తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం: డాక్టర్ కళ్యాణ్
కాపుగల్లు(కోదాడరూరల్): తల్లి పాలే బిడ్డకు ఆరోగ్యకరమని, దీనిపై ప్రజల్లో అవగాహన కలిగించాలని కాపుగల్లు వైద్యాధికారి కల్యాణ్‌చక్రవర్తి సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని కాపుగల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాలవారోత్సవాల సందర్భంగా ఆరోగ్య సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. తల్లిపాలలో బిడ్డకు కావాల్సిన పోషకాలు అందడంతో పాటు రోగనిరోధక శక్తి కూడ పెరుగుతుందన్నారు. పుట్టిన గంటలోపు బిడ్డకు ముర్రుపాలు తాగించాలని ఆయన సూచించారు. ఆరు నెలల పాటు తప్పకుండా తల్లి పాలే ఇవ్వాలని దీంతో బిడ్డకు శ్వాస సంబంధ, కామెర్లు వంటి వ్యాధులు దరి చేరవన్నారు. తల్లిపాలు వెంటనే జీర్ణమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్‌రెడ్డి, సిబ్బంది భారతమ్మ, పద్మ, ఇందిర ,ఉమామహేశ్వరీ, ప్రమీల, స్వరూప, రూప, భవాని, శాంతకుమారి, జీవమ్మ, వెంకట్‌నారాయణ, రాజ్యం, కవిత, సుకన్య, నాగేంద్రమ్మ, సూజాత, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.