Bus attack
-
రియాసి ఉగ్రవాది ఊహాచిత్రం విడుదల.. పట్టిస్తే 20లక్షల రివార్డ్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపిన ఉగ్రవాది స్కెచ్(ఫొటో)ను పోలీసులు విడుదల చేశారు. స్కెచ్ ఆధారంగా ఉగ్రవాది సమాచారం అందించిన వారికి రూ. 20 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. రియాసి ఎస్పీ- 9205571332, రియాసి ఏఎస్పీ- 9419113159, ఎస్హెచ్ఓ పౌని- 7051003214 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని పోలీసులు కోరారు.రాస్నో-పౌని-త్రెయాత్ ప్రాంతాల్లో 11 భద్రతా బలగాల బృందాలతో ఉగ్రవాదులు వేట కొనసాగుతోంది. ఈ ఉగ్రదాడి వెనకాల లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి ఎన్ఐఏ ఫొరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది.ఆదివారం 53 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది యాత్రికులు మృతి చెందగా.. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. యాత్రికుల బస్సు .. శివ్ కోరి నుంచి కాత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి తిరిగి వస్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడులతో విరుచుకుపడ్డారు. బస్సులో ఉత్తరపదేశ్, రాజస్తాన్, ఢిల్లీకి చెందిన యాత్రికులు ఉన్నారు. కాల్పులు జరగటంతో యాత్రికుల బస్సు లోయలోకి పడిపోయింది. -
కశ్మీర్లో బస్సు దాడి మా పనే: టీఆర్ఎఫ్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రియాస్ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. అంతేగాక భవిష్యత్తులో పర్యాటకులు లేదా స్థానికేతరులపై ఇలాంటి దాడులు మరిన్ని జరగవచ్చని హెచ్చరించింది. రియాస్ దాడి కేవలం ప్రారంభం మాత్రమేనని తెలిపింది. ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో పది మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. రియాస్‌లోని శివ్ఖోరి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని కాత్రాలోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్తునన భక్తుల బస్సుపై ఈ దాడి జరిగింది. దీంతో అదుపుతప్పిన బస్సు లోయలో పడిపోయింది. బస్సుపై కాల్పులు జరిపిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.సంఘటన ప్రాంతంలో భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో దాడి జరిగిన ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి, భారీ వృక్షాలతో ఉండటంతో ఉగ్రవాదుల్ని పట్టుకునేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఐఏ ఈ దాడిపై దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది.కాగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటతో 2023 జనవరి 6న ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దానిని ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ 2019లో ఉనికిలోకి వచ్చింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆన్లైన్ సంస్థగా ఇది పుట్టుకొచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేస్తుంది. -
చైనాలో ఏనుగు రెచ్చిపోయింది
-
బస్సును అలవోకగా తోస్తూ ఏనుగు హల్చల్
బీజింగ్ : చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఓ ఏనుగు రెచ్చిపోయింది. తన ప్రశాంతతకు భంగం కలిగించారనే కోపంతో వాహనాలపై దాడికి దిగింది. తొలుత ఓ బస్సును టార్గెట్ చేసింది. దాన్ని అయిదుదారు అడుగులు వెనక్కి తోసేసింది. బస్సు అద్దాలను పగలగొట్టింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సులో ప్రయాణీకులు ఎవరూలేకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న డ్రైవర్ ఏనుగును చూసి పారిపోయాడు. కొద్దిసేపు బస్సుకు తన వీపును రుద్దుకున్న ఏనుగు అంతటితో ఆగని ఏనుగుఅదే దారిలో వున్న మిగితా వాహనాలను టార్గెట్ చేసింది. ఓ మినీ ట్రాన్స్పోర్ట్ వ్యానప్ పై దాడికి దిగింది. దాన్ని అమాంతం పడేసేందుకు గట్టిగా ప్రయత్నించింది. కుదరకపోవడంతో ఇక చాల్లే అనుకుని మెల్లిగా అడవిదారి పట్టింది. -
కారాచీ కాల్పుల ఘటన: 135 మంది అరెస్టు
కరాచీలో బస్సులో ప్రయాణిస్తోన్న 46 మందిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించి 135 మందిని పాకిస్థాన్ రేంజర్లు, పోలీసుల సంయుక్త బృందం అరెస్టుచేసింది. కాల్పుల ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించిన దరిమిలా గురువారం రాత్రి నుంచి రేజర్లు, పోలీసులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయంవరకు అరెస్టుల పరంపర కొనసాగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ప్రముఖ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు కూడా ఉన్నట్లు తెలిసింది. అరెస్టు చేసినవారందరినీ రహస్యప్రదేశంలో ఇంటరాగేషన్ చేస్తోన్నట్లు సమాచారం. బుధవారం ఉదయం కరాచీ శివారు నుంచి కూలీలు, చిరు వ్యాపారులతో బయలుదేరిన బస్సును అటకాయించిన సాయుధ ఉగ్రవాదులు 46 మందిని కాల్చిచంపిన సంగతి తెలిసిందే. -
చెన్నైకి ఆర్టీసీ సర్వీసుల నిలిపివేత
శేషాచలం ఎన్కౌంటర్ నేపథ్యంలో నిర్ణయం భవానీపురం : నగరం నుంచి చెన్నై వెళ్లే బస్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నాగరాజు చెప్పారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఎన్కౌంటర్లో చనిపోయిన నేపథ్యంలో మంగళవారం తమిళనాడులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సులపై దాడి జరిపారు. ఈ కారణంగా రాత్రిపూట బయలుదేరే ఐదు సర్వీసులను నిలిపివేసినట్లు వివరించారు. మంగళవారం ఉదయం బయలుదేరిన ఆరు సర్వీసులు బాగానే నడిచాయని, సాయంత్రం దాడులు జరిగినట్టు తెలిపారు. బుధవారం అక్కడి పరిస్థితిని బట్టి బస్సులు నడపాలా లేదా అనే విషయమై ఒక నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.