International News
-
భారతీయ విద్యార్ధిని రంజనీ వీసా రద్దు కారణం ఇదే..!
-
రష్యా దాడులకు ఉక్రెయిన్ ప్రతీకారం
-
ట్రంప్ తో ఖనిజాల డీల్ కు సిద్ధమే: జెలెన్స్కీ
-
అమెరికా టూర్లో మోదీకి ట్రంప్ స్పెషల్ గిఫ్ట్
-
అమెరికాలో అక్రమ వలసలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
-
మోదీ ఫ్రాన్స్ టూర్: PM Modi
-
ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయ విద్యార్ధులకు కష్టాలు
-
గ్రీన్ కార్డ్ కి సిటిజెన్ షిప్ కి తేడా ఏంటి..?
-
ట్రంప్ అనుకున్నది ఏది జరగదు..
-
వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం
-
జన్మతః పౌరసత్వంపై ట్రంప్ వేటు.. ఆర్డర్ జారీ
-
రెండోసారి అధ్యక్షడుగా ట్రంప్ పాలనపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ
-
47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ట్రంప్
-
డొనాల్డ్ ట్రంప్ దూకుడు..తొలి రోజే సంచలన..!
-
భారతీయులను తొక్కేస్తే ట్రంప్ కొంప కొల్లేరే..!
-
సౌత్ కొరియా అధ్యక్షుడు అరెస్ట్
-
అమెరికా కార్చిచ్చు పెద్ద కుట్ర..?
-
Sankranti 2025 : జపాన్‌లో తెలుగువారి సంక్రాంతి సంబరాలు
-
హాలీవుడ్ హిల్స్ పైనా వేగంగా వ్యాపించిన అగ్ని కీలలు
-
లాస్ ఏంజిల్స్ ను చుట్టుముట్టిన భయంకర కార్చిచ్చు
-
California: కూలిన విమానం
-
చైనా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు
-
చిన్నారులను కూడా వదలని కర్కశత్వం
-
భారతీయుల ఆశలపై ట్రంప్ పిడుగు
-
రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్
-
బాంబు షెల్టర్లకు గిరాకీ వరల్డ్ వార్-3కి సంకేతమా?
-
ట్రంప్‌కు బేడీలు
-
బైడెన్ గుడ్ న్యూస్.. ట్రంప్ బ్యాడ్ న్యూస్
-
ట్రంప్‌నకు హష్ మనీ కేసులో ఎదురుదెబ్బ
-
దక్షిణ కొరియాలో రోజురోజుకూ ముదురుతున్న సంక్షోభం
-
దక్షిణ కొరియాలో ట్విస్ట్.. అధ్యక్ష ఆఫీసులో పోలీసుల సోదాలు
సియోల్: దక్షిణ కొరియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి సంబంధించిన విషయాలను సేకరించేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టినట్టు కొరియన్ టైమ్స్ తెలిపింది.వివరాల ప్రకారం.. ఇటీవల దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అనంతరం, దేశవ్యాప్తంగా రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్టు యూన్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు యూన్‌పై దక్షిణ కొరియా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే అధ్యక్ష కార్యాలయంలో.. నేడు సియోల్ మెట్రోపాలిటన్ పోలీసులు, నేషనల్ అసెంబ్లీ పోలీస్ గార్డ్స్ సోదాలు చేశారు. అయితే, అధ్యక్ష కార్యాలయంపై పోలీసులు సోదాలు చేసిన సమయంలో యూన్ ఆఫీసులో లేరని కొరియన్ టైమ్స్ వెల్లడించింది.ఇక, అంతకుముందు.. అంతకుముందు డిసెంబర్ 9న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. ఆయనపై దర్యాప్తు ప్రారంభించినందుకు గానూ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు.. ఎమర్జెన్సీ ప్రకటనలో మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ పాత్ర ఉందనే ఆనుమానంతో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఐసిస్ ఉగ్రభూతం మళ్లీ విజృంభిస్తుందా?ఇక, మార్షల్ లా ప్రకటన నేపథ్యంలో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, కిమ్ యోంగ్ హ్యూన్లను పదవుల నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే హ్యూన్‌ను పదవి నుంచి తప్పిస్తున్నట్లు దేశాధ్యక్షుడే ప్రకటించారు. ఆయన స్థానంలో చోయ్ బ్యూంగ్ హ్యూక్‌ను నియమించారు. South Korean police raided President Yoon Suk Yeol's office and police headquarters on Wednesday as part of an investigation into the brief imposition of martial law, the Yonhap news agency reported.Raids were also carried out at the offices of the Seoul Metropolitan Police. pic.twitter.com/G5yLytJWJy— VIVERO del bosque (@viverodelbosque) December 11, 2024 -
కేపిటల్ భవనంపై దాడిలో పాల్గొన్న వారికి క్షమాభిక్ష: Donald Trump
-
పెద్ద ప్లానే..! ట్రంప్ సనాతన మంత్రం
-
సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు
-
సిరియాలో డేంజర్ బెల్స్..
-
కుమారుడు హంటర్‌కు దేశాధ్యక్షుడి హోదాలో క్షమాభిక్ష పెట్టిన జో బైడెన్. విమర్శించిన డొనాల్డ్ ట్రంప్
-
అమెరికాలో యూనివర్సిటీ విద్యార్థులకు ట్రంప్ ఎఫెక్ట్
-
ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం
-
కుప్పకూలిన విమానం..
-
హష్ మనీ కేసులో ట్రంప్ కు భారీ ఊరట
-
ప్రపంచాన్ని వల్లకాడు చేస్తారా..!
-
పశ్చిమ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్
-
మోదీకి డొమినికా అత్యున్నత పురస్కారం
సాంటో డొమింగో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్ దేశం కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ఆయనకు అందించింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గుయానా చేరుకున్నారు. అక్కడ డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఆయనన్ని కలిశారు. ఈ సందర్భంగా.. ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో మోదీని డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ సత్కరించారు. కరోనా టైంలో తమ దేశానికి మోదీ నేతృత్వంలో భారత్ అందించిన సహకారం.. అందులో ఆయన పాత్రను బర్టన్ ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే.. Gratitude to President Sylvanie Burton of Dominica for conferring the 'Dominica Award of Honour' upon me. This honour is dedicated to my sisters and brothers of India. It is also indicative of the unbreakable bond between our nations. pic.twitter.com/Ro27fpSyr3— Narendra Modi (@narendramodi) November 20, 2024ఈ అవార్డును భారతీయ సోదర సోదరీమణులకు అంకితం ఇస్తున్నానని ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు జార్జ్‌టౌన్‌లో డొమెనికా ప్రధాని రూజ్వె స్కెర్రిట్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. 1981 నుంచి ఈ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు.. 2019లో ఇండి-క్యారీకామ్లో భాగంగా మోదీ-స్కెర్రిట్ న్యూయార్క్‌లోనూ భేటీయ్యారు. కరోనా టైంలో ఈ దేశానికి భారత్ వ్యాక్సిన్ సహకారం అందించింది కూడా. -
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి GSAT-20
-
మహిళల హక్కులను కించపరిచిన ట్రంప్
-
ట్రంప్, ఇలాన్ మస్క్ తో కలిసి బర్గర్ తిన్న కెన్నెడీ జూనియర్
-
భారతీయులకు దెబ్బ మీద దెబ్బ ట్రంప్ సంచలనం
-
న్యూజిలాండ్ - పార్లమెంట్ దద్దరిల్లింది
-
అబార్షన్ మాత్రలను ఎగబడి కొంటున్నారు.. ఎందుకంటే?
-
అటు అమెరికా..ఇటు కెనడా భారతీయులంటే ఎందుకంత..?
-
భారతీయులకు భారీ షాక్..?
-
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి తీవ్రంగా ఖండించిన డొనాల్డ్ ట్రప్
-
అధ్యక్షుడిగా పనికిరారు.. ట్రంప్‌ను ఓడించండి..
-
కెనడాతో కటీఫ్ .. భారత్ కీలక నిర్ణయం
-
మైక్రోఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు 'వైద్య' నోబెల్
-
ఉగ్రజాబితా నుంచి తాలిబాన్లను తొలగించిన రష్యా
-
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు. ఐరాస సదస్సులో మోదీ వ్యాఖ్యలు
-
ఫ్లోరిడాలో కాల్పుల కలకలం .. ట్రంప్ సురక్షితం
-
Israel: నెతన్యాహు నెగ్గుకొచ్చేనా?
సాక్షి, నేషనల్ డెస్క్: ఇజ్రాయెలీల ఆక్రోశం, ఆక్రందనలు క్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారాయి. ఇజ్రాయెల్ ప్రధాని పీఠానికి ఎసరు పెట్టేలా కని్పస్తున్నాయి. హమాస్ చెరనుంచి ఇజ్రాయెలీ బందీలను విడిపించడంలో నెతన్యాహు సర్కారు వైఫల్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. తాజాగా ఆగస్టు 31న ఆరుగురు బందీలను గాజాలో ఉగ్రవాదులు పాశవికంగా హతమార్చడంతో ఇజ్రాయెలీలు భగ్గుమంటున్నారు. సోమవారం లక్షలాదిగా వీధుల్లోకి వచ్చారు. దేశాన్ని స్తంభింపజేశారు. నెతన్యాహూ వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కోర్టు జోక్యం చేసుకుంటే గానీ వెనక్కు తగ్గలేదు. ఈ నిరసనలు చివరికి నెతన్యాహూ రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పెడతాయా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి తెగబడ్డ హమాస్ 1,200 మందికి పైగా పొట్టన పెట్టుకోవడమే గాక 250 మందిని బందీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. ఖైదీల మారి్పడి కింద 100 మందిని విడిపించారు. 35 మందికి పైగా చనిపోయినట్టు భావిస్తుండగా 100 మందికి పైగా ఇంకా హమాస్ చెరలోనే మగ్గుతున్నారు. వాళ్లను విడిపించేందుకు ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన తాజా ప్రయత్నం వికటించడం, ఆరుగురు బందీలను హమాస్ చంపేయడం తెలిసిందే. దీనిపై ఇజ్రాయేలీల్లో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. బందీలను విడిపించడంలోనే గాక గాజాలో కాల్పుల విరమణలో కూడా ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ఘోరంగా విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇజ్రాయెల్‌లో అతిపెద్ద కార్మిక సంఘం హిస్ట్రాడుట్ ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపు సోమవారం దేశాన్ని స్తంభింపజేసింది. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యాక దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఇదే అతి పెద్దది. దాని దెబ్బకు బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. విశ్వవిద్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఓడరేవులనూ మూసివేశారు. నిరసనలు సాయంత్రం దాకా కొనసాగాయి. నిరసనకారులు నెతన్యాహూ నివాసాన్ని కూడా ముట్టించారు. అమెరికా ఎంబసీ ముందు బైఠాయించారు. అయలాన్ హైవేను దిగ్బంధించారు. దాంతో వారిపైకి పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించాల్సి వచ్చింది. విధ్వంసానికి, అధికారులపై దాడికి పాల్పడ్డారంటూ టెల్ అవీవ్‌లో 29 మందిని అరెస్టు చేశారు. చివరికి లేబర్ కోర్టు ఆదేశాలతో సమ్మె ఆగింది. ఇజ్రాయెలీల నిరసనల వెల్లువను తట్టుకుని నిలవడం నెతన్యాహూకు కష్టమేనంటున్నారు.పెరుగుతున్న వ్యతిరేకత.. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలన్న నెతన్యా హు వైఖరిపై విమర్శలు నానాటికీ పెరుగుతున్నా యి. ఇజ్రాయెల్ విపక్ష నేత యైర్ లాపిడ్ కూడా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. యుద్ధ విషయమై నెతన్యాహు తీసుకున్న, తీసుకుంటున్న పలు నిర్ణయాలపై సొంత కేబినెట్లోనే వ్యతిరేకత ప్రబలుతోంది. బందీలను విడిపించే ఒప్పందం కుదు ర్చుకోవడం కంటే కారిడార్ నియంత్రణకే ప్రాధాన్యమిస్తుండటం సరికాదని రక్షణ మంత్రి యెవ్ గాలెంట్ బాహాటంగానే విమర్శించారు. దీన్ని ‘నైతికంగా అవమానం’గా అభివరి్ణంచారు. బందీల ఒ ప్పందంపై గానీ, కాల్పుల విరమణపై గానీ నెత న్యాహుకు ఎలాంటి ఆసక్తి లేదని ఇజ్రాయెల్ మాజీ రాయబారి, ప్రభుత్వ సలహాదారు అలోన్ పింకస్ ఆరోపించారు. ‘‘ఆశ్చర్యంగా అని్పంచినా ఇదే నిజం. ఒప్పందానికి నెతన్యాహూ విముఖత వల్లే బందీలు బలవుతున్నారు’’ అని మండిపడ్డారు.తగ్గుతున్న మద్దతు..మరోవైపు నెతన్యాహుకు మద్దతు కూడా నానాటికీ తగ్గుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదని మెజారిటీ ఇజ్రాయెలీలు భావిస్తున్నట్లు గత శుక్రవారం ఛానెల్ 12 చేసిన సర్వేలో తేలింది. ఆయన మళ్లీ పోటీ చేయొద్దని 69 శాతం పేర్కొనగా కేవలం 22 శాతం మంది మాత్రమే మళ్లీ ఎన్నికల బరిలో దిగాలని కోరుతున్నారు.నిత్యం నిరసనలే..ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత అతివాద సంకీర్ణ సర్కారుకు నెతన్యాహూ నేతృత్వం వహిస్తున్నారు. 2023 జనవరిలో ఆయన గద్దెనెక్కిన నాటినుంచీ దేశంలో తరచూ నిరసనలూ, ఆందోళనలూ కొనసాగుతూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు అధికారాలకు భారీగా కత్తెర వేసేందుకు ఉద్దేశించిన న్యాయ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏడాది కింద జనం భారీగా రోడ్డెక్కారు. చివరికి ఆ ప్రతిపాదనలపై ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇక హమాస్ ఆటవిక దాడి అనంతరం నెతన్యాహూ ప్రభుత్వ స్పందనను నిరసిస్తూ గత అక్టోబర్ నుంచి రాజధాని మొదలుకుని దేశంలో ఏదో ఒక మూల నిత్యం ఆందోళనలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. హమాస్‌తో ఒప్పందానికి అంగీకరిస్తే ప్రభుత్వాన్ని పడగొడతామని కూడా కొన్ని సంకీర్ణ పక్షాలు బెదిరిస్తున్నాయి. దీనికి తోడు నెతన్యాహూపై అవినీతి, మోసం, నమ్మకద్రోహం తదితర అభియోగాలపై విచారణలు కోర్టుల్లో పలు దశల్లో ఉన్నాయి.ఎన్నికలకు మరో రెండేళ్లు..ఇజ్రాయెల్‌లో ఎన్నికలకు మరో రెండేళ్ల గడువుంది. ఆలోపు నెతన్యాహూపై విపక్షం అవిశ్వాసం పెట్టాలన్నా కనీసం ఐదుగురు పాలక సంకీర్ణ సభ్యుల మద్దతు అవసరం.నెతన్యాహు.. తగ్గేదేలే..నెతన్యాహు మాత్రం వెనక్కు తగ్గేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే తన లక్ష్యమని ఆయన కరాఖండిగా చెబుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలన్న నిరసనకారుల డిమాండ్లను, మంత్రివర్గ సహచరుల విజ్ఞప్తులను నెతన్యాహూ తోసిపుచ్చారు. ‘‘ఆరుగురు బందీలను ఉరి తీశారు. అయినా కసి తీరక తల వెనుక భాగంలో కాల్చారు. వాళ్లతో రాయబారాలా?’’ అని ప్రధాని ప్రశి్నస్తున్నారు. కొన్ని మినహాయింపులతోనైనా కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనాలన్న సూచనకు ససేమిరా అంటున్నారు.దీనిపై ఇటీవల మరింత కఠిన వైఖరి తీసుకున్నారు. గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగాలన్న హమాస్ డిమాండ్‌కు ఒప్పుకునేదే లేదంటున్నారు. బందీలను కాపాడలేకపోయినందుకు క్షమాపణ చెప్పిన నెతన్యాహూ, యుద్ధాన్ని ముగించేందుకు అంతర్జాతీయ సమాజమే హమాస్‌పై మరింత ఒత్తిడి తేవాలంటూ కుండబద్దలు కొట్టారు. బందీల విడుదలకు తాను తగినంత కృషి చేయడం లేదన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ‘‘ఈ విషయంలో నాకంటే నిబద్ధత కలిగిన వారెవరూ లేరు. దీనిపై నాకెవరూ ఉపన్యాసం ఇవ్వనక్కరలేదు’’ అన్నారు! -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా.. జపాన్ మహిళ!
జపాన్‌కు చెందిన 116 ఏళ్ల టొమికో ఇటుకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ఆమె గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నట్లు అమెరికాకు చెందిన జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ బుధవారం ప్రకటించింది. ఇంతకీ ఆమె పుట్టిందెప్పుడో తెలుసా? రైట్ బ్రదర్స్ ఐరోపా, అమెరికాల్లో తొలిసారిగా విమానాలను ప్రారంభించిన 1908లో. అదే ఏడాది ఈఫిల్ టవర్ నుంచి తొలి సుదూర రేడియో సందేశం పంపించారు. ఇటుకా జపాన్‌లోని నగరమైన అషియా నివాసి.ఆమె 70వ ఏట జపాన్‌లోని 3,067 మీటర్ల ఎత్తయిన ఒంటాకే పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. అది కూడా బూట్లు ధరించకుండా స్నీకర్స్‌తో ఎక్కి గైడ్‌నే ఆశ్చర్యపరిచారు. 100 ఏళ్ల వయసులో ఆషియా మందిరంలోని అతి పొడవైన రాతి మెట్లెక్కారు. ఇప్పటిదాకా అత్యంత వృద్ధురాలిగా ఉన్న స్పెయిన్‌కు చెందిన మరియా బ్రాన్యాస్ మొరెరా (117) మంగళవారం కన్నుమూయడంతో ఇటుకాకు రికార్డు దక్కింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఫ్రెంచ్ మహిళ జీన్ లూయిస్ కాల్మెంట్. ఆమె 122 ఏళ్ల 164 రోజులు జీవించి 1997లో మరణించారు. -
ఏకైక చాయిస్ హారిస్..
షికాగో: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఫక్తు షోమ్యాన్గా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభివర్ణించారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు పూజ్యమన్నారు. బుధవారం డెమొక్రాట్ల జాతీయ కన్వెన్షన్‌లో ఆయన ప్రసంగించారు. ‘‘మతం, జాతి, ఒంటి రంగు తదితరాల ఆధారంగా దేశాన్ని విడదీయడం, అందరినీ కించపరచడం, ఎదుటి వారిపై నిందలేయడమే ట్రంప్ నైజం. కుట్రలు, ప్రతీకారాలు, నిత్యం గందరగోళ పరిస్థితులను సృష్టించడం ఆయన స్వభావం. ఎంతసేపూ ‘నేను, నేను, నేను’ అంటూ తన గురించే చెప్పుకునే అత్యంత స్వార్థపరుడు’’ అంటూ దుయ్యబట్టారు. డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ను నిత్యం ఇతరుల సంక్షేమం గురించే ఆలోచించే జన నేతగా క్లింటన్ అభివర్ణించారు. ‘‘దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, అపార అనుభవమున్న హారిసే ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏకైక చాయిస్. అది సుస్పష్టం’’ అన్నారు. సమర్థ పాలకురాలిగా దేశ ప్రజలందరినీ ఆమె మెప్పిస్తారని జోస్యం చెప్పారు.ప్రెసిడెంట్ ఆఫ్ జాయ్..హారిస్‌ను ‘ప్రెసిడెంట్ ఆఫ్ జాయ్’గా బిల్ క్లింటన్ అభివర్ణించారు. ‘‘హారిస్ విద్యార్థి దశలో మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైమర్‌గా చాలాకాలం పని చేశారు. ‘మీకెలా సాయపడగలను?’ అంటూ ప్రతి కస్టమర్నూ చక్కని చిరునవ్వుతో పలకరించేవారు. ఇప్పుడు అత్యున్నత అధికార హోదాలో కూడా ‘మీకెలా సాయపడగలను?’ అని అదే చిరునవ్వుతో ప్రజలందరినీ అడుగుతున్నారు. హారిస్ ప్రెసిడెంట్‌గా వైట్‌హౌస్‌లో అడుగు పెడితే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషిస్తా. ఎందుకంటే మెక్‌డొనాల్డ్స్‌లో అత్యధిక కాలం పని చేసిన ప్రెసిడెంట్‌గా నా రికార్డును బద్దలు కొడతారు’’ అంటూ ఛలోక్తులు విసిరారు. అనంతరం మాట్లాడిన సీనియర్ డెమొక్రటిక్ నేతలంతా ట్రంప్‌పై ముక్త కంఠంతో విమర్శలు గుప్పించారు. ‘‘అమెరికాకు ట్రంప్ పెను ముప్పు. ఆయన విధానాలన్నీ దేశాన్ని తిరోగమన బాట పట్టించేవే’’ అని ఆక్షేపించారు.అభ్యర్థిత్వం స్వీకరించిన వాల్జ్..హారిస్ రన్నింగ్మేట్గా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ (60) లాంఛనంగా స్వీకరించారు. తనది అతి సాధారణ నేపథ్యమని గుర్తు చేసుకున్నారు. తనకు ఇంతటి అవకాశం కల్పించినందుకు పారీ్టకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కమల చాలా గట్టి నాయకురాలు. అత్యంత అనుభవజ్ఞరాలు. అమెరికాకు నాయకత్వం వహించేందుకు అన్ని అర్హతలతో సన్నద్ధంగా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజలందరి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం రాజీ లేని పోరును ఆమె కొనసాగిస్తాన్నారు. ‘‘ట్రంప్ స్వయానా కుబేరుడు. కేవలం కుబేరులకు, అతివాద శక్తులకు ఉపయోగపడటమే ఆయన ఏకైక అజెండా’’ అంటూ దుయ్యబట్టారు.ట్రంప్ వయసుపై క్లింటన్ విసుర్లు..ట్రంప్ వయసుపై బిల్ క్లింటన్ చెణుకులు విసిరారు. 78 ఏళ్ల ట్రంప్ కంటే క్లింటన్ వయసులో కేవలం కొద్ది నెలలే చిన్నవాడు. దీన్ని ప్రస్తావిస్తూ, ‘‘రెండ్రోజుల క్రితమే నాకు 78 ఏళ్లు నిండాయి. నా కుటుంబంలో నాలుగు తరాల్లో నేనే అత్యంత పెద్ద వయసు్కణ్ని. ట్రంప్‌కన్నా వయసులో కాస్తంత చిన్నవాడినని గుర్తు చేసుకోవడమే నాకు ఏకైక ఊరట’’ అని క్లింటన్ చెప్పుకొచ్చారు. తద్వారా, వయసుపరంగా అమెరికాకు సారథ్యం వహించేందుకు ట్రంప్ అనర్హుడంటూ సంకేతాలిచ్చారు.హారిస్‌కు ఓప్రా మద్దతు..వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌కు ప్రఖ్యాత అమెరికా టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే మద్దతు పలికారు. షికాగోలో జరుగుతున్న డెమొక్రటిక్ జాతీయ సదస్సులో బుధవారం మూడో రోజు ఆమె ఉత్సాహపూరిత ప్రసంగం చేశారు. తద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. విన్ప్రే ఓ రాజకీయ వేదికపై మాట్లాడటం ఇదే తొలిసారి. ‘‘పుస్తకాలు ప్రమాదకరమని, రైఫిల్స్ సురక్షితమని, ప్రేమించడం తప్పుడు మార్గమనే విధ్వంసకర భావనలను మనపై రుద్దుతున్నారు. మనల్ని విభజించి, చివరికి జయించడం వారి లక్ష్యం’’అంటూ రిపబ్లికన్ల అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ పేర్లు ప్రస్తావించకుండానే వారిని తూర్పారబట్టారు.‘‘హారిస్‌ను, ఆమె రన్నింగ్‌మేట్ టిమ్ వాల్జ్‌ను గెలిపించాలి. అదే అమెరికా గెలుపు’’అని పిలుపునిచ్చారు. ‘‘ఇల్లు అగి్నకి ఆహుతైతే ఆ ఇంటి యజమాని జాతి, మతం చూడం. భాగస్వామి ఎవరని అడగం. ఎవరికి ఓటేశారో చూడం. వాళ్లను కాపాడేందుకే ప్రయత్నిస్తాం. ఆ ఇల్లు సంతానం లేని పిల్లిదైతే ఆ పిల్లిని కూడా రక్షిస్తాం’’అన్నారు. సంతానం లేని మహిళ అంటూ హారిస్‌ను వాన్స్ గేలి చేయడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లేని పిల్లుల్లాంటి మహిళల సమూహం అమెరికాను పాలిస్తోందంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. విన్ఫ్రేకూ పిల్లల్లేరు. ‘‘అభ్యర్థులకు విలువలు, వ్యక్తిత్వం ముఖ్యం. హారిస్, వాల్జ్ మనకు హుందాతనం, గౌరవం అందిస్తారని నా మనస్సాక్షి చెబుతోంది’’ అన్నారు.డెమొక్రాట్ల సదస్సులో వైదిక ప్రార్థనలు..షికాగో: డెమొక్రటిక్ జాతీయ కన్వెన్షన్ (డీఎన్సీ) మూడో రోజు బుధవారం వైదిక ప్రార్థనతో ప్రారంభమైంది. ఇలా జరగడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి. ‘‘మనది వసుదైక కుటుంబం. సత్యమే మనకు పునాది. అదే ఎల్లప్పుడూ గెలుస్తుంది. అసతో మా సద్గమయ.. తమసో మా జ్యోతిర్గమయ.. మృత్యోర్మా అమృతంగమయం (అసత్యం నుంచి సత్యానికి, అంధకారం నుండి వెలుగుకు, మరణం నుండి అమరత్వానికి సాగుదాం). ఓం శాంతిః శాంతిః శాంతిః’’అంటూ భారత సంతతికి చెందిన అమెరికా పూజారి రాకేశ్ భట్ ప్రార్థనలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం విషయానికి వచి్చనప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు.‘’మన మనసులు ఒకేలా ఆలోచించాలి. సమాజ శ్రేయస్సు కోసం మన హృదయాలు ఒక్కటవ్వాలి. అందుకు మనల్ని శక్తిమంతులను చేయాలని, తద్వారా మనం ఐక్యమై, దేశం గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా’’అని చెప్పారు. మేరీలాండ్‌లోని శ్రీ శివ విష్ణు ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న భట్ బెంగళూరుకు చెందిన వ్యక్తి. ఉడిపి అష్ట మఠానికి చెందిన పెజావర్ స్వామీజీ వద్ద ఋగ్వేదం, తంత్రసార (మాధ్వ) ఆగమాలలో శిక్షణ పొందిన మధ్వా పూజారి. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లి‹Ù, తుళు, సంస్కృతం అనర్గళంగా మాట్లాడతారు. సంస్కృతం, ఆంగ్లం, కన్నడ భాషల్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. ఉడిపి అష్ట మఠం, సేలంలోని బద్రీనాథ్, రాఘవేంద్ర స్వామి ఆలయాల్లో పని చేసి 2013లో మేరీలాండ్ శివవిష్ణు ఆలయంలో చేరారు. -
మేం ఆకలితో చస్తుంటే... మీకు మరో విమానమా?
ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి నైజీరియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అధ్యక్షుడు బోలా టినుబు కోసం కొత్త విమానాన్ని కొనడంపై నైజీరియన్లు మండిపడుతున్నారు. ఆకలి, పెరుగుతున్న జీవన వ్యయంపై దేశవ్యాప్తంగా అసంఖ్యాకులు రోడ్లపైకెక్కి నిరసన వ్యక్తం చేసిన రెండు వారాలకే ఈ పరిణామం జరిగింది. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. గతేడాది అధ్యక్షునిగా ఎన్నికైన టినుబు పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక వృద్ధికి ఊతమివ్వడానికి తప్పదంటూ ఇంధన సబ్సిడీలను తొలగించారు. దాంతో ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. దీంతో తన సొంత పరివారంతో సహా అధికారిక ప్రయాణాలను, ప్రతినిధులను తగ్గిస్తున్నట్లు జనవరిలో ప్రకటించారు. ఉన్నట్టుండి ఇప్పుడిలా ఎయిర్ బస్ ఎ330 విమానాన్ని కొనుగోలు చేశారు. ఆయన సొంత విమానాల శ్రేణిలో ఇది ఏడోది! కొత్త విమానంలోనే గత సోమవారం ఫ్రాన్స్ వెళ్లారు.డబ్బు ఆదా అవుతుందట!తాము ఆకలితో చస్తుంటే అధ్యక్షునికి కొత్త విమానం కావాల్సొచందా అంటూ నైజీరియన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మెరుగైన రేపటి కోసం ఈ రోజు కష్టాలు భరించక తప్పదంటూ అధ్యక్షుడు సుద్దులు చెప్పారు! ఇదేనా ఆ మెరుగైన రేపు?’’అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 150 నైజీరియన్ బిలియన్లు పెట్టి మరీ విమానం కొనుక్కోవడం సగటు నైజీరియన్ల పట్ల అధ్యక్షునికి ఏమాత్రం బాధ్యత లేదనేందుకు రుజువంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు మాత్రం విమాన కొనుగోలును సమర్థించుకుంటున్నారు. పాత విమానాలకు కాలం చెల్లడంతో వాటి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. ఆ లెక్కన కొత్త విమానం వల్ల డబ్బు ఆదాయే అవుతుంది’’అంటూ అధ్యక్షుని మీడియా సహాయకుడు సూత్రీకరించడం విశేషం! ప్రస్తుత విమానాలు సురక్షితం కాదంటూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుని కోసం రెండు కొత్త విమానాల కొనుగోలుకు చట్టసభ సభ్యులు గతంలోనే సిఫార్సు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిరసనల ధాటికి రాజీనామా చేసి.. బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు చేరిన ప్రధాని షేక్ హసీనా..
-
ఇరాన్ Vs ఇజ్రాయెల్.. యుద్ధం షురూ
-
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు
-
న్యూయార్క్ లో కాల్పులు
-
ట్రంప్ పై కాల్పులు.. జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు
-
డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు..
-
డోనాల్డ్ ట్రంప్ కు అమెరికన్ల నుంచి ఊహించని షాక్
-
శృంగార తార కేసు..ట్రంప్ కు జైలు శిక్ష
-
నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్
ఒట్టావా: భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అనుమానితులను శుక్రవారం కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు భారతీయులే కావడం గమనార్హం. కరణ్ బ్రార్(22), కమల్ ప్రీత్ సింగ్(22), కరణ్ ప్రీత్ సింగ్(28)లను అరెస్ట్ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ముగ్గురు అనుమానితులు ఎడ్మోంటన్‌లోని అల్బెర్టాలో ఉంటున్నారని.. వారికి అక్కడే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరు 3 నుంచి 5 ఏళ్ల నుంచి కెనడాలో ఉంటున్నారని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొసాగుతోందని పోలీసులు తెలిపారు. మరోవైపు నిజ్జర్ హత్యలో భారత్‌కు ఉన్న సంబంధాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ హత్య కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని.. వారిని కూడా అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.గతేడాది జూన్ 18న కెనడా బ్రిటిష్ కొలంబియా ప్రావిన్సు సర్రే పట్టణంలో ఉన్న గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ ఆవరణలో నిజ్జర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్య కేసులో భారత్‌కు సంబంధించిన ఏజెంట్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశాడు. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. -
ఐర్లాండ్: వాసవి మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు..
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో త్రిశక్తి స్వరూపిణి, సకల వేద స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘశుద్ధ విదియ రోజు వందమందికి పైగా వాసవి మాత భక్తులు, కమిటీ సభ్యులందరు కలిసి ఉదయాన్నే అనుకున్నట్టుగా కింగ్స్‌వుడ్ ప్రాంతమునందున్న స్థానిక వినాయగర్ ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. మొదటగా పిల్లలు తరువాత మహిళలంతా కలిసి చక్కగా అమ్మవారికి భక్తిశ్రద్దలతో అభిషేక కార్యక్రమాన్ని పూర్తిచేశారు. తరువాత అమ్మవారికి వివిధరకాల పుష్పాలతో అలంకరించిన పిమ్మట లలిత సహస్రనామ పఠనము, మణిదీపవర్ణన, సామూహిక కుంకుమార్చన నిర్వహించగా.. విశాలి రమేష్, శృతి, అనూష చేసిన అమ్మవారి గీతాలాపనలో భక్తులందరూ తన్మయత్వం చెందారు. అటుపిమ్మట అమ్మవారికి మహిళలందరూ వడిబియ్యం సమర్పించి మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అంకిత ఈ కార్యక్రమం మొత్తాన్ని చక్కగా సమన్వయము చేసారు. చిరంజీవి-లక్ష్మి హాసిని వాసవి పురాణం నుండి సేకరించిన ధర్మసూత్రాలను ఆంగ్లంలోకి అనువదించిన వాసవి దివ్యకథను భక్తులందరికీ చదివి వినిపించారు. అమ్మవారి నామస్మరణతో భక్తులందరూ పులకించిపోయారు. సంప్రదాయ వస్త్రధారణలో పిల్లలు పెద్దలు ఆనందంగా వారి ఒకరోజు సమయాన్ని ఇలా అమ్మవారి సేవలో గడపటం చాలాా ఆనందంగా ఉందని కోర్-కమిటీ సభ్యుల్లో ఒకరైన అనీల్ అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన ఆలయ సెక్రటరీ, డైరెక్టర్ బాలకృష్ణన్ దంపతులకు కార్యవర్గ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ముత్తుస్వామిని ఘనంగా సత్కరించారు. బాలకృష్ణన్ మాట్లాడుతూ అమ్మవారి కార్యక్రమాలు వినయాగర్ ఆలయం నందు నిర్వహించడం అందులో భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందమైన విషయమని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనీ అభిలాషించారు. సరసమైన ధరలకే భోజన ప్రసాదాలు అందించిన బిర్యానీవాలా రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్‌కి, దీనికి సహకరించిన ప్రశాంత్‌కి కమిటీ కార్యవర్గ సభ్యులు శివ కుమార్, నవీన్ సంతోష్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. హాజరైన సభ్యులందరు ముక్తకంఠంతో ఐర్లాండ్ నందు ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఎంతో శుభపరిణామమని ఆనందించారు. కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు రేణుక దినేష్, రజిత సంతోష్, నితేశ్ గుప్తాలకు కమిటీ సభ్యులు సత్కరించి కృతఙ్ఞతలు తెలియజేసారు. అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో మాధవి, దివ్య మంజుల, శృతి, మాధురి, రేణుక, అంకిత, మణి, లావణ్య తదితరులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. తదుపరి కార్యక్రమంలో అధ్యక్షులు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. అమ్మవారి జీవిత విశేషాలను ప్రస్తుత సమాజం ఎలా స్వీకరించాలో ఉదాహారణలతో వివరించి సభ్యులందరికి అమ్మవారు చెప్పిన ధర్మ సంబంధమైన విషయాలను లోతుగా వివరించి చెప్పారు, హాజరైన సభ్యులకు భక్తులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. చివరిగా.. అందరూ భోజన ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమం మొత్తం ముందుకు సాగడంలో కీలకంగా కోర్-కమిటీ సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా గంగా ప్రసాద్, లావణ్య, సంతోష్ పారేపల్లి, శ్రీనివాస్, సతీష్, మాణిక్, శ్రవణ్ తదితరులు పాల్గొని విజయవంతంగా ముగించారు. -
టోక్యో ఎయిర్ పోర్ట్ లో రెండు విమానాలు ఢీ
-
కుప్పకూలిన జిమ్ పైకప్పు.. పలువురి మృతి
బీజింగ్: చైనాలో ఘోరం జరిగింది. ఓ జిమ్ పైకప్పుకూలిపోయి పది మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. హెయిలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్విక్విహార్లోని రోడ్.34 మిడిల్ స్కూల్లో ఈ జిమ్ ఉంది. ఆదివారం సాయంత్రం ఉన్నట్లుండి పైకప్పు కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. పలువురిని శిథిలాల నుంచి బయటకు లాగాయి. అయితే ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆరుగురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందినట్లు స్థానికమీడియా సంస్థలు కథనం ప్రచురించాయి. భారీ వర్షం శిథిలాల తొలగింపు ప్రక్రియను అవాంతరం కలిగిస్తోంది. దీంతో ఇంకా పూర్తి కాకపోవడంతో.. వాటి కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 【#黑龍江 一中學體育館樓頂坍塌 已致10人死亡】 🇨🇳23日,黑龍江 #齊齊哈爾 市的一所中學的體育館樓頂發生坍塌。事故發生時體育館內共有19人,其中4人自行脫險,15人被困。截至24日凌晨三點,被困人員中已有9人死亡,4人被救出無生命危險,仍有2人被困。#China #Heilongjiang pic.twitter.com/IQEVhQytuZ — 鳳凰衛視PhoenixTV (@PhoenixTVHK) July 24, 2023 -
జపాన్ ప్రధానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
Japan PM: జపాన్ ప్రధానికి తప్పిన ముప్పు.. అతి సమీపంలో పేలుడు..
టోక్యో: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదాకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమ ప్రాంత వకయామ ప్రిఫెక్చర్‌లోని తీర నగరం సైకజాకిలో శనివారం ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్లారు. ప్రసంగానికి కొద్దిసేపటి ముందు కిషిదా నిల్చున్న ప్రదేశానికి అతి సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు వినిపించింది. అంతటా దట్టమైన పొగలు వ్యాపించాయి. వెంటనే పోలీసులు మాస్క్ ధరించి ఉన్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న మరో ట్యూబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. BREAKING: Japanese Prime Minister Kishida evacuated after loud bang; suspect in custody pic.twitter.com/iQDZeCOePh — BNO News Live (@BNODesk) April 15, 2023 పేలుడుతో అక్కడికి చేరిన ప్రజలు భయంతో అరుస్తూ పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని పోలీసులు చెప్పారు. ఈ అనూహ్య ఘటనతో కిషిదా కొంత భయపడినట్లు కనిపించారు. అనంతరం ప్రచార కార్యక్రమాలను ఆయన యథా ప్రకారం కొనసాగించారు. అనుమానిత వస్తువును విసిరినట్లు భావిస్తున్న ఒక యువకుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారని చీఫ్ కేబినెట్ సెక్రటరీ హిరొకజు మట్సునో చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్న ఆయన.. ఘటన వెనుక కారణాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అది ఎటువంటి పేలుడు వస్తువనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. పైపు బాంబు అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం హాట్ స్ప్రింగ్ రిసార్టు పట్టణం కరుయిజావాలో జి–7 దేశాల విదేశాంగ మంత్రుల భేటీ జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 23వ తేదీన జపాన్ వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు, కొన్ని పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు, మేలో కిషిదా సొంత పట్టణం హిరోíÙమాలో జి–7 నేతల శిఖరాగ్రం జరగనుంది. చదవండి: ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం.. అలాంటి ఉద్దేశమే లేదు: చైనా -
Italy Crisis: దుర్భిక్షం దిశగా ఇటలీ.. చుక్క నీరు లేక విలవిల..
రోమ్: ఐరోపా దేశం ఇటలీ నీటి సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నదులు, జలాశయాలు, కొలనులలో చుక్క నీరు లేక విలవిల్లాడుతోంది. 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగంటాయి. గతేడాదితో పోల్చితే వర్షపాతం 40 శాతం పడిపోయింది. వేసవికాలం ముగిసి చాలా రోజులవుతున్నా వర్షాలు పడకపోడవంతో ప్రజలు పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. తాగడానికి మంచి నీరు కూడా లేని పరిస్థితి వచ్చింది. దీంతో ఇటలీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నీటి కొరతను అధిగమించేందు 35 మిలియన్ యూరోలను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రజలు నీటిని పరిమితంగా ఉపయోగించేలా ఆంక్షలు విధించింది. ఎవరైనా నీటిని పరిమితి కంటే ఎక్కువగా ఉపయోగించినా, వృథా చేసినా 500 యూరోల జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఎమర్జెన్సీ ప్రకటించినందున ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. నీటి సంక్షోభం కారణంగా ఇటలీలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. నీటి స్థాయిలు సాధారణం కంటే 85 శాతం క్షీణించడంతో రైతుల పంటలకు సాగనీరు లేని దుస్థితి నెలకొంది. దీంతో దేశ ఆహార ఉత్పత్తి మూడింట ఒక వంతు తగ్గే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటలీలో ఈ పరిస్థితికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని పర్యావరణ నిపుణులు చెప్పారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, సకాలంలో వర్షాలు కురవకపోవడం ప్రపంచానికి ఓ అలర్ట్ అని పేర్కొన్నారు. చదవండి: ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు! -
లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. దివాళా తీసిన పాకిస్తాన్..
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న విషయం తెలిసిందే. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. లీటర్ పాల ధర రూ.250, కేజీ చికెన్ రూ.780కి చేరిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో దివాళా అంచుల్లోకి పాకిస్తాన్ వెళ్లిందని అంతా అనుకుంటున్నారు. అయితే పాక్ రక్షణ మంత్రి, పీఎంఎల్-ఎన్ నేత ఖవాజా ఆసిఫ్ ఆ దేశ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని కుండబద్దలుకొట్టారు. పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయామని ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కన్పించడం లేదన్నారు. ఇక పాక్ ప్రజలు తమకాళ్లపై తామే నిలబడాలని పిలుపునిచ్చారు. సియాల్కోట్లో ఓ ప్రైవేట్ కాలేజ్ నిర్వహించిన కాన్వొకేషన్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఖవాజా ఈ వ్యాఖ్యలు చేశారు. 'పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోయిందని, ఆర్థిక మాంద్యంలో ఉందని ప్రజలు అంటున్నారు. అయితే ఇదంతా ఇప్పటికే జరిగిపోయింది. మనం ఇప్పుడు దివాళా తీసిన దేశంలో నివసిస్తున్నాం. ఇక సొంతంగా మనకాళ్లపైనే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది' అని ఆసిఫ్ అన్నారు. Defence Minister of Imported govt admits that Pakistan is already in default. In 10 months they have brought Pak to this sorry state - Shameless lot selling out the country & holding on to power instead of letting nation choose their ldrs thru elections. pic.twitter.com/IHbREnbAhK — Shireen Mazari (@ShireenMazari1) February 18, 2023 దేశంలో ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడానికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని గత పీటీఐ ప్రభుత్వమే కారణమని ఖవాజా ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్‌కు తిరిగితీసుకొచ్చారని ఆరోపించారు. పాకిస్తాన్‌ను ఉగ్రవాదులకు నిలయంగా మార్చారని కూడా ఖవాజా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖవాజా ఆరోపణలను ప్రతిపక్ష పీటీఐ పార్టీ తిప్పికొట్టింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 నెలల్లోనే దేశాన్ని దివాళా తీయించిందని ఎదురుదాడికి దిగింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి 2019లో పాకిస్తాన్‌కు 6 బిలియన్ డాలర్ల సాయం అందించింది. 2022లో వరదల తర్వాత మరో 1.1 బిలియన్ డాలర్లను సాయంగా ప్రకటించింది. కానీ దేశంలో రాజకీయ గందరగోళం మధ్య ఆర్థిక ఏకీకరణపై పాకిస్తాన్ మరింత పురోగతి సాధించడంలో విఫలమవడంతో నవంబర్‌లో చెల్లింపులను నిలిపివేసింది. చదవండి: ఆక్స్ఫర్డ్ వర్సిటీ హాస్పిటల్స్ సీఈఓగా మేఘనా పండిట్ -
నా కూతురి పేరు మరెవరికీ ఉండొద్దు.. కిమ్ హుకుం..
ప్యాంగాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అంటే ప్రపంచ దేశాలే కాదు సొంత ప్రజలు కూడా భయపడుతారు. ఆయన నిర్ణయాలు అలా ఉంటాయి మరి. తాజాగా కిమ్ ప్రభుత్వం విధించిన కొత్త ఆంక్షలు ఉత్తరకొరియాలో కొంతమంది అమ్మాయిలు, మహిళలకు ఇబ్బందికరంగా మారాయి. కిమ్ కూతురు 'జు ఏ' పేరు దేశంలో మరెవరికీ ఉండొందట. అలాంటి పేరు ఎవరికి ఉన్నా.. వారు వెంటనే మార్చుకుని వేరే పేరు పెట్టుకోవాలట. 'జు ఏ' అనే పేరుతో ఉన్న మహిళతో పాటు, అదే పేరు పెట్టుకున్న 12 ఏళ్ల చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం నోటీసులు పంపింది. వెంటనే పేర్లు మార్చుకోవాలని సూచించింది. జనన ధ్రువీకరణ పత్రం కూడా మార్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో జు ఏ పేరు ఉన్న వారు మాకేంటీ బాధ.. అనుకుంటున్నారు. గత్యంతరం లేక పేరు మార్చుకుంటున్నారు. కిమ్ కూతురు జు ఏ కొద్ది రోజులగా తండ్రితో పాటు ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో కిమ్ తర్వాత ఉత్తరకొరియాను పాలించబోయేది ఆమే అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఉత్తరకొరియాలో ప్రజలు పేర్లు మార్చుకోవాలని అధినేతలు హుకుం జారీ చేయడం ఇది తొలిసారేం కాదు. కిమ్ II- సంగ్ పాలనలో కూడా ప్రజలు ఆయన పేరును పెట్టుకోకూడదనే రూల్ ఉండేది. కిమ్ జోంగ్ ఉన్ అధికారం చేపట్టాక కూడా తన పేరుతో పాటు, తన భార్య పేరు సోల్-జు పేరు ఎవరికీ ఉండొద్దని నిబంధన తీసుకొచ్చారు. అప్పటికే ఆ పేరు ఉన్నవారు మార్చుకోవాలని తేల్చిచెప్పారు. చదవండి: బైడెన్ ఆర్థిక బృందంలో భారతీయుడు.. -
టర్కీ భూకంపం.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు..
టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. భూకంపం ముందు ఓ వ్యక్తి తీసిన లైవ్ వీడియో వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. ముందుగా మెరుపులు వచ్చి ఆ తర్వాత ప్రకంపనలు రావడంతో విద్యుత్ సరఫరా స్తంభించిపోయి అంతా చీకటిమయం అయింది. ఆ తర్వాత క్షణాల్లోనే భూప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 🎥1 Scary footage of how the #earthquake struck #Turkey last night. 🎥2 A 6-story building in Urfa, Turkey falls over after earthquake As per estimate over 1700 buildings have been destroyed with over 800 deaths PM Modi extends condolences and offers help to all effected pic.twitter.com/B9CSpvRh2J — Megh Updates 🚨™ (@MeghUpdates) February 6, 2023 రెండో భూకంపం.. అతిపెద్ద భూకంపం సంభవించిన 12 గంటల్లోనే టర్కీ, సిరియాలో మరోసారి భూకంపం రావడం ఆందోళన కల్గిస్తోంది. మొదటిసారి భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.8గా నమోదు కాగా.. రెండోసారి భూకంపం వచ్చినప్పుడు తీవ్రత 7.6గా నమోదైంది. 1700మందికిపైగా మృతి.. టర్కీ చరిత్రలోనే అతిపెద్ద విపత్తుగా చెబుతున్న ఈ భూకంపంలో ఇప్పటివరకు 1498 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. శిథిలాలు తవ్వేకొద్ది మృతదేహాలు బయటపడుతుండటంతో మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. అటు సిరియాలో 430 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సిరియా ప్రభుత్వ నియంత్రణలో లేని ప్రాంతాల్లో 380 మంది చనిపోయారు. మొత్తంగా 2300 మందిపైగా మృత్యుఒడికి చేరారు. Turkey💔 #Turkey #amed #earthquake #Earthquake pic.twitter.com/qVwPXft9Hu — Ismail Rojbayani (@ismailrojbayani) February 6, 2023 ఈ వీడియోల్లో కన్పిస్తున్న దృశ్యాల్లో కొన్ని బహుళ అంతస్తుల భవనాలు కళ్లుముందే పేకమేడల్లా కూలిపోవడం హృదయాలను కలచివేస్తోంది. వందల మంది చనిపోయారు. వేల మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. తమను కాపాడమని ఆర్తనాదాలు పెడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీస్తున్నారు. February 6, 2023 ....There are reports of several hundred dead. The Entire buildings collapsed in South #Turkey the epicenter of 7.8 magnitude earthquake in last hour,#Turkey #earthquake pic.twitter.com/pJtFoJlWfK — Naveed Awan (@Naveedawan78) February 6, 2023 భూకంపం ధాటికి వేలాది భవనాలు నేలమట్టం కావడంతో టర్కీ, సిరియాలో కొన్ని ప్రాంతాల్లో భయానక దృశ్యాలు కన్పిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా కూలిపోయిన భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. భూకంపం వల్ల ఇళ్లు కోల్పోయిన వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తమకు కావల్సిన వారిని కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. #Turkey #earthquake #Syria #Iraq #Turkey #Iran#earthquake #Turkey Prayers for Turkey 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/Eh6ny5qYut — vipin singh (@vipin_tika) February 6, 2023 టర్కీలో 2,818 భవనాలు నేలమట్టం.. 1939 తర్వాత దేశంలో ఇదే అతిపెద్ద విపత్తు అని, భూకంపంలో 2,818 భవనాలు నేలమట్టమయ్యాయని టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాకు సంఘీభావం ప్రకటించాయి. ఈ విపత్కర పరిస్థితిలో సాయం అందిస్తామనని చెప్పాయి. భారత్ కూడా తన వంతు సాయంగా టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు, వైద్య బృందాలతో పాటు సహాయ సామగ్రిని టర్కీకి పంపింది. In #Kahramanmaras the moment #earthquake rocking #Turkey recorded by security camera of a pharmacy. #deprem #PrayForTurkey pic.twitter.com/6oNPPQHEnY — JournoTurk (@journoturk) February 6, 2023 #earthquake in #Turkey and #Lebanon Ya Allah save everyone 7.8 GOD bless Everyone #Syria pic.twitter.com/UYOsZAbwLo — waqar haider (@whaiderr25) February 6, 2023 The impact of the massive #earthquake in the streets of Gaziantep, southern Turkey. Update- 1006 Killed & 5590 injured.#deprem #Idlib #Syria #DEPREMOLDU #TurkeyEarthquake #Turkey pic.twitter.com/n4ejuCz28l — Chaudhary Parvez (@ChaudharyParvez) February 6, 2023 చదవండి: అమెరికా వెళ్లాలనుకునేవారికి శుభవార్త.. వెయిటింగ్ అక్కర్లే 14 రోజుల్లోనే వీసా! -
Wikipedia: వికిపీడియాను బ్యాన్ చేసిన పాకిస్తాన్.. ఎందుకంటే..?
ఇస్లామాబాద్: ప్రముఖ వెబ్సైట్ వికిపీడియాను బ్యాన్ చేసింది పాకిస్తాన్. తాము చెప్పిన కంటెంట్‌ను తొలగించనందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మతాన్ని అగౌరపరిచేలా ఉన్న కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలని 48 గంటలు గడువు ఇచ్చినా వికిపీడియా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పాక్ టెలికం శాఖ ఈమేరకు చర్యలు తీసుకుంది. సామాజిక మాధ్యమాలు, వెబ్సైట్లను బ్యాన్ చేయడం పాకిస్తాన్లో తరచూ జరగుతూనే ఉంది. 2012లో ఏకంగా 700 యూట్యూబ్ లింకులను బ్లాక్ చేసింది. ఇస్లాంకు వ్యతిరేకంగా కంటెంట్ ఉందని ఆరోపిస్తూ ఈ చర్యలు తీసుకుంది. పాక్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజాగా వికిపీడియా కూడా ఈ జాబితాలో చేరింది. మతానికి సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని ఆ సంస్థకు పాక్ ప్రభుత్వం నోటీసులు పంపింది. తమ ఆదేశాలు పాటించకపోతే వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. అయినా వికిపీడియా నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసింది పాక్ ప్రభుత్వం. అయితే పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని పులువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్దమని, సరైన నిర్ణయం కాదని విమర్శిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు, పరిశోధకులు, సమాజంలోని వర్గాలపై ప్రభావం పడుతుందని డిజిటల్ హక్కుల కారకర్త ఉసామా ఖిల్జీ అన్నారు. మరోవైపు వికిపీడియా సంస్థ కూడా దీనిపై స్పందించింది. తమ వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది. ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞాన సంపదను పాక్ ప్రజలు కోల్పోతారని, దేశ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉండదని పేర్కొంది. చదవండి: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి.. -
Wildfires: కార్చిచ్చు బీభత్సం.. వందల ఇళ్లు ధ్వంసం.. 13 మంది మృతి..
శాన్టియాగో: చీలి దేశంలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. వేసవిలో వేడిగాలులకు అగ్గి రాజుకొని అడువులు తగలబడిపోతున్నాయి మొత్తం 151 చోట్ల కార్చిచ్చు ఘటనలు వెలుగుచూశాయి. వాటిలో 65 చోట్ల మంటలను అదపుచేశారు. బుధవారం నుంచి వ్యాపిస్తున్న కార్చిచ్చు కారణంగా 35 వేల ఎకరాలు బూడిదైనట్లు అధికారులు తెలిపారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదాల్లో 13 మంది మరణించినట్లు వివరించారు. మృతుల్లో ఓ హెలికాప్టర్ పైలట్‌తో పాటు మెకానిక్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీరు ఓ ప్రాంతంలో మంటలను అదుపు చేసేందుకు వెళ్లి హెలికాఫ్టర్ క్రాష్ అయి చనిపోయినట్లు పేర్కొన్నారు. మరోవైపు కార్చిచ్చును అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. హెలికాఫ్టర్ ట్యాంకర్లతో సహాయక చర్యలు చేపట్టింది. కార్చిచ్చు నేపథ్యంలో చీలి అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ తన వెకేషన్‌ను రద్దు చేసుకున్నారు. ఈ అత్యవసర పరిస్థితిలో 24 గంటలు అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కార్చిచ్చును విపత్తుగా ప్రకటించారు. దీంతో సైన్యం కూడా రంగంలోకి సహాయక చర్యలు చేపట్టింది. 2017లో కూడా చీలిలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. అప్పుడు 11 మంది వివిధ ప్రమాదాల్లో చనిపోయారు. 1500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 1,15,000 ఎకరాల అటవీప్రాంతం కాలిబూడిదైంది. చదవండి: సన్నీలియోన్ వెళ్లే ఫ్యాషన్ షో వేదిక సమీపంలో పేలుడు.. -
రష్యా భరతం పట్టాలంటే సరికొత్త ఆయుధాలు కావాలి.. త్వరగా ఇవ్వండి
కీవ్: ఉక్రెయిన్ తూర్పు డొనెస్క్ ప్రాంతంలో రష్యా తరచూ దాడులు చేస్తోందని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. తాము అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. రష్యాను దీటుగా ఎదుర్కోవాలంటే తమకు సరికొత్త ఆయుధాలు కావాలని, ప్రపంచ దేశాలు వేగంగా వాటిని తమకు అందించాలని కోరారు. ఈమేరకు ఆయన ఆదివారం వీడియో సందేశం విడుదల చేశారు. డొనెస్క్‌లోని బాఖ్ముత్, వుహ్లెడార్తో పాటు ఇతర చోట్ల రష్యా తరచూ భీకర దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ సేనలను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. రష్యా ఈ యుద్ధాన్ని ఇంకా సాగదీయాలని చూస్తోందని, అందుకే సమయాన్ని ఆయుధంగా మార్చుకుని శత్రు దేశాన్ని చావుదెబ్బతీయాలని జెలెన్స్కీ చెప్పారు. అత్యంత వేగంగా తమకు అధునాతన ఆయుధాలు సమకూర్చాలన్నారు. డొనెస్క్‌లోని బ్లాహొదాట్నే ప్రాంతంపై రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఆదివారం ఉదయమే వెల్లడించారు. రష్యా మాత్రం ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నట్లు ప్రకటించింది. అమెరికా, జర్మనీ వంటి దేశాలు ఇతర దేశాల సహకారంతో ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందిస్తున్నాయి. అయితే అమెరికా తయారు చేసిన ఏటీఎసీఎంస్ క్షిపణులను తమకు ఇవ్వాలని జెలెన్స్కీ కోరుతున్నారు. 300 కీలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉండటం దీని ప్రత్యేకత. అయితే ఈ క్షిపణులను ఉక్రెయిన్ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరిస్తోంది. చదవండి: బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి.. -
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
వాషింగ్టన్: దాదాపు 11 నెలలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంకా ఉద్రిక్తతలు చల్లారడంలేదు. రష్యా క్షిపణులతో విరుచుకుపడుతుండగా.. ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ఈ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు కోరినా ఫలితం లేకుండాపోయింది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తాను అధికారంలో ఉండి ఉంటే ఈ యుద్ధాన్ని 24 గంటల్లోనే ఆపేవాడినని పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యను వెంటనే పరిష్కరించేవాడినని చెప్పుకొచ్చారు. ఇప్పటికి కూడా తాను అధ్యక్షుడినైతే చర్చల ద్వారా ఈ భయానక యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేలా చేస్తానని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ట్రుత్ సోషల్'లో రాసుకొచ్చారు. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగింది. అప్పటినుంచి బాంబులు, క్షిపణులుతో కీవ్‌పై విరుచుకుపడుతోంది. మొదట్లో రష్యా దాడులకు తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్.. ఆ తర్వాత ధీటుగా బదులిస్తూ శత్రు దేశానికి సవాళ్లు విసురుతోంది. ప్రపంచదేశాలు కూడా ఉక్రెయిన్‌కు సంఘీభావంగా నిలిచి ఆర్థికంగా, ఆయుధాలపరంగా అండగా నిలుస్తున్నాయి. అమెరికా, జర్మనీ వంటి దేశాలు కీవ్‌కు అధునాతన యుద్ధ ట్యాంకులు, ఆయుధ వ్యవస్థలను సమకూరుస్తున్నాయి. ఈ పరిణామాల కారణంగా రష్యా అణ్వాయుధాలతో దాడులు చేసే ప్రమాదం ఉందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. తానుంటే 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపే వాడినని చెబుతున్నారు. -
దేశవ్యాప్తంగా కరెంట్ బంద్.. ‘చీకటి’లో పాకిస్తాన్ ప్రజలు (ఫోటోలు)
-
అల్లాడుతున్న పాకిస్తాన్ ప్రజలు.. దేశవ్యాప్తంగా కరెంట్ కట్!
ఇస్లామాబాద్: ఇప్పటికే ఆర్థిక కష్టాలతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ నెత్తిపై మరో పిడుగు పడింది. అకాశన్నంటిన నిత్యావసరాల ధరలు, ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో కష్టం వచ్చిపడింది. నేషనల్ గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు సోమవారం అంధకారంలోనే గడిపారు. హోటళ్లు, రెస్టారెంట్లు దీపాల వెలుగులోనే నడిచాయి. సాధారణ పౌరులు ఇళ్లలో కొవ్వత్తులు వెలిగించుకొని జీవనం సాగించారు. నేషనల్ గ్రిడ్‌లో ఫ్రీక్వెన్సీ పడిపోడవంతో సోమవారం ఉదయం 7:30 గంటలకు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీన్ని పునరుద్ధరించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఎట్టకేలకు ఇస్లామాద్, గుజ్రావాలా ప్రాంతాల్లో మాత్రం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మిగతా నగరాల్లో కూడా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యత్ శాఖ మంత్రి ఖురాం దస్తగిర్ పేర్కొన్నారు. కరెంటు కోతలు సహజమే.. విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో కరెంటు కోతలు సర్వసాధరణమైపోయాయి. హాస్పిటళ్లు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు జనరేటర్ల సాయంతో నడుస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల్లో కూడా వెలుతురు లేకుండానే పాఠాలు బోధిస్త్నున్నారు. కొన్ని చోట్ల బ్యాటరీతో నడచే లైట్లను ఉపయోగిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాలు మాత్రం చాలా తక్కువే. గతంలో 2021లో గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా పాక్ మొత్తం విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఇదే కారణంతో దేశం మొత్తం అంధకారంలోకి వెళ్లింది. చదవండి: ఆందోళనలతో అట్టుడుకుతున్న బ్రెజిల్, పెరు.. ఏమిటీ సమస్య? -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి కన్నుమూత.. వయసు ఎంతంటే..?
పారిస్: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపుపొందిన ఫ్రాన్స్ దేశస్తురాలు లూసిలీ ర్యాండమ్(118) తుది శ్వాస విడిచారు. కోవిడ్‌ను జయించిన అత్యంత వృద్ధుల్లో ఒకరిగానూ చరిత్ర సృష్టించిన ఈమెను స్థానికులు సిస్టర్ ఆండ్రీగా పిలుస్తారు. 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్‌లోని ఎలీస్ పట్టణంలో జన్మించిన ఈమె వృత్తిరీత్యా నర్సు. మంగళవారం టౌలూన్ పట్టణంలో ఈమె మరణించారని ఆమె తరఫు ప్రతినిధి వెల్లడించారు. 2021 జనవరిలో ఈమెకు కరోనా సోకింది. అయితే, పెద్దగా అనారోగ్య లక్షణాలేవీ కనిపించకపోవడం విశేషం. కోవిడ్‌ను జయించిన బామ్మగా ప్రాచుర్యంపొందారు. ‘కష్టంగా భావించకుండా ఇష్టంగా పనిచేయడమే నా ఆరోగ్య రహస్యం. 108 ఏళ్ల వరకు నా పనులు నేనే చేసుకున్నా. రోజూ ఒక చాక్లెట్ తినడం, ఒక గ్లాస్ వైన్ తాగడం నా అలవాటు’ అని ఆండ్రీ గతంలో చెప్పారు. ర్యాండమ్ మృతి తర్వాత స్పెయిన్‌లో నివసిస్తున్న 115 ఏళ్ల అమెరికన్ మరియా బ్రాన్యాస్ మొరేరా ప్రపంచంలో అత్యంత వృద్ధ వ్యక్తిగా రికార్డులకెక్కారు. చదవండి: జనాభాలో చైనాను దాటేశాం -
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఘోర విమాన ప్రమాదం
-
మహిళల హక్కులను పట్టించుకోం.. మాకు అదే ముఖ్యం: తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో అమ్మాయిలను హైస్కూల్, కాలేజీ, యూనివర్సిటీల్లో చదవకుండా తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా మహిళలు ఎన్జీఓల్లో కూడా పనిచేయకుండా కొత్త రూల్ తీసుకొచ్చారు. దీంతో తాలిబన్ ప్రభుత్వం తీరును ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. మహిళల హక్కులను కాలరాయొద్దని సూచిస్తున్నాయి. ఈ విషయంపై తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ స్పందించాడు. అసలు మహిళల హక్కులు తామ ప్రాధాన్యమే కాదని చెప్పాడు. తమకు ఇస్లామిక్ చట్టమే ముఖ్యమని దాని ప్రకారమే మహిళలు నడుచుకోవాలని పేర్కొన్నాడు. వాళ్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే ఉద్దేశమే తమకు లేదని తేల్చిచెప్పాడు. ఇస్లాం చట్ట ప్రకారమే తమ పాలన ఉంటుందన్నాడు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల హక్కులను కాలరాస్తోంది. ఉన్నత విద్య, కాలేజీలు, యూనివర్సీటీల్లో అమ్మాయిలపై నిషేధం విధించింది. వాళ్లు అబ్బాయిలతో కలిసి చదువుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చివరకు మహిళలు ఎన్జీఓల్లో కూడా ఉద్యోగం చేయకుండా ఆంక్షలు విధించింది. హిజాబ్ ధరిచంకుండా, మగ తోడు లేకుండా బయటకు వెళ్లొద్దని నిబంధనలు తీసుకొచ్చింది. ప్రపంచదేశాలు నుంచి తీవ్ర విమర్శలు ఎదరువుతున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్తోంది. చదవండి: కీవ్‌పై మరోసారి పేట్రేగిన రష్యా -
పాకిస్థాన్ లో ఆర్థిక, ఆహార సంక్షోభం
-
100 ఏళ్లలో తొలిసారి.. స్పీకర్‌ను ఎన్నుకోలేకపోయిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా ప్రతినిధుల సభలో స్పీకర్ ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. మూడు రౌండ్ల బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించినా స్పీకర్ విజయానికి కావాల్సిన మెజార్టీ 218 ఓట్లు రాలేదు. దీంతో సభలో 222 సీట్లున్న రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. స్పీకర్ పదవికి పోటీ పడుతున్న కెవిన్ మెకర్తీకి సొంత సభ్యుల నుంచే వ్యతిరేకత వచ్చింది. దీంతో మంగళవారం మూడు రౌండ్ల ఓటింగ్ జరిగినా ఆయన 218 ఓట్లు సాధించలేకపోయారు. 202 మంది రిపబ్లికన్ ప్రతినిధులు ఆయనకు అనుకూలంగా ఓటు వేయగా.. మరో 20 మంది వ్యతిరేకిస్తున్నారు. స్పీకర్ ఎన్నికకు జరిగిన తొలి రౌండ్ ఓటింగ్‌లో ఫలితం తేలకపోవడం అమెరికా ప్రతినిధుల సభ చరిత్రలో 100 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారి 1923లో స్పీకర్ ఎన్నికకు నిర్వహించిన తొలి రౌండ్ ఓటింగ్‌లో ఫలితం రాలేదు. అయితే స్పీకర్ అభ్యర్థికి కావాల్సిన మెజార్టీ వచ్చే వరకు ప్రతినిధుల సభలో ఓటింగ్ నిర్వహిస్తూనే ఉంటారు. ఫలితం వచ్చే వరకు ఎన్ని రౌండ్లయినా ఈ ప్రక్రియ కొనసాగిస్తారు. మంగళవారం మూడు రౌండ్ల ఓటింగ్ జరగగా.. బుధవారం మరోమారు ఓటింగ్ నిర్వహిస్తారు. తాను మళ్లీ రేసులో నిలబడతానని మెకర్తీ స్పష్టం చేశారు. పార్టీ సభ్యులతో చర్చించి అందరూ తనకు మద్దతు తెలిపేలా చూస్తానన్నారు. అయితే 20 మంది రిపబ్లికన్ సభ్యులు మెకర్తీని వ్యతిరేకిస్తున్నారు. వీరంతా ట్రంప్ సన్నిహితుడు అయిన జిమ్ జోర్డాన్‌కు మద్దతు తెలిపారు. మెకర్తీనే స్పీకర్‌గా ఎన్నుకోవాలని జోర్డాన్ సూచించినా.. వారు మాత్రం వినలేదు. మూడో రౌండ్లోనూ జోర్డాన్‌కు ఓటు వేశారు. అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం 435 మంది సభ్యులున్నారు. రిపబ్లికన్లకు 222, అధికార డెమొక్రాట్లకు 212 మంది ప్రతినిధులున్నారు. మెజార్టీలో స్వల్ప తేడా ఉండటంతో 20 ఓట్లు చాలా కీలకమయ్యాయి. సభలో మొన్నటివరకు డెమొక్రాట్లదే మెజార్టీ. కానీ ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్లు అధిక సీట్లు గెలుచుకుని సభలో మెజర్డీ సాధించారు. చదవండి: కిమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణ కొరియా..! -
కిమ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన దక్షిణ కొరియా..!
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తమ గగనతలంలోకి మరోసారి కిమ్ దేశానికి చెందిన డ్రోన్లు ప్రవేశిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. అవసరమైతే 2018లో కుదుర్చుకున్న సైనిక ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కిమ్ దేశం హద్దులు మీరొద్దని తేల్చి చెప్పారు. గతవారం ఉత్తరకొరియా డ్రోన్లు దక్షిణ కొరియాలోకి ప్రవేశించాయి. నిబంధనలు ఉల్లంఘించి సరిహద్దు దాటి చక్కర్లు కొట్టాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన యూన్ సుక్.. పొరుగు దేశం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమ సైన్యం ఈ విషయంలో వ్యవహిరించిన తీరుపైనా మండిపడ్డారు. డ్రోన్లు తమ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు సైన్యం సరైన రీతిలో స్పందించాల్సిందని వ్యాఖ్యానించారు. హద్దు మీరినప్పుడు చూస్తూ ఉరుకోవద్దన్నారు. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య దశాబ్దాల కాలంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. యూన్ సుక్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పొరుగు దేశంతో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. కిమ్ దేశం నిబంధనలు ఉల్లంఘిస్తే దీటుగా బదులిస్తున్నారు. చదవండి: రష్యా సినిమా హాళ్లలో ఉక్రెయిన్‌పై దాడి దృశ్యాలు.. పుతిన్ కీలక ఆదేశాలు -
అమెరికాపై " స్నో బాంబు "
-
ఆఫ్ఘానిస్తాన్ లో అమ్మాయిలకు నరకం చూపిస్తున్న తాలిబన్లు
-
Japan Snow Storm: జపాన్‌లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి
టోక్యో: జపాన్ వాసులు మంచు తుపాను ధాటికి వారం రోజులుగా వణికిపోతున్నారు. సంబంధిత ప్రమాద ఘటనల్లో 17 మంది చనిపోగా వంద మంది గాయపడ్డారు. వేలాదిగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తీవ్రంగా మంచు పేరుకుపోవడంతో రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈశాన్య జపాన్‌లో ఈ సీజన్లో సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువగా మంచు పడింది. చదవండి: అమెరికాను ముంచేసిన మంచు -
కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. ఇద్దరు మృతి.. చీకట్లో వేల మంది..
కాలిఫోర్నియా: అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. భూప్రకంపనల ధాటికి పలుచోట్ల ప్రమాదాలు సంభవించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. ఫార్చునాకు 15 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా హంబోల్డ్ కౌంటీలో వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దాదాపు 71వేల మంది అంధకారంలోకి వెళ్లారు. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోయాయి. చదవండి: ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు -
భారత్-పాక్ సంబంధాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్-అమెరికా సంబంధాలపై అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు దేశాల మధ్య తాము మాటల యుద్ధం కోరుకోవటం లేదని చెప్పింది. సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక చర్చలు చేపట్టాలని సూచించింది. అగ్రరాజ్యం విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఈమేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు. భారత్‌తో అమెరికాకు అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అటు పాకిస్తాన్‌తోనూ తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని ప్రైస్ పేర్కొన్నారు. ఈ రెండు దేశాలతో సంబంధాలను ఒకదానికొకటి ముడిపెట్టలేమని వివరించారు. భారత్-పాక్ మధ్య మాటల యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ప్రధానీ మోదీపై పాక్ మంత్రి బిలావల్ భుట్టో చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా ఈమేరకు బదులిచ్చారు. రెండు దేశాలతోనూ ద్వైపాక్షిక సంబంధాలు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. భారత్-పాక్ నిర్మాణాత్మక చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటే రెండు దేశాల ప్రజలకు శ్రేయస్కరం అని పేర్కొన్నారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారత్‌పై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కుతోంది. పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ వ్యవహారంపై రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలోనే అమెరికా స్పందించింది. చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..! -
మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు..
బ్యాంకాక్: థాయ్‌లాండ్ సముద్రజలాల్లో ఆ దేశ యుద్ధనౌక ఒకటి మునిగిపోయింది. ఆ ఘటనలో 75 మందిని కాపాడారు. అయితే 31 మంది నావికుల జాడ తెలియాల్సి ఉంది. వీరి కోసం థాయ్‌లాండ్ నావికాదళ హెలికాప్టర్లు, నౌకల్లో సైన్యం అన్వేషణ పనుల్లో నిమగ్నమైంది. ప్రచుయాప్ ఖిరి ఖాన్ ప్రావిన్స్‌లోని బాంగ్‌సఫాన్ జిల్లాలోని సముద్ర తీరం నుంచి 32 కిలోమీటర్ల దూరంలో సముద్రజలాల్లో హెచ్‌టీఎంఎస్ సుఖోథాయ్ యుద్ధనౌక గస్తీ కాస్తోంది. ఆ ప్రాంతంలో వేటకొచ్చే చేపలపడవల సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సహాయక కార్యక్రమాల బాధ్యతలను ఈ నౌక చూసుకునేది. ఆదివారం రాత్రి భారీ అలలు ఈ నౌకను అతలాకుతలం చేశాయి. సముద్రనీరు చేరడంతో నౌకలో విద్యుత్ వ్యవస్థ స్తంభించడంతో నావికులు నౌకను అదుపుచేయడంలో విఫలమయ్యారు. దీంతో పక్కకు ఒరగడం మొదలై పూర్తిగా మునిగిపోయింది. 75 మందిని కాపాడగా మిగతా వారి గాలిస్తున్నారు. చదవండి: పాకిస్తాన్లో రెచ్చిపోయిన తాలిబన్లు.. పోలీస్ స్టేషన్‌ను సీజ్ చేసి.. -
ప్రభుత్వంపై విమర్శలు.. ప్రముఖ నటి అరెస్ట్
కైరో: ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై అసత్యాలను ప్రచారం చేశారనే ఆరోపణలపై ప్రముఖ నటి తరానెహ్ అలీదూస్తి (38) శనివారం అరెస్టయ్యారు. నిరసనలకు మద్దతు ప్రకటించిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే అరెస్టవడం తెలిసిందే. ఆందోళనల్లో పాలుపంచుకున్నారంటూ గత రెండు నెలల్లో ఇద్దరిని ఉరి తీశారు. ఈ చర్యలను తరానెహ్ సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండించారు. గతంలోనూ ఆమె ప్రభుత్వ వైఖరిని నిరసించారు. ఆస్కార్ గెలుచుకున్న ‘ది సేల్స్‌మ్యాన్’తో పాటు ది బ్యూటిఫుల్ సిటీ, ఎబవుట్ ఎల్లీ వంటి హాలీవుడ్ సినిమాల్లో తరానెహ్ నటించారు. చదవండి: విషాదం.. అమెరికాలో భారత వ్యాపారవేత్త మృతి -
సాక్షినేషనల్ న్యూస్ @ 18 డిసెంబర్ 2022
-
అవసరమైతే అణుబాంబు వాడతాం.. భారత్‌కు పాక్ మంత్రి బెదిరింపులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మంత్రి షాజియా మర్రి నోరుపారేసుకున్నారు. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. తమ వద్ద అణుబాంబు ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. అవసరమైతే దాన్ని ఉపయోగించేందుకు తాము వెనుకాడబోమని పరోక్షంగా అణుయుద్ధం బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రధాని మోదీ ప్రభుత్వం యుద్ధానికి దిగితే తాము దీటుగా బదులిస్తామని భేషజాలకు పోయారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరునాడే షాజియా భారత్‌పై నోరుపారుసుకోవడం చూస్తుంటే.. వాళ్ల అక్కసు స్పష్టమవుతోంది. కాగా.. మోదీపై భుట్టో అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శనివారం దేశ్యవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఆమె దిష్టిబొమ్మను దహనం చేసింది. భారత్‌లో మోదీ గాంధీ సిద్ధాంతాలను కాకుండా హిట్లర్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నారని భుట్టో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఉత్తర కొరియా మిసైల్ ప్రయోగం.. జపాన్‌లో ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటన -
ఆ గ్రామానికి యజమాని కావాలట.. కారుచౌకగా అమ్మేస్తున్నారు!
స్పెయిన్ నైరుతి ప్రాంతంలోని ఒక ఊరు కారుచౌకగా అమ్మకానికి ఉంది. సాల్టో డి క్యాస్ట్రో అనే ఊరి ధర 2.60 లక్షల యూరోలు మాత్రమే! అంటే, రూ.2.24 కోట్లు అన్నమాట. బ్రిటన్‌లోని సగటు ఇంటి ధర కంటే ఈ ఊరి ధర చాలా తక్కువ. పోర్చుగీసు సరిహద్దుల్లో ఉన్న ఈ ఊరి నుంచి మాడ్రిడ్ నగరానికి మూడు గంటల్లో చేరుకోవచ్చు. ఈ ఊళ్లో 44 ఇళ్లు, ఒక హోటల్, ఒక చర్చి, ఒక స్కూలు, మునిసిపల్ స్విమింగ్ పూల్, బ్యారక్స్ బిల్డింగ్ ఉన్నాయి. ఇన్ని వసతులు ఉన్నా, ఈ ఊరు దాదాపు ముప్పయ్యేళ్లుగా ఖాళీగానే ఉంది. నిజానికి ఇక్కడ సాల్టో డి క్యాస్ట్రో ఊరిని ఒక విద్యుదుత్పాదక సంస్థ తన ఉద్యోగులు, కార్మికుల కోసం నిర్మించింది. ఊరికి దగ్గర్లోనే రిజర్వాయర్ ఉంది. ఇక్కడ జలవిద్యుత్తు ప్రాజెక్టు పూర్తికావడంతో, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు ఇక్కడి నుంచి తరలిపోయారు. అప్పటి నుంచి ఊరు ఖాళీగానే ఉంటోంది. జనాలు లేని ఈ ఊరిని తిరిగి జనావాసంగా మార్చడానికి ఇరవయ్యేళ్ల కిందటే స్పెయిన్ ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేసినా, అవేవీ సఫలం కాలేదు. చివరకు ఈ ఊరిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఇదివరకు 6.5 మిలియన్ యూరోల (రూ.560.63 కోట్లు) ధర నిర్ణయించగా, కొనడానికి ఎవరూ రాలేదు. ఆ తర్వాత విడతల వారీగా ధర తగ్గిస్తూ వచ్చినా ఫలితం లేకపోయే సరికి, ఇప్పుడు కారుచౌకగా ఊరిని తెగనమ్మేందుకు సిద్ధపడ్డారు. -
మలేసియా నూతన ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. మద్ధతిచ్చిన బద్ధ శత్రువు
కౌలాలంపూర్: మలేసియా సీనియర్ నేత, సంస్కరణలవాదిగా పేరున్న అన్వర్ ఇబ్రహీం(75) ఆ దేశ నూతన ప్రధానమంత్రి అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ 112 సీట్లు కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్వర్ నేతృత్వంలోని అలయెన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు గెలుచుకుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కక హంగ్ ఏర్పడటంతో రాజు జోక్యం చేసుకున్నారు. అన్వర్ సారథ్యంలోని ఐక్య కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు బద్ధ వ్యతిరేకి, దీర్ఘకాలం అధికారంలో ఉన్న యునైటెడ్ మలయీస్ నేషనల్ ఆర్గనైజేషన్ అనూహ్యంగా ముందుకు వచ్చింది. దీంతో సందిగ్ధానికి తెరపడింది. నేషనల్ ప్యాలెస్‌లో గురువారం రాజు సుల్తాన్ అహ్మద్ షా ప్రధానిగా అన్వర్‌తో ప్రమాణం చేయించారు. చదవండి: కిమ్‌కి అంత భయమా?.. ట్రంప్‌ని మించి పోయాడు! -
ఇండోనేసియా భూకంపం.. 268కి చేరిన మృతులు
జకార్తా: ఇండోనేసియాలోని జావా దీవిలో సోమవారం వచ్చిన భూకంపంలో మృతుల సంఖ్య 268కి పెరిగింది. మరో 151 మంది జాడ తెలియాల్సి ఉందని, 1,083 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వారిలో 300 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులేనని పశ్చిమ జావా గవర్నర్ చెప్పారు. 13 వేల నివాసాలు దెబ్బతిన్నాయని చెప్పారు. మరిన్ని ప్రకంపనలు సంభవించవచ్చనే భయాందోళనల మధ్య ప్రజలు రోడ్లపైనే చీకట్లో గడిపారు. మంగళవారం దేశాధ్యక్షుడు జోకో విడొడొ సియంజుర్‌లో పర్యటించారు. చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. 38 మంది సజీవదహనం -
ఘోర అగ్ని ప్రమాదం.. 38 మంది సజీవదహనం
బీజింగ్: చైనాలోని హినాన్ ప్రావిన్స్‌లోని ఒక వస్త్ర పరిశ్రమలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద విషయం తెలియగానే హుటాహుటిన 240 మంది అగ్నిమాపక సిబ్బంది , 63 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు సిబ్బంది నాలుగు గంటలకుపైగా శ్రమించాల్సి వచ్చింది. వెన్ఫెంగ్ జిల్లాలోని అన్యాంగ్ సిటీలో సోమవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా నిప్పురవ్వలు చెల్లాచెదురుగా నూలు వ్రస్తాలకు మంటలంటుకున్నాయి. అగ్నికీలలు వేగంగా వ్యాపించి దారుణం జరిగిందని పోలీసులు అంచనాకు వచ్చారు. నిబంధనలను ఆ ఫ్యాక్టరీ పూర్తిగా ఉల్లంఘించిందని స్థానిక యంత్రాంగం మండిపడింది. ఈ దుర్ఘటనపై అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పందించారు. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలని, కారకులను కఠినంగా శిక్షించాలని ఆదేవించారు. అనుమానితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. 2015 ఆగస్టులో చైనాలో ఇంతకుమించిన ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తియాంజిన్ నౌకాశ్రయంలో 700 టన్నుల సోడియం సైనేడ్ సహా విషతుల్య రసాయనాలను భద్రపరిచిన భారీ గిడ్డంగికి మంటలంటుకున్నాయి. దాంతో 170 మందికిపైగా మరణించారు. ఇటీవల చైనాలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. చదవండి: కరోనా తరహా కొత్త మహమ్మారుల జాబితా తయారీ! -
ఆరు నెలల తర్వాత చైనాలో తొలి కరోనా మరణం
బీజింగ్: చైనాలో దాదాపు ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం సంభవించింది. ఆ దేశ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు 'జీరో కోవిడ్ పాలసీ' పేరిట కఠిన ఆంక్షలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది డ్రాగన్ దేశం. ఇప్పుడు మరణించిన వ్యక్తి బీజింగ్‌కు చెందిన వృద్ధుడు అని అధికారులు తెలిపారు. వయసు 87 ఏళ్లు అని పేర్కొన్నారు. ఈయన మృతితో చైనాలో కోవిడ్ మరణాల సంఖ్య 5,227కు చేరింది. చివరిసారిగా మే 26న షాంగైలో కరోనా మరణం నమోదైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే మరో వ్యక్తి వైరస్ కారణంగా చనిపోయాడు. చైనాలో దాదాపు 92 శాతం మంది కనీసం ఒక్కడోసు కరోనా టీకా తీసుకున్నారు. అయితే వృద్ధులకు టీకాలు సరిగా పంపిణీ చేయలేదని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరణించిన వ్యక్తి కూడా టీకా తీసుకున్నాడా? లేదా? అనే విషయంపై ఆరోగ్య శాఖ స్పష్టత ఇవ్వలేదు. కరోనా కట్టడికి ప్రపంచంలో ఏ దేశమూ అమలు చేయని విధంగా జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తోంది చైనా. కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్డౌన్ సహా కఠిన ఆంక్షలు విధిస్తోంది. వ్యాపారం, ఆర్థికవ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతున్నప్పటికీ ఆంక్షల విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. చైనాలో ఇప్పటివరకు 2,86,197 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారినపడిన వారిలో 2,60,141 మంది కోలుకున్నారు. చదవండి: ఉక్రెయిన్‌కి సాయం అందిస్తాం: రిషి సునాక్ -
రష్యా భీకర దాడులకు 437 మంది ఉక్రెయిన్ చిన్నారులు బలి
కీవ్: రష్యా తమపై చేస్తున్న దండయాత్రలో ఇప్పటివరకు 437 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపింది. మరో 837 మంది చిన్నారులు గాయపడినట్లు వెల్లడించింది. ఇంకా మొత్తం లెక్కలు సేకారించాల్సి ఉందని, ఈ సంఖ్య పెరగవచ్చని పేర్కొంది. రష్యా దాడుల్లో తూర్పు డొనెస్క్ ప్రాంతంలోని చిన్నారులు అత్యంత తీవ్రంగా ప్రభావితమైనట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఈ ఏరియాలో 423 చిన్నారులు బాధితులుగా ఉన్నట్లు వివరించింది. రష్యాతో యుద్ధంలో 16,295 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నారు. ఫిబ్రవరి 24న మొదలైన ఈ యుద్ధం భారీ ప్రాణ, నష్టాన్ని మిగుల్చుతోంది. నెలలు గడుస్తున్నా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని రష్యా, చర్చలకు వెళ్లేది లేదని ఉక్రెయిన్ చెబుతున్నాయి. దీంతో ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కన్పించడం లేదు. చదవండి: గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన అపార్ట్మెంట్.. 9 మంది దుర్మరణం -
కూతురిని ప్రపంచానికి పరిచయం చేసిన కిమ్..
-
గ్యాస్ సిలిండర్ పేలి కుప్పకూలిన అపార్ట్మెంట్.. 9 మంది దుర్మరణం
మాస్కో: రష్యా ఐలాండ్ సఖాలిన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఐదు అంతస్తుల అపార్ట్మెంట్లోని ఓ బ్లాక్ కుప్పకూలింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. మరొకరు శిథిలాల కింద చిక్కుకున్నారు. అధికారులు అత్యవసర సేవలు చేపట్టారు. మిగిలిన వ్యక్తిని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అయితే అపార్ట్మెంట్లోని బ్లాక్‌లో 20 లీటర్ల వంటగ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్! -
వైరల్ వీడియో.. రష్యా క్షిపణులను పేల్చేసిన ఉక్రెయిన్
కీవ్: ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వరుసగా ఎదురదెబ్బలు తింటున్న పుతిన్ దేశం.. మరోమారు ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. బాంబుల వర్షం కురిపిస్తూ హడలెత్తించింది. ఉక్రెయిన్‌లో శీతాకాలం ప్రారంభమై ఉష్ణోగ్రతలు పడిపోయిన తరుణంలో విద్యుత్ మౌలికసదుపాయాలే లక్ష్యంగా భీకరదాడులు చేసింది. అయితే రష్యా క్షిపణి దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. క్రెమ్లిన్‌కు చెందిన క్రూజ్ మిసైల్స్‌ను నిర్వీర్యం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ గగనతలంలోకి రెండు రష్యా క్షిపణలు దూసుకువచ్చాయి. వీటిని పసిగట్టిన ఉక్రెయిన్ సేనలు తమ మిసైల్స్‌ను ఉపయోగించి రష్యా క్షిపణులను పేల్చివేశాయి. ఈ దృశ్యాలను ప్రత్యక్ష సాక్షి తన ఫోన్లో వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయింది. Spectacular footage: Two Russian Kalibr cruise missiles shot down within seconds over Kyiv Oblast on Nov. 15. First is audible explosion and glow on horizon, second a clear view of interception by German Iris-T air defense system. pic.twitter.com/bDp1twuzJB — Euan MacDonald (@Euan_MacDonald) November 17, 2022 చదవండి: అమెరికా అధ్యక్ష బరిలో బరాక్ ఒబామా భార్య.. స్పందించిన మిచెల్ -
పోలాండ్‌పై మిసైల్ దాడిలో ట్విస్ట్.. అది రష్యా పని కాదు..!
వాషింగ్టన్: పోలాండ్ సరిహద్దు గ్రామం ప్రెజెవోడో సమీపంలో మిసైల్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మిసైల్‌పై 'మేడ్ ఇన్ రష్యా' అని ఉండటంతో అంతా రష్యానే ఈ దాడికి పాల్పడిందని భావించారు. పోలాండ్ కూడా రష్యా రాయబారికి ఈ విషయంపై సమన్లు పంపింది. అయితే ఈ ఘటనపై అమెరