మై ఫిట్ మంత్ర 3 2 1... | my fit mantra 3 2 1..... | Sakshi
Sakshi News home page

మై ఫిట్ మంత్ర 3 2 1...

Published Fri, Apr 3 2015 10:42 PM | Last Updated on Tue, Oct 16 2018 8:03 PM

మై ఫిట్ మంత్ర 3 2 1... - Sakshi

మై ఫిట్ మంత్ర 3 2 1...

ఆమె వయసు 50కి పైనే. కాని స్కిన్ టోన్ 18 దగ్గరే ఆగిపోయింది. ఇవామెండిస్, స్కార్లెట్ జాన్సన్, జెస్సికా ఆల్బా తదితర హాలీవుడ్ టాప్ స్టార్స్‌కు సైతం ఫిట్‌నెస్ అక్షరాభ్యాసం చేయించిన రమోనా బ్రగాంజా.. మన సిటీలోని అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న జిమ్‌లో ఫిట్‌నెస్ లవర్స్‌కు తాత్కాలిక ట్రైనర్ కూడా. ఇటీవల సిటీకి వచ్చిన ఆమెను సిటీప్లస్ పలకరించింది. ఆ విశేషాలు...
 ..:: ఎస్. సత్యబాబు
 నాలుగేళ్ల వయసులోనే జిమ్నాస్టిస్ట్ట్‌గా మారాను. 18 ఏళ్లొచ్చాక డ్యాన్సర్  అయ్యాను. ఆ తర్వాత ఎన్‌ఎఫ్‌ఎల్ ఫుట్‌బాల్ టీమ్ ‘ది ఎల్ ఎ రైడర్స్’ కోసం చీర్‌లీడర్‌గా సైతం పనిచేశాను. పదేళ్ల పాటు చీర్‌లీడర్స్‌గా చేస్తున్న టైమ్‌లోనే ఫిట్‌నెస్ కాంటెస్ట్‌లపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ తర్వాత జెస్సికా నటిస్తున్న డార్క్ ఏంజెల్ టీవీ షో కోసం ట్రైనర్‌గా పనిచేయమని ఇన్వైట్ చేశారు. అలా ఒక నటిని తొలిసారి ట్రైన్ చేశాను. అక్కడి నుంచి పలువురికి ట్రైనర్‌గా ఆఫర్లు వచ్చాయి.
 రమోనా 321 అంటే
 ఇది నేను క్రియేట్ చేసిన స్పెషలైజ్డ్ స్టైల్. బాగా పాపులరైన నా వర్కవుట్ మంత్ర. 3 కార్డియో వర్కవుట్స్, 2 సర్క్యూట్, 1 కోర్ మజిల్ వర్కవుట్... ఈ మూడింటిని కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేస్తే సంపూర్ణమైన వర్కవుట్ చేసిన ఫలితం లభిస్తుంది.
 మొబైల్ జిమ్...
 నేను జెస్సికాకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మరికొందరు హాలీవుడ్ స్టార్స్‌కు సైతం నా సర్వీసెస్ కావాల్సి వచ్చాయి. అయితే వాళ్లంతా బిజీ స్టార్స్, పైగా షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాల కోసం అప్పటికప్పుడు ఇన్‌స్టంట్ మజిల్ టోనింగ్ అవసరమయ్యేది. స్టూడియోస్ దగ్గరకు తీసుకెళ్లేందుకు నేను మొబైల్‌జిమ్ ఇలా సెటప్ చేశాను.
 తల్లయ్యాకే...
 తల్లులైన హాలీవుడ్ హీరోయిన్స్‌కే ఎక్కువగా పనిచేశాను. నిజానికి ఆడవాళ్లకి ఫిట్‌నెస్ అత్యంత అవసరమైన దశ తల్లి అయిన తర్వాతే. నిజానికి ఒక ట్రైనర్‌కి కూడా అదొక చాలెంజ్ లాంటిది. జెస్సికా లాంటి తారలు అమ్మలైనా అమ్మాయిల్ని మించిన ఆకర్షణతో ఉండడానికి వారి ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా ఉపయోగపడింది. ఏ మహిళ అయినా తల్లయినంత మాత్రాన మంచి ఫిజిక్ గురించి మర్చిపోవాల్సిన అవసరం లేదని నేనెప్పుడూ చెబుతుంటాను.
 మూలాలు ఇక్కడే...
  త్రీ ఇయర్స్ అవుతోంది ఇక్కడికి వచ్చి. మా పెద్దవాళ్ల మూలాలు ఇక్కడే (ఇండియాలో) ఉన్నాయి. ప్రస్తుతం వాటిని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. ఇక నేను సింగిల్‌ని. రీసెంట్‌గా ఒక రిలేషన్ షిప్‌ను వదిలేసుకున్నాను. అయితే విభిన్న రకాల మనుషుల్ని కలవడం, ఫిట్‌నెస్ క్యాంప్స్... వీటితో అయామ్ రియల్లీ హ్యాపీ అండ్ ఎంగేజ్డ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement