అందాజ్ అందం
ఫ్యాషన్ వస్త్ర ప్రపంచాన్ని ఏలుతున్న మెబాజ్ నుంచి అందాజ్ పేరిట మరో కొత్త కలెక్షన్ మార్కెట్లోకి వచ్చింది. కాక్‌టెయిల్ శారీస్, కాక్‌టెయిల్ బ్రైడల్స్, క్రియేటివ్ వెస్టర్న్, ఇంప్రెసివ్ ఇండో-వెస్టర్న్, క్లాసికల్ ట్రెడిషనల్ వస్త్రాలు నగరవాసులు మనసు దోచుకుంటున్నాయి. బేగంపేటలోని మెబాజ్‌లో అందాజ్ కలెక్షన్‌ను మిస్ ఆసియా పసిఫిక్ వరల్డ్ సృష్టి రాణా ఆదివారం ఆవిష్కరించారు. నటుడు శ్రీధర్ రావు షేర్వానీలో తళుక్కుమన్నారు. ఎప్పటికప్పుడూ ట్రెండ్ ఫాలో అయ్యే నగరవాసుల కోసం సరికొత్త ఫ్యాషన్ వస్త్రాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నామని మెబాజ్ డెరైక్టర్ మనోజ్ జేత్వాని తెలిపారు.