Ukrainian families who fear they will be killed by Russian Forces: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజులకు దాడి కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ని తలవంచకపోయేసరికి ఆగ్రహంతో రష్యా బలగాలు ఊహించని విధంగా పౌరులపై కాల్పుల జరిపి నరమేథానికి పాల్పడుతున్నాయి. ఇప్పటికే బుచా నగరాన్ని శవాల దిబ్బగా మార్చేసింది. అదీగాక రష్యా బలగాలు ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉక్రెయిన రాజధాని కైవ్‌కి సమీపంగా వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ కుటుంబాల్లో భయాలు మొదలయ్యాయి.
తాము రష్యాన్ దళాల చేతిలో హతమైతే తమ పిల్లలు బతికి క్షేమంగా ఉండాలని వారి శరీరాలపై ఫోన్ నెంబర్లతో సహా కుటుంబ వివరాలను రాస్తున్నారు. ఆ ఘటనలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఉక్రెయిన్‌లోని ఒక బాలిక తల్లి సాషా మకోవియ్ ఇలానే తన కూతురు శరీరంపై కుటుంబ వివరాలను రాసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు తమకు ఏమైన అయితే తమ పాపను మంచిగా చూసుకోవాలనే ఆశతో ఇదంతా చేస్తున్నట్లు వివరించింది. అంతేగాదు గత నెలలో యుద్ధం మొదలైనప్పుడు వేలాది మంది పౌరులు ఉక్రెయిన్ సరిహద్దులకు దాటి వెళ్లారు. ఈ క్రమంలో ఒక పదేళ్ల బాలుడు తన తల్లి ఇచ్చిన చిన్న కాగితం ముక్కతో ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలాండ్ సరిహద్దుకు చేరిన ఉదంతం తెలిసిందే.
రష్యన్ బలగాల దాడులకు భయపడి పారిపోతున్న పిల్లలను, పౌరులను మావన కవచాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపణ వెలువెత్తాయి. అంతేకాదు నోవీ బైకివ్ గ్రామంలో యుద్ధ ట్యాంకుల ముందు బస్సులలో పిల్లలను ఉంచుతున్నారని నివేదిక పేర్కొంది. పుతిన్ అరాచకాలకు అంతేలేకుండా పోతుందంటూ ప్రపంచ దేశాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాదు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఈ దాడులన ఖండించడమే కాకుండా పుతిన్‌ని యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు.
Ukrainian mothers are writing their family contacts on the bodies of their children in case they get killed and the child survives. And Europe is still discussing gas. pic.twitter.com/sK26wnBOWj
— Anastasiia Lapatina (@lapatina_) April 4, 2022
(చదవండి: యజమాని కోసం నిరీక్షిస్తున్న కుక్క!)
Comments
Please login to add a commentAdd a comment