Lashkar
-
కశ్మీర్లో బస్సు దాడి మా పనే: టీఆర్ఎఫ్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రియాస్ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. అంతేగాక భవిష్యత్తులో పర్యాటకులు లేదా స్థానికేతరులపై ఇలాంటి దాడులు మరిన్ని జరగవచ్చని హెచ్చరించింది. రియాస్ దాడి కేవలం ప్రారంభం మాత్రమేనని తెలిపింది. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో పది మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. రియాస్‌లోని శివ్ఖోరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని కాత్రాలోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్తునన భక్తుల బస్సుపై ఈ దాడి జరిగింది. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. బస్సుపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.సంఘటన ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.కాగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో 2023 జనవరి 6న ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ 2019లో ఉనికిలోకి వచ్చింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆన్లైన్ సంస్థగా ఇది పుట్టుకొచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేస్తుంది. -
జమ్ముకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
కశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ఎదురుకాల్పులు జరిగాయి. టెర్రరిస్టులు లష్కర్ ఎ తొయిబా ఉగ్రసంస్థకు చెందినవారిగా గుర్తించారు. పలు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. J-K: Five Lashkar terrorists gunned down in ongoing Kulgam encounter Read @ANI Story | https://t.co/6qRrP7HdiL#JammuAndKashmir #Kulgamencounter pic.twitter.com/X0hL5Dkcjg — ANI Digital (@ani_digital) November 17, 2023 జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. కుల్గాంలోని దమ్హాల్ హంజి పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే ముందస్తు సమాచారంతో బలగాలు రెక్కీ నిర్వహించాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిదాడికి దిగిన బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. గత అక్టోబర్‌లోనే కుల్గాం జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఇదీ చదవండి: యెమెన్‌లో కేరళ నర్సుకు నిరాశ.. మరణశిక్ష అప్పీల్‌ను తోసిపుచ్చిన కోర్టు -
జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్: లష్కరే తోయిబా కమాండర్ హతం
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్ అనంతనాగ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజ్జైర్ ఖాన్ హతమయ్యాడు. ఈ మేరకు ఏడు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌కు ముగింపు పలికినట్లు సైన్యం వెల్లడించింది. ఉజ్జైర్ ఖాన్‌తో పాటు మరో ఉగ్రవాది మృతదేహం లభ్యమయినట్లు ఏడీజీపీ పోలీసు వినయ్ కుమార్ తెలిపారు. పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతనాగ్‌లో ఏడు రోజులుగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగింది. అటవీ ప్రాంతాల్లో, కొండ చరియల్లో నక్కి ఉన్న టెర్రరిస్టుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. రెండు రోజుల క్రితం సైన్యంపై ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులతో పాటు జమ్ము కశ్మీర్ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఆర్మీ జవాన్ కిడ్నాప్.. హత్య -
లష్కర్‌ను వీడుతున్న కరోనా!
సాక్షి, సికింద్రాబాద్ : నిత్యం సందడిగా ఉండే సికింద్రాబాద్(లష్కర్) నగరం కరోనా పుణ్యమా.. అని 60 రోజులుగా మూగబోయింది. వ్యాపారాలు, కార్యాలయాలు మూతబడటం మాట అటుంచితే.. బయటకు వెళ్తే.. ఏమవుతుందోనన్న భయం మాత్రం ఈ ప్రాంత ప్రజలను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెంటాడింది. లష్కర్లో 26 మందికి కరోనా పాజిటివ్ రాగా, అందులో ముగ్గురు మృతి చెందారు. దీంతో లష్కర్ ప్రజలు పూర్తిగా భయాందోళనలకు గురయ్యారు. కరోనా దాడికి విలవిల్లాడిన లష్కర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కరోనా దెబ్బకు కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న 13 కాలనీలలో కరోనా తగ్గుముఖంలో ఉండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఒక్కొక్కటిగా ఎత్తి వేస్తున్నారు. దీంతో నివాసాలకే పరిమితమైన కంటైన్మెంట్ ప్రాంతాల ప్రజలు కొంత మేరకు ఊపిరి పీల్చుకుంటున్నారు. (తల్లికి కరోనా.. ఐసోలేషన్లోకి నటుడు) 13 కంటైన్మెంట్లు... సికింద్రాబాద్ నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్ల పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు కరోనా విస్తృతిని కట్టడి చేసేందుకు 13 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని లాలాగూడ, మెట్టుగూడ, శ్రీనివాస్‌నగర్, షాబాద్‌గూడ, కౌసరి మసీదు, బౌద్ధనగర్ అను ఆరు కంటైన్మెంట్ జోన్లలో ఐదింటిని ఎత్తివేశారు. బేగంపేట్ సర్కిల్ పరిధిలోని జీరా, పాటిగడ్డ, ప్రకాశ్‌నగర్, రామస్వామి కాంపౌండ్, నల్లగుట్ట, ఈస్ట్ మారేడుపల్లి, పీజీ రోడ్ అను ఎనమిదికి ఎనమిది కంటైన్మెంట్ జోన్లన్నీంటిని ఎత్తేశారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో 14 మందికి, బేగంపేట్ సర్కిల్ పరిధిలో 12 మందికి కరోనా వైరస్ సోకడంతో వారితో సన్నిహితంగా ఉన్న రెండు సర్కిళ్ల పరిధిలో సుమారు నాలుగు వందల మందికి అధికారులు పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే చికిత్స పొందుతుండగా మిగతా వారంతా డిశ్ఛార్జ్ అయ్యారు. వైరస్ సోకిన వారిలో ముగ్గురు వ్యక్తులు మాత్రం మృతి చెందారు. (కనరో శ్రీవారి దర్శన భాగ్యము) మిగిలింది ఒక్కటే... సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిళ్ల పరిధిలోని 9 మున్సిపల్ డివిజన్లలో మొత్తంగా ఒక్క కాలనీ మాత్రమే కంటైన్మెంట్ జోన్‌గా కొనసాగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 13 కంటైన్మెంట్లను అధికారులు రెండ్రోజుల క్రితమే ఎత్తివేశారు. తాజాగా బౌద్ధనగర్‌లోని ఒకే ఇంటిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో అట్టి కాలనీని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేశారు. నిరంతరం పరీక్షలు... సికింద్రాబాద్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్ఎంసీ ఉత్తర మండలం అధికారులు అన్నివిధాల చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయా ప్రాంతాల్లో మందులు పిచికారీ చేయడం, పరిశుభ్రంగా ఉంచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించేందుకు, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం పట్ల అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. (స్వతంత్ర దర్యాప్తు: భారత్ సహా 62 దేశాల మద్దతు!) ముషీరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, యూపీహెచ్సీ సిబ్బంది సమన్వయంతో అనేక చర్యలు చేపడుతున్నారు. అయినా వైరస్ మాత్రం వ్యాపిస్తూనే