కశ్మీర్​లో బస్సు దాడి మా పనే: టీఆర్‌ఎఫ్‌ Pak backed Lashkar front claims responsibility for JK bus terror attack. Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్​లో బస్సుపై దాడి మా పనే.. ప్రకటించిన టీఆర్‌ఎఫ్‌ ఉగ్రసంస్థ

Published Mon, Jun 10 2024 1:43 PM | Last Updated on Mon, Jun 10 2024 3:48 PM

Pak backed Lashkar front claims responsibility for JK bus terror attack

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని రియాస్‌ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్​కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్‌ ఫ్రంట్‌ (టీఆర్​ఎఫ్​) ప్రకటించింది. అంతేగాక భవిష్యత్తులో పర్యాటకులు లేదా స్థానికేతరులపై ఇలాంటి దాడులు మరిన్ని జరగవచ్చని హెచ్చరించింది. రియాస్​ దాడి కేవలం ప్రారంభం మాత్రమేనని తెలిపింది.  

ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో పది మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు.  రియాస్‌లోని శివ్‌ఖోరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని కాత్రాలోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్తునన భక్తుల బస్సుపై ఈ దాడి జరిగింది. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. బస్సుపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

సంఘటన ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్​లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్​ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్​ఎస్​ఎల్​) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.

కాగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో 2023 జనవరి 6న ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్‌ఎఫ్‌ 2019లో ఉనికిలోకి వచ్చింది. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు తర్వాత ఆన్‌లైన్ సంస్థగా ఇది పుట్టుకొచ్చింది. పాకిస్థాన్‌లోని క‌రాచీ కేంద్రంగా ప‌నిచేస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement