Lingamaneni
-
లింగమనేని శివరాంప్రసాద్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
-
లింగమనేనికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
సాక్షి, ఢిల్లీ: టీడీపీ నేత లింగమనేనికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ నిర్మాణాల అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా?. ఇందులో ప్రజా ప్రయోజనం ఏం ఉందని సీజే ప్రశ్నించారు. ఇది రాజకీయ ఫిర్యాదు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రుషికొండపై నిర్మాణాలు అక్రమం అని, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంంలో లింగమనేని శివరామ ప్రసాద్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్జీటీ, ఏపీ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యేవరకు రుషి కొండపై ఏవిధమైన నిర్మాణాలు, కార్యక్రమాలు చేపట్టోద్దని లింగమనేని శివరామప్రసాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లింగమనేని అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చదవండి: ఉచితమంటూ.. ముసుగు దోపిడీ -
నారాయణ, లింగమనేని దేశం విడిచి వెళ్లరాదు!
సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై ఇటీవల సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న మాజీమంత్రి పొంగూరు నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, అతని సోదరుడు లింగమనేని వెంకటసూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ కేపీవీ అంజనీకుమార్‌లకు హైకోర్టు ఊరటనిచ్చింది. సీఐడీ నమోదు చేసిన కేసులో వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ, కొన్ని షరతులు విధించింది. ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు దేశంలోనే ఉండాలని నిందితులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ దేశం విడిచి వెళ్లాలంటే సంబంధిత కోర్టు అనుమతి తీసుకోవాలని వారికి స్పష్టంచేసింది. రూ.50వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం తీర్పు వెలువరించారు. ఆళ్ల ఫిర్యాదు.. సీఐడీ కేసు.. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ డిజైన్ల మార్పు ముసుగులో భారీ భూ దోపిడీ జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీమంత్రి పొంగూరు నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, అతని సోదరుడు లింగమనేని వెంకటసూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ కేపీవీ అంజనీకుమార్ తదితరులపై సీఐడీ ఈ ఏడాది మే 9న కేసు నమోదు చేసింది. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నారాయణ, లింగమనేని సోదరుడు, అంజనీకుమార్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జూన్ 17కు తీర్పును వాయిదా వేశారు. తీర్పు రిజర్వ్ చేసిన రెండున్నర నెలల తరువాత న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. -
లింగమనేని దందాలపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలి
విజయవాడ సిటీ: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో జరిగిన భూ బాగోతాలతో పాటు లింగమనేని భూ దందాలపై విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరనున్నట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.కరకట్ట లోపల నిర్మించిన ఇల్లును ఇచ్చినందుకే లింగమనేని రమేష్‌ను చంద్రబాబు కాపాడుకుంటూ వస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం తన నియోజకవర్గంలోనే లింగమనేని రూ.50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి శనివారం విజయవాడలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పనంగా కొట్టేశారు ‘‘కాజ, నంబూరు, కంతేరు గ్రామాల్లో ఐజేఎం–లింగమనేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 2005–06లో 40 ఎకరాల్లో వెంచర్లు వేసి విలాసవంతమైన విల్లాలు నిర్మించింది. పొన్నూరు నియోజకవర్గం నంబూరు గ్రామంలో 200 ఎకరాల్లో లేఔట్లు వేశారు. 