mothers
-
పాలిచ్చే తల్లులకు ప్రైవసీ కల్పించండి
న్యూఢిల్లీ: పాలిచ్చే తల్లులకు ప్రైవసీని కల్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పాలిచ్చే తల్లులకోసం బహిరంగ ప్రదేశాల్లో, ప్రత్యేకించి ప్రభుత్వ భవనాల్లో ప్రత్యేక గదులు ఏర్పాటు చేసేలా రాష్ట్రాలకు సూచించాలని కేంద్రాన్ని ఆదేశించిందచి. బహిరంగ ప్రదేశాల్లో ఫీడింగ్ కోసం గదులు, పిల్లల సంరక్షణ కోసం సౌకర్యం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ప్రసన్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన ఆ హక్కులను కాపాడాలని గుర్తు చేసింది. ఇది పాలిచ్చే తల్లులకు సౌకర్యాన్ని, రక్షణను ఇస్తుందని పేర్కొంది. రాష్ట్రాలు ఈ ఆదేశాలను అమలు చేసేలా, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఈ సౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత స్థలం కేటాయించేలా చూడాలని, ఇప్పటికే ఉన్న బహిరంగ ప్రదేశాల్లో గదులను కేటాయించాలని కోర్టు అభిప్రాయపడింది. -
Valentines Day: అమ్మను ప్రేమిద్దామా..!
ప్రేమించిన ప్రియుడితో ఎప్పుడెప్పుడు తన మనసులోని మాటను చెబుదామని అమ్మాయి...ఎన్నాళ్ల నుంచో దాచుకున్న ప్రేమనంతా ఈ వాలెంటైన్స్ డే రోజున బయటపెట్టాలని అబ్బాయి..ఇలా కుర్రకారు తహతహలాడిపోతుంటుంది. నిన్న మొన్న వచ్చిన ఇలాంటి ప్రేమల కన్నా..ఈ భూమ్మీదకు తీసుకువచ్చి..ప్రాణాలన్నీ మనమీదే పెట్టుకుని బతికే అమ్మ ప్రేమను ఇలాంటి రోజును గుర్తు చేసుకుందాం. ప్రేమకు ప్రతిరూపం అమ్మ..అంటారే అలాంటి అమ్మ ప్రేమకు సాటిలేదు ఏ ప్రేమ. మనం ఎలా ఉన్నా..ఇష్టంగా లాలించే దేవత ఆమె. మనం పుట్టక ముందు నుంచి ప్రేమిస్తూ..మన ఆలన పాలనా కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆ దేవతకు ఈ పవితమైన రోజున..మన గుండెల్లోని ప్రేమనంతా ఈ విధంగా తెలుపుదామా..!.ఈ వాలెంటైన్ డే రోజున అమ్మ కళ్లు నులుముకుంటు నిద్రలేచేసరికి ఎదురుగా ఆమె ముందు నిల్చుని చూడండి. ఎప్పుడూ తానే మనల్ని నిద్రలేపే ఆమె ముందు గనుక మనమే ముందు లేచి ఎదురుగా ఉంటే కొంచెం తత్తరపాటు తోపాటు ఏంటా అని కచ్చితంగా కంగారుపడుతుంది. ఎందుకంటే అమ్మ కదా..? మనం ఏదైనా టెన్షన్లో ఉన్నామా..? లేక బాధగా ఉన్నామా..? అని భయపడుతుంది. కాస్త అనుమానంగా నటిస్తూ..విష్ చేస్తూ నవ్విచండి..ఏదో అయిపోతుందా రా ఈ రోజు అంటూ నవ్వేస్తుంది. మనం ఇష్టపడ్డ అమ్మాయి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేయడం కాదు. మనల్ని ఇన్నాళ్లు సాకి, ఎన్నో ఒడుదుడుకులు, కష్టాలను దిగమింగిన మన అమ్మకు I Love You Maa అంటూ ప్రపోజ్ చేయండి. ఆమె పైకి కోపం నటించినా..ఈ విషయం అంతా చుట్టుపక్కల వాళ్లతో గొప్పగా చెప్పుకుని తప్పక ఆనందిస్తుంది. అలాగే రోజూ ఎప్పుడు చివరగా మిగిలిపోయింది తినే ఆమెకు..కనీసం ఈరోజునైనా మనం ఆ అవకాశం ఇవ్వకుండా ఏదైనా చేసిపెట్టండి. లేదా కనీసం ఆమె చూడని వెరైటీ స్వీట్ లేదా చాక్లెట్‌తో నోటిని తీపి చెయ్యండి. మనల్ని ఆడించడాని అమ్మ బొమ్మగా మారిన రోజులను గుర్తు తెచ్చుకుంటూ..ఆమె చిత్రంతో పెయింట్ చేసిన గ్లాస్ లేదా టెడ్డీ బొమ్మల గిఫ్ట్‌గా ఇవ్వండి. ఆమె కోసం కాదు..మన కోసమే. ఎందుకంటే..బిజీ బిజీ లైఫ్‌లతో అమ్మ ప్రేమను మర్చిపోతున్న మనకు ఇలాంటి రోజునైనా అలనాటి స్మృతులను గుర్తు తెచ్చుకునేలా సెలబ్రేట్ చేసుకునేందుకు. ప్రతి అమ్మకి తన బిడ్డకు మించిన గొప్ప బహుమతి ఉండదు. అయినా ఆమె మననుంచి ఆశించదు కూడా. అలాగే కడ వరకు తనకు మంచి బిడ్డగా ఉంటాననే భరోసా ఇవ్వండి. ఆమెకు రెక్కల్లొస్తే ఎగిరిపోయే పక్షులం కాదు..నాకోసం ఆహర్నిశలు శ్రమించిన నిన్ను ఎన్నటికీ మర్చిపోను అనే నమ్మకం కలిగించండి. చిన్నప్పుడు అందంగా రెడీ చేసి..బుగ్గన దిష్టి చుక్కగా కాటుక పెట్టి మురిసిపోయే ఆ అమ్మను ఈ రోజున మనం రెడీ చేద్దాం. ఎలా ఉన్నా.. ఎవరి అమ్మ వారికి అందం, ఇష్టం ఉంటాయి కదా..!. అందుకే ఈరోజున నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అమ్మ నుదిటిని ముద్దాడదాం. అలాగే చిన్నప్పుడు మనం భయపడినా..పరీక్షలప్పుడూ పాసవ్వుతానా? లేదా..? అన్న టెన్షన్ పడుతున్నప్పడు అమ్మ మనల్ని దగ్గరకు తీసుకుని హత్తుకుని ధైర్యం చెప్పేది కదా..అది గుర్తుతెచ్చుకుని మరీ వయసు మళ్లినా.. నీ చేయి ఎన్నటికీ వదలను అనేట్టుగా ఆమెను ఆలింగనం చేసుకోండి. చివరిగా వీటిలో ఏ ఒక్కటి మనం చేసినా..అమ్మ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆమె మనకిచ్చిన అనంతమైన ప్రేమలో రవ్వంతైనా తిరిగిచ్చే ప్రయత్నం చేద్దామా..!. నిజానికి అమ్మ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. ఆ దేవతకు ప్రేమను ఇవ్వడమే గానీ తీసుకోవడం తెలియదు. ఆమె ప్రేమే మనకు సంజీవని, శ్రీరామ రక్ష. అలాంటి అమ్మకు ఈ రోజున మర్చిపోలోని ఆనందం కలిగేలా ప్రేమిద్దాం. ప్రస్తుత ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ప్రేమను వ్యక్తం చేసే సావకాశం కూడా లేని ఈ పరిస్థితుల్లో ఇలాంటి రోజుని మిస్ చేయకుండా ఉపయోగించుకుందాం. -
అమ్మల కోసం రూ.10 లక్షల వ్యయంతో ‘ఆణిముత్యాలు’
దాదర్: బహిరంగ ప్రదేశాల్లో పసిబిడ్డలకు పాలిచ్చేందుకు బాలింతలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్లానింగ్ కమిటీ ఉపనగరాల్లో 50 చోట్ల ఆణిముత్యం (పసిబిడ్డలకు పాలిచ్చే) కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఉపనగర జిల్లా ప్లానింగ్ కమిటీ రూ.5 కోట్లు నిధులు మంజూరు చేసింది. అవసరమైన స్ధల సేకరణ, అనుమతుల ప్రక్రియ పూర్తి కావడంతో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నగరం, ఉప పనగరాల్లో పాలిచ్చే కేంద్రాలు ఎక్కడ లేవు దీంతో బాలింతలు, పసిపిల్లల తల్లులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ కేంద్రాలు వినియోగంలోకి వస్తే పసిపిల్లల తల్లులు, బాలింతలకు ఊరట లభించనుంది. ఆణిముత్యం కేంద్రాల నిర్వాహణ మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా)కు చెందిన సుధార్ సమితి పర్యవేక్షించనుంది. 50 చోట్ల ఆణిముత్యం కేంద్రాలు నేటి ఆధునిక సాంకేతిక యుగంలో పురుషులతోపాటు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు, ఆస్పత్రులు, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్ధల్లో పనిచేస్తున్నారు. వివాహానికి పూర్వమే కాక ఆ తరువాత కూడా ఎన్నో సమస్యలను, సవాళ్లను అధిగమించి ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్న మహిళల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇలా విధులకు లేదా రొటీన్ చెకప్‌ల కోసం ఆసుపత్రులు, లేదా ఇతర పనులు నిమిత్తం వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలింతలు, పసిపిల్లల తల్లులకు మార్గమధ్యంలో పాలిచ్చేందుకు చాటు దొరకడంలేదు. రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వాలంటే ఎవరైన ఆకతాయిలు దొంగచాటుగా తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేస్తారని భయం. దీంతో గత్యంతరం లేక కొందరు బస్టాపుల్లో లేదా దుకాణాల వెనక, నివాస సొసైటీ కాంపౌండ్లలో చాటు వెతుక్కుని తమ బిడ్డలకు పాలిస్తున్నారు. ఇది వారికెంతో ఇబ్బందికరంగా, అసౌకర్యవంతంగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్లానింగ్ కమిటీ ఆణిముత్యం కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. 125 చదరపుటడుగుల ఒక్కో ఆణిముత్యం కేంద్రానికి రూ.10 లక్షలు ఖర్చు చేయనుంది. అందులో తాగునీరు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్, వాష్ బేసిన్, ఒక బెడ్డు, మూడు కుర్చీలలు, శానిటరీ ప్యాడ్ మెషీన్, గాలి, వెలుతురు ఆడేందుకు వీలుగా విశాలమైన కిటికీలను ఏర్పాటు చేయనుంది. అలాగే ఈ కేంద్రాల బయట సీసీ టీవీ కెమరాలుంటాయి. దీంతో సౌకర్యంతో పాటు భద్రత కూడా లభిస్తుందని జిల్లా ప్లానింగ్ కమిటీ స్పష్టం చేసింది. -
అమ్మచీరచుట్టుకున్న ఆనందంలో బిగ్ బాస్ బ్యూటీ (ఫొటోలు)
-
అమ్మే దిగివస్తే మత్తు దిగదా..
పంజాబ్‌లో హెరాయిన్‌ని ‘చిట్టా’ అంటారు. దీని అడిక్షన్లో పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌ను వ్యతిరేకించడానికి నేడు తల్లులే రంగంలోకి దిగారు. పంజాబ్‌లో ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ మొదలైంది. నిజానికి ఇది ప్రతి రాష్ట్రంలో జరగాలి. డ్రగ్స్ నీడ లేని ఇల్లే సమాజానికి వెలుగు.పంజాబ్‌లో ‘డ్రగ్స్’ మహమ్మారి వ్యాపించి ఉంది. ప్రకృతిలోని మహమ్మారికి మందు ఉంది వాక్సిన్లు ఉన్నాయి... కాని ఈ మహమ్మారికి మందు లేదు. దీనిని నివారించాలంటే మానవశక్తి కావాలి. మహా శక్తి కావాలి. ఆ శక్తి తల్లే తప్ప మరెవరూ కాలేరని పంజాబ్‌లో ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమం మొదలైంది. ‘పంజాబ్ లిటరేచర్ ఫౌండేషన్’ అనే సంస్థ సెప్టెంబర్ 15న హోషియార్‌పూర్‌లో ఈ ఉద్యమం మొదలెట్టింది. ఈ కార్యక్రమానికి తల్లులు భారీగా తరలి వచ్చారు. పిల్లలు వ్యసనాల బారిన పడితే కడుపుకోతకు గురయ్యేది మొదట తల్లులే. పిల్లల్ని కాపాడుకోవాల్సింది మొదట వారే.13 నుంచి 18 ఏళ్ల మధ్యలోపిల్లల వయసు 13 నుంచి 18 ఏళ్ల మధ్య వరకు తల్లులు వారిని జాగ్రత్తగా గమనించుకుంటే డ్రగ్స్ నుంచి కాపాడుకోవచ్చని ‘పంజాబ్ లిటరేచర్ ఫౌండేషన్’ స్థాపకుడు, రచయిత కుష్వంత్ సింగ్ అన్నాడు. పంజాబ్‌లోని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఆయన ‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమానికి అంకురార్పణ చేశాడు. ‘పంజాబ్‌లో 13 నుంచి 18 ఏళ్ల మధ్యలో పిల్లలు డ్రగ్స్‌కు పరిచయం అవుతున్నారు. 14 నుంచి 24 ఏళ్ల మధ్య వీళ్లు అడిక్ట్స్‌గా మారుతున్నారు. వీరిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్స్‌లో పడేస్తే మారే వారు ఒక శాతం మాత్రమే ఉంటున్నారు. అంటే డ్రగ్స్ బానిసత్వం ఎంత ప్రమాదమో అర్థం చేసుకోవాలి’ అన్నాడాయన. ‘పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గత సంవత్సరం చండీగఢ్ నుంచి భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్ వరకూ పాదయాత్ర చేసినప్పుడు దారిలో ఎందరో తల్లులు వచ్చి మా పిల్లలు బాగుపడే మార్గం లేదా అని అడిగేవారు. తల్లులే మొదటి రక్షకులుగా మారితే పిల్లలను డ్రగ్స్‌వైపు వెళ్లకుండా ఆపొచ్చని నాకు అనిపించింది. దాని ఫలితమే ఈ ఉద్యమం’ అని తెలిపాడతడు.మంచాలకు సంకెళ్లుపంజాబ్లో హెరాయిన్ వ్యసనపరులు లెక్కకు మించి ఉన్నారు. దీనిని అక్కడ ‘చిట్టా’ అంటారు. దాని కోసం పిల్లలు ఎంతకైనా తెగిస్తారు. వారిని డ్రగ్స్ కోసం వెళ్లకుండా ఉంచేందుకు తల్లిదండ్రులు మంచాలకు సంకెళ్లు వేసి కట్టేసి ఉంచడం సర్వసాధారణం. పంజాబ్‌లో కొన్ని ఊళ్లు డ్రగ్స్ వల్ల చని΄ోయిన వ్యక్తుల భార్యలతో నిండి ‘వితంతువుల పల్లెలు’గా పేరు పడటం సమస్య తీవ్రతను తెలుపుతుంది.తల్లులకు ట్రైనింగ్ ఇస్తేమదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్ ఉద్యమంలో తల్లులను ఒకచోట చేర్చి డ్రగ్స్ గురించి అవగాహన కలిగిస్తారు. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన గౌరవ్ గిల్ అనే బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నవారి శారీరక కదలికలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఈ సందర్భంగా తల్లులకు తెలియచేసి పిల్లల్లో ఈ మార్పు చూడగానే అలెర్ట్ అవ్వాలని కోరాడు. ‘తొలి రోజుల్లోనే గమనిస్తే చాలా మేలు జరుగుతుంది. చాలాసార్లు పరిస్థితి చేయి దాటి ΄ోయాకే పిల్లలు డ్రగ్ ఎడిక్ట్స్ అయ్యారని తల్లిదండ్రులు గమనిస్తున్నారు’ అని అక్కడకు వచ్చిన ΄ోలీసు అధికారులు తెలిపారు. అందుకే ఈ ఉద్యమంలో డ్రగ్స్ కార్యకలాపాలు గమనించిన వెంటనే ΄ోలీసుల హెల్ప్‌లైన్‌కు ఎలా తెలపాలి, ΄ోలీసుల సహాయం ఎలా తీసుకోవాలో తెలియచేస్తారు. ‘గ్రామీణ స్త్రీలకు ఈ శిక్షణ ఉంటే గ్రామాల్లో యువకులు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోగలరు’ అంటున్నారు ఈ ఉద్యమ బాధ్యులు.ఎన్నో రకాలుమత్తు పదార్థాలంటే హెరాయిన్, గంజాయి మాత్రమే కాదు. వైటెనర్స్తో మొదలు దగ్గుమందు వరకు ఎన్నో ఉన్నాయి. డ్రగ్స్ చలామణి కోసం పంజాబ్‌లో దగ్గుమందు ముసుగులో ఫ్యాక్టరీలు తయారయ్యి ్రపాణాంతకస్థాయిలో దగ్గుమందులోని రసాయనాలను ఇంజెక్షన్లుగా ఎక్కించునే విధంగా తయారు చేస్తున్నారు. అంతేకాదు గ్రాము బరువుకు ఎక్కువ పొడి వచ్చే విధంగా తయారు చేయడంతో ఒక్క గ్రాముతో కూడా రోజు గడపొచ్చనుకుని అలవాటు పడుతున్నారు.ఏం చేయాలి?తల్లిదండ్రులు పిల్లలతో తరచూ సమయం గడపాలి. వారితో విహారాలు చేయాలి. ఆ సమయంలో వారి మనోభావాలు విని స్నేహాలు తెలుసుకోవాలి. చదువుల్లో మార్కులు తెలుసుకోవాలి. ప్రవర్తనను గమనించాలి. ఇవన్నీ ఏమాత్రం తేడా వున్న అనుమానించి ఆదుకోవాలి. ఈ స్పీడు యుగంలో ఎవరూ ఈ పని చేయడం లేదు. తల్లులకు తప్పదు. వారే రక్షకులు. అమ్మ వల్లే మారాను‘మదర్స్ ఎగైనెస్ట్ డ్రగ్స్’ ఉద్యమంలో భాగంగా డ్రగ్స్ నుంచి బయటపడి సామాన్య జీవితం గడుపుతున్న వారి కథనాలు కూడా స్వయంగా వినిపించారు. ‘నేను డ్రగ్స్ నుంచి కేవలం మా అమ్మ వల్ల బయట పడ్డాను. ఒక దశలో హెరాయిన్ డోస్ కోసం 2 లక్షలు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడలేదు. మా అమ్మ నా కోసం అనేక త్యాగాలు చేసి మామూలు మనిషిని చేసింది’ అని ఒకతను తెలిపాడు. -
ఆటిజం బిడ్డలు, ఆ అమ్మలకు హ్యట్సాఫ్ : వీడియో వైరల్
ఆటిజంతో బాధపడుతున్న పిల్లల్ని పెంచి పెద్ద చేయడం తల్లి తండ్రులకు ఒక సవాల్. కానీ వారికి రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో శిక్షణ ఇవ్వాలి. అలాగే ఆటిజం పిల్లల్లో స్పెషల్ టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తే బాగా రాణిస్తారు. దీనికి ఉదారణలు చాలానే ఉన్నాయి. తాజాగా తన బిడ్డ డ్యాన్స్ ప్రదర్శన కోసం తపన పడుతున్న ఓ తల్లి వీడియో ఒకటి ఇంటర్నెట్లో ఆసక్తికరంగా మారింది.ఒక తల్లి తన ఆటిస్టిక్ బిడ్డకు నృత్య పోటీలో ప్రదర్శన ఇవ్వడానికి సహాయం చేస్తోంది అంటూ అపర్ణ అనే యూజర్ ఎక్స్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ‘‘ప్రత్యేక పిల్లలను పెంచడానికి అనుభవించే బాధ.. సహనం.. ఎంత అంకితభావం అవసరమో ఊహించను కూడా ఊహించలేం.. హ్యాట్సాఫ్’’ అంటూ వ్యాఖ్యానించారు.A mother helps her autistic child perform in a dance competition ...Can't even imagine the amount of pain, patience and dedication required to bring up special children! Hats off 🙏💕 pic.twitter.com/JbEETe4yzC— Aparna 🇮🇳 (@apparrnnaa) June 10, 2024ఈ వీడియోలో ఆటిజంతో బాధపడుతున్న ఒక బాలిక స్టేజ్‌పై శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అక్కడే ఆమెకు ఎదురుగా కూర్చున్న తల్లి స్వయంగా ఆయా భంగిమలను చూపిస్తూ ఉంటుంది. దాని కనుగుణంగా ఆ పాప తన డ్యాన్స్‌ను కొనసాగిస్తుంది. ఈ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.ఆటిజంఆటిజం అనేది చిన్నపిల్లల్లో ఏర్పడే ఒక మానసిక స్థితేకానీ, రుగ్మత కాదు. తల్లి గర్భం దాల్చిన సమయంలో ఆమె మానసిక స్థితిని బట్టి లేదా మేనరికం కొన్ని జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవడం, ఎవరితో అయినా మాట్లాడే సమయంలో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోవడం, చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తుండటం, ఒక పనిని ఎప్పుడూ చేసినా తిరిగి అలాగే చేయాలని ప్రయత్నించడం, కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్ళను పైకి కిందికి అదే పనిగా ఆడించడం,చెప్పిన పని చేయకపోవడం, నేలపై నడిచేటప్పుడు నిటారుగా నడవకుండా వేళ్లపై నడవడం లాంటి లక్షణాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఇలాంటి సమస్యలు చిన్నపిల్లల్లో జన్మించిన మూడు సంవత్సరాల నుండి మొదలయ్యే అవకాశం ఉంటుందని, ఇలాంటి లక్షణాలు తల్లిదండ్రులు కనుగొన్నట్లయితే వెంటనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స అందించాలి. లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. -
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
మిస్ యూఎస్ విజేతల వరుస రాజీనామాలు అమెరికాను షాక్ గురి చేసింది. అదీకూడా రెండు మూడు రోజుల వ్యవధిలోనే జరగడం పలు రకాల అనుమానాలకు లెవనెత్తింది. అయితే ఆ మోడల్స్ ఇద్దరిలో ముందుగా తన స్థానం నుంచి తప్పకుంటున్నట్లు ప్రకటించిన మిస్ యూఎస్ఏ 2023 నోలియా వోగ్ట్ తన మానసిక ఆరోగ్య నిమిత్త రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, మరో మోడల్ మిస్ టీన్ యూఎస్ఏ 2023 తన వ్యక్తిగత విలువలు సంస్థతో సరిపోవడం లేదని చెబుతూ తప్పుకుంటున్నట్ల ప్రకటించింది. అయితే అసలు ఎందుకు ఆ ఇరువురు అందాల భామలు సడెన్‌గా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఎట్టకేలకు వాటికి ఆ విజేతల తల్లులు వివరణతో తెరపడింది. ఆ బ్యూటీ క్వీన్స్ తల్లులైన బార్బరా, జాక్లైన్ వోగ్ట్, తమ కుమార్తెలు మిస్ యూఎస్ఏ ఆర్గనైజేషన్‌లో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నారని చెప్పారు. వారు సంస్థకు సంబంధించిన నాన్ డిస్క్లోజర్ ఒప్పందాల(ఎన్డీఏ) కారణంగా వారు ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి పెదవి విప్పడం లేదని చెప్పారు. తమ కుమార్తెలు సంస్థకు సంబంధించిన కొందరి వ్యక్తుల నుంచి లైంగిక వేధింపులను కూడా ఎదుర్కొన్నారని తెలిపారు. విజేతలుగా కిరీటాన్ని గెలుచుకున్నప్పటికీ వాళ్లు ఏం పొందలేదన్నది చెప్పాలనుకోవడం లేదని అన్నారు. వాళ్లు అక్కడ పలు దుర్భాషలకు, బెదిరింపులకు గురయ్యారు. తాము ఇలా బయటకొచ్చి చెప్పడానికి ప్రధాన కారణం ప్రధాన పోటీల్లో ఉండే వాస్తవాల గురించి మిగతా తల్లిదండ్రులు కూడా తెలసుకోవాలనే ఉద్దేశ్యంతోనేననిన్నారు. కాగా, మిస్ యూఎస్ఏ పోటీలు ఇటీవలి సంవత్సరాలలో అనేక వివాదాలు, కుంభ కోణాల్లో చిక్కుకుంది. అలాగే కొంతమంది పోటీదారులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు పలు ఆరోపణలు కూడా వచ్చాయి.(చదవండి: డీజిల్‌తో పరాటా చేయడమా? చివరికి యజమాని..) -
Mothersday 2024 ‘బంగారం నువ్వమ్మా’! టాలీవుడ్ అమ్మల్నిచూశారా?
-
మదర్స్ డే 2024 : బీటౌన్ మామ్స్పై ఒక లుక్కేసుకోండి! (ఫోటోలు)
-
Celebrities With Their Mom's: మామ్స్తో సెలబ్రిటీలు, రెండు కళ్లూ చాలవు (ఫోటోలు)
-
Famous Celebrities Mothers Photos: భారతీయులు గర్వించదగ్గ ప్రభావవంతమైన తల్లులు
-
Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్తత్త!
కుటుంబం, పిల్లలు, భర్త అంటూ చాలామంది మహిళలు తమ శారీరక ఆరోగ్యాన్నిఅస్సలు పట్టించుకోరు. భర్త పిల్లలకు పెట్టి, మిగిలింది తిని కడుపునింపుకునే శ్రామిక మహిళలు చాలా మందే ఉన్నారు. భారతీయ మహిళలు, యువతులు పోహకాహారం లోపంతో బాధపడు తున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా, కుటుంబానికి సేవ చేయాలన్నా శరీరానికి సమతులాహారం అందాలంటారు పోషకాహార నిపుణులు.క్రమం తప్పని వ్యాయామంఇంటి పనిచేస్తున్నాంకదా అని శారీరక వ్యాయామాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాయామం చేయడం శారీరక బలాన్ని కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలాగే పనిలోపని బ్రేక్ ఫాస్ట్‌ను అస్సలు పట్టించుకోరు.ఆహారం పట్ల నిర్లక్ష్యంఉదయం లేచింది మొదలు.. పడుకునేదాకా, ఏం టిఫిన్ చేయాలి. ఏం కూరలు ఉండాలి. ఎలాంటివెరైటీ ఫుడ్‌ను అందించాలి అంటూ తపన పడే చాలామంది అమ్మలు తమ అలవాట్లను, అభిరుచులను మర్చిపోతారు. పనిలో పడి అస్సలు దేన్నీ పట్టించుకోరు. కానీ ఉదయం అల్పాహారం చాలా ముఖ్యం. కార్బ్స్ ఎక్కువ కాకుండా, ఫైబర్ ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడండి. తద్వారా ప్రసవం తరువాత లావు కాకుండా ఉంటారు. అందుకే కేలరీలు అందేలా చూసుకోవాలి. నూనెలేని ఇడ్లీ, దోశలు, మిల్లెట్స్‌తో చేసిన వాటిని తీసుకోండి. లేదంటే ఉడకబెట్టిన గుడ్లు, పాలు, మొలకెత్తిన గింజలు, నట్స్, వెజిటబుల్ సలాడ్ కొద్దిగా నిమ్మరసం వేసుకొని తినండి.కింగ్ లాంటి లంచ్కింగ్ లాంటి భర్తే కాదు, అంతకంటే కింగ్ లాంటి లంచ్ అవసరం. మధ్యాహ్నంహ భోజనం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్నం లేదా చపాతీతోపాటు ఆకుకూరలు, కాయగూరలు, బఠాణీలూ, బీన్స్, పుట్టగొడుగులూ, పప్పు ధాన్యాలూ గుడ్లూ, చేపలూ, చికెన్ ఇలా మీకిష్టమైనదాన్ని ఎంచుకోండి. అలాగే రోజూ ఒకేలా రొటీన్‌లా కాకుండా, మంచి పోషకాలుండేలా చూసుకోండి. స్నాక్స్రోజంతా పనిచేసిన తరువాత సాయంత్రం ఏదైనా తినాలనిపిస్తుంది. మరోవైపు పిల్లలు స్కూలునుంచి ఇంటికి వచ్చే సమయం. మరి వారి అల్లరిని భరించాలన్నా, ఓపిగ్గా వారిని లాలించాలన్నా శక్తి తప్పదు. అందుకే మొక్కజొన్నతో చేసినవి, పండ్ల ముక్కలూ, చిరుధాన్యాల పిండితో చేసిన మురుకులూ, పల్లీ పట్టీ, నువ్వులు బెల్లం ఉండలు ఇలాంటి.. అప్పుడపుడూ పకోడీ, మిరపకాయ బజ్జీలాంటివి తినేయొచ్చు.చివరిగాఏదైనా అనారోగ్యం అనిపించినా.. అదే తగ్గిపోతుందిలే అని ఊరుకోవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించడం, సరైన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా ఒంటరిగా అనిపించినా, ఏమాత్రం సంకోచించ కుండా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భర్తతో పంచుకోండి. తగిన పరిష్కారాన్ని వెదుక్కోండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంగా ఉండండి! దీంతో మీ పిల్లలు, మీ కుటుంబం మొత్తం ఆరోగ్యం ఆనందంగా ఉండటమే కాదు, సమాజం, దేశం కళకళలాడుతూ ఉంటుంది.మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు! -
అస్సలు బాధపడకండి..! వ్యాపారవేత్త రాధిక గుప్తా సలహా!
ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పుట్టుకతోనే శారీరక లోపంతో పుట్టి, అనేక రకాల అవహేళనలను ఎదుర్కొంది. డెలివరీ సమయంలో చిన్న సమస్య కారణంగా రాధిక మెడ కొద్దిగా వంగింది. అంతేకాకుండా ఒక కంటిలో లోపం ఏర్పడింది. అయినా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవడమే కాదు విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. (పిల్లి కోసం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత) పెన్సిల్వేనియాలో కంప్యూటర్సైన్స్లో పట్టభద్రురాలైన రాధిక ఉద్యోగం కోసం ప్రయత్నించగా దాదాపు 7 సార్లు రిజెక్ట్ అయిందనీ, దీంతో ఆత్మహత్య చేసు కోవాలనే ఆలోచన కూడా వచ్చిందని స్వయంగా రాధిక ఒకసారి చెప్పారు. దీంతో ఏదైనా సాధించాలనే పట్టుదలతో భర్త, స్నేహితులతో కలిసి ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీని ప్రారంభించింది. కొనేళ్లకు ఈ కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ ఆల్టర్నేటివ్ ఈక్విటీకి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా ఉన్నారు, ఆమె భర్త నలిన్ మోనిజ్. వీరికి 2022లోఒక కుమారుడుపుట్టాడు. View this post on Instagram A post shared by Radhika Gupta (@iamradhikagupta) షార్క్ ట్యాంక్ ఇండియా-3లో న్యాయనిర్ణేతగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్నారు. అంట్రప్రెన్యూర్స్ ఎకోప్రెన్యూర్స్ ఫ్యాషన్ సస్టైనబుల్ ఉండటమేకాదు అందంగా సౌకర్యవంతంగా ఉంటుంది.. అరటి, పైనాపిల్, జనపనార ఆకులు, కాండంతో డెనిమ్స్, టీ షర్టులు చీరలు రూపొందించే సంస్థలో పెట్టు బడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అలాగే మండే మోటివేషన్ అంటూఇన్స్టాలో ముఖ్యంగా ఉద్యోగం చేసే తల్లుల కోసం కొన్ని సలహాలు సూచనలు అందించారు. ఈ సందర్బంగా తన తల్లి ఇచ్చిన విలువైన సలహాను ఆమె పంచుకున్నారు. తన చేతుల్లో తన బిడ్డను పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసిన ఆమె ఉద్యోగినులుగా పనిలో తలమునకలై పిల్లల గురించి, మీ గురించి పట్టించు కోలేకపోతున్నామని బాధపడుతున్నారా.. దీన్ని గుర్తుంచుకోండి అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. మాతృత్వ బాధ్యతలతో పాటు కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడం కష్టతరమైందే కానీ..దేనికీ బాధపడాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, కరియర్‌ను కొనసాగించా లన్నారు. ‘‘ఏ తల్లీ చెడ్డ తల్లి కాదని అమ్మ చెప్పింది. పదవారు, ధనవంతులు, విద్యావంతులు, చదువుకోనివారు, పని చేసేవారు, పని చేయకనివారు.. ఇలా ఎవరైనా అమ్మ అమ్మే.. ప్రతీ తల్లి తన బిడ్డకు మంచి చేయాలనే కోరుకుంటుంది’’ రాధిక గుప్తా అలాగే అటు తల్లి, ఇటు వ్యాపారవేత్తగా ఉంటూనే, రియాలిటీ షోలను కూడా ఎలా మేనేజ్ చేస్తున్నదీ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. తాను ఎక్కడికి వెళ్లినా, ప్రెపెస కాన్ఫరెన్స్‌లలో కూడా కుమారుడు తనతో పాటు ఉంటాడని, షార్క్ ట్యాంక్సెట్లలో ఎక్కువ సమయం ఉంటాడని కూడా వెల్లడించా రామె. మాతృత్వం మహిళల సవాళ్లను స్వీకరించే సామర్థ్యానికి అడ్డుకోకూడదని తాను భావిస్తానన్నారు. మహిళలకు పెళ్లి, పిల్లలు తరువాత కరియర్లో బ్రేక్ వస్తుంది. ప్రసూతి సెలవు తరువాత మళ్లీ ఉద్యోగంలోకి రావడం అనేది మానసికంగా కొంత ఇబ్బంది కరమైన పరిస్థితే. పసిబిడ్డల్ని వదిలి వెళుతున్నామనే బాధ ఒకవైపు, ఉద్యోగంలో రాణించాలనే ఒక పట్టుదల ఒకవైపు వారిని స్థిరంగా ఉండనీయవు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో కొంతమంది తల్లులు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. -
చంటి బిడ్డతో ప్రయాణమా? మీకోసమే 'ట్రావెల్ విత్ కిడ్స్'
ప్రయాణాల మీద బోలెడు ఆసక్తి ఉన్నప్పటికీ పిల్లలు ఒక వయసు వచ్చాకగానీ ఇల్లు దాటని తల్లులు ఎందరో ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, డెంటిస్ట్‌లు సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు యంగ్ మదర్స్ కోసం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ అనే ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. ప్రయాణాలలో తల్లీపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు... సాక్షి గులాటీ, నికిత మాథుర్‌లు పర్యాటక ప్రేమికులు. వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సరే ప్రయాణాలకు మాత్రం దూరంగా ఉండేవారు కాదు. నాలుగున్నర సంవత్సరాల క్రితం సాక్షి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడానికి ఆలోచనలు చేస్తున్నప్పుడు ‘చంటి బిడ్డతో ప్రయాణమా!!’ అని ఆశ్చర్యపోవడమే కాదు ప్రయాణాలు వద్దంటే వద్దన్నారు చాలామంది. ఒక బిడ్డకు తల్లి అయిన నికితకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా చెన్నైకి చెందిన సాక్షి తన మూడు నెలల బిడ్డతో కలిసి మహాబలిపురానికి వెళ్లింది. చాలా కాలం తరువాత పర్యాటక ప్రదేశానికి వచ్చింది. మరోవైపు బెంగళూరుకు చెందిన నికిత మూడు నెలల పిల్లాడితో కలిసి మైసూర్‌కు వెళ్లింది. ‘బేబీతో ప్రయాణం కష్టమని చాలామంది భయపెట్టారు. ఇది నిజం కాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. మొదటి మూడు నాలుగు నెలలు మాత్రమే కష్టం’ అంటుంది సాక్షి. చెన్నైలో ఉండే సాక్షి, బెంగళూరులో ఉండే నికితలు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఒకే రకమైన వృత్తి, అభిరుచులు వారిని సన్నిహిత స్నేహితులుగా మార్చాయి. సినిమాల నుంచి పర్యాటకం వరకు ఇద్దరు స్నేహితులు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. అలా ఒకరోజు వారి మధ్య చంటిబిడ్డలు ఉన్న తల్లుల ప్రస్తావన వచ్చింది. మహిళల కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. సోలో ట్రావెలర్స్, సీనియర్ సిటిజన్లు... మొదలైన వారి కోసం ఎన్నో ట్రావెల్ గ్రూప్స్ ఉన్నాయి. కాని మదర్స్ అండ్ కిడ్స్ కోసం మాత్రం లేవు. ఈ లోటును భర్తి చేయడానికి రెండు సంవత్సరాల క్రితం ‘ట్రావెల్ విత్ కిడ్స్’ పేరుతో ట్రావెల్ గ్రూప్‌ను ప్రారంభించారు. తొలి ‘మదర్ అండ్ కిడ్స్’ ట్రిప్‌ను పాండిచ్చేరికి ప్లాన్ చేశారు. సాక్షికి పాండిచ్చేరి కొట్టిన పిండి. పాండిచ్చేరి ట్రిప్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే మంచి స్పందన లభించింది. ఈ ట్రిపుల్ ఆరుగురు తల్లులు వారి పిల్లలను తీసుకువెళ్లారు. ఈ ప్రయాణం విజయవంతం కావడంతో ఇద్దరు స్నేహితులకు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత వివిధ ప్రాంతాలకు సంబంధించి అయిదు ట్రిప్‌లు ప్లాన్ చేశారు. తమ వృత్తిలో బిజీగా ఉండే సాక్షి, నికితలు వీకెండ్స్‌లో ప్లానింగ్ చేస్తుంటారు. ‘చంటి బిడ్డలు ఉన్నారని ఇంటి నాలుగు గోడలకే పరిమితం కానక్కర్లేదు. బయటి ప్రపంచలోకి వస్తే కొత్త ఉత్సాహం, శక్తి వస్తాయి’ అంటున్నారు సాక్షి, నికిత. ‘పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త అనుభూతిని సొంతం చేసుకునేలా చంటి బిడ్డల తల్లులను ప్రేరేపించడం ఒక లక్ష్యం అయితే, ప్రయాణాలలో తల్లీబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం అనేది మా ప్రధాన లక్ష్యం’ అంటుంది నికిత. ఈ ట్రావెల్ గ్రూప్ ప్రత్యేకత ఏమిటంటే, ఒక ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు సాక్షి, నికితలలో ఒకరు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లి వస్తారు. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తారు. రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ‘ట్రిప్ బుక్ చేసుకున్న వారి కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. దీనిద్వారా తల్లుల ఆహారపు అలవాట్లతో పాటు వారి ఇష్టయిష్టాలు, తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకునే అవకాశం దొరికింది’ అంటుంది సాక్షి. చెన్నై. బెంగళూరు, ముంబై, జైపుర్, కోచి, కోల్‌కతా... ఇలా ఎన్నో నగరాల నుంచి తల్లులు ఈ ట్రిప్‌లలో భాగం అవుతున్నారు. తన పిల్లాడితో కలిసి పాండిచ్చేరికి వెళ్లిన దీపిక ఇలా అంటుంది... ‘ట్రిప్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు తిండి సహించేది కాదు. ఈ ప్రయాణంలో మాత్రం ఇంటి తిండిని మరిపించేలా చేశారు. ఈ ట్రిప్ ద్వారా ఎంతోమంది స్నేహితులయ్యారు’ ట్రిప్‌ల ద్వారా పరిచయం అయిన వారు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి కలుసుకోవడం, ఆ కుటుంబంలో వ్యక్తిలా మారడం మరో విషయం. ‘కిడ్–ఫ్రెండ్లీగా లేవని కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉంటాం. అయితే పిల్లలు మొరాకో నుంచి ఈజిప్ట్ వరకు ఎక్కడైనా సరే తమ ఆనందాన్ని తామే వెదుక్కుంటారు. పిల్లలు పార్క్‌లు, జూలలలో మాత్రమే ఆనందిస్తారనేది సరికాదు’ అంటుంది సాక్షి. సింగిల్ మదర్స్ ఈ ట్రిప్స్‌పై ఆసక్తి ప్రదర్శించడం మరో కోణం. స్థూలంగా చెప్పాలంటే ‘ట్రావెల్ విత్ కిడ్స్’ తల్లుల పర్యాటక సంతోషానికి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒకే రకంగా ఆలోచించే వారిని ఒక దగ్గరికి తీసుకువచ్చింది. కొత్త స్నేహితుల రూపంలో కొత్త బలాన్ని కానుకగా ఇస్తోంది. -
ఈ తల్లులు ప్రకృతే మురిసేలా ..పిల్లల పెళ్లి ఘనంగా చేశారు
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి... ఊరంతా చెప్పుకునేలా జరగాలి పెళ్లంటే మరి!’ అంట అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నేటితరం పెళ్లిళ్లు. ఏమాత్రం పర్యావరణ స్పృహలేకుండా హంగు, ఆర్భాటాలు చేస్త తెగ గొప్పలు చెప్పేసుకుంటున్నారు. దీనివల్ల ప్రకృతమ్మ ఎంత తల్లడిల్లిపోతుందో కూడా పట్టడం లేదు. ఒకతల్లి మనసు మరో తల్లికే తెలుస్తుందేవె! అందుకే బెంగళూరుకు చెందిన ఇద్దరమ్మలు కలిసి తమ పిల్లల పెళ్లిని ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా ఎంతో ఘనంగా, ప్రకృతి మురిసేలా జరిపించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బెంగుళూరుకు చెందిన అనుపమ కువరుడికి, చారులత కూతురుతో వివాహం నిశ్చయమైంది. రెండు కుటుంబాలకు అన్ని విషయాల్లో సఖ్యత కుదిరింది. కానీ ‘పెళ్లిలో ప్లాస్టిక్‌ను అస్సలు వాడకడదు’ అని అనుపమ కండిషన్ పెట్టింది. ఇది చారులతకు నచ్చడంతో మరింత సంతోషంతో ఒప్పుకుని ‘‘ఇద్దరం కలిసి ప్లాస్టిక్ రహిత పెళ్లి చేద్దాం వదినా!’’ అని ఒక నిర్ణయానికి వచ్చారు. తమ పిల్లల పెళ్లిని మూడురోజులపాటు అంగరంగా వైభవంగా ప్లాస్టిక్ లేకుండా జరిపేందుకు నామమాత్రపు పెళ్లిపత్రికలను కొట్టించారు. కొంతమందికి మాత్రమే ఆహ్వాన పత్రికలు ఇచ్చి, మిగతా వారిని నేరుగా పెళ్లికి పిలిచారు. పెళ్లికి పిలిచేటప్పుడే.. ‘‘ఎవరూ బొకేలు, బహుమతులు వంటివి తీసుకు రావద్దు’’ అని మనవి చేశారు. అరిటాకులు.. స్టీల్ ప్లేట్లు... వచ్చిన వెయ్యిమంది అతిథులకు వడ్డించేందుకు అరటి ఆకులు, స్టీల్ ప్లేట్స్‌ను ఎంచుకున్నారు. ప్లాస్టిక్ కప్పులు, గ్లాసులు, ప్లేట్లు, వాటర్ బాటిల్స్ స్థానంలో స్టీల్ సామాన్లు వాడారు. తాజా పువ్వులు, లైట్లతో పెళ్లిమండపాన్ని అలంకరించారు. పంతొమ్మిదేళ్లనాటి పేపర్‌తో... అనుపమ కొడుకుకు 2004లో ఉపనయనం జరిగిన సందర్భంగా జరిపిన వేడుకలో బటర్పేపర్ను వాడారు. అప్పుడు మిగిలిన పేపర్ తో పెళ్లికి వచ్చిన అతిథులకు రిటన్ గిఫ్ట్స్ ఇచ్చారు. సహజసిద్ధ పద్ధతుల్లో రంగులద్దిన జాకెట్ ముక్కలు, కాగితం పొట్లాల్లో పసుపు, కుంకుమను పేరంటాళ్లకు పంచారు. స్టీల్ ప్లేటులు, గ్లాసులతో పెళ్లిలో డెకరేషన్ల కోసం వాడిన తాజా పువ్వులను వేడుక ముగిసిన తరువాత ముంబైలోని సహజ రంగుల తయారీ స్టూడియోకి పంపించారు. వెయ్యికేజీల వేస్ట్ నుంచి ... ప్లాస్టిక్ వాడకపోయినప్పటికీ, కొన్ని సహజసిద్ధ వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి కాబట్టి వాటికోసం క్యాటరింగ్ సిబ్బంది తడి, పొడి చెత్తను విడివిడిగా డ్రమ్స్లో వేసేవాళ్లు. ఈ వ్యర్థాలను కోకోపీట్ నింపిన డ్రమ్స్లో వేసేది. కాగితాలను, పువ్వులను కలెక్షన్ సెంటర్‌కు పంపించారు. డ్రమ్‌లలో వేసిన వెయ్యికేజీల వ్యర్థాల నుంచి మూడు వందల కేజీల సేంద్రియ ఎరువును తయారు చేశారు. ‘‘పెళ్లిలో ప్లాస్టిక్ వాడకుండా చేయడం మాకు చాలెంజింగ్‌గా అనిపించినప్పటికీ ఇద్దరం కలిసి విజయవంతం చేశాం. మా అమ్మ, అమ్మమ్మల కాలంలో పెళ్లిళ్లకు ఇలానే స్టీల్ సామాన్లు వాడేవారు. మేము అలాగే మా పిల్లల పెళ్లి చేయాలనుకున్నాం. అందుకు అందర సహకరించడం సంతోషం’’ అని అనుపమ, చారులతలు చెప్పకొచ్చారు. (చదవండి: గూగుల్ మ్యాప్‌లో వినిపించే వాయిస్.. ఏ మహిళదో తెలుసా?) -
బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే..
ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఆనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా.. ఇలా ఎంతో మంది భారతీయ పారిశ్రామిక వేత్తలు వ్యాపార రంగంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఎంత ఎదిగినా బిడ్డకు తల్లే ఆది గురువు అని అంటారు. పిల్లలను తీర్చిదిద్దడంలో తల్లి పాత్ర అత్యంత కీలకం. మదర్స్ డే సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలు, వారి మాతృమూర్తుల గురించి తెలుసుకోండి.. ఇదీ చదవండి: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తల్లి, దివంగత ధీరూబాయి అంబానీ సతీమణి కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనుక చోదక శక్తిగా ప్రసిద్ధి చెందారు. ఆమె మధ్యతరగతి గుజరాతీ పాటిదార్ కుటుంబంలో జన్మించారు. తండ్రి, రతీలాల్ జష్రాజ్ పటేల్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉద్యోగి. తల్లి రుక్ష్మాణిబెన్ గృహిణి. 1955లో కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని బలమైన పేర్లలో ఆమె ఒకరు. 2009లో ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిని స్థాపించారు. శాంతాబెన్ అదానీ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తల్లి పేరు శాంతాబెన్ అదానీ. 2010లో మరణించిన ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఉత్తర గుజరాత్‌లోని థారాడ్ నుంచి భర్త శాంతిలాల్ అదానీతో కలిసి అహ్మదాబాద్‌కు వలస వచ్చి మొదట్లో వాల్ సిటీలోని రతన్పోల్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఆమె తన జీవితకాలంలో పలు దానధర్మాలు, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. రాజశ్రీ బిర్లా ఆదిత్య బిర్లా సంస్థల అధిపతి కుమారమంగళం బిర్లా మాతృమూర్తి రాజశ్రీ బిర్లా. దివంగత ఆదిత్య బిర్లా సతీమణి. బిర్లా కుటుంబంలో చెప్పుకోదగిన పేరు ఆమెది. పరోపకారి అయిన రాజశ్రీ బిర్లా 1995లో భర్త మరణించిన తర్వాత కార్పొరేట్ సామాజిక బాధ్యత, స్వచ్ఛంద సేవా రంగాలలో పనిచేయడం ప్రారంభించారు. కుటుంబ నిధులతో దాతృత్వ సంస్థను కూడా అభివృద్ధి చేశారు. దీంతో ఆమెను భారత ప్రభుత్వం 2011లో పద్మభూషణ్‌తో సత్కరించింది. సూని టాటా దేశం గర్వించదగ్గ పారిశ్రామిక వేత్త రతన్ టాటా తల్లీ పేరు సూని టాటా. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్సెట్జీ టాటా మేనకోడలైన ఆమె అసలు పేరు సూని కమిషారియట్. రతన్ టాటా తన తల్లితో ఎక్కువ సమయం గడపలేదు. తన పదేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తరువాత రతన్ టాటాను అతని బామ్మ నవాజ్‌బాయి టాటా చేరదీసి పెంచారు. ఇందిరా మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా తన తల్లి ఇందిరా మహీంద్రా గురించి తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఆమె తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో పంచుకుంటుంటారు. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించిన ఇందిరా లక్నోలో పెరిగారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. రచయిత్రి అయిన ఆమె తన పేరుతో నాలుగు పుస్తకాలు రాశారు. అలాగే ఒక బాలీవుడ్ సినిమాకు కూడా పనిచేశారు. ఆనంద్ మహీంద్రా ఏటా తన తల్లి జ్ఞాపకార్థం లక్నోలో ఓ సాంస్కృతిక ఉత్సవాన్ని జరిపిస్తారు. -
Mothersday 2023: మాతృమూర్తుల కోసం 24/7 బడ్డీ ప్రోగ్రాం
హైదరాబాద్: మెటర్నిటీ లీవులో ఉన్న ఉద్యోగినుల కోసం మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక బడ్డీ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించినట్లు 24/7 డాట్ఏఐ వెల్లడించింది. ఉద్యోగ విధులకు దూరంగా ఉన్నప్పటికీ సంస్థలో చోటుచేసుకునే పరిణామాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఇలా అప్డేట్గా ఉంచేందుకు సూపర్వైజర్ సూచించిన వారిని లేదా తమకు నచ్చిన వ్యక్తిని సదరు ఉద్యోగిని తమ బడ్డీగా (స్నేహితులు) ఎంచుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే బేబీ అలవెన్సులు, గిఫ్ట్ ఆఫ్ టైమ్, ప్రెగ్నెన్సీ సమయంలో ప్రత్యేక క్యాబ్‌లు తదితర సదుపాయాలను కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
International Mothers Day: ఆలోచింప చేసే అమ్మ కథ
‘అమ్మను మసిగుడ్డలా చూస్తున్నామా?’ అని ప్రశ్నిస్తుందో తెలుగు కథ. ‘ఇంట్లో నుంచి బయటకు పో అని అమ్మను నాన్న ఎందుకు అంటుంటాడు’ అని నిలదీస్తుంది మరో కథ. ‘అమ్మ ఒంటి నిండా మందులు చేరడానికి కారణం ఎవరు?’ అని వేదన చెందుతుంది ఇంకో కథ. ‘అమ్మకు కంటి నిండా నిద్రన్నా ఉంటుందా?’ అని కన్నీరు కారుస్తుంది కథ. ‘మదర్స్ డే’ రోజున అమ్మను తలచుకోవడం, గౌరవించడం అందరూ చేసేదే. కాని ఆమె గురించి ఆలోచించాలి. సరిగా ఆలోచించాలి. ఆమె శ్రమను, గౌరవాన్ని, స్థానాన్ని సమస్థాయిలో ఉంచడం గురించి తెలుగులో వచ్చిన కొన్ని గొప్ప కథల ప్రస్తావన... ఆమె పేరు ఏమిటో ఆమెకు గుర్తు లేదు. భర్త ‘అది’ అంటాడు. ఇంటికి రాగానే ‘అదెక్కడా?’ అని కొడుకును అడుగుతాడు. కొడుక్కు కూడా ‘అది’ అనడం అలవాటే. ‘పిల్లల బాధ నీకెందుకు? అది చూసుకుంటుంది కదా’ అని అంటుంటాడు. ఈ ‘అది’ ఆ ఇంట్లో ఏనాడూ కూచోవడానికి వీల్లేదు. నిలబడి చేస్తూ ఉండాల్సిందే. భర్త రిటైరైనా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు కాబట్టి అతను ఇంట్లో హాయిగా కూచోగలడు. కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తారు. డబ్బు ఉంది. వాళ్లు కూచుంటారు. ఈ ‘అది’కే ఏ సంపాదనా లేదు. ‘నేను తల్లిని కదా’ అనుకుంటుంది. అయితే? ‘నేను అత్తగారిని, నానమ్మని కదా’ అనుకుంటుంది. అయితే? ఇంట్లో ఎవరికీ ఏ విలువా లేదు. ‘అది.. ఇది’ అనడమే. ఒకరోజు ఆమె గేటు దగ్గర నిలబడి ఉంటే ఇద్దరు పనమ్మాయిలు మాట్లాడుకుంటూ వెళుతుంటారు. ఒకమ్మాయి అంటుంటుంది– ‘ఆ ఇంట్లో పని మానేశాను. ఆదివారం కూడా చేయిస్తున్నారు’ అని. విన్న ఆమె దిగ్భ్రమ చెందుతుంది. ఇన్నేళ్లుగా ఇంత చాకిరీ చేస్తున్నా ప్రతిఫలం లేకపోగా చులకనగా చూడటమా? ఉన్నది ఉన్నట్టుగా ఆ పని మనుషుల వెంట నడుస్తుంది. ‘మనలాంటి వాళ్ల కోసం ఒక మేడమ్ మంచి హోమ్ నడుపుతున్నారు. అక్కడ చేర్పిస్తాం. పద’ అని వాళ్లు తీసుకెళ్లి చేర్పిస్తారు. ఆ మేడమ్ ఆమెను పేరు అడుగుతుంది. ఏనాడో మర్చిపోయిన పేరును గుర్తు చేసుకోవడం వల్ల ఆ తల్లి కొత్త అస్తిత్వం, ఆత్మగౌరవం పొందుతుంది. కె.రామలక్ష్మి రాసిన ‘అదెక్కడ’ కథ ఇది. ఇలా ఇంట్లో అమ్మను చూసుకుంటున్నవారు ఉంటే ఈ కథ చెప్పే నీతి ఏమిటో గ్రహించాలి. ఒక ఇంట్లో ఒక తల్లి మరణిస్తుంది. దుప్పటి తీసి చూసిన భర్త అదిరిపోతాడు. ఎందుకంటే ఆమె శరీరం మొత్తం సుద్దముక్కలా తెల్లగా అయిపోయి ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది? ఇదేం వింత జబ్బు? ఆ కాలనీలో ఉన్న ఒక చురుకైన అమ్మాయి ఆ తల్లి ఒంటి నుంచి చిన్న ముక్క తీసి ల్యాబ్‌కు పరిగెత్తి పరీక్ష చేయిస్తే ఆ ముక్క ‘ఆస్ప్రిన్’ టాబ్లెట్ అని తేలుతుంది. అంటే ఆమె శరీరం మొత్తం మందు బిళ్లలతో నిండిపోయిందా? అందుకే సుద్దముక్కలా మారిందా? నిజానికి ఆ చనిపోయినామెకు ‘సూపర్ మామ్’ అని పేరు. పిల్లల్ని బాగా పెంచేది. భర్తను బాగా చూసుకునేది. ఇల్లు బాగా పెట్టుకునేది. పైగా ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేసేది. పిల్లల్ని చదివించి, ప్రయోజకుల్ని చేసి, అమెరికా సంబంధాలు చూసి సెటిల్ చేసి... ఇన్ని చేసి అందరి ప్రశంసలు పొందిన ఆమె కొన్ని విషయాలు దాచింది. ఏమిటవి? ఆఫీసు పని వొత్తిడితో రోజూ ఒక తలనొప్పి మాత్ర వేసుకునేది. ఇంటి పనులకు ఆటంకం రాకుండా ఒళ్లు ఏమాత్రం వెచ్చబడినా ఒక మాత్ర వేసుకునేది. శుభకార్యాలకు అడ్డు రాకుండా నెలసరిని వెనక్కు నెట్టడానికి మాత్రలు వేసుకునేది. గర్భసంచి తీయించేస్తే సప్లిమెంట్లు తెగ మింగింది. హార్మోనల్ ఇంబేలెన్స్ అంటే అందుకు మళ్లీ మందులు. అనారోగ్యం గురించి చెప్పి భర్తను, పిల్లల్ని డిస్ట్రబ్ చేయకుండా ఏ ఇబ్బంది వచ్చినా మాత్రలే మాత్రలు. అందుకే మరణించగానే ఒళ్లు అలా తెల్లబడింది. తేలిపోయింది. ఇది అర్థమయ్యాక, ఆమె సూపర్‌మామ్ సిండ్రోమ్‌తో మరణించిందని అర్థమయ్యాక ఆ కాలనీ అమ్మాయి తన తల్లి దగ్గరకు పరిగెడుతుంది. ‘అమ్మా... నువ్వు గొప్పల కోసం నిన్ను నువ్వు బలిపెట్టుకోకు. కొద్దిగానే పని చెయ్. విశ్రాంతి తీసుకో. ఆరోగ్యం మెరుగు పర్చుకో’ అని చెప్పడానికి. కె.సత్యవతి రాసిన ‘సూపర్‌మామ్ సిండ్రోమ్’ ఇస్తున్న సందేశం అర్థమైందిగా. ఒక భర్త భార్య మీద కోపం వచ్చిన ప్రతిసారీ ‘పో నా ఇంటి నుంచి’ అంటుంటాడు. అది అతని ఊతపదం. ఏ ఇల్లయినా భర్తదే. భార్యది కాదు. తండ్రిదే. తల్లిది కాదు. అందుకే భర్తలు భార్యల్ని ఇంటి నుంచి గెంటేస్తుంటారు. లేదా గెంటేస్తానని బెదిరిస్తుంటారు. పిల్లల్ని కన్నా, పొదుపు చేసి ఆ డబ్బు భర్త చేతిలో పెట్టినా, ఇల్లు దగ్గరుండి కట్టించినా, అందులో సంసారం చేసినా ఆ ఇల్లు మాత్రం ఆమెది కాదు. అతనిదే. ఒకరోజు ఆమెకు చివుక్కుమంటుంది. ఇంటి నుంచి రెండు మూడు చీరలతో బయటపడి దూరంగా ఒక గది అద్దెకు తీసుకుంటుంది. చిన్న ఉద్యోగం వెతుక్కుంటుంది. స్టవ్వు గివ్వు పెట్టుకుని ఇంకెవరూ తనని బెదిరించ లేని తన ఇంట్లో ఉంటుంది. దాంతో ఆ భర్త తెగ కంగారు పడిపోతాడు. కాలనీ కంగారు పడుతుంది. బంధువులు కంగారు పడతారు. కాని ఆమె మాత్రం ‘అతడికి విడాకులు ఇవ్వను. కావాలంటే నా దగ్గరకు వచ్చి నా ఇంట్లో ఉండమనండి‘ అని వర్తమానం పంపుతుంది. ఏం కథ ఇది. ఏ ఇంట్లో అయినా అమ్మ ఈ మూడ్‌లో ఉందేమో ఎవరు గమనించాలి? ఇది కవన శర్మ ‘ఆమె ఇల్లు’ కథ. పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ కథ ఉంటుంది. అందులో ఒకామె అందరూ జేబు రమణమ్మ అని పిలుస్తూ ఉంటారు. దాని కారణం ఆమె తన బాల్యంలో తల్లి ప్రతి రూపాయి కోసం తండ్రి దగ్గర చేయిజాస్తూ ఉండటమే. అలా తాను ఉండకుండా తన రవికకో, చీర కుచ్చిళ్లకో ఒక జేబు ఉండాలని భావిస్తుందామె. అలా జేబులాంటి గుడ్డ సంచిని దోపుకునే బతుకుతుంది. పసుపు కుంకాలుగా కోడలు తెచ్చిన భూమిని భర్త, కొడుకు అమ్మబోతే వారించి ‘అది కోడలి ఆర్థిక భద్రత కోసం ఉండాలి’ అని గట్టిగా నిలబడుతుంది. అమ్మకు ఉండాల్సిన ఆర్థిక స్వాతంత్య్రం గురించి ఆర్థిక గౌరవం గురించి ఆలోచిస్తున్నామా మనం. ‘మసిగుడ్డ’ లేకుండా వంట చేయడం అసాధ్యం. కాని మసిగుడ్డకు ఏ విలుగా ఉండదు. పిల్లల్ని తల్లి పెంచుతుంది. కాని ప్రోగ్రెస్ కార్డ్ మీద తండ్రి సంతకం చేస్తాడు. పిల్లలకు తల్లి ఒండి పెడుతుంది. కాని పిల్లలు వెచ్చాలకు డబ్బులిచ్చే తండ్రినే గౌరవిస్తారు. బంధువులు శుభలేఖ ఇస్తూ దానిపై అతని పేరే రాస్తారు. ఆస్తిపన్ను, కరెంటు బిల్లు, ఇంటి గడపకు నేమ్‌ప్లేట్ అన్నీ అతనివే. ఆమె మసిగుడ్డ. కాని అది లేకపోతే ఏ పనీ జరగదు. కుప్పిలి పద్మ రాసిన ‘మసిగుడ్డ’ కథ ఇది. కిచెన్‌లోకి నేడు వెళ్లి చూసినా అమ్మ పాత జాకెట్టే మసిగుడ్డగా కనిపిస్తుంది. నాన్న పాత చొక్కా కాదు. అమ్మకు గౌరవం ఇవ్వలేమా? బతికినంత కాలం ఇంటి చాకిరీలో పడి, తెల్లవారుజామునే లేస్తూ, రాత్రి లేటుగా వంట గది సర్దుకుని పడుకుంటూ, చంటి పిల్లల వల్ల, వృద్ధులైన అత్తమామల వల్ల, వేరే సవాలక్ష బాధ్యతల వల్ల కంటి నిండుగా నిద్రపోని ఒక తల్లి తనకు నిద్ర కావాలని, కనీసం ఈ వృద్ధాప్యంలో అయినా హాయిగా నిద్రపోవాలని గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. కంటి నిండా నిద్ర పోయే ‘లగ్జరీ’ ఇవాళ్టికీ అమ్మకు ఉందా? అమ్మ గురించి మదర్స్ డే సందర్భంగా ఆలోచిద్దాం. అమ్మను మొదట మనిషిగా చూస్తే, వ్యక్తిగా చూస్తే, పౌరురాలిగా చూస్తే ఆమె హక్కులు అర్థమవుతాయి. ఆ హక్కులు ఆమెకు మిగల్చడమే అందరి విధి. -
రెండేళ్లుగా ఫ్రిజ్లోనే తల్లి శవం..కన్న కూతురికి కూడా తెలియకుండా..
యూఎస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తల్లి చనిపోయినా.. బయటకు పొక్కనీకుండా కూతురు అత్యంత రహస్యంగా ఉంచింది. దీంతో పోలీసులు ఆమె అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని చికాగోలో ఇల్లినాయిస్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం..ఎవా బ్రాచర్ అనే 60 ఏళ్ల మహిళ తన 96 ఏళ్ల తల్లి రెజీనా మిచాల్స్కీ రెండేళ్ల క్రితమే చనిపోయింది. అయితే ఆ విషయం బయటకు పొక్కనీయకుండా అత్యంత జాగ్రత్తపడింది. ఆమె ఇల్లినాయిస్లోని రెండు అంతస్తుల అపార్ట్మెంట్ భవనం సెల్లార్‌లోని డీప్ ప్రీజ్‌లో ఆమె తల్లి మృతదేహాన్ని కనుగోన్నారు చికాగో పోలీసులు. ఈ మేరకు పోలీసు కేసు నమోదు చేసి బ్రాచర్‌ని అదుపులో తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో ఆమె తల్లి పేరుతో తప్పుడు ఐడీని కలిగి ఉన్నట్లు కౌంటీ అసిస్టెంట్ స్టేట్ అటార్నీ మైఖేల్ పెకారా చెప్పారు. అంతేగాదు బ్రాచర్ తన తల్లి చనిపోవడానికి రెండు సంవత్సరాల క్రితమే డీప్ ఫ్రీజర్‌ని కోనుగోలు చేసినట్లు ఉన్న రసీదును కూడా ఆమె నివాసం వద్ద కనుగొన్నట్లు తెలిపారు. అసలు ఎందుకలా ఆమె తన తల్లి మరణం గురించి ఎవరికీ తెలియకుండా దాచి ఉంచిందన్న విషయంపై విచారించడం ప్రారంభించారు పోలీసులు. ఒకవేళ తన తల్లి మరణం దాచడం ద్వారా ఎవా బ్రాచర్ పొందే సామాజిక భద్రతా ప్రయోజనం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బ్రాచర్ కూతురు సబ్రినా వాట్సన్ తన తల్లికి ఎవరీ పట్ల ప్రేమ ఉండదని, ఆఖిరికీ తనమీద కూడా ఉండదంటూ కన్నీటి పర్యతమయ్యింది. కనీసం ఆమెకు మానవత్వం కూడా లేదంటూ.. అమ్మమ్మ మిచాల్స్కీ తలుచుకుంటూ విలపించింది. (చదవండి: ఓరి దేవుడా! అది బస్సా! ఇంకేదైననా? ఆ స్థితిలో కూడా ఏం రేంజ్లో వెళ్తోంది) -
పుతిన్‌కి భంగపాటు.. అస్సలు ఊహించి ఉండడు!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న రష్యా సైనికుల తల్లులు, భార్యలు.. ఆయన్ని నిలదీసే పరిస్థితికి చేరుకున్నారు. తమ వాళ్ల పేరిట కుటుంబాలకు ఇచ్చిన భద్రత హామీల అమలు ఏమయ్యిందంటూ, తమకు సమాధానం చెప్పాలంటూ ఆయన్ని నిలదీస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలై తొమ్మిది నెలలు పూర్తైంది. కానీ, ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని వాళ్లు సోషల్ మీడియా సాక్షిగా పుతిన్‌ను నిలదీస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. రష్యా సైనికుల కుటుంబ సభ్యులతో పుతిన్ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సమయంలోనే కొందరు కుటుంబ సభ్యులు వీడియో పోస్టులు అక్కడి సోషల్ మీడియాలో పెడుతుండడం గమనార్హం. కొన్ని కుటుంబాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసు. అది ఊహించే ఈ సమావేశానికి వాళ్లను దూరంగా ఉంచారు. కేవలం అధ్యక్షుడు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు కొన్ని కుటుంబాలను మాత్రమే ఆ సమావేశానికి ఆహ్వానించారు అని రష్యా ఉద్యమవేత్త ఓల్గా సుకనోవా అంటున్నారు. ఆమె తన 20 ఏళ్ల కొడుకు ఉక్రెయిన్ యుద్దంలో పాల్గొనడం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే.. సమారా నగరం నుంచి వోల్గా నది వెంట 900 కిలోమీటర్లు ప్రయాణించి మరీ క్రెమ్లిన్‌కు చేరుకుంది. అలాగే కొందరు మహిళలు.. పుతిన్ ముందర ఫిర్యాదులు చేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడి ఫిర్యాదు చేయలేదని ఆమె అంటున్నారు. అత్యవసరంగా తమ వాళ్లను యుద్ధం రొంపిలోకి దింపిన అధ్యక్షుడు పుతిన్.. చేసిన వాగ్దానాలను నెరవేర్చాలంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు రష్యా సైనికుల కుటుంబ సభ్యులు. యుద్ధ సమయంలో సైనికుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక అలవెన్సులతో పాటు జీవిత బీమా, పిల్లలకు చదువులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని హామీలు ఇచ్చింది క్రెమ్లిన్. అంతేకాదు యుద్ద కాలంలో వాళ్లతో మాట్లాడించేలా ఏర్పాట్లు కూడా చేయిస్తామని తెలిపింది. కానీ, వాటి విషయంలో ఎలాంటి పురోగతి లేదు. మరోవైపు సెప్టెంబర్‌లో ఉక్రెయిన్ యుద్ధం కోసం లక్షల మంది కావాలంటూ ప్రకటన ఇచ్చి.. అన్ని వయస్కుల వాళ్లను బలవంతపు శిక్షణకు ఆదేశించింది. అయితే.. అందులో వృద్ధులు, పిల్లలు సైతం ఉండడంతో నాలుక కర్చుకున్న క్రెమ్లిన్ వర్గాలు.. ప్రకటనలో పొరపాటు దొర్లిందంటూ సవరణ ప్రకటన ఇచ్చాయి. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ఎలా పుట్టిందో తెలుసా? -
అమ్మ మరిచిన పాట
పక్క ఫ్లాట్‌లో పాపాయి పుట్టింది. బుజ్జిగా ఉండుంటుంది. కళ్లు తెగ తెరిచి తల్లిని చూస్తూ ఉండుంటుంది. పాలు సరిపోతుండొచ్చు. గుండెలకు హత్తుకుని ఇచ్చే వెచ్చదనం సరిపోతుండొచ్చు. అయినా సరే కయ్‌మని ఏడుస్తుంది. నేను ఏడుస్తున్నానహో అని చెప్పడానికి ఏడుస్తున్నట్టుంది. నాకేదో కావాలహో అని చెబుతున్నట్టు ఏడుస్తుంటుంది. అమ్మకు పాతికేళ్లుంటాయి. ఎత్తుకుని సముదాయిస్తుంది. అటూ ఇటూ తిప్పుతూ ఊరుకోబెడుతుంది. పాపాయి ఏడుపు ఆపదే! బహుశా అమ్మ పాడాలేమో! యుగాలుగా తల్లులందరూ పసికందుల కోసం మనోహరమైన గాయనులై ఎత్తే గొంతును ఆ తల్లి కూడా ఎత్తాలేమో! ‘ఆయి ఆయి ఆయి ఆపదలు కాయీ’. ఆహా. ఒకప్పుడు ఏ అమ్మయినా ఈ పాట అందుకుంటే పసినోరు ఠక్కున మూతపడేది. గొంతులో లయ ఊయల ఊపుతున్నట్టుండేది. ఏదమ్మా... మళ్లొకసారి పాడు అన్నట్టుగా పాపాయి మెడ కదిలించేది. ‘ఆయి ఆయి ఆయీ... ఆపదలు కాయీ’. చిట్టి బంగారు తల్లికి ఏ ఆపదలూ రాకూడదు. ఈ బంగరు బుజ్జాయి బొజ్జ నిండా పాలు తాగి, కంటి నిండా కనుకు తీయాలి. వివశుల్ని చేసే చిర్నవ్వు నిదురలో నవ్వాలి. గుప్పిళ్లు బిగించాలి. ఉత్తుత్తికే ఉలికి పడాలి. అందుకు తల్లి ఏం చేయాలి? పాడాలి. ‘ఏడవకు కుశలవుడ రామకుమార... ఏడిస్తె నిన్నెవ్వరెత్తుకుంటారు?’ సీతాదేవి పాడకుండా ఉందా? అడవిలో తావు కాని తావులో, లోకుల మధ్య ఇద్దరు కుమారులను కని, వారికి సర్వం తానై, వారు ఒడిలో ఉంటే అదే పెన్నిధిగా భావించి, ఆ కారడవిలో, రాత్రివేళ, ఏనాడైనా దడుపు వల్లో కలత చేతో ఏడిస్తే సీత పాడకుండా ఉందా? ‘ఉంగరమ్ములు కొనుచు ఉయ్యాల గొనుచు ఊర్మిళా పినతల్లి వచ్చె ఏడవకు. పట్టు అంగీ గొనుచు పులిగోరు గొనుచు భూదేవి అమ్మమ్మ వచ్చె ఏడవకు’. సీతాదేవి పాడుతున్నదా? పిల్లలకు తన సొద చెప్పుకుంటున్నదా? ఆశను వారిలో సజీవంగా ఉంచు తున్నదా? ఏమో! పాడటం మాత్రం మానలేదు. వాళ్ల నాన్న విన్న పాటను తిరిగి వల్లెవేయక ఉండ లేదు. ‘రామా లాలీ మేఘ శ్యామా లాలి... తామరస నయన దశరథ తనయా లాలీ’... తల్లి గొంతు ఎలా ఉంటే ఏమి? బిడ్డ కోసం పాడితే అందులోకి అమృతం వచ్చేస్తుంది. వాత్సల్యపు తేనె తొర్లి పడుతుంది. నా పంచప్రాణాలు నీవే కన్నా అనే భావం మాటలు రాని చిట్టిగుండెకు గట్టిగా చేరుతుంది. పాపాయికి అది కావాలి. పసివాడికి ఆ మాట చెవిన పడాలి. అందుకై చెవి రిక్కిస్తుంది ఒడిలో ఉండే కలువమొగ్గ. ‘జో అచ్యుతానంద జోజో ముకుంద.. రార పరమానంద రార గోవింద’... వింటుంటే నిద్రాదేవి బింకం చెదిరేలా లేదూ! అయ్యో తల్లి... నీ బిడ్డను చేరి హాయిగా నిద్ర పుచ్చుతాలే అని బెట్టు తీసి గట్టున పెట్టేట్టు లేదూ!! శ్రీమంతుల ఇంట్లో వారసుడు పుట్టాడట. సంగీతం వినిపించే ఖరీదైన ఆట వస్తువులు కొంటారు. యూట్యూబ్‌లో జింగిల్స్ వినిపిస్తారు. మధ్యతరగతి ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందట. కొత్త గౌన్లు కొంటారు. బంగరు దండ వేస్తారు. ఏడ్చిన ప్రతిసారీ పాలకే అని భ్రమసి ఎదను నోటికంది స్తారు. పేదవాడి గుడిసెలో ముత్యాలమూట ఒడిలోకొచ్చి పడిందట. ముద్దులు పుణుకుతారు. కంటి మీద రెప్పేయక కాచుకుంటారు. ఏడుస్తూ ఉంటే అగ్గిపెట్టె మీద దరువేసి వినిపిస్తారు. తెలుగు ఉంది మనకు. భాష ఉంది మనకు. రాగం ఉంది, పసికందుల నిదురకై భావం ఉంది మనకు. పాడమని చెప్పారు పెద్దలు పిల్లల కోసం. పాటలు అందించి వెళ్లారు పిల్లల కోసం. తల్లిపాలు పోయి పోత పాలు వచ్చె. లాలిపాట పోయి హోరుపాట వచ్చె. పిల్లలకు తెలుసు ఇది బాగలేదని. అందుకే ఏడుస్తారు. తల్లికి అమ్మమ్మ పాట ఇవ్వలేదు. తల్లి తనకు పుట్టిన బిడ్డకు పాట ఇవ్వబోదు. లాలిపాట అదృశ్యమయ్యే నేలా మనది? ‘నిద్ర నీ కన్నుల్లు మబ్బు మొగముల్లు నిద్రకూ నూరేళ్లు నీకు వెయ్యేళ్లు... నిన్ను గన్నయ్యకూ నిండు నూరేళ్లు... జో జో’.... తల్లి బిడ్డతో చేసే తొలి సంభాషణ లాలిపాట. బిడ్డ జీవితంలో సంగీ తాన్ని తొలిగా ప్రవేశపెట్టేదే లాలిపాట. శ్రుతి తప్పని జీవితాన్ని కాంక్షించేదే లాలిపాట. ఒంటరితనం మిగిలినప్పుడు పాటను తోడు చేసుకొమ్మని ఉపదేశం చేసేదే లాలిపాట. సర్వం సంగీతమయమైన ఈ జగత్తులో బిడ్డకు స్వాగతం పలికేదే లాలిపాట. కాని తల్లి గొంతు ఫోన్లో బిజీ. తల్లి గొంతు ఏదో పని పురమాయింపులో బిజీ. తల్లి గొంతు ఇరుగు పొరుగు పలకరింపుల్లో బిజీ. బిడ్డ పుడితే చేయవలసిన సాంగేలు అనేకం పోయాయి. బిడ్డ పుడితే హాజరు కావాల్సిన బంధుమిత్రులు ముఖం చూపించలేనంత బిజీగా ఉన్నారు. చీటికి మాటికి వచ్చి ఆ చిట్కా, ఈ విరుగుడు చెప్పే ముసలమ్మలు సొంతింట, పరాయింట కాన రావడం లేదు. దిష్టి చుక్కలు, సాంబ్రాణి ధూపాలు లేవు. గోరువెచ్చని నీళ్లతో కాళ్లన బోర్లించి స్నానం చేయించి ఇచ్చే అమ్మలక్కలు లేరు. సంస్కృతి అంటే ఏమిటి? అది ఏదో మహా విగ్రహాల్లో, అపూర్వ ఉత్సవాల్లో ఉండదు. కుటుంబంలో నిబిడీకృతం అయ్యే చిన్నచిన్న ఆనందాల్లో, ముచ్చట్లలో ఉంటుంది. ముగ్గు, మామిడి తోరణం లేనిది కూడా ఇల్లే. కాని అవి రెండూ ఉన్న ఇల్లు తెలుగుదనపు ఇల్లు. ఏడుపు ఆపి, పిల్లలు బుల్లి పెదాలు విప్పి, భలే నవ్వాలి. ఇంటింటా బిడ్డ కోసం పాడి తల్లి ఆవులించాలి. ‘ఏడవకు ఏడవకు వెర్రి నాగన్న... ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు... నీలాలు కారితే నే చూడలేను... పాలైన కారవే బంగారు కళ్లు...’. -
Shikha Khanna: నూరు తల్లుల కథ
31 ఒక్క దేశాలు. 100 మంది తల్లులు. వారు టీచర్లు, సైంటిస్ట్‌లు, క్రీడాకారులు, సంగీతకారులు, మహిళా సైనికులు... రంగాలు వేరు. కాని మాతృత్వం ఒకటే. ఒక మహిళ నిర్వహించే అత్యుత్తమ కర్తవ్యం తల్లి కావడం. అందుకు ప్రతి తల్లీ ఒక భిన్న ప్రయాణం చేస్తోంది. ఆ తల్లుల గాధలు అందరికీ తెలియాలి అని భావించిన ప్రసిద్ధ పోర్ట్రయిట్ ఫొటోగ్రాఫర్ శిఖా ఖన్నా వందమంది తల్లుల ఫొటోలు, ఇంటర్వ్యూలతో ‘100 సెల్ఫ్పోర్ట్రయిట్స్ 100 డ్రీమ్స్’ పేరుతో పుస్తకం తెస్తోంది. ఈ సందర్భంగా వచ్చే వారం పూణెలో ఈ వందమంది తల్లులు ఒక వేదిక మీదకు రానున్నారు. ఈ ఘట్టం తల్లి గొప్పదనాన్ని చాటనుంది. ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసే ఒక తల్లికి లడాఖ్‌లో డ్యూటీ. ఆ సమయానికి ఆమెకు రెండేళ్ల పాప ఉంది. దూరాన వదల్లేదు. లడాఖ్‌లో ప్రతికూల వాతావరణంలో పెంచడం రిస్క్. ఉద్యోగమా... మాతృత్వమా? ఏం... రెండూ ఎందుకు చేయకూడదు. ఆమె తన రెండేళ్ల కూతురిని లడాఖ్ తీసుకెళ్లింది. ఒకవైపు డ్యూటీ చేస్తూనే మరోవైపు కూతురిని పెంచింది. ఆ తల్లి ఆ సవాలును ఎలా స్వీకరించి దాటిందో ఆ కథ తెలిస్తే ఎలా ఉంటుంది? ఒక తల్లి అంధురాలైన కళాకారిణి. అంధత్వంతో కళలో సాగడమే ఒక కష్టమైతే తల్లిగా బాధ్యతలు నెరవేర్చడం ఇంకా కష్టం. కాని ఆ తల్లి ఆ బాధ్యతను నెరవేర్చింది. అందుకు ఏ యే ఇక్కట్లను దాటింది? ఆమె నోటి గుండా వింటే ఎంత బాగుంటుంది? ఒక తల్లి క్రీడల్లో కొనసాగాలి. దేశాలు తిరగాలి. మరోవైపు పిల్లలు. ఆటల కోసం వ్యాయామానికి, ప్రాక్టీసుకు సమయం ఇవ్వాలి. మరోవైపు పిల్లలకూ ఇవ్వాలి. ఎంత ఒత్తిడి. ఏదో ఒకటి ఎంచుకొని రెండోది వదిలేయకుండా రెంటినీ నిర్వహించడంలోనే ఆ తల్లి గొప్పదనం ఉంది. ఆ కథ లోకంలో ఎందరికి తెలుసు? తల్లులు ఇంటి పట్టునే ఉన్నా, కెరీర్లో ఉన్నా పిల్లల పెంపకం కోసం ఎనలేని త్యాగాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. పిల్లల కోసం స్వార్థమెరుగని అంకితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా వివిధ రంగాల్లో ఉంటూ ఆ రంగాల్లో తమదైన విజయాన్ని నమోదు చేస్తూ కూడా పిల్లల పెంపకంలో ఏ వంకా వదలని తల్లులు తమ జీవితాలను తమ మాటల్లో చెప్తే కచ్చితంగా ఈ కాలం తల్లులకు, కాబోయే తల్లులకు స్ఫూర్తిగా ఉంటుంది. మగవారు వాటిని వింటే తల్లులకు ఇవ్వాల్సిన స్థానం, గౌరవం మరింత విశదం అవుతుంది. ఆ ఆలోచనతోనే ఫొటోగ్రాఫర్ శిఖా ఖన్నా ‘ఎంయుఎం’ (మదర్స్ యునైటెడ్ మూవ్మెంట్) అనే ప్రాజెక్ట్ మొదలెట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ‘100 సెల్ఫ్ పోర్ట్రెయిట్స్ 100 డ్రీమ్స్’ అనే పుస్తకాన్ని తెచ్చింది. ఆ పుస్తకంలో తల్లుల జీవన గాథలు వారి మాటల్లోనే రికార్డు చేసింది. 31 దేశాల నుంచి 100 మంది తల్లులు– వారంతా తమ తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నవారు... వృత్తిలో విజయం సాధిస్తూనే తల్లిగా కూడా విజయం సాధించినవారు– తమ అనుభవాలను ఈ పుస్తకంలో చెప్పారు. భారతదేశం నుంచి అథ్లెట్ అశ్వినీ నాచప్ప, పారా అథ్లెట్ దీపా మాలిక్ తదితరులు ఉన్నారు. ఇతర దేశాల నుంచి టీచర్లుగా, మ్యూజిక్ టీచర్లుగా, లైఫ్‌స్టయిల్ కోచ్‌లుగా, గాయనులుగా, హక్కుల ఉద్యమకారులుగా, చెఫ్‌లుగా, ఫొటోగ్రాఫర్లుగా వివిధ రంగాలలో కొనసాగుతున్న తల్లులు ఉన్నారు. ‘తల్లి గొప్పదనం ఎంత చెప్పినా తక్కువే. ఈ పుస్తకం ఆమెను మరింత ఉన్నతంగా ఉంచుతుంది’ అంటుంది శిఖా ఖన్నా. స్వయంగా ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ అయిన శిఖా భారతదేశంలో న్యూబోర్న్ బేబీల ఫొటోగ్రఫీని తొలిగా ప్రవేశ పెట్టింది. దాదాపు 1000 ప్రముఖ కుటుంబాల ఫొటోలు తీసిందామె. అంతే కాదు యువతరం కోసం ఆన్లైన్లో ఫొటోగ్రఫీ క్లాసులు తీసుకుంటూ ఉంటుంది. తను తల్లయ్యాక ఫొటోగ్రాఫర్/ తల్లిగా రెండు పాత్రలు పోషించడంలో తానెంత ఫోకస్డ్గా ఉండాల్సి వచ్చిందో అర్థమయ్యాక ఇలా పని చేసే తల్లుల కథలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి కదా అనిపించింది. పిల్లలు పుట్టగానే చాలామంది తల్లులు తమకు ఎంతో ఇష్టమైన వృత్తిని, ఉపాధిని, హాబీని వదిలేస్తుంటారు. అలాంటి వారు ఒక ధైర్యం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం తెచ్చిందామె. పూణెలో నవంబర్ 11 నుంచి 13 తేదీల మధ్య జరిగే ఈవెంట్లో ఈ 100 మంది తల్లులు వచ్చి నేరుగా ప్రేక్షకులతో మాట్లాడనున్నారు. స్త్రీల మాతృత్వానికి, జీవన రంగానికి సంబంధించిన అనేక సెషన్స్ జరగనున్నాయి. అలాగే ఈ పుస్తకం ఆవిష్కరణ కూడా జరగనుంది. ప్రధాని మెచ్చుకుని ఈ ఈవెంట్ విజయవంతం కావాలని సందేశం పంపారు. ఈ ఈవెంట్లో పాల్గొనే తల్లులకు శుభాకాంక్షలు. తల్లులు ఇంటి పట్టునే ఉన్నా, కెరీర్లో ఉన్నా పిల్లల పెంపకం కోసం ఎనలేని త్యాగాలు చేస్తూనే ఉంటారు. ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. పిల్లల కోసం స్వార్థమెరుగని అంకితాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలా వివిధ రంగాల్లో ఉంటూ ఆ రంగాల్లో తమదైన విజయాన్ని నమోదు చేస్తూ కూడా పిల్లల పెంపకంలో ఏ వంకా వదలని తల్లులు తమ జీవితాలను తమ మాటల్లో చెప్తే కచ్చితంగా ఈ కాలం తల్లులకు, కాబోయే తల్లులకు స్ఫూర్తిగా ఉంటుంది. మగవారు వాటిని వింటే తల్లులకు ఇవ్వాల్సిన స్థానం, గౌరవం మరింత విశదం అవుతుంది. -
మదర్ హీరోయిన్ను తెరపైకి తెచ్చిన పుతిన్
మాస్కో: ప్రపంచ జనాభా తగ్గిపోతోంది.. ఇప్పుడు ఇది ఒక ఆందోళనకరమైన అంశంగా సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు.. జనాభాను పెంచే మార్గాలపై దృష్టిసారించాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం రష్యా జనాభాను పెంచేందుకు ఓ పథకం తీసుకొచ్చి.. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాడు. పదేసి మంది పిల్లలను కని.. వాళ్లను పెంచే తల్లులకు నగదు నజరానా ప్రకటించాడాయన. మదర్ హీరోయిన్.. పుతిన్ నేతృత్వంలో ప్రభుత్వం రష్యాలో తీసుకొచ్చిన పథకం పేరు. ఈ పథకం ప్రకారం.. పది మంది పిల్లలను కని.. వాళ్లను సురక్షితంగా పెంచాల్సి ఉంటుంది తల్లులు. అలా చేస్తే.. వన్ మిలియన్ రూబుల్స్(మన కరెన్సీలో 12 లక్షల 92 వేల రూపాయల)తో పాటు మదర్ హీరోయిన్ గౌరవం ఇచ్చి గౌరవిస్తారు. ఈ విషయాన్ని రష్యా రాజకీయ, భద్రతా దళ నిపుణుడు డాక్టర్ జెన్నీ మాథర్స్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సోమవారం పుతిన్ సంతకాలు చేసినట్లు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఒక ప్రకటనలో పేర్కొంది. తగ్గిపోతోంది.. గత రెండున్నర దశాబ్దాలుగా.. రష్యా జనాభా ఆందోళనకరంగా పడిపోతోంది. పైగా కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లాంటి తాజా పరిణామాలతో జనాభా సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ఈ సంక్షోభం బయటపడేందుకు పుతిన్ తాజా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు మాథర్స్ తెలిపారు. అయితే.. కొత్తదేం కాదు.. పుతిన్ సంతకం చేసిన ‘మదర్ హీరోయిన్’ ఆదేశాలు కొత్తవేం కాదు. గతంలోనూ ఉన్నాయి. ఇంతకు ముందు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ నేత జోసెఫ్ స్టాలిన్.. యుద్ధంలో మరణించిన వాళ్ల సంఖ్యతో జనాభా తగ్గిపోగా ‘మదర్ హీరోయిన్’ రివార్డును ప్రకటించాడు. ఆ స్కీమ్ అప్పట్లో బాగా వర్కవుట్ అయ్యింది. జనాభా క్రమేపీ పెరుగుతూ పోయింది. అయితే.. 1991 సోవియట్ యూనియన్ పతనంతో ఈ టైటిల్ ఇవ్వడం కూడా ఆగిపోయింది. ఇదిలా ఉంటే.. పుతిన్ ‘దేశభక్తి’ ప్రయత్నాలు వర్కవుట్ అయ్యేవి కావని డాక్టర్ మాథర్స్ అంటున్నారు. ఎందుకంటే.. పదవ బిడ్డ పుట్టిన తర్వాతే అదీ మిగతా తొమ్మిది మంది బిడ్డల ఆరోగ్య స్థితి బాగా ఉంటేనే ఈ ప్రైజ్ మనీని, మదర్ హీరోయిన్ ట్యాగ్‌ను సదరు తల్లికి అందిస్తారు. దీంతో ఆ ప్రైజ్ మనీ కోసం అంతమంది పిల్లలను పోషించడం.. కుటుంబాలకు భారం కావొచ్చనే చర్చ నడుస్తోంది అక్కడ. అప్పటి, ఇప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు బేరీజు వేసుకుంటే.. మదర్ హీరోయిన్ ఇప్పుడు విఫలం కావొచ్చనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: కొలీగ్ కౌగిలించుకోవడంతో కోర్టుకెక్కింది! -
ఉక్రెనియన్ తల్లుల ఆవేదన...తమ పిల్లలైన బతికి ఉండాలని..
Ukrainian families who fear they will be killed by Russian Forces: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజులకు దాడి కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ని తలవంచకపోయేసరికి ఆగ్రహంతో రష్యా బలగాలు ఊహించని విధంగా పౌరులపై కాల్పుల జరిపి నరమేథానికి పాల్పడుతున్నాయి. ఇప్పటికే బుచా నగరాన్ని శవాల దిబ్బగా మార్చేసింది. అదీగాక రష్యా బలగాలు ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉక్రెయిన రాజధాని కైవ్‌కి సమీపంగా వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ కుటుంబాల్లో భయాలు మొదలయ్యాయి. తాము రష్యాన్ దళాల చేతిలో హతమైతే తమ పిల్లలు బతికి క్షేమంగా ఉండాలని వారి శరీరాలపై ఫోన్ నెంబర్లతో సహా కుటుంబ వివరాలను రాస్తున్నారు. ఆ ఘటనలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఉక్రెయిన్‌లోని ఒక బాలిక తల్లి సాషా మకోవియ్ ఇలానే తన కూతురు శరీరంపై కుటుంబ వివరాలను రాసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు తమకు ఏమైన అయితే తమ పాపను మంచిగా చూసుకోవాలనే ఆశతో ఇదంతా చేస్తున్నట్లు వివరించింది. అంతేగాదు గత నెలలో యుద్ధం మొదలైనప్పుడు వేలాది మంది పౌరులు ఉక్రెయిన్ సరిహద్దులకు దాటి వెళ్లారు. ఈ క్రమంలో ఒక పదేళ్ల బాలుడు తన తల్లి ఇచ్చిన చిన్న కాగితం ముక్కతో ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలాండ్ సరిహద్దుకు చేరిన ఉదంతం తెలిసిందే. రష్యన్ బలగాల దాడులకు భయపడి పారిపోతున్న పిల్లలను, పౌరులను మావన కవచాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపణ వెలువెత్తాయి. అంతేకాదు నోవీ బైకివ్ గ్రామంలో యుద్ధ ట్యాంకుల ముందు బస్సులలో పిల్లలను ఉంచుతున్నారని నివేదిక పేర్కొంది. పుతిన్ అరాచకాలకు అంతేలేకుండా పోతుందంటూ ప్రపంచ దేశాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాదు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఈ దాడులన ఖండించడమే కాకుండా పుతిన్‌ని యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు. Ukrainian mothers are writing their family contacts on the bodies of their children in case they get killed and the child survives. And Europe is still discussing gas. pic.twitter.com/sK26wnBOWj — Anastasiia Lapatina (@lapatina_) April 4, 2022 (చదవండి: యజమాని కోసం నిరీక్షిస్తున్న కుక్క!) -
ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్ డ్రైవ్
సాక్షి, అమరావతి: ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు ఆదివారం వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్ వేవ్‌పై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ నెలాఖరుకు 12 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 10 వేల డి టైప్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఏపీలో 113 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు ఫైనల్ చేశామని పేర్కొన్నారు. థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో 6151 ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని సింఘాల్ తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని సింఘాల్ తెలిపారు. ఈనెల 21 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇచ్చామని.. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉధృతి నేపథ్యంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 400 ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 70 శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నామని సింఘాల్ వెల్లడించారు. చదవండి: ఏపీలో కొత్తగా 6,341 కరోనా కేసులు Covid Time: నేస్తమా.. నువ్వచట కుశలమా..! -
ఏ చట్టమైనా ఇంటి స్త్రీని రక్షించాలి..
చనిపోయినవారు బతికున్నవారితో కలిసి ఒకేచోట చేరడం ఢిల్లీలో జరిగింది. పంజాబ్‌లోని దాదాపు 2000 మంది వితంతువులు ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పసుపుపచ్చటి దుపట్టాలు తలపై కప్పుకుని పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో ఫొటోలే. భర్తలవి. తండ్రులవి. కుమారులవి. అన్నీ బాగుంటేనే ఇంత మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.. ఈ కొత్త చట్టాల వల్ల ఇంకా ఎంతమంది వితంతువులను తయారు చేస్తారు మీరు? అని వారు ప్రశ్నించారు. వితంతువులందరూ ఒక్కటై తమ నిరసనను వ్యక్తం చేయడం ఈ ఉద్యమంలో ఒక బలమైన సందర్భం. వీరు చెబుతున్న కథలు వ్యధాభరితం. శోకం చాలా గాఢంగా ఉంటుంది. అది చాలా సహనాన్ని కూడా ఇస్తుంది. కాని ఒక దశ తర్వాత అది తిరగబడుతుంది. శోకానికి కూడా చివరి బిందువు ఉంటుంది. అది దాటితే కన్నీరు కార్చే కళ్లు రుధిర జ్వాలలను వెదజల్లుతాయి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంలో ఇదే కనిపిస్తోంది. చదవండి: నాకు పేరొస్తుందనే.. విపక్షాలపై మోదీ ధ్వజం ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనలో బుధవారం ప్రత్యేకంగా ‘వితంతువుల నిరసన’ నిర్వహించేందుకు సోమ, మంగళవారాల్లోనే పంజాబ్ నుంచి వితంతువులు ప్రత్యేక బస్సుల్లో, ట్రాలీలలో బట్టలు, ఆహారం పెట్టుకుని బయలుదేరారు. బయలుదేరేముందు స్థానిక కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, ధర, నిల్వకు సంబంధించిన కొత్త సవరణలతో వచ్చిన చట్టాలు వీరికి ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవు. చదవండి: రైతుల వాదనకే మద్దతు ఢిల్లీ– హర్యానా సరిహద్దులోని టిక్రీ వద్ద వేలాదిగా రైతులు బైఠాయించి నెల రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని, సవరింపులను ఒప్పుకోము అని వారు తేల్చి చెబుతున్నారు. మగవారు వ్యవసాయాన్ని వదిలి ఇక్కడకు చేరగా పంజాబ్‌లో చాలా మటుకు స్త్రీలు, పిల్లలు పొలం పనులు చూస్తున్నారు. అయితే బుధవారం రోజున ప్రత్యేకంగా వ్యవసాయ రుణాల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల భార్యలు, తల్లులు, తోబుట్టువులు ఈ నిరసనలో పాల్గొన్నారు. భారతదేశంలో 2019లో 10,281 మంది వ్యవసాయరంగంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో 5,957 మంది రైతులు కాగా, 4,324 మంది రైతు కూలీలు. దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో వ్యవసాయరంగ ఆత్మహత్యలు 7.5 శాతం ఉన్నాయి. పురుషుడు పరువు కోసం ప్రాణాలు తీసుకుంటూ ఉంటే స్త్రీ కుటుంబం కోసం ప్రాణాలు నిలబెట్టుకుంటూ రావడం దేశమంతా ఉంది. ‘ఏ రోజైతే మా ఇంటి మగాళ్లు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ రోజే మా జీవితం ఆగిపోయింది’ అని ఇక్కడ నిరసనలో పాల్గొన్న వితంతువులు తెలియచేశారు. ‘పంజాబ్‌లో సంపన్న రైతులు ఉన్నారు. అలాగే పేద రైతులు తక్కువేం లేరు’ అని ఈ మహిళలు అన్నారు. వీరు ఇలా వచ్చి నిరసన తెలపడానికి కారణం ఏమంటే ఆ అప్పులు పెరుగుతూ ఉండటం. దేశంలో ఏ చట్టమైనా ఇంటిని, ఇంటి స్త్రీని రక్షించేదిగా ఉండాలని ప్రజలు అనుకోవడం సహజం. ఇప్పడు ఆ స్త్రీ తీవ్ర ఆందోళనలో ఉంది. ఆ ఆందోళన తొలగక పోతే అశాంతి కొనసాగుతూనే ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
టెన్నిస్ మమ్మీస్
జన్మనివ్వడం పునర్జన్మ. కమ్ బ్యాక్ కూడా అంతే. మెట్టినింటికి కమ్ బ్యాక్. ఆఫీస్‌కి కమ్ బ్యాక్. ఆటకు కమ్ బ్యాక్. ప్రాణం పుంజుకోవాలి. ఫిట్నెస్తో రెడీ అవ్వాలి. టెన్నిస్ బరిలో ఈసారి.. తొమ్మిది మంది మమ్మీస్! అందరూ పవర్ రాకెట్స్ యు.ఎస్. ఓపెన్ మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో మొన్న మంగళవారం సెరెనా, త్సె్వతానా, విక్టోరియా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోగానే 96 ఏళ్ల గ్రాండ్ స్లామ్ చరిత్రలో (వింబుల్డన్, యు.ఎస్., ఫ్రెంచి, ఆస్ట్రేలియన్ ఓపెన్) ఒక రికార్డు నమోదు అయింది. ముగ్గురు తల్లులు ఒకేసారి క్వార్టర్ఫైనల్స్కు చేరుకోవడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని యు.ఎస్. ఓపెన్ టోర్నమెంట్ గర్వంగా రెండు ట్వీట్లతో షేర్ చేసుకుంది. ‘గ్రాండ్ స్లామ్ చరిత్రలో తొలిసారి క్వార్టర్ ఫెనల్స్‌కు ముగ్గురు తల్లులు’ అనేది మొదటి ట్వీట్. ‘మదర్ ఆఫ్ ఆల్ గ్రాండ్ స్లామ్స్’ అనేది రెండో ట్వీట్. ప్రత్యేకించి 139 ఏళ్ల యు.ఎస్. ఓపెన్‌కి ఇది నిజంగానే గర్వకారణం. ఈ అవకాశం వింబుల్డన్కో, ఫ్రెంచికో, ఆస్ట్రేలియన్ ఓపెన్కో పోలేదు. వెరా జ్వోనారెవా (రష్యా), త్సె్వతానా (బల్గేరియా) ఆగస్టు 31న న్యూయార్క్‌లో ప్రారంభం అయిన యు.ఎస్. ఓపెన్‌లో బరిలోకి దిగిన వారిలో ఈసారి తొమ్మిది మంది తలుల్లు ఉన్నారు. వీళ్లంతా గత రెండు మూడేళ్లలో కాన్పు విరామం తర్వాత ఆటలోకి తిరిగి వచ్చినవాళ్లే. కమ్ బ్యాక్ ఉమన్ ప్లేయర్స్. సెరెనా, త్సె్వతానా, విక్టోరియా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోడానికి ముందే వారిలో ఆరుగురు.. కిమ్ క్లిజ్స్టర్స్, వెరా జ్వొనారెవా, తత్జానా మారియా, కేథరీనా బాండెరెంకో, ప్యాట్రీషియా మేరియా టిగ్, ఓగ్లా గోవోర్ట్సోవా.. ఆడి ఓడారు. మదర్స్ కాబట్టి ఓడినా గెలిచినట్లేనని కాదు. గెలుపుకోసం చివరి వరకూ పోరాట పటిమను కనబరిచారని. మిగిలిన ముగ్గురు తల్లులూ ఒకేసారి కార్వర్ఫైనల్స్కి చేరడం రికార్డు అయినట్లే.. ఆ ముగ్గురి తల్లుల వ్యక్తిగత రికార్డులూ అసాధారణమైనవే. ఓల్గా గోవోర్ట్సోవా (బెలారస్), పాట్రీషియా మారియా టిగ్ (రొమేనియా) ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్లో మమ్మీ సెరెనా ఫైనల్స్‌కి వచ్చి, అక్కడా గెలిస్తే అది ఆమెకు 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అవుతుంది. అప్పుడు.. గ్రాండ్‌స్లామ్‌లో 24 టైటిళ్లతో రికార్డును నిలుపుకుని ఉన్న ఆస్ట్రేలియన్ టెన్నిస్ క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్‌తో సెరెనా సమానం అవుతారు. క్వార్టర్‌ఫైనల్స్‌కి చేరిన మిగతా ఇద్దరు మమ్మీలు విక్టోరియా (31), త్సె్వతానా (32) కన్నా సెరెనా సీనియర్. వయసు 38. సెరెనాకు ఒలింపియా అనే మూడేళ్ల కూతురు ఉంది. తత్జానా మారియా (జర్మనీ), క్యాథెరీనా బాండెరెంకో (ఉక్రెయిన్) మరో మమ్మీ త్సె్వతానా గ్రాండ్ స్లామ్లో ఇంతవరకు 105 మ్యాచ్‌లు గెలిస్తే ఓడినవి పదమూడే! ఈ బల్గేరియా క్రీడాకారిణికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. పేరు అలెగ్జాండర్. రెండు వారాలుగా తను కొడుకునే చూడలేదు. గత సోమవారం.. కెరీర్లోనే తన తొలి క్వార్టర్ ఫైనల్స్‌కి చేరడానికి ముందు ఆమె ఆడిన చివరి ఆట 2017లో వింబుల్డన్. ‘‘చాలా టఫ్‌గా ఉంది. రోజు రోజుకూ ఎక్కువ టఫ్ అవుతోంది’’ అంటున్నారు త్సె్వతానా. యు.ఎస్. ఓపన్ గురించి కాదు.. కొడుకును చూడకుండా ఉండలేకపోవడం గురించి. ‘‘నాకు తెలుసు. వాడు నన్ను చూస్తూ ఉండి ఉంటాడు’’ అని చెప్పుకుని మురిసిపోతున్నారు కూడా. త్సె్వతానా వయసు 32. విక్టోరియా (బెలారస్) మూడో మమ్మీ విక్టోరియా (31). బెలారస్ దేశ క్రీడాకారిణి. అమెరికన్ క్రీడాకారిణి సెరెనాలా ఈమె మరో మాజీ వరల్డ్ నెంబర్ వన్. 2015 తర్వాత ఆమె మళ్లీ యు.ఎస్. ఓపెన్ క్వార్టర్‌ఫైనల్స్‌కి లోకి రావడం ఇదే మొదటిసారి. ఆమెకు లియో అనే మూడేళ్ల కొడుకు ఉన్నాడు. బరిలో తనతో పాటు ఉన్న తక్కిన తల్లుల్ని చూసి ‘ఇటీజ్ ఇన్స్పైరింగ్’ అని ఆశ్చర్యపోతున్నారు విక్టోరియా. పిల్లలు పుట్టినా మన కలలు కొనసాగుతూనే ఉండాలి అంటున్నారు. ‘‘తల్లి అనే గుర్తింపు గొప్పది. ఆ గుర్తింపునకు క్రీడాకారిణి మరింత గుర్తింపు తెస్తుంది’’ అంటారు విక్టోరియా. ఇప్పుడీ ముగ్గురు తల్లులు ఏకకాలంలో గ్రాండ్ స్లామ్కే గుర్తింపు తెచ్చిపెట్టారు. గత ఏభై ఏళ్లలో ఇప్పటి వరకు తల్లులు అయ్యాక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన వాళ్లు కూడా ముగ్గురే. మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా), ఎవోన్ గూలగోంగ్ (ఆస్ట్రేలియా), కిమ్ క్లిజ్స్టర్స్ (బెల్జియం). -
అమ్మకు పని పెంచుతున్నామా?
మనకు సహాయం చేసే పని మనిషి రావడం లేదు. ఇస్త్రీ మనిషి రాడు. వంట విసుగుపుడితే బయటి నుంచి తెచ్చుకోవడానికి లేదు. వెళ్లడానికి లేదు. స్కూలుకెళ్లే పిల్లలు ఇంట్లోనే. భర్త ఇంట్లోనే. అమ్మ గృహిణి అయినా ఉద్యోగిని అయినా ఇప్పుడు ఆమె ఇంట్లోచేస్తున్న పని ఎంత? దానిని మనం పెంచుతున్నామా? సాయం చేసి తగ్గిస్తున్నామా? అసలు ఆమె పనిని మన పని అనుకోగలుగుతున్నామా? ఈ కరోనా సమయంలో అమ్మ పని ఎలా ఉంది? ఇంటి పని అమ్మ పని. అనాదిగా అది అమ్మ పని అని ఈ సమాజం ఆమెకు దానిని విధిగా చేసింది. ఇంటి బయట పడి నాన్నకు అప్పజెప్పింది. అంతటితో ఆగక ఇంటి బయటపని గొప్పదిగా ఇంటి లోపలి పని తక్కువదిగా తూకం వేసి నిర్థారించింది. ఇంటి బయటి పని ‘డబ్బు’ వస్తుంది గనుక, నాన్న దానిని తెస్తాడు గనుక అది గొప్పదిగా, ఇంటిలో లోపలి పనిలో ఏ డబ్బు రాదు గనుక అమ్మ ఆ పనితో డబ్బు సంపాదించదు కనుక అది తక్కువది అయ్యింది. అమ్మ గృహిణి అయినా, ఉద్యోగి అయినా ఇంటి పనిలో పెద్దగా మార్పు ఉండదు. ఇంటి సభ్యులు పని చేయించుకునేవారిగా, అమ్మ వారికి పని చేసి పెట్టేదానిగా మారిపోతుంది. ఇందులో కొద్దిపాటి సర్దుబాట్లు చేసి ‘ఆమెకు అవసరమైనవి చేసి పెడుతున్నాం కదా’ అని మనసును సమాధానపరుచుకుంటూ ఉంటారు. పని మనిషి ఉందని, పిల్లలు స్కూల్‌కు వెళ్లాక, భర్త ఆఫీసుకు వెళ్లాక ఆమెకు పెద్దగా పని ఉండదని ఏమిటేమిటో చెప్పుకుంటారు. కొందరు జోకులు వేసుకుంటారు. కాని అది నిజంగా నిజం కాదని అందరికీ తెలుసు. ‘అమ్మకు ఆదివారం కూడా సెలవు ఉండదని’ కథలు, వ్యాసాలు, ఉద్యమాలు కూడా వచ్చాయి. అమ్మ శ్రమను అర్థం చేసుకున్నవారు కొందరు. చేసుకోవాల్సినవారు ఎందరో. మొన్నటి దాకా రొటీన్ నిన్న మొన్నటి దాకా అమ్మ రొటీన్ అందరికీ తెలుసు. ఉదయాన్నే లేవాలి. పిల్లలను లేపాలి. బ్రేక్‌ఫాస్ట్, క్యారేజీ రెడీ చేయాలి. భర్తకు క్యారేజీ రెడీ చేయాలి. తను ఉద్యోగానికి వెళుతుంటే గనుక తనూ రెడీ కావాలి. ఉదయం ఆరు నుంచి 9 లోపు ఆమె ఒక యుద్ధంలో పాల్గొంటున్న సైనికురాలిగా ఉంటుంది. ఆమెను గౌరవించే పిల్లలు, భర్త ఉంటే ఈ పనిలో ఎంతో కొంత సాయం చేస్తారు. లేదూ అందరిలాంటి వారే అయితే ఆమె శ్రమను చూసీ చూడనట్టుగా వదిలేస్తారు. సరే.. అది అలవాటైపోయింది కనుక దాని మీద కంప్లయింట్ చేయాలి అని కూడా మర్చిపోయి అమ్మ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు? ఈ కరోనా సమయంలో? బయట కరోనా మహమ్మారి అగ్గిలా రాజుకుంటోంది. అది ఎందరిని దహిస్తుందో తెలియదు. ప్రపంచంతో పాటు దేశం కూడా లాక్డౌన్ అయ్యింది. ముందు తలుపుకు ఎప్పుడూ గొళ్లెం వేసి పెట్టాల్సి వస్తోంది. పిల్లలకు స్కూళ్లు లేవు. నాన్న ఇంట్లోనే. పనిమనిషి బంద్. పని మనిషి ఉంటే బట్టలు, అంట్ల శ్రమ తగ్గేది. కాని లేదు. ఇస్త్రీ చేసే కుర్రాడు వచ్చి బట్టలు తీసుకెళ్లడు. ఈ సమయంలో అమ్మ శ్రమ ఎంత ఉందో మనం చూస్తున్నామా? మూడు పూటలా ఆమె వండాలి. వాటికి అంట్లు పడతాయి. పిల్లలు ఇంట్లో ఉంటే వారు గడియకోమారు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అవి సమకూర్చాలి. భర్త తిండి ప్రియుడు అయితే వాటినీ చేసి పెట్టాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంకా అన్యాయం. ఇవన్నీ చేస్తూ ఆఫీస్ పని కూడా చేయాలి. అమ్మకు ఎంత కష్టం. అమ్మ నోరు తెరిచి అన్నీ చెప్పుకోదు. అరవదు. విసుక్కోదు. లోలోపల బాధ పడుతుంది. ఆ బాధను పట్టించుకుంటున్నామా? ఏం చేద్దాం? టైం టేబుల్ వేసుకోవాలి. పనిని కాగితం మీద రాసుకోవాలి. అమ్మ చేయాల్సిన పనులు, నాన్న చేయాల్సిన పనులు, పిల్లలు చేయాల్సిన పనులు అని విభజన చేసుకోవాలి. ఆ పనులు తప్పక చేయాలి. చేసింది తినడం, పెట్టినదానితో సరి పుచ్చుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఈ భయాందోళన సమయంలో రుచి ప్రతిసారీ కుదరకపోవచ్చు. వంకలు పెట్టకుండా తినాలి. అసలు వంటే చేయనవసరం లేకుండా ఒక్కో పూట పండ్లు, బ్రెడ్‌లాంటి వాటిని తీసుకోవచ్చేమో చూడాలి. ఇల్లు శుభ్రం చేయడం, సర్దుకోవడం, బట్టలు ఉతకడం ఇవి ఎవరెవరు పంచుకోవచ్చో చూసి తప్పనిసరిగా పంచుకోవాలి. అన్నింటికి మించి అమ్మతో మాట్లాడాలి. ఆమెను వంట గదిలో వదిలిపెట్టి మిగిలిన కుటుంబ సభ్యులంతా ఒక పార్టీలాగా మారి కబుర్లు చెప్పుకుంటోనో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటేనో అది చాలా తప్పుగా గ్రహించాలి. మనం నవ్వాలి. అమ్మను నవ్వించాలి. పరస్పరం ప్రశంసించుకుంటూ ప్రోత్సహించుకోవాలి. ఇది ఇప్పుడు చేయాల్సింది. నాన్నలు మారాలి ‘నాకు టీ పెట్టడం కూడా రాదు’, ‘నాకు కిచెన్ ఎక్కడుందో తెలియదు’... ఇలా మాట్లాడటం కొందరు మగవాళ్లకు గొప్ప. ఇలా మాట్లాడేవాళ్లందరూ బేచిలర్ లైఫ్‌లో తిండి కోసం నానా ప్రయోగాలు చేసినవారే అయి ఉంటారు. ఇప్పుడు మళ్లీ ఆ రోజులను తలుచుకుని పనిలోకి దిగాలి. చేయగలిగిన వంట పని చేయాలి. ఆమెకు ఆఫీస్ పని ఎంత ఉందో తెలుసుకొని ఆ పని వొత్తిడి తీరేవరకు ఇల్లు చూసుకోవాలి. బాత్రూమ్లు కడగాలి. నా ఇంటి కోసం నేను పని చేస్తాను అని తీర్మానించుకోవాలి. ఏ పనీ తప్పించుకునే వీలు లేని రోజులివి. వీటిని పంచుకునేవారే ఇప్పుడు కావలసినది. అలాంటి ఇల్లే ఇప్పుడు అవసరమైనది. అలాంటి ఇంట్లో అమ్మకు ఆయుష్షు ఎక్కువ. – సాక్షి ఫ్యామిలీ -
తల్లుల మరణాల నియంత్రణ శూన్యం
సాక్షి, అమరావతి: ప్రసవం లేదా గర్భిణీగా ఉన్న సమయంలో తల్లుల మరణాలు దేశంలోని చాలా రాష్ట్రాల్లో తగ్గగా.. ఆంధ్రప్రదేశ్‌లో 2014–17 మధ్య కాలంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించలేదు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే (ఎస్ఆర్ఎస్) విడుదల చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా మాతా శిశు మరణాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని, అందుకు కేంద్రం సహకరిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు పిలుపునిచ్చినా అప్పటి చంద్రబాబు సర్కారు పెద్దగా స్పందించకపోవడాన్ని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2015–17 మధ్యకాలంలో వివిధ రాష్ట్రాల్లో మాతా మరణాల నియంత్రణ (మెటర్నల్ మోర్టాలిటీ రేట్–ఎంఎంఆర్)పై ఎస్ఆర్ఎస్ బులెటిన్ రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2014 –16 మధ్యకాలానికి ఇచ్చిన బులెటిన్‌కూ.. 2015–17 కాలానికి ఇచ్చిన బులెటిన్‌కూ మరణాల్ని నియంత్రించడంలో ఎలాంటి వృద్ధి కనిపించలేదని వెల్లడించింది. 2014–16లో సగటున లక్ష మందికి 74 మంది మృతి చెందగా.. 2015–17 కాలానికి అదే రేటు కొనసాగింది. చాలా రాష్ట్రాల్లో 2014–16, 2015–17 మధ్య కాలానికి విడుదల చేసిన సూచీల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. నియంత్రించిన మిగతా దక్షిణాది రాష్ట్రాలు 2015–17 మధ్య మాతా మరణాలపై ఈనెల 7న ఎస్ఆర్ఎస్ బులెటిన్ విడుదల చేసింది. పక్క రాష్ట్రం తెలంగాణలో 2014–16లో ప్రతి లక్ష మందికి 81 మరణాలు నమోదు కాగా.. 2015–17 కాలానికి ఆ సంఖ్య 76కు తగ్గింది. కర్ణాటకలో 108 నుంచి 97కి నియంత్రించగా.. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఎప్పటిలానే తాజా సర్వేలోనూ మరింతగా మరణాల నియంత్రణలో ముందంజలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా సగటున ప్రతి లక్ష మందికి 130 మరణాలు చోసుచేసుకుంటుండగా.. ఆ సంఖ్య 2015–17 సర్వేలో 122కు తగ్గింది. మన రాష్ట్రంలో ఎలాంటి తగ్గుదల లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జాతీయ మిషన్, రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసినా మార్పు రాలేదని, దీనిపై గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. -
వివాహేతర సంబంధాల వల్లే..
