rushikonda
-
రుషికొండపై కట్టినవి ప్రభుత్వ భవనాలే
సాక్షి, అమరావతి: విశాఖలో రుషికొండపై నిర్మించిన భవనాలన్నీ ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని నిర్మించినట్లు మంత్రే స్వయంగా చెప్పారని, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ఈ భవనాలను రాష్ట్రపతి, ప్రధాని వంటి అతిథులు రాష్ట్రానికి వచ్చినప్పుడు గెస్ట్హౌస్లుగానో లేక వేరే విధంగా వినియోగించుకుంటారా... అన్నది ప్రభుత్వ ఇష్టమన్నారు. మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ భవనాలపై చర్చ జరిగింది.ఈ చర్చలో బొత్స మాట్లాడుతూ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి నివాసం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి భవన్‌ను నిర్మించారని, ఆ తర్వాత సీఎంలు ఆ భవనాలను వినియోగించుకుంటున్నారని, అదేవిధంగా రుషికొండ భవనాలను కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఒక పక్క అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతూనే, ప్రజల ఆమోదం లేకుండా నిర్మించారని మంత్రి దుర్గేష్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఉపన్యాసం చేస్తుండటంతో మధ్యలో కల్పించుకొని వివరణ ఇస్తున్నానని తెలిపారు.మరో మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం చదరపు అడుగుకు వారు రూ.6,500 ఖర్చు చేస్తే, రుషికొండలో ఏకంగా రూ.25,000 ఖర్చు చేశారంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బొత్స అన్నారు. 2015లో శాసనసభ నిర్మాణానికి ఫర్నిచర్‌తో కలిపి చదరపు అడుగుకు రూ.14,000 ఖర్చు చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా ఈ భనాలను చూసి తాజ్‌మహల్ కంటే చాలా బాగున్నాయని పొగిడిన సందర్భాన్ని గుర్తు చేశారు.వాస్తవాలు ఇలా ఉంటే మంత్రులే çసంయమనం పాటించకుండా ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా చిత్రీకరిస్తూ రండి చూసుకుందాం.. దమ్ముంటే రండి... అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఈ పదాలను తక్షణం రికార్డుల నుంచి తొలగించాలంటూ బొత్స డిమాండ్ చేశారు. అంతకముందు మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అప్పటి మున్సిపల్ మంత్రి అయిన మిమ్మల్ని కూడా చూడనీయకుండా దాచిపెట్టి కట్టినందుకు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా.. అంటూ బొత్స సత్యనారాయణను ఉద్దేశించి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సభలో వైఎస్సార్సీపీ సభ్యులు, మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది.అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు ఎప్పుడిస్తారు?రబీ అయిపోయి ఖరీప్ వచ్చినా ఇప్పటివరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద కూటమి ప్రభుత్వం ఇస్తామన్న రూ.20వేల నగదు సాయంలో ఒక్కపైసా విడుదల కాలేదని, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని మండలిలో వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, రామసుబ్బారెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ 52 లక్షల మంది రైతులకు రూ.10,500 కోట్లు అవసరమైతే బడ్జెట్లో కేటాయించిన రూ.4,500 కోట్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో కూడా రూ.3,500 కోట్లు పీఎం కిసాన్ కింద ఇచ్చే కేంద్ర నిధులని, కేవలం రూ1,000 కోట్లే రాష్ట్ర నిధులను కేటాయించారన్నారు.కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత పెరుగుతుందన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం విధివిధానాలు తయారు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6,000కు రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 త్వరలోనే అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ–క్రాప్ ఆధారంగా ఉచిత పంటల బీమా అందించి ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందని, ఇప్పుడు జూలై, ఆగస్టు నెలల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం ఇంతవరకు ఇవ్వలేదని వైఎస్సార్సీపీ సభ్యుడు తోట త్రిమూర్తులు విమర్శించారు.ఫైళ్ల దగ్ధం కేసు విచారణ జరుగుతుండగా పేర్లు ఎలా చెబుతారు?: బొత్సమదనపల్లి ఫైళ్ల దగ్ధంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తప్పు జరిగితే విచారణ చేసి దోషులపై కఠిన చర్య తీసుకోవచ్చని, కానీ విచారణ జరుగుతుండగానే కొంతమంది పేర్లను నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ప్రస్తావిస్తారని నిలదీశారు. ఆ పేర్లను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో చినజీయర్ స్వామి, ఈషా ఫౌండేషన్లకు చంద్రబాబు ఇచ్చిన విధంగానే వేద పాఠశాల నిర్మాణం కోసం ధార్మిక సంస్థలకు భూ కేటాయింపులు చేశారని చెప్పారు. ఇందులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే చట్టప్రకారం చర్య తీసుకోవడానికి తాము వ్యతిరేకం కాదన్నారు. -
రుషికొండ భవనాలకు అన్ని అనుమతులున్నాయి : మంత్రి దుర్గేశ్
-
అమరావతి పేరుతో 33 వేల ఎకరాల ధ్వంసం చేస్తే మంచి..! రుషికొండపై ప్రభుత్వ భవనాలు కడితే తప్పా?
-
అద్భుతం.. అంటూనే అడ్డగోలు విమర్శలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అనకాపల్లి: విశాఖలో రుషికొండపై వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖ నిర్మించిన భవనాలు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. ఆయన శనివారం సాయంత్రం రుషికొండపై నిర్మించిన భవనాల్ని మంత్రులతో కలిసి పరిశీలించారు. భవనాల్లో ప్రతి గదినీ క్షుణ్ణంగా పరి శీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ.. కొండ చరియలు విరిగి పడకుండా జపాన్ సాంకేతికతను వినియోగించి, నాలుగు బ్లాక్‌లు అత్యా«ధునిక టెక్నాలజీతో నిర్మించారని కితాబిచ్చారు. వీటిని చూస్తే మైండ్ బ్లోయింగ్ అయిందన్నారు.ఎన్నో దేశాల్లో ప్యాలెస్‌లు చూశానని, ఇలాంటి కట్టడాలు చూడలేదని తెలిపారు. రాష్ట్రపతి భవన్కంటే అద్భుతంగా కట్టారని, కారిడార్‌ని చూస్తే.. అమెరికాలోని వైట్‌హౌస్‌లో కూడా ఇలా ఉండదని అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మించిందని అన్నారు. సుమారు రూ.500 కోట్లు ప్రజాధనం వెచ్చించి విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని, ప్రజలంతా ఈ దారుణాన్ని చూశాక, అందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని, ఈ భవనాన్ని ఏం చెయ్యాలో నిర్ణయిస్తామని చెప్పారు. రాజధాని నిర్మిస్తామంటూ విశాఖ ప్రజలను జగన్ మోసం చేశారన్నారు.సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లురాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఉన్న రోడ్లన్నింటినీ సంక్రాంతినాటికి గుంతలు లేని రహదారులుగా చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన శనివారం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నలపాలెంలో రూ.860 కోట్లతో చేపట్టిన గుంతలు లేని రహదారుల కార్యక్రమం ‘మిషన్ ఫర్ పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఇన్ ఏపీ’ని ప్రారంభించారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.1.25 లక్షల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అదనంగా మరో రూ.50 వేల కోట్లతో భోగాపురం– మూలపేట, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ ఈస్ట్ బైపాస్ వంటి రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. విశాఖ నుంచి అమరావతికు బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తామని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం ముడసర్లోవ వద్ద 52 ఎకరాలు కేటాయించామని తెలిపారు.3 రోజుల్లో కొత్త ప్రణాళికవిశాఖ జిల్లా కలెక్టరేట్లో విశాఖ గ్రోత్ హబ్‌పై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రెండు మూడేళ్లలో రాష్ట్ర భవిష్యత్తుని మార్చేలా 10 పాయింట్లతో కూడిన కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. దీనిద్వారా 2047 నాటికి రాష్ట్రం అన్నింటా ముందుంటుందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో ప్రత్యేక హబ్‌ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అనిత, కొల్లు రవీంద్ర, జనార్థన్‌రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, బాలవీరాంజనేయ స్వామి, దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
కట్టలు తెగిన దుష్ప్రచారం.. రుషికొండ భవనాలపై దిగజారుడు మాటలు
ప్రభుత్వ అవసరాల కోసం రుషికొండలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గత ప్రభుత్వం రూ.430 కోట్లతో భవనాలు నిర్మించింది. ఇవి శాశ్వత భవనాలు. రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన విశాఖలో ప్రభుత్వ పరంగా ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. వీటిని గుడ్లప్పగించి చూస్తూ.. నోరెళ్లబెట్టిన చంద్రబాబు.. గట్టిగా వానొస్తే నీళ్లు కారేలా ఏకంగా రూ.2,500 కోట్లతో అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు ఏ లెక్కన నిర్మించారు? ఇప్పుడు ఈ తాత్కాలిక కట్టడాలను కూల్చేసి.. శాశ్వత భవనాల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు? తన విలాసాల కోసం చేసిన ఖర్చు ఎవరికి తెలియదు? కుట్రలు, దుష్ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్న ఈ పెద్దమనిషికి డైవర్షన్ పాలిటిక్స్ వెన్నతో పెట్టిన విద్య. వాటి ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంతకైనా దిగజారుతానని మరోమారు నిరూపించుకున్నారు. సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా, చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సీఎం చంద్రబాబు విష ప్రచారాలనే నమ్ముకున్నారు. జరగని వాటిని జరిగినట్లు, లేని విషయాలను ఉన్నట్లు ఎడతెగని దుష్ప్రచారం చేస్తూ రోజుకో కుట్రకు తెరతీస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరాంధ్ర వెళ్లి అక్కడ తన పని మరచిపోయి, రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ భవనాల వద్దకు వెళ్లి అవాకులు చెవాకులు పేలారు. గంట సేపు అక్కడ గడిపి వీడియో, ఫొటో షూట్లు చేయించడమే కాకుండా నోటికి వచ్చిన అబద్ధాలను కళ్లార్పకుండా చెప్పేశారు. ప్రభుత్వ అవసరాల కోసం టూరిజం శాఖ కట్టిన భవనాలను అప్పటి సీఎం విలాసాల కోసం కట్టారని.. రాజులు, చక్రవర్తులు ఇలాంటివి కట్టించుకుంటారంటూ అడ్డగోలుగా మాట్లాడారు. కమోడ్‌కు రూ.10 లక్షలు ఖర్చు పెట్టారంటూ అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. 2014లో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో నెలల తరబడి కుటుంబంతో ఉండి రూ.30 కోట్ల బిల్లును ప్రభుత్వంతో కట్టించిన విషయాన్ని మరచిపోయారు. ఉండవల్లి, హైదరాబాద్, ఢిల్లీలోని తన క్యాంపు ఆఫీసులకు కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వ అవసరాల కోసం భవనాలు కట్టడాన్ని తప్పుగా చిత్రీకరించడం విడ్డూరంగా ఉంది. హైదరాబాద్ మదీనాగూడలోని తన సొంత ఫామ్‌హౌస్‌లో మరమ్మతులకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయించిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మించిన భవనాలపై అడ్డగోలు నిందలు మోపుతూ శుద్ధపూస కబుర్లు చెప్పడాన్ని ఏమనాలి? రుషికొండపై టూరిజం శాఖ రూ.430 కోట్లతో నిర్మించిన భవనాలు ప్రభుత్వ కార్యకలాపాల కోసమేననే విషయాన్ని పక్కదారి పట్టించి వైఎస్ జగన్ కోసం నిర్మించినట్లుగా దాన్ని చిత్రీకరించడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి ఒక ఉదాహరణ. ఇందులో భూమి చదును చేయడానికే ఎక్కువ మొత్తం ఖర్చయింది. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాల కోసం ఇదే చంద్రబాబు ప్రభుత్వం గతంలో రూ.2,500 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు వీటిని కూలగొట్టి శాశ్వత భవనాలు నిర్మించడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తారో ఆయనే సెలవివ్వాలి. ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్⇒ హనీ ట్రాప్‌ల మాయలేడి, ముంబయికి చెందిన నటి కాదంబరి జత్వాని కేసును తెరపైకి తెచ్చి నలుగురు ఐపీఎస్ అధికారులపై కేసులు బనాయించారు. పారిశ్రామికవేత్తలు, ధనికులను లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్‌తో బ్లాక్ మెయిల్ చేసే కేసును ఏపీ పోలీసులు చాకచక్యంగా ఛేదిస్తే, దాన్ని కూడా రాజకీయం చేసి ఆమెకు వత్తాసు పలికి రాచమర్యాదలు చేయించారు చంద్రబాబు. ⇒ మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగితే.. దాన్ని వైఎస్సార్సీపీ కావాలని చేసిందంటూ ఆ ఘటనను రాజకీయానికి వాడుకున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని ఫైళ్లు తగుల బెట్టించడానికి ఇది చేయించారంటూ అడ్డగోలు వాదనకు దిగి కేసులు పెట్టి నానా రభస సృష్టించారు. డీజీపీని హెలికాప్టర్లో అక్కడికి పంపించారు. ఆ కేసులో ఇంతవరకు ఏమీ నిరూపించలేకపోయారు. ⇒ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందన్నప్పుడల్లా ఇలా ఏదో అంశాన్ని తెరపైకి తెచ్చి, వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా చిత్రీకరించి ఆయనపై దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు, ఆయన కూటమి పనిగా పెట్టుకుంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోననే భయంతో ఇలాంటి దారుణమైన కుట్ర రాజకీయాలు చేస్తూ చంద్రబాబు తన దిగజారుడుతనాన్ని ప్రతిరోజూ బయట పెట్టుకుంటున్నారు. మోసం, నయవంచనతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటినే ఆలంబనగా చేసుకుని తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించి వాటిని పక్కదారి పట్టించేందుకు దారుణంగా దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ప్రమాదంపై అడ్డగోలుతనం రెండేళ్ల క్రితం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ వాహనానికి జరిగిన ప్రమాదాన్ని ఇటీవలి ఎన్నికలకు ముందు జరిగినట్లు ప్రచారం చేస్తూ కుట్ర రాజకీయం మొదలుపెట్టారు. ఎప్పుడో 2022లో విజయమ్మ వాహనం టైర్లు ప్రమాదవశాత్తు పంక్చర్ అయితే, దాన్ని ఇటీవలే జరిగినట్లు.. దాని వెనుక కుట్ర ఉన్నట్లు, జగన్ కావాలని చేయించినట్లు అనుమానాలు కలిగేలా టీడీపీ సోషల్ మీడియా మూడు రోజులుగా వైరల్ చేస్తూ శునకానందం పొందుతోంది. అబద్ధానికి రెక్కలు తొడిగి పబ్బం గడుపుకునే చంద్రబాబుకు, ఆయన పరివారానికి కనీస విచక్షణా జ్ఞానం లేదని, కుట్రతో బురద జల్లడమే తెలుసని ఈ విషయం ద్వారా తేటతెల్లమైంది. అనుకోకుండా జరిగిన ప్రమాదాన్ని రెండేళ్ల తర్వాత తెరపైకి తెచ్చి, దానిపై ఆరోపణలు చేయడం చంద్రబాబు కుట్రలకు పరాకాష్ట. శ్రీవారి సాక్షిగా అబద్ధాలుకలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమలనే వేదికగా చేసుకుని వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు అభాసుపాలయ్యారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, ఇందుకు గత ప్రభుత్వమే కారణమని దారుణమైన అబద్ధాన్ని పదే పదే చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించారు. వేంకటేశ్వరస్వామి తన కుల దైవం అని చెప్పుకుంటూనే ఆయన్ను రాజకీయంలోకి లాగి చివరికి సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నారు. నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదని తేలడంతో దానిపై అడ్డగోలుగా మాట్లాడిన చంద్రబాబు, ఆయన అనుయాయుల నోళ్లు మూత పడ్డాయి.బెజవాడ వరదల్లోనూ రాజకీయంవిజయవాడ వరదలను ఎదుర్కోవడంలో దారుణంగా వైఫల్యం చెంది లక్షలాది మందిని నీటిలో ముంచిన చంద్రబాబు... ఆ విషయం నుంచి రాష్ట్ర ప్రజలను ఏమార్చేందుకు ప్రకాశం బ్యారేజీని బోట్లతో గుద్దించి ధ్వంసం చేయడానికి జగన్ పథకం పన్నారంటూ విష ప్రచారం చేశారు. వరదలో కొట్టుకువచ్చిన 4 బోట్లు బ్యారేజీ గేట్లకు అడ్డం పడితే, దాన్ని రాజకీయం చేసి వైఎస్సార్సీపీయే కావాలని బోట్లతో గుద్దించిందని, దీని వెనుక జగన్ ఉన్నారని చెబుతూ కేసులు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. చరిత్రలో ఇంతటి దగుల్బాజీ రాజకీయం చంద్రబాబు తప్ప వేరెవరూ చేయలేరని ఆ కేసు ద్వారా నిరూపించుకున్నారు. వాస్తవానికి వరద నీటిని నగరంలోకి మళ్లించిందే చంద్రబాబు. ఆ పడవలన్నీ టీడీపీ వాళ్లవే. -
వైఎస్ జగన్ పనితనాన్ని మెచ్చుకున్న చంద్రబాబు
సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నంలోని రుషికొండపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్రభుత్వ భవనాలపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. కొండచరియలు విరిగి పడకుండా జపాన్ టెక్నాలజీని ఉపయోగించి అత్యాధునిక భవనాలను నిర్మించారని చంద్రబాబు కితాబిచ్చారని వైఎస్సార్సీపీ తెలిపింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. ఈ నేపథ్యంలో వైఎస్సార్.. రుషికొండపై భవనాలను కొండ చరియలు విరిగి పడకుండా జపాన్ టెక్నాలజీని వినియోగించి కట్టారు. ప్రభుత్వ భవనాలను ఎంతో అత్యాధునికంగా భవనాల్ని నిర్మించారని కితాబిచ్చారని చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో చంద్రబాబుకు కౌంటరిచ్చింది. అమరావతిలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి నాసిరకం ప్రభుత్వ భవనాల్ని అప్పట్లో చంద్రబాబు నిర్మించారని గుర్తు చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వ భవనాల్ని ఎలా నిర్మించాలో తెలుసుకో చంద్రబాబు అంటూ చురకలంటించింది.వైయస్ జగన్ గారి హయాంలో నిర్మించిన రుషికొండ ప్రభుత్వ భవనాలపై సీఎం @ncbn ప్రశంసలు కొండ చరియలు విరిగి పడకుండా జపాన్ టెక్నాలజీని వినియోగించి.. ఆ తర్వాత అత్యాధునికంగా భవనాల్ని నిర్మించారని కితాబు అమరావతిలో వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి నాసిరకం ప్రభుత్వ భవనాల్ని అప్పట్లో… pic.twitter.com/Wc2ukxwdKG— YSR Congress Party (@YSRCParty) November 2, 2024ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు విశాఖలో పర్యటించారు. ఈ సందర్బంగా రుషికొండపై వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ భవనాలను పరిశీలించి ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. That is Jagan !! pic.twitter.com/f4LJzBHOGB— Sridhar Reddy Avuthu (@SridharAvuthu) November 2, 2024 -
బాపట్ల బీచ్ లో బాదుడే బాదుడు
సాక్షి ప్రతినిధి, బాపట్ల : గత ప్రభుత్వ హయాంలో విశాఖ రుషికొండలోని బ్లూఫ్లాగ్ బీచ్‌లో ప్రవేశరుసుం వసూలుచేయాలని సంకల్పిస్తే నానా యాగీచేసిన పచ్చబ్యాచ్ ఇప్పుడు బాపట్ల సూర్యలంక బీచ్‌లో సిగ్గూఎగ్గూ లేకుండా అదే పనికి బరితెగిస్తున్నారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల నుంచి భారీగా పిండుకునేందుకు రంగం సిద్ధంచేశారు. బీచ్‌కు వచ్చే ఒక్కొక్కరి నుంచి రూ.20 చొప్పున వసూలుచేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఇప్పటివరకూ వేలంపాట నిర్వహించి తద్వారా వాహనాల నుంచి టోల్గేట్లో డబ్బులు వసూలుచేసేవారు. ఇప్పుడు ఆ వేలంపాట ఎత్తేసి పంచాయతీ ముసుగులో తెలుగు తమ్ముళ్లే ఈ తతంగం మొత్తం నిర్వహించి బీచ్‌ను తమ గుప్పెట్లో పెట్టుకోనున్నారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ శుక్రవారం జరిగిన బాపట్ల మున్సిపల్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించగా సభ్యులు, అధికారులు చప్పట్లతో స్వాగతించారు. ఈనెలాఖరు నుంచే పచ్చబ్యాచ్ వాహనాల నుంచి డబ్బులు వసూలుచేయనుండగా ఆ తర్వాత సందర్శకుల నుంచి వసూలు చేయనున్నారు. మరోవైపు.. పక్కనే ఉన్న చీరాలలో కూడా కొద్దిరోజులుగా ఇదే రీతిలో వసూళ్ల పర్వం సాగుతుండడంతో అక్కడ పచ్చనేతల దోపిడీపై పర్యాటకులు మండిపడుతున్నారు.వేలంపాటకు మంగళం..నిజానికి.. ఇప్పటివరకూ వేలంపాటలో టోల్గేట్ నిర్వహణను దక్కించుకున్న వారు సందర్శకుల నుంచి వాహనాలకు డబ్బులు వసూలు చేసేవారు. కానీ, ఇప్పుడు గ్రామ పంచాయతీ మాటున పచ్చ మాఫియాయే నేరుగా టోల్గేట్ వసూళ్లతోపాటు తీరంలో టాయిలెట్లు, ఇతరత్రా రాబడి వనరులన్నింటినీ తమ గుప్పెట్లోకి తీసుకుని దందా సాగించేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే.. వారంలో ప్రతి శని, ఆదివారాల్లో ఇక్కడికి విపరీతంగా పర్యాటకులు వస్తారు. వారాంతంలో రెండ్రోజులు దాదాపు 20 వేల మంది పర్యాటకులు వస్తుండగా.. మిగిలిన ఐదురోజుల్లో 10 నుంచి 15 వేల మంది చొప్పున నెలకు 1.20 లక్షల మందికి తగ్గకుండా పర్యాటకులు వస్తున్నారు.ఈ లెక్కన నెలకు రూ.24 లక్షల రాబడి ఉంటుంది. దీంతో పచ్చ తమ్ముళ్లు దీనిని పాడికుండలా భావించి దీనిపై కన్నేశారు. అలాగే, టూవీలర్‌కు రూ.15, ఆటోకు రూ.30, కారుకు రూ.50, బస్సుకు రూ.100 చొప్పున ధరలు నిర్ణయించారు. గత ఏడాది ఇది వేలంపాటలో రూ.30 లక్షలు పలికింది. దీంతోపాటు ఇక్కడి కొన్ని టాయిలెట్స్, వాష్‌రూములు ఏర్పాటుచేసి నిర్వహణ కోసం వేలంపాట పెట్టగా అదీ ఏడాదికి రూ.5 లక్షలు పలికింది. ఇవికాకుండా బల్లలు, గుర్రాలు, తీరంలో పర్యాటకులను తిప్పే బైక్‌లు నడిపేవారు పంచాయతీకి పన్నులు చెల్లిస్తున్నారు. మొత్తంగా ఏడాదికి రూ.38 లక్షల వరకు తీరంపై రాబడి ఉంది. ఇలా ఇవన్నీ వేలంపాటలు కావడంతో రాబడిపై అందరికీ స్పష్టత ఉంది.కానీ, ఇప్పుడు ఈ వ్యవహారాన్నింట్లో ఇక తెలుగు తమ్ముళ్లదే పెత్తనం కావడంతో రాబడిపై అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఎందుకంటే.. ఇప్పుడు ఎంత వస్తుందో అన్నది ఎవరికీ తెలిసే అవకాశంలేదు. అధికార పార్టీ కనుక అడిగేవారూ ఉండరు. ఇదే ఆలోచనకు వచ్చిన ఎల్లోగ్యాంగ్ తీరంలో పాగా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొద్దిరోజుల్లో కార్తీక మాసం ప్రారంభమవుతుండడంతో పచ్చనేతలకు పండగే పండగ. కారణం.. ఈ మాసంలో జనం లక్షల్లో తీరానికి వస్తారు. పెద్దఎత్తున వాహనాల రానుండటంతో రూ.లక్షల్లో వసూలుచేసుకునే అవకాశముంది. ఇదిచూసి.. పచ్చనేతల సొంత లాభం కోసమే పర్యాటకుల నుంచి డబ్బులు వసూళ్లకు దిగుతున్నారని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పక్కదోవ.. రుషికొండ ప్యాలెస్ పై నీచ రాజకీయం
-
ఇక తగ్గేదేలేదు.. కొడాలి నాని ఈజ్ బ్యాక్
-
రుషికొండ బిల్డింగ్ తప్పుడు ప్రచారాలపై గుడివాడ అమర్నాథ్ క్లారిటీ..
-
రుషికొండలో భవనాలపై టీడీపీ బురద చల్లుతోంది: మాజీ మంత్రి రోజా
-
ఐకానిక్ భవనంపై టీడీపీ రచ్చ..
-
అదేనా మా తప్పు?: టీడీపీకి ఆర్కే రోజా సూటి ప్రశ్న
విశాఖపట్నం, సాక్షి: రుషికొండలో గత జగన్ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలు.. అక్రమ కట్టడాలని ప్రచారం చేస్తున్న టీడీపీకి గట్టి ఎదురు దెబ్బలే తగులుతోంది. చంద్రబాబు మాదిరి జగన్ తాత్కాలిక భవనాలు నిర్మించి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయలేదని.. ప్రజా ధనంతో పటిష్టమైన ప్రభుత్వ భవనాలే నిర్మించారని ఇటు వైఎస్సార్సీపీ, అటు నెటిజన్లు కౌంటర్లు ఇస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఈ అంశంపై స్పందించారు. రుషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా.. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా? అని టీడీపీ శ్రేణుల్ని గట్టిగా ప్రశ్నించారు. ‘‘విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా?. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా?’’ అంటూ సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం.. 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..?. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టం...ఇందులో అక్రమం ఎక్కడుంది..?. విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా..?. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా...?. ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా..... హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా..?. ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..?. హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్ లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా...ఈరోజు విమర్శలు చేసేది..?. .. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది..?. జగనన్నపైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెన్ను చూపేది లేదు...వెనకడుగు వేసేది లేదు.. జై జగన్ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. -
జగన్ ను విమర్శించడం కాదు.. వాటిని ఎలా ఉపయోగించాలో ఆలోచించండి..
-
మూడేళ్లుగా దుష్ప్రచారం
కొమ్మాది (విశాఖ): విశాఖపట్నం బీచ్‌రోడ్డులో రుషికొండపై నిర్మించిన భవనాల విషయంలో టీడీపీ నేతలు గడిచిన మూడేళ్లుగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని, దానిని తక్షణమే మానుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఎండాడలోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రుషికొండపై ప్రభుత్వ అవసరాల కోసం ఆ భవనాలను నిర్మించామన్నారు. అయితే ఆ భవనాలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి సొంతానికి నిర్మించుకున్నారంటూ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.రుషికొండపై నిర్మాణాలు సాగనీయకుండా అనేక సార్లు కోర్టును ఆశ్రయించారన్నారు. ఈ నిర్మాణాలకు ముందే సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీని వేశామని, ఆ కమిటీ ఇచ్చిన సూచనలు మేరకు ముందుకు సాగామని తెలిపారు. విశాఖ నగరానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ వంటి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు వారికి సరైన విడిది సౌకర్యం లేనందువల్లే ఆ భవనాలను నిర్మించామని తెలిపారు.ఈ భవనాలు వీఐపీలు, వీవీఐపీలకు కేటాయించే అవకాశం ఉన్నందున భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు వాటిని బహిర్గతం చేయలేదని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ విషయాన్ని పట్టించుకోకుండా వీటిని బహిర్గతం చేశారని అన్నారు. అదే విధంగా విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఇక్కడి నుంచే పాలన సాగించాలని వైఎస్ జగన్ భావించారని వివరించారు. రాష్ట్రంలో అధికార మారి్పడి జరిగిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పర్యాటక శాఖకు సంబంధించిన ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన చేయాలన్నారు. అమరావతి పేరుతో రూ.వేల కోట్లు దుర్వినియోగం గతంలో 2014–19 సమయంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో తాత్కాలిక భవనాల నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని అమర్నా«థ్ చెప్పారు. హైదరాబాద్‌లో చంద్రబాబు అత్యంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నారని ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులను ఓ హోటల్లో ఉంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశి్నంచారు.నిజంగా గంటా శ్రీనివాసరావు ప్రజలకు వాస్తవాలు చూపించాలి అనుకుంటే ఇదే నిర్మాణం ఎదురుగా గీతం ఆక్రమణలు బహిర్గతం చేసి ప్రజలకు చూపించాలన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగమైన భోగాపురం ఎయిర్‌పోర్టు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, మూలపేటలో పోర్టు, మెడికల్ కాలేజీలు, ట్రైబల్ యూనివర్సిటీ వంటివి నిర్మించామని వాటినీ ప్రజలకు చూపించాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి పాల్గొన్నారు. -
అద్భుత భవనాలపై ‘అగ్లీ’ ఏడుపు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది టీడీపీ. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా అద్భుత భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేస్తోంది.ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే వాటిపై చేస్తున్న విష ప్రచారం ఆ పార్టీ సంస్కృతికి నిదర్శనం. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చేస్తున్న కపట నాటకం. రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా.. ఇప్పుడు కేవలం రూ. 400 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఈ ఐకానిక్ భవనాలను చూసి తల ఎక్కడ పెట్టుకోవాలో టీడీపీ అధినేతలకే తెలియడంలేదు. అందుకే ఈ అగ్లీ (చెత్త)ఏడుపు. విశాఖపట్నంలోని బీచ్‌కి ఆనుకొని ఉన్న రుషికొండపై రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్ భవనాలు చాలా కాలం క్రితం నిర్మించినవి.అవి శిథిలమై ప్రమాదకరంగా మారడంతో వాటిని తొలగించి, కొత్త భవనాలు కట్టాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరిపింది. ప్రపంచ స్థాయిలో, 5 స్టార్ వసతులతో అత్యాధునికంగా, విశాఖ నగర ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసేలా డిజైన్లు రూపొందించింది. సీఆర్‌జెడ్ పరిమితులకు లోబడి నిర్మాణాలు ప్రారంభించింది. రుషికొండపై ఏ భవనాలు, ఎందుకు నిర్మిస్తున్నారో సమగ్ర వివరాల్ని 2021లోనే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందజేసింది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ పర్యాటక విడిది కేంద్రంగా మొత్తం రూ.412 కోట్లతో 7 బ్లాకుల్ని నిర్మించింది.రుషికొండ మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిర్మించింది. గతంలో హరిత రిసార్టు 48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చ.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా నిర్మించారు. ప్రెసిడెన్షియల్ సూట్, సూట్ రూమ్, బాంక్వెట్ హాల్‌తో విజయనగర బ్లాకు, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, సూట్ రూమ్స్, డీలక్స్ గదులు, బాంక్వెట్ హాల్‌తో కళింగ బ్లాక్ నిర్మించింది. సూట్ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్‌తో పల్లవ బ్లాక్, సమావేశ మందిరాలతో చోళ బ్లాక్, రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్‌తో గజపతి బ్లాక్, ప్రైవేట్ సూట్ రూమ్‌లతో వేంగిబ్లాక్, రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్ సౌకర్యాలతో ఈస్ట్రన్ గంగా బ్లాక్‌లని నిర్మించింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే.. విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తే, రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలంచింది. ఇందుకు ఏర్పాట్లూ ప్రారంభించింది. విశాఖలో పాలన ప్రారంభించడానికి అనువైన భవనాల పరిశీలనకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ విశాఖలోని పలు భవనాలను పరిశీలించింది. వీటిలో రుషికొండపై నిర్మించిన భవనాలు ప్రభుత్వ కార్యకలాపాలకు అనువైనవని తేల్చింది. ఇక్కడ సీఎం నివాసం, సీఎం కార్యాలయానికి ఇవి అనువుగా ఉంటాయని వెల్లడించింది. అప్పట్నుంచి ఈ భవనాల్లో సీఎం నివాసం, కార్యాలయానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు.వాటిని నిర్మించింది ప్రభుత్వం. పనులు జరిగింది ఏపీటీడీసీ ఆధ్వర్యంలో. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు ఇక్కడే నిర్వహించేందుకు వీలుగా అత్యద్భుతంగా ఫైవ్‌స్టార్ హోటల్స్‌ని తలదన్నేలా నిర్మాణం జరిగింది. సాగర తీరంలో అద్భుతంగా, రాష్ట్రానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చేలా నిర్మించిన ఈ భవనాలను చూసి గర్వపడాలి కానీ.., ఎవరో సొంతగా భవనాలు కట్టేసుకొన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతల ఏడుపులు, పెడబోబ్బలు ఎందుకు? అవి ప్రభుత్వం నిర్మించిన భవనాలు. అనుమతి ఉన్న వారు ఎవరైనా వెళ్లొచ్చు. అయినా, టీడీపీ నేతలు ఏదో ఘనకార్యం చేసినట్లు ప్రభుత్వం భవనం లోపలికి వెళ్లి, ఫొటోలు దిగి, వీడియోలు తీసి చెడు ప్రచారం చేయడం నీచత్వానికి పరాకాష్టే. మంచి చేయడమే కాదు.. మరొకరు చేసిన మంచిని అంగీకరించడం కూడా చేతకాదని వారికి వారే నిరూపించుకోవడమే. -
విశాఖపై టీడీపీ విషం
-
రుషికొండ ప్రభుత్వ భవనాలపై టీడీపీ చిల్లర రాజకీయం
-
రుషికొండ ప్రభుత్వ భవనాలపై విషం కక్కుతున్న టీడీపీ అండ్ కో
సాక్షి, అమరావతి: రుషికొండ భవనాలపై టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారాలకు దిగిన వేళ.. అవి ప్రభుత్వ భవనాలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. ‘ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం..అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు. ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు’ అని సామాజిక మాధ్యమంలో పేర్కొంది. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి… https://t.co/o3m2GSOrAk— YSR Congress Party (@YSRCParty) June 16, 2024చీటికి మాటికి దుష్ప్రచారం తగదు: ఎమ్మెల్సీ వరుదు కల్యాణిరుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేర్కొన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లి చీటికిమాటికి తమ పార్టీపై దుష్ప్రచారం చేయటం తగదన్నారు. ఆమె ఆదివారం సాక్షితో మాట్లాడుతూ అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని తమ ప్రభుత్వం అధికారంలో ఉండగానే స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ‘ప్రజలు విజ్ఞులు. అన్నీ గమనిస్తూ ఉంటారు. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే ప్రసక్తేలేదు. అధికారం ఇచ్చింది ప్రజలకు సేవచేయమని. కల్పితకథలు సృష్టించి వైఎస్సార్సీపీపై నిందలు వేయమని కాదు..’ అని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే టీడీపీ వారికే నష్టం అని ఆమె పేర్కొన్నారు. -
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
రుషి కొండపై గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను భూతద్దంలో చూపిస్తూ విష ప్రచారం చేస్తున్న టీడీపీ నేతల తీరును వైఎస్సార్సీపీ ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.‘రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నాడు. ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు’అంటూ వైస్సార్సీపీ ట్వీట్లో పేర్కొంది.రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి… https://t.co/o3m2GSOrAk— YSR Congress Party (@YSRCParty) June 16, 2024 -
ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి పేపర్ ఫేక్ న్యూస్ పై KSR విశ్లేషణ
-
రుషికొండ భవనాల వినియోగంపై త్వరలోనే నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై త్వరలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. రుషికొండపై నిర్మించిన ఆ భవనాలను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతితో కలిసి మంత్రులు అమర్నాథ్, రోజా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు అమర్నాథ్, రోజా మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండపై 9.88 ఎకరాల్లో టూరిజం ప్రాజెక్టు నిర్మించామని, గతంలో ఈ ప్రాంతంలో ఉన్న హరిత రిసార్టుల స్థానంలో ఈ నిర్మాణాలు జరిగాయన్నారు. అత్యంత సుందరమైన విశాఖ నగరానికి తగ్గట్లుగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భవన నిర్మాణాలు సాగాయని తెలిపారు. పర్యాటకంగా విశాఖను తీర్చిదిద్దడంలో భాగంగా రూపుదిద్దుకున్న ఈ భవనాలు నగరానికే తలమానికమన్నారు. ఈ భవన నిర్మాణాలకు అనేక అడ్డంకులు కల్పించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ అనేక కుట్రలు పన్నాయని, వాటన్నింటినీ దాటుకుంటూ ప్రాజెక్టును పూర్తిస్థాయి అనుమతులతో పూర్తిచేశామని వారు వివరించారు. విశాఖపట్నం రాజధానిగా చేయాలని సంకల్పించిన సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో త్రీమెన్ కమిటీని ఏర్పాటుచేశారన్నారు. ఇందులో సీఎం క్యాంపు కార్యాలయం ఉంటే మంచిదని ఆ కమిటీ సూచించిందని మంత్రి రోజా అన్నారు. అయితే, ఈ భవనాల్ని పూర్తిగా పర్యాటకం కోసం వినియోగించాలా? లేదా ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉపయోగించాలా? అన్న అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ డా.ఎ. వరప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్మన్ సుభద్ర, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కె.రవిబాబు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డా.రజత్‌భార్గవ, మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు, జేసీ కె.మయూర్ అశోక్, పర్యాటక శాఖ ఆర్.డి. శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ లొడగల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు వివరాలివీ.. ♦ నూతన రిసార్ట్స్ని 9.88 ఎకరాల విస్తీర్ణంలో 1,48,413 చ.అడుగుల విస్తీర్ణంలో ఏడు బ్లాకులుగా నిర్మించారు. ♦ అంతర్జాతీయ ప్రమాణాలతో పచ్చదనం, ల్యాండ్ స్కేపింగ్ పనులతో వీటిని అభివృద్ధి చేశారు. రహదారులు, డ్రైనేజీ, నీటిసరఫరా, వీధిదీపాలు, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. ♦ 2021లో సీఆర్‌జెడ్ ఆమోదం, 2022లో స్థానిక సంస్థల ఆమోదం, 2023లో అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ కూడా తీసుకోవడంతో పాటు సంబంధిత చట్టబద్ధమైన ఆమోదాలు తీసుకున్నారు. ♦ వేంగి–ఏ, బీ, కళింగ, గజపతి, విజయనగర ఏ, బీ, సీ బ్లాకులుగా మొత్తం ఏడు బ్లాక్‌లు నిర్మించారు. వీటిల్లో రిసెప్షన్, రెస్టారెంట్లు, బ్యాంక్వెట్ హాల్స్, గెస్ట్‌రూమ్‌లు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్నెస్ సెంటర్, బ్యాక్‌ఆఫీస్, సర్వీస్ ఏరియాలు అభివృద్ధి చేశారు. ♦ నీటి సరఫరా సౌకర్యం కోసం 150 కేఎల్, ఫైర్ సంప్, పైప్ నెట్‌వర్క్‌తో పాటు 100 కేఎల్ డొమెస్టిక్ సంప్ ఏర్పాటుచేశారు. ♦ వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగం కోసం 100 కేఎల్డీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ కూడా నిర్మించారు. ♦ 1,000 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 2, 1010 కేవీఏ జనరేటర్లు 3, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ పనులు, వీధిదీపాలు ఏర్పాటుచేశారు. ♦ రిసార్ట్ అభివృద్ధికి స్థలం చదును చేయడం, నిర్మాణం, మౌలిక సదుపాయాలు.. ఇలా మొత్తం ప్రాజెక్టుకు రూ.365.24 కోట్లు ఖర్చుచేశారు. ♦ వేంగి–ఏ బ్లాక్‌లో సెక్యూరిటీ, బ్యాక్ ఆఫీస్, సూట్ రూమ్‌లు, రెస్టారెంట్స్ ఉన్నాయి. ♦ వేంగి–బీ బ్లాక్‌లో అతిథి గదులు, సమావేశ మందిరాలు, రెస్టారెంట్‌తో కూడిన బిజినెస్ హోటల్ ఉంది. ♦ కళింగ బ్లాక్‌లో రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా, లగ్జరీ సూట్ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. ♦ గజపతి బ్లాక్‌లో హౌస్ కీపింగ్, కేఫ్టేరియా, వ్యాపార కేంద్రాలున్నాయి. ♦ విజయనగరం–ఏ, బీ, సీ బ్లాక్‌లలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లా సూట్స్, స్పా, ఫిట్నెస్ సెంటర్, బ్యాంక్వెట్ హాల్స్ ఏర్పాటుచేశారు. -
రుషికొండపై నిర్మాణాల నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రుషికొండపై జరుగుతున్న పర్యాటక శాఖ రిసార్ట్ పునరుద్ధరణ పనులను, నిర్మాణాలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. నిర్మాణాలకు సంబంధించి ఉల్లంఘనలను పరిశీలించేందుకు ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఏం చేయాలో చూస్తామంది. ఉల్లంఘనలు ఏం ఉన్నాయో తాము కమిటీకి చెబుతామన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. కమిటీకి మీరు చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం తేల్చిచెప్పింది. రాజకీయ నేతల వ్యాజ్యాలు.. విశాఖ జిల్లా యండాడ గ్రామం సర్వే నంబర్ 19 పరిధిలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంఓఈఎఫ్) నిబంధనలు, విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ గతంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది యజ్ఞదత్ స్పందిస్తూ.. ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు హెచ్‌టూవో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ సలహాదారు గౌరప్పన్ నేతృత్వంలో ఎంఓఈఎఫ్ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కమిటీ డిసెంబర్ మొదటి వారంలో రుషికొండ నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇస్తుందని నివేదించారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. మూర్తి యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ.. ఉల్లంఘనలను కమిటీకి వివరించేందుకు అనుమతివ్వాలని కోరగా.. ధర్మాసనం నిరాకరించింది. ఏం ఉల్లంఘనలు ఉన్నాయో కమిటీనే చూసుకుంటుందని, మీరు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. కమిటీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేసింది. ఇచ్చిన అనుమతులు ఏమిటి? నిర్మాణాలు అందుకు అనుగుణంగా ఉన్నాయా? ఉల్లంఘనలు ఏం ఉన్నాయి? తదితర వివరాలను కమిటీ స్వయంగా చూసుకుంటుందని తెలిపింది. నిర్మాణాలను నిలువరించేందుకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరగా.. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం చెప్పింది. తదుపరి విచారణను డిసెంబర్ 27కి వాయిదా వేసింది. -
రుషికొండపై 'ఈనాడు' కడుపుమంట
-
రుషికొండ మిలీనియం టవర్స్ లో మంత్రుల క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు
-
రామోజీ శోకం రుషి‘కొండంత’!
సాక్షి, అమరావతి: అభివృద్ధి చూసి గోల పెట్టడమంటే ఇదే. మంచిని గుర్తించలేని కడుపు మంట అంటే ఇదే. ఒకళ్లపై పడి ఏడవటమంటే ఇదే. ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన విశాఖలో ఓ మంచి ప్రాజెక్టు రావడం రామోజీకి ఇష్టమే ఉండదు. విశాఖను రాజధానిగా చేస్తుంటే తట్టుకోలేరు. విశాఖ సుందర తీరంలో ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా ఓ అద్భుత ప్రాజెక్టు ని ర్మిస్తుంటే అసలే తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఉత్తరాంధ్రపై ఆయనకు ఉన్న ఉన్మాదాన్ని మరోసారి ప్రదర్శించారు. రుషికొండ టూరిజం ప్రాజెక్టుపై కొండంత విషం చిమ్మారు. హైదరాబాద్, విజయవాడలో క్యాంపు కార్యాలయాల పేరిట, ఫైవ్‌స్టార్ హోటళ్లలో బసకు ఆయన అనుంగు చంద్రబాబు చేసిన కోట్లాది రూపాయల దుబారాను వదిలేసి, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన టూరిజం ప్రాజెక్టుపై విలాసాలు, దుబారా అంటూ చిందులేస్తున్నారు. రుషికొండ ప్రాజెక్టులో ఆధునిక సౌకర్యాలు కల్పించారని, ఇందుకోసం ప్రజాధనం రూ.433 కోట్లు ఖర్చు చేశారంటూ శోకాలు తీస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ రాకుండా కుట్ర చేస్తున్నారు. ఆదాయం కోసమే కొత్త రిసార్టు ప్రతిపాదన వాస్తవానికి రుషికొండపై 1984–89లో 48 వేల చదరపు అడుగులు స్థలంలో నిర్మాణాలు చేశారు. తర్వాత 2002లో మరిన్ని నిర్మాణాలు చేపట్టారు. పర్యాటక రంగానికి తలమానికంగా ఉండాల్సిన ఈ భవనాల్లో తగినన్ని వసతులు లేవు. వాటిని ఆధునికంగా తీర్చిదిద్దడం సాధ్యం కాదని అధికారులు తేల్చారు. పైగా ఈ భవనాలు పాతబడటంతో వాటి స్థానంలో కొత్తవి ని ర్మించాలని నిర్ణయించారు. అందుకే ఏపీటీడీసీ 2.15 లక్షల చదరపు అడుగుల్లో కొత్తగా రిసార్ట్ నిర్మాణం చేపట్టింది. గతంలో చదరపు అడుగు స్థలంలో ఏడాదికి వచ్చే ఆదాయం రూ.1,100 అయితే, దానిని రూ.2,300కు పెంచేలా కొత్త రిసార్టులను డిజైన్ చేశారు. అందుకే బీచ్ ముఖద్వారంగా అన్ని రకాల సదుపాయాలతో నిర్మాణాలు చేసింది. ఈ నిర్మాణాలకు సీఆర్‌జెడ్, ఏపీసీజెడ్‌ఎంఏ, అటవీ, ఫైర్‌సేఫ్టీ, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్, ఏపీపీసీబీల నుంచి ముందస్తు అనుమతులు తీసుకునే పనులు చేస్తున్నారు. త్వరలో మొత్తం పనులు పూర్తికానున్నాయి. బాబుగారి క్యాంపు ఆఫీసుల బాగోతమిదీ.. చంద్రబాబు తొలుత జూబ్లిహిల్స్‌లోని తన నివాసాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి దానిలో హంగులు, ఆర్భాటాల కోసం ఖజానా నుంచి నిధులు ఖర్చు చేశారు. ఆ తరువాత అద్దె ఇంటిలోకి వెళ్లి ఆ ఇంటిని సీఎం నివాసం, క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు. ఆ ఇంటికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు చేశారు. తొలుత హైదరాబద్‌లోని సెక్రటేరియట్లో హెచ్ బ్లాక్‌ను సీఎం కార్యాలయంగా ప్రకటించి రూ. 7 కోట్లతో మరమ్మతులు చేశారు. ఆ తరువాత వాస్తు పేరుతో ఎల్ బ్లాక్‌ను సీఎం కార్యాలయంగా ప్రకటించి అక్కడ మరమ్మతులు, ఫర్నిచర్, హంగుల కోసం ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్‌లోనే లేక్‌వ్యూ గెస్ట్ హౌన్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి రూ.10 కోట్లు ఖర్చు చేశారు. ఆ తరువాత ఓటుకు కోట్లు కేసులో ఆయన గుట్టు రట్టవడంతో హఠాత్తుగా హైదరాబాద్ వదిలేసి రాత్రికిరాత్రి విజయవాడ వచ్చేశారు. విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌ను సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి రూ.42 కోట్లతో మార్పులు చేశారు. చివరికి కృష్ణా కరకట్ట ఎక్కి లింగమనేని గెస్ట్ హౌస్‌ను సీఎం నివాసం, క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు. ఇవన్నీ కూడా అధికారికంగా జీవోల ద్వారానే ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు దుబారా చేసినవే. హైదరాబాద్ మదీనాగూడలోని చంద్రబాబు సొంత ఫామ్ హౌస్‌లో హెలిప్యాడ్, రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. మదీనాగూడతో పాటు జూబ్లిహిల్స్‌లో విలాసవంతమైన ఇంద్రభవనాలు ని ర్మించుకున్న చంద్రబాబు.. వాటిలో ఇంటీరీయర్ కోసం సీఆర్డీఏ నిధులను మళ్లించారు. ఇలాంటి దుబారా బాబు.. రామోజీ దృష్టిలో చాలా నిరాడంబరుడు. తన సొంత ఇంటినే క్యాంపు కార్యాలయంగా చేసుకున్న సీఎం జగన్‌ను మాత్రం ఏ కారణం లేకుండా తప్పుపట్టేయొచ్చు. ఇందుకే రుషికొండ ఎంపిక.. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షల కోసం ముఖ్యమంత్రి విశాఖలో విడిది చేయడానికి అనువైన భవనాలను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. విశాఖలోని ఐటీ హిల్స్‌తో పాటు అనేక భవనాలను పరిశీలించింది. ఆంధ్ర యూనివర్శిటీ ప్లాటినం జూబ్లీహాల్స్, వీఆర్ఎండీఏ బిల్డింగు, వీఎంఆర్డీఏ పిఠాపురం షాపింగ్ కాంప్లెక్స్, రుషికొండ వద్ద ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మిలీనియం టవర్స్, రుషికొండపై ని ర్మించిన రిసార్టులను తుది పరిశీలనలోకి తీసుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం, అధికారులతో సమావేశాలు, భద్రత దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది లేకుండా భవనం ఎంపిక చేయాలని భావించారు. రుషికొండ రిసార్టు, ట్రైబల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ భవనం మినహా మిగిలినవన్నీ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఉన్నాయి. అధికారులకు, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా ఉండేలా అనేక కోణాల్లో చర్చించిన తర్వాత రుషికొండ రిసార్టును సీఎం క్యాంపు కార్యాలయానికి అనువైనదని సూచించారు. పైగా దీనికి సమీపంలోనే గత ప్రభుత్వంలో ని ర్మించిన హెలిప్యాడ్ ఉంది. ఇది సీఎం సహా వీవీఐపీల రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని కమిటీ నివేదికలో పేర్కొంది. రుషికొండ ప్రాజెక్టు సీఎం క్యాంపు కార్యాలయంగా పరిశీలనలోకి రావడం, సీఎం భద్రత దృష్ట్యా చిన్న చిన్న మార్పులను కమిటీ సూచించింది. అంతకు ముందు రుషికొండ ఒక పర్యాటక ప్రాజెక్టు మాత్రమే. దేశ, విదేశీ పర్యాటకులకు అత్యాధుని పర్యాటక అనుభూతిని అందించే ఉద్దేశంతోనే ఏపీటీడీసీ ఈ ప్రాజెక్టును చేపట్టినందనేది జగమెరిగిన సత్యం. కానీ, ఈనాడు మాత్రం వాస్తవాలను వక్రీకరిస్తూ విశాఖకు సీఎం రాకూడదనే ఉద్దేశంతో నిత్యం బురదజల్లుతూనే ఉంది. ఫైవ్‌స్టార్ బాబు గుర్తులేడా రామోజీ! చంద్రబాబు ఎన్ని క్యాంపు కార్యాలయాల కోసం ఖజానా నుంచి ఎన్ని కోట్లు వెచ్చించారో రామోజీ ఓసారి ఐదేళ్లు వెనక్కు వెళ్లి పరిశీలన చేసుకోవాలి. ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా సీఎం నివాసం క్యాంపు కార్యాలయాల కోసం కోట్ల రూపాయలను వ్యయం చేసి దుబారాకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తన నివాసం, క్యాంపు కార్యాలయంగా హైదరాబాద్‌లోని పార్క్ హయత్ ఫైవ్ స్టార్ హోటల్‌ను ప్రకటించి మరీ సర్కారు ఖజానా నుంచి ఏకంగా రూ.30 కోట్లు చెల్లించారు. ఫైవ్ స్టార్ హోటల్లో బాబు కుటుంబం నెలల తరబడి నివాసం ఉండటం, అందుకు ఖజానా నుంచి కోట్ల రూపాయలు చెల్లించినా రామోజీ రావుకు కనపించలేదు. ఏ ముఖ్యమంత్రీ ఎప్పుడు ఇలా ఫైవ్ స్టార్ హోటల్లో నివాసం ఉండలేదు. పార్క్ హయత్ హోటల్‌కు రోజుకు లక్ష రూపాయల చొప్పున అద్దె చెల్లించినట్లు అప్పట్లోనే ఆంగ్ల పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. -
సీఎంని రుషికొండకు వెళ్లొద్దంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖలోని రుషికొండ నిర్మాణాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా అంటూ పిటిషనర్‌ను నిలదీసింది. రాజీకీయ పరిష్కారాలకు కోర్టుకు ఎందుకు వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రుషికొండలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను శుక్రవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు పలు ప్రశ్నలు వేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా అంటూ సీజేఐ ఘాటుగా స్పందించారు. ఇందులో ప్రజా ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. రాజకీయ పరిష్కారాలకు కోర్టు వేదిక కారాదని వ్యాఖ్యానించారు. రుషికొండ నిర్మాణాలపై జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు, జాతీయ హరితట్రిబ్యునల్ ఆదేశాలపై సీజేఐ ఆరా తీశారు. ఈ తరహా కేసులను హైకోర్టు తేల్చగలదని అన్నారు. హైకోర్టు లేదా ఎన్జీటీలకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించారు. హైకోర్టుకు వెళ్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. అనంతరం కేసు డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
లింగమనేనికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
-
లింగమనేనికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ
సాక్షి, ఢిల్లీ: టీడీపీ నేత లింగమనేనికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ నిర్మాణాల అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లింగమనేని శివరామ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రిని రుషికొండకు వెళ్లొద్దంటారా?. ఇందులో ప్రజా ప్రయోజనం ఏం ఉందని సీజే ప్రశ్నించారు. ఇది రాజకీయ ఫిర్యాదు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రుషికొండపై నిర్మాణాలు అక్రమం అని, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంంలో లింగమనేని శివరామ ప్రసాద్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్జీటీ, ఏపీ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యేవరకు రుషి కొండపై ఏవిధమైన నిర్మాణాలు, కార్యక్రమాలు చేపట్టోద్దని లింగమనేని శివరామప్రసాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లింగమనేని అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చదవండి: ఉచితమంటూ.. ముసుగు దోపిడీ -
మీరు సుద్దులు చెబితే ఎలా!?
సాక్షి, అమరావతి : విశాఖ అభివృద్ధి అంటే రామోజీరావును ఎక్కడలేని ఆవేశం ఆవహిస్తుంది. అంతేకాదు.. ఆందోళన, ఆవేదన.. అక్కసు కూడా. అందుకే ఈ మధ్య తరచూ ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై ఈ విషయంలో ఎక్కడలేని విషం కక్కుతున్నారు. విశాఖలో భూ కబ్జాలంటూ నిత్యం అడ్డగోలు రాతలు రాస్తున్నారు. ప్రభుత్వాన్ని, వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి మరీ నానా రోత రాతలు రాసిపారేస్తున్నారు. ప్రతిరోజూ ఇలా పచ్చి అబద్ధాలు చెబితే ప్రజలు నమ్మేస్తారన్నది అయన గుడ్డి విశ్వాసం. ‘ఈనాడు’ ఆవిర్భావం నుంచి రామోజీరావు ఎంచుకున్న మార్గం కూడా ఇదే. కానీ, ఇప్పుడు ఆయన అనుకుంటున్న రోజులు కావు కదా.. ఆయన ఒకటంటే సోషల్ మీడియా ఆయన్ను పది అంటూ నగ్నంగా నిలబెడుతోంది. అయినా ఇవేవీ పట్టని ఆయన ఉత్తరాంధ్ర బాగుపడకూడదన్న దురుద్దేశంతో.. నిస్సిగ్గుగా విశాఖపై చెలరేగిపోతున్నారు. తాజాగా.. రుషికొండ మీద పర్యాటక శాఖ కట్టడాలపై రామోజీ బాధ వర్ణనాతీతం. తన ఆత్మబంధువు చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కబ్జాలు జరిగితే నోరెత్తని ఆయన.. ఇప్పుడు అన్ని అనుమతులతో రుషికొండలో పర్యాటక శాఖ నిర్మాణాలు చేస్తుంటే పెడబొబ్బలు పెడుతున్నారు. నిజానికి.. విశాఖలో భూకబ్జాలు చేసిందెవరు? ఆ భూముల్ని కబ్జాదారుల నుంచి కాపాడిందెవరు? రుషికొండపై రామోజీ చేస్తున్న రచ్చలో నిజమెంత? ఒకసారి చూద్దాం.. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందడం రామోజీకి అస్సలు నచ్చడంలేదు. అందులోను కొన్ని దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైన ఉత్తరాంధ్ర, విశాఖ నగరాభివృద్ధి అంటేనే ఆయన గుండెలు బాదుకుంటున్నారు. దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తన విషపత్రికలో అడ్డగోలు కథనాల పరంపరను అచ్చేస్తున్నారు. నిజానికి.. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి, నిశిత పర్యవేక్షణకు ముఖ్యమంత్రి, ఇతర అధికారులకు క్యాంపు కార్యాలయాలు సహా వసతి ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రభుత్వానికి తన సిఫార్సులను నివేదించింది. విశాఖ నగరంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేటు, ఇతరత్రా భవనాలను పరిశీలించి కమిటీ తమ సిఫార్సులను అందజేసింది. ముఖ్యమంత్రికి భద్రత, పరిపాలనా అవసరాలు, క్యాంపు కార్యాలయం, వసతి ఒకే ప్రాంగణంలో ఉండడం, సరిపడా పార్కింగ్, సమీపంలోనే హెలిపాడ్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రుషికొండ వద్ద నిర్మించిన టూరిజం రిసార్టులు సానుకూలంగా ఉన్నాయని కమిటీ తేల్చింది. పైగా.. ముఖ్యమంత్రి రాకపోకల కారణంగా నగర వాసులకు ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయానికి వచ్చామని కూడా తెలిపింది. ముగ్గురు సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీ ఇలా నివేదిక ఇచ్చిందో లేదోం రామోజీరావు వెంటనే తన పైత్యానికి పదును పెట్టారు. ‘వేదికపై సుద్దులు..ం తీరంలో ఘోరాలు’ అంటూ గురువారం ఈనాడులో గగ్గోలు పెట్టారు. రుషికొండ వద్ద పర్యాటక శాఖ నిర్మించిన భవనాలు అక్రమమని, నిబంధనలకు విరుద్ధమని తీర్పు కూడా ఇచ్చేశారు. అన్ని అనుమతులతో.. ♦ కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ నుంచి సీఆర్‌జెడ్ అనుమతులు తీసుకుంది.. ♦ ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సిఫార్సులు తీసుకోవడంతో పాటు.. నిర్మాణంలో భాగంగా, అనుమతి ఉన్న ప్రాంతంలో చెట్లు తొలగించేందుకు, అంతకుమించి పెద్దసంఖ్యలో కొత్తగా మొక్కలు నాటేందుకు అటవీశాఖ అనుమతి నుంచి అనుమతులు సైతం ఉన్నాయి.. ♦ జీవీఎంసీ నుంచి ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లభించడంతో పాటు, భవనాల డిజైన్లకు ఆమోదం ఉంది.. ..ఇలా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్‌తో పాటు, చట్ట ప్రకారం నిబంధనలను అనుసరించి అన్ని రకాల అనుమతులతో పర్యాటక శాఖ భవనాలను నిర్మించింది. ♦ ఇక రుషికొండ వద్ద ప్రభుత్వ భూమిలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టు కోసం ప్రతిపాదించింది కేవలం 3 శాతం మాత్రమే. ♦ 61 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతులుంటే, 9.88 ఎకరాల్లోనే ప్రాజెక్టు కోసం ప్రతిపాదించారు. ఇందులో కూడా భవనాలు కట్టింది కేవలం 1.84 ఎకరాల్లో మాత్రమే.. ♦ అలాగే, ఏడు బ్లాకుల నిర్మాణానికి అనుమతులివ్వగా, కట్టింది నాలుగు బ్లాక్లే.. కట్టడాలు ఈరోజు ప్రారంభించినవేం కాదు.. రుషికొండ మీద కట్టడాలు 1984లోనే ప్రారంభమయ్యాయి. 1989 నాటికి క్రమంగా 12 బ్లాకులు నిర్మించారు. అంటే రుషికొండను తొలిచింది, నిర్మాణాల కోసం అక్కడ చెట్లను నరికివేసింది టీడీపీ ప్రభుత్వమే. సముద్రతీరంలో వాతావరణ పరిస్థితులతో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం కట్టిన ఈ భవనాలన్నీ దెబ్బతిన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం వాటిని తీసివేసి కొత్తగా రిసార్టులను నిర్మించింది. మరి 1984లో కట్టిన నిర్మాణాలతో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదా? అప్పుడు రుషికొండను తవ్వి, అక్కడున్న చెట్లను నరికి ఈ నిర్మాణాలు చేయలేదా? ఇప్పుడు ప్రశ్నిస్తున్న వాళ్లంతా అప్పుడేమయ్యారు? అంటే టీడీపీ ప్రభుత్వం చేస్తే కరెక్టు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తే తప్పు అవుతుందా.. రామోజీ? బాలకృష్ణ వియ్యంకుడి కబ్జాలపై మౌనం.. మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడుగా చంద్రబాబుకు బంధువైన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి అడ్డగోలుగా విశాఖలో భూకబ్జాకు పాల్పడితే కనీసం ఒక్క ముక్క వార్త కూడా ఈనాడులో రాయలేదు. ఎందుకంటే ఎంవీవీఎస్ మూర్తి టీడీపీ పెద్దల బంధువు కావడమే. విశాఖ నగరంలో ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలో అత్యంత విలువైన ప్రాంతంలో ఏకంగా 38.6 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా మూర్తి స్వాహా చేసేశారు. అప్పటి సీఎం చంద్రబాబు సైతం నోరు మెదపలేదు. విశేషం ఏమిటంటే.. ఈ కబ్జా అంతా రుషికొండకు సరిగ్గా ఎదురుగానే.. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ కబ్జాలపై ఉక్కుపాదం మోపింది. మొదటి విడతలో 19.39 ఎకరాలను, రెండో విడతలో 4.74 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. మొత్తంగా 24.13 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. కోర్టు స్టే ఇవ్వడంతో మిగిలిన భూముల స్వాధీన ప్రక్రియకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఏ కొండ మీద ఏముంది? ♦ విశాఖ నగరంలో చాలా నిర్మాణాలన్నీ కూడా కొండల మీదే ఉన్నాయి. ఏఏ కొండ మీద ఏమేం ఉన్నాయంటే.. ♦ డాల్ఫిన్ హిల్ మీద పెద్ద సంఖ్యలో నేవీ సిబ్బంది క్వార్టర్లు నిర్మించారు. ఇవి పూర్తిగా కొండవీుదే ఉన్నాయి. ♦ సర్క్యూట్ హౌస్‌గా పిలిచే గవర్నర్ బంగ్లా కూడా కొండ మీదే ఉంది. ♦ ఐటీ హిల్స్ ప్రాంతాన్ని చూస్తే దాదాపు అన్ని భవనాలు కొండల మీదే ఉన్నాయి. మిలీనియం టవర్స్ ఉండేది ఈ కొండవీుదే. ♦ రామానాయుడు స్టూడియోస్ మొత్తం కొండల మీదే ఉంది. ♦ ఇక రుషికొండకు సమీపంలో ఉన్న పెమా వెల్నెస్ సెంటర్ కూడా పూర్తిగా కొండవీుదే నిర్మించారు. రామోజీ.. మీరుండేది కొండ మీదేనని మర్చిపోయారా!? రుషికొండ మీద ఏదో జరిగిపోతోందంటూ గగ్గోలు పెడుతున్న రామోజీరావు నిజానికి ఎక్కడుంటున్నారు? ఆయన కట్టిన ఫిల్‌్మసిటీ ఎక్కడుంది? ఆ ఫిల్మ్ సిటీలో వివిధ నిర్మాణాలు వేటి మీద చేశారు? వీటిని ఒక్కసారి పరిశీలిస్తే గురవింద సామెత గుర్తుకొస్తుంది. రామోజీరావు ఉంటున్న నివాసం పూర్తిగా కొండవీుదే కట్టారు. అవి పర్యావరణ ఉల్లంఘనలు కావా? ఫిల్‌్మసిటీ పేరిట ఈ పెద్ద మనిషి పదుల కొద్దీ అసైన్డ్, సీలింగ్ భూములు కబ్జాచేసిన వ్యవహారాలు మర్చిపోతే ఎలా? ఇక ఫిల్‌్మసిటీ నిర్మాణాలను పరిశీలిస్తే అన్నీ గుట్టల మీద కట్టినవే. కాదంటారా రామోజీ.. రుషికొండలో గీతం కాలేజీ పేరిట చేసిన భూముల కబ్జా ♦ గులాబీరంగులో ఉన్న 19.39 ఎకరాల కబ్జా భూమిని మొదటివిడతగా ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ♦ ఆకుపచ్చ రంగులో 4.74 ఎకరాల కబ్జా భూమిని రెండో విడతగా స్వాధీనం చేసుకుంది. ♦ ఎరుపు రంగు గళ్లతో ఉన్న భూమి ఇంకా కబ్జాలో ఉంది. కబ్జాచేసిన ఈ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను స్పష్టంగా చూడొచ్చు. -
ఉత్తరాంధ్రపై రామోజీ ఉన్మాదం..
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది.. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి ఆ పార్టీ పరిస్థితి నానాటికీ పాతాళానికి పడిపోతోంది.. సానుభూతి పవనాలు ఎక్కడా లేవు.. పైగా అరెస్టును నిరసిస్తూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు మైలేజీ ఇవ్వలేకపోయాయి.. ఎన్ని జాకీలు పెట్టినా ఫలితం శూన్యం. దీంతో పచ్చగ్యాంగ్‌కు పిచ్చెక్కిపోతోంది. ఒకటే మార్గం కనిపిస్తోంది.. అదీ పదేళ్లకు పైగా చేస్తున్నదే.. ఎప్పటిలాగే జగన్‌ను టార్గెట్ చేయడం.. ప్రభుత్వాన్ని అభాసుపాల్జేయడం. ఇంకేముంది.. రుషికొండపై జనం సొమ్ముతో జగన్ సోకులు అంటూ శుక్రవారం ఈనాడు తన పైశాచిక ఆనందాన్ని మరోసారి ప్రదర్శించి విశాఖపై తన అక్కసుకు అంతులేదని చాటుకుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామంటే ప్రభుత్వంపై తెగ విషం చిమ్ముతోంది. ప్రగతిని అడ్డుకోవడంలో ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని దిగజారుడు రాతలు రాస్తోంది. చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా కబ్జాలు చేస్తే కన్నెత్తి చూడని, పెన్నెత్తి రాయని రామోజీ.. ఇప్పుడు ఉన్మాదంతో వెర్రెక్కిపోతున్నారు. బోడిగుండు రాతలు.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో ఈనాడుకు కంటిమీద నిద్ర కరువైంది. అందుకే తన మార్కు వక్రీకరణ రాగం అందుకుంది. రుషికొండ బోడిగుండయ్యిందంటూ అనుమతుల విషయంలో అసత్య ప్రచారం చేసింది. కానీ, ప్రభుత్వం రుషికొండపై నిర్మాణాలు చేస్తున్న విస్తీర్ణం, వాటికున్న అనుమతులు అంకెలతో సహా చెప్పేసరికి దిమ్మతిరిగింది. అయితే.. ఎన్నడూ నిజాలను అంగీకరించని ఈనాడు.. నిస్సిగ్గుగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలకు పదును పెడుతూనే ఉంది. ఇంతలో సీఎం జగన్ విశాఖ కేంద్రంగా సమీక్షలు, సమావేశాలు చేయాల్సి ఉండటంతో, అక్కడ విడిది చేసేందుకు ముఖ్యమంత్రికి, అధికారులకు, ఇతర ప్రభుత్వ శాఖలకు అవసరమైన వసతి సదుపాయాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రభుత్వ భవనాలను గుర్తించే పనిలో ఉంది. ఇందులో భాగంగానే సీఎం క్యాంపు కార్యాలయం కోసం సరైన భవనాలను అన్వేషిస్తూ రుషికొండపై నిర్మాణాలను కూడా పరిశీలిస్తోంది. వాస్తవానికి అవి రిసార్టుల కోసం నిర్మించినవి కావడం, వాటిని సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించాల్సి వస్తే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పటివరకూ దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ, రుషికొండలో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనంటూ గుండెలు బాదుకుంటోంది. రుషికొండపై శాశ్వత భవనాల నిర్మాణం.. ఇక రుషికొండపై నిర్మిస్తున్నవి ప్రభుత్వ భవనాలే. అవి కూడా శాశ్వత భవనాలు. వాటిని టూరిజం ప్రాజెక్టులో భాగంగా పునర్మిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది. దాదాపు ఈ భవనాలు ఇప్పుడు పూర్తికావొచ్చాయి. కానీ, వాటిని ప్రైవేటు భవనాలుగా, ప్రైవేటు వ్యక్తుల కోసం ఉచితంగా నిర్మిస్తున్నట్లు.. వేరెవరికో దోచిపెడుతున్నట్లుగా ఈనాడు రంకెలేస్తోంది. అవి ఎప్పటికీ ప్రభుత్వ భవనాలే అన్న విషయాన్ని దాచేందుకు నానాపాట్లు పడుతోంది. అందుకే రుషికొండలో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసమేనని, వాటిని వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవనాల ఖర్చుతో పోల్చి బొక్కబోర్లా పడింది. నిజానికి.. గత టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.6,070 మాత్రమే ఖర్చయిందంటూ దోపిడీని తక్కువచేసి చూపించింది. వాస్తవంగా అక్కడ చ.అ.కు అయిన ఖర్చు రూ.9,166. ఆ తర్వాత కూడా మరికొంత అదనంగా ఖర్చుచేశారు. ఈ మొత్తం కలుపుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంత ఖర్చుచేసినా అవన్నీ తాత్కాలిక భవనాలే. ఈ విషయాన్ని గత ప్రభుత్వమే చెప్పింది. కేవలం తాత్కాలిక భవనాల నిర్మాణం కోసం చదరపు అడుగుకు ఎక్కడైనా ఇంత ఖర్చు చేస్తారా? పైగా ఈ భవన నిర్మాణాల్లో డొల్లతనం రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. వర్షం నీరు కారడం, గదుల్లోకి మురుగు పొంగడం, గోడలు బీటలు వారడం చూస్తే వాటి గొప్పతనం అర్థమవుతుంది. కబ్జాలను దగ్గరుండి ప్రోత్సహించలేదా? మరోవైపు.. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పేరుతో భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆధారాలు లేకుండా ఈనాడు క్షుద్ర రాతలు రాస్తోంది. కానీ, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ, బాలకృష్ణ వియ్యంకుడు తద్వారా చంద్రబాబుకు బంధువైన ఎంవీఎస్ మూర్తి ఎండాడ, రుషికొండ గ్రామాల పరిధిలోనే ఏకంగా 38.60 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జాచేస్తే ఈనాడు కళ్లు మూసుకుని కూర్చుంది. పైగా ఈ కబ్జా జరిగింది ఎక్కడోకాదు.. రోజూ రుషికొండ చుట్టూ తప్పుడు కథనాలు అల్లుతున్న ప్రాంతానికి సరిగ్గా ఎదురుగానే. ఇంత జరుగుతుంటే అప్పట్లో చంద్రబాబు నోరు పెగల్లేదు.. రామోజీ పెన్ను కదల్లేదు. పైగా వారి కబ్జాలకు వత్తాసు పలికారు. కానీ, ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి విడిపిస్తోంది. ఇవి తొలగిస్తుంటేనే ఈనాడు దానిని అభివృద్ధి విధ్వంసంగా చిత్రీకరిస్తోంది. వాస్తవానికి ఈ ప్రభుత్వం రుషికొండలో మొదటి విడతలో 19.39 ఎకరాలను, రెండో విడతలో 4.74 ఎకరాలను కలిపి మొత్తంగా 24.13 ఎకరాలను స్వా«దీనం చేసుకుంది. కోర్టు స్టేతో మిగిలిన భూముల స్వా«దీన ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. అభివృద్ధిపైనా ఈనాడు అక్కసు.. ఇక రుషికొండకు సమీపంలో హెలీప్యాడ్, రుషికొండ చుట్టూ గ్రావెల్ రోడ్డు 2019కి ముందే ఉన్నాయి. కానీ, ముఖ్యమంత్రి విలాసాల్లో భాగంగా వీటిని నిర్మించారంటూ ఈనాడు కలరింగ్ ఇచ్చింది. తాజాగా.. టూరిజం ప్రాజెక్టులో భాగంగా ఈ రోడ్డు మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. చివరికి ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధిని కూడా ఈనాడు జీర్ణించుకోలేకపోతోంది. ఒక ప్రాంతాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేటప్పుడు.. ప్రజల నివాసాలు వస్తున్న కొద్దీ కరెంటు, రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పిస్తారు. ఇది ఏ ప్రభుత్వమైనా చేసేదే. కానీ, ఈనాడుకు మాత్రం వంకరగా కనిపిస్తోంది. ఎందుకంటే.. రామోజీ బుద్ధే వక్రబుద్ధి కాబట్టి!. ప్రభుత్వ భవనాల్లో ఎక్కడైనా ఉండొచ్చు.. రుషికొండపై సీఎం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేస్తే ఏదో తప్పన్నట్లుగా, చట్టవిరుద్ధమైనట్లు ఈనాడు పెడ»ొబ్బలు పెడుతోంది. విశాఖపట్నం పక్క దేశంలోనో, శత్రుదేశంలోనో ఉన్నట్లు చిత్రీకరిస్తోంది. అసలు రుషికొండలో ఉన్నవన్నీ ప్రభుత్వ భవనాలేనన్న పచ్చి నిజాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతోంది. వాస్తవానికి.. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దీనికి రాజ్యాంగబద్ధంగా ఆయనకు సర్వాధికారాలు ఉంటాయి. ఈ నిజాన్ని ఈనాడు అంగీకరించదు. -
ఆ మేరకే సీఆర్ జెడ్ నుంచి అనుమతులు
-
రుషికొండ టూరిజం పునర్నిర్మాణ ప్రాజెక్టుపై 'ఈనాడు' విష ప్రచారం
-
‘కొండంత’ అబద్ధం
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ఊసే రామోజీకి నచ్చట్లేదు. అక్కడ అభివృద్ధి అసలే గిట్టట్లేదు. అందుకే విశాఖపట్నంలోని రుషికొండ టూరిజం పునర్నిర్మాణ ప్రాజెక్టుపై ‘ఈనాడు’ విష ప్రచారం మొదలెట్టింది. బోడి గుండుకి.. మోకాలికి ముడేస్తూ వాస్తవాల వక్రీకరణకు తెరలేపింది. త్వరలో రుషికొండను మిగలకుండా చేసేస్తారంటూ ప్రజలను మభ్యపెట్టేలా ఊహాజనిత కథనాన్ని అచ్చేసింది. విశాఖ జిల్లా పరవాడ మండలం ఎండాడ గ్రామం సర్వే నంబర్ 19/3, 19/4లో రుషికొండలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి 61 ఎకరాల భూమి ఉంది. అందులో కేవలం 9.88 ఎకరాల్లో మాత్రమే రిసార్టుల పునర్నిర్మాణ ప్రాజెక్టును ఏపీటీడీసీ ప్రతిపాదించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్), అటవీ, జీవీఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి పూర్తి స్థాయి క్లియరెన్స్‌లు వచ్చిన తర్వాతే పనులు చేస్తోంది. కానీ, ఈనాడు మాత్రం 61 ఎకరాల్లోనూ కట్టడాలకు అనుమతులిచ్చారని, కొండ పూర్తిగా కనుమరుగవుతుందంటూ భయాందోళన కలిగించేలా కథనం ప్రచురించడంపై పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ కె.కన్నబాబు ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వం ఏపీటీడీసీ ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైఎండ్ లగ్జరీ రిట్రీట్ రుషికొండ ప్రాజెక్టును లీజుకిచ్చే ప్రతిపాదన ఇప్పటివరకు లేదన్నారు. టీడీపీ నేత బండారు సత్యనారాయణ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్రాజెక్టుపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ప్రతి అంశంపై కోర్టుకు సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాతే పనులు చేశామని చెప్పారు. భవనాల నిర్మాణం, రహదారులు సహా అన్ని పనులకు సంబంధిత శాఖల ఆమోదం తీసుకున్నామని, ఎక్కడా ఉల్లంఘనలకు చోటివ్వలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వంతో సమగ్రంగా చర్చించి, పరిపాలనపరమైన అనుమతులు పొందామని, ఇదంతా పర్యాటక శాఖకు తెలియకుండా జరగదని చెప్పారు. అదేవిధంగా అప్పటి పర్యాటక మంత్రికి తెలియకుండా ఈ ప్రాజెక్టు జరగదని, ఈనాడు రాసినవి అవాస్తవాలని చెప్పారు. అసలు వాస్తవాలను ఆయన వెల్లడించారు. ఆరోపణ: 61 ఎకరాల్లో కట్టడాలకు అనుమతులు వాస్తవం: రుషికొండలో ఏపీటీడీసీకి ఉన్నది 61 ఎకరాలు. అందులో 9.88 ఎకరాల్లో మాత్రమే పర్యాటక రిసార్టుల పునర్నిర్మాణ ప్రాజెక్టుకు సీఆర్‌జెడ్ నుంచి అనుమతులు తీసుకుని పనులు చేపట్టింది. ఇందులో 19,968 చదరపు మీటర్లలో 7 బ్లాక్‌లు నిర్మించాలన్నది ప్రతిపాదన. 5.18 ఎకరాల్లో మాత్రమే భవనాలు ఉంటాయి. మిగిలిన 4.70 ఎకరాలు రోడ్లు, గ్రీనరి, గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్, డ్రెయిన్ల కోసం వినియోగిస్తారు. ఆరోపణ: రుషికొండలో 90 శాతం విస్తీర్ణంలో పనులు వాస్తవం: ఏపీటీడీసీ ప్రాజెక్టులో కేవలం 1.84 ఎకరాల్లో మాత్రమే 4 బ్లాకులను (విజయనగరం, గజపతి, కళింగ, వేంగి) నిర్మించింది. మిలిగిన 8.04 ఎకరాల్లో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టలేదు. వాటిని ల్యాండ్ స్కేపింగ్ పనుల కోసం వినియోగిస్తారు. అంటే ప్రతిపాదిత 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కేవలం 13,542 చదరపు మీటర్లకు మాత్రమే నిర్మాణాలకు పరిమితమైంది. రుషికొండలో అందుబాటులో ఉన్న మొత్తం విస్తీర్ణంలో 3 శాతం భూమిలో మాత్రమే భవనాల నిర్మాణం జరిగింది. ఇంకా 97 శాతం ప్రాంతం ఖాళీగానే ఉంది. ఆరోపణ: రుషికొండపై పర్యావరణానికి విఘాతం వాస్తవం: రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి సీఆర్‌జెడ్ క్లియరెన్స్, ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ, జీవీఎంసీ నుంచి ప్లాన్ అప్రూవల్, ఫైర్ క్లియరెన్స్ తీసుకుంది. పర్యావరణ సమతుల్యత కోసం ఏపీటీడీసీ 16,350 స్థానిక జాతుల మొక్కలు, 24,120 హెడ్జ్ ప్లాంట్స్, 4,047 తీగజాతి మొక్కలతో గ్రీనరీని అభివృద్ధి చేసింది. రుషికొండను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున మొక్కలు నాటుతూ వృక్ష సంపదను పెంచుతోంది. సీఆర్‌జెడ్ అనుమతి పొందిన ప్రాంతంలో ఎక్కడా బోర్‌వేల్స్ వేయలేదు. ఇక భూగర్భ జలాలను వెలికితీశారనడానికి అవకాశమే లేదు. -
పవన్‌వి అర్థం లేని మాటలు
మద్దిలపాలెం (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి/ఆరిలోవ (విశాఖ తూర్పు): రుషికొండ చూడడానికి వెళ్లి పవన్‌కళ్యాణ్ అక్కడ జరుగుతున్నవి అక్రమ నిర్మాణాలని, అక్కడ స్థలాలను కబ్జాచేశారని, ఈ నిర్మాణాలకు అనుమతులెవరు ఇచ్చారని అర్థంపర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కట్టడాలు అధికారికంగా కడుతుంటే ఎవరి అనుమతి తీసుకుంటారని, ఈ మాత్రం జ్ఞానంలేకుండా పవన్‌కళ్యాణ్ అవివేకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజారంజకమైన పాలనతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న సీఎం జగన్ చర్మిషాను చూసి పవన్ విద్వేషంతో రగిలిపోతున్నారన్నారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో ఆదివారం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. రుషికొండ మీద నిర్మిస్తున్న భవనాలలో సీఎం కార్యాలయాన్ని గానీ, ప్రభుత్వ కార్యాలయాలను గాని వినియోగించే అవకాశాలున్నాయి. సీఎం విశాఖపట్నం రావడానికి ఎలాంటి బిల్లు అవసరంలేదు. విశాఖ నుంచి పాలన చేస్తాననే మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు. త్వరలో సీఎం విశాఖకు రానున్నారు. ఇక రుషికొండలో షరతులను ఎక్కడా ఉల్లంఘించకుండా అన్ని అనుమతులతో చేపడుతున్నవే. రామానాయుడు స్టూడియో, వేంకటేశ్వరస్వామి ఆలయం, ఐటీ కంపెనీలు కొండలపైన కట్టినవే. ఇవన్ని అభివృద్ధిలో భాగమే. భూమి లభ్యత తక్కువున్న ప్రాంతాల్లో కొండలపై ఇటువంటి భవనాలను నిర్మించడం సర్వసాధారణం. ఈ విషయం పవన్‌కు తెలీకపోవడం దురదృష్టకరం. రామోజీ ఫిల్మ్‌సిటీ, మీ అన్నగారు చిరంజీవి ఇళ్లు కొండ మీద కట్టలేదా? వీటన్నింటికి లేని అభ్యంతరాలు రుషికొండపై ప్రభుత్వ భవనాలు కడితే వచ్చిందా? బాబు అజెండాను మోస్తున్న పవన్ చంద్రబాబు కోసం కోతిలా ఎగురుతున్న పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం హయాంలో జరిగిన అక్రమాలను ఆ పార్టీ నాయకులే బయట పెట్టినప్పడు ఎందుకు నోరు విప్పలేదు? నది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కట్టుకున్నప్పుడు పవన్ కళ్లు కనబడలేదా? నిజానికి.. పవన్ తన జెండాను పక్కనపెట్టి చంద్రబాబు అజెండాను మోస్తున్నారు. విశాఖ నగరంలో లక్షన్నర మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తే దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు కేసులు వేశారు. దీనిపై పవన్ ఎందుకు చంద్రబాబుని ప్రశ్నించలేదు? అసలు ఆయనకు సరైన పొలిటకల్ స్టాండ్లేదు. మంత్రిగా వాస్తవాలను చెప్తే వేయరా?: రోజా మరోవైపు.. మంత్రి రోజా ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే.. మధ్యలో పవన్, చంద్రబాబుకు వచి్చన బాధేంటని ఆమె అందులో ప్రశ్నించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. రుషికొండ వద్ద ఏం నిర్మిస్తున్నామన్న విషయాన్ని శనివారం అధికారికంగా మీడియా సమావేశంలో వివరించా. కానీ, ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ఈ నిజాలను ప్రజలకు చెప్పలేదు. అందుకే మరోసారి స్పష్టతనిస్తున్నాను. రుషికొండలోని భూమి ప్రభుత్వ భూమి. పర్యాటక శాఖకు సంబంధించిన భూమి అది. ఇక్కడ పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉంది. ఇందులో 9.88 ఎకరాల్లో నిర్మాణాల కోసం ప్రభుత్వానికి అనుమతులిచ్చారు. ఇందులో కూడా మేం కడుతున్నది కేవలం 2.7 ఎకరాల్లోపే. ఏడు భవన నిర్మాణాలకు అనుమతులొస్తే కేవలం నాలుగు భవనాలు మాత్రమే నిర్మిస్తున్నారు. అదికూడా జీ ప్లస్ వన్ మాత్రమే. రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు వేసిన కమిటీ అన్నింటినీ పరిశీలించి, తనిఖీచేసి రిపోర్టు కూడా ఇచ్చింది. హైకోర్టు ఏమైనా సూచనలు చేస్తే వాటిని కూడా పాటిస్తాం. ప్రజాప్రతినిధిగా ఏ హోదాలేని వాడు, కనీసం వార్డు మెంబర్ కూడా కాని పవన్ మాటలను పెద్దపెద్దగా ప్రచారం చేస్తారా? ఆయన ఊగుడు చూస్తుంటే త్వరగా మెంటల్ ఆస్పత్రిలో చేరేట్లు ఉన్నాడు. పవన్ ఓ ఫ్లవర్‌స్టార్: వరుదు కళ్యాణి విశాఖపట్నం రుషికొండ వద్ద ఉన్న గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములు కనిపించడం లేదా? అని పవన్‌ను ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. రుషికొండపై ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతింటుందని తప్పుపడుతున్నారని, అయితే దీనికి ఎదురుగా ప్రభుత్వ భూమిని ఎకరాలకొద్దీ ఆక్రమించిన లోకేశ్ తోడల్లుడు భరత్‌కు చెందిన గీతం వర్సిటీ గురించి, ఓ కొండపై పూర్తిగా పచ్చదనం నాశనం చేసి నిర్మించిన రామానాయుడు స్టూడియో గురించి పవన్ ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలన్నారు. తన పర్యటనల్లో పవన్ చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె అన్నారు. పవన్ నడుపుతున్నది జనసేన కాదు.. చంద్రసేన అంటూ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఆయన సినిమాల్లో పవర్‌స్టారే కావచ్చు.. కానీ, రాజకీయాల్లో మాత్రం ఫ్లవర్‌స్టార్ అని వ్యాఖ్యానించారు. పెందుర్తిలో మరణించిన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారన్నారు. వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ అని అనడానికి ఆయనకు నోరెలా వచ్చిందన్నారు. ఇక హిందూపురంలో జనసేన నేత ఓ వ్యక్తిపై దాడిచేసి 16 తులాల బంగారు ఆభరణాలు దోచేశాడని, ఈ ఘటనతో జనసేన నేతలు హత్యలు, దోపిడీలు చేస్తారని ఒప్పుకుంటావా? అని ఆమె ప్రశ్నించారు. -
అన్ని అనుమతులతోనే రుషికొండ వద్ద నిర్మాణాలు
తిరుచానూరు(తిరుపతి జిల్లా): అన్ని అనుమతులతోనే విశాఖపట్నంలోని రుషికొండ వద్ద నిర్మాణాలు జరుగుతున్నాయని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. విశాఖను పరిపాలన రాజధాని చేయడం పవన్‌కళ్యాణ్‌కు, చంద్రబాబుకు ఇష్టం లేదని.. అందుకే అసత్య ప్రచారాలతో విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ రుషికొండపై ఏం అక్రమాలు జరిగాయో చెప్పాలని పవన్‌ను డిమాండ్ చేశారు. రుషికొండ వద్ద ప్రభుత్వ భవనాల నిర్మాణాలను అడ్డుకోవడానికి గతంలో పవన్, చంద్రబాబు పార్టీలతో పాటు రఘురామకృష్ణంరాజు కోర్టులను ఆశ్రయించారని గుర్తు చేశారు. ఏ కోర్టు అయినా.. ఈ నిర్మాణాలు ఆపేయాలంటూ తీర్పులిచ్చాయా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కూడా ఈ నిర్మాణాలకు అనుమతులిచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టు కంటే పవన్ ఏమైనా గొప్ప వ్యక్తా అని మండిపడ్డారు. రుషికొండ వద్ద నిర్మాణాలను హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షిస్తోందని చెప్పారు. కొండలపై ఇవి కనిపించలేదా పవన్? ‘కొండపై కట్టడమే పవన్‌కు సమస్య అయితే.. మరి విశాఖలో రామానాయుడు స్టూడియో ఎక్కడ ఉంది? ఐటీ టవర్స్ ఎక్కడ ఉన్నాయి.. వేంకటేశ్వరుని ఆలయం ఎక్కడ ఉంది?’ అని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌లో మీ ఇల్లు, మీ అన్న ఇల్లు కొండలపైనే ఉన్నాయి కదా? రామోజీ ఫిలింసిటీ కూడా కొండలు, గుట్టలపైనే కదా ఉంది. అప్పుడు పర్యావరణ విధ్వంసం గుర్తుకు రాలేదా?’ అని నిలదీశారు. టీడీపీ నేత బాలకృష్ణ అల్లుడు, నారా లోకేశ్ తోడల్లుడు శ్రీభరత్ విశాఖలో రుషికొండ సమీపంలోనే గీతం యూనివర్సిటీ పేరుతో 40 ఎకరాలు కబ్జా చేస్తే ఎందుకు మాట్లాడలేదని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు. ఏడాదికి మూడు పంటలు పండే 33 వేల ఎకరాలను రైతుల నుంచి చంద్రబాబు లాక్కున్నప్పుడు.. మాట్లాడకుండా హెరిటేజ్ ఐస్‌క్రీం తింటున్నారా అని పవన్‌పై మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే తమ నాయకుడు వైఎస్ జగన్ తన సొంత డబ్బుతో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారని.. ఇప్పుడు కూడా అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. కానీ కృష్ణా నది కరకట్టలో టీడీపీ అధినేత చంద్రబాబు నివసించిన అక్రమ నిర్మాణం గురించి ఏనాడైనా ప్రశ్నించావా అని పవన్‌ను రోజా నిలదీశారు. చంద్రబాబు తన అధికార, అనధికార, సొంత నివాసాలకు మరమ్మతుల పేరుతో రూ.184.58 కోట్ల ప్రజాధనాన్ని దురి్వనియోగం చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు. -
ఏపీలో వాళ్లకు కనీసం ఇల్లు కూడా లేదు: మంత్రి రోజా
సాక్షి, తిరుపతి: విశాఖను పాలనారాజధానిగా ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు విషం చిమ్ముతున్నారని ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. తాజాగా విశాఖలో పవన్ పర్యటించడం, రుషికొండలో ఓవరాక్షన్ తదితరాలపై శనివారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. రుషికొండపై నిర్మాణాలు చేపట్టడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు నిబంధనలకు లోబడి నిర్మాణాలు కొనసాగిస్తున్నాం. పైగా నిర్ణీత విస్తీర్ణంలో కంటే తక్కువలోనే కట్టడాలు నిర్మిస్తున్నాం. 69 ఎకరాలు టూరిజం 9 ఎకరాల్లో నిర్మాణాలు, 159 చెట్లు తొలగించాము, 13 వేల చెట్లు నాటాం. అయినా పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో అభివృద్ధి కట్టాడాలు కడుతుంటే ఎందుకు అంత బాధ?. కోర్టుల కంటే పవన్ గొప్పా?. పైగా కొండలపై ఏం కట్టొద్దని పవన్ అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్ ఇళ్లు బంజారాహిల్స్‌లో కొండల మీద ఉన్నాయ్ కదా. అసలు రుషికొండలో ఏం అక్రమాలు జరుగుతున్నాయో పవన్ చెప్పలేకపోయారు. బోడి వెధవలు.. బోడి ప్రచారం చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందని మంత్రి రోజా అన్నారు. సీఎం జగన్ గురించి ఎందుకు? సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్లపైనా పవన్ చేసిన కామెంట్లకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్‌కు ఏపీలో ఇల్లు ముందు నుంచే ఉంది. ఆయన తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు. పవన్ చంద్రబాబుకు బానిస. బాబు ఇచ్చే ప్యాకేజీ కోసం పని చేస్తుంటాడు. ఈ ఇద్దరికీ ఏపీలో కనీసం ఇల్లు లేనే లేదు అని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్.. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు. సీఎం జగన్ సంక్షేమాలు దేశంలో కొన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. అసలు జగన్ గురించి మాట్లాడే అర్హత ఏం ఉంది? అని పవన్‌ను ప్రశ్నించారామె. చంద్రబాబుది అవినీతి.. నిలదీయాలనుకుంటే చంద్రబాబు అవినీతి గురించి నిలదీయమని పవన్‌ను ఉద్దేశించి మంత్రి రోజా వ్యాఖ్యానించారు. కరకట్ట చంద్ర బాబు అక్రమ నిర్మాణం గురించి ఎందుకు మాట్లాడరు. మొత్తం187.58 కోట్లు మాజీ సీఎం చంద్రబాబు ఖర్చు చేస్తే పవన్ కల్యాణ్ నోరు మెదపలేదు. గీతం కబ్జాలు పవన్‌కు కనబడడం లేదా?. దమ్ము ధైర్యం ఉంటే.. ఈ విషయంలో పశ్నించాలని పవన్‌కు సవాల్ విసిరారు మంత్రి రోజా. నువ్వొక ప్రతిపక్ష నేతవా? పవర్‌స్టార్ కాదు.. ప్యాకేజీ స్టార్. నువ్వు.. చంద్రబాబు పనికిమాలిన పార్టీలకు అధ్యక్షులు. ఒక్క ఎమ్మెల్యే లేడు నువ్వేం ప్రతిపక్ష నేతవి. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదు. పక్క పార్టీ జెండాలు మోసే సంస్కృతి మీది. నిన్ను పవన్ కల్యాణ్ అనాలా.. పనికిమాలిన కళ్యాణ్ అనాలా అర్థం కావడం లేదు. ఆటలో అరటి పండు లాంటి వాడివి.. నువ్వు ప్యాకేజీ పడినప్పుడు ఒక వింత జీవిలా ప్రవర్తిస్తున్నావు. వాలంటీర్లపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. తొలగించిన వాలంటీర్ హత్య చేస్తే.. బోడి గుండుకు మోకాలికి లింకు వేయడమేనా? అని పవన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైజాగ్ అభివృద్ధి ఓర్వలేకే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు విశాఖను క్రైమ్ సిటీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధాని రాకూడదనే కుట్రతో ముందుకెళ్తున్నారు. టీడీపీ విశాఖలో కబ్జా చేసిన 450 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సీఎం జగనన్న విశాఖకు అదానీ డేటా సెంటర్ తెచ్చారు. ఆరు వేల కోట్లతో బీచ్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. వెనుక బడిన ఉత్తరాంద్ర అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధి చేస్తుంటే ఒర్వ లేక కుట్ర చేస్తున్నారు అని మంత్రి రోజా ప్రతిపక్షాల కుట్రకు ఏకేశారు. -
బాబు స్ఫూర్తి?.. పవన్ ఓవరాక్షన్
సాక్షి, విశాఖపట్నం: పుంగనూరు హింసాత్మక ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీయాలనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర భగ్నం అయ్యింది. అంత ఉద్రిక్త పరిస్థితుల్లోనూ పోలీసులు సంయమనం పాటించి పరిస్థితిని చెయ్యి జారిపోకుండా అదుపు చేసుకున్నారు. ఈ తరుణంలో బాబు స్ఫూర్తితో ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాన్ ఇవాళ విశాఖ పర్యటనతో అలాంటి ఉద్రిక్తతలనే రాజేయాలని ప్రయత్నించారేమో అనిపించకమానదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి విశాఖ పర్యటనలో మామూలు ఓవరాక్షన్ చేయలేదు. ఎప్పటిలాగే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాదు.. నిబంధనలకు విరుద్ధంగా అభిమానులతో ర్యాలీ కూడా నిర్వహించాడు. ఎప్పటిలాగే పోలీసులతో సైతం వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే దిశగా పరిస్థితి మారింది. కానీ, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఇక నిబంధనలకు అనుగుణంగా రుషికొండపై నిర్మాణాలు జరుగుతుంటే.. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఉన్న పవన్ ఇష్టానుసారం విమర్శలు చేసుకుంటూ పోయారు. హడావిడి తప్ప ఏముంది? పవన్ సేమ్ ఆరోపణలతో రుషికొండను గతంలోనూ పర్యటించాడు. మరి అప్పటికీ.. ఇప్పటికీ ఏం మార్పు వచ్చిందని నిలదీస్తున్నారు స్థానికులు. ఎందుకంటే పవన్ పర్యటన వల్ల ఇవాళ వాళ్లు బాగా ఇబ్బంది పడ్డారు కాబట్టి!. ఉదయం నుంచే తన పర్యటన అంటూ లీకులు ఇచ్చి.. జనసైనికుల్ని, అభిమానుల్ని గుమిగూడేలా చేశారు పవన్. ఇక సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చి.. హడావిడి చేసి వెళ్లాడంతే. ఈ క్రమంలో ఫ్యాన్స్, జనసైనిక్స్‌కు తప్ప పవన్ పర్యటన వల్ల ప్రజలకు ఒరిగిందేం లేదని, పైగా ఈ పర్యటనతో తాము ఇబ్బంది పడాల్సి వచ్చిందని జనం తిట్టుకుంటున్నారు. ఇక పవన్ ఆదేశాలతో జోడిగుళ్లపాలం వద్ద జనసేన నేతల పేరిట కొందరు చేసిన హడావిడి అయితే మామూలుగా లేదు. ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు వాళ్లు. ఇదిలా ఉంటే.. రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారంటూ ఇప్పటికే జనసేనానికి పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. ఇదీ చదవండి: వారాహి యాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు -
ఋషికొండపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
రుషికొండపై వ్యవహారాలన్నీ ఎంవోఈఎఫ్కు అప్పగిస్తాం
సాక్షి, అమరావతి: రుషికొండపై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల వ్యవహారాలన్నీ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్)కు అప్పగిస్తామని హైకోర్టు ప్రతిపాదించింది. ఈ కొండపై నిర్మాణాల నిమిత్తం చేసిన తవ్వకాలపై సర్వే చేసేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు ఎంవోఈఎఫ్ ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిర్మాణాల్లో ఉల్లంఘనల వ్యవహారాన్ని కూడా ఆ శాఖే చూడటం సబబని తెలిపింది. నిర్మాణాల్లో కొన్ని ఉల్లంఘనలు ఉన్నట్లు ఆ కమిటీ తేల్చిందని, అవి చిన్నవేనా లేక తీవ్రమైనవా అన్న విషయాలను ఆ శాఖే తేలిస్తే బాగుంటుందని తెలిపింది. ఈ ప్రతిపాదనలపై స్పందన తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలోని రుషికొండపై తవ్వకాలు, నిర్మాణాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఏసీజే ధర్మాసనం విచారణ జరిపింది. రుషికొండపై పనుల్లో ఉల్లంఘనలు ఉన్నట్లు ఎంవోఈఎఫ్ కమిటీ తేల్చినందున, నిర్మాణాలు కొనసాగించకుండా ఆదేశాలు జారీ చేయాలని మూర్తి యాదవ్ తరఫు సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంవోఈఎఫ్కు అప్పగిస్తామని ప్రతిపాదించింది. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పిటిషనర్ల అభ్యర్థన మేరకే ఎంవోఈఎఫ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ క్షేత్రస్థాయిలో సర్వే చేసి నిర్మాణాల్లో ఉల్లంఘనలు లేవని నివేదిక ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. నివేదికను పరిశీలిస్తే పూర్తి వివరాలు అర్థమవుతాయన్నారు. ఈ వ్యవహారాన్ని ఎంవోఈఎఫ్కు పంపడం వల్ల జాప్యం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఒకవేళ ఎంవోఈఎఫ్కు పంపాలనుకుంటే పిటిషనర్లు వారి వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
రుషికొండలో ఉల్లంఘనల్లేవ్
సాక్షి, అమరావతి: రిసార్ట్ ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా విశాఖలోని రుషికొండపై చేపడుతున్న నిర్మాణాల్లో ఎలాంటి ఉల్లంఘనలు లేవని హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించిన సంయుక్త కమిటీ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం నివేదికను కమిటీ బుధవారం హైకోర్టుకు సమర్పించింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) అనుమతించిన మేరకు 9.88 ఎకరాల ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ రుషికొండ రిసార్ట్ ప్రాజెక్టు భవనాలను చేపట్టిందని తెలిపింది. వ్యక్తిగత భవనాల ప్రదేశాల్లో స్వల్ప మార్పులు మినహా ఎలాంటి ఉల్లంఘనలు లేవని కమిటీ తేల్చింది. మొత్తం 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏడు బ్లాకులు నిర్మించాలని టూరిజం డెవలప్మెంట్ అథారిటీ (ఏపీటీడీసీ) ప్రతిపాదించింది. 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏడు బ్లాకుల నిర్మాణానికి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతించినా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులకే పరిమితం చేసిందని కమిటీ పేర్కొంది. వాస్తవంగా సీఆర్‌జెడ్ అనుమతి మేరకు 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంటే 2.71 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ కేవలం 1.84 ఎకరాల్లో అంటే 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు బ్లాకులకే పరిమితమైనట్లు కమిటీ వివరించింది. మొత్తం 9.88 ఎకరాల ప్రాజెక్టులో 3.86 ఎకరాల్లో ఉన్న వాలు ప్రాంతంతో పాటు 4.225 ఎకరాలున్న మట్టి డంప్ ప్రాంతాన్ని కమిటీ పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం దాదాపుగా సరిపోతున్నట్లు కమిటీ పేర్కొంది. మట్టిడంప్ ప్రాంతమే అథారిటీ పేర్కొన్న దాని కన్నా కొంచెం ఎక్కువగా ఉందని, అయితే నిర్మాణం పూర్తయిన తరువాత డంప్ చేసిన మట్టిని తొలగిస్తారని కమిటీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ కేంద్ర పర్యావరణ శాఖ ముందస్తు అనుమతి లేకుండా భూ వినియోగ నమూనాలు, ప్రతి బ్లాక్‌లో బిల్డ్ అప్ ఏరియాతో ఉన్న బ్లాకుల సంఖ్యలో సవరణలు చేసిందని కమిటీ వ్యాఖ్యానించింది. అయితే ఏపీటీడీసీ బిల్డప్ ఏరియాను తొలుత ప్రతిపాదించిన 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణం నుంచి 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణానికే నాలుగు బ్లాకులకే కుదించిందని కమిటీ పేర్కొంది. ఇందులో భూ వినియోగ విధానంలో ఎటువంటి మార్పులు లేవని, ఆమోదించిన బిల్డ్ అప్ ఏరియాలో నిర్మించిన ప్రాంతం సరిగానే ఉందని కమిటీ తెలిపింది. తొలుత 15,364 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించినట్లు అంకెల్లో పొరపాటు దొర్లిందని పేర్కొంది. 13,542 చదరపు మీటర్లలో నిర్మాణాలు, ఆమోదించిన ప్రాంతంలోనే ఉన్నాయని కమిటీ వెల్లడించింది. ప్రాజెక్టు పూర్తయ్యాక డంప్ తొలగింపు రుషికొండకు దక్షిణం వైపున సీఆర్‌జెడ్–2 ప్రాంతంలో తవ్విన మట్టిని ఏపీటీడీసీ డంప్ చేస్తున్నట్లు కమిటీ పరిశీలనలో తేలిందని పేర్కొంది. అయితే ఇది మెటీరియల్ తాత్కాలిక నిల్వ కోసం ఉద్దేశించినందున అభ్యంతరకరం కాకపోవచ్చని తెలిపింది. పాక్షికంగా ల్యాండ్ స్కేపింగ్, హార్డ్ స్కేపింగ్ పనుల కోసం దీన్ని వినియోగిస్తున్నారని, ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఏవైనా ఉంటే ఆ స్థలం నుంచి తొలగిస్తారని పేర్కొంది. మొత్తం మీద కోస్టల్ రెగ్యులేషన్ జోన్, పర్యావరణ శాఖ అనుమతుల్లో పేర్కొన్న షరతుల ప్రకారమే ఉన్నాయని, ఎటువంటి ఉల్లంఘనలు లేవని కమిటీ స్పష్టం చేసింది. -
ఉత్తరాంధ్రపై రకరకాలుగా విష ప్రచారం చేస్తున్నారు: మంత్రి అమర్నాథ్
-
ఎల్లో బ్యాచ్ విష ప్రచారం.. ఘాటుగా స్పందించిన మంత్రి అమర్నాథ్
సాక్షి, అమరావతి: పారిశ్రామిక ప్రగతిపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ ఐటీ, పర్రిశమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రుషికొండలో అక్రమ నిర్మాణాలంటూ విష ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏపీతో సంబంధం లేనివాళ్లు అవాస్తవాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘రుషికొండ మీద జరుగుతున్న నిర్మాణాలను సీపీఐ నారాయణ చూశారు. అవి ప్రభుత్వ కార్యాలయాలు కావని చెప్పినా వారికి నచ్చలేదు. ఇప్పుడు రాజేంద్రసింగ్ అనే కొత్త వ్యక్తిని తెచ్చి మాట్లాడించారు. ఆయన రామోజీరావుకు 20 ఏళ్లుగా స్నేహితుడు. రిషికొండ మీద నిర్మాణాలన్నీ టూరిజం నిర్మాణాలు. కానీ ఆ కొండను చూస్తే కన్నీరు వచ్చినట్లు చెప్పారు. మరి అమరావతిలో పొలాలు లాక్కున్నప్పుడు రైతుల కన్నీరు కనపడలేదా?. రుషికొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఆ పక్కన సినిమా స్టూడియో ఉంది. అవేమీ కనపడలేదా?. రామోజీరావు ఫిల్మ్ సిటీని కొండల్లో కట్టలేదా?. సముద్ర తీరంలో, కొండల మీద ఉన్న నిర్మాణాలు ఇంకెక్కడా కనపడలేదా?. విశాఖపట్నమే సముద్రంలో కలిసిపోబోతున్నదని ఇంకో పత్రిక రాసింది’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. ‘‘ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే ఓర్వలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో అక్రమాలను వీరు ఎందుకు ప్రశ్నించలేదు?. ఉత్తరాంధ్రపై రకరకాలుగా విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లడమే అజెండాగా పనిచేస్తున్నారు?. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారు?. వైఎస్సార్ హయాంలో విశాఖ అభివృద్ధి చెందింది. ఇప్పుడు మళ్లీ జగన్ వల్లనే అభివృద్ధి జరుగుతుంది’’ అని మంత్రి అన్నారు. ‘‘చంద్రబాబు చెప్పింది కొండంత.. అప్పుడు వచ్చింది గోరంత. లక్షల కోట్ల పెట్టుబడులని ప్రచారం చేసి వేల కోట్లు కూడా తేలేదు. చంద్రబాబు హయాంలో 58 కంపెనీలు మూతపడ్డాయి. ఆ సంగతి ప్రజలందరికీ తెలుసు. పవన్ కల్యాణ్ వారాహి ఏపీలోకి వచ్చాక ఆలోచిస్తాం. ఇక్కడ రూల్స్‌కి అనుగుణంగా ఉందా లేదా అనేది రవాణా శాఖ అధికారులు నిర్ణయిస్తారు. సైకో ఎవరో గత ఎన్నికలలో ప్రజలే నిర్ణయించారు. సొంత తమ్ముడిని గొలుసులతో కట్టేసిన చంద్రబాబే సైకో’’ అని మంత్రి అమర్నాథ్ ధ్వజమెత్తారు. చదవండి: ఏపీలో భారీగా ఉద్యోగావకాశాలు.. రూ.23, 985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ -
రుషికొండ పై సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
-
CPI Narayana: రుషికొండపై టూరిజం నిర్మాణాలే జరుగుతున్నాయి
విశాఖ: రుషికొండపై టూరిజం నిర్మాణాలే జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పష్టం చేశారు. కొత్త నిర్మాణాలతో టూరిజం అభివృద్ధి చెందుతుందని నారాయణ తెలిపారు. ఈరోజు(శుక్రవారం) రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించిన అనంతరం నారాయణ మాట్లాడారు. ‘రుషికొండపై టూరిజం నిర్మాణాలే జరుగుతున్నాయి. కొత్త నిర్మాణాలతో టూరిజం అభివృద్ధి చెందుతుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణమనేది అవాస్తవం.కొండపైకి ఎవరినీ అనుమతించకపోవడం వల్లే అపోహలు’ అని పేర్కొన్నారు. -
రుషికొండ కేసు: పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రుషికొండ కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఎదురు దెబ్బ తగిలింది. రుషికొండ కేసులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రతి ఇంచు జాగాకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా అని ప్రశ్నించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకూ వేచి చూడాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. రుషికొండలో రెండు కిలోమీటర్ల వరకు తవ్వకాలు జరిపారని సుప్రీంకోర్టుకు రఘురామకృష్ణరాజు న్యాయవాది ఫోటోలు ఇవ్వగా, జోక్యం చేసుకునేందుకు అత్యున్నత స్యాయస్థానం ఆసక్తి చూపలేదు. అభివృద్ధి - పర్యావరణం మధ్య సమతుల్యత పాటిస్తూ ముందుకు వెళ్లాలని గతంలోనే సుప్రీంకోర్టు సూచించింది. అభివృద్ధి కూడా అవసరమేనని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
రుషికొండ తవ్వకాలపై సర్వే
సాక్షి, అమరావతి: విశాఖలోని రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా చేపట్టిన తవ్వకాల విషయంలో సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ(ఎంవోఈఎఫ్)ను హైకోర్టు గురువారం ఆదేశించింది. ఇందుకోసం బాధ్యతాయుతమైన అధికారి నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. రిసార్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)ను ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలు... ఏపీఎండీసీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టు పనుల్లో భాగంగా తొలగించిన చెట్ల స్థానంలో కొత్తవి నాటుతున్నామని, అది భారీ స్థాయిలో చేపట్టామని వివరించారు. ఈ వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో పిటిషనర్ల చిత్తశుద్ధి, నిజాయితీని చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ దురుద్దేశాలతో ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ పిల్ దాఖలు చేసే ప్రతి వ్యక్తి ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలం గానే ఉంటారని వ్యాఖ్యానించింది. పిటిషనర్ మూర్తి యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. -
అనుమతుల్లేకపోతే వాటి కూల్చివేతకు ఆదేశాలిస్తాం: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలకు అనుమతులు లేవని తేలితే వాటి కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లా యండాడ గ్రామం సర్వే నంబర్ 19 కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అనుమతులివ్వడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ గతంలో ఇచ్చిన అనుమతులకు, విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యాలను సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. మూర్తి యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ, అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యాలపై త్వరగా విచారణ చేపట్టాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. గతంలో తామిచ్చిన ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించినా ఆ నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. చదవండి: (‘నవయుగ’ అప్పీల్లో కీలక పరిణామం) -
పిటిషనర్లవన్నీ అవాస్తవాలే
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రుషికొండ రిసార్టు పునరుద్దరణ ప్రాజెక్టుకు సంబంధించి పిటిషనర్లు చెబుతున్నవన్నీ అవాస్తవాలని పర్యాటక అభివృద్ధి సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ.. హైకోర్టుకు చెప్పారు. పూర్తి వాస్తవాలను కోర్టు ముందుంచుతామన్నారు. పిటిషనర్లు దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లకు తిరుగు సమాధానం దాఖలు చేస్తామని విజ్ఞప్తి చేశారు. దీనికి హైకోర్టు అనుమతిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే అధికారులపై చర్యలు.. విశాఖ జిల్లా యందాడలోని సర్వే నంబర్ 19 పరిధిలో ఉన్న కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అధికారులు అనుమతులివ్వడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులకు, విశాఖ పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన నేత మూర్తి యాదవ్ గతేడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా పిల్ వేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. మూర్తి యాదవ్ తరఫున న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా 20–30 ఎకరాల్లో అదనంగా కొండను తవ్వేశారని ఆరోపించారు. తవ్వకాల వ్యర్థాలను బంగాళాఖాతంలో వేస్తున్నారని చెప్పారు. హైకోర్టు స్పందిస్తూ.. పనులకు సంబంధించి తామిచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా తవ్వకాలు జరిపినట్లు తేలితే.. బాధ్యులైన అధికారులను కోర్టు ధిక్కారం కింద జైలుకు పంపిస్తామంది. రిసార్టును ఎంత మేర కూల్చివేశారో.. ఆ మేరకు నిర్మాణాలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినా కూడా కోర్టు ధిక్కార చర్యలు తప్పవని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ కోసం అవసరమైతే జిల్లా జడ్జి నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామంది. ఆ మేరకు ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు సిద్ధం కాగా.. అభిషేక్ సింఘ్వీ జోక్యం చేసుకుంటూ, పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వారు దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లకు తిరుగు సమాధానంలో అన్ని వాస్తవాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదన్నారు. తమ సమాధానం చూసిన తర్వాతే కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. 5.18 ఎకరాలకు మించి నిర్మాణాలు చేసినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణబాబు తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్ జోక్యం చేసుకుంటూ.. 20 ఎకరాలకు పైనే తవ్వకాలు జరిపారని.. సమీపంలోని బస్టాండ్‌ను కూల్చి వేశారన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడానికి ముందే.. గతంలో ఎప్పుడో బస్‌స్టాండ్‌ను తొలగించినట్లు చెప్పారు. ఈ విషయం పత్రికల్లోనూ వచ్చిందన్నారు. ఇదే అంశంపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిల్ గురించి అతని తరఫు న్యాయవాది ఉమేశ్ చంద్ర ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యాజ్యంపై త్వరలో కౌంటర్ వేస్తామని సుమన్ చెప్పారు. -
వ్యర్థాలను సముద్రంలో వేయట్లేదు
సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు వ్యర్థాలను సముద్రంలో వేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖాలు చేస్తామన్న ప్రభుత్వ వినతికి హైకోర్టు ధర్మాసనం అంగీకారం తెలిపింది. విశాఖ జిల్లా యండాడ గ్రామం సర్వే నం.19 పరిధిలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అనుమతులివ్వడంపై జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్, టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. మూర్తియాదవ్ తరఫు న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ.. వ్యర్థాలను బంగాళాఖాతంలో పడేసేందుకు కలెక్టర్ అనుమతినిచ్చారని, దీనివల్ల సముద్రం కలుషితమయ్యే ప్రమాదముందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. వ్యర్థాలను బంగాళాఖాతంలో ఎలా వేస్తారని ప్రశ్నించింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి కలెక్టర్ ఈ అనుమతులు ఇచ్చారో చెప్పాలని ఆదేశించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ స్పందిస్తూ.. ఎలాంటి వ్యర్థాలనూ సముద్రంలో పారబోయడంలేదని స్పష్టం చేశారు. తొట్లకొండ సమీపంలోని ప్రభుత్వ స్థలంలో, నిరుపయోగంగా ఉన్న పార్కు స్థలంలో వేస్తున్నామని చెప్పారు. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. మొత్తం 9.88 ఎకరాల్లో కేవలం 5.18 ఎకరాల్లోనే నిర్మాణాలు జరుగుతాయని, మిగిలిన భూమిలో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడానికి హైకోర్టు అంగీకరించింది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. రిసార్ట్ కూల్చివేసిన స్థలంలోనే పనులు జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. ల్యాండ్ స్కేపింగ్ పేరుతో తవ్వకాలు చేస్తున్నారని వివరించారు. సుమన్ జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వ కౌంటర్‌కు ఇచ్చిన సమాధానంలో పిటిషనర్లు ఈ విషయాలను పేర్కొనలేదన్నారు. ఇప్పుడు వాటిని లేవనెత్తడం సరికాదని స్పష్టంచేశారు. పూర్తి వాస్తవాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఈ కేసులో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హాజరవుతున్నారని, అందువల్ల తదుపరి విచారణను హైబ్రీడ్ విధానంలో చేపట్టాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. తన వాదన కూడా వినాలంటూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
మైనింగ్ లీజులన్నీ బాబు హయాంలోనే
తిరుపతి రూరల్: జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుని ఉత్తమ పనితీరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు సాధించిన రాష్ట్ర గనుల శాఖపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శలు చేయడాన్ని గనులు, విద్యుత్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. విశాఖలో కొండలను కొల్లగొడుతున్నారంటూ చంద్రబాబు చెబుతున్న గాలి కబుర్లలో ఏమాత్రం నిజం లేదన్నారు. గురువారం తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్‌కుమార్, గనులశాఖ డీడీ ప్రసాదరావుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యావరణ అనుమతుల ప్రకారమే రుషికొండలో మట్టి తవ్వకాలు జరిగాయని, ప్రభుత్వానికి ఆ సంస్థ రూ.6 కోట్ల రాయల్టీ కూడా చెల్లించిందని వివరించారు. చంద్రబాబు చెబుతున్న మైనింగ్ లీజులన్నీ కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే ఇచ్చారని గుర్తు చేశారు. కుప్పంలో రౌడీయిజం సంస్కృతి చంద్రబాబుదేనని, తమకు ఆ అలవాటు ఉంటే ఆయన అక్కడ గెలిచేవారు కాదని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలో ఉండగా అటవీ ప్రాంతంలో జరిగిన దొంగచాటు మైనింగ్‌ను తాము రాగానే నిలుపుదల చేసినట్లు చెప్పారు. పది రోజుల్లో నివేదిక.. కుప్పం నియోజకవర్గంలో 102 మైనింగ్ లీజులున్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కేవలం రెండు లీజులు మాత్రమే ఇచ్చాం. మిగిలినవి టీడీపీ, కాంగ్రెస్ హయాంలో ఇచ్చినవే. ఇందులో 71 లీజులకు సంబంధించి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి రూ.114 కోట్ల పెనాల్టీ వేశాం. వర్కింగ్‌లో ఉన్న 31 లీజులపై పూర్తి స్థాయిలో విచారించి పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించాం. అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు తేలితే వాటిపై కూడా చర్యలు తీసుకుంటాం. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాం. ఇంగిత జ్ఞానం లేకుండా.. సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక లేటరైట్ పేరుతో బురద చల్లాలనే దుస్థితికి చంద్రబాబు దిగజారిపోయారు. భారతీ సిమెంట్‌కు రోజూ 1,000 లారీల లేటరైట్ తరలిస్తున్నారనే ఆరోపణలు అర్థరహితం. సిమెంట్ తయారీలో కేవలం 3 శాతం మాత్రమే లేటరైట్ వినియోగిస్తారు. వేల లారీల ఖనిజాన్ని సిమెంట్ కంపెనీలు ఏం చేసుకుంటాయి? ఆమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనం. రూ.100 కోట్ల జరిమానా మరిచావా? చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా పట్టించుకోలేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించిన సంగతి చంద్రబాబు మరిచిపోయారా? మా ప్రభుత్వం వచ్చాక ఇసుక మాఫియాకు చెక్ పెట్టి అత్యంత పారదర్శక విధానాన్ని తెచ్చాం. కేంద్ర సంస్థల ద్వారా ఇసుక టెండర్లు నిర్వహించాం. వనరులపై కాగ్ పర్యవేక్షణ.. మైనింగ్, ఇసుక అక్రమాలు, అక్రమ తవ్వకాలను నిరోధిస్తూ ప్రతి జిల్లాలో విజిలెన్స్ స్క్వాడ్‌ను నియమించాం. రీజినల్ స్క్వాడ్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. కాగ్ సహజ వనరులపై ఎప్పటికప్పుడు శాటిలైట్ ఇమేజింగ్ సిస్టం ద్వారా పర్యవేక్షిస్తోంది. ఎక్కడైనా అక్రమాలను గుర్తిస్తే కాగ్ వెంటనే రాష్ట్రాలను ప్రశ్నిస్తోంది. మన రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఇప్పటివరకు కాగ్ నుంచి ఫిర్యాదులు లేవు. గనులశాఖ సమర్థతకు ఇది నిదర్శనం. అందుకే కేంద్ర ప్రభుత్వం మన గనుల శాఖకు జాతీయ స్థాయి అవార్డు ఇచ్చింది. రూ.2.40 కోట్ల ప్రోత్సాహకాలను అందించింది. మైనింగ్ శాఖలో తెచ్చిన సంస్కరణల వల్ల ఆదాయం పెరిగింది. సొంత మామకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని అనుభవించిన చంద్రబాబుకు ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా లేదు. శాటిలైట్ సిస్టమ్ గురించి తొలుత ఆయన తెలుసుకోవాలి. -
వాస్తవాలను కోర్టు ముందుంచుతాం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణ ప్రాజెక్ట్ అమల్లో భాగంగా చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించి పూర్తి వాస్తవాలను కోర్టు ముందుంచుతామని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, ఇందుకు కొంత సమయం ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ హైకోర్టును అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా, యందాడ గ్రామంలోని సర్వే నంబర్ 19 పరిధిలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇవ్వడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంఓఈఎఫ్) అనుమతులకు, విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతేడాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే అంశంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా పిల్ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కేఎస్ మూర్తి, న్యాయమూర్తి ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ.. కొన్ని ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ జోక్యం చేసుకుంటూ, పిటిషనర్లు కోర్టు ముందుంచిన ఫొటోలు పాతవన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో వాస్తవాలను తేల్చేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను నియమిస్తామని ప్రతిపాదించింది. కౌంటర్ ద్వారా వాస్తవాలను కోర్టు ముందుంచుతామని, ఇందుకు కొంత సమయం ఇవ్వాలని సుమన్ ధర్మాసనాన్ని కోరారు. కౌంటర్‌ను పరిశీలించిన తరువాత అడ్వొకేట్ కమిషన్ నియామకంపై నిర్ణయం తీసుకోవచ్చునన్నారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. -
విశాఖ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్!
సాక్షి, విశాఖపట్నం : ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశాఖలో ఏర్పాటుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. నగరంలో ఇన్ఫోసిస్ సంస్థకు కావలసిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందిస్తోంది. మరో రెండు నెలల్లో విశాఖలో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉండడంతో అందుకు అవసరమైన చర్యలు మొదలయ్యాయి. ఒక పక్క ఇన్ఫోసిస్, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా పనులు వేగవంతం చేస్తున్నాయి. విశాఖలో ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటు ప్రకటన వెలువడిన తరువాత నుంచి నగరంలో సరైన స్థలం కోసం అన్వేషణ జరుగుతోంది. నగరంలో కొన్ని ప్రాంతాలను పరిశీలించినా అవి అనుకూలంగా ఉండవన్న నిర్ధారణకు వచ్చారు. దీంతో ప్రాథమికంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో సంస్థ కార్యకలపాలు మొదలు పెట్టడానికి వీలుగా రుషికొండ సమీపంలోని ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లక్ష చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) విస్తీర్ణం ఉన్న భవనాన్ని అద్దె ప్రాతిపదికన తీసుకుని కార్యకలాపాలు ప్రారంభిస్తారు. భవిష్యత్తులో ఇన్ఫోసిస్ సొంత భవనం సమకూర్చుకునే వరకు అక్కడే నడుపుతారు. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ‘సాక్షి’తో చెప్పారు. ఆరంభంలో వెయ్యి మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ విశాఖ యూనిట్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. మున్ముందు ఆ సంఖ్యను దశల వారీగా 2,500 నుంచి 3,000 మంది వరకు పెంచనుంది. త్వరలో హెచ్‌సీఎల్ కూడా.. మరోవైపు ఇన్ఫోసిస్‌తో పాటు మరో ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ కూడా విశాఖపట్నంలో తమ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. టైర్–2 నగరాల్లో విశాఖపట్నం ప్రథమ స్థానంలో ఉండడంతో ఇంకా మరికొన్ని ఐటీ సంస్థలు విశాఖలో తమ యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి కనబరుస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో బహుళ జాతి ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది. ఇప్పటికే మరో ప్రఖ్యాత సంస్థ అదానీ.. మధురవాడ సమీపంలో 130 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కును ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం రూ.14,634 కోట్లు వెచ్చిస్తోంది. కాగా విశాఖలో ప్రస్తుతం ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు 150 వరకు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, ఐటీ రంగానికున్న అనుకూలతల నేపథ్యంలో రానున్న రోజుల్లో విశాఖలో మరిన్ని ఐటీ సంస్థలు ఏర్పాటుకు ముందుకొస్తాయని, ఫలితంగా విరివిగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. (క్లిక్: మేడిన్ ఇండియా కాదు.. మేక్ ఫర్ వరల్డ్) -
సముద్ర గర్భంలో చిన్నారి సాహసం
స్కూబా డైవింగ్‌లో పదేళ్ల చిన్నారి విశాఖ వేదికగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. చిచ్చరపిడుగు దేబప్రియ రుషికొండ సముద్ర జలాల్లో 35 అడుగుల లోతులో స్కూబా డైవింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సముద్రగర్భంలో స్కూబా డైవింగ్ చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. మొదటి డైవ్‌ని 40 నిమిషాల పాటు సముద్రంలో కొనసాగించిన దేబప్రియ.. రెండో డైవ్‌ని మరో 5 నిమిషాలు అదనంగా సాగర జలాల్లో కలియతిరుగుతూ 45 నిమిషాల పాటు కొనసాగించింది. ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్ బలరాం సారథ్యంలో చిన్నారి దేబప్రియ ఈ సాహస రికార్డుని నెలకొల్పింది. ఈ సందర్భంగా దేబప్రియకు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ (పాడీ) ప్రతినిధుల బృందం అభినందనలు తెలిపింది. తన పదో పుట్టిన రోజునే చిన్నారి ఈ రికార్డు సృష్టించడం కొసమెరుపు. చదవండి: (సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్: వీటిపైనే నిషేధం) -
‘రుషికొండ’పై ఎన్జీటీ విచారణ నిలిపివేత
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ), హైకోర్టు పరస్పర విరుద్ధమైన ఆదేశాలతో అసాధారణ పరిస్థితికి దారి తీస్తుంది. అధికారులకు ఏ ఉత్తర్వును అనుసరించాలో అర్థం కాదు. అలాంటి సందర్భంలో ట్రిబ్యునల్ ఆదేశాలపై రాజ్యాంగ న్యాయస్థానమైన హైకోర్టు ఆదేశాలు ప్రబలం. – సుప్రీం కోర్టు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ రఘురామకృష్ణరాజు భుజంపై తుపాకి పెట్టి న్యాయస్థానాల ద్వారా అభివృద్ధి పనులను అడ్డుకొనే ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసింది. రాష్ట్రంలోని అతి పెద్ద నగరం విశాఖలో రుషికొండపై చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలని చూసిన చంద్రబాబు, రఘురామ ద్వయానికి గట్టి చెంపదెబ్బలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చేపట్టిన విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రుషికొండపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు కొనసాగించడానికి అనుమతించింది. ఈ నిర్మాణాలపై ఎన్జీటీ ఉత్తర్వులకు హైకోర్టు ఆదేశాలు విరుద్ధంగా ఉన్న పక్షంలో హైకోర్టు ఉత్తర్వులే వర్తిస్తాయని స్పష్టం చేసింది. రుషికొండపై నిర్మాణాలు నిలిపివేస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ కొనసాగించింది. ఈ అంశాన్ని హైకోర్టు సీజ్ చేసి ఉత్తర్వులు జారీ చేసినందున ఎన్జీటీ ముందు విచారణ కొనసాగించడం సరికాదని స్పష్టం చేసింది. ఎన్జీటీ ముందు విచారణ కొనసాగించడం న్యాయానికి ప్రయోజనం కలిగించదని పేర్కొంది. తగిన ఉత్తర్వుల నిమిత్తం తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణ హైకోర్టు కొనసాగిస్తుందని తెలిపింది. హైకోర్టులో ఈ కేసులో ఇంప్లీడ్ అవడానికి ప్రతివాదిని అనుమతించింది. రుషికొండలో నిర్మాణాలకు హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ ఆరోపణల నేపథ్యంలో తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అవసరమైతే హైకోర్టు నిపుణుల కమిటీని నియమించొచ్చని పేర్కొంది. దేశ ఆర్థికాభివృద్ధికి అభివృద్ధి అవసరమే అయినప్పటికీ కాలుష్య రహిత వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఈ అంశాన్ని విచారించే లోపు చదును చేసిన ప్రాంతాల్లో నిర్మాణాలు జరపవచ్చని, కొండ ప్రాంతంలో పనులు చేపట్టవద్దని తెలిపింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, నిరంజన్లు రెడ్డిలు స్పందిస్తూ.. ఆ ప్రాంతమంతా రుషికొండగానే పరిగణిస్తారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో కట్టడాలకు సంబంధించి పనులు చేసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. కేసు మెరిట్స్‌లోకి వెళ్లడంలేదన్న ధర్మాసనం పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్లు తెలిపింది. వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది. -
ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ.. రిషికొండలో నిర్మాణాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
-
ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఎదురు దెబ్బ
సాక్షి, ఢిల్లీ: ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రుషి కొండలో నిర్మాణాలకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకే అంశంపై రెండు చోట్ల పిటిషన్లపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. బుధవారం అనుమతులు మంజూరు చేసింది. రుషి కొండపై టూరిజం భవనాల నిర్మాణాలు చేపట్టకుండా ఎన్జీటి స్టే విధించగా.. దానిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. మంగళవారం వాదనల సందర్భంగా.. ఎన్జీటీ తీరును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం, ఇవాళ(బుధవారం) రుషి కొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం రఘురామ లేఖ ఆధారంగానే ప్రాజెక్టుపై స్టే ఇవ్వడం సరికాదన్న సుప్రీం కోర్టు.. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ స్పష్టం చేసింది. ఇక ఇవాళ ఆదేశాల సందర్భంగా.. ముందుగా చదును చేసిన ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు ఏపీ సర్కార్‌కు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు..ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిధిగా నిర్మాణాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే తవ్వకాలు చేసిన ప్రదేశంలో నిర్మాణాలు చేయవద్దన్న సుప్రీం.. కేసులోని మెరిట్స్‌పై తామెలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాదు రుషికొండ ప్రాజెక్టు కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని తేల్చిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది. హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగంలో గందరగోళం నెలకొందని, రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతవరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది. ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి వెసులుబాటు ఇస్తున్నట్లు తెలిపింది. -
రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్టీజీ తీరును తప్పుబట్టిన సుప్రీం
-
రుషికొండ టూరిజం ప్రాజెక్టు.. ఎన్జీటీ తీరు సరికాదు: సుప్రీం
సాక్షి, ఢిల్లీ: రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్జీటీ తీరును తప్పుబట్టింది సుప్రీంకోర్టు. ఈ మేరకు దాఖలైన ఓ పిటిష్‌పై మంగళవారం వాదనల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపీ రఘురామకృష్ణ లేఖ ఆధారంగా ప్రాజెక్టుపై స్టే ఉత్తర్వులిచ్చింది ఎన్జీటీ. అయితే ఏకపక్షంగా ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో.. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ హితవు పలికింది సుప్రీం కోర్టు. ఇక ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వొకేట్ సింఘ్వి. ఈ ప్రాజెక్టుతో 300 మందికి ఉపాధి దొరుకుతోందని, రూ. 180 కోట్లు పెట్టబడులు ఏపీ ప్రభుత్వం పెట్టిందని కోర్టుకు తెలిపారాయన. ఓ ఎంపీ లేఖపై ఎన్జీటీ స్టే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీంతో ఎన్జీటీ తీరును తప్పుబట్టిన సుప్రీం.. విచారణ రేపటికి(బుధవారం) వాయిదా వేసింది. -
నిబంధనలమేరకే ‘రుషికొండ’ నిర్మాణాలు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండ పర్యాటక ప్రాజెక్టును ‘కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు అనుగుణంగానే నిర్మిస్తున్నామని పర్యాటకశాఖ స్పష్టం చేసింది. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ నుంచి పూర్తి అనుమతులు పొంది ఆమేరకే నిర్మాణ పనులు చేపడుతున్నామని పేర్కొంది. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండ పర్యాటక ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ‘ఈనాడు’ పత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉందని పర్యాటకశాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.240 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ముందుగానే అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టిందని పేర్కొంది. 9.88 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 5.18 ఎకరాల్లో నిర్మాణాలు చేపడుతుండగా 4.70 ఎకరాలు సుందరీకరణకు కేటాయించినట్టు తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతించిన 139 చెట్లనే తొలగించామని, మిగిలినవి పొదలేనని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వందలాది చెట్లను తొలగించినట్టు ‘ఈనాడు’ పత్రిక తన కథనంలో పేర్కొనడం అవాస్తవమని తెలిపింది. తొలగించిన చెట్లకు బదులుగా అంతకు రెండింతలకుపైగా మొక్కలు నాటేందుకు ఇప్పటికే నిర్ణయించామని, భవన నిర్మాణాలు పూర్తికాగానే మొక్కలు నాటతామని తెలిపింది. నిర్మాణ వ్యర్థాలు, కంకరను తీరప్రాంతంలో 10 కిలోమీటర్ల మేర పారబోస్తున్నట్టు చేసిన ఆరోపణలు కూడా సత్యదూరమని స్పష్టం చేసింది. విశాఖపట్నం జిల్లా యంత్రాంగం అనుమతించిన 287, 288 సర్వే నంబర్లతో ఉన్న ప్రభుత్వ భూమిలోనే డంప్ చేస్తున్నామని, ఆ మట్టిని భవిష్యత్‌లో లోతట్టు ప్రాంతాలను ఎత్తుచేసేందుకు జిల్లా యంత్రాంగం వినియోగిస్తుందని తెలిపింది. తీరప్రాంతంలో తాబేళ్లు, ఇతర సముద్ర జీవుల ఉనికికి ఎలాంటి ముప్పువాటిల్లడం లేదని స్పష్టం చేసింది. విశాఖపట్నం మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు ‘ఈనాడు’ తన కథనంలో చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతం వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ మిక్స్డ్ యూజ్ జోన్–3 పరిధిలోకి వస్తుందంది. అంటే ఈ ప్రాంతంలో ఆతిథ్య రంగంలో ప్రాజెక్టులు నిర్మించేందుకు వీఎంఆర్డీఏ మాస్టర్‌ప్లాన్ అనుమతిస్తోందని వెల్లడించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన నలుగురు సభ్యుల కమిటీ ఈ ప్రాజెక్టును పరిశీలించి నిబంధనల మేరకు నిర్మాణాలు చేపడుతున్నట్టుగా నివేదిక ఇచ్చిందని గుర్తుచేసింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రుషికొండ ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. సీఆర్‌జెడ్, వీఎంఆర్డీఏ నిబంధనలను అనుసరిస్తూ ఎన్జీటీ అనుమతుల మేరకు ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని తెలిపింది. -
రుషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కల్యాణోత్సవం (ఫొటోలు)
-
సాగర గర్భం నుంచి సీఎం జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు
సాక్షి, కొమ్మాది (భీమిలి)/ విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర వ్యాప్తంగా 110 జలక్రీడ ప్రాంతాలను గుర్తించినట్టు రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖ రుషికొండలోని యాటింగ్ సెంటర్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నదులు, సముద్రంలో 110 ప్రాంతాలు జల క్రీడలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అనంతరం ఆయన లైవ్ అడ్వంచర్ డైరెక్టర్ బలరామ్‌నాయుడుతో కలసి సముద్రంలో 30 అడుగుల లోతు వరకు స్కూబా డైవ్ చేశారు. ఈనెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా సముద్ర గర్భంలోకి వెళ్లి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే సీఎం సార్ అంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. Byreddy Siddharth Reddy's special birthday wishes to CM YS Jagan garu 🔥🔥#CMYSJagan pic.twitter.com/twqNJVYsGK — Manvitha (𝕾𝖚𝖒𝖆) (@ManviDad) December 19, 2021 సీఎం కప్ బాక్సింగ్ టోర్నీ ప్రారంభం విశాఖలోని వైఎంసీఏ వద్ద ఆదివారం సీఎం కప్ స్టేట్ సీనియర్స్, యూత్ మెన్, ఉమెన్ బాక్సింగ్ టోర్నీ ప్రారంభమైంది. తొలి బౌట్‌ను బైరెడ్డి సిద్దార్థరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో ఏపీ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు కాయల వెంకటరెడ్డి, జీసీసీ చైర్పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, 13 జిల్లాల బాక్సర్లు పాల్గొన్నారు. చదవండి: (సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలకు ప్రత్యేక వ్యవస్థ) -
సింహాచలం: ‘అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తీసుకుంటాం’
విశాఖ: టీడీపీ హయాంలోనే సింహాచలం భూములు అన్యాక్రాంతమయ్యాయి.. దీనిలో అధికారుల పాత్ర ఉండటంతో చర్యలు తీసుకున్నాం అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. అన్యాక్రాంతమైన భూములను వెనక్కి తీసుకుంటాం అన్నారు. రుషికొండ రిసార్ట్స్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి మండిపడ్డారు. కొత్తవి కట్టేందుకు పాత రిసార్ట్స్ తొలగిస్తే.. టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఇప్పుడున్నవాటి స్థానంలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మిస్తాం అన్నారు. కొత్త రిసార్ట్స్ కోసం మొదటి దశలో రూ.92 కోట్లు.. రెండో దశలో రూ.72 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి అని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. -
విశాఖలో కలియుగ దైవం
దొండపర్తి (విశాఖ దక్షిణ): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం విశాఖపట్నంలో ముస్తాబవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆలయ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. తూర్పున బంగాళాఖాతానికి అభిముఖంగా సాగరతీరంలో కొండపై శ్రీవారు కొలువుదీరుతున్నాడు. పర్యాటక అందాలకు తోడు ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లేలా ఈ ఆలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఆధ్యాత్మిక కేంద్రంగా రుషికొండ తిరుమలలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మాదిరిగా రుషికొండలో ప్రకృతి రమణీయతల మధ్య ఈ ఆలయ నిర్మాణాన్ని టీటీడీ 2019లో చేపట్టింది. సాగర తీరానికి ఎదురుగా గీతం యూనివర్సిటీకి పక్కనే ఉన్న కొండపై నెలకొల్పుతున్నారు. సముద్ర మట్టానికి 60 మీటర్ల ఎత్తులో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.28 కోట్ల నిధులతో టీటీడీ ఈ ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతోంది. చిన్న తిరుపతి స్థాయిలో ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ ఆలయం ఎదురుగా బేడాంజనేయ స్వామి ఆలయాన్ని ఏర్పాటుచేశారు. మూల విరాట్‌కు ఒకవైపు పద్మావతి అమ్మవారి ఆలయం, మరోవైపు ఆండాళ్ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. తిరుపతిలో ఎస్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషినల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ వారితో శ్రీవారు, అమ్మవార్ల విగ్రహాలను తయారుచేయించారు. బీచ్ రోడ్డులో వెళ్లే వారికి కనువిందు చేసేలా విద్యుద్దీపకాంతులతో కొండపై శంఖు, చక్ర, నామాలను ఏర్పాటుచేశారు. ప్రధానాలయం కింద ప్రత్యేకంగా ధ్యాన మందిరం, పూజలు, పెళ్లిళ్ల కోసం 100 నుంచి 150 మందికి సరిపడేలా ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. బీచ్ రోడ్డు నుంచి కొండపైకి సుమారు అర కిలోమీటర్ మేర ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు. కొండ కింద భారీ పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. భక్తులు విశ్రాంతి తీసుకోడానికి, టికెట్లు, ప్రసాద కౌంటర్లను సైతం ఏర్పాటుచేస్తున్నారు. ఈ ఆలయంలో ఇద్దరు ప్రధాన పూజారులు ఉండనున్నారు. ఆలయం సమీపంలోనే అర్చకుల కోసం క్వార్టర్స్‌ను సిద్ధంచేశారు. -
నేటి నుంచి పర్యాటక ప్రాంతాల్లోకి అనుమతి
సాక్షి, అమరావతి: కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాల్లోకి గురువారం నుంచి పర్యాటకులను అనుమతించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రూ.164 కోట్లతో విశాఖ రుషికొండలోని హరిత హోటల్‌ను పర్యాటక శాఖ బ్లూబే హోటల్‌గా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీలోని పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేశంలోని ప్రధాన నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్ కష్ట కాలంలో ఆదాయం తగ్గినా పర్యాటక శాఖలోని ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించలేదన్నారు. విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన విదేశీ ఓడను లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ (షిప్ రెస్టారెంట్) ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చాయని, వీలైనంత తొందరగా షిప్ కొనుగోలుకు చర్యలు తీసుకుంటామన్నారు. వైఎస్సార్ కడప జిల్లా గండికోటను హార్సిలీహిల్స్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణం రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కరోనా కారణంగా ఆ పనులు ఆలస్యమయ్యాయన్నారు. విశాఖ, తిరుపతిలో ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఒబెరాయ్ హోటల్ యాజమాన్యం ముందుకొచ్చిందన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లకు ఆహార పదార్థాలు సరఫరా చేయడం ద్వారా 38 హోటళ్ల ద్వారా గతేడాది రూ.58.05 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.28 కోట్ల మేర ఆదాయం ఆర్జించామన్నారు. ప్రైవేటు బోటు యజమానులతో శుక్రవారం విజయవాడలోని బెరమ్ పార్కులో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. వారికి రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఈ ఏడాది సెప్టెంబర్‌లో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో రాష్ట్రం నుంచి పాల్గొనే బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్, హాకీ క్రీడాకారిణి రజినికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అంతర్జాతీయ స్థాయి స్టేడియాలను నిర్మించాలని నిర్ణయించామన్నారు. -
గీతం వర్సిటీలో ఆక్రమణల తొలగింపు
సాక్షి, విశాఖ : గీతం యూనివర్సిటీలో ఆక్రమణలను రెవెన్యూ శాఖ అధికారులు తొలగించారు. విశాఖ నగర శివారు రుషికొండ సమీపాన పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని ఆధీనంలో ఉంచుకున్న గీతం యూనివర్సిటీ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 40 ఎకరాలు గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నట్లు రెవెన్యూ అధికారుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆర్డీవో కిషోర్ పర్యవేక్షణలో రెవిన్యూ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. (చదవండి: గీతం ఆక్రమణలకు చెక్) అక్రమాల ‘గీతం’పై ప్రభుత్వం ఆరా.. గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం గుప్పిట్లో 40.51 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని జిల్లా రెవిన్యూ అధికారులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎండాడ, రుషికొండ పరిసరాల్లోని భూముల్ని ఆక్రమించేసుకుని సంస్థ పరిధిలో కలిపేసుకున్నట్లు రెవిన్యూ అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి సవివర నివేదికని ప్రభుత్వానికి మరోసారి అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గీతం పరిధిలో కోర్టు కేసుల్లో ఉన్న భూములు ఏఏ గ్రామాల పరిధిలో ఉన్నాయి.? ఆక్రమణలు ఎంత మేర జరిగాయన్నదానిపై నివేదిక అందించనున్నారు. దీనికి తోడు.. అడ్డగోలుగా.. అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. విద్యా సంస్థల మధ్యలో అండర్ పాసేజ్ రహదారి నిర్మాణంపైనా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ఉన్న గీతం ఇంజినీరింగ్ కాలేజ్‌కి మెడికల్ కళాశాలకు అనుసంధానం చేస్తూ సొరంగ మార్గాన్ని నిర్మించేశారు. గత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి.. ఎలాంటి పూర్తి స్థాయి అనుమతులూ తీసుకోకుండా.. జీవో పేరుతో అండర్ పాసేజ్ నిర్మాణం పూర్తి చేసేశారు. ఈ వ్యవహారంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. -
విశాఖ చేరుకున్న వైఎస్ జగన్
సాక్షి, విశాఖ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విశాఖ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సోదరుడు కుమార్తె వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరు కానున్నారు. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కుమార్తె యామిని, విశాఖ నగరానికి చెందిన మునికోటి నిరంజనరావు, విజయలక్ష్మిల కుమారుడు రవితేజల వివాహం శనివారం రుషికొండ సమీపంలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో జరగనుంది. హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చిన వైఎస్ జగన్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వివాహ వేదిక వద్దకు వెళతారు. నూతన వధూవరులను వైఎస్ జగన్ ఆశీర్వదించిన అనంతరం అదే రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వెళతారు. ఇక వైఎస్ జగన్ వెంట విశాఖ వంశీకృష్ణ శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ, మళ్ళ విజయ్ ప్రసాద్, గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణరెడ్డి, అవంతి శ్రీనివాస్, అదీప్ రాజ్, చెట్టి ఫాల్గుణ, బూడి ముత్యాలనాయుడు, గొట్టేటి మాధవి, కోలా గురువులు, కుంభ రవిబాబు, ద్రోణంరాజు శ్రీనివాస్, కేకే రాజు, రొంగలి జగన్నాధం, కొండా రాజీవ్‌తో సహా సీనియర్ పార్టీ నేతలు ఉన్నారు. -
విశాఖలో కలకలం రేపుతున్న పులి సంచారం
-
నేరస్థుల కోసం వెళ్తే పులి ప్రత్యక్షం
సాక్షి, విశాఖ: విశాఖ జిల్లాలోని రుషికొండలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఓ కేసు దర్యాప్తుకు సంబంధించి పోలీసులు రుషికొండలోని లేఔట్ కు వెళ్లారు. నిందితుల కోసం అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులకు నేరస్థులకు బదులు పులి కదలికలు కనిపించాయి. ఫుటేజ్‌లో కనిపించిన పులి ఆహారం కోసం పరిసరాలలో వెతుకులాడుతున్నట్టు పోలీసులు గుర్తించి వెనుదిరిగారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి జాడ కోసం గాలిస్తున్నారు. -
తీరం ఘోరం
-
‘గాయత్రి’ విద్యార్థులకు అవార్డులు
సాగర్‌నగర్, న్యూస్‌లైన్ : గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల (రుషికొండ)కు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. హైదరాబాద్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి బెస్ట్ స్టూడెంట్, బెస్ట్ స్టూడెంట్ ప్రాజెక్ట్ వర్క్ అవార్డులు సాధించారు. కళాశాలకు చెందిన యేచూరి మణిదీప్ ఉత్తమ విద్యార్థిగా అవార్డు పొందారు. అతనికి బంగారుపతకం, రూ.10వేల నగదును పురస్కారంగా ప్రకటించగా హైదరాబాద్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థి తరఫున ఆయన తండ్రి సత్యనారాయణ టీసీఎస్ ఉపాధ్యక్షుడు వి.రాజన్న నుంచి అందుకున్నారు. బెస్ట్ స్టూడెంట్ ప్రాజెక్టు అవార్డును కె.అఖిలానాయుడు, కె.దివ్య, కె.సాహితి మాధురిల బృందం రియల్‌టైమ్ ట్రాకింగ్ అప్లికేషన్స్ ప్రాజెక్టుకుగాను అందుకున్నారు. ఈ అవార్డు కింద బంగారు పతకం, రూ.20వేల నగదు అందజేశారు. ఈ అవార్డును గీతం ఇంజినీరింగ్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ వెంకటరావు అందుకున్నారు. అవార్డులు సాధించిన విద్యార్థులను గీతం ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం అభినందించింది.