
అక్రమంగా తరలిస్తున్న బియ్యం సీజ్
రామసముద్రం: అనుమతిలేకుండా కర్ణాటకకు టెంపోలో తరలిస్తున్న బియ్యాన్ని బుధవారం కమ్మవారిపల్లె చెక్‌పోస్టులో ఏఎస్‌ఐ గోపాల్ సీజ్ చేశారు. ఆయన కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన 120 బస్తాల బియ్యాన్ని తిరుపతి నుంచి టెంపోలో వేసుకుని కర్ణాటకకు తరలిస్తున్నారు. కమ్మవారిపల్లె చెక్‌పోస్టు వద్ద ఏఎస్‌ఐ తనిఖీలు చేయగా బియ్యానికి సంబంధించిన అనుమతులు లేవు.
దీంతో బియ్యం, టెంపోను స్వాధీనం చేసుకున్నారు. అందులో 115 బస్తాల ఉప్పుడు బియ్యం, ఐదు బస్తాల సోనామసూరు బియ్యం ఉండడంతో రాయచోటికి చెందిన డ్రైవర్ వినయ్‌తుల్లా, ఓనర్ జమీల్‌బాషాపై కేసు నమోదు చేశారు. వారిని రిమాండ్ నిమిత్తం పుంగనూరుకు తరలించారు.