![Rajasthan Man 3 Children Dead In Tractor Tempo Collision - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/7/tract.jpg.webp?itok=1N7uwpKC)
ట్రాక్టర్ టెంపో ఢీ కొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారుల తోసహా నలుగురు మృతి. ఈ ఘటన రాజస్తాన్‌లో అల్వార్‌లోని కథూమర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి అక్రమ తవ్వకాలతో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టరే కారణమంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో గ్రామస్తులు రహదారులను దిగ్బంధించి..సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా గ్రామస్తులు రాళ్లు రువ్వారు. ఇసుక మాఫియాతో కుమ్మక్కయ్యారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. చివరికి పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి ట్రాఫిక్‌ని క్లియర్ చేశారు. తదనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
(చదవండి: గుడ్‌న్యూస్.. ప్యాసింజర్ రైళ్లు, నల్లగొండలో వందేభారత్‌కు హాల్ట్!)
Comments
Please login to add a commentAdd a comment