హుజూరాబాద్‌లో వాహన తనిఖీలో సీపీ సుబ్బారాయుడు
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో మొత్తం 5 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అవి హైదరాబాద్ రూట్‌లో రేణికుంట టోల్‌ప్లాజా, పెద్దపల్లి మార్గంలో మొగ్దుంపూర్, జమ్మికుంట వైపు సిరిసే డు, వరంగల్ రూట్‌లో పరకాల ఎక్స్‌రోడ్ వద్ద, మంచిర్యాల రూట్‌లో చొప్పదండి ఆర్నకొండ వద్ద ఉన్నాయి. ఒక్కో చెక్‌పోస్టులో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారి, ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఎకై ్సజ్ శాఖ నుంచి ఒకరు, అటవీశాఖ నుంచి ఒకరు, రవాణా శాఖ నుంచి ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేల డబ్బులు, మద్యం, ఇతరత్రాలను కట్టడి చేసేందుకు వాహన తనిఖీలు చేపడుతున్నారు.
నిబంధనలు పాటించాలి
ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సుబ్బారాయుడు అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌శివారులోని కేసీక్యాంపు, ఇల్లందకుంట మండలం సరిసేడు, తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆర్నకొండ చెక్‌పోస్టును రూరల్ ఏసీపీ కరుణాకర్‌రావు తనిఖీ చేశారు.
సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యం నగదు, బంగారం తీసుకెళ్లేవారు రశీదులు వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి, ఎలాంటి ఆధా రాలు లేని నగదు, బంగారాన్ని సీజ్ చేస్తామని తెలిపారు. వాహనదారులు అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో అనుమతి పొందిన ఆయుధాలపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. గన్స్‌ను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని తెలిపారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
రూ.1.50 లక్షలు సీజ్
కరీంనగర్ టూటౌన్ పరిధిలోని తెలంగాణచౌక్ వద్ద మంగళవారం బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు లేని రూ.1.5 లక్షలు సీజ్ చేశారు. 10మంది పాతనేరస్తులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. త్రీటౌన్ పరిధిలోని కాపువాడలో ఓ బెల్ట్‌షాపులో 23 మద్యం బాటిళ్లు చేశారు. జమ్మికుంట మండలం కోరపల్లిలో ఓ బెల్టుషాపు నుంచి రూ.3,800 విలువ చేసే మద్యం సీజ్ చేశారు.
వీణవంక మండలంలో 13మందిని తహసీల్దార్ తిరుమల్‌రావు ఎదుట భైండోవర్ చేసినట్లు ఎస్సై ఆసిఫ్ తెలిపారు. మండలంలోని మామిడాలపల్లి గ్రామంలోని ఓ బెల్టుషాపులో మద్యంబాటిళ్లను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment