గది బయట ప్రియాంకా గాంధీ వాద్రా పేరుతో ఉన్న బోర్డు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితురాలైన ప్రియాంకా గాంధీ వాద్రాకు అక్బర్ రోడ్‌లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక గదిని కేటాయించారు. సోదరుడు, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యాలయం పక్కనే ఉన్న ఈ చాంబర్‌ను ఆమెకు ఇవ్వడం విశేషం. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాహుల్ సైతం ఇదే కార్యాలయం నుంచి పనిచేశారు. అంతకుముందు ఇది కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోనీ, జనార్దన్ ద్వివేది, సుశీల్ కుమార్ షిండేల కార్యాలయంగా ఉండేది.
గత నెలలోనే ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతోపాటు, ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు గట్టి పట్టున్న గోరఖ్‌పూర్ ఉన్న ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగం ఇన్‌చార్జిగా రాహుల్ ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారమే అమెరికా నుంచి వచ్చిన ప్రియాంక వెంటనే రాహుల్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ యూపీ తూర్పు ఇన్‌చార్జి జ్యోతిరాదిత్య సింధియా కూడా హాజరయ్యారు. మంగళవారం ఆమె యూపీ సీనియర్ నేతలతో అనధికారికంగా సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆమె వారితో చర్చించారన్నాయి. గురువారం రాష్రా ్టల ఇన్‌చార్జులు, ప్రధాన కార్యదర్శులతో జరిగే సమావేశంలో ప్రియాంక పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment