
ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది మృతి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులను బుధాన్ నుంచి మహోర్‌కు తీసుకు వెళుతుండగా టెంపో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలోని జామ్‌సలాం గ్రామంలోని చాచి నల్లా సమీపంలో చోటుచేసుకుంది.
ఏడుగురు సంఘటనా స్థలంలోనే మరణించగా, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.