Ukraine Prosecutor General Says Over 400 Children Killed Russia War - Sakshi
Sakshi News home page

రష్యా భీకర దాడులకు 437 మంది ఉక్రెయిన్ చిన్నారులు బలి

Published Sat, Nov 19 2022 8:43 PM | Last Updated on Sat, Nov 19 2022 8:48 PM

Ukraine Prosecutor General Says Over 400 Children Killed Russia War - Sakshi

కీవ్‌: రష్యా తమపై చేస్తున్న దండయాత్రలో ఇప్పటివరకు 437 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపింది. మరో 837 మంది చిన్నారులు గాయపడినట్లు వెల్లడించింది. ఇంకా మొత్తం లెక్కలు సేకారించాల్సి ఉందని, ఈ సంఖ్య పెరగవచ్చని పేర్కొంది.

రష్యా దాడుల్లో తూర్పు డొనెస్క్ ప్రాంతంలోని చిన్నారులు అత్యంత తీవ్రంగా ప్రభావితమైనట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఈ ఏరియాలో 423 చిన్నారులు బాధితులుగా ఉన్నట్లు వివరించింది.

రష్యాతో యుద్ధంలో 16,295 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నారు. ఫిబ్రవరి 24న మొదలైన  ఈ యుద్ధం భారీ ప్రాణ, నష్టాన్ని మిగుల్చుతోంది. నెలలు గడుస్తున్నా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని రష్యా, చర్చలకు వెళ్లేది లేదని ఉక్రెయిన్ చెబుతున్నాయి. దీంతో ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కన్పించడం లేదు.
చదవండి: గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన అపార్ట్‌మెంట్‌.. 9 మంది దుర్మరణం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement