కోల్‌కతా: సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసులో పశ్చిమబెంగాల్‌లోని మమతాబెనర్జీ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. కేసు దర్యాప్తును హైకోర్టు సీబీఐకి ఇవ్వడాన్ని తప్పుపడుతూ మమత సర్కారు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం(జులై 8) కొట్టివేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
‘ఎవరినో కాపాడటానికి ప్రభుత్వానికి ఆసక్తి ఎందుకు. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’అని బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్ బెంచ్ వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మొత్తం నిరుత్సాహపరిచిందని పేర్కొంటూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ స్థానిక మహిళలను లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా వారి భూములు కబ్జా చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలతో అక్కడి మహిళలు ఒక ఉద్యమాన్నే నడిపారు. దీంతో షాజహాన్‌ను సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment