ఆవు పాలు, గేదే పాలు, ఒంటె పాలు ఇలా రకరకాల పాల గురించి విన్నారు. వాటిలో అత్యంత ఖరీదైన పాలు ఏవంటే ఒంటె పాలని ఠక్కున చెప్పేస్తారు. కానీ వాటన్నింటికంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలు ఇంకొకటి ఉన్నాయి. ఔను! అది కూడా ఓ చిన్న జీవి నుంచి వచ్చే పాలవి. ఎవ్వరూ నమ్మరు దాన్నుంచి పాలు వస్తాయా ? అని. కానీ ఓ జపాన్ వ్యక్తి ఆ జీవి నుంచి పాలను తీసి కోట్లు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఏ జీవి అంటే..
అదేనండి సీతాకోక చిలుక. ఏంటీ సీతాకోక చిలుక నుంచా..? అని నోరెళ్లబెట్టకండి. నిజంగానే సీతాకోక చిలుక నుంచి పాలు తీసున్నాడు జపాన్ వ్యక్తి. అసలు సీతాకోక చిలుకకు పాలు ఎలా వస్తాయనే కదూ..! లార్వా దశలో ఓ చిన్న గుడ్డు నుంచి గొంగళి పురుగు బయటకొచ్చి ఏ చెట్టు కాండానికో, ఏ గోడకో బలంగా చుట్టుకుని దాని చుట్టు ఓ దూదిలాంటి రక్షణ వలయాన్ని ఏర్పారుచుకుంటుదంది. అది ప్యూపా దశకు చేరుకోవడానికి నాలుగు వారాలు పడుతుంది.
సరిగ్గా అది ప్యూపా దశకు చేరుకుని ఇంకొక్క వారంలో సీతాకొక చిలుకగా రూపాంతరం చెందుతుందనంగా దాని బాడిలో భారీ మొత్తంలో ద్రవాలు ఉంటాయి. ఆ టైంలో దాని కకూన్(గూడు) నుంచి ఈ ప్యూపాను తీసి జెంటిల్‌గా తోక భాగాన్ని ప్రెస్ చేయగానే తెల్లటి పాల వంటి పదార్థం వస్తుంది. ఇది చాలా గాఢతగా ఉంటుంది. ఇది ఒక లీటర్ నీటిలో కలిపి ఉపయోగించాలి. ఈ పాలని మార్కెట్లో అమ్మి కోట్లు సంపాదిస్తున్నాడు జపాన్ వ్యక్తి. ఈ సీతకోక చిలుక పాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలల్లో ఒకటిగా నిలిచింది. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అవేంటంటే..
- ఇది ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్న మహిళల పాలిట వరంలా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించిన చాలామంది స్త్రీలు ఈ సమస్య నుంచి బయటపడ్డారట కూడా.
- ఇది నేచురల్ వయాగ్రాల కూడా పనిచేస్తుందంట
- ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు ఉన్నాయట.
- దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు.
>
(చదవండి: సీఫుడ్ ఇష్టంగా తినేస్తున్నారా? శాస్త్రవేత్తల స్ట్రాంగ్ వార్నింగ్!)
Comments
Please login to add a commentAdd a comment