కేక్... రొటీన్‌కు బ్రేక్ | In house different types of cakes | Sakshi
Sakshi News home page

కేక్... రొటీన్‌కు బ్రేక్

Published Tue, May 19 2015 2:13 AM | Last Updated on Fri, Oct 5 2018 6:40 PM

కేక్... రొటీన్‌కు బ్రేక్ - Sakshi

కేక్... రొటీన్‌కు బ్రేక్

- ఠీఇంట్లోనే కేక్‌లు సిద్ధం  
- విభిన్న రుచుల్లో లభ్యం

వేసవి కాలంలో ఇళ్లలోఉండే పిల్లలకు విభిన్న రుచులు చూపించేందుకు రెడీ అవుతున్నారు అమ్మలు. రోజూ అమ్మ చేతి వంట తినే పిల్లలు... సెలవులు కదా అని బయటకు తీసుకెళితే చిరుతిళ్ల కోసం మారాం చేస్తున్నారు. బేకరీ ఫుడ్ నోట్లో పడేదాకా నానా అల్లరి చేస్తున్నారు. అందుకే పిల్లలు అతిగా ఇష్టపడుతున్న కేకులు, స్వీట్లను ఇంట్లోనే రెడీ చేసి ఇవ్వాలనుకుంటున్న సిటీవాసులు... శిక్షణ  సంస్థల బాట పడుతున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టుగానే కేవలం ఒక రోజులోనే పూర్తి స్థాయి శిక్షణను ఇస్తున్నాయి వివిధ సంస్థలు. ఎగ్‌ఫ్రీ బేకింగ్, కేక్ డెకరేషన్, డిసార్ట్స్, డూనట్స్, చాక్లెట్ మేకింగ్, పెస్ట్రీలు, ట్రఫుల్, సాస్, ఫ్రూట్ కేక్, మ్యాంగో చాక్లెట్ కేక్, పైనాపిల్ పెస్ట్రీ నేర్చుకునేందుకు చాలా మంది మహిళలు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు బోయిన్‌పల్లిలోని టంక్‌డ్లైట్ నిర్వాహకురాలు ప్రియాంక టంక్. హోం బేకింగ్ అయితే ఎప్పటికప్పుడు తాజాగా... మన అభిరుచులకు అనుగుణంగా రెడీ చేసుకునే అవకాశముంటుందని అంటున్నారు.                                            

ఆసక్తి చూపుతున్నారు
కప్‌కేక్స్, అసార్టెడ్ చాక్లెట్, కప్‌కేక్స్ బాక్సెస్, చాక్లెట్ థీమ్ బోటిక్, కప్ కేక్స్ థీమ్ బొటిక్, ముఫిన్స్, జెల్లీస్, 2-టైర్, 3-టైర్ వెడ్డింగ్ కేక్స్‌కు సిటీలో మంచి డిమాండ్ ఉంది. విభిన్న ఆకృతుల కేక్‌లు, చాక్లెట్‌ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు సిటీవాసులు. పిల్లలు కూడా అవే ఇష్టపడుతున్నారు. అందుకే మేం ఈ చాక్లెట్, కేకుల తయారీలో శిక్షణ ఇస్తున్నామని చెబుతోంది ప్రియాంక టంక్. ‘ఆరోగ్యంతో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలనుకుంటున్న సిటీవాసుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని డిఫరెంట్ కేకుల బేకింగ్‌లో శిక్షణ ఇస్తున్నాం. కేలరీ గురించి ఆందోళన చెందే వారికి జింజర్ బ్రెడ్ కేకులు, ఓట్‌మీల్ కేకులను రెడీ చేయిస్తున్నాం. హెల్తీ, ఫ్యాట్ ఫ్రీతో పాటు టేస్టీగా ఉండేలా చూస్తున్నాం. దీనికి సిటీవాసుల నుంచి మంచి స్పందన ఉంటుద’ంటున్నారు కేక్ డిజైనర్ ప్రియాంక.  

ఇవీ నా ఫేవరేట్...
‘బర్త్‌డేలు, వివాహ వేడుకలకు డిజైన్ చేసే కేకులు నా ఫేవరేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి స్పెషల్ మూమెంట్స్. అలాంటి వాటిలో నేను భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంద’ని చెబుతున్నారు ప్రియాంక. ఎంతో మంది మహిళలకు చాక్లెట్ తయారీ, కేక్ బేకింగ్‌లో శిక్షణ ఇస్తున్నందుకు గర్వంగా ఉందంటున్నారు.

పని ఒత్తిడి దూరం...
‘కేక్ బేకింగ్ పని ఒత్తిడిని దూరం చేస్తుంది. కొన్నిసార్లు థెరపటిక్‌గా కూడా పని చేస్తుంది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్లు వీకెండ్‌లలో మా వద్ద శిక్షణకు వస్తున్నారు. ఐదు రోజుల పాటు పనిలో బిజీగా ఉండే వీరికి కేక్ బేకింగ్... ఆ ఒత్తిడి నుంచి దూరం చేస్తోంది. కొంత మంది శిక్షణ తీసుకున్న వారు ఉద్యోగాలకు రాజీనామా చేసి సొంతంగా వెంచర్‌ను ప్రారంభిస్తున్నవారు కూడా ఉన్నారంటున్నారు ప్రియాంక. ఆర్డర్లపై చాక్లెట్లు, కేకులను పంపిణీ చేస్తున్నామని వివరించారు.

అభిరుచి నుంచి వృత్తి వైపు...
‘కేక్ బేకింగ్, చాక్లెట్ తయారీమంచి హాబీ. ఇంట్లో వారి కోసం ఎప్పుడూ చేస్తుండేదాన్ని. ఇలా ఒక రోజు వంట పోటీల్లో పాల్గొన్నా. ఆ అనుభవంతోనే నేను సొంతంగా వెంచర్‌ను ప్రారంభించాలకున్నా. సిటీలోని ఆరోరా కాలేజీ నుంచి ఎంబీఏ (ఫినాన్స్) పూర్తవగానే హాబీనే ప్రొఫెషన్‌గా మార్చుకున్నా. తొలినాళ్లలో కప్‌కేక్స్, చాక్లెట్లతో చిన్నగా ప్రారంభించా. కస్టమర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో 2012లో టంక్‌డ్లైట్‌గా మార్చా’నంటారు ప్రియాంక.

తయారీలో శిక్షణ...
ఎగ్‌ఫ్రీ బేకింగ్, కేక్ డెకరేటింగ్, డిసార్ట్స్, డూనట్స్, చాక్లెట్ తయారీలో రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం. ఈ నెల 23, 24 తేదీల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చాక్లెట్ కేక్‌లు, చాక్లెట్ డెకరేషన్, ట్రఫుల్, సాస్, ఫ్రూట్ కేక్, మ్యాంగో చాక్లెట్ కేక్, ఫైనాపిల్ పెస్ట్రీ, ఎగ్‌లెస్ చాక్లెట్ తయారీలో శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 90526 62545 నంబరులో సంప్రదించవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement