మూన్‌ మిల్క్‌ గురించి విన్నారా! ఐదువేల ఏళ్ల నాటి.. | Do You Know About Ancient Ayurvedic Drink Moon Milk, Check Its Health Benefits In Telugu - Sakshi
Sakshi News home page

Moon Milk Health Benefits: మూన్‌ మిల్క్‌ గురించి విన్నారా! ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్‌ పెడుతోంది!

Published Tue, Sep 19 2023 10:59 AM | Last Updated on Tue, Sep 19 2023 11:36 AM

Do You Know Ancient Ayurvedic Drink Moon Milk  - Sakshi

మూన్‌మిల్క్‌ గురించి విన్నారా! ఇది పురాతన ఆయుర్వేద పానీయం. ఆయుర్వేద మూలికల నుంచి తయారుచేసిన దివ్వ ఔషధం. పూర్వం ఈ పానీయంతోనే రోగ నిరోధక శక్తిని పెంచుకునేవారట. అందువల్లే వాళ్లు ఎలాంటి అనారోగ్యం బారిన పడిన తట్టకుని బతికిబట్టగట్టగలిగేవారట. దీన్ని అత్యంత శక్తివంతమైన ఔషధంగా వారంతం ప్రగాఢంగా విశ్వసించేవారని ఆయుర్వేద నిపుణుల చెబుతున్నారు. ఈ మూన్‌మిల్క్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఎలా తయారు చేయాలి తదితరాల గురించే ఈ కథనం.

అందించే ఆరోగ్య ప్రయోజనాలు

  • ఇది దాదాపు 5వేల ఏళ్ల నాటి పురాతన సహజసిద్ధ ఔషదం. శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడం కోసం మూన్‌మిల్క్‌ని ఉపయోగించేవారట. మీకు పుష్టిని కలిగించడమేగాక రోగనిరోధక శక్తిని పెంచేలా ఈ మూన్‌మిల్క్‌కి ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా దీని తయారీలో ఉపయోగించే మూలిక ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెడతాయని అంటున్నారు.
  • దీన్ని ఆవు పాలతో తయారు చేస్తారు కాబట్టి. ముఖ్యంగా కొలస్ట్రాల్‌ లేకుండా ఉంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉపయోగించే బాదం, సోయా, వోట్‌, దాల్చిన చెక్క, ఏలకులు, పసుపు అశ్వగంధం తదితర సుగంధ ద్రవ్వయాలు వినియోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తి తోపాలు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌లను వృద్ధి చేస్తుంది. 
  • ఇక ఇందులో వినయోగించే అశ్వగంధం వంటి అడాప్టోజెనిక్‌ మూలికలు శరీరంలో కార్టిసాల్‌​ స్థాయిలను తగ్గిస్తాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది. 
  • సుఖవంతమైన నిద్ర
  • ఈ మూన్‌ మిల్క్‌ని సేవిస్తే..కలవరపాటుకు గురి కాని మంచి నిద్ర పడుతుంది. నిద్రకు కారణమయ్యే మెలటోనిన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. 
  • ఇక ఇందులో ఉపయోగించే పసుపు, అ‍ల్లం వంటి సుగంధ ద్రవ్యాలు యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను వృద్ధి చేసి రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. శీతాకాలంలో దీన్ని సేవిస్తే మరింత ప్రయోజనం ఉండటమే గాక ఎన్నో రుగ్మతల నుంచి ఈజీగా బయటపడొచ్చు.
  • ఇక యాలకులు, దాల్చిన చెక్క వంటి సున్నితమైన సుగంధ ద్రవ్యాలు రుచిని పెంచడం మాత్రమే కాదు, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఈ మసాలాలు అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్‌ల వంటి సమస్యలకు చెక్‌పెడతాయి. భారీ మొత్తంలో భోజనం సమయంలో ఇది సేవిస్తే చాలా చక్కగా జీర్ణం అవ్వడమే గాక ఎలాంటి ఆపసోపాలు పడాల్సిన పని ఉండదు.

తయారీ విధానం
చంద్రుని పాలు తయారీకి ఆవు పాలు లేదా గేదె పాలు(వాల్‌నట్‌ మిల్స్‌, బాదం మిల్క్‌ లేదా జీడిపప్పు మిల్స్‌ అయినా ఉపయోగించొచ్చు) ఓ కప్పు తీసుకుని వేడి చేయండి. అందులో అర టీ స్పూన్‌ పసుపు, చిటికెడు దాల్చిన చెక్క, యాలకులు కలపండి. అశ్వగంధం వంటి అడాప్లోజెనిక్‌ మూలికలు ఒక టీస్పూన్‌ వేయండి. బాగా మరిగిన తర్వాత దించి చల్లారక తాగండి. ఇది ఆరోగ్యానికి బహుముఖ ప్రయోజనాలను అందించడమే గాక ఒత్తిడిని దూరం చేసే మంచి సుఖవంతమైన నిద్ర పట్టేలా చేస్తుంది. 

(చదవండి: స్పైసీ చిప్స్‌ తినకూడదా? చనిపోతారా..?)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement