Tempo
-
బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది మృతి?
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలకనంద నదిలో ఒక టెంపో వాహనం పడిపోయింది. ఈ టెంపోలో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని, వారిలో 10 మంది వరకూ మృతి చెందివుంటారని సమాచారం.రుద్రప్రయాగ్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో హైవేపై రతౌలీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రామస్తులు పోలీసులు, పరిపాలనా అధికారులు, డీడీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. టెంపో నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి, హెలికాప్టర్ ద్వారా గుప్తకాశీలోని ఆస్పత్రికి తరలించారు.ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, పరిపాలనా అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై ఆయన ఒక ట్వీట్లో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై విచారణకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తేలితే అతనిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. VIDEO | Uttarakhand: Around eight people lost their lives after a tempo, they were travelling in, fell into a gorge on Rishikesh-Badrinath national highway. More details are awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/DrcaPhTfBX— Press Trust of India (@PTI_News) June 15, 2024 -
Rahul Gandhi: మోదీజీ... భయపడ్డారా?
న్యూఢిల్లీ: అంబానీ– అదానీలతో కాంగ్రెస్‌కు ఒప్పందం కుదిరిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు. ‘నమస్కారం మోదీజీ.. మీరు భయపడ్డారా?’ అని రాహుల్ ఓ వీడియో సందేశంలో ప్రశ్నించారు. ‘సాధారణంగా మీరు అంబానీ, అదానీల గురించి అంతర్గతంగా, తెరవెనుక మాట్లాడుతారు. కానీ మొదటిసారిగా ఇవాళ మీరు అంబానీ, అదానీల పేర్లను బహిరంగంగా తీసుకున్నారు’ అని రాహుల్ అన్నారు. ఎన్ని టెంపో లోడ్ల నల్లధనం కాంగ్రెస్‌కు ముట్టింది? ఏం ఒప్పందం కుదిరింది? రాత్రికి రాత్రే అంబానీ– అదానీలపై ఆరోపణలు ఆగిపోయాయి’ అని ప్రధాని మోదీ బుధవారం వేములవాడ సభలో ప్రశ్నించారు. ప్రధాని విమర్శలకు బదులిస్తూ ‘వారు టెంపోల నిండా డబ్బులిస్తారని కూడా మీకు తెలుసు. అంటే మీకు వ్యక్తిగతంగా ఇది అనుభవమేనా?’ అని రాహుల్ నిలదీశారు. ఒక పనిచేయండి.. అంబానీ, అదానీలపైకి ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ)ని పంపాలని ప్రధాని మోదీని కోరారు. కాంగ్రెస్ పారీ్టకి వారు నల్లధనమిచ్చారనే దానిపై సాధ్యమైనంత త్వరగా లోతైన దర్యాప్తు పూర్తయ్యేలా చూడాలన్నారు. వారిపైకి ఈడీని పంపడానికి భయపడొద్దన్నారను. బీజేపీ అవినీతి టెంపోకు డ్రైవర్ ఎవరో, హెల్పర్ ఎవరో మొత్తం దేశానికి తెలుసన్నారు. -
ఐదుగుర్ని బలిగొన్న రోడ్డు ప్రమాదం
వడమాలపేట/తిరుమల:టెంపోలో వెళ్తున్న భక్తులను తిరుపతి జిల్లా ఎస్వీ పురం టోల్‌ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న టెంపో ట్రావెలర్ వాహనాన్ని హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వడమాలపేట మండలం పుత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై అంజేరమ్మ కనుమ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతిలోని ఎస్ఆర్ ఇండియా ప్రైమ్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ నిర్వాహకులు సుబ్రహ్మణ్యం, రాజశేఖర్‌రెడ్డి వడమాలపేట మండలం ఎస్వీ పురంలోని అంజేరమ్మకు మొక్కు చెల్లించుకునేందుకు ఆదివారం మధ్యాహ్నం కారులో బయలుదేరగా.. వారి కార్యాలయంలో పనిచేసే 12 మంది సిబ్బంది టెంపో ట్రావెలర్‌లో బయలుదేరారు. టెంపో టోల్‌ప్లాజా దాటి అంజేరమ్మ ఆలయానికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న దానిని హెరిటేజ్ ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 12 మందితోపాటు మిల్క్ ట్యాంకర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది, టోల్ ప్లాజా అంబులెన్స్‌లో క్షతగాత్రులను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఐరాల మండలానికి చెందిన రేవంత్ (44), ఆర్సీ పురానికి చెందిన గిరిజ (45) మృతి చెందారు. అక్కడి నుంచి క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ గంగాధర నెల్లూరుకు చెందిన హెరిటేజ్ మిల్క్ ట్యాంకర్ డ్రైవర్ శివకుమార్ (57), పాకాల మండలం శ్రీరంగరాజపురానికి చెందిన రేఖ (24), కుప్పానికి చెందిన అజయ్‌కుమార్ అలియాస్ అంజి (25) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నెల్లూరుకు చెందిన రాజశేఖర్, తిరుపతి కొత్తపల్లెకి చెందిన లతారెడ్డి, సత్యనారాయణపురానికి చెందిన కాంతిరేఖ, నారాయణరెడ్డి, రెడ్డిగుంటకు చెందిన కుమారస్వామిరెడ్డి, అన్నమయ్య జిల్లా రామాపురానికి చెందిన నరసింహులు, రాజంపేటకు చెందిన సుజాత, సత్యసాయి జిల్లాకు చెందిన ఆంజనేయులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే టెంపో డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వడమాలపేట పోలీసులు తెలిపారు. ఘాట్ రోడ్డులో రెండు టెంపోలకు బ్రేక్ ఫెయిల్ కాగా, తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో రెండు టెంపో ట్రావెలర్ వాహనాలకు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. తిరుమల ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు, చెన్నైకి చెందిన 12 మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ఆదివారం తిరుపతికి తిరిగి వెళుతుండగా.. మొదటి ఘాట్ రోడ్డుపై నాలుగో మలుపు వద్ద వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది క్షత్రగాత్రులను అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఇద్దరిని టీటీ బర్డ్ ఆస్పత్రికి తరలించారు. మరో ప్రమాదంలో తిరుపతికి చెందిన టెంపో ట్రావెలర్ వాహనంలో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమల నుంచి తిరుపతికి దిగుతుండగా 9వ మలుపు వద్ద వాహనం బ్రేక్ ఫెయిలై రక్షణ గోడను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో భక్తులెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
ట్రాక్టర్ టెంపో ఢీ కొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారుల తోసహా నలుగురు మృతి. ఈ ఘటన రాజస్తాన్‌లో అల్వార్‌లోని కథూమర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి అక్రమ తవ్వకాలతో ఇసుకను తరలిస్తున్న ట్రాక్టరే కారణమంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు రహదారులను దిగ్బంధించి..సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా గ్రామస్తులు రాళ్లు రువ్వారు. ఇసుక మాఫియాతో కుమ్మక్కయ్యారంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. చివరికి పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి ట్రాఫిక్ని క్లియర్ చేశారు. తదనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. (చదవండి: గుడ్‌న్యూస్.. ప్యాసింజర్ రైళ్లు, నల్లగొండలో వందేభారత్‌కు హాల్ట్!) -
షాకింగ్ ప్రమాదం: జనాల మీదకు దూసుకొచ్చిన టెంపో, ఆపై..
-
షాకింగ్ ఘటన:రెస్టారెంట్లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు
గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా ఒక టెంపో హైవేకి సమీపంలో ఉన్న ధాబా (రోడ్డు సైడ్ రెస్టారెంట్)లోకి దూసుకొచ్చింది. సరిగ్గా ఆ సమయంలో రెస్టారెంట్లో సుమారు 8 నుంచి 10 మంది దాక కస్టమర్లు ఉన్నారు. ఈ అనుహ్య ఘటనలో ముగ్గరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ టెంపో అదుపు తప్పి వేగంగా ధాభాలోకి దూసుకురావడంతో రెస్టారెంట్‌లోని గోడను ఢీకొట్టి ఫర్నీచర్‌ని ధ్వంసం చేస్తూ..పలువురు పైకి దూసుకుపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అవ్వడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే ఆ సమయంలో టెంపో ఖాళీగానే ఉందని డ్రైవర్ మాత్రం తప్పించుకున్నాడని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. સરોલીમાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે. સરોલીમાં આવેલ બાપા ના બગીચા નામના ઢાભામાં બુલેરો પિકઅપ વાન ઘુસી જતા 3 લોકો કચડાયા@CP_SuratCity @TrPoliceSurat #ACCIDENT #suratcity #Surat pic.twitter.com/dumHqOW9OW — journalist Sharif Shaikh (@PatrkarShaikh) December 19, 2022 (చదవండి: గుంజీలు తీయండి..ఫ్రీగా బస్సు టిక్కెట్ పొందండి) -
టెంపో ఢీకొని ఇద్దరి దుర్మరణం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని టి.సదుం పంచా యతీ చెన్నరాయునిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని టెంపో ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసుల కథ నం మేరకు.. కర్ణాటక సరిహద్దులోని ఉప్పుకుంటపల్లికి చెందిన జయమ్మ (54) సమీపంలోని అంకాలమడుగు గ్రామానికి వెళ్లింది. అక్కడ పని ముగించుకుని సమీప బంధువు రామక్రిష్ణప్ప(58)తో కలిసి ద్విచక్ర వాహనంలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దులో ఉన్న చెన్నరాయనిపల్లి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న టెంపో ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో జయమ్మ, రామక్రిష్ణప్ప తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయింది. ఈ విషయం తెలుసుకున్న మృతుల బంధువులు అక్కడికి చేరు కుని కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రవికుమార్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది మృతి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులను బుధాన్ నుంచి మహోర్‌కు తీసుకు వెళుతుండగా టెంపో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలోని జామ్‌సలాం గ్రామంలోని చాచి నల్లా సమీపంలో చోటుచేసుకుంది. ఏడుగురు సంఘటనా స్థలంలోనే మరణించగా, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
అక్రమంగా తరలిస్తున్న బియ్యం సీజ్
రామసముద్రం: అనుమతిలేకుండా కర్ణాటకకు టెంపోలో తరలిస్తున్న బియ్యాన్ని బుధవారం కమ్మవారిపల్లె చెక్‌పోస్టులో ఏఎస్ఐ గోపాల్ సీజ్ చేశారు. ఆయన కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన 120 బస్తాల బియ్యాన్ని తిరుపతి నుంచి టెంపోలో వేసుకుని కర్ణాటకకు తరలిస్తున్నారు. కమ్మవారిపల్లె చెక్‌పోస్టు వద్ద ఏఎస్ఐ తనిఖీలు చేయగా బియ్యానికి సంబంధించిన అనుమతులు లేవు. దీంతో బియ్యం, టెంపోను స్వాధీనం చేసుకున్నారు. అందులో 115 బస్తాల ఉప్పుడు బియ్యం, ఐదు బస్తాల సోనామసూరు బియ్యం ఉండడంతో రాయచోటికి చెందిన డ్రైవర్ వినయ్‌తుల్లా, ఓనర్ జమీల్బాషాపై కేసు నమోదు చేశారు. వారిని రిమాండ్ నిమిత్తం పుంగనూరుకు తరలించారు. -
బరువైన 'బుల్లెట్' ప్రాణం తీసింది
న్యూఢిల్లీ: ఢిల్లీలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం బీభత్సం సృష్టించింది . ఒకవైపు అతి వేగం, మరోవైపు బరువైన వాహనం మానిక్ గౌర్(32) ప్రాణాలు తీసింది. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని శంకర్ విహార్ దగ్గర చోటు చేసుకున్న ఈ ఘటనతో ప్రత్యక్ష సాక్షులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్రేజీ బైక్ బుల్లెట్ పై రైడ్ అంటే యువకులకు మహా ఉత్సాహం. ఈ ఉత్సాహంలోనే మానిక్ మితిమీరిన వేగంతో బుల్లెట్ పై వెడుతూ పక్కనే ఉన్న టెంపోను ఢీకొట్టాడు. అక్కడితో అది ఆగలేదు.. కొన్నిమీటర్ల దూరం వాహనాన్ని ఈడ్చుకెళ్లి పోవడంతో మంటలు చెలరేగాయి. బండి పూర్తిగా అదుపు తప్పి, అతను కిండపడిపోయాడు. అతనిపై బుల్లెట్ పడిపోయింది. పెట్రోల్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో మానిక్ మంటల్లో చిక్కుకు పోయాడు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక దళాలు అతణ్ని ఆసుపత్రి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే బుల్లెట్ బరువు ఎక్కువగా ఉండడంతో అతను తప్పించుకోలేకపోయాడని పోలీస్ అధికారులు తెలిపారు. సుమారు 200 కిలోల వెయిట్ వున్న వాహనాన్ని లేపలేకపోయాడని , మంటలు బాగా వ్యాపించడంతో తాము కూడా ఏమీ చేయలేకపోయామని ప్రత్యక్ష సాక్షులు వాపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి భార్య, రెండేళ్ల కూతురు ఉన్నారు. -
ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న టెంపో
రామకుప్పం : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని రాజుపేట వద్ద రహదారిపై ఆగి ఉన్న ఆటోను అటుగా వస్తున్న ఐచర్ టెంపో ఢీకొట్టింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన రామకుప్పం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.