న్యూఢిల్లీ: ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యం మెరుగుపడింది. ఎయిమ్స్‌లోని ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డులోకి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రపతి ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయన కోలుకుంటున్నారని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది.
ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి 27వ తేదీన సైనిక (ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్) ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆ ఆస్పత్రి వర్గాలు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లాలని సూచించాయి. సాధారణ వైద్య పరీక్షల అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు మర్చి 30వ తేదీన బైపాస్ సర్జరీ విజయవంతంగా చేసిన విషయం తెలిసిందే.
President Kovind was shifted from the ICU to a special room in the AIIMS today. His health has been improving continuously. Doctors are constantly monitoring his condition and have advised him to take rest.
— President of India (@rashtrapatibhvn) April 3, 2021
Comments
Please login to add a commentAdd a comment