
తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.
జమ్మూకశ్మీర్ దుర్ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘పహెల్ గామ్ లో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యారు. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Shocked to hear about the terror attack in Pahalgam, condemn this cowardly act of violence. My thoughts are with the victims and their families. Praying for the speedy recovery of those injured.#Pahalgam
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025
టూరిస్టులపై కాల్పులు
మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా పహెల్ గామ్‌లో బైసరీన్ వ్యాలీని వీక్షించేందుకు వచ్చిన టూరిస్టులను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఇండియన్ ఆర్మీ దుస్తులు ధరించిన ఏడుగురు ఉగ్రవాదులు ఓపెన్ ఏరియాలో టూరిస్టులపై పాయింట్ బ్లాంక్‌లో గన్‌పెట్టి కాల్పులు జరిపారు. ఓపెన్ ఏరియా కావడంతో టూరిస్టులు ఎటూ పారిపోలేకపోయారు. ముష్కరుల తూటాలకు బలయ్యారు. ముష్కరుల జరిపిన కాల్పుల్లో 27మంది టూరిస్టులు మరణించారు. పలువురు టూరిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.