సాక్షి, ఢిల్లీ: టీడీపీ నేత లింగమనేనికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ నిర్మాణాల అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా?. ఇందులో ప్రజా ప్రయోజనం ఏం ఉందని సీజే ప్రశ్నించారు. ఇది రాజకీయ ఫిర్యాదు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రుషికొండపై నిర్మాణాలు అక్రమం అని, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంంలో లింగమనేని శివరామ ప్రసాద్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఎన్‌జీటీ, ఏపీ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యేవరకు రుషి కొండపై ఏవిధమైన నిర్మాణాలు, కార్యక్రమాలు చేపట్టోద్దని లింగమనేని శివరామప్రసాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లింగమనేని అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
చదవండి: ఉచితమంటూ.. ముసుగు దోపిడీ
Comments
Please login to add a commentAdd a comment