ఉంది. శనివారం బాగ్‌లింగంపల్లిలోని ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్‌లో 34 సంవత్సరాల మహిళకు కరోనా సోకింది. ఆదివారం భోలక్‌పూర్ డివిజన్లో నివాసముండే గర్భిణీ (21)కి కరోనా సోకింది. శనివారం వెన్నుపూస నొప్పి రావడంతో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన నేపథ్యంలో వైద్యులు నమూనాను సేకరించి కరోనా పరీక్షలకు పంపడంతో ఆమెకు పాజిటివ్ తేలింది. దీంతో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె నివాసమున్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఆమె ఉంటున్న ఇంటిలో 18 మంది సభ్యులు ఉన్నారు. ఏఎంహెచ్ఓ డాక్టర్ హేమలత వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారందరికీ కరోనా లక్షణాలు లేవని తెలిపారు. ఇప్పటివరకు ముషీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 20 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10 మంది చికిత్స పొంది విజయవంతంగా కరోనాను జయించి ఇంటికి చేరుకున్నారు. -
ఉడీ దాడి మా పనే: లష్కరే
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని ఉడీలోని సైనిక స్థావరంపై దాడికి పాల్పడింది తామేనని లష్కరేతోయిబా ప్రకటించింది. గత నెలలో జరిగిన ఈ దాడిలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పంజాబ్‌లోని గుజ్రాన్వాలాలో.. ఉడీ దాడులకు పాల్పడిన ఉగ్రవాది సంస్మరణార్థం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు లష్కరే మాతృసంస్థ అయిన జమాతుద్ దవా (జేయూడీ) తెలిపింది. ఈమేరకు సామాజిక మాధ్యమంలో పోస్టర్లు విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. సంస్మరణ ప్రార్థనల అనంతరం జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ ప్రసంగిస్తారని అందులో ఉంది. లష్కరే తోయిబాకు చెందిన మిలిటెంట్ ముహమ్మద్ అనాస్.. ఉడీలో భారత సైనిక శిబిరంపై దాడి చేసినప్పుడు ‘అమరుడయ్యాడు’ అని కూడా పేర్కొన్నారు. -
ఐఎస్ఐ కనుసన్నల్లోనే లష్కరే పనితీరు
* పాక్ ఆర్మీతో కలిసి ఉగ్ర సంస్థల ఏర్పాటు * ఐసిస్ కమాండర్ హఫీజ్ సయీద్ ఖాన్ వెల్లడి * కశ్మీర్లో ఐసిస్ విస్తరణ.. ఖలీఫాపై త్వరలోనే శుభవార్త వాషింగ్టన్: భారత్‌లో విధ్వంసమే లక్ష్యంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాతోపాటు పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ ఆర్మీ పూర్తిగా సహకారం అందిస్తున్నాయని మరోసారి వెల్లడైంది. కశ్మీర్లో దాడులు, భారత్‌లో అనిశ్చితి సృష్టించేందుకే.. పాక్ ఆర్మీతో కలసి ఐఎస్ఐ ఈ ఉగ్ర సంస్థలను సృష్టించిందని ఐసిస్ ఆన్లైన్ మేగజైన్ ‘దబిక్’ తెలిపింది. పాకిస్తాన్, అఫ్గాస్తాన్‌ల ఐసిస్ బాధ్యతను చూస్తున్న హఫీజ్ సయీద్ ఖాన్ అనే ఉగ్రనేత ‘దబిక్’కు ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించారు. ‘పాకిస్తాన్లో దుష్టశక్తులు.. మరీ ముఖ్యంగా ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆర్మీ.. తమ వ్యక్తిగత అవసరాలకోసం ఏ విధంగా ఉగ్రసంస్థలను సృష్టించి కశ్మీర్లో విధ్వంసాలకు పాల్పడిందో మనకు తెలుసు’ అని అన్నారు. ‘అల్లాకోసం, ముస్లింలకోసం కాకుండా.. వారి వ్యక్తిగత ఆసక్తుల కోసం కశ్మీర్ యువతను రెచ్చగొట్టార’ని విమర్శించారు. ఐఎస్ఐ చెప్పినట్లు వింటున్నందుకే.. కశ్మీర్‌లోని ఏ ప్రాంతంపైనా లష్కరే తోయిబాకు ఇంకా పట్టుచిక్కలేదన్నారు. ‘అధీనంలో ఉన్న పాకిస్తాన్‌లోనే అల్లా చట్టాన్ని అమలుచేయలేని వారు.. కశ్మీర్లో ఏ విధంగా అల్లా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తార’ని ప్రశ్నించారు. తమను ఎవరు కాపాడతారా అని కశ్మీర్ ప్రజలు ఎదురుచూస్తుంటే.. పాకిస్తాన్ తన స్వలాభం కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే కశ్మీర్‌లోని వివిధ ఉగ్రసంస్థల కార్యకర్తలు ఐసిస్‌లో చేరుతున్నారని..దీనివల్ల లోయలో ఐసిస్ విస్తరణకు మంచి అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో ఖలీఫా రాజ్య స్థాపన గురించి ముస్లింలు త్వరలోనే ఓ శుభవార్త వింటారని సయీద్ తెలిపారు. అఫ్గానిస్తాన్ తాలిబాన్ చీఫ్ ముల్లా అఖ్తర్ మన్సూర్, అతని సహచరులకు కూడా ఐఎస్ఐతో సత్సంబంధాలున్నాయని సయీద్ తెలిపారు. ఇస్లామాబాద్, పెషావర్, క్వెట్టా వంటి ప్రాంతాల్లో అఫ్గాన్ తాలిబాన్ నేతలు స్వేచ్ఛగా తిరుగుతారని.. వారికి అక్కడ నివాసాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. మన్సూర్ సలహా మండలిలోనూ ఐఎస్ఐ అధికారులు సభ్యులుగా ఉన్నారని సయీద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం తాలిబాన్ నాయకుడు హమీద్ గుల్ చనిపోయినపుడే ఈ విషయం బయటపడిందన్నారు. ఐఎస్ఐ.. తను సృష్టించిన ఉగ్రవాద సంస్థలను సమన్వయం చేసేందుకు రిటైర్డ్ జనరల్ అయిన హమీద్‌ను నియమించిందన్నారు. 2014 అక్టోబర్‌లో తాలిబాన్ సంస్థకు కు గుడ్‌బై చెప్పిన హఫీజ్ సయీద్ ఖాన్ మరో ఐదుగురు కమాండర్లతో కలిసి ఐసిస్‌లో చేరారు. -
లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదుల కోసం తీవ్రగాలింపు
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ముజఫరాబాద్ జిల్లాలో మతకల్లోలాల ఘటన తర్వాత కొత్త సభ్యుల నియామకం కోసం ప్రయత్నించిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. గత సెప్టెంబర్‌లో జరిగిన ముజఫర్‌నగర్ మతకల్లోలాల ఘటనలో ఒక వర్గానికి చెందిన సుమారు 60 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ ఇచ్చిన సమాచారం మేరకు గత డిసెంబర్లో లష్కరే తోయిబా కార్యకలాపాలపై కేసు నమోదు చేశారు. అనంతరం హర్యానా రాష్ట్రం మేవాట్ ప్రాంతంలో ఎండీ షాహిద్, ఎండీ రషీద్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. వారిని విచారించగా చాలా కొత్తవిషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేక పోలీస్ కమిషనర్ (ప్రత్యేక సెల్) ఎస్.ఎన్.శ్రీవాత్సవ కథనం మేరకు వివరాలు.. రషీద్, మరో సహచరుడితో దియోబంద్ వెళ్లి ముజఫర్‌నగర్‌లో నివసించే లియాఖత్ (58) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కలిశాడు. లియాఖత్ వారిద్దరిని ముజఫర్‌నగర్ జిల్లాలోని ఠాణాూ బహవన్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారు ముజఫర్‌నగర్‌కు చెందిన జమీర్, మరో ఇద్దరు వ్యక్తులతో భేటీ అయ్యారు. లియాఖత్, జమీర్ ముజఫర్వాసులే అయినా మతఘర్షణల్లో వారికి ఎటువంటి నష్టం జరగలేదు. స్థానికంగా సభలు నిర్వహించేందుకు కావాల్సిన సొమ్మును కిడ్నాప్‌లు చేయడం ద్వారా సంపాదించాలని పథకం పన్నినట్లు జమీర్‌కు వచ్చిన వారు చెప్పారు. అయితే జమీర్ వారితో కలిసి పనిచేయడానికి ముందుకు రాలేదు. అనంతరం రషీద్, మరో వ్యక్తి పల్వాల్ మీదుగా మేవాట్ వెళ్లిపోయారు. ఈ దశలో పోలీసులు లియాఖత్, జమీర్‌లను అరెస్టు చేసి వారినుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ప్రస్తుతం అబ్దుల్ సుభాన్,అఫ్తాబ్ అన్సారీ, ఆమిర్ రజాఖాన్, జావేద్ బలాచీ తదితరుల గురించి గాలిస్తున్నట్లు శ్రీవాత్సవ తెలిపారు.