కరాచీలో బస్సులో ప్రయాణిస్తోన్న 46 మందిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించి 135 మందిని పాకిస్థాన్ రేంజర్లు, పోలీసుల సంయుక్త బృందం అరెస్టుచేసింది.
కరాచీలో బస్సులో ప్రయాణిస్తోన్న 46 మందిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనకు సంబంధించి 135 మందిని పాకిస్థాన్ రేంజర్లు, పోలీసుల సంయుక్త బృందం అరెస్టుచేసింది. కాల్పుల ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించిన దరిమిలా గురువారం రాత్రి నుంచి రేజర్లు, పోలీసులు సోదాలు నిర్వహించారు.
శుక్రవారం ఉదయంవరకు అరెస్టుల పరంపర కొనసాగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ప్రముఖ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు కూడా ఉన్నట్లు తెలిసింది. అరెస్టు చేసినవారందరినీ రహస్యప్రదేశంలో ఇంటరాగేషన్ చేస్తోన్నట్లు సమాచారం. బుధవారం ఉదయం కరాచీ శివారు నుంచి కూలీలు, చిరు వ్యాపారులతో బయలుదేరిన బస్సును అటకాయించిన సాయుధ ఉగ్రవాదులు 46 మందిని కాల్చిచంపిన సంగతి తెలిసిందే.