అంబానీ– అదానీలు టెంపోల్లో డబ్బు ఇస్తారని మీకు తెలుసంటే..
ఇది మీకు వ్యక్తిగత అనుభవమా?
ప్రధాని మోదీపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ: అంబానీ– అదానీలతో కాంగ్రెస్‌కు ఒప్పందం కుదిరిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు. ‘నమస్కారం మోదీజీ.. మీరు భయపడ్డారా?’ అని రాహుల్ ఓ వీడియో సందేశంలో ప్రశ్నించారు. ‘సాధారణంగా మీరు అంబానీ, అదానీల గురించి అంతర్గతంగా, తెరవెనుక మాట్లాడుతారు. కానీ మొదటిసారిగా ఇవాళ మీరు అంబానీ, అదానీల పేర్లను బహిరంగంగా తీసుకున్నారు’ అని రాహుల్ అన్నారు.
ఎన్ని టెంపో లోడ్ల నల్లధనం కాంగ్రెస్‌కు ముట్టింది? ఏం ఒప్పందం కుదిరింది? రాత్రికి రాత్రే అంబానీ– అదానీలపై ఆరోపణలు ఆగిపోయాయి’ అని ప్రధాని మోదీ బుధవారం వేములవాడ సభలో ప్రశ్నించారు. ప్రధాని విమర్శలకు బదులిస్తూ ‘వారు టెంపోల నిండా డబ్బులిస్తారని కూడా మీకు తెలుసు. అంటే మీకు వ్యక్తిగతంగా ఇది అనుభవమేనా?’ అని రాహుల్ నిలదీశారు. ఒక పనిచేయండి.. అంబానీ, అదానీలపైకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ (ఈడీ)ని పంపాలని ప్రధాని మోదీని కోరారు. కాంగ్రెస్ పారీ్టకి వారు నల్లధనమిచ్చారనే దానిపై సాధ్యమైనంత త్వరగా లోతైన దర్యాప్తు పూర్తయ్యేలా చూడాలన్నారు. వారిపైకి ఈడీని పంపడానికి భయపడొద్దన్నారను. బీజేపీ అవినీతి టెంపోకు డ్రైవర్ ఎవరో, హెల్పర్ ఎవరో మొత్తం దేశానికి తెలుసన్నారు.
Comments
Please login to add a commentAdd a comment