ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో గాజా పూర్తిగా ధ్వంసమైంది. ఇక్కడి ప్రజలకు తిండి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు, పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి.
తాజాగా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 15 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడింది. నెతన్యాహు యూఎస్ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణపై చర్చ కూడా జరగనుంది.
మరోవైపు గాజాలో పోలియో వైరస్ మరింతగా విస్తరిస్తోంది. గాజాలోని ప్రజలకు పారిశుద్ధ్య సేవలు కూడా అందడం లేదు. సెంట్రల్ గాజాలోని బురెజ్ శరణార్థుల శిబిరంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది మృతిచెందారు. గాజా నగరాన్ని ఖాళీ చేసి దక్షిణం వైపు తరలివెళ్లాలని పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ సైన్యం గతంలోనే ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment