
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: పాలిచ్చే తల్లులకు ప్రైవసీని కల్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాలిచ్చే తల్లులకోసం బహిరంగ ప్రదేశాల్లో, ప్రత్యేకించి ప్రభుత్వ భవనాల్లో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసేలా రాష్ట్రాలకు సూచించాలని కేంద్రాన్ని ఆదేశించిందచి. బహిరంగ ప్రదేశాల్లో ఫీడింగ్ కోసం గదులు, పిల్లల సంరక్షణ కోసం సౌకర్యం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
పిల్లలు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన ఆ హక్కులను కాపాడాలని గుర్తు చేసింది. ఇది పాలిచ్చే తల్లులకు సౌకర్యాన్ని, రక్షణను ఇస్తుందని పేర్కొంది. రాష్ట్రాలు ఈ ఆదేశాలను అమలు చేసేలా, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఈ సౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత స్థలం కేటాయించేలా చూడాలని, ఇప్పటికే ఉన్న బహిరంగ ప్రదేశాల్లో గదులను కేటాయించాలని కోర్టు అభిప్రాయపడింది.