రుషికొండ ప్రభుత్వ భవనాలపై విషం కక్కుతున్న టీడీపీ అండ్‌ కో | Those In Rushikonda Are Government Buildings Says Andhra Pradesh YSRCP | Sakshi
Sakshi News home page

రుషికొండ ప్రభుత్వ భవనాలపై విషం కక్కుతున్న టీడీపీ అండ్‌ కో

Published Mon, Jun 17 2024 4:34 AM | Last Updated on Mon, Jun 17 2024 11:39 AM

Those in Rushikonda are government buildings: Andhra Pradesh

రుషికొండ నిర్మాణాలపై విషం కక్కుతున్న టీడీపీ

ప్రభుత్వ భవనాలను వైఎస్‌ జగన్ కి చెందినవిగా వక్రీకరణ

ఆయన తన కోసమే బిల్డింగులు కట్టించుకున్నట్టు ఆరోపణలు

భవనాల గదుల ఫోటోలు తీసి వికృత పోస్టులు

విశాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ప్రభుత్వం

అందుకు అనుగుణంగానే‌ రుషికొండ నిర్మాణాలు

రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్.. ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణం

ఐనాసరే అది జగన్ వ్యక్తిగత ఆస్తి అన్నట్టుగా ఎల్లోమీడియా తప్పుడు రాతలు

ఇలాంటి రాతల వలన విశాఖ ప్రజలకు మేలు జరగదంటూ వైఎస్సార్‌సీపీ హితవు

సాక్షి, అమరావతి: రుషికొండ భవనాలపై టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారాలకు దిగిన వేళ.. అవి ప్రభుత్వ భవనాలేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరోమారు స్పష్టం చేసింది.  ‘ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖప­ట్నా­నికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభు­త్వం ఇష్టం..

అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు. ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 

విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్‌ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు’ అని సామాజిక మాధ్యమంలో పేర్కొంది. 

చీటికి మాటికి దుష్ప్రచారం తగదు: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేర్కొ­న్నారు. ఇలా ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లి చీటికిమా­టికి తమ పార్టీపై దుష్ప్రచారం చేయటం తగద­న్నారు. ఆమె ఆదివారం సాక్షితో మాట్లాడుతూ అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని తమ ప్రభుత్వం అధికారంలో ఉండగానే స్పష్టం చేసిందని గుర్తుచే­శారు. 

‘ప్రజలు విజ్ఞులు. అన్నీ గమనిస్తూ ఉంటారు. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే ప్రసక్తేలేదు. అధికారం ఇచ్చింది ప్రజలకు సేవచేయమని. కల్పితకథలు సృష్టించి వైఎస్సార్‌సీపీపై నిందలు వేయమని కాదు..’ అని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే టీడీపీ వారికే నష్టం అని ఆమె పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement