reasi
-
రియాసి ఉగ్రవాది ఊహాచిత్రం విడుదల.. పట్టిస్తే 20లక్షల రివార్డ్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపిన ఉగ్రవాది స్కెచ్(ఫొటో)ను పోలీసులు విడుదల చేశారు. స్కెచ్ ఆధారంగా ఉగ్రవాది సమాచారం అందించిన వారికి రూ. 20 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. రియాసి ఎస్పీ- 9205571332, రియాసి ఏఎస్పీ- 9419113159, ఎస్హెచ్ఓ పౌని- 7051003214 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని పోలీసులు కోరారు.రాస్నో-పౌని-త్రెయాత్ ప్రాంతాల్లో 11 భద్రతా బలగాల బృందాలతో ఉగ్రవాదులు వేట కొనసాగుతోంది. ఈ ఉగ్రదాడి వెనకాల లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి ఎన్ఐఏ ఫొరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది.ఆదివారం 53 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది యాత్రికులు మృతి చెందగా.. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. యాత్రికుల బస్సు .. శివ్ కోరి నుంచి కాత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి తిరిగి వస్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడులతో విరుచుకుపడ్డారు. బస్సులో ఉత్తరపదేశ్, రాజస్తాన్, ఢిల్లీకి చెందిన యాత్రికులు ఉన్నారు. కాల్పులు జరగటంతో యాత్రికుల బస్సు లోయలోకి పడిపోయింది. -
కశ్మీర్లో బస్సు దాడి మా పనే: టీఆర్ఎఫ్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రియాస్ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. అంతేగాక భవిష్యత్తులో పర్యాటకులు లేదా స్థానికేతరులపై ఇలాంటి దాడులు మరిన్ని జరగవచ్చని హెచ్చరించింది. రియాస్ దాడి కేవలం ప్రారంభం మాత్రమేనని తెలిపింది. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో పది మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. రియాస్‌లోని శివ్ఖోరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని కాత్రాలోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్తునన భక్తుల బస్సుపై ఈ దాడి జరిగింది. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. బస్సుపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.సంఘటన ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.కాగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో 2023 జనవరి 6న ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ 2019లో ఉనికిలోకి వచ్చింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆన్లైన్ సంస్థగా ఇది పుట్టుకొచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేస్తుంది. -
జమ్ము కశ్మీర్: డ్రోన్ల సాయంతో ఎన్ఐఏ ‘ఉగ్ర’ వేట
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యాత్రికులు కత్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు.ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. సంఘటన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత సమీపంలోని గుహల్లోకి వారు పారిపోయి ఉంటాని భావిస్తున్నారు. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.కాగా శివ ఖోరీ మందిరం నుంచి వైష్ణో దేవి ఆలయం వైపు వెళ్తుండగా.. సమీపంలోని అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు బస్సుపై దాడి చేసి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో బస్సు డ్రైవర్‌కు గాయాలవ్వడంతో నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాహనం లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారు. ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని తెలుస్తోంది. గత నెలలో రాజౌరి, పూంచ్‌లలో ఇతర దాడులు పాల్పడిన ఉగ్రవాదులో ఈ ఆపరేషన్‌లో కూడా పాల్గొన్నట్లు సమాచారం.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. ఘటనలో గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించా. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ఉగ్రదాడిని ఖండించారు. -
దేశంలో తొలి రైల్వే కేబుల్ బ్రిడ్జి సిద్ధం
జమ్మూ: దేశంలోనే మొట్టమొదటి రైల్వే తీగల వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా వెల్లడిస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. కేవలం 11 నెలల్లో ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యిందని తెలియజేశారు. వంతెన వీడియోను షేర్ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లా అంజీ ఖద్‌లో ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. దీని మొత్తం పొడవు 473.25 మీటర్లు. 96 ప్రధాన తీగలు ఉన్నాయి. ఉదంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్ లింక్(యూఎస్బీఆర్ఎల్)లో ఈ బ్రిడ్జిని నిర్మించారు. కాట్రా వైపు ఉన్న టన్నెల్ టీ2, రియాసీ వైపు ఉన్న టన్నెల్ టీ3ని ఇది అనుసంధానిస్తుంది. వంతెన నిర్మాణంలో ఉపయోగించిన మొత్తం తీగల పొడవు 653 కిలోమీటర్లు కావడం విశేషం. జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై ఉన్న రైల్వే వంతెన తర్వాత ఇది దేశంలోనే రెండో అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన. బలమైన గాలులు, తుఫాన్లు, పేలుళ్లను సైతం తట్టుకొనేలా డిజైన్ చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ట్వీట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్సలెంట్(అద్భుతం) అంటూ స్పందించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: 9మంది మృతి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులను బుధాన్ నుంచి మహోర్‌కు తీసుకు వెళుతుండగా టెంపో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జమ్మూ కశ్మీర్‌లోని రియాసీ జిల్లాలోని జామ్‌సలాం గ్రామంలోని చాచి నల్లా సమీపంలో చోటుచేసుకుంది. ఏడుగురు సంఘటనా స్థలంలోనే మరణించగా, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
లోయలో పడిన బస్సు, 22 మంది మృతి
శ్రీనగర్: జమ్మూలోని రియాసి జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 22మంది మృతి చెందినట్లు జమ్మూకశ్మీర్ మంత్రి అజయ్ నందా తెలిపారు. గాయపడిన వారిని అంబులెన్స్ ల ద్వారా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.