Government buildings
-
అమరావతి పేరుతో 33 వేల ఎకరాల ధ్వంసం చేస్తే మంచి..! రుషికొండపై ప్రభుత్వ భవనాలు కడితే తప్పా?
-
అద్భుత భవనాలపై ‘అగ్లీ’ ఏడుపు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. ఇప్పుడూ అదే చేస్తోంది టీడీపీ. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా అద్భుత భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేస్తోంది.ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే వాటిపై చేస్తున్న విష ప్రచారం ఆ పార్టీ సంస్కృతికి నిదర్శనం. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు చేస్తున్న కపట నాటకం. రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా.. ఇప్పుడు కేవలం రూ. 400 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఈ ఐకానిక్ భవనాలను చూసి తల ఎక్కడ పెట్టుకోవాలో టీడీపీ అధినేతలకే తెలియడంలేదు. అందుకే ఈ అగ్లీ (చెత్త)ఏడుపు. విశాఖపట్నంలోని బీచ్‌కి ఆనుకొని ఉన్న రుషికొండపై రాష్ట్ర పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్స్ భవనాలు చాలా కాలం క్రితం నిర్మించినవి.అవి శిథిలమై ప్రమాదకరంగా మారడంతో వాటిని తొలగించి, కొత్త భవనాలు కట్టాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరిపింది. ప్రపంచ స్థాయిలో, 5 స్టార్ వసతులతో అత్యాధునికంగా, విశాఖ నగర ఖ్యాతిని మరింతగా ఇనుమడింపజేసేలా డిజైన్లు రూపొందించింది. సీఆర్‌జెడ్ పరిమితులకు లోబడి నిర్మాణాలు ప్రారంభించింది. రుషికొండపై ఏ భవనాలు, ఎందుకు నిర్మిస్తున్నారో సమగ్ర వివరాల్ని 2021లోనే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందజేసింది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఫైవ్ స్టార్ పర్యాటక విడిది కేంద్రంగా మొత్తం రూ.412 కోట్లతో 7 బ్లాకుల్ని నిర్మించింది.రుషికొండ మొత్తం 61 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 9.88 ఎకరాల విస్తీర్ణంలోనే ఈ భవనాలు నిర్మించింది. గతంలో హరిత రిసార్టు 48 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేది. ప్రస్తుత భవనాలు 19,968 చ.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. వీటన్నింటినీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు వీలుగా నిర్మించారు. ప్రెసిడెన్షియల్ సూట్, సూట్ రూమ్, బాంక్వెట్ హాల్‌తో విజయనగర బ్లాకు, ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్స్, సూట్ రూమ్స్, డీలక్స్ గదులు, బాంక్వెట్ హాల్‌తో కళింగ బ్లాక్ నిర్మించింది. సూట్ రూమ్‌లు, కాన్ఫరెన్స్ హాల్‌తో పల్లవ బ్లాక్, సమావేశ మందిరాలతో చోళ బ్లాక్, రిక్రియేషన్ లాంజ్, బిజినెస్ సెంటర్‌తో గజపతి బ్లాక్, ప్రైవేట్ సూట్ రూమ్‌లతో వేంగిబ్లాక్, రెస్టారెంట్స్, లాంజ్, కిచెన్, పార్కింగ్ సౌకర్యాలతో ఈస్ట్రన్ గంగా బ్లాక్‌లని నిర్మించింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే.. విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తే, రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వం తలంచింది. ఇందుకు ఏర్పాట్లూ ప్రారంభించింది. విశాఖలో పాలన ప్రారంభించడానికి అనువైన భవనాల పరిశీలనకు ఉన్నతాధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ విశాఖలోని పలు భవనాలను పరిశీలించింది. వీటిలో రుషికొండపై నిర్మించిన భవనాలు ప్రభుత్వ కార్యకలాపాలకు అనువైనవని తేల్చింది. ఇక్కడ సీఎం నివాసం, సీఎం కార్యాలయానికి ఇవి అనువుగా ఉంటాయని వెల్లడించింది. అప్పట్నుంచి ఈ భవనాల్లో సీఎం నివాసం, కార్యాలయానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు.వాటిని నిర్మించింది ప్రభుత్వం. పనులు జరిగింది ఏపీటీడీసీ ఆధ్వర్యంలో. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు ఇక్కడే నిర్వహించేందుకు వీలుగా అత్యద్భుతంగా ఫైవ్‌స్టార్ హోటల్స్‌ని తలదన్నేలా నిర్మాణం జరిగింది. సాగర తీరంలో అద్భుతంగా, రాష్ట్రానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చేలా నిర్మించిన ఈ భవనాలను చూసి గర్వపడాలి కానీ.., ఎవరో సొంతగా భవనాలు కట్టేసుకొన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతల ఏడుపులు, పెడబోబ్బలు ఎందుకు? అవి ప్రభుత్వం నిర్మించిన భవనాలు. అనుమతి ఉన్న వారు ఎవరైనా వెళ్లొచ్చు. అయినా, టీడీపీ నేతలు ఏదో ఘనకార్యం చేసినట్లు ప్రభుత్వం భవనం లోపలికి వెళ్లి, ఫొటోలు దిగి, వీడియోలు తీసి చెడు ప్రచారం చేయడం నీచత్వానికి పరాకాష్టే. మంచి చేయడమే కాదు.. మరొకరు చేసిన మంచిని అంగీకరించడం కూడా చేతకాదని వారికి వారే నిరూపించుకోవడమే. -
రుషికొండ ప్రభుత్వ భవనాలపై విషం కక్కుతున్న టీడీపీ అండ్ కో
సాక్షి, అమరావతి: రుషికొండ భవనాలపై టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారాలకు దిగిన వేళ.. అవి ప్రభుత్వ భవనాలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. ‘ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం..అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీయించి, వాటికి వక్రీకరణలకు జోడించి బురదజల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు. ఇప్పటికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్‌లాంటి వ్యక్తులు వెళ్లినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి. రుషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫొటోలు తీసి, పైత్యం ప్రదర్శించడంవల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమోగాని, విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు’ అని సామాజిక మాధ్యమంలో పేర్కొంది. రుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి. అవేమీ ప్రైవేటు ఆస్తులు కావు. అవి ఎవరి సొంతంకూడా కాదు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం. అలాంటి… https://t.co/o3m2GSOrAk— YSR Congress Party (@YSRCParty) June 16, 2024చీటికి మాటికి దుష్ప్రచారం తగదు: ఎమ్మెల్సీ వరుదు కల్యాణిరుషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పేర్కొన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లి చీటికిమాటికి తమ పార్టీపై దుష్ప్రచారం చేయటం తగదన్నారు. ఆమె ఆదివారం సాక్షితో మాట్లాడుతూ అవేమీ ప్రైవేటు ఆస్తులు కావని తమ ప్రభుత్వం అధికారంలో ఉండగానే స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ‘ప్రజలు విజ్ఞులు. అన్నీ గమనిస్తూ ఉంటారు. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే ప్రసక్తేలేదు. అధికారం ఇచ్చింది ప్రజలకు సేవచేయమని. కల్పితకథలు సృష్టించి వైఎస్సార్సీపీపై నిందలు వేయమని కాదు..’ అని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే టీడీపీ వారికే నష్టం అని ఆమె పేర్కొన్నారు. -
ఏపీ: ఊరిస్తున్న ఊరు
సాక్షి, అమరావతి: గ్రామంలోకి అడుగు పెట్టగానే కనిపించే సచివాలయాలు.. మరో నాలుగు అడుగులు వేస్తే రైతన్నల కోలాహలంతో సందడిగా ఆర్బీకేలు.. అనారోగ్య సమస్యలు తలెత్తితే చికిత్స అందించేందుకు విలేజ్ హెల్త్ క్లినిక్స్.. ఆధునిక సదుపాయాలతో సరికొత్తగా మారిపోయిన ప్రభుత్వ పాఠశాలలు.. ఆ పక్కనే అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో సిద్ధమవుతున్న డిజిటల్ లైబ్రరీలు.. సంతృప్త స్థాయిలో సేవలు అందించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్.. ప్రతి గ్రామంలో పది మంది క్వాలిఫైడ్ శాశ్వత ఉద్యోగులు.. వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలతో జీవనోపాధులు పొందుతూ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న అక్క చెల్లెమ్మలు.. ఇలా రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లి చూసినా సరికొత్తగా పల్లెసీమల ముఖచిత్రం ఆవిష్కృతమవుతోంది. రాష్ట్రంలో వికేంద్రీకరణతో నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనబడుతోంది. గతంలో కూలిపోయే దశలో ఉన్న సర్కారు స్కూళ్ల భవనాలు మినహా ఇతర ప్రభుత్వ భవనాలేవీ కానరాని దుస్థితి నుంచి అన్ని సదుపాయాలతో సర్వ సేవలు అందించేలా పలు కార్యాలయాలు గ్రామాల్లోనే