Special Room
-
ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యం మెరుగుపడింది. ఎయిమ్స్‌లోని ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డులోకి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రపతి ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయన కోలుకుంటున్నారని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి 27వ తేదీన సైనిక (ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్) ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆ ఆస్పత్రి వర్గాలు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లాలని సూచించాయి. సాధారణ వైద్య పరీక్షల అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు మర్చి 30వ తేదీన బైపాస్ సర్జరీ విజయవంతంగా చేసిన విషయం తెలిసిందే. President Kovind was shifted from the ICU to a special room in the AIIMS today. His health has been improving continuously. Doctors are constantly monitoring his condition and have advised him to take rest. — President of India (@rashtrapatibhvn) April 3, 2021 చదవండి: రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ -
రాహుల్ ఆఫీస్ పక్కనే ప్రియాంకకు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితురాలైన ప్రియాంకా గాంధీ వాద్రాకు అక్బర్ రోడ్‌లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక గదిని కేటాయించారు. సోదరుడు, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యాలయం పక్కనే ఉన్న ఈ చాంబర్‌ను ఆమెకు ఇవ్వడం విశేషం. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాహుల్ సైతం ఇదే కార్యాలయం నుంచి పనిచేశారు. అంతకుముందు ఇది కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోనీ, జనార్దన్ ద్వివేది, సుశీల్ కుమార్ షిండేల కార్యాలయంగా ఉండేది. గత నెలలోనే ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతోపాటు, ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు గట్టి పట్టున్న గోరఖ్‌పూర్ ఉన్న ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం ఇన్చార్జిగా రాహుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారమే అమెరికా నుంచి వచ్చిన ప్రియాంక వెంటనే రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ యూపీ తూర్పు ఇన్చార్జి జ్యోతిరాదిత్య సింధియా కూడా హాజరయ్యారు. మంగళవారం ఆమె యూపీ సీనియర్ నేతలతో అనధికారికంగా సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆమె వారితో చర్చించారన్నాయి. గురువారం రాష్రా ్టల ఇన్చార్జులు, ప్రధాన కార్యదర్శులతో జరిగే సమావేశంలో ప్రియాంక పాల్గొననున్నారు. -
మహిళా జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక గది
అనంతపురం సిటీ: వివిధ పనుల నిమిత్తం జిల్లా పరిషత్‌కు వచ్చే మహిళా జెడ్పీటీసీ సభ్యులు కూర్చుని సేద తీరేందుకు ప్రత్యేకంగా ఓ గదిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి సదుపాయం లేకపోవడంతో మహిళా జెడ్పీటీసీ సభ్యులు స్వేచ్ఛగా కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్యను గుర్తించిన జెడ్పీ ఇన్చార్జి చైర్పర్సన్ శుభాషిణమ్మ, సీఈఓ శోభాస్వరూపారాణిలు మహిళా సభ్యులు సేదతీరేందుకు ప్రత్యేకంగా ఓ గదిని పరిశీలించారు. డిప్యూటీ సీఈఓ ఛాంబర్‌కు పక్కనే ఉన్న గదిని ఎంపిక చేశారు. ఈ మేరకు కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి గదిలో చిన్నపాటి మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వారు తెలిపారు. దీనిపై మహిళా జెడ్పీటీసీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రత్యేక గదికి చిన్నమ్మ
కేకే.నగర్: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అలియాస్ చిన్నమ్మ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో నాలుగేళ్ల శిక్ష అనుభవిస్తూ బెంగళూరు పరప్పర అగ్రహారం జైలులో ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. సెల్‌నెంబర్–2లో ఆమెతో పాటు శశి బంధువులైన ఇలవరసి ఒకే గదిలో ఉండేవారు. ప్రస్తుతం శశికళ 2వ సెల్ నుంచి 4వ నెంబరు సెల్‌కు మారారు. జైలుకు వచ్చిన కొత్తలో ఆమెను కలవడానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు వచ్చేవారు. వారిని కలవడానికి వెలుపలకు వచ్చిన సమయంలో అదనపు భద్రత ఏర్పాటు చేయాల్సిఉండేది. దాన్ని నియంత్రించే దిశగా ఆమెను వేరే గదికి మార్చి నట్టు తెలుస్తోంది. కొత్త గదిలో శశికళకు పడక, కుర్చీ, టీవీ సౌకర్యం కల్పించారు. దోమల బెడద ఎక్కువగా ఉండడంతో ఆమె దోమతెర వాడుతున్నారు. రోజూ ఆమె దినపత్రికలు చదివి సమాచారం తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు. అనంతరం టీవీలో జయలలిత నటించిన పాత సినిమాలను చూసి కాలక్షేపం చేస్తున్నారని జైలు అధికారులు తెలిపారు. -
అమ్మ ఆరోగ్యం... సాధారణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: జ్వరం, డీహైడ్రేషన్‌లతో బాధపడుతూ సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆనాటి నుంచి ఆమెను ఐసీయూలో ఉంచే చికిత్స అందిస్తున్నారు. అపోలో వైద్యులు, ఢిల్లీ నుంచి స్విమ్స్ వైద్య బృందం, లండన్ నుంచి డాక్టర్ రిచర్డ్, సింగపూరు నుంచి ఫిజియో థెరపిస్టులు ఆమె వైద్య సేవలు అందించారు. ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా శ్వాస తీసుకునేందుకు ఎక్కువకాలం ఆమె ఇబ్బంది పడ్డారు. సుమారు నెల రోజులకు పైగా వెంటిలేటర్ ద్వారా కృత్రిమశ్వాసను అందజేస్తారు. సహజరీతిలో శ్వాస తీసుకునేంతగా ఆమె కోలుకున్నా నిద్రపోయే సమయంలో ఇటీవలి వరకు వెంటిలేటర్‌ను అమరుస్తూ వచ్చారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులంతా ఏకాభ్రియానికి రావడంతో త్వరలో సాధారణ వార్డుకు మారుస్తారని కొంతకాలంగా చెబుతూ వచ్చారు. ఈ దశలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఐసీయూ నుంచి సాధారణ వార్డు (ప్రత్యేక గదికి)కి ఆమెను తరలించారు. ఇళ్లా, కొడనాడా: సీఎం జయలలిత త్వరలో డిశ్చార్జ్ అవుతారని దీపావళి నుంచే చెబుతుండగా, పోయెస్‌గార్డెన్‌లోని ఇంటికి వెళతారా లేక ఏడాదికి ఒకసారి విశ్రాంతి తీసుకునే నీలగిరి జిల్లా కొడనాడు బంగ్లాకు చేరుకుంటారా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అనారోగ్య సమస్యలు లేనపుడు సైతం కొడనాడులో కొన్నాళ్లు గడపడం ఆమెకు ఆనవారుుతీ. నెలరోజులకు పైగా అక్కడే ఉండి ఉన్నతాధికారులను రప్పించుకుంటూ పరిపాలన సాగించిన సందర్భాలు ఉన్నాయి. ఆయా కారణాల దృష్ట్యా అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే జయ ఎక్కడికి వెళతారనే చర్చ మొదలైంది. అయితే తీవ్ర అస్వస్థకు గురై 58 రోజుల చికిత్స తరువాత కోలుకున్న దశలో అపోలో వైద్యులకు ఆమె అందుబాటులో ఉండడం అవసరమని భావిస్తున్నారు. ఏదేనీ అనారోగ్య పరిస్థితులు ఎదురైతే అత్యవసర చికిత్స చేసేందుకు వీలుగా చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచించే అవకాశం ఉంది. అన్నాడీఎంకేలో ఆనందోత్సాహాలు: తమ అభిమాన నేత పార్టీ అధినేత్రి జయలలిత పూర్తిగా కోలుకుని సాధారణ వార్డుకు తరలించారనే సమాచారం అన్నాడీఎంకే శ్రేణులను ఆనందంలో ముంచెత్తింది. జయ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే గడిపే నేతలకు తోడు మరికొందరు సైతం అపోలో వద్దకు చేరుకుని ఆనందంతో గంతులు వేశారు. కొందరు మహిళా కార్యకర్తలు ఆసుపత్రి గేటు ముందు ఆనందంతో చిందులు వేశారు. లడ్డూ తదితర మిఠాయిలను అందరికీ పంచిపెట్టారు. తమిళనాడు ప్రజలు, పార్టీ నేతలు చేసిన ప్రార్థనలు ఫలించాయని హర్షం వ్యక్తం చేశారు. -
చిన్నారుల లోకం
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఎవరికి ప్రత్యేకంగా గది ఉన్నా లేకపోయినా.. పిల్లల కోసం మాత్రం ప్రత్యేక గది ఉంటుందిప్పుడు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆలోచనలు, ఇష్టాలకు అనుగుణంగానే ఆ గదిని డిజైన్ చేయిస్తున్నారు. పిల్లల్లో సృజనాత్మక శక్తిని మేల్కొలిపే విధంగా, వారిలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేలా తీర్చిదిద్దుతున్నారు కూడా. ♦ పిల్లలను ఆకట్టుకోవడంలో రంగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్‌లు కూడా ఓకే. ఇక వెలైట్, పింక్‌లు కూడా పర్వాలేదు. మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. ♦ చిన్నారులు గదిలో ఆడడం, చదవడం, నిద్రపోవడం లాంటివి చేస్తారు. అదే వాళ్ల ప్రపంచం. వారిని ఆకట్టుకునేలా ముదురు రంగులు వాడటమే కాకుండా గోడల మీద రకరకాల డిజైన్లు వేయడం, ఒకే గోడ మీద రెండు రంగులు వేయడం చేయవచ్చు. ♦ పిల్లల గదుల్లో రంగులు, అలంకరణ వారికి ఆహ్లాదం కలిగించేలా ఉండాలి. గదంతా కార్టూన్లతో నింపకుండా ఒకే గోడకు మాత్రమే కార్టూన్లకు కేటాయిస్తే సరిపోతుంది. ♦ చిన్నారుల కోసం ఫర్నీచర్, మంచం లాంటివి కొనేటప్పుడు అందంతో పాటు పిల్లల భద్రత, సౌకర్యాలకు కూడాప్రాదాన్యమివ్వాలి. బెడ్ మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. కొద్దిగా మెత్తగా ఉంటే పిల్లలు ఇష్టంగా ఎక్కువసేపు నిద్రపోతారు. ♦ పిల్లల పుస్తకాలు కోసం ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి, చక్కటి ఆల్మరాను పెట్టించడం మంచిది. ♦ పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేస్తే పిల్లలు కొత్తల్లో భయపడే అవకాశం ఉంది. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసే విధంగా ఉండే మెటాలిక్ రంగులు లేదా స్టెన్సిల్‌తో పెయింటింగ్‌లు వేస్తే బాగుంటుంది.