-ఈ ఏడాది జూలై నెల 31న విజయనగరం ఎల్ఐసీ కార్యాలయం సమీపంలోని పొలంలో ఒక రోజు వయసున్న మగశిశువును అట్టపెట్టెలో పెట్టి పడేశారు. దీంతో ఆ శిశువు మృతి చెందాడు. -ఈఏడాది ఆగస్టు 30న గజపతినగరం రోడ్డులో రెండ్రోజుల వయసున్న మగ శిశువును పడేశారు. దీంతో మగశిశువు మృతి చెందాడు. -బొబ్బిలిలో సెప్టెంబర్ నెలలో అప్పుడే పుట్టిన శిశువును కాలువలో పడేయడంతో మృతి చెందాడు. -తాజాగా విజయనగరం జొన్న గుడ్డి ఉప్పరవీ«ధిలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును చెత్తకుప్పలో పడేయడంతో తలను కుక్కలు తినేశాయి. -ఇవే కాదు.. వెలుగులోకి రానివి ఇంకెన్నో ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో శిశువులను చెత్తకుప్పలు, రోడ్డు పాల్జేసిన సంఘటనలు మూడు బయట పడ్డాయి. సాక్షి, విజయనగరం ఫోర్ట్: మాతృత్వానికి నోచుకోక ఎంతో మంది మహిళలు అల్లాడుతున్నారు. అలాంటిది చందమామలాంటి పిల్లలను కొందరు నిర్థాక్షిణ్యంగా చంపేస్తున్నారు. నవమాసాలు గర్భంలో ఉన్న శిశువులు కళ్లు తెరవకముందే హత్య చేసేస్తున్నారు. కొందరు శిశువులను చెత్తకుండీలు, తుప్పల్లో పడేస్తున్నారు. మరి కొందరు ఆలయాలు, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్లలో వదిలేస్తున్నారు. ఎవరైనా చూస్తే వారు బతికి బట్టగడుతున్నారు. లేదంటే వారు కుక్కలు, నక్కలు పాలై మృత్యువాత పడుతున్నారు. అందరూ ఉన్నప్పటికీ అమ్మ, నాన్న పిలుపునకు నోచుకోక అనాథలుగా మిగులుతున్నారు. వివాహేతర సంబంధాల వల్లే.. వివాహేతర సంబంధాల వల్ల గర్భం దాల్చినవారు విషయం బయటపడితే పరువు పోతుందని భయపడి చెత్తకుప్పలు, బావుల్లోనూ పడేస్తున్నట్టు సమాచారం. వివాహం కాకుండా గర్భవతులు అయిన మహిళలు శిశువులను వదిలించుకోవడానికి విక్రయించడం లేదా శిశువులను తుప్పలు, చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. శిశుగృహకు అప్పగించండి పిల్లలు అవసరం లేదనుకునే వారు శిశుగృహకు అప్పగించాలి. వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం. శిశువులకు అన్ని రకాల వసతి రక్షణ కల్పించి వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తాం. శిశువులను చెత్తకుప్పల పాల్జేయడం మంచిది కాదు. – బి.హెచ్.లక్ష్మి, జిల్లా బాలల సంరక్షణాధికారి 1098కి ఫోన్ చేయండి.. పిల్లలు అక్కర్లేకపోతే చైల్డ్‌లైన్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1098 కు ఫోన్ చేసి ఫలానా ప్రాంతంలో శిశువు ఉన్నాడని సమాచారం ఇస్తే చాలు.. క్షణాల్లో రక్షణ కల్పిస్తాం. లేదంటే నేరుగా అందించిన ఫర్వాలేదు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఆర్థిక ఇబ్బందులుంటే ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు వినియోగించుకోవాలి. అంతే తప్ప పిల్లలను చంపేయడం నేరం. – వి.లక్ష్మణరావు, చైర్మన్, జిల్లా బాలల సంక్షేమ సమితి -
'ఓహ్ బేబీ' బీ విత్ మీ..
సాక్షి, సిటీబ్యూరో :ఒకప్పుడు పసిపిల్లలను చూసుకోవడానికి ఇంటెడు చుట్టాలో.. పెద్దవాళ్లో ఉండేవాళ్లు. కానీ సిటీలోని న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో వర్కింగ్ ఉమెన్‌కి అలాంటి అవకాశాలు అరుదే.. పిల్లలకు సంబంధించిన ఏ పనైనా స్వయంగా చేసుకోక తప్పని పరిస్థితి ఉద్యోగినులది. దీంతో చిన్నారి ధారణ/బేబీ వేరింగ్ పేరుతో ఓ ఆర్ట్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. చీర కట్టుకోవడం నేర్పించినట్లే.. బిడ్డను చుట్టుకోవడం ఆధునిక ప్రపంచం సరికొత్తగా నేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో బేబీ వేరింగ్ చుట్టూ ఆసక్తికరమైన విషయాలెన్నో అల్లుకుంటున్నాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బిడ్డను తమ వీపునకు వెనుక చీరతో కట్టుకుని పొలం పనులు తదితర పని పాటల్లో మునిగిపోయే తల్లులను ఇప్పటికీ మనం చూస్తుంటాం. అదే ఇప్పుడు మరో రూపంలో నగరాల్లో ట్రెండీగా మారింది. ప్రస్తుతం నగర మహిళలు బేబీ వేరింగ్ లాభాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఎర్గోనామిక్ బేబీ కేరియర్స్పై తగినంత ఖర్చు పెడుతున్నారు. కొత్తగా తల్లులైనవారికి పిల్లలను తమ శరీరాలపై ధరించడం అనే ఆర్ట్‌పై అవగాహన పెంచేందుకు, ఎడ్యుకేటర్స్, సపోర్ట్ గ్రూప్స్ కూడా వచ్చేశాయి. జాగ్రత్తగాఎంచుకో..ప్రేమనుపంచుకో.. నాణ్యమైన కేరియర్స్ను ఎంచుకోవాలని బేబీ వేరింగ్ ఎడ్యుకేటర్స్ తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ఎర్గోనామిక్ (అటు అందుబాటులో ధరలు, ఇటు పర్యావరణ హితమైనవి)గా ఉండే వాటి వల్ల వచ్చే ప్రయోజనాలను అర్థం చేసుకోవాలని, కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఇవి ఉండేలా చూడాలని అంటున్నారు. మన దేశంలో వాటిని పరీక్షించే ప్రమాణాలు లేవు కాబట్టి యూకే లేదా యూఎస్ స్టాండర్డ్స్‌ను సరిచూసుకోవాలన్నారు. బిడ్డకు సురక్షితమైన ఫ్యాబ్రిక్స్/డైస్ ఉపయోగిస్తున్నారా లేదా? అనేది చాలా ముఖ్యం. భిన్న రకాల కేరియర్స్ను పరిశీలించడానికి సమయం కేటాయించాలి. బేబీ వేరింగ్ నెట్ వర్క్స్ ఏర్పాటు చేసే మీటప్స్కు హాజరవ్వాలి. దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల బేబీ వేరింగ్లను ట్రయల్ ఇచ్చేందుకు, అద్దెకు ఇచ్చేందుకు లైబ్రరీలూ ఉన్నాయి. కన్సెల్టెంట్స్ను సంప్రదించడం వల్ల బిడ్డకు, తల్లికి ఇద్దరికీ నప్పే సరైన కెరియర్ను ఎంచుకునే దిశగా సరైన సలహా లభించవచ్చు. ధారణ.. ప్రేరణ.. ప్రస్తుతం పేరెంటింగ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది బేబీ వేరింగ్.. ఇది బిడ్డతో బంధాన్ని ధృడతరం చేస్తుంది. తల్లులకు తరచూ సులభ ప్రయాణాలు చేసేందుకు సహకరిస్తుంది. సింగిల్‌గా జీవించే తల్లులకు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కూడా ఈ కెరియర్స్ బాగున్నాయి. ఫ్యాషన్.. ఎమోషన్.. ప్రస్తుతం సిటీలో బేబీ వేరింగ్ స్టైల్ సరికొత్త ఫ్యాషన్ స్టేట్మెంట్గా అవతరించింది. దీని కోసం రకరకాల ఆకర్షణీయమైన కెరియర్స్ను తల్లులు కొనుగోలు చేస్తున్నారు. వీటికి విభిన్న రకాల రంగులు, ప్రింట్స్లో బ్యాగ్స్, షూస్, యాక్సెసరీస్‌తో మ్యాచింగ్ మ్యాచింగ్ అంటున్నారు. రింగ్ స్లింగ్స్తో పాటుగా కెరియర్స్ వచ్చాయి. స్ట్రెచ్చీ ర్యాప్, ది ఉమెన్ ర్యాప్, ది రింగ్ స్లింగ్, ది మెహ్ దాయ్, ది టోన్ బ్యుహిమో... ఇంకా ఎన్నో కెరియర్స్ అందుబాటులో ఉన్నాయి. నగరంలో నిర్వహిస్తున్న బేబీ వేరింగ్ వాక్స్ వంటివి కొత్తగా తల్లులైన వారికి ఆరోగ్య ఆనందాలతో పాటు పిల్లలను జాగ్రత్తగా ధరించడంపై అవాహన కూడా పెంచుతున్నాయి. బేబీ వేర్.. టేక్ కేర్.. పేరెంట్స్ పిల్లల్ని ధరించేటప్పుడు సరైన కెరియర్ ఎంచుకోవాలి. లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇక టూవీలర్ వంటి వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం బేబీ వేరింగ్ వద్దు. ఎప్పుడు అవసరం అయినా వెంటనే చేతులు వెనక్కి పెట్టగిలిగేలా ఉండాలి. పిల్లల సైజ్‌ను బట్టి మార్చడం లేదా అడ్జస్టబుల్ కెరియర్స్ వస్తున్నాయి. వీలున్నంత వరకూ ఫ్రంట్ వైపు అంటే పేరెంట్స్‌కు అభిముఖంగా పిల్లలు చూస్తుండేలా అయితే బెటర్. బేబీ వేరింగ్ సుదీర్ఘంగా ఉండటం మంచిది కాదు.. 2 లేదా 3 గంటల వరకూ అయితే ఓకే.. పేరెంట్స్ జ్వరం లాంటి అనారోగ్య సమస్యలు ఉంటే బేబీ వేరింగ్కు దూరంగా ఉండాలి. – డా.ఎమ్.విష్ణువర్ధన్‌రెడ్డి, నియోనెటాలజిస్ట్, అపోలో క్రెడిల్ ఆస్వాదించా... బేబీ వేరింగ్ చేసిన కొత్తలో బిడ్డ భద్రత గురించి నాకు కొంత భయంగా అనిపించింది. అయితే కొంత సాధన, సలహాలు, సూచనల అమలు తర్వాత దాన్ని చాలా ఆస్వాదించాను. పిల్లలకు కూడా చక్కగా కూర్చోవడం, చూడటం అలవాటైపోయింది. మనకు కలిగే మరో మంచి ప్రయోజనం ఏమిటంటే కెరియర్ బరువు రెండు భుజాల మీద సమంగా పడటం వల్ల మోచేయి, మణికట్టు దగ్గర కీళ్ల నొప్పుల నుంచి విముక్తి కూడా కలిగిస్తుంది. మనం బాగా ఎక్కువ సమయం వాకింగ్ చేయాల్సిన సందర్భాల్లో ఇది చాలా ఉపకరిస్తుంది. ఫ్లైట్ జర్నీ దగ్గర నుంచి మాల్స్, సూపర్ మార్కెట్స్‌లో షాపింగ్ దాకా బేబీ వేరింగ్ ఉపయుక్తమే. – డా.హాసిని యాదవ్ తల్లికి బిడ్డకూ క్షేమం.. కొత్తగా తల్లులైన వారికి మద్దతు చాలా అవసరం. వారికి పలు విషయాల్లో అవగాహన, శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగేళ్ల మా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా బేబీ వేరింగ్పై నెలకు, రెండు నెలలకు మీట్స్ చేస్తున్నాం. తన పనులు తాను చేసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేందుకు దీని ద్వారా వీలు కలుగుతుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బేబీ కేరియర్స్కు సరైన ఫ్యాబ్రిక్ వాడటం లేదు. బేబీ వేరింగ్ ద్వారా బిడ్డ ఎంతగా తల్లి శరీరానికి దగ్గరగా ఉంటే అంతగా తల్లిపాలు పెరుగుతాయని.. వీటన్నింటిపై మేం అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికి 100కిపైగా ఈవెంట్స్ చేశాం. సిటీలో మిళింద్ సోమన్ నిర్వహించిన బేబీ వేరింగ్ మారథాన్ రన్లో మేం పాల్గొన్నాం. – కామ్నా గౌతమ్, హైదరాబాద్ పేరెంట్స్ లైబ్రరీ -
శిశువులు తక్కువ..తల్లులు ఎక్కువ!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని శాఖల గణాంకాలను ఈ ఐదేళ్లల్లో కాకిలెక్కలతో రూపొందిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం గర్భిణుల విషయంలోనూ తప్పుడు సంఖ్యలు.. పొంతనలేని వివరాలతో జాబితాలు రూపొందించి కేంద్రం దృష్టిలో అభాసుపాలవుతోంది. గర్భిణుల సంఖ్య, పుట్టే పిల్లల సంఖ్య ఎక్కడా సరిపోలడంలేదు. రాష్ట్రంలో గర్భిణులను గుర్తించి వారికి వైద్య సేవలు అందించే క్రమంలో ఈ తప్పులతడకలు భారీగా చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు బర్త్ రేటు (పుట్టే చిన్నారుల శాతం) తగ్గుతూంటే మరోవైపు గర్భిణుల శాతం మాత్రం అమాంతంగా పెరిగిపోతోంది. మన రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి 16.4 శాతం చిన్నారులు పుడుతున్నారు. కానీ, గర్భిణులను మాత్రం 19 శాతానికి పైగానే అని ఆరోగ్య శాఖాధికారులు చూపిస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలని ఇలా చేస్తున్నారా లేదా ఎక్కువ మందికి వైద్యం అందిస్తున్నామని చెప్పడానికి ఇలా చేస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో మాతా శిశు మరణాల విషయంలో ఇలాగే తప్పుడు లెక్కలు చూపించి దక్షిణాదిలో అద్భుతంగా నివారణ చర్యలు చేపడుతున్నట్టు పలుమార్లు జరిగిన కలెక్టర్ల సదస్సుల్లో నివేదికలు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా తప్పుడు లెక్కలు చూపించి గందరగోళం సృష్టించారు. ఓ వైపు ప్రజాసాధికార సర్వేలో రాష్ట్ర జనాభా 4.50 కోట్లు అని చెబుతుంటే.. కేంద్రం మాత్రం 5.30 కోట్లు అని చెబుతోంది. కేంద్ర లెక్కలనే అధికారులు పరిగణనలోకి తీసుకుని అద్భుతంగా చేస్తున్నామని చూపించడానికి ఇలా తప్పటడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. గర్భిణుల గణాంకాల్లో గందరగోళం! కాగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ రూపొందించిన జాబితాలో తల్లులను ఎక్కువ మందిని చూపించి పిల్లల సంఖ్యను మాత్రం తక్కువగా చూపించారు. ఉదాహరణకు.. కృష్ణా జిల్లాలో ఒక ఏడాదిలో 52 వేల మంది చిన్నారులు (0 వయసు) అని లెక్కల్లో తేల్చారు. అదే గర్భిణుల నమోదులో 82 వేల మందికి పైగా నమోదైనట్లు చూపించారు. అంటే 30 వేల మంది చిన్నారులు పుట్టగానే మృతిచెందినట్లయినా ఉండాలి.. లేదా గర్భిణుల నమోదులో ఎక్కువైనా చేసి చూపించి ఉండాలి. క్షేత్రస్థాయి సిబ్బందికి టార్గెట్లు పెట్టి ఈ లక్ష్యాలను ఎలాగైనా సాధించాలంటూ ఒత్తిడి తేవడంతో చాలాచోట్ల గర్భిణుల నమోదులో డబుల్ ఎంట్రీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉదా.. విశాఖపట్నం జిల్లాలోని దొరకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక గర్భిణి నమోదై ఉంది. అదే గర్భిణి దేవరాపల్లి, బీమాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా నమోదై ఉంది. అధికారులు తమ నివేదికలో ముగ్గురు గర్భిణులుగా చూపించి ముగ్గురికీ ప్రతినెలా వైద్యపరీక్షలు అందించినట్టు పేర్కొన్నారు. ఇలా సుమారు 82వేల మంది గర్భిణులను ఒకటికి రెండు లేదా మూడుసార్లు నమోదుచేసి అమాంతంగా వారి సంఖ్యను పెంచేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలిపి 7 లక్షల పైచిలుకు ప్రసవాలు జరుగుతుండగా, 8.50 లక్షల మంది గర్భిణులను రిజిస్ట్రేషన్ చేసి, వారికి వైద్యమందించినట్లు చూపించారు. ఈ లెక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం సంభ్రమాశ్చర్యాలకు గురవుతోంది. అడ్డగోలుగా టార్గెట్లు రాష్ట్రంలో సరాసరిన 7.50 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. అందులోనూ ప్రతి ఏడాదీ బర్త్ రేటు తగ్గుతోంది కాబట్టి గర్భిణుల శాతం కూడా తగ్గాలి. కానీ, ఉన్నతాధికారులు మాత్రం ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు విధిస్తున్న టార్గెట్లు విస్మయం కలిగిస్తున్నాయి. ఏకంగా 9.90 లక్షల మందిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ టార్గెట్లు విధించారు. ఏ జిల్లాలో ఎంత టార్గెట్ ఇచ్చారో చూస్తే అవాక్కవాల్సిందే. అసలు లేని గర్భిణులను ఎక్కడ్నుంచి చూపించాలని క్షేత్రస్థాయి సిబ్బంది వాపోతున్నారు. గర్భిణుల విషయంలో జిల్లాల వారీగా ప్రభుత్వం విధించిన టార్గెట్లు ఇవీ.. రిజిస్ట్రేషన్లు ఎక్కువ.. బర్త్ రేటు తక్కువ రాష్ట్రంలో 2011 నుంచి బర్త్ రేటు బాగా తగ్గుతోంది. ఉదా.. 2011లో వైఎస్సార్ కడప జిల్లాలో 43,378 మంది చిన్నారులు పుట్టారు. అప్పటి జనన నిష్పత్తి వెయ్యి జనాభాకు 17.5 శాతం. ఆ తర్వాత 16.4కు తగ్గింది. కానీ, ఇప్పుడు చిన్నారుల రిజిస్ట్రేషన్ టార్గెట్ 57,443 మందిని ఇచ్చారు. ఓ వైపు బర్త్ రేటు తగ్గుతూంటే ఎక్కువ చూపించడమేంటో అర్థంకాని పరిస్థితి. కాగా, బర్త్ రేటును సంవత్సరాల వారీగా చూస్తే.. -
మాతృదేవతాౖయె నమః
ప్రేమ, కరుణలను వర్షించే ప్రేమమూర్తులుగా మాతృత్వమనే పదానికే అర్థంగా, నిదర్శనంగా నిలిచిన తల్లులు మన పురాణాల్లో ఎంతోమంది కనిపిస్తారు. అలాంటివారిలో... తలచుకోగానే బొమ్మకట్టే కొందరు మాతృమూర్తుల గురించి తెలుసుకుందాం. పార్వతీదేవి: ఆమె అమ్మల గన్న అమ్మ, శక్తి స్వరూపిణి, తన బిడ్డ ప్రాణం కోసం పతి అయిన పరమ శివుడినే ఎదిరించి, ఆయనతో పోరాడి మరీ బిడ్డను బతికించుకున్న మాతృమూర్తి. తాను నలుగుపిండితో ప్రాణం పోసిన బాలుడికి, తన భర్త అయిన శంకరుడికి మధ్య జరిగిన పోరాటంలో ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తెలిసి భోరున విలపించింది. తొందరపడి బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని ప్రాణనాథుడైన పరమేశ్వరుడినే ఒక సాధారణ స్త్రీలా తూలనాడిన సిసలైన తల్లి ఆమె. ఏనుగు తలైనా ఫరవాలేదు పిల్లవాడు ప్రాణాలతో తిరుగాడితే చాలు అని ఆరాటపడిన అసలైన అమ్మ. ఆ బిడ్డడే అందరి తొలి పూజలందుకునే బొజ్జ గణపయ్య. సీతాదేవి: శ్రీరాముడి పత్ని అయిన సీతాదేవి గర్భిణిగా తనను అడవిలో వదిలేసినప్పటికీ, ఆ బాధను, శోకాన్ని దిగమింగుకుని వాల్మీకి ఆశ్రమంలో కవలలు లవకుశులకు జన్మనిచ్చింది. ఎన్ని కష్టనష్టాలెదురైనా తన కుమారులిద్దరినీ క్షత్రియపుత్రులు, ఇక్ష్వాకు వంశ వారసులుగా ఒంటరిగా పెంచి పెద్ద చేసింది. యశోదాదేవి: దేవకీ నందనుడైన కన్నయ్యను తన ప్రేమ, వాత్సల్యాలతో యశోదా కృష్ణుడిగా మార్చుకున్న ప్రేమమయి యశోదాదేవి. కన్నది దేవకీ దేవి అయినా కృష్ణుడి బాల్యం అనగానే మనకు చటుక్కున స్ఫురించేది యశోదాదేవి పేరే. పాలు, వెన్నలతోపాటు ప్రేమ, వాత్సల్యాలను, మమతానురాగాలను కూడా రంగరించి కృష్ణుడిని పెంచి పెద్ద చేసింది. కన్నయ్య ఆడితే ఆనందపడిపోయి, పాడితే పరవశించిపోయి, పిల్లనగ్రోవి ఊదితే మైమరచిపోయి అల్లరి చేస్తే ముద్దుగా కోప్పడి... ఇలా అతని బాల్యక్రీడలతో, అల్లరిచేష్టలతో మాతృత్వాన్ని తనివి తీరా ఆస్వాదించిన తల్లి.. యశోదమ్మ. అయితే అన్న అయిన కంసుడి క్రౌర్యానికి వెరచి పొత్తిళ్లలోనే బిడ్డను వేరొకరికి అప్పగించవలసిన అగత్యం ఏర్పడినా ఎక్కడో ఒకచోట తన బిడ్డ క్షేమంగా ఉంటే చాలని పుట్టెడు శోకాన్ని గుండెల్లోనే దాచుకున్న దేవకీదేవి కూడా స్మరణీయురాలే.. కౌసల్యాదేవి: దశరథ రాజు పట్టపురాణి, రామచంద్రుడి తల్లి కౌసల్యాదేవి. సవతి కైకేయికి భర్త ఇచ్చిన వరం మూలంగా పద్నాలుగేళ్ల పాటు తన పుత్రుడికి దూరమై తీవ్ర వేదనను అనుభవించిన మాతృమూర్తి. భర్త నిస్సహాయత, కైకేయి దురాలోచన ఫలితంగా రాముడు వనవాసానికి వెళ్లి తాను శోకంలో మునిగిపోయినప్పటికీ తనయుడి పితృవాక్య పరిపాలనకు లోటు రాకూడదన్న సదాశయంతో, సయమనంతో వ్యవహరించిన తల్లి కౌసల్యాదేవి. సుమిత్రాదేవి: భర్త దశరథుడు కైకేయికి ఇచ్చిన వరమే తన పాలిట శాపం కాగా పుత్రుడి ఎడబాటును ఏళ్లతరబడి మౌనంగా భరించిన తల్లి సుమిత్ర. అన్నతోపాటు తాను కూడా వనవాసానికి వెళతానంటూ లక్ష్మణుడు పట్టుబట్టిన వేళ... అతడిని వారించకుండా రాముడిని కూడా తన కుమారుడిలాగే భావించి అతడి పితృవాక్యపరిపాలనకు తన వంతు సహకారాన్ని అందించిన సహృదయురాలు సుమిత్రాదేవి. కైక: పేరుకు భరతుడు తన పుత్రుడైనా రాముడినే తన బిడ్డగా భావించి అపరిమితమైన ప్రేమ, వాత్సల్యాలతో అల్లారుముద్దుగా రామచంద్రుడిని పెంచింది. అనుక్షణం రాముడినే కలవరించి, పలవరించేది. అలాంటిది మంధర చెప్పుడు మాటలు విని తన కుమారుడు భరతుడి భవిష్యత్తుకోసం రాముడిని వనవాసానికి పంపింది. ఫలితంగా కన్నకొడుకే తనను చూసి ఛీత్కరించుకుంటే ఎంతగానో ఏడ్చింది. ఆ తరువాత ఎంతో పశ్చాత్తాప పడ్డ కైక కూడా గుర్తుచేసుకోదగిన తల్లే. వకుళమాత: శ్రీకృష్ణుడి బాల్యం మాత్రమే తాను చూడగలిగానని అనంతరం అతని వద్ద ఉండలేకపోయానని వాపోయిన యశోదమ్మకు మరుజన్మలో ఆ అవకాశం కల్పిస్తానని వాగ్దానం చేశాడు కృష్ణుడు. అన్నట్లుగానే యశోదమ్మ, వకుళమాతగా జన్మించగా తాను శ్రీనివాసుడిగా అవతరించి పుత్రుడిగా ఆమె ప్రేమను అందుకున్నాడు కృష్ణుడు. పూర్వజన్మలో తాను కోరిన కోరికను ఈ జన్మలో నెరవేర్చేందుకు పుత్రుడిగా తన వద్దకు ఏతెంచిన గోవిందుడిని వాత్సల్యంతో ఆదరించి తనలోని మాతృత్వభావనను పరిపూర్ణం చేసుకున్న మాతృమూర్తి వకుళమాత. అనసూయ: ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మారువేషాలతో అత్రి ఆశ్రమానికి అతిథులుగా వెళ్ళి భవతీ భిక్షాందేహి అని నిలబడ్డారు. అతిథులుగా వచ్చిన త్రిమూర్తులకు మర్యాదలు జరిపి భోజనానికి కూర్చోమన్నది అసూయ. అప్పుడు కపటయతులు ముగ్గురూ ఏకకంఠంతో, ‘‘సాధ్వీ! మాకొక నియమమున్నది – అది నీవు నగ్నంగా వడ్డిస్తేనే గాని తినేది లేదు!’’ అని అన్నారు. అనసూయ ‘అలాగా! సరే!’ అంటూ వారిమీద నీళ్ళు చిలకరించింది. ముగ్గురు అతిథులూ ముద్దులొలికే పసిపాపలైపోయారు. అనసూయకు మాతృత్వం పొంగివచ్చింది. పసివాళ్ళకు పాలబువ్వ మెత్తగా కలిపి తినిపించింది. ఒడిలో చేర్చుకొని లాలించి పాలిచ్చింది. త్రిమూర్తులు పసిపాపలై అనసూయ ఒడిలో నిద్రలోకి జారిపోయారు. ముగ్గుర్నీ ఉయ్యాల తొట్టిలో పరుండబెట్టి, ‘‘ముజ్జగాలేలే ముమ్మూర్తులు నా పాపలైనారు. బ్రహ్మాండమే వీళ్ళకు ఉయ్యాలతొట్టి, నాలుగు వేదాలే గొలుసులు, ఓంకార ప్రణవనాదమే జోలపాట!’’ అంటూ జోలపాడింది. ఆ పాటకు మైమరచిపోయిన బ్రహ్మ విష్ణుమహేశ్వరులు కలిసిపోయి, ఒకే ఒక మూర్తిగా దత్తాత్రేయుడు రూపొందాడు. మాతృమూర్తులందరికీ అభివందనం. -
ఆమె నా కన్నతల్లి కాదు.. అందుకేనేమో!
ఆడపిల్లకు ప్రమాదం, నష్టం జరిగడానికి వీలైన అన్ని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆ రెండుమూడు రోజులు గడిపింది. ప్రమాదం, నష్టం జరిగాయా? తెలియదు. కాని ఇంటికి రాగానే తల్లితో యుద్ధాలు. తల్లికి కూతురితో యుద్ధాలు. ‘పదహారేళ్లంటే నీకేం తెలుసు. లోకం ఎలా ఉంటుందో తెలుసా? బయట ఎంత ప్రమాదమో తెలుసా? మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో తెలుసా? అసలు ఏం తెలుసని ఇంట్లో నుంచి పారిపోయావ్? పైగా ఆడపిల్లవి’ ‘మాట్లాడవేం?’‘అవన్నీ నాకు తెలుసో లేదో తెలియదు. కాని ఒక్కటి మాత్రం బాగా తెలుసు’‘ఏంటది’‘మా అమ్మకు నేనంటే ఇష్టం లేదు. అందుకే నాకు మా అమ్మంటే ఇష్టం లేదు’ఆ జవాబుకు కన్సల్టేషన్ రూమ్‌లో నిశ్శబ్దం అలముకుందిఆ అమ్మాయికి అచ్చంగా పదహారేళ్లుంటాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై.పి.సి ఇష్టమని చేరింది. కాని చదవదు. కాలేజ్‌కని వెళుతుంది. కాని వెళ్లదు. మాట విన్నట్టే కనిపిస్తుంది కాని వినదు. హుషారుగా ఉన్నట్టు అభినయిస్తుంది కాని నిజంగా హుషారుగా ఉండదు.‘నాకు చాలా బెంగ’ అని మెసేజ్ పెట్టింది ఫేస్బుక్లో కనిపించిన హైస్కూల్నాటి ఫ్రెండ్‌కి.‘నాకూ బెంగే’ అని కుర్రాడు అన్నాడు.‘మనిద్దరం కష్టసుఖాలు చెప్పుకుందామా?’ అని టైప్ చేసింది.‘అందుకేగా నీతో ఫ్రెండ్షిప్ చేస్తోంది’ అన్నాడు వాడు.ఆ అమ్మాయి తన తొలి కష్టం చెప్పుకుంది.‘మా అమ్మంటే నాకు ఇష్టం లేదు’‘నాకు మా నాన్నంటే ఇష్టం లేదు. ఎప్పుడూ తిడుతుంటాడు’ అన్నాడు వాడు.ఇలా కొన్నాళ్లు మాటలు నడిచాయి. ఇద్దరూ పెనుకష్టాల్లో ఉన్నారని ఆ కష్టాలకు ఇళ్లే కారణమని ఇళ్లలో నుంచి పారిపోతే పూర్తి కష్టాలు పోతాయని ఇద్దరూ అనుకుని పారిపోయారు.వైజాగ్ వెళ్లారు. అక్కడ ఏం చేయాలో తోచలేదు. అరకుకు వెళ్లి సాయంత్రం ఆ చీకటిని, తెలియని ముఖాలని చూసి బెంబేలెత్తారు. ఆ తర్వాత విజయవాడ వెళ్లారు. అక్కడి బస్ స్టేషన్లో ఆ అమ్మాయిని వదిలి ఇప్పుడే వస్తానని వాడు పారిపోయాడు. భయాన్ని తట్టుకోలేక ఇల్లు చేరాడని తర్వాత తెలిసింది. మొండి అమ్మాయి ఇంకో రోజు బెజవాడలోనిబస్టాండ్లో, రైల్వేస్టేషన్లో తిరిగి ఇల్లు చేరింది.ఆడపిల్లకు ప్రమాదం, నష్టం జరగడానికి వీలైన అన్ని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆ రెండుమూడు రోజులు గడిపింది. ప్రమాదం, నష్టం జరిగాయా?తెలియదు. కాని ఇంటికి రాగానే తల్లితో యుద్ధాలు. తల్లికి కూతురితో యుద్ధాలు. ఇలా ఎంతకాలం అని భార్యనూ, కూతురిని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొచ్చాడు తండ్రి. ముందు ఎవరూ లేకుండా చేసి కూతురితో మాట్లాడాడు సైకియాట్రిస్ట్.‘ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మ నాతో బాగుండదు. చీటికి మాటికి కోప్పడుతుంటుంది. కరెక్ట్ చేయాలని చూస్తుంటుంది. చూశారుగా నన్ను. కొంచెం పొట్టి. మా అమ్మా నాన్నల పక్కన ఎలుకపిల్లలా ఉంటాను వాళ్ల పర్సనాల్టీస్కి. అసలే కాన్ఫిడెన్స్ లేదు. చదువులో స్లో. ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది నాతో కలవాలని అనుకోరు. ఇవన్నీ మా అమ్మకు డిస్శాటిస్ఫాక్షన్ అనుకుంటాను. అందుకని నాకు రిస్కీ ఫ్రెండ్షిప్స్ చేయడం అలవాటైంది. పక్కింటి అంకుల్‌తో, ఆటో అంకుల్‌తో, ఫేస్బుక్లో తెలియనివారితో ఇట్టే ఫ్రెండ్షిప్ చేస్తాను. తర్వాత వాళ్ల బిహేవియర్‌కి ఫ్రస్ట్రేట్ అవుతాను. ఒక ఫ్రెండ్‌తో ఇంట్లో నుంచి పారిపోతే వాడు కూడా నన్ను వదిలి పారిపోయాడు. నేను కోపంగా ఉంటానని మా అమ్మ అంటుంది. కాని మా అమ్మే కోపంగా ఉంటుంది. కాని సడన్‌గా ఒక డౌట్ వచ్చింది. ఏ తల్లీ సొంత బిడ్డతో ఇలా వ్యవహరించదు కదా... కొంపదీసి నేను ఈమెకు పుట్టలేదా? అని. అప్పుడు తెలిసింది...’‘ఏమని’‘నేను ఆమెకు పుట్టలేదు. మా పేరెంట్స్ నన్ను అడాప్ట్ చేసుకున్నారని. నాకు ఎనిమిదేళ్లప్పుడు ఆ సంగతి చెప్పారట..నాకు అర్థం కాలేదు... వాళ్లు ఆ సంగతి రిపీట్ చేయలేదు. టీనేజ్లోనే సరిగ్గా అర్థమైంది. ఇక ఇంట్లో ఎందుకుండాలి అనుకున్నాను’ ఆ అమ్మాయికి ఏడుపు తన్నుకొచ్చింది.సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయిని మనసారా ఏడవనిచ్చాడు. ఇప్పుడు ఎవరూ లేకుండా సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయి తల్లితో మాట్లాడాడు.‘డాక్టర్... మాది కలిగిన కుటుంబమే. కాని చిన్నప్పటి నుంచి సంతోషం లేదు. మా నాన్న డ్రంకర్డ్. అమ్మను నిత్యం బాధించేవాడు.వేధించేవాడు. అనుమానించేవాడు. భయంకరమైన గొడవలను చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగాను. అలాంటి జీవితం నా సంతానానికి రాకూడదనుకున్నాను. పెళ్లితో అయినా నా జీవితం బాగుపడుతుందని ఆశించాను. నా అదృష్టం నా భర్త చాలా మంచివాడు. దురదృష్టం నా అత్తమామలు తగువులమారి స్వభావం ఉన్నవారు. 18 ఏళ్లకు పెళ్లయితే చిన్నదాన్నని కూడా చూడకుండా అన్ని పనులూ నా నెత్తినేసి సుఖం లేకుండా చేశారు. దానికి తోడు పిల్లలు పుట్టలేదు. ఏమిటా దురదృష్టం అని డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. చిన్నప్పటి డిప్రెషన్ ఇప్పటి డిప్రెషన్ అంతా కలిసి పేషెంట్‌లాగా మారాను’‘తర్వాత?’ సైకియాట్రిస్ట్ అడిగాడు.‘అప్పుడు మావారే సర్దిచెప్పి అడాప్ట్ చేసుకుందామనుకున్నారు. అనాథ శిశుశరణాలయం నుంచి ఎనిమిది నెలల పాపను దత్తత తీసుకున్నాం. నాకు పిల్లలు ఇష్టమే. ఎన్నో కలలు కన్నాను పెంపకం విషయంలో. కాని పాప మా ఇద్దరికీ ఏ మాత్రం పొంతన లేని ఎత్తుతో పెరిగింది. తెలివితేటలు లేవు. దానికి తోడు ప్రవర్తన కూడా ఏమిటోగా ఉంది. దానిని కంట్రోల్ చేయబోయి దానిపట్ల గయ్యాళిగా మారాను. నేను ఎంత ప్రేమిద్దామనుకున్నా ఎందుకు నా బతుకు ఇలా అయ్యిందా అనే నెగెటివ్ ఆలోచన. నా జీవితం నరకంగా మారింది. నా భర్తతో కూతురితో ఆనందంగా నేను ఎలా గడపాలి?’... ఆమె కళ్లు ధారలు కట్టాయి.మనసును కుదుటపర్చడంలో కన్నీళ్లకు మించిన మందు లేదు.సైకియాట్రిస్ట్ ఆమెను కూడా గుండె తేటపడే వరకు ఏడ్వనిచ్చాడు. ఇప్పుడు గదిలో ముగ్గరూ ఉన్నారు. తల్లి కూతురు తండ్రి.సైకియాట్రిస్ట్ మాట్లాడటం మొదలుపెట్టాడు.‘చూడండి... చీకటి అంటే వెలుతురు లేకపోవడం కాదు. ఇంకా రాకపోవడం. ఇంకా చెప్పాలంటే ఉన్న వెలుతురును చూడకపోవడం. మీరిద్దరూ జీవితంలో నెగెటివిటీని చూడటానికే అలవాటు పడి జీవితం పట్ల రోత పుట్టించుకున్నారు. (తల్లివైపు చూస్తూ) బాల్యంలో మీరు తల్లిదండ్రుల కొట్లాటలు చూశారు. కాని మీరొక కలిగిన కుటుంబంలో పుట్టారని ఏ పోలియో బాధో అనారోగ్య సమస్యో దేవుడు మీకు ఇవ్వలేదని చదువు అబ్బని తెలివితక్కువతనం ఇవ్వలేదని సంతోషపడలేదు. పెళ్లయ్యాక వేధించే అత్తామామలను చూసి శోకించారు తప్ప ఒక్క లోపం లేని భర్త దొరికాడని ఆనందించలేదు. ముఖ్యంగా మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్లు తేల్చినా లోపం మీదేనని చెప్పినా మిమ్మల్ని పన్నెత్తు మాట అనని భర్తను చూసి జీవితాంతం సంతోషంగా బతకొచ్చని మీరు అనుకోలేదు. దత్తతకు కుమార్తె దొరికితే దానికీ సంతోషపడలేదు. కళకళలాడే ఆడపిల్ల అనుకోక రూపం గురించి, ర్యాంకుల గురించి బాధ పడ్డారు. ఒక్కసారైనా మీరు మీకు ఏమేమి ఉన్నాయో లిస్టు రాసుకుంటే అవి లేనివాళ్లు కోట్లమంది కనిపించి ఉండేవారు. మీ దృష్టి రుణాత్మకం కావడంతో వచ్చిన సమస్య ఇది’ అన్నాడు సైకియాట్రిస్ట్.ఆ తర్వాత కూతురి వైపు చూశాడు.‘చూడమ్మా... ఎందరో పిల్లలు అడాప్ట్ చేసుకునే తల్లిదండ్రులు లేక బాధపడుతుంటే మంచి తల్లిదండ్రులను నీకు దేవుడు ఇచ్చాడని నువ్వు కొంచెం కూడా సంతోషపడటం లేదు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా లేవు. అమ్మ వేధిస్తుంది అంటున్నావే తప్ప నాన్న నిన్ను ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటున్నాడని మాటవరసకు కూడా అనలేదు. సొంత ఇల్లు, కారు, మంచి కాలేజీ ఇవి ఎంతమందికి ఉన్నాయి. అమ్మ సమస్య ఏమిటో తెలుసుకోకుండా అమ్మ మీద డిమాండ్స్ పెట్టి ఆమెను బాధపెట్టావు. మీది అన్నీ ఉండి ఎక్కువైన బాధ. అసలు ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు హాయిగా జీవనం సాగించే పరిస్థితుల్లో ఉన్నారన్న దానికి మించిన అదృష్టం ఏముంది? మీరు యుద్ధాలు జరిగే నేల మీద, భూకంపాలు వచ్చే చోట, కరువు తాండవించే చోట లేరని కర్ఫ్యూ మధ్య లేరని అప్పుల్లో లేరని తెలుసుకుంటే పోల్చి చూసుకుంటే మీ జీవితం ఎంత వరప్రసాదమో తెలుస్తుంది. అసలు ముందు మీకు ఉన్న గొప్ప పాజిటివ్ విషయాలేమిటో చెప్తూ వెళతాను. నెగెటివ్ విషయాలు వాటికవే దూదిపింజల్లా తేలిపోతాయి’ అన్నాడు సైకియాట్రిస్ట్.సెషన్స్ మొదలయ్యాయి.కొన్నాళ్లకు విడివిడిగా ఉన్న ఆ ముగ్గురు ఒక కుటుంబంగా బతకడం నేర్చుకున్నారు. ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
ఊహూ ఆ అమ్మే కావాలి
ఇద్దరు తల్లులు.. ఇద్దరు బిడ్డలు... పిల్లలు తారుమారయ్యారు... తల్లులు కనిపెట్టలేకపోయారు. తీరా కనిపెట్టాక ఈ వింత జరిగింది. ఆమె ఒక ముస్లిం యువతి. పేరు రెహానా (పేరు మార్చాం). అసోంలో ఒక చిన్న గ్రామంలో ఉంటోంది. నిండు చూలాలు. నెలలు నిండటంతో మంగోల్డోయ్ ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకోవడానికి వచ్చింది. అక్కడి వారి నియమానుసారం కేసు షీటులో అన్నీ పూర్తి చేసింది. కాన్పు సులువుగానే అయ్యింది. పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. నర్సు వచ్చి పసిబిడ్డకు స్నానం చేయించడానికి తీసుకువెళ్లింది. శుభ్రంగా ఒళ్లంతా కడిగి, సాన్నం చేయించి, పొడి వస్త్రంలో చుట్టి తీసుకువచ్చి తల్లి దగ్గర పడుకోబెట్టింది. తల్లి ఆ బిడ్డను అక్కున చేర్చుకుని పాలు తాగించి నిద్రపుచ్చింది. అదే రోజున ప్రభ (పేరు మార్పు చేశాం) అనే బోడో యువతి కూడా అదే ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చింది. ఆమెకు కూడా పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ పసివాడికి కూడా నర్సు స్నానం చేయించి పొడి వస్త్రంలో చుట్టి తల్లికి అప్పచెప్పింది. పిల్లవాడు పాలు తాగి హాయిగా నిద్రపోయాడు. ఈ ఇద్దరూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి, ఇంటికి వెళ్లారు. ఇద్దరూ ప్రతిరోజూ పసిబిడ్డకు స్నానం చేయించి, బిడ్డకు పాలిచ్చి నిద్ర పుచ్చారు. ఇలా వారం రోజులు గడిచాయి. రోజూ స్నానం చేయిస్తున్నా గమనించని ఆ ముస్లిం అమ్మ, ఆ రోజు బిడ్డను చూసి ఆశ్చర్యపోయింది. తల్లిదండ్రుల పోలికలు లేకుండా ఉన్నాడు బిడ్డ. పోలికలే కాదు, వేరే జాతి పిల్లవాడిలా ఉన్నాడు. ఇలా ఎలా జరిగిందో అర్థం కాలేదు. వెంటనే ఆమె భర్తతో కలిసి ఆసుపత్రికి వెళ్లింది. ఆ రోజు ప్రసవించిన ప్రభ వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకుంది.ఆమె ఇంటికి వెళ్లింది. అక్కడకు వెళ్లిన వెంటనే ప్రభ ఒడిలోని బాబుని చూసింది. ఆశ్చర్యపోయింది. తన పోలికలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఆ బిడ్డ తన బిడ్డేనని, ఆసుపత్రిలో బిడ్డలు తారుమారయ్యారని చెప్పింది. ప్రభ అంగీకరించలేదు. ఆ బిడ్డ తమ బిడ్డేనంటూ గట్టిగా ఏడుస్తూ, బిడ్డను గుండెలకు హత్తుకుంది. రెహానా ఎంత చెప్పినా ప్రభ అంగీకరించలేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో రెహానా న్యాయ పోరాటం చేసింది. ఆ బిడ్డ ఆమె బిడ్డే అని కోర్టు తీర్పు చెప్పింది. న్యాయపరంగా తన బిడ్డను తనకు ఇవ్వమని కోరింది రెహానా. అన్ని రోజులపాటు పాలిచ్చి పెంచిన బిడ్డను ఇవ్వడానికి ప్రభ మనసు అంగీకరించలేదు. అయితే తాను పెంచిన తల్లిని మాత్రమేనని, నవ మాసాలు మోసిన తల్లికే బిడ్డ మీద అధికారం ఉంటుందని చాలాసేపటికి అర్థం చేసుకుంది ప్రభ. తన అజ్ఞానానికి విచారిస్తూ, రెహానా బిడ్డను ఆమెకు ఇవ్వడానికి అంగీకరించింది. ఇంతవరకు కథ బాగానే ఉంది. అసలు ఇబ్బందంతా ఇక్కడే వచ్చిపడింది.ప్రభ తన ఒడిలోని బిడ్డను రెహానాకు అందించబోయింది. ఆ బిడ్డ ప్రభను విడిచిపెట్టలేదు. చీర గట్టిగా పట్టేసుకున్నాడు. రెహానా ఆమె చీర విడిపించి, బిడ్డను తన ఒడిలోకి తీసుకుంది. గుక్క పెట్టి ఏడ్వడం మొదలుపెట్టాడు. ఎవరు ఎంత ఆడించినా ఏడుపు ఆపలేదు. బిడ్డను తన వైపు మళ్లించుకోవడానికి రెహానా ఎంతగానో ప్రయత్నించింది.ఇదే సంఘటన ప్రభకూ అనుభవమైంది. రెహానా దగ్గర నుంచి తన బిడ్డను తీసుకుని ఎత్తుకుంది. ఆ పిల్లవాడూ గుక్క పట్టి ఏడ్వడం మొదలుపెట్టాడు.ఇద్దరు తల్లులకు ఏం చేయాలో అర్థం కాలేదు. కన్న పేగు కంటె, పెంచిన మమకారానికి లొంగిపోయారు ఆ పసికందులు. కన్న తల్లి చేతుల నుంచి, పెంచిన తల్లి చేతుల్లోకి వెళ్లగానే ఇద్దరూ ఏడుపు ఆపేశారు. కన్నతల్లిని కాదు, పుట్టిన మరుక్షణం నుంచి పాలిచ్చి పెంచిన తల్లినే కన్నతల్లిగా భావించారు. చిరునవ్వులు చిందించారు. ఆమే తన తల్లి అని గుర్తుపట్టినట్లుగా, ఆ పసిపిల్లలిద్దరూ తల్లులను గట్టిగా పట్టేసుకున్నారు... ‘‘నువ్వే మా అమ్మవు’’అన్నట్లుగా ఉంగా ఉంగా అంటూ అమ్మలతో మాట్లాడారు.చేసేదిలేక ఒకరి కన్న బిడ్డను మరొకరు తమతో తీసుకెళ్లారు. బరువెక్కిన గుండెలకు ఆ పిల్లలను అదుముకున్నారు. ఇది చాలా వింత, విచిత్ర కథ. సృష్టి అంటే ఇదేనేమో. ఎవరు ఎవరిని పెంచాలో ఆ దేవుడే నిర్ణయించి ఉంటాడు. అందుకే ఒకరు కన్నారు మరొకరు పెంచారు. వీరిద్దరూ యశోదలే. ఇద్దరూ దేవకీదేవులే! -
పాలివ్వడం మా జన్మహక్కు
అది అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం. ఒక ఆఫీసుకు ఒక తల్లి తన నాలుగు నెలల బిడ్డతో పాటు పని ఉండి వచ్చింది. ఆఫీసు రిసెప్షన్ ఏరియాలో కూర్చుని పాలు ఇవ్వడానికి పూనుకుంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ అభ్యంతర పెట్టాడు. ‘మీ వక్షోజాలు కనపడకుండా కప్పుకోండి’ అన్నాడు. ‘బహిరంగంగా పాలు ఇచ్చే హక్కు నాకుంది’ అని చెప్పిందామె. ‘కాని మీరిక్కడ ఇలా ఇవ్వడానికి లేదు. చాటుకు వెళ్లండి’ అన్నాడతను. మరి కాసేపటిలో ఆమెను అక్కడినుంచి పంపించేశాడు. కాని వెళ్లినతల్లి ఊరుకోలేదు. ఈ విషయాన్ని నలుగురికీ చెప్పింది. తనలా బిడ్డల తల్లులైన మరో పదిహేనుమందితో అదే ఆఫీసుకు చేరుకుంది. వాళ్లంతా ఆ ఆఫీసు రిసెప్షన్లో పిల్లలకు అందరూ చూస్తుండగా పాలు ఇవ్వడం మొదలుపెట్టారు. పిల్లల ఏడుపు, తల్లుల నిరసన... వీటి దెబ్బకు ఆఫీసు వారు దిగి వచ్చారు. ‘ఇంతకు మునుపు జరిగింది తప్పే. పాలు ఇవ్వడం మీ హక్కు’ అని క్షమాపణ పత్రం రాసి ఇచ్చారు. ఈ గోలంతా తెలియని పసికూనలు తల్లి పాలను కమ్మగా గుటకలు వేస్తూ కునుకు తీశారు. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఒక ఊరు.అక్కడి చర్చ్‌లో ఒక బాలింత ప్రార్థనకు వచ్చింది.చర్చ్‌లో తన బిడ్డకు పాలు ఇవ్వబోయింది.కాని దీనిని చర్చ్ బాధ్యులు అంగీకరించలేదు.ఆమె పాలిచ్చే పద్ధతి వల్ల ఇతరుల ఏకాగ్రత భంగమవుతుంది కనుక ఆమెను చర్చ్ నుంచి బయటకు వెళ్లిపోమ్మన్నారు. లేదా లేడీస్ బాత్రూమ్కు వెళ్లి పాలు ఇవ్వమన్నారు. ఇది ఆమెకు చాలా కోపం తెప్పించింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే 1600 మంది దానిని షేర్ చేశారు. ‘పోప్ అంతటివారే స్వయంగా చర్చ్‌లో బిడ్డలకు పాలు ఇవ్వవచ్చునని చెప్పారు. మరి ఎందుకు మమ్మల్ని పాలివ్వకుండా నిరోధిస్తున్నారు?’ అని వారు ప్రశ్నించారు.‘పిల్లలు పాలు తాగడం అంటే వారు భోజనం చేయడం లాంటిది. మనల్ని ఎవరైనా బాత్రూమ్లో భోజనం చేయమని అంటారా? మరి నా బిడ్డ బాత్రూమ్లో ఎందుకు పాలు తాగాలి?’ అని ఆ తల్లి ప్రశ్నించింది.చివరకు ఈ గొడవ మరీ పెద్దదవక ముందే చర్చ్వారు రాజీకి వచ్చారు. తమ చర్చ్‌లో తల్లులు పిల్లలు పాలివ్వవచ్చునని ప్రకటించారు. ఇటీవల అర్జెంటైనాలో మరో సంఘటన జరిగింది. రోడ్డు పక్కన ఒక బాలింత ఫుట్ పాత్ మీద తన బిడ్డకు పాలివ్వబోయింది.దానిని అక్కడి పోలీస్ వారించాడు. ‘పాలిచ్చేటప్పుడు నీ వక్షం కనపడుతోంది. ఇవ్వొద్దు’ అని వారించాడు. అంతేకాదు ‘చెప్పినా వినకుండా ఇచ్చావంటే నిన్ను అరెస్ట్ చేస్తాను’ అని కూడా హెచ్చరించాడు. అర్జెంటీనాలో బహిరంగంగా చనుబాలు ఇవ్వడం నేరం అని చెప్పే చట్టం ఏదీ లేదు. అయినా కాని ఆ పోలీస్ అలా బెదిరించడంతో ఆ బాలింత ఫేస్‌బుక్‌ను ఆశ్రయించింది. అది పెద్ద ప్రకంపననే సృష్టించింది. దాంతో వందలాది మంది తల్లులు అక్కడి పార్కులో తమ బిడ్డలతో సహా వచ్చి సామూహిక స్తన్యమిచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలో తల్లిపాలు ఇవ్వడం నామోషీగా భావించే ఒక ధోరణి ఉన్న సందర్భంలో అమెరికా, యూరప్, లాటిన్ అమెరికాలలో స్తన్యమిచ్చే హక్కు కోసం తల్లులు నిరసనలకు దిగడం ఎక్కువయ్యింది. నిన్నగాక మొన్న అంటే నవంబర్ 3వ తేదీన కొలంబియాలోని బొగొటా నగరంలోని ఒక పార్కులో రెండు వేల మంది తల్లులు ఒక పార్కులో చేరి కొన్ని గంటల పాటు బహిరంగంగా (వక్షం కనిపించేలాగా) బిడ్డలకు పాలు ఇస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.‘పిల్లలకు పాలు ఇవ్వడం బూతు కాదు’ అని వారు చేస్తున్న ప్రచారం.‘మర్యాదస్తులు’ పెరిగిపోవడం, ‘సంస్కారాన్ని’ వ్యాఖ్యానించడం ఎక్కువైపోయిన ఈ రోజుల్లో ఒక తల్లి తన బిడ్డకు ఏ ఆచ్ఛాదన లేకుండా పాలు ఇవ్వడం ఒక ‘కుసంస్కారం’గా భావించడానికి ఆయా దేశాలలోని తల్లులు సహించడం లేదు.‘మన నాగరికత ఎంత వరకూ చేరిందంటే స్తన్యానికి మాతృత్వ భావన పోయి కేవలం శృంగారభావన మాత్రమే మిగిలింది’ అని ఒక తల్లి వ్యాఖ్యానించింది.భారతదేశంలో పల్లెల్లో అందరూ చూస్తుండగా పాలివ్వడం తల్లులు, చూపరులు తప్పుగా భావించరు. కాని పట్టణాల్లో, నగరాల్లో ‘బ్రెస్ట్‌ఫీడ్ రూమ్స్’ అని కొన్ని తయారయ్యాయి. లేదంటే చాటుగా ఇచ్చే పరిస్థితి అలిఖితంగానే ఉంది. లేదా మనకు చీరకట్టు వల్ల పవిట ఒక సౌలభ్యం కావడంతో పవిట చాటు నుంచి పాలు ఇచ్చే సౌకర్యం ఉంది. కాని పాశ్చాత్య వస్త్రధారణలో వక్షాన్ని చాటు చేసుకోవడం అన్నిసార్లు సాధ్యం కాదు. వక్షం కనపడుతుండగా పాలు ఇవ్వడానికి బహిరంగ ప్రదేశాలలో కొందరు తప్పు పట్టడం, అభ్యంతరం వ్యక్తం చేయడం తల్లులు సహించలేకపోతున్నారు. పాలివ్వడం మా జన్మహక్కు అంటున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆగి వెళ్లడం మనిషి అలవాటు చేసుకున్నాడు. తల్లి తన బిడ్డకు పాలు ఇస్తుంటే ఆమెకు సౌకర్యాన్ని కలిగిస్తూ తన దారిన తాను ఎందుకు వెళ్లలేకపోతున్నాడు?‘బిడ్డకు ఆకలి వేసే టైమే పాలిచ్చే టైమ్. అది ఎక్కడ ఎలా ఉంటే అక్కడ ఇచ్చి తీరాల్సిందే’ అని ఒక పసిబిడ్డ తండ్రి పాలిస్తున్న తన భార్యను చూస్తూ అన్నాడు బొగొటా నగరం పార్కులో.బిడ్డ ఆకలితో ఉన్నా వక్షం కనిపిస్తుందన్న భయంతో పాలు పట్టకుండా ఉండటం కంటే దారుణమైన సంగతి మరొకటి లేదని తల్లులు వాదిస్తున్నారు.‘వక్షం కనిపించేలా పాలు ఇచ్చే మా హక్కును ఎవరూ కాదనలేరు’ అని వారు నినదిస్తున్నారు.అయినా కొన్ని రెస్టారెంట్లు, పబ్లిక్ ప్లేసుల నిర్వాహకులు, ప్రయాణ సాధనాల ఆపరేటర్లు ఈ విషయంలో తమ సంస్కార స్థాయిని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సర్వేలు చెబుతున్నాయి.భారతదేశంలోని నగరాలలో ఉన్న తల్లులు ఇంకా ఈ సమస్యను సమస్యగా చెప్పే పరిస్థితిలో లేరు. ‘సాంస్కృతిక రక్షణ’ పెచ్చు మీరితే వారూ గొంతెత్తే రోజు దూరంలో లేదు.ఒక్కటి మాత్రం నిజం– తన బిడ్డకు పాలివ్వకుండా తల్లిని ఆపే శక్తి ఎవరికీ లేదు. ఉండదు. కరెక్ట్ అవ్వాల్సింది మనమే... తల్లులు కాదు. ఫేస్‌బుక్‌కు బడితెపూజ ఫేస్బుక్లో కొన్నిసార్లు తల్లులు తమ బిడ్డలకు పాలిచ్చే ఫొటోలను పోస్ట్ చేస్తే ఫేస్బుక్ తన నియమావళిలో భాగంగా వాటిని తొలిగించడం కొంతమంది తల్లులకు నచ్చలేదు. ‘అవి అశ్లీలం కిందకే వస్తాయి’ అనే ఫేస్బుక్ వాదనను వారు తిరగ్గొట్టారు. ‘ఒక డేటింగ్ కంపెనీవాళ్ల యాడ్‌లో అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిని మీరెందుకు తీసేయలేదు’ అని వారు ప్రశ్నించారు. అంతే కాదు వేలాది మంది తల్లులు ఒక విజ్ఞాపనను సంతకం చేసి ఫేస్‌బుక్‌కు పంపారు. దాని సారాంశం ‘బిడ్డలకు పాలు ఇవ్వడం ఆశ్లీలం కాదు’ అని చెప్పడమే. -
పురుష ఉద్యోగులకు బంపర్ ఆఫర్
స్వీడన్‌కు ఫర్నిచర్ కంపెనీ ఐకియా ఇండియా తన కంపెనీలో తల్లితండ్రులైన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లితోపాటు తండ్రికూడా ఆరు నెలల సెలవు దినాలను వర్తింప చేయనుంది. ఈ మేరకు కొత్త పేరెంటల్ లీవ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇక మీదట పురుష ఉద్యోగులకు కూడా ఆరు నెలల పెయిడ్ పెటర్నటీ లీవును అమలు చేయనుంది. తన సహ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ కొత్త విధానాన్ని ప్రకటించడం సంతోషగా ఉందని ఐకియా హెచ్ఆర్ మేనేజర్ అన్నా కారిన్ మాన్సన్ చెప్పారు. మహిళా ఉద్యోగులకు 26 వారాలకు వేతనంతోకూడిన సెలవుదినాలతోపాటు , మరో 16 వారాల పాటు పనిగంటల్లో 50శాతం కోత పెడుతున్నట్టు స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా. సంస్థలో ఉద్యోగులందరికీ ఈ కొత్త విధానాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు తల్లులైన మహిళా ఉద్యోగులకు అదనపు సౌకర్యాలను కల్పించనున్నామని చెప్పారు. ట్యూబెక్టమీ చేయించుకున్న మహిళలకు అదనంగా మరో రెండువారాల సెలవు ఇస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ గర్భధారణ, ప్రసవం కారణంగా అనుకోని అనారోగ్యం బారిన పడితే గరిష్టంగా ఒక నెలపాటు సెలవు ఇస్తున్నట్టు తెలిపింది. సరోగేట్, సింగిల్ పేరెంట్, దత్తత తీసుకున్నా కూడా ఈ నిబంధన వర్తిస్తున్నందని కారిన్ మాన్సన్ తెలిపారు. 50/50 లింగ సమతుల్యతను సాధించే దిశగా తాము కృషి చేస్తున్నట్టు తెలిపారు. కుటుంబ బాధ్యతల్లో, పిల్ల పెంపకంలో ఉన్న ఉద్యోగుల కరియర్ కోసం డే కేర్ సెంటర్లు, దీర్ఘకాలిక శిక్షణ, డెవలప్మెంట్ ప్లాన్స్ లాంటి కొన్ని ప్రత్యేక చర్యల్ని కూడా చేపడుతున్నట్టు చెప్పారు. కాగా జర్మనీకి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం డ్యుయిష్ బ్యాంక్ ఇండియా కూడా తండ్రులు 6 నెలల సెలవును ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
లబ్ధిదారులకు బాండ్ల పంపిణీ
మునగాల: 2005–2011 సంవత్సరాల మధ్యలో బాలికా శిశు సంక్షేమ అభివృద్ధి పథకానికి దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారులకు మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో కోదాడ ఐసీడీయస్ సీడీపీఓ కృష్ణకుమారి చేతుల మీదుగా బాండ్లను పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఇద్దరు ఆడపిల్లలు కన్న తల్లులతో పాటు ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించుకున్న మహిళలు 150 మంది లబ్ధిదారులకు, బంగారుతల్లి పథకం లబ్ధిదారులకు బాండ్లను పంపీణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు ఆడపిల్లల ఉన్న తల్లిదండ్రులకు రూ.60వేలు, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లికి రూ.లక్ష చొప్పున బాండ్లను పంపీణీ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ బాండ్లు బాలికకు 20ఏళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ లోగా బాండ్లు పొందిన పిల్లలు మధ్యలో చదువు మానేసిన, వివాహాం చేసుకున్న ఈ బాండ్లు వర్తించవని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భీమపంగు అక్కమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు సంధ్య, మణి, మణెమ్మ, కమల, రూప తదితరులు పాల్గొన్నారు. -
తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం: డాక్టర్ కళ్యాణ్
కాపుగల్లు(కోదాడరూరల్): తల్లి పాలే బిడ్డకు ఆరోగ్యకరమని, దీనిపై ప్రజల్లో అవగాహన కలిగించాలని కాపుగల్లు వైద్యాధికారి కల్యాణ్‌చక్రవర్తి సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాలవారోత్సవాల సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. తల్లిపాలలో బిడ్డకు కావాల్సిన పోషకాలు అందడంతో పాటు రోగనిరోధక శక్తి కూడ పెరుగుతుందన్నారు. పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు తాగించాలని ఆయన సూచించారు. ఆరు నెలల పాటు తప్పకుండా తల్లి పాలే ఇవ్వాలని దీంతో బిడ్డకు శ్వాస సంబంధ, కామెర్లు వంటి వ్యాధులు దరి చేరవన్నారు. తల్లిపాలు వెంటనే జీర్ణమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది భారతమ్మ, పద్మ, ఇందిర ,ఉమామహేశ్వరీ, ప్రమీల, స్వరూప, రూప, భవాని, శాంతకుమారి, జీవమ్మ, వెంకట్‌నారాయణ, రాజ్యం, కవిత, సుకన్య, నాగేంద్రమ్మ, సూజాత, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే తాటికి మాతృవియోగం
దమ్మపేట: అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాతృమూర్తి బుల్లెమ్మ(80) గురువారం పశ్చిమగోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం మర్రిగూడెంలోగల చిన్న కుమారుడు చిన్న వెంకటేశ్వర్లు స్వగృహంలో గురువారం మృతిచెందారు. ఆమె కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గురువారం మర్రిగూడెం తన చిన్నకుమారుడు చిన్న వెంకటేశ్వర్లు నివాసంలో తుది శ్వాస విడిచారు. తాటి వెంకటేశ్వర్లును రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్లో పరామర్శించారు. -
అమ్మలూ ఈ హెచ్చరిక వినండి!
న్యూయార్క్: మాతృమూర్తులకు అమెరికాకు చెందిన ఓ అధ్యయన సంస్థ హెచ్చరికలు చేసింది. తమ చిన్నారుల ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం ద్వారా లేనిపోని సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆ అధ్యయనం తెలిపింది. అప్పుడే జన్మించిన తమ పిల్లల ఫొటోలను ప్రతి రోజు ఫేస్ బుక్ లో పెట్టే విద్యావంతులైన తల్లులు, ఆయా సంస్థల్లో పనిచేసే మాతృమూర్తులు అనవసరంగా మానసిక ఒత్తిడికి లోనవుతారని ఆ అధ్యయనం పేర్కొంది. ఎందుకంటే అలా తమ పిల్లల ఫొటోలు పోస్ట్ చేసిన తల్లులు వెంటనే ఎన్ని లైక్‌లు వచ్చాయని, కామెంట్స్ ఎన్ని వచ్చాయని చూస్తారని, పాజిటివ్ గా రాకుంటే అనవరసం ఒత్తిడికి గురవుతారని తెలిపింది. అమెరికాలోని ది ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఈ అధ్యయనం నిర్వహించారు. అది కూడా ఎక్కువగా చదువుకున్న తల్లుల మీదే. వీరి అధ్యయనం ప్రకారం ఎక్కువగా చదువుకున్న మహిళలు తామే గొప్ప తల్లులం అనిపించుకోవాలని, పిల్లలను గొప్పగా పెంచుతున్నాం అని నలుగురి నుంచి మన్నన పొందాలనే ఉద్దేశంతో ఫేస్బుక్ లో తమ చిన్నారుల ఫొటోలు పోస్ట్ చేస్తారట. వాటి వెంటే భావోద్వేగంతో నిండిన మాటలు కూడా అందులో పెడతారంట. తిరిగి వాటికి సానుకూల స్పందన రాకుంటే మాత్రం తీవ్రంగా డిప్రెషన్‌కు లోనవుతారని వారు చెబుతున్నారు. ఇది క్రమంగా ఒక జబ్బుగా మారే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అసలు ఆ ఫొటోలు పోస్ట్ చేయడం కన్నా మానేయడమే మంచిదని చెబుతున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలిగొంది
♦ కడుపులోనే బిడ్డ, పరిస్థితి విషమించి తల్లి మృతి ♦ సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన హైదరాబాద్ : వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డల ఉసురుతీసింది. కాన్పుకోసం వచ్చిన నిం డు గర్భిణిని ఆసుపత్రిలో చేర్పుకోకుండా తిప్పి పంపడంతో కడుపులోనే శిశువు మృతి చెందగా.. ఆరోగ్యం విషమించి కొన్ని గంట్లోనే తల్లి కూ డా మృత్యువాత పడింది. ఈ విషాద ఘటన సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో జరిగింది. దీంతో మృతుల కుటుం బసభ్యులు ఆసుపత్రి వద్ద మంగళవారం ఆందోళనకు దిగారు. బాధితుల కథనం ప్రకారం... కందూకూరు మండలం మాదాపూర్‌కు చెందిన శ్రీనివాస్ లారీడ్రైవర్. ఏడాది క్రితం ఇతనికి నాదర్గుల్కు చెందిన మమతతో పెళ్లైం ది. మమత గర్భం దాల్చడంతో భర్త ప్రతీనెలా సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించాడు. నెలలు నిండడంతో కాన్పు కోసం మమతను సోమవారం ఉదయం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. సోమవారం రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో వైద్యులు మమతను ఆసుపత్రిలో చేర్చుకోకుండా బుధవారం రావాలని చెప్పిపంపేశారు. మంగళవారం తెల్లవారుజామున 1.45కి మమతకు తీవ్రమై కడుపు నొప్పి రావడంతో మళ్లీ సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతికి తీసుకొచ్చారు. మమతను పరీక్షించిన వైద్యులు అప్పటికే కడుపులోని శిశువు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మమత పరిస్థితి సైతం విషమించడంతో తెల్లవారుజామున 2.25కి మృతి చెందిం ది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లీబిడ్డల ప్రాణాలు పోయాయని బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగడంతో మూ డు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొం ది. ఆస్పత్రికి వచ్చిన రోజే నిండు గర్భి ణి అయిన మమతను ఆసుపత్రిలో చేర్చుకొని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని వారు రోదించారు. సమాచారం తెలుసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు ఆస్పత్రిలో భారీగా బలగాలను మోహరించి బందోబస్తు నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యం ఉంటే తమకు ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు రోగి బంధువులకు న చ్చచెప్పారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం వైద్యులపై చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడంతో ఆందోళన విరమించారు. బీపీ వల్లే మమత చనిపోయింది గర్భిణి మమతకు అధికంగా బీపీ ఉందని, అలాగే ఉపిరితిత్తుల్లో నీరు చేరడంతోనే చనిపోయింది. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉండటంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి బాగా పెరిగింది. మమత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. -డాక్టర్ రత్నకుమారి ఆసుపత్రి సూపరింటెండెంట్ -
అమ్మల సమక్షంలో మోదీ-షరీఫ్ మాట్లాడాలి!
బరెలీ (ఉత్తరప్రదేశ్): భారత్-పాకిస్థాన్ అన్నదమ్ముళ్లలాంటివి. కాబట్టి మన రెండు దేశాల ప్రధానమంత్రులు వారి అమ్మల సమక్షంలో చర్చలు జరిపితే.. ఇరుదేశాల సమస్యలకు కచ్చితమైన పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు ప్రముఖ ఉర్దూ కవి మునావరణ్ రాణా. 'ఇద్దరు ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, నవాజ్‌షరీఫ్ తమ అమ్మల సమక్షంలో చర్చలు జరిపితే ఇరుదేశాల సమస్యలకు తప్పక పరిష్కార మార్గం దొరుకుతుంది. అమ్మలు చెంత ఉన్నప్పుడు ఎంతటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది' అని ఆయన మంగళవారం ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్‌లు అన్నదమ్ముళ్లని, అందుకే పొరుగు దేశాన్ని ఇటీవల సందర్శించడం, నవాజ్ షరీఫ్ తల్లి పాదాలకు నమస్కరించడం ద్వారా అన్నగా తన బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వర్తించారని మునావర్ రాణా ప్రశంసించారు. ఇప్పుడు తదుపరి చొరవ తీసుకోవాల్సిన బాధ్యత షరీఫ్‌పై ఉందన్నారు. మునావర్ రాణా ఇటీవల తనకు ప్రకటించిన సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాను కానీ, తన కొడుకు కానీ ప్రభుత్వ అవార్డులు తీసుకోరాదని నిర్ణయించామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. -
కష్టమే వచ్చిందో..కడతేర్చారో?
తల్లీ, కూతుళ్లు అనుమనాస్పద మృతి హత్యేనని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ, పోలీసులకు ఫిర్యాదు కష్టమే వచ్చిందో.. కడతేర్చారో తెలియదుగాని తల్లీ, కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఉరిపోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారో, ఎవరో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారో తెలియదుగాని శవాలై చెట్టుకు వేలాడారు. ఈ విషాద ఘటన కొత్తూరు మండలంలోని కర్లెమ్మ పంచాయతీ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. కొత్తూరు: కర్లెమ్మ పంచాయతీ పరిధిలోని ఎన్ఎన్ కాలనీలో ఉంటున్న అగ్నిమాపకశాఖ మాజీ ఉద్యోగి పి.సుందరనారాయణ తన మొదటి భార్య చనిపోవడంతో ఒడిశా రాష్ట్రంలోని జీబ గ్రామానికి చెందిన సరోజినిని (35) ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండో తరగతి చదువుతున్న సంజినీ (7) కుమార్తె ఉంది. శనివారం సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురైన సరోజిని కుమార్తె సంజినీ తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై సరోజిని కన్నవారింటికి ఫోన్లు చేయగా రాలేదని సమాధానం వచ్చింది. ఈ క్రమంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయిన తల్లీ, కుమార్తె కర్లెమ్మ గ్రామ సమీపంలో మామిడితోటలోని ఓ చెట్టుకు చీర కొంగుతో ఉరిపోసుకొని వేలాడుతూ శవాలై ఆదివారం ఉదయం కనిపించారు. చీరను రెండు ముక్కలు చేసి ఒక కొంగుతో సరోజిని, మరో కొంగుతో చిన్నారి సంజినీ వేర్వేరు చెట్లకు ఉరిపోసుకొని ఉండటాన్ని స్థానికులు కనుగొన్నారు. సంజినీ మృతదేహం నేలకు తాకుతూ ఉంది. కిందని బిస్కెట్ ప్యాకెట్, తల్లీ కుమార్తె చెప్పులు ఉన్నాయి. విషయాన్ని వీఆర్వో కృష్ణచంద్ర పట్నాయక్‌కు తెలియజేశారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్చార్జి ఎస్సై రామకృష్ణ , ఆర్ఐ వై.కూర్మనాయుకులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సుందరనారాయణ, అతని మొదటి భార్య కుమార్తెలే తన కుమార్తె సరోజిని, మనమరాలు సంజినీ హత్య చేసి చెట్టుకు వేలాడదీసేశారని అనుమానం వ్యక్తం చేస్తూ సరోజిని తండ్రి దుర్జన కొత్తూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు ఇన్చార్జి ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎన్నో అనుమానాలు! తల్లీ, కూతురు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరోజిని తెలియని, నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిలో తల్లీ, బిడ్డలను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు శవాలను మామిడి తోటలోకి తీసుకొచ్చి చెట్లకు వేలాడిదీసి ఉంటారనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుందరనారాయణ, ఆయన మొదటి భార్య కుమార్తెలు కలిసి తల్లీ కూతురును నిత్యం వేధిస్తుండేవారని, కన్నవారి ఇంటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేయడంతోపాటు సూటిపోటు మాటలతో ఇబ్బందులకు గురి చేయడంతో పలుమార్లు విషయాన్ని సరోజని తన తండ్రి దుర్జనకు తెలిపినట్లు సమాచారం. కాగా సరోజిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సుందరనారాయణ, అతని తొలి భార్య కుమార్తెలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సరోజని కూతురుతో కలసి ఇంటి నుంచి వచ్చిన గంట ముందు లెట్రిన్ ట్యాంకు విషయమై కుటుంబ సభ్యులతో వివాదం జరిగినట్టు సమాచారం. కాగా సరోజని, కుమార్తెలతో కలిసి సుందరనారాయణ ఇటీవల వారం రోజుల పాటు తీర్థయాత్రలకు వెళ్లి.. రాజమండ్రి పుష్కర స్నానాలు ఆచరించి ఈ నెల 14 తేదీ రాత్రే ఇంటికి చేరారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో గ్రామస్తులు తీవ్ర విషాదానికి గురయ్యారు. -
కేక్... రొటీన్‌కు బ్రేక్
- ఠీఇంట్లోనే కేక్‌లు సిద్ధం - విభిన్న రుచుల్లో లభ్యం వేసవి కాలంలో ఇళ్లలోఉండే పిల్లలకు విభిన్న రుచులు చూపించేందుకు రెడీ అవుతున్నారు అమ్మలు. రోజూ అమ్మ చేతి వంట తినే పిల్లలు... సెలవులు కదా అని బయటకు తీసుకెళితే చిరుతిళ్ల కోసం మారాం చేస్తున్నారు. బేకరీ ఫుడ్ నోట్లో పడేదాకా నానా అల్లరి చేస్తున్నారు. అందుకే పిల్లలు అతిగా ఇష్టపడుతున్న కేకులు, స్వీట్లను ఇంట్లోనే రెడీ చేసి ఇవ్వాలనుకుంటున్న సిటీవాసులు... శిక్షణ సంస్థల బాట పడుతున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టుగానే కేవలం ఒక రోజులోనే పూర్తి స్థాయి శిక్షణను ఇస్తున్నాయి వివిధ సంస్థలు. ఎగ్ఫ్రీ బేకింగ్, కేక్ డెకరేషన్, డిసార్ట్స్, డూనట్స్, చాక్లెట్ మేకింగ్, పెస్ట్రీలు, ట్రఫుల్, సాస్, ఫ్రూట్ కేక్, మ్యాంగో చాక్లెట్ కేక్, పైనాపిల్ పెస్ట్రీ నేర్చుకునేందుకు చాలా మంది మహిళలు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు బోయిన్‌పల్లిలోని టంక్డ్లైట్ నిర్వాహకురాలు ప్రియాంక టంక్. హోం బేకింగ్ అయితే ఎప్పటికప్పుడు తాజాగా... మన అభిరుచులకు అనుగుణంగా రెడీ చేసుకునే అవకాశముంటుందని అంటున్నారు. ఆసక్తి చూపుతున్నారు కప్‌కేక్స్, అసార్టెడ్ చాక్లెట్, కప్‌కేక్స్ బాక్సెస్, చాక్లెట్ థీమ్ బోటిక్, కప్ కేక్స్ థీమ్ బొటిక్, ముఫిన్స్, జెల్లీస్, 2-టైర్, 3-టైర్ వెడ్డింగ్ కేక్స్‌కు సిటీలో మంచి డిమాండ్ ఉంది. విభిన్న ఆకృతుల కేక్‌లు, చాక్లెట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు సిటీవాసులు. పిల్లలు కూడా అవే ఇష్టపడుతున్నారు. అందుకే మేం ఈ చాక్లెట్, కేకుల తయారీలో శిక్షణ ఇస్తున్నామని చెబుతోంది ప్రియాంక టంక్. ‘ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్ను కాపాడుకోవాలనుకుంటున్న సిటీవాసుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని డిఫరెంట్ కేకుల బేకింగ్‌లో శిక్షణ ఇస్తున్నాం. కేలరీ గురించి ఆందోళన చెందే వారికి జింజర్ బ్రెడ్ కేకులు, ఓట్మీల్ కేకులను రెడీ చేయిస్తున్నాం. హెల్తీ, ఫ్యాట్ ఫ్రీతో పాటు టేస్టీగా ఉండేలా చూస్తున్నాం. దీనికి సిటీవాసుల నుంచి మంచి స్పందన ఉంటుద’ంటున్నారు కేక్ డిజైనర్ ప్రియాంక. ఇవీ నా ఫేవరేట్... ‘బర్త్‌డేలు, వివాహ వేడుకలకు డిజైన్ చేసే కేకులు నా ఫేవరేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి స్పెషల్ మూమెంట్స్. అలాంటి వాటిలో నేను భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంద’ని చెబుతున్నారు ప్రియాంక. ఎంతో మంది మహిళలకు చాక్లెట్ తయారీ, కేక్ బేకింగ్‌లో శిక్షణ ఇస్తున్నందుకు గర్వంగా ఉందంటున్నారు. పని ఒత్తిడి దూరం... ‘కేక్ బేకింగ్ పని ఒత్తిడిని దూరం చేస్తుంది. కొన్నిసార్లు థెరపటిక్గా కూడా పని చేస్తుంది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్లు వీకెండ్లలో మా వద్ద శిక్షణకు వస్తున్నారు. ఐదు రోజుల పాటు పనిలో బిజీగా ఉండే వీరికి కేక్ బేకింగ్... ఆ ఒత్తిడి నుంచి దూరం చేస్తోంది. కొంత మంది శిక్షణ తీసుకున్న వారు ఉద్యోగాలకు రాజీనామా చేసి సొంతంగా వెంచర్‌ను ప్రారంభిస్తున్నవారు కూడా ఉన్నారంటున్నారు ప్రియాంక. ఆర్డర్లపై చాక్లెట్లు, కేకులను పంపిణీ చేస్తున్నామని వివరించారు. అభిరుచి నుంచి వృత్తి వైపు... ‘కేక్ బేకింగ్, చాక్లెట్ తయారీమంచి హాబీ. ఇంట్లో వారి కోసం ఎప్పుడూ చేస్తుండేదాన్ని. ఇలా ఒక రోజు వంట పోటీల్లో పాల్గొన్నా. ఆ అనుభవంతోనే నేను సొంతంగా వెంచర్‌ను ప్రారంభించాలకున్నా. సిటీలోని ఆరోరా కాలేజీ నుంచి ఎంబీఏ (ఫినాన్స్) పూర్తవగానే హాబీనే ప్రొఫెషన్‌గా మార్చుకున్నా. తొలినాళ్లలో కప్‌కేక్స్, చాక్లెట్లతో చిన్నగా ప్రారంభించా. కస్టమర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో 2012లో టంక్డ్లైట్గా మార్చా’నంటారు ప్రియాంక. తయారీలో శిక్షణ... ఎగ్ఫ్రీ బేకింగ్, కేక్ డెకరేటింగ్, డిసార్ట్స్, డూనట్స్, చాక్లెట్ తయారీలో రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం. ఈ నెల 23, 24 తేదీల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చాక్లెట్ కేక్‌లు, చాక్లెట్ డెకరేషన్, ట్రఫుల్, సాస్, ఫ్రూట్ కేక్, మ్యాంగో చాక్లెట్ కేక్, ఫైనాపిల్ పెస్ట్రీ, ఎగ్‌లెస్ చాక్లెట్ తయారీలో శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 90526 62545 నంబరులో సంప్రదించవచ్చు. -
అమ్మతో హ్యాపీగా...!
-
మై మామ్.. మై లవ్
అమ్మ కోసం... నేను సైతం... అంటున్న యువత ఒక్క ‘థ్యాంక్స్’తో సంతోషాన్నివ్వచ్చంటున్న సర్వే ఇటీవల పి అండ్ జి సంస్థ ఓ సర్వే చేసింది. ఆ సర్వేలో తల్లి ఆశిస్తోంది పిల్లల నుంచి చిన్న కృతజ్ఞతా పూర్వకమైన మాటేనని, తల్లి చేసే సేవలకి థ్యాంక్స్ చెప్తున్నవారి కంటే చెప్పనివారే ఎక్కువని తేలింది. జన్మ అనే గొప్ప వరాన్ని అందించిన మాతృమూర్తికి ఇష్టమైనవో, కోరుకున్నవో ఇచ్చి సంతోషపెడుతున్నవారు మరీ తక్కువగా 30 శాతానికి మించి లేరట. జన్మనివ్వడంతో పాటు ఫ్రెండ్ నుంచి గైడ్ దాకా మనకు అనువుగా తనను తాను మార్పు చేర్పులకు గురిచేసుకుంటూ, ప్రతి నిమిషం మనకోసమే ఒళ్లంతా కళ్లుచేసుకుని, మనల్ని కళ్లారా కాచుకుంటున్న అమ్మ కోసం ఏదైనా చేద్దాం. మదర్స్‌డే సందర్భంగా అమ్మ కళ్లల్లో ఆనందం కోసం నిరంతరం తపిస్తూ... ఆమె సంతోషమే తమకు సగం బలం అనీ, తమ విజయాలకు మూలం అని నమ్ముతున్న వ్యక్తుల గురించి ‘మదర్స్‌డే స్పెషల్’లో... -సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి ‘శాంత బయోటెక్’ ఫౌండర్‌గా పరిచయం అవసరంలేని ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త వరప్రసాద్ రెడ్డి. ఎన్ని పదవులు వరించినా.. ఎంత పెద్ద హోదాలో ఉన్నా అమ్మకు నచ్చిన తనయుడిగా ఉంటే చాలనుకునే వరాల పుత్రుడు ఆయన. తాను ఎదిగిన ప్రతి మలుపులో అమ్మ తోడ్పాటు ఉందని.. అమ్మ పుట్టిన రోజును (మే 9) ‘మాతృ దినోత్సవం’గా జరుపుకుంటున్నారాయన. ‘నాఎదుగుదలకు కారణం అమ్మ’ అని ఆయనంటే.. ‘నేనేం చేసానయ్యా నీకు జన్మతహా వచ్చింది.. సాధించావు’.. అంటుందా తల్లి. మాతృదినోత్సవం సందర్భంగా ఆ తల్లి, తనయుల మాటలు.. ‘ఇంట్లో స్త్రీ చదువు, సంస్కారవంతమైనది అయితే ఆ ఇంట్లో అందరూ సంస్కారవంతులవుతారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమె ఆలోచనలు, తినే ఆహారం, చదివే పుస్తకం, వినే శబ్దాలు, సంగీతం అన్నీ బిడ్డ మీద ప్రభావం చూపిస్తాయి. అవి సహజంగానే బిడ్డకు అబ్బుతాయి. ప్రణాళికాబద్ధ మైన జీవితం, ఆధ్యాత్మిక చింతన, ఏ విషయానికి ఉద్రేక పడకుండా ఉండే స్వభావం ఆమె నుంచే వచ్చాయి. గురువు చదువు నేర్పిస్తే.. సంస్కారం అమ్మ నేర్పుతుంది. సంస్కారం లేకపోతే సంపూర్ణమైన వ్యక్తిత్వం రాదు’.. కృతజ్ఞతగా చెప్పారు కొడుకు వరప్రసాద్ రెడ్డి. ‘ఏదో రామాయణం, భారతంలో కథలు చెప్తే ఊ.. కొట్టేవాడు. నిద్దరొస్తే పడుకునేవాడు. ఇంట్లో పది మంది పిల్లలున్నా వారితో చేరి అల్లరి చేసేవాడు కాదు. అతిశయంగా చెప్పటం లేదు. చెప్పింది వినేవాడు. ఒక్కమాట ఎవరినీ అనేవాడు కాదు. దేవుడి నైవేద్యం కూడా పెట్టేవరకూ తాకేవాడు కాదు. పుట్టుకతో వచ్చిన లక్షణాలే అవి’.. అంటుంది శాంతమ్మ. ‘ఆ రోజుల్లో 5వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ సాహిత్యం, పురాణ, ఇతిహాసాల మీద పట్టు ఉంది. వాటి సారం వివరించేది. మంచి, చెడుల మధ్య విచక్షణ తెలుసుకుంది. చదువు భుక్తి కోసం అయితే సంస్కారం జీవన్ముక్తికి అవసరం. అమ్మ నుంచి మనకొచ్చే ఈ సంస్కారం మనం గుర్తించం. తల్లి దగ్గర అది నేర్చుకున్నాం అని కూడా చెప్పం. అలా ఆమె ఇచ్చిన సౌభాగ్యాన్ని మదర్స్‌డే రోజు బోకే ఇచ్చి తీర్చుకోలేం. ప్రతి రోజు ఆమె కోసం ఆలోచించాలి’. ఇది ఆ కొడుకు కృతజ్ఞత. ‘పద్యం దాని తాత్పర్యం చెప్పేదాన్ని.. బుద్ధిగా వినేవాడు. సుభాషితాలు, వేమన, సుమతి శతకాలు అన్నీ నీతి వాక్యాలే కాబట్టి అవి ఆకట్టుకుని ఉండవచ్చు. అంతేగాని నేను ప్రత్యేకంగా కొట్టి, తిట్టి చెప్పింది, నేర్పించింది ఏమీ లేదు. తోటి పిల్లలతో ఆడుకోవటం కన్నా నా దగ్గరే ఎక్కవ సేపు గడిపేవాడు’. ఆ అమ్మ నిరాడంబరత. ‘అమ్మ నాలుగున్నర కల్లా లేస్తారు. ఆ సమయానికి లేచి ఆమెతో పాటు కాసేపు కూర్చుని మిగతా పనులు మొదలుపెడతాను. నేనున్న వృత్తిలో ప్రయాణాలు ఎక్కువ. దానివల్ల అమ్మను రోజూ చూసే అవకాశం ఉండదు. చాలా బాధగా ఉండేది. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఆఫీస్‌కి వెళ్లడం లేదు. అమ్మతో ఎక్కువ టైం గడుపుతున్నాను. నేనొక్కడినే ఆమెకు సంతానం. ఈ వయసులో ఆమెకు ఇవ్వగలిగిన బహుమతులు ఏం ఉంటాయి..! మధ్య వయస్కులకు, చిన్న పిల్లలకు బహుమతులు ఇస్తాం. ఈ వయసులో ఆమె నగలు, చీరలు వేసుకోలేదు. అందుకే ఏడేళ్ల క్రితం ఆమెకు ఉత్తరం రాశాను. ఆమె దాన్ని చదువుకుని, మనసంతా తడైపోయింది. ‘మడిచి జేబులో పెట్టుకునే ఉత్తరం కాదు, నీ బిడ్డలు దీన్ని చూడాలి. వాళ్ల తల్లిని వారు అలాగే చూసుకోవాలి. పటం కట్టించు’ అంది. అమ్మకు నేనిచ్చిన బహుమతి నచ్చింది’. కొడుకు సంతోషం. ‘పది మందికి ఉపయోగపడేలా ఉండమని, నిస్వార్థంగా చేసేది మనకు కలిసొస్తుంది నాయనా.. అని చెప్పానే తప్పా ఫలానా పని చెయ్యి.. వద్దు అంటూ చెప్పలేదు. తినేది నలుగురికి పెట్టేవాడు. ఇప్పటికీ అదే తీరు. ఇంట్లో ఏది చేసినా తీసుకెళ్లి నలుగురు పిల్లకాయలకు పెట్టి తింటాడు. అలా పెరిగిన క్రమంలో వంటపట్టినని ఏమన్నా ఉన్నాయేమో గాని, నేను ప్రత్యేకంగా ఏమీ నేర్పలేదు. తల్లికి పిల్లలు వృద్ధిలోకి రావాలనే ఉంటదిగా. పెద్దోడై, మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో, పది మందికి ఉపయోగపడే మనస్తత్వం కలవాడు కావాలని అనుకుంటాం. మాది వ్యవసాయ కుటుంబం. అయిదో తరగతి చదువున్న దాన్ని. గొప్పగా ఏం చెప్పగలను’ అంటుంది భూషణం లాంటి కొడుకుని కన్న ఈ బంగారు తల్లి. ‘1950 మార్చి మూడో తేదీ...నెల్లూరు జిల్లా మొలాపేట.. ఒక కుర్రాడి కోసం సందుల్లో నలుగురు పరుగెత్తుతున్నారు. గోడలు దూకేస్తున్నారు. అర్ధగంట చేజింగ్ తర్వాత దొరికాడు. పట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఒక ఆవిడ కాళ్ల మీద కుర్రాడిని బలవంతంగా పడుకోబెట్టారు. ఉగ్గుగిన్నెలోని వంటాముదం కుర్రాడి నోట్లో పోశారు. ఆ కుర్రాడు ఇప్పటి నటుడు జయప్రకాశ్ రెడ్డి. కాళ్ల మీద కుర్రాడిని పెట్టుకుంది జేపీ అమ్మ సాంబ్రాజ్యమ్మ. ‘రెండు, మూడు నెలలకోసారి నేను పరుగెత్తే సీన్ రీపిట్ అవుతుండేద’ని అమ్మతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు జేపీ. విసుక్కునేది కాదు.. నాన్న సాంబిరెడ్డి పోలీసు ఆఫీసర్. రోజూ పదుల సంఖ్యలో జనాలు ఇంటికి వచ్చేవారు. వారందరికీ టీతో సరిపెట్టకుండా మా అమ్మ టిఫిన్లు కూడా చేసేది. అస్సలు విసుక్కునేది కాదు. పెద్దయ్యాక నాటకాలు వేస్తూ రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరేవాణ్ని. నాతోపాటు ఐదారుగురు ఆర్టిస్టులు వచ్చేవారు. ఆ టైమ్‌లోనూ అమ్మ ఎంతో ఓపికగా అందరికీ భోజనం పెట్టేది. పూర్తి శాకాహారి.. మా అమ్మ ప్యూర్ వెజిటేరియన్. మా కోసమే నాన్‌వెజ్ వండడం నేర్చుకుంది. ఆమె మాత్రం శాకాహారమే తినేది. అమెరికాలో బ్రదర్స్‌తో కలిసి 18 ఏళ్లు ఉంది. అక్కడ బ్రదర్ ఫ్రెండ్స్ అమెరికా వాళ్లు అమ్మ వంట రుచికి ఫిదా అయిపోయారు. పక్షవాతం వచ్చిన నాన్నను కంటికి రెప్పలా చూసుకోవడం ఇప్పటికీ నా మదిలో కదలాడుతునే ఉన్నాయి. ఇప్పుడు 84 ఏళ్లు.. నేను చిన్నగా ఉన్నప్పుడే అమ్మకు టీబీ సోకింది. చెన్నైలో వైద్యం చేయిస్తే తగ్గిపోయింది. ఇప్పడు అమ్మకు 84 ఏళ్లు. ఓపెన్ హార్ట్ సర్జరీ కావడంతో అమ్మను మూడున్నరేళ్ల క్రితం గుంటూరుకు తీసుకొచ్చా. చంటి పిల్లలా వ్యవహరిస్తున్న అమ్మను చూస్తుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. తన తల్లికంటే ఎక్కువగా మా అమ్మను జాగ్రత్తగా చూసుకునే భార్య దొరకడం నా అదృష్టం’’. ఎంత ఓపికో.. ఎంతటివారైనా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే అమ్మతో గడిపిన క్షణాలే జ్ఞాపకాల దొంతర్లుగా కళ్ల ముందు కదలాడతాయి. ప్రతిచోటా అమ్మ చూపిన ప్రేమానురాగాలే గుర్తుకు వస్తాయి. ఏమిచ్చినా అమ్మ రుణం తీరదు. లోకంలో ఏదీ అమ్మ ప్రేమకు సాటిరాదు. అమ్మతో ఉన్న అనుబంధాన్ని కొందరు ప్రముఖులు ఇలా గుర్తు చేసుకున్నారు. వారి మాటల్లోనే... ‘అమ్మ’దనానికి ప్రతీక యశోదమ్మ ‘మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న రామచందర్ రావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఐ. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళుతుండేవారు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లాలోని గుమ్మడివెల్లి గ్రామం నుంచి హన్మకొండకు మకాం మార్చాం. నాన్న మరో ప్రాంతానికి బదిలీ అయ్యారు. అమ్మ యశోదా దేవి మా చదువుల కోసం హన్మకొండలోని శివారు గ్రామాల్లో భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశారు. కాజీపేటలోని సెయింట్ గాబ్రియల్ స్కూల్లో పదో తరగతి వరకు చదివించారు. ఇంటర్ తర్వాత బ్రదర్స్ సురేందర్ రావు, నరేందర్ రావు మెడిసిన్‌లో చేరారు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశా. మరో బ్రదర్ సీఏ చేశాడు. మమ్మల్ని సరైన మార్గంలో నడపడంలో మా అమ్మ పాత్ర మరవలేనిది. వృధా ఖర్చులకు ఎప్పుడూ దూరంగా ఉంచేది. తెల్లవారుజామునే లేపి చదివించడంతో పాటు చదువుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చని పదేపదే చెప్పేది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం మాకు చిన్నప్పటి నుంచే అమ్మ అలవర్చారు. అమ్మ మీద ప్రేమ, గౌరవంతో యశోద హాస్పిటల్స్ ప్రారంభించాం. 1989లో ఒక చిన్న క్లినిక్‌గా ప్రారంభమైన యశోద హాస్పిటల్ పాతికేళ్ల కాలంలో అగ్రశ్రేణి వైద్య సంస్థగా ఎదగడంలో అమ్మ దీవెనలు ఉన్నాయి. తల్లిగా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా.. సంకల్పంతోనూ.. శ్రమించే తత్వంతోనూ.. అంకితభావంతోనూ, క్రమశిక్షణతోనూ ఎందరికో ఆదర్శమూర్తి అయిన అమ్మ జీవితం ఈతరం వారికి స్ఫూర్తి అవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు అమ్మ మా మధ్యలో లేకున్నా... ఆమె చూపిన మార్గంలోనే ముందుకెళుతున్నాం’. - గోరుకంటి రవీందర్రావు, చైర్మన్, యశోద హాస్పిటల్స్ ‘స్త్రీ బాగుంటే సమాజం, పరిజనం అంతా బాగుంటాయి. ఆ ఉద్దేశంతోనే తల్లిని బాగా చూసుకోవాలి. అమ్మ రుణం తీర్చుకోవాలంటే అమ్మకు అమ్మగా పుట్టాలి. అప్పుడే ఆమె చేసినంత సేవ ఆమెకు చేయగలం’ అమ్మా నీవే నేను నేనే నీవు నేను నీలో అంతర్భాగానిని నీవు నాలో అంతర్వాహినివి..! - వరప్రసాద్ రెడ్డి నాన్న జ్ఞాపకాలతో కుంగిపోకుండా... మా అమ్మగారు మనోహరం(60). ఒకప్పుడు టీచర్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. మా నాన్నతో చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ అమ్మకి. సడెన్‌గా ఫాదర్ త్రీ ఇయర్స్ బ్యాక్ హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. ఫాదర్ చనిపోయిన షాక్‌తో ఉన్న అమ్మ కోసం 6 నెలల పాటు అన్ని పనులూ మానేశా. చెన్నై రీ రికార్డింగ్ వెళితే అక్కడికి తీసుకెళ్లేవాడ్ని. అయితే ఎన్ని చేసినా అమ్మ పూర్తిగా రికవర్ కావడం లేదనిపించి... మా ఇంటికి దగ్గర్లో ఉన్న చిన్నపిల్లల గార్మెంట్స్ షాప్ సేల్‌కి ఉంటే కొనేశాను. ఆ షాప్ బాధ్యతలు అమ్మకు అప్పజెప్పాను. నిజానికి నాకు బిజినెస్ అంటే ఏమిటో అసలు తెలీదు. అయితే నాకు తెలుసు అమ్మ ఏదైనా బాధ్యత అప్పజెపితే అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతుందని, 100 శాతం ఎఫర్ట్ పెడుతుందని. నేననుకున్నట్టే, ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యాక...నాన్న జ్ఞాపకాల నుంచి అమ్మ బాగా తేరుకుందని అనిపించాక, ఆ షాప్ మా బంధువులకు ఇచ్చేసి అమ్మని ఆ బాధ్యతల నుంచి తప్పించాను. నా ఫస్ట్ ఫిలిమ్ జై నుంచి నా గురించి వచ్చిన అన్ని మీడియా ఇంటర్వ్యూలను, వార్తలను కలెక్ట్ చేసి 3 ఆల్బమ్స్‌గా చేసి నా బర్త్‌డేకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది అమ్మ. కళ్ల వెంట నీళ్లొచ్చాయి. అమ్మకి ఏసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. ప్రేయర్ చేస్తుంటుంది. నేనే చర్చిలకు తీసుకెళుతుంటాను. . నేను క్రీస్తు ఆల్బమ్స్ చేసిన వెంటనే తొలిశ్రోత అమ్మే. కల్వరి ఆల్బమ్స్ చేసినప్పుడు మా ఇంట్లోనే కంపోజ్ చేసేవాడ్ని. మా అమ్మగారికి వినిపించేవాడిని. అయితే మనం ఎన్ని చేసినా అమ్మ రుణం తీర్చుకోలేం అని నాకు తెలుసు. అమ్మ త్యాగానికి సాటి లేదు. అమ్మ చేసే సేవకు సాటిరాదు. - అనూప్‌రూబెన్స్, సంగీత దర్శకుడు ఫిట్నెస్ రొటీన్ అలవాటు చేశా... నేను సీనియర్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. మా మమ్మీ సుచిత్ర నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ విషయంలో నేను చాలా లక్కీ. తను ఏదీ ఎప్పుడూ ఆర్డర్స్ వేయదు. గైడ్ చేస్తుంటుందంతే. ఒక స్నేహితురాలిలా నాతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంది. నాకోసం వెతికి వెతికి అన్నింటికన్నా బెస్ట్ నాకు ఇస్తుంటుంది. నా కోసం తను ఏం చేయదు? అని అడిగితే అసలు ఏం చెప్పాలో తెలీనంత చేస్తుంది. అంత చేసే అమ్మ కోసం నేను కూడా ఏదైనా చేయాలనిపిస్తుంటుంది. తను టీచర్‌గా పనిచేస్తుంది. స్కూల్లో అలసిపోయి వచ్చినట్టు అనిపిస్తే వెంటనే షాపింగ్‌కో, లాంగ్డ్రైవ్కో తీసుకెళతాను. తను రిలాక్స్ అయ్యేలా చేస్తాను. వంట పనిని నేను కూడా తరచుగా షేర్ చేసుకుంటాను. మిడల్ ఏజ్‌లో ఎక్సర్సైజ్ కంపల్సరీ కదా... అందుకే మమ్మీని జిమ్‌కి అలవాటు చేశాను. ఈవెనింగ్ 7 నుంచి 8 గంటల మద్యలో ఇద్దరం కలిసే జిమ్‌కి వెళతాం. నేను ఎక్కువగా ఎరోబిక్స్ చేస్తాను. మమ్మీ బాడీ కండిషనింగ్, పర్సనల్ ట్రైనింగ్‌తో వర్కవుట్స్ చేస్తుంది. అమ్మ నాతో అన్నీ చెబుతుంది. నేను కూడా తనతో అన్నీ దాచుకోకుండా చెప్తాను. ప్రతి రోజు ఆ రోజులో జరిగినవన్నీ షేర్ చేసుకుంటాం. బైక్ మీద రౌండ్స్ తీసుకెళుతుంటే చిన్నపిల్లలా సరదా పడుతుంది. - క్లారా ఇషిత... పాడమని ప్రోత్సహించా... నాకు జీవితంలో లభించినవన్నీ అమ్మ సప్నాదాస్ వల్లే. ఎలా మాట్లాడాలి? ఎలా తినాలి? ఎలా మసలుకోవాలి..అన్నీ నేర్పింది అమ్మే. లైఫ్‌ని లీడ్ చేయడానికి అన్ని రకాల కాన్ఫిడెన్స్ ఇచ్చింది అమ్మే. చాలా విషయాల్లో మా ఇద్దరికీ ఎప్పుడూ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. కాని చివరికి ఆమె చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పనీ నాకోసమే అని అర్ధమవుతుంటుంది. అన్నీ అందించిన అమ్మకి ఏవేవో ఇవ్వాలని అనిపిస్తుంది. అయితే తను గిఫ్ట్స్వద్దంటుంది. అందుకని ఖాళీ దొరికినప్పుడు, ఏ మాత్రం సమయం చిక్కినా తనతోనే స్పెండ్ చేస్తున్నా. అయినా అది సరిపోదు కదా... ఆమెకు ఆనందం కలిగించేవి ఏమిటా అని పరిశీలిస్తూ వచ్చా... ఆమెకు పాడడం అంటే బాగా ఇష్టం అని గ్రహించా. దాంతో పాడమంటూ ఎంకరేజ్ చేయడం ప్రారంభించా. అమ్మ చాలా బాగా పాడుతుంది. మీకు తెలుసా? ఇప్పుడు తను స్టేజ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇస్తోంది. కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడంలో నేనూ పాలు పంచుకుంటున్నా. తనకున్న ఓ మంచి అభిరుచి తీర్చుకోవడానికి నేను ఒక కారణం కావడం నాకెంతో సంతోషాన్ని అందిస్తోంది. - శ్రద్ధాదాస్, సినీనటి డ్యాన్స్ అలవాటు చేశా... నేను లెవెన్త్ స్టాండర్డ్ చదువుతున్నా. మమ్మీ (కిరణ్ డెంబ్లా) పెద్ద ఫిట్నెస్ ప్రీక్ అని సిటీ మొత్తానికి తెలిసిందే. ఆమె ఎప్పుడూ వర్కవుట్స్, ట్రైనింగ్స్ అని స్ట్రెయిన్ అవుతుంటుంది కదా... నాకేమో డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తనకు వండర్ఫుల్ రిలాక్సేషన్ ఇవ్వాలంటే డ్యాన్స్‌లో ఉన్న కిక్ టేస్ట్ చేయించాల్సిందే అనిపించింది. అందుకే నాతో పాటు తనను మాదాపూర్‌లోని డ్యాన్స్ స్కూల్‌కి తీసుకెళుతున్నా. ఇద్దరం కలిసి డ్యాన్స్ చేస్తాం. ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేస్తాం. మమ్మీతో ఉంటే ఒక ఫ్రెండ్‌తో ఉన్నట్టే ఉంటుంది. తనతో నన్ను అన్ని పార్టీలకు, ఈవెంట్స్‌కి తీసుకెళుతుంటుంది. వయసులో చిన్న అనీ, నాకేమీ తెలియదనీ తీసిపారేయకుండా నా ఆలోచనలకి ఇష్టాఇష్టాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే తన కోసం, తన సంతోషం కోసం ఏదైనా చేయాలని నేనూ రోజూ ప్లాన్ చేస్తుంటా. కేవలం ఒక్క రోజే కాదు. ప్రతి రోజూ నాకు మదర్స్‌డేనే. - ప్రియాంక వండి వడ్డిస్తా... మా మమ్మీ (సుశీల బొకాడియా)కి సోషల్ యాక్టివిటీస్ ఎక్కువుంటాయి. అటు ఇంటిపని, ఇటు సోషల్ వర్క్‌తో చాలా టైర్డ్ అవుతుంటుంది. అందుకే తను ఇంటికి వచ్చి రెస్ట్‌లెస్‌గా ఫీలైనా... హ్యాపీ మూడ్‌లోకి తేవడానికి ట్రై చేస్తా. దీని కోసం తరచుగా నా పర్సనల్ వర్క్ కూడా పక్కన బెట్టేస్తా. డాడీ బిజినెస్‌లో బిజీగా ఉంటే నన్ను, తమ్ముడ్ని మమ్మీ ఎంత కేర్‌ఫుల్‌గా చూసుకుందో నాకు తెలుసు. తనను హ్యాపీగా ఉంచడం మా బాధ్యత. నాకు కుకింగ్ వచ్చు. తమ్ముడి హెల్ప్ తీసుకుని తరచుగా తనకు ఇష్టమైన వంటలు స్వయంగా వండి వడ్డిస్తా. అప్పుడు మమ్మీ ఫేస్‌లో చెప్పలేనంత ఆనందం. అది చూస్తే నాకెంత హ్యాపీ అనిపిస్తుందో... ఎప్పుడైనా సర్ప్రైజ్ గిఫ్ట్స్ తెచ్చిస్తే... ‘‘ఎందుకురా ఇవన్నీ’’ అంటూ చిన్నగా కోప్పడుతుంది. తమ్ముడు, నేను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవడం ఒక్కటే తనకు మేమిచ్చే అత్యుత్తమ బహుమతి అని నాకు తెలుసు. అది మేమెలాగూ ఇస్తాం కూడా. - రౌనత్ -
ఇంటిపైకప్పు కూలి తల్లీ కూతుర్లు మృతి
-
పీఆర్ కండ్రీగ తల్లులకు నా భారతరత్న అంకితం
నెల్లూరు: తన కన్నతల్లితోపాటు పీఆర్ కండ్రీగ గ్రామంలోని తల్లులందరికీ తాను అందుకున్న అత్యున్నత పురస్కారం భారతరత్నను అంకితమిస్తున్నట్లు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. ఆదివారం నెల్లూరు జిల్లా పుట్టంరాజుగారి కండ్రీగ గ్రామంలోని గ్రామస్తులతో సచిన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.... భార్తల కోసం, పిల్లల కోసం దేశంలోని మహిళలంతా ఎన్నో త్యాగాలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి దిశగా ఈ గ్రామానికి తొలి ఇన్నింగ్స్ ఇప్పుడే మొదలైందని తెలిపారు. కానీ గ్రామంలోని అభివృద్ధి నిర్వహణలో రెండో ఇన్సింగ్స్ మాత్రం మీ చేతుల్లోనే ఉందని గ్రామస్తులకు గుర్తు చేశారు. చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల చాలా వ్యాధులు వస్తున్నాయని... ఈ నేపథ్యంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని మీ పిల్లలకు చెప్పాలని గ్రామంలోని తల్లిదండ్రులకు సచిన్ సూచించారు. గ్రామంలో టాయిలెట్స్ నిర్మిస్తామని... వాటిని ఎలా పరిశ్రుభంగా ఉంచుకోవాలో మీ పిల్లలకు తెలియజేయాలని అన్నారు. గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారని... ఆ సమయంలోనే ఇదే అంశంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతున్నానని నాటి జ్ఞపకాలను సచిన్ ఈ సందర్బంగా పిఆర్ కండ్రీగ గ్రామస్తులకు వివరించారు. -
కార్ఖానలో దారుణం
మంటల బారినపడిన తల్లీ, ఇద్దరు కూతుళ్లు గాంధీ ఆస్పత్రికి తరలింపు ప్రమాదకరంగా ముగ్గురి పరిస్థితి భర్త నిర్లక్ష్యం చేయడం వల్లేనని భార్య వాంగ్మూలం రసూల్‌పురా: అనుమానాస్పదస్థితిలో తల్లి, ఇద్దరు కూతుళ్లు మంటల బారినపడ్డారు. 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ యజమాని దినేష్ కథనం ప్రకారం... కార్ఖాన ఏపీ టెక్ట్స్‌బుక్ కాలనీలో నివసించే దినేష్ సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో మామా జ్యుయెలర్స్ నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య కవిత(40), వైష్ణవి(18), భావన (16) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9గంటల ప్రాంతంలో ముగ్గురికి ఒకేసారి మంటలు అంటుకున్నాయి. దినేష్ ఉంటున్న పైఅంతస్తులో అతని సోదరుడి కుటుంబం నివాసం ఉంటోంది. దినేష్ సోదరుని ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అరుపులు, కేకలు విని కిందికి దిగివచ్చిన దినేష్ మంటలార్పేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో అతని చేతులకు కూడా గాయాలయ్యాయి.ఈ ముగ్గురిని వెంటనే స్థానికుల సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. భర్త నిర్లక్ష్యం వల్లే... భర్త పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది తానే వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నానని కవిత మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిందని ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తెలిపారు. తల్లి లేకుండా తాము బతకలేమని ఇద్దరు కూతుళ్లు కూడా ఆత్మహత్యకు యత్నించినట్టు కవిత పేర్కొన్నట్టు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అయితే ఇద్దరు పిల్లలు మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అమ్మాయిలకు నచ్చితే.. అమ్మలకు నచ్చినట్టే!
ఇంటికి కావాల్సిన వస్తువుల విషయంలో ఇల్లాలి మాటే దాదాపు ఫైనల్! ఆమెకు సంబంధించిన దుస్తుల విషయంలో..? అమ్మాయిల మాటలకే అమ్మలు ఓటేస్తారట. చీరలు మొదలుకొని అన్ని రకాలు దస్తులు, ఫ్యాషన్ విషయంలో అమ్మాయిలు ఓకే చెప్పాల్సిందే. ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. వయసు అంతరమున్నాఅమ్మల మనసు తెలుసుకుని ఎలాంటివైతే నచ్చుతాయో వాటినే అమ్మాయిలు ఎంపిక చేస్తారట. దుస్తుల ఎంపికలో అమ్మాయిల మాటే ఫైనల్ అని 48 శాతం మంది మహిళలు చెప్పారు. ఇక 19 శాతం మంది.. గతంలో పిల్లలతో వాదించేవారమని, ప్రస్తుతం అమ్మాయిలకే దుస్తుల నాణ్యత గురించి ఎక్కువ తెలుసని చెప్పారు. మరో 35 శాతం మంది.. తమ అమ్మాయిలకున్న డ్రెస్‌ల వంటివే పొరపాటున కొనుగోలు చేయకుండా ఉండేందుకు వారితో సంప్రదిస్తామని తెలిపారు. మొత్తమ్మీద దుస్తుల కొనుగోలు విషయంలో ఈ తరం అమ్మలకు అమ్మాయిల మాటే వేదవాక్కు. 'అమ్మకు నచ్చితే.. అమ్మాయికి నచ్చినట్టే' అన్నది పాత మాట. 'అమ్మాయికి నచ్చితే.. అమ్మకు నచ్చినట్టే' అన్నది కొత్త సంగతి. ఇక ఫ్యాషన్ విషయంలోనూ.. అంటే తమ వయసుకు తగ్గట్టు హుందాగా ఉండేలా కూతుళ్ల సలహాలను పాటిస్తారట.