నిర్మితమవుతున్నాయి. అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఏ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులైనా గ్రామాల నుంచే పని చేసుకోవచ్చు. ► ఇప్పుడు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా గ్రామాల్లోనే అన్ని సేవలు అందుతున్నాయి. బంధువులను చూడడానికి మాత్రమే ఇప్పుడు పొరుగూళ్లకు వెళుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ప్రజలకు పథకాలు, సేవలను ప్రభుత్వం చేరువ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే దుస్థితిని, వ్యయ ప్రయాసలను సమూలంగా తొలగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఏ మారుమూల ప్రాంతమైనా సరే సచివాయాల ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా సేవలు అందేలా వ్యవస్థను రూపొందించారు. లంచాల బెడద లేకుండా లబ్ధిదారుల ఇంటి వద్దే టంఛన్‌గా పింఛన్లు, రేషన్ సరుకులు, వివిధ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందచేస్తున్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా బలవర్ధకమైన ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో సైతం 545 రకాల ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం తిరగాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఏదో మహమ్మారి జబ్బులైతే మినహా సాధారణ రోగాల చికిత్స కోసం ఊరు దాటాల్సిన అవసరం లేకుండా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు హెల్త్ క్లినిక్‌లలో ఉచితంగా వైద్య సేవలను అందజేస్తోంది. రక్త పరీక్షలు అక్కడే నిర్వహిస్తూ అవసరమైన మందులూ ఉచితంగా ఇస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. ఇంటింటినీ జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తిస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్‌లో నూతన అధ్యాయాన్ని లిఖించారు. ► ఐదేళ్ల క్రితం వరకు గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లను మినహాయిస్తే మరే ప్రభుత్వ కార్యాలయాలు లేని పరిస్థితి నెలకొంది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు దాటిన 2019కి ముందు వరకు దాదాపు 3 వేల పంచాయతీలలో కనీసం కార్యాలయం భవనాలు కూడా లేవని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇరుకు గది, చిన్న హాలు మినహా మరే వసతులు ఉండవు. కార్యదర్శుల కొరతతో అవి నెలల తరబడి మూసివేసి ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం రూ.4,750 కోట్ల ఖర్చుతో రాష్ట్రవ్యాప్తంగా 10,893 గ్రామ సచివాలయాల భవనాలను మంజూరు చేసింది. ఇప్పటికే 7,144 భవనాల నిర్మాణం పూర్తి కాగా మరో 1,888 భవనాలు నెల రోజుల్లో పూర్తి అయ్యే దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల పంటలకు సంబంధించిన మాగ్యజైన్లు ఉంటాయి. రైతులతో వ్యవసాయ శాస్త్రవేత్తల ముఖాముఖి సమావేశాలకు వీలుగా స్మార్ట్ టీవీలు, వివిధ పంట ఉత్పత్తుల ధరలు, వాతావరణ సమాచారం తెలుసుకునే డిజిటల్ కియోస్క్‌లు, తేమ కొలిచే యంత్రాలు, విత్తన పరీక్ష పనిముట్లు, భూసార పరీక్ష కిట్లు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ► గతంలో విత్తనాలు కావాలన్నా ఎరువులు అవసరమైనా వ్యయ ప్రయాసలకు ఓర్చి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. పంటలను చీడపీడలు ఆశిస్తే వ్యవసాయ అధికారి సలహా కోసం కార్యాలయం వద్ద ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి. ఇప్పుడు అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం గ్రామంలోనే అందిస్తోంది. కాల్ సెంటర్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తల సేవలను చేరువ చేసింది. రైతులకు సేవలు అందించేందుకు ఒక్కో ఊరిలో రూ.23.94 లక్షలు ఖర్చు పెట్టి 1,360 చదరపు అడుగుల విస్తీర్ణంలో రైతు భరోసా కేంద్రాలను నిర్మించారు. పశువైద్య సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.2446 కోట్లతో 10,216 రైతు భరోసా కేంద్రాల భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ► గ్రామాల్లో ప్రజలకు కనీస వైద్య సేవలు అందించేందుకు ఒక్కొక్కటి రూ.17.50 లక్షల వ్యయంతో 1,185 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెల్త్ క్లినిక్స్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.1726 కోట్లతో 8299 హెల్త్ క్లినిక్‌లను మంజూరు చేసింది. వీటిలో 3,388 నిర్మాణం పూర్తి కాగా మరో 1705 ఒకట్రెండు నెలల్లో పూర్తయ్యే దశలో ఉన్నాయి. విలేజీ హెల్త్ కిన్లిక్లలో 14 రకాల రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన పరికరాలన్నింటినీ ప్రభుత్వం అందించింది. డెంగ్యూ, మలేరియా సహా హెచ్ఐవీ, సిఫిలిస్ లాంటి వ్యాధుల నిర్ధారణకు అవసరమైన ర్యాపిడ్ కిట్లను అన్ని హెల్త్ క్లినిక్‌లోనూ అందుబాటులో ఉంచింది. వీటికి తోడు ప్రతి హెల్త్ క్లినిక్‌లో 105 రకాల మందులు సరిపడినంత స్టాక్ అందుబాటులో ఉంచింది. ► నాడు – నేడు ద్వారా రూ.11,000 కోట్ల ఖర్చుతో 38,059 ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ సూళ్లకు ధీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. రూ.612 కోట్లు ఖర్చు చేసి ప్రహరీ గోడలను నిర్మించింది. డిజిటల్ ల్రైబరీలను కూడా నిర్మిస్తోంది. ► ప్రభుత్వం కేవలం కార్యాలయాల నిర్మాణం మాత్రమే కాకుండా వాటిల్లో అన్ని మౌలిక వసతులను కల్పించింది. ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు కంప్యూటర్లు, యూపీఎస్, ప్రింటర్లను సమకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్, 15,002 ప్రింటర్లుతో పాటు 3,000 ఆధార్ కిట్లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లను పంపిణీ చేసింది. వలంటీర్లతోపాటు సచివాలయ సిబ్బందికి విధులను వేగంగా నిర్వహించేందుకు 2,91,590 స్మార్ట్ ఫోన్లను, సిమ్ కార్డులను అందజేసింది. ► 2020లో పలు భవన నిర్మాణాలకు అనుమతులు లభించగా వరుసగా రెండేళ్ల పాటు కరోనా కారణంగా నిర్మాణ పనులను స్తంభించాయి. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 16,081 భవన నిర్మాణాలు పూర్తి కాగా మరో 5095 భవనాలు నెల నుంచి నెలన్నర లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. నిర్మాణాలు జరుగుతున్న చోట్ల అద్దె భవనాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇరుకైన పంచాయతీ భవనాలు మినహా రైతులకు, ప్రజలకు సేవలు అందించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి కార్యాలయాలు లేకపోవడం గమనార్హం. ► గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు సాధికారత బాట పట్టారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి పశువులు కొనుగోలు చేశారు. ఆసరా, చేయూత ద్వారా కిరాణా షాప్‌లు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఉన్న ఊరిలోనే ఉపాధి పొందుతున్నారు. ఆమూల్, రిలయన్స్, పీ అండ్ జీ లాంటి దిగ్గజ కంపెనీలతో అనుసంధానించి మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వారికి బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తోంది. నాలుగు నెలల్లో నియామకాలు.. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్ ఒకేసారి ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. ఇది ఒక రికార్డు కాగా కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పారు. ఈ స్థాయిలో లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. నాడు ఉద్యోగాలు సాధించిన ఎంతోమంది సచివాలయాల ఉద్యోగులు ఈ నాలుగేళ్ల కాలంలో పదోన్నతులు కూడా పొందారు. టీచర్లు మినహా ప్రభుత్వ ఉద్యోగులు లేని గ్రామాల్లో నేడు సచివాలయాల ద్వారా పది మంది చొప్పున శాశ్వత ఉద్యోగులు సేవలందిస్తున్నారు. -
ప్రభుత్వ కార్యాలయాలకు ఎక్కడెక్కడ అనుకూలం?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం విశాఖకు తరలివచ్చే ప్రక్రియ వేగవంతమవు తోంది. మునిసిపల్, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులతో కూడిన అధికారుల బృందం వైజాగ్‌లో పర్యటిస్తోంది. సీఎం కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలకు అవ సరమైన భవనాలు, అధికారుల వసతి కోసం అనువైన స్థలాలను ఈ బృందం పరి లించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించి.. అనువుగా ఉంటే ఓకే చేసేందుకు అధికా రుల కమిటీ కసరత్తు మొదలెట్టినట్టు సమా చారం. దీనికనుగుణంగా జిల్లా యంత్రాంగంతో సోమవారం సమావేశమైన కమిటీ.. ఖాళీ గా ఉన్న భవనాల వివరాలు సేకరించింది. -
భూత్ బంగ్లాలతో భయం భయం.. అసాంఘిక కార్యకలాపాలకు..
సాక్షి, సికింద్రాబాద్: సికింద్రాబాద్ ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న సుమారు 600 ప్రభుత్వ నివాసాలు క్రమేణా భూత్ బంళాలుగా మారిపోతున్నాయి. రాత్రి సమయాల్లో ఇవి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయి. అల్లరి చిల్లరి మూకలు నిరుపయోగంగా ఉంటున్న ఈ ప్రభుత్వ భవన సముదాయాల్లో సృష్టిస్తున్న అలజడులు పరిసర ప్రాంతాలవారికి ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ►వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సిబ్బందితో దశాబ్దాలపాటు ఈ ప్రాంతం సందడిగా కనిపించిన ఈ భవన సముదాయాలు కొద్ది సంవత్సరాలుగా అనర్థాలను తెచ్చి పెడుతున్నాయి. ►ప్రస్తుతం మొండిగోడలకే పరిమితమైన ప్రభుత్వ భవనాల సముదాయాలతో రాత్రి వేళల్లో రహదారుల మీదుగా ప్రయాణించేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) వందలాది నివాసాలు.. ►తార్నాక ప్రాంతంలో ఓయూ ఉద్యోగుల క్వార్టర్లు, మెట్టుగూడ ప్రాంతంలో రైల్వే ఉద్యోగుల క్వార్టర్లు, ఆర్ట్స్ కళాశాల రైల్వేస్టేషన్ సమీపంలో పోలీసు క్వార్టర్లు మొండిగోడలకు పరిమితమయ్యాయి. ►దశాబ్దాల కాలం పాటు ఈ క్వార్టర్లు ఉద్యోగుల కుటుంబాలతో కళకళలాడాయి. క్రమేణా క్వార్టర్లు శిథిలావస్థకు చేరుతుండడంతో క్వార్టర్లు ఖాళీ అవుతూ వస్తున్నాయి. సంవత్సరాల కాలంగా క్వార్టర్ల భవన సముదాయాలు నిరుపయోగంగా ఉంటుండడంతో సంఘవ్యతిరేకులకు ఆవాసాలుగా మారుతున్నాయి. ►తార్నాక కూడలికి సమీపంలో వంద వరకు ఓయూ అధికారుల క్వార్టర్లు, ఓయూ పీఎస్ పోలీసుల కోసం ఆర్ట్స్ కళాశాల రైల్వేస్టేషన్లో నిర్మించిన 100 క్వార్టర్లకు చెందిన ఎనిమిది భవన సముదాయాలు, మెట్టుగూడ ప్రాంతంలో రైల్వే అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మించిన వందల సంఖ్యలోని క్వార్టర్లు ఖాళీగా ఉంటున్నాయి. తార్నాకలో ముళ్లపొదల మధ్యన ఓయూ ఉద్యోగుల క్వార్టర్లు పదేళ్లుగా ఖాళీ.. ►ఓయూ, రైల్వే, పోలీసు కుటుంబాలు పై ప్రాంతాల్లోని క్వార్టర్స్‌ను పదేళ్ల క్రితమే మొత్తంగా ఖాళీ చేశారు. అప్పటి నుంచి వీటి నిర్వహణ బాధ్యతలు చూసేవారే కరువయ్యారు. ►అసాంఘిక శక్తులతోపాటు తాగుబోతులకు అడ్డాలుగా మారుతున్నాయి. రాత్రి సమయాల్లో ఖాళీగా ఉంటున్న క్వార్టర్స్ ప్రాతంలో పోలీసు గస్తీకూడా కరువైందని...జులాయిలు, తాగుబోతులు సృష్టిస్తున్న అలజడికి భయబ్రాంతులకు గురవుతున్నామని పరిసర ప్రాంతాలవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు తలనొప్పి.. ►ఖాళీగా ఉంటున్న భవన సముదాయాలు పోలీసులకు కొత్త చిక్కలు తెచ్చిపెడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో సెక్యురిటీ, సీసీ కెమెరా వ్యవస్థ లేని కారణంగా నేరగాళ్లు ఇక్కడ తమ కార్యకలాపాలు పూర్తి చేసుకుని ఉడాయిస్తున్నారు. ►ఆ మీదట కేసును ఛేదించడం, నిందితులను అదుపులోకి తీసుకోవడం కోసం పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. తుకారాంగేట్, చిలకలగూడ, లాలాగూడ, తుకారాంగేట్, ఓయూ పీఎస్ పరిధిలో ఖాళీ భవన సముదాయాలు విస్తరించి ఉన్నాయి. ►నిరుపయోగంగా ఉంటున్న భవన సముదాయాల్లో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు జరుగుతున్నాయి. సంబంధిత భవనాలు నెలకొన్న ప్రాంతాల్లో సంబంధిత స్థల యజమానులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇబ్బందులు తొలగిస్తాం.. క్వార్టర్లు ఖాళీ చేయించడం, రోడ్ల మూసివేతతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్మానుష్యంగా ఉంటున్న ఉద్యోగుల నివాసాల ప్రాంతాల్లో గస్తీ పెంచేందుకు పోలీసులకు అప్రమత్తం చేశాం. జీఎంతోపాటు ఇతర రైల్వే విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి ఖాళీగా ఉంటున్న జనవాసాల నుంచి పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకుంటాం. –టి.పద్మారావుగౌడ్, డిప్యూటీ స్పీకర్ ప్రయాణిలకు తప్పని ఇబ్బందులు.. మద్యం సేవనాలకు ఇతరత్రా అసాంఘీక కార్యక్రమాలకు నిరుపయోగంగా ఉంటున్న ప్రభుత్వ క్వార్టర్లు నిలయాలుగా మారుతున్నాయి. అతీ కాకుండా రైల్వేస్టేషన్‌తోపాటు సికింద్రాబాద్ ప్రాంతంలో అల్లరిచిల్లరగా తిరిగే వ్యక్తులు ఈ భవన సముదాయాల్లో తిష్టవేసి అలజడి సృష్టిస్తున్నారు. –శివకృష్ణ, సీతాఫల్మండి -
చూడముచ్చటగా ఒకే రీతిలో.. ఇక ప్రభుత్వ భవనాలకు ఏకీకృత డిజైన్లు
సాక్షి, అమరావతి: తెలుగుదనం ఉట్టిపడే భవనాలు... సంప్రదాయం, ఆధునికత కలబోతగా నిర్మాణాలు... సకల సౌకర్యాలతో చూడముచ్చటైన సముదాయాలు... కేటగిరీలవారీగా ఏకీకృత డిజైన్లు... వెరసి రాష్ట్రానికి ఓ బ్రాండింగ్ తెచ్చేలా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం. డిజైన్ల కోసం దశాబ్దాలుగా ప్రైవేట్ కన్సల్టెన్సీలకు భారీగా ప్రజాధనం ధారపోసే ఆనవాయితీకి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ప్రభుత్వ భవనాలన్నీ ఏకీకృత డిజైన్లతో రాష్ట్రానికి ఒక బ్రాండింగ్ తేవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ఆర్కిటెక్ట్ బోర్డ్ (ఎస్‌ఏబీ) కార్యాచరణకు ఉపక్రమించింది. ప్రభుత్వ కార్యాలయాలకు ఆరు కేటగిరీల కింద నిర్దిష్ట డిజైన్లను రూపొందించింది. ఇకపై నిర్మించే భవనాలన్నీ ఈ ఆకృతుల ప్రకారమే ఉండాలని నిర్దేశించింది. సుదీర్ఘకాలం నిలిచేలా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, అన్ని వసతులతో ప్రభుత్వ భవనాలను నిర్మించనున్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ భవనాలు రెండు రీతుల్లో ఉండేవి. సీమాంధ్రలో ఎక్కువ బ్రిటీష్ హయాంలో నిర్మించినవి కాగా తెలంగాణలో నిజాం కాలం నాటి కట్టడాలున్నాయి. నాణ్యతతో నిర్మించిన ఆ భవనాలు సుదీర్ఘకాలం సేవలు అందించాయి. తదనంతరం నిర్మించిన ప్రభుత్వ భవనాలపై ఓ నిర్దిష్ట విధానం లోపించింది. ఎక్కడికక్కడ వేర్వేరు డిజైన్లతో భవనాలను నిర్మించడంతో ఏకరూపత లేకుండా పోయింది. వాతావరణ పరిస్థితులు, మట్టి స్వభావం మొదలైనవి శాస్త్రీయంగా అంచనా వేయకుండా కట్టిన భవనాలు సరైన ప్రయోజనాన్ని అందించలేకపోతున్నాయి. అత్యధిక వ్యయం కావడంతోపాటు విలువైన స్థలం వృథా అయింది. సరైన ప్రణాళిక లేకపోవడంతో భవిష్యత్ అవసరాల కోసం విస్తరించే అవకాశం లేకుండాపోయింది. ఈ అంశంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ భవనాలకు కేటగిరీల వారీగా నిర్దిష్ట డిజైన్లు ఖరారు చేయాలని ఎస్ఏబీని ఆదేశించారు. చదవండి: (వరుస సర్వీసులతో దూసుకుపోతున్న విశాఖ ఎయిర్పోర్ట్) ఆరు కేటగిరీలుగా ఏకీకృత డిజైన్లు ప్రభుత్వ భవనాలకు ఆరు కేటగిరీలవారీగా ఏకీకృత డిజైన్లను ఎస్‌ఏబీ రూపొందించింది. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దీర్ఘకాలం నిలిచేలా భవనాల నిర్మాణానికి ప్రమాణాలను ఖరారు చేసింది. రాష్ట్రంలోని రెండు వాతావరణ జోన్లు, ఆరు వ్యవసాయ జోన్లను పరిగణనలోకి తీసుకుని భవనాల డిజైన్లను రూపొందించడం విశేషం. భవిష్యత్ అవసరాల కోసం భవనాల విస్తరణకు అవకాశం కల్పించింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా హేతుబద్ధమైన వ్యయంతో భవనాలను నిర్మించేలా డిజైన్లను రూపొందించింది. గ్రామాల్లో నిర్మించే పాఠశాలలు, పోలీస్ స్టేషన్ల నుంచి జిల్లా కేంద్రాలు, రాజధానిలో నిర్మించే పరిపాలన భవనాల వరకు అన్నింటినీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేలా నిర్దిష్ట డిజైన్లను ప్రభుత్వ ఆర్కిటెక్ట్‌లే రూపొందించడం విశేషం. రాష్ట్రంలో నిర్మించబోయే ప్రభుత్వ భవనాలన్నీ ఈ డిజైన్ల ప్రకారమే నిర్మిస్తారు. ఏ శాఖ అయినా నూతన భవనం నిర్మించాలంటే ఎస్‌ఏబీ నుంచి నిర్దిష్ట డిజైన్ పొందాలి. ఆ తరువాత టెండర్ల ప్రక్రియ నిర్వహించి భవన నిర్మాణాలు చేపట్టాలి. కన్సల్టెన్సీల దోపిడీకి అడ్డుకట్ట రాష్ట్ర ఆర్కిటెక్ట్ బోర్డు(ఎస్‌ఏబీ)ను ఇటీవల పునరుద్ధరించిన ప్రభుత్వం దశాబ్దాలుగా ప్రైవేట్ కన్సల్టెన్సీల దోపిడీకి అడ్డుకట్ట వేసింది. ప్రభుత్వ కార్యాలయాల డిజైన్లు ఖరారు చేసే ఈ బోర్డును 1990– 2000 మధ్య అప్పటి ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. అప్పటి నుంచి కన్సల్టెన్సీల పెత్తనం సాగుతోంది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం భవన నిర్మాణాల డిజైన్ల కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీలకు ఏకంగా రూ.500 కోట్ల వరకు ధారపోయడం ఈ దోపిడీకి పరాకాష్ట. ఆర్అండ్బీ శాఖలో సమర్థులు, నిపుణులైన ఇంజనీర్లను పక్కనపెట్టి డిజైన్ల రూపకల్పన కోసం ప్రైవేట్ కన్సల్టెన్సీలకు పెద్ద ఎత్తున చెల్లింపులు జరిపారు. వీటికి తెర దించుతూ ‘ఎస్‌ఏబీ’ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఆర్థిక మంత్రి అధ్యక్షుడుగా, ఆర్థిక, ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు పలువురు నిపుణులను సభ్యులుగా నియమించింది. ఆర్అండ్బీ శాఖ ప్రధాన ఆర్కిటెక్ట్, మరో ఇద్దరు ఆర్కిటెక్ట్లతోపాటు కొత్తగా 12 మంది ఆర్కిటెక్ట్‌లను నియమించింది. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ ‘తెలుగుదనాన్ని ప్రతిబింబిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఎస్‌ఏబీ నిర్దిష్ట డిజైన్లను రూపొందించింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి దీర్ఘకాలం నిలిచేలా డిజైన్లు ఖరారు చేసింది. రాష్ట్రానికి ఓ బ్రాండ్ ఇమేజ్ కల్పించేలా ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణం ఉంటుంది’ – కణితి నవీన్, ఓఎస్డీ, రాష్ట్ర ఆర్కిటెక్ట్ బోర్డ్ ఇవీ ఆరు కేటగిరీలు... 1. విద్యాసంస్థల భవనాలు ( పాఠశాలలు, కళాశాలలు, గ్రంథాలయాలు) 2. వైద్య, ఆరోగ్య శాఖ భవనాలు ( సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు) 3. పరిపాలన భవనాలు ( హెచ్‌వోడీ భవనాలు, అన్ని శాఖల భవనాలు) 4. వివిధ వ్యవస్థల భవనాలు ( న్యాయస్థానాలు, రవాణా సముదాయాలు, శాస్త్రవిజ్ఞాన క్యాంపస్‌లు) 5. నివాస సముదాయాలు ( క్వార్టర్లు, అతిథి గృహాలు, బంగ్లాలు, ఇతర వసతులు) 6. కమ్యూనిటీ భవనాలు ( స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, సాంస్కృతిక కేంద్రాలు, ఆర్ట్ గ్యాలరీలు, కమ్యూనిటీ హాళ్లు, మ్యూజియంలు) -
ఎస్పీ కార్యాలయం కోసం స్థల పరిశీలన
వనపర్తి : త్వరలో జిల్లా కేంద్రంగా మారనున్న వనపర్తి పట్టణంలో ఎస్పీ కార్యాలయం, పరేడ్‌గ్రౌండ్ నిర్మాణం కోసం గురువారం ఐజీ కె.శ్రీనివాస్‌రెడ్డి వివిధ ప్రభుత్వ స్థలాలు, భవనాలను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్ కానున్న రాజమహల్‌ను,నాగవరం శివారులోని సర్వే నం.86లో ప్రభుత్వ భూమిని, శ్రీనివాసపురం సమీపంలో సర్వేనం.55లోని ఫారెస్టు భూమిని చూశారు. మరికుంటలో ఉన్న పాలశీతలీకరణ కేంద్రంలో కలెక్టరేట్ భవనం, పక్కనే అటవీ భూమిలో ఎస్పీ కార్యాలయం నిర్మిస్తే బాగుంటుందన్నారు. అనంతరం వనపర్తి పట్టణంలోని మున్సిపల్ భవనం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ, నాగవరం శివారులోని యూత్ ట్రై నింగ్ భవనం పరిశీలించారు. కాగా, తాత్కాలిక ఎస్పీ కార్యాలయం కోసం పీఆర్ గెస్ట్‌హౌస్‌ను ఉపయోగించుకోవచ్చని డీఎస్పీ జోగుల చెన్నయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర్‌నాయక్, తహసీల్దార్ పాండు, ఎస్ఐలు గాంధీనాయక్, నాగశేఖరరెడ్డి, సర్వేయర్ బాల్యానాయక్, వీఆర్ఓలు తిరుపతయ్య, మధుసూదన్, సుధారాణి పాల్గొన్నారు. -
కొత్త జిల్లాల్లో పరిపాలనకు సిద్ధం కావాలి
ప్రభుత్వ భవనాలు లేని చోట అద్దె ఇళ్లు తీసుకోవాలి రికార్డుల పంపిణీ పూర్తి చే యాలి కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి ఆయా జిల్లాలో పరిపాలన కార్యకలాపాలు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మం దిరంలో జిల్లాల విభజనకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహబూబాబా ద్లో వైటీసీలో, భూపాలపల్లిలో సింగరేణి సంస్థ భవనంలో కలెక్టరేట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామమన్నారు. పాత భవనాలు ఉంటే వాటికి మరమ్మతులు చేయించుకోవాలని, లేని చోట్ల అద్దె భవనాలు తీసుకోవాలన్నారు. తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఫైళ్లు స్కానింగ్ చేయించాలి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటివరకు ఉన్న ఫైళ్లు భద్రంగా స్కానింగ్ చేయించాలని కలెక్టర్ సూచించారు. ఏ జిల్లా పరిధిలోని ఫైళ్లు ఆ జిల్లాకు పంపించాలన్నారు. ఈ పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టు వివాదాలు, ఇతర ముఖ్యమైన ఫైళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు రికార్డుల్లో నమోదుచేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందినే కొత్త జిల్లాలకు పంపిణీ చేసుకోవాలని పేర్కొన్నారు. ఉమ్మడి కార్యాలయాల్లో హన్మకొండ, వరంగల్ ప్రస్తుతం హన్మకొండ, వరంగల్ జిల్లాల పాలన కొద్ది రోజుల వరకు ఉమ్మడి కార్యాలయాల్లోనే కొనసాగుతుందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చేసినట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకే కార్యాలయం మధ్యలో పార్టీషన్, గోడ కట్టడం వంటి వాటితో సర్దుబాటు చేసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు వచ్చే అధికారులకు సమస్యలు స్వాగతం పలకకుండా ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. భూపాలపల్లిలో భవనాల కొరత సమీక్ష సమావేశంలో పాల్గొన్న 30 శాఖలకు పైగా అధికారులు తమకు భూపాలపల్లిలో కార్యాలయం లేదని.. వాటి కోసం ప్రత్యామ్నాయం చూపించాలని కలెక్టర్‌ను కోరారు. కాగా, కార్యాలయాల పూర్తి వివరాలు అందజేసేందుకు లేఖలు రాయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఏజేసీ తిరుపతిరావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
కోట్ల నిధులు ఏట్లో !
మణుగూరు : ప్రభుత్వ నిధులు ‘నీళ్ల’ పాలు అన్న చందంగా ఉంది అధికారుల పనితీరు. కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలకు ఎక్కడా స్థలం దొరకలేదన్నట్లుగా వాగులో నిర్మిస్తున్నారు. దీంతో వాగులు నిండితే ఆ భవనాలు కూడా మునుగుతాయని, అవి ఎందుకూ పనికి రాకుండా పోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ నిధులు ఏట్లో పోసినట్టేనని అంటున్నారు. ఇలాంటి నిర్మాణాలతో కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతారే తప్ప ప్రజలకు మాత్రం ఉపయోగం లేదని ఆరోపిస్తున్నారు. పినపాక నియోజకవర్గ కేంద్రమైన మణుగూరు మండల కేంద్రంలో అన్ని రకాల హాస్టళ్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత చదువులు అందించే లక్ష్యంతో భవననాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి నిధులు కేటాయించింది. అయితే వచ్చిన నిధులను ఖర్చు చేయాలే తప్ప, వాటిని ఎలా సద్వినియోగం చేయాలనే ఆలోచన అధికారులకు లేకుండా పోయింది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మణుగూరు మండలంలో ఐటీడీఏ సహకారంతో నిర్మిస్తున్న ఎస్ఎంఎస్ హస్టల్ భవ నమే. మండలంలోని సమితిసింగారం కోడిపుంజుల వాగులో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గతంలోనూ రూ.50 లక్షలతో మరో హాస్టల్ భవనాన్ని నిర్మించారు. అయితే వర్షాలు వస్తే వాగు పొంగితే ఈ భవనాలు ఎందుకూ పనికి రావని స్థానికులు అంటున్నారు. వాగును ఎటూ డైవర్షన్ చేయలేదని, నీరొస్తే మునిగే ఈ భవనాలలో విద్యార్థులు ఎలా ఉంటారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కబ్జాదారులకు, ప్రైవేటు వ్యాపారులకు మంచి స్థలాలను చూపించే రెవెన్యూ అధికారులు ప్రభుత భవనాలకు మాత్రం స్థలం లేదంటూ ఇలా వాగులు వంకలు చూపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి ఐదేళ్లుగా స్థలం చూపించకపోవడంతో నిధులు వృథాగా పోవద్దనే ఉద్దేశంతో జూనియర్ కళాశాల ఆవరణలోనే దీన్ని కూడా నిర్మించారు. విద్యాలయాలకు సంబంధించిన భవనాల కే ఇలా ఆటంకాలు కల్పిస్తుంటే.. మారుమూల ప్రాంతాలలో విద్యాభివృద్ధి ఎలా సాధ్యమో ఉన్నతాధికారులే ఆలోచించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.