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఆ గ్రామ పంచాయతీకి 10 శాతం భూమిని రిజిస్టర్ చేయాల్సి ఉండగా చేయకుండా తప్పించుకున్నారు. కాజకు సంబం«ధించి జాతీయ రహదారిని ఆనుకుని విలాసవంతమైన విల్లాలు నిర్మించారు. మంగళగిరిలో 40 ఎకరాల్లో లేఔట్లు వేశారు. అక్కడి కట్టడాలకు సంబంధించిన బిల్డింగ్ పర్మిట్, గ్రామ పంచాయతీకి కట్టాల్సిన ఫీజులు రూ.కోట్లు ఎగవేశారు. చంద్రబాబు అండ చూసుకునే ప్రభుత్వానికి రావల్సిన రూ.వందల కోట్లకు ఎగనామం పెట్టారు. ఒక్కో విల్లాను రూ.5 కోట్లకు అమ్ముకుని, లేఔట్ ఫీజులు చెల్లించలేదు. 2005–06 నుంచి పన్నులు ఎగ్గొట్టారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి లేఖ రాసినా పట్టించుకోలేదు. అక్కడి రిజిస్టర్ విలువ ప్రకారం ఎకరం రూ.2.5 కోట్లు, మార్కెట్ విలువ రూ.15 కోట్ల వరకు ఉంది. ఈ మేరకు కాజ గ్రామ పంచాయతీకి రూ.50 నుంచి రూ.60 కోట్ల మేర ఎగవేశారు. పంచాయతీకి చెందని భూములు, దళితుల భూములను చట్టవ్యతిరేకమైన పద్ధతిలో ఇతరుల పేరిట మార్పిడి చేసుకున్నారు. రూ.250 కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా కొట్టేసిన లింగమనేనిని చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చారు. చంద్రబాబును అడ్డం పెట్టుకొని లింగమనేని రూ.100 కోట్ల దాకా రాయితీలు పొందారు. రియల్ ఎస్టేట్ ముసుగులో లింగమనేని వంటి వాళ్లు సాగించిన భూ బాగోతాలు బయటకు రావాలి. గత టీడీపీ ప్రభుత్వం అండతో దళితుల భూములను బలవంతంగా లాక్కొని వెంచర్లు వేశారు. వాటిపై కూడా దర్యాప్తు జరగాలి. కంతేరు గ్రామ డొంక భూములను సైతం కబ్జా చేశారు’’ అని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. అప్పుడు ఎందుకు స్పందించలేదు? ‘‘లింగమనేని భూ బాగోతాలపై కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, 12 ఏళ్లకు కూడా ఆ కేసులు బెంచ్‌పైకి రాకపోవడం ఏమిటి? చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నానని లింగమనేని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది. ఆ ఇంటిపై 2015 ఫిబ్రవరి 6న తాడేపల్లి తహసీల్దార్ నోటీసు ఇస్తే ఎందుకు స్పందించలేదు? దీనిపై నేను హైకోర్టుకు వెళ్లినప్పుడు అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదు?’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. -
చంద్రబాబు – లింగమనేని..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: భూములు దోచుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు–లింగమనేని గ్రూపు (రమేశ్)ల బంధం ఏళ్ల క్రితం నుంచి దృఢంగా కొనసాగుతోంది. అసలు లింగమనేని వ్యాపారంలోనే చంద్రబాబుకు వాటాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. లింగమనేనికి వంద ఎకరాలకు పైగా సంతర్పణ చేశారు. దీని కోసం నిబంధనలకు నీళ్లొదిలారు. ప్రజాప్రయోజనాలను గాలికొదిలారు. విజయవాడ–గుంటూరు మధ్యలో 16వ నంబర్ జాతీయ రహదారి వెంబడి ప్రజావసరాల పేరుతో సేకరించిన భూములను 2003లో లింగమనేని గ్రూపునకు చంద్రబాబు కట్టబెట్టడం చూస్తే వాళ్ల బంధం ఎంతలా పెనవేసుకుందో ఇట్టే అర్థం అవుతుంది. చంద్రబాబు సహకారానికి ప్రతిగా ఆయనకు కృష్ణా నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన గెస్ట్ హౌస్‌ను, హెరిటేజ్ సంస్థకు 14.22 ఎకరాల భూములను లింగమనేని సమర్పించుకున్నారు. ప్రజావసరాల పేరుచెప్పి.. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా 2001లో ప్రజావసరాల పేరుతో (సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం) వీజీటీఎం–ఉడా ద్వారా ‘సైట్స్ అండ్ సర్వీసెస్’ పథకం పేరిట 115.91 ఎకరాలను తీసుకోవాలని నిర్ణయించారు. దీని కోసం మంగళగిరి ప్రాంతంలోని నంబూరు, కాజ, కంతేరు గ్రామాల మధ్య జాతీయ రహదారి పక్కన, నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఏసీసీ సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీకి ఉన్న భూములే లక్ష్యంగా వ్యూహం అమలు చేశారు. భూ సేకరణ క్రమాన్ని ఇలా కొనసాగించారు. 1. భూసేకరణ నోటిఫికేషన్ నం.ఆర్.సి.5549/2001– జి1 (తేదీ 25–12–2001) ద్వారా గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో సర్వే నంబరు 142/1బి, 144/1బిలో 7.63 ఎకరాల కోసం నోటిఫికేషన్ జారీచేసింది. 2. భూ సేకరణ నోటిఫికేషన్ నం.ఆర్.సి.5550/2001–జి1 (తేదీ 25–12–2001) ద్వారా గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో సర్వే నెంబరు 203, 204/ఏ, 204/బి2, 206/1, 206/2, 213/ఏ (పి), 207, 213/బి (పి), 214(పి), 215, 216/2, 217లో 69.81 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీచేసింది. 3. భూసేకరణ నోటిఫికేషన్ నం.ఆర్.సి.5551/2001– జి1 (తేదీ 25–12–2001) ద్వారా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని సర్వే నంబరు 142, 143/1బి, 144,145, 146/1బిలో 38.47 ఎకరాలు కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ మూడు నోటిఫికేషన్ల ద్వారా 115.91 ఎకరాలను వీజీటీఎం – ఉడా 11 నెలల వ్యవధిలో సేకరించింది. పేరు ఒకరికి.. ఫలితం మరొకరికి సేకరించిన 115.91 ఎకరాలను స్వల్పకాలంలోనే లింగమనేని రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వీజీటీఎం–ఉడా కట్టబెట్టేసింది. ముందస్తు ప్రణాళికలో భాగంగా ఆ భూముల వేలం ప్రకటన (ఆర్.సి.నెం:365/2001, తేదీ 13–03–2003) జారీచేసింది. 27–03–2003న బిడ్లు పిలిచింది. వేలం ఆపాలని హైకోర్టు స్టే ఆర్డర్లు ఇచ్చినప్పటికీ ఏమాత్రం జాప్యం లేకుండా లింగమనేని రియల్ ఎస్టేట్ కంపెనీకి 115.91 ఎకరాలను రూ. 8 కోట్లకు ప్రభుత్వం అప్పగించేసింది. అదే భూమిలో మౌలిక వసతులు కల్పించి, అభివృద్ధి చేసి విక్రయించి ఉంటే అప్పట్లోనే కనీసం రూ. 100 కోట్ల వరకు ఉడాకు సమకూరేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇదంతా అప్పటి ప్రభుత్వాధినేత చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందనేది బహిరంగరహస్యమే. భూసేకరణ ద్వారా తీసుకున్న భూమిని సేకరించిన అవసరాల కోసం కాకుండా, ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఉడా యథాతథంగా విక్రయించడమనేది చట్టవిరుద్ధమని నిపుణులు చెప్పినా అప్పట్లో సర్కార్ పట్టించుకోలేదు. ఐజేఎం–రెయిన్ ట్రీపార్కు.. సీఎం చంద్రబాబుకు సింగపూర్, మలేసియాలతో వ్యాపారపరమైన సంబంధాలు గతం నుంచి ఉండేవనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలకు ఎరుకే. ఆ సంబంధాల నేపథ్యంలోనే మలేసియాకు చెందిన ఐజేఎం సంస్థకు హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు స్థలం కేటాయించి ఐజేఎం– మలేషియా టౌన్‌షిప్‌ను నిర్మించారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఆ క్రమంలోనే వీజీటీఎం– ఉడా నుంచి లింగమనేనికి ధారాదత్తం చేసిన 115.91 ఎకరాల్లోనే ఐజేఎం–రెయిన్ ట్రీపార్కు అపార్టుమెంట్ల సముదాయం రూపుదిద్దుకుంది. అపార్ట్మెంట్లను విక్రయించడం ద్వారా సొమ్ము చేసుకోవడంతో పాటు తాజాగా తమ వారికి చెందిన ప్లాట్లను ఎక్కువ అద్దె చెల్లిస్తూ అధికారులకు నివాసాలుగా చంద్రబాబు సర్కార్ కేటాయించింది. ‘లింగమనేనే’ రాజధాని సరిహద్దు.. రాష్ట్ర విభజన తరువాత నూతన రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో లింగమనేని భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా భారీ ఎత్తున లబ్ధి చేకూర్చారు. రాజధానికి లింగమనేని రియల్ ఎస్టేట్ భూములే సరిహద్దు. ఆ భూములకు కేవలం కొద్ది మీటర్ల దూరంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు వెళుతోంది. తన పరోక్ష భాగస్వామి, బినామీ అయిన లింగమనేనికి ఆర్థిక సహకారం అందించడం, తద్వారా తాను లబ్ధి పొందడంలో భాగంగా పెద్ద సంస్థల చేత భూములను కొనుగోలు చేయిస్తున్నారు. ఏసీసీ సిమెంట్స్ భూములతో పాటు సన్న, చిన్నకారు రైతుల నుంచి వందలాది ఎకరాలను నామమాత్రపు ధరకు తీసుకున్న లింగమనేని నుంచి ఒక ప్రముఖ విద్యాసంస్థ, మిల్క్‌డెయిరీ అధినేత, వైద్యవిద్యను అందిస్తున్న మరో సంస్థతో పదుల ఎకరాలను చంద్రబాబు కొనుగోలు చేయించారని సమాచారం. ముఖ్యమంత్రి ఆశీస్సులతో భారీ కాంట్రాక్టులను దక్కించుకుంటున్న ప్రముఖ సంస్థ కొన్నాళ్ల కిందట లింగమనేని నుంచి 150 ఎకరాల వరకు కొనుగోలు చేసిందని తెలిసింది. ఈ ని«ధులన్నీ చంద్రబాబు జేబులోకే వెళ్లినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఎయిర్ కోస్టాకు సహకారం.. లింగమనేని నేతృత్వంలోని ఎయిర్కోస్టా విమానయాన సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నది సీఎం చంద్రబాబే అని పారిశ్రామిక వర్గాలకు తెలిసిన విషయమే. ఓ ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ద్వారా రూ. వందల కోట్లను అందులో పెట్టుబడిగా పెట్టించింది కూడా చంద్రబాబేనని చెపుతుంటారు. నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్‌కోస్టాకు అశోక్‌గజపతిరాజు విమానయానశాఖ మంత్రిగా ఉండగా జాతీయస్థాయి పర్మిట్ ముఖ్యమంత్రి ఇప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చంద్రబాబును పట్టుకుంటే ఎంతటి పనైనా అయిపోతుందని ఎయిర్ ఏషియా సంస్థ సీఈవోల మధ్య జరిగిన ఆడియో సంభాషణల్లో వెల్లడైన విషయం తెలిసిందే. దీన్నిబట్టి ఎయిర్‌కోస్టాకు పర్మిట్ దక్కడంలో ఆశ్చర్యమేముందని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, ఎయిర్‌కోస్టాకు సంబంధించి మరో కోణంలోనూ చంద్రబాబు, లింగమనేని ఆర్థిక ప్రయోజనం పొందారనే ఆరోపణలు ఉన్నాయి. లాభాలు ప్రకటించిన కొద్దికాలానికే నష్టాలంటూ ఎయిర్‌కోస్టాను మూసేసి ఆర్థిక ప్రయోజనాలు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకోవడానికి ఎయిర్‌కోస్టాను సాధనంగా వాడుకున్నట్లు అంతర్జాతీయ, జాతీయ పత్రికల్లో వార్తాకథనాలు కూడా ప్రచురితమయ్యాయి. పోలీస్ బెటాలియన్ తరలింపులో లోగుట్టు ఇదేనా? మంగళగిరి వద్ద వందలాది ఎకరాల్లో ఉన్న పోలీస్ బెటాలియన్‌ను అక్కడి నుంచి గుంటూరు జిల్లా అచ్చంపేట మండలానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ మేరకు ప్రతిపాదనలు ఇదివరకే చేశారు. ఇందుకు కారణం లింగమనేనికి సహకారం అందించడానికే అనేది స్పష్టమవుతోంది. బెటాలియన్ సమీపంలోనే లింగమనేని సంస్థ భారీస్థాయిలో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లను నిర్మిస్తోంది. అదే ప్రాంతంలో ఇంకా స్థలాలు ఉన్నాయి. లింగమనేని ఆస్తులకు విలువను పెంచడానికేనని పోలీస్ బెటాలియన్‌ను తరలిస్తున్నారని ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పోలీసు కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. -
తనఖా భూములనూ మింగేస్తున్న లింగమనేని
-
రాజధాని ప్రాంతంలో బాబుగారి కొండచిలువ
నాగార్జున వర్సిటీకి ఎదురుగా బ్యాంకు తనఖాలో ఉన్న 6.19 ఎకరాల భూమి ఇది. రాష్ట్ర విభజనకు ముందు 2014లో దీని విలువ రూ. 35.59 కోట్లుగా లెక్కకట్టారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 102 కోట్లు కానీ ఈ స్థలాన్ని కేవలం రూ.33 కోట్లకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. కొసమెరుపు: ఈ చిత్రంలోని బహుళ అంతస్తుల భవనాలు, ఐజేఎం– లింగమనేని.. రెయిన్‌ట్రీ పార్కుకు చెందినవి కావటం గమనార్హం. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాజధాని ప్రాంతంలోని భూములను అధికారపార్టీ ముఖ్యనేతలు, వారి అనుయాయులు కొండచిలువల్లా మింగేస్తున్నారు. విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినప్పటి నుంచీ వారు పేట్రేగిపోతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోతున్నారు. చిన్న, సన్నకారు రైతులు వద్ద నుంచి తీసుకున్న భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారమే ప్రధాన ధ్యేయంగా సాగిపోతున్న వారిలో ఇప్పుడు మరో కోణం బయటపడింది. పరోక్షంగా ముఖ్యనేత, ఓ కీలక మంత్రి.. ప్రత్యక్షంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లింగమనేని గ్రూప్ ఈ దందా కొనసాగిస్తోంది. తనఖాలో ఉన్న విలువైన భూములే లక్ష్యంగా ఎంపిక చేసుకుని, నయానో, భయానో, అధికార బలంతోనే వాటిని లాగేసుకుని తమ రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. రాజధాని, విజయవాడ, గుంటూరు నగరాలకు సమీపంలో వాణిజ్య పరంగా అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన భూములను చేజిక్కించుకోవడానికి బ్యాంకర్లను పావులుగా వాడుకుంటున్నారు. రుణం తీర్చేస్తామని తనఖా పెట్టిన వారు మొత్తుకుంటున్నా వినకుండా ఆ భూములను లింగమనేని అండ్‌కోకు తక్కువ ధరకే కట్టబెట్టేలా ప్రణాళికలు వేస్తున్నారు. దీనికోసం నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. తనఖాలోని భూములే లక్ష్యంగా.. బ్యాంకుల్లో రుణం తీసుకోవాలంటే ఆస్తులను తనఖా పెట్టాల్సిందేనన్న విషయం తెలిసిందే. గడువులోగా రుణం చెల్లించకపోతే బ్యాంకర్లు నోటీసులు ఇస్తారు. వాటికి స్పందించకపోతే ఆ రుణాన్ని నిరర్ధక ఆస్తి (ఎన్పీఏ)గా ప్రకటించి.. ఆస్తులను వేలం వేసి, వచ్చిన డబ్బులో తామిచ్చిన రుణాన్ని మినహామించుకుని మిగిలిన సొమ్మును తనఖా పెట్టిన వారికి ఇవ్వడం రివాజు. అయితే నోటీసులు ఇచ్చినప్పుడు రుణం తీసుకున్న వారు వడ్డీ చెల్లించినా, గడువు కోరినా, ఇతర సెక్యూరిటీలు చూపడానికి సిద్ధమైనా ఆస్తులను వేలం వేయకూడదు. అలాగే ఒన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)కు రుణగ్రహీత సిద్ధపడితే ఆ అవకాశాన్ని కూడా పరిశీలించాలి. కానీ, రాజధాని ప్రాంతంలో విలువైన భూముల వేలం విషయంలో బ్యాంకర్లు నిబంధనలను పాటించడం లేదు. ఆ భూములను లింగమనేనికి కట్టబెట్టడానికే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యనేతతో పాటు లింగమనేనితో ఆర్థిక లావాదేవీలు ఉన్న ఓ మంత్రి కూడా ఒత్తిడి చేస్తుండటంతో బ్యాంకర్లు ఈ పనికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలంలో తక్కువకు పాడినా.. వ్యాపార అవసరాల నిమిత్తం హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ 2014లో బంజరాహిల్స్‌లోని సిండికేట్ బ్యాంక్‌ను రుణం కోసం ఆశ్రయించింది. గుంటూరు జిల్లా చినకాకానిలో సర్వే నంబర్లు 230, 231ఏల్లో తనకున్న 3 ఎకరాల భూమిని ఆ కంపెనీ సెక్యూరిటీగా చూపింది. బ్యాంకు అధికారులు ఈ భూమి విలువను 2014 జూన్ 6న రూ.19.50 కోట్లు, అదే నెల 19న రూ. 20.25 కోట్లు, 2018 మార్చి 20న రూ. 24.75 కోట్లుగా అంచనా వేశారు. 2014 విలువ ఆధారంగా బ్యాంక్ అధికారులు రూ. 9 కోట్ల రుణాన్ని మంజూరు చేశారు. అయితే మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా ఆ కంపెనీ వ్యాపారం సక్రమంగా సాగలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు రూ. 36.37 లక్షల వడ్డీని చెల్లించాలని కోరడంతో, ఆ కంపెనీ వెంటనే రూ. 20 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసింది. తమ 3 ఎకరాల భూమి అభివృద్ధి నిమిత్తం మరో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, అప్పు మొత్తాన్ని త్వరలో చెల్లించేస్తామని బ్యాంకుకు తెలిపింది. ఈ భూమిపై లింగమనేని అండ్ కో కన్ను పడింది. ఆ భూమికి పక్కనే లింగమనేని సంస్థకు పది ఎకరాల భూమి కూడా ఉంది. కంపెనీ భూమితో కలుపుకొని 13 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేసి వందలాది కోట్ల రూపాయలు గడించడానికి ముఖ్యనేత, ఓ మంత్రితో లింగమనేని వ్యూహం రచించారు. అధికారంలోని ముఖ్య నేతలతో బ్యాంకర్లపై ఒత్తిడి తెచ్చారు. దీంతో నిబంధనలు తుంగలో తొక్కి బ్యాంకర్లు ఆ మూడు ఎకరాలను వేలం వేసేశారు. అయితే బ్యాంకుకు రావాల్సిన మొత్తం బకాయిల్ని రాబట్టుకునే ప్రయత్నాలు కూడా సజావుగా చేయలేదు. బ్యాంకుకు మొత్తం రూ.11.87 కోట్లు రావాల్సి ఉండగా, రూ.10.85 కోట్లకే వేలం పాడిన లింగమనేని అండ్ కోకి ఆ భూమిని కట్టబెట్టేశారు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ రూ. 50 కోట్లకుపైగా ఉంటుందని బ్యాంకు ఉద్యోగులే చెబుతుండటం గమనార్హం. దీనిపై డెట్ రికవరీ ట్రిబ్యునల్ హైదరాబాద్‌లో పిటిషన్ దాఖలవ్వగా.. వేలం పాడిన వారు ఈ ఆస్తిపై ఎటువంటి లావాదేవీలు జరపరాదనే ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. రుణం చెల్లిస్తామన్నా వేలమే.. హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీ స్పిన్నింగ్ మిల్లు కొనుగోలు కోసం 2014లో సిండికేట్ బ్యాంకు, ఒంగోలు బ్రాంచ్‌లో రూ.31.75 కోట్ల రుణం కోసం దరఖాస్తు చేసుకుంది. ఇందుకు ప్రకాశం జిల్లా, దొడ్డవరప్పాడులోని 27.25 ఎకరాలను ప్రధాన హామీగా ఉంచింది. ఈ భూమి విలువను 2014లో రూ.26.01 కోట్లుగా, ప్లాంట్, మిషనరీని రూ.15 కోట్లుగా నిర్ణయించారు. అలాగే అదనపు హామీ (కొల్లేటరల్ సెక్యూరిటీ)గా గుంటూరు–విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా సర్వే నంబర్ 213/ఎ, 214లో ఉన్న 6.19 ఎకరాల భూమిని చూపారు. దీని విలువను బ్యాంకు 2014లో రాష్ట్ర విభజనకు ముందు రూ. 35.59 కోట్లుగా లెక్కగట్టింది. అలాగే రూ.13.13 కోట్లకు వ్యక్తిగత పూచీకత్తు, రూ.42 కోట్లకు కార్పొరేట్ గ్యారెంటీని కూడా కంపెనీ ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ప్రాంతాన్ని ప్రకటించిన తరువాత అదనపు హామీగా ఉంచిన భూమి విలువ భారీగా పెరిగింది. 2015 జూన్‌లో ఆ భూమి విలువ రూ.75 కోట్లుగా అంచనా వేశారు. గతంలో విలువ నిర్ణయించిన వాల్యూయరే ఈ విలువను కూడా లెక్కగట్టారు. అయితే రుణ వాయిదాలను సక్రమంగా చెల్లించడంలేదంటూ 2016 ఫిబ్రవరి 18న కంపెనీకి సిండికేట్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. ఆ రుణాన్ని నిరర్థక ఆస్తిగా పరిగణించింది. రుణం మొత్తాన్ని చెల్లించే స్థోమత తమకుందని చెప్పి రూ. 10 కోట్లు చెల్లించింది. మిగిలిన రుణం చెల్లించేందుకు కొంత గడువు ఇవ్వాలని బ్యాంకును కంపెనీ కోరింది. అయితే ఇక్కడ కూడా లింగమనేని అండ్ కో ఎంటరైంది. ఈ భూమికి రెండు వైపుల లింగమనేనికి భూములు ఉండటంతో తక్కువ ధరకే కంపెనీ భూములు కొట్టేసేందుకు ఎత్తు వేశారు. లింగమనేనికి అండగా ముఖ్యనేత, ఓ మంత్రి రంగంలోకి దిగి ఆ భూమిని వేలం వేయాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రధాన ఆస్తితో పాటు అదనపు హామీగా ఉంచిన భూమి వేలానికి బ్యాంకు నిర్ణయం తీసుకుంది. నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉన్న భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.102 కోట్లు ఉండగా దానిని రూ. 33 కోట్లకే విక్రయించడానికి నిర్ణయించినట్లు బ్యాంకు తన నోటీసులో పేర్కొంది. వాస్తవానికి వేలానికి ముందు సదరు ఆస్తి విలువను తప్పనిసరిగా మదింపు చేయాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉంది. ఆ పని చేయకుండా అతి తక్కువ ధరకు లింగమనేనికే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. కాగా ప్రధాన హామీగా ఉంచిన ప్రకాశం జిల్లా, దొడ్డవరప్పాడులోని 27.25 ఎకరాలను, ప్లాంట్, మిషనరీ గురించి బ్యాంకర్లు దృష్టి సారించకపోవడం గమనార్హం. -
మా ఆస్తిని కాజేసేందుకు లింగమనేని ప్రయత్నిస్తున్నారు...
హైకోర్టులో బద్రీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ సాక్షి, హైదరాబాద్: బ్యాంకుతో కుమ్మక్కై తమ కంపెనీకి చెందిన కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేసేందుకు లింగమనేని ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ లింగమనేని రమేశ్, చైర్మన్ లింగమనేని భాస్కరరావులు ప్రయత్నిస్తున్నారం టూ బద్రీ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. రూ.75 కోట్ల విలువ చేసే తమ భూమిని రూ.35 కోట్లకే వేలం వేయాలని సిండికేట్ బ్యాంక్ నిర్ణయించిందని, రుణ చెల్లింపునకు చట్ట ప్రకారం గడువు పొడిగించే అవకాశం ఉన్నా, బ్యాంకు ఆ పని చేయడం లేదని, లింగమనేని రమేశ్ తదితరులకు లబ్ధి చేకూర్చేందుకే ఇలా వ్యవహరిస్తోందంటూ ఆ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ లింగమనేని రమేశ్, అతని తండ్రి భాస్కరరావులతో పాటు సిండికేట్ బ్యాంక్ ఎండీ, ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఎస్.పి.శర్మ, రీజినల్ మేనేజర్ రమణమూర్తి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. -
రాసేవాడిపైనే విచారణ
అప్పుడే భయం ఉంటుంది.. రాసేవాడికి, క్రిమినల్‌కి ఒకటే చట్టం: సీఎం చంద్రబాబు * మీరేదో రాస్తే.. ప్రభుత్వం విచారణ చేయించాలా? * రాతలు నిరూపించాల్సిన బాధ్యత విలేకరులదే * లింగమనేని పూలింగ్‌లో భూములు ఇస్తానంటే వద్దన్నా * మా నేతలు సొంత డబ్బుతో కొంటే తప్పేంటి? * హాయ్‌ల్యాండ్ ప్రస్తుతం సీబీసీఐడీ జప్తులో ఉంది * లోకేశ్ భూములు కొట్టేశారనడంలో వాస్తవం లేదు * అమరావతికి రావొద్దంటూ విదేశీ ప్రతినిధులకు * విపక్ష నేత జగన్ ఈ-మెయిల్స్ పంపారు సాక్షి, హైదరాబాద్ వార్తలు రాసే విలేకరులను ప్రాసిక్యూట్ చేస్తామని, రాసేవాడికి.. నేరం చేసిన వాడికి చట్టం ఒకటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సమాచారం తెచ్చివ్వమంటేనే మీడియాకు భయం ఉంటుందని, అప్పుడే ఒళ్లు దగ్గరపెట్టుకుని రాస్తారని విలేకరులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి బయటపెట్టిన ‘రాజధానిలో భూ దురాక్రమణ’పై విచారణ కమిషన్ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆదివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భూదందాపై వార్తలు రాసిన విలేకరులే వాటిని నిరూపించాలని, ఇష్టప్రకారం వార్తలు రాస్తే విలేకరులను ప్రాసిక్యూట్ చేస్తామన్నారు. బ్రాండ్ ఇమేజిని దెబ్బతినే విధంగా రాస్తూ, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. కడిగిన ముత్యంలాగా బయటకు రావడానికి భూదందాపై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తారా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీరేదో చేసేసి.. కడిగిన ముత్యం లాగా రావాలని ఎవరు చెప్పారయ్యా? నీదగ్గర సమాచారం ఉంటే ఇవ్వు. లేదంటే నిన్ను ప్రాసిక్యూట్ చేస్తాం. రాస్తున్న వారికి ఒకటే చట్టం.. నేరం చేసిన వాడికీ ఒకటే చట్టం. రాసేవాడు ప్రివిలేజ్డ్ కాదు. నువ్వు ఒకటి రాశావు కాబట్టి.. రాసిన వారి మీద విచారణ చేపట్టాలి అంటే.. నిరూపించమని అడుగుతాం. మొత్తం సమాచారం తెచ్చివ్వమని అడగాలి. అప్పుడు మీడియాకు భయం ఉంటుంది. ఒళ్లు దగ్గరపెట్టుకొని రాస్తారు. మీరు రాశారని అందరినీ విచారించాలా? కడిగిన ముత్యంలాగా, ఆణిముత్యంలాగా ప్రభుత్వం రావాలా? ప్రభుత్వానికి ఇదే పనా? ప్రభుత్వం పనిచేయాలా? వద్దా? ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని పని చేస్తుంటే.. ప్రజలకు నష్టం. ప్రభుత్వం పరిపాలన చేయాలా? లేక విచారణలు చేస్తూ కూర్చోవాలా? ఎవరైనా బాధ్యతగా రాయాలి. రాసినప్పుడు నిరూపించాలి. బాధ్యత లేకుండా రాస్తుంటాం.. టీవీల్లో వేస్తుంటాం.. అంటే కరెక్ట్ కాదు. ఒక పత్రిక స్వార్థంతో కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. భూమితో రైతులకు అటాచ్మెంట్ ఉంటుంది. రాష్ట్రం బాగుపడుతుందని పూలింగ్‌లో భూములు ఇచ్చారు. వారికి ఇప్పుడు బాధ కలుగుతోంది** అంటూ మండిపడ్డారు. సాక్షి ప్రస్తుతం ఈడీ అటాచ్మెంట్లో ఉందని, అది ప్రభుత్వ ఆస్తి అని పునరుద్ఘాటించారు. అవును.. కొన్నారు.. నిజమే రాజధాని ప్రాంతంలో వేమూరి రవికుమార్, సుజనా చౌదరి, మురళీమోహన్, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర భూములు కొనడం వాస్తవమేనని ముఖ్యమంత్రి అంగీకరించారు. వారి సొంత డబ్బుతో భూములు కొనుగోలు చేశారని చెప్పారు. భూముల క్రయవిక్రయాల మీద నిషేధం లేనప్పుడు, డబ్బున్నవాళ్లు భూములు కొనుక్కోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వ ఆస్తిగా పేర్కొన్నారు. ఆ గెస్ట్‌హౌస్ ల్యాండ్‌పూలింగ్‌లో వచ్చిందని, అందువల్లే తాను అందులో ఉంటున్నానన్నారు. మంత్రులు నారాయణ, పుల్లారావు భూములు కొన్నట్లు నిరూపిస్తే.. తిరిగి ఇచ్చేస్తామని సవాల్ చేశారన్న విషయాన్ని గుర్తుచేశారు. హాయ్‌ల్యాండ్ తన కుమారుడు లోకేశ్ భూములు కొట్టేశారని ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ప్రస్తుతం అది సీబీసీఐడీ జప్తులో ఉందని తెలిపారు. రాజధానిలో భూ అక్రమాలు జరగలేదన్నారు. బెదిరించి భూములు లాక్కున్నారన్న ఆరోపణలు ఖండించారు. గుంటూరు-విజయవాడ మధ్యలో ఉన్న వారిని బెదిరించగలమా? అంటూ ఎదురు ప్రశ్నించారు. బెదిరించి తమ భూమిని లాక్కున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే, తక్షణం స్పందిస్తామని, తగిన భద్రత కల్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అక్రమ దందాపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసే ప్రసక్తే లేదన్న ఆయన.. ప్రభుత్వానికి అగ్నిపరీక్ష అక్కర్లేదని తేల్చేశారు. అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీయడానికే ఇలాంటి వార్తలు రాస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజధాని శంకుస్థాపనకు పిలిస్తే కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాలేదని.. పైగా అమరావతికి రావద్దంటూ చైనా, జపాన్, సింగపూర్ తదితర దేశాల ప్రతినిధులకు టెలిగ్రామ్‌లు, ఈ-మెయిల్స్ పంపించారని ఆరోపించారు. ఇడుపులపాయలో 610 ఎకరాల అసైన్డ్ భూమిని ప్రభుత్వానికి అప్పగించడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చట్టాన్ని మార్చారని, శిక్ష పడకుండా తప్పించుకున్నారని విమర్శలు చేశారు. అసైన్డ్ భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తూ అప్పటి శాసనసభలో దివంగత సీఎం వైఎస్ఆర్ చేసిన ప్రకటనను చదివి వినిపించారు. సొంతవారిని వెనకేసుకొచ్చిన సీఎం రాజధాని భూ దురాక్రమణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తనవారిని ముఖ్యమంత్రి వెనకేసుకొచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల గురించి సీఎం ఏమన్నారంటే.. - రాజధాని ప్రకటన చేయకముందే అమరావతి మండలంలో వేమూరు రవికుమార్ కొన్నమాట వాస్తవమే. ఆయన ఎన్నారై. కుటుంబ సభ్యులందరి పేర్లతో భూములు కొన్నారు. మాకు సంబంధం లేదు. - నేను కొనుక్కున్నాని పయ్యావుల కేశవ్ ధైర్యంగా చెప్పారు. - తాను కూడా కొనుక్కున్నానని ధూళిపాళ్ల నరేంద్ర చెప్పారు. - 2002, 2003లోనే లింగమనేని రమేశ్ భూములు కొన్నారు. ల్యాండ్‌పూలింగ్‌లో భూములు తీసుకోమని రమేశ్ అడిగారు. తీసుకోనని నేనే స్పష్టంగా చెప్పాను. నేను గ్యాస్ టర్మినల్ ఇచ్చాను కాబట్టి లింగమనేని ఇల్లు ఇచ్చారని ఆరోపణ. ఇల్లు ఇవ్వడం ఏమిటి? అది ప్రభుత్వ ఆస్తే. ఇస్తే భూసమీకరణలో, ఇవ్వకుంటే భూసేకరణలో తీసుకొనే వాడిని. లింగమనేని గెస్ట్‌హౌస్ ప్రభుత్వ ఇల్లు కాబట్టే, తాత్కాలికంగా నేను ఉంటున్నాను. - సుజనా చౌదరి ఎక్కడో దూరంగా కొన్నారు. - ఎన్నికలు జరగకముందే డెవలెప్మెంట్ ఒప్పందం చేసుకున్నామని మురళీమోహన్ చెబుతున్నారు. - సాక్షి బయటపెట్టిన భూ దందా కథనాల వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. భూముల ధరలు పెరుగుతాయని సీఎంను నమ్మి ఇస్తే, ధరలు పెరగడం లేదని రైతులు అడుగుతున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇలాంటి రాతలు రాసి రాజధాని అభివృద్ధి చేయడానికి ఎవరూ రాకుండా చేయడం కుట్ర కాదా? అసైన్డ్ భూముల అసలు యజమానులకే ప్యాకేజీ 1954కు పూర్వం అసైన్డ్ భూములు చాలా చేతులు మారాయి. రిజిస్ట్రేషన్లూ జరిగాయి. ఆ భూములకు ప్రస్తుత యజమానికే ప్యాకేజీ ఇస్తాం. 1954 తర్వాత అసైన్డ్ భూములు పొందినవారికి విక్రయ అధికారం లేదు. రిజిస్ట్రేషన్లు చేయడం కూడా చట్ట విరుద్ధం. ఈ భూముల అసలు యజమానుల (అసైనీల)కే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అందుతుంది. ‘జర్నలిస్టులను వేధించడం సరికాదు’ హైదరాబాద్: రాష్ట్ర రాజధాని అమరావతిలో భూదందాపై మంత్రులు, అధికార పార్టీ నేతలు తమ నిజాయతీని చిత్తశుద్ధితో నిరూపించుకోవాలని ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఆర్ వెంకటేశ్ గౌడ్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు కోశాధికారి అస్కాని మారుతి అన్నారు. అంతేకాని నిష్పక్షపాతంగా వార్తలు రాసే జర్నలిస్టులను వేధించడం సబబు కాదని పేర్కొన్నారు. అక్రమాలను వెలుగులోకి తెస్తున్న పత్రికలపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని, అందుకు సీఎం కూడా అతీతుడు కాదన్నారు. భూదందాలో తన ప్రమేయం లేనపుడు ప్రజలకు సరైన ఆధారాలు చూపాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. -
అక్రమభవనానికి సీఎం చంద్రబాబు రాజముద్ర