చెన్నైకి ఆర్టీసీ సర్వీసుల నిలిపివేత | Dropping the RTC services in Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైకి ఆర్టీసీ సర్వీసుల నిలిపివేత

Published Wed, Apr 8 2015 4:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

చెన్నైకి ఆర్టీసీ సర్వీసుల నిలిపివేత

చెన్నైకి ఆర్టీసీ సర్వీసుల నిలిపివేత

శేషాచలం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో నిర్ణయం
 
భవానీపురం : నగరం నుంచి చెన్నై వెళ్లే బస్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నాగరాజు చెప్పారు. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నేపథ్యంలో మంగళవారం తమిళనాడులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సులపై దాడి జరిపారు. ఈ కారణంగా రాత్రిపూట బయలుదేరే ఐదు సర్వీసులను నిలిపివేసినట్లు వివరించారు. మంగళవారం ఉదయం బయలుదేరిన ఆరు సర్వీసులు బాగానే నడిచాయని, సాయంత్రం దాడులు జరిగినట్టు తెలిపారు. బుధవారం అక్కడి పరిస్థితిని బట్టి బస్సులు నడపాలా లేదా అనే విషయమై ఒక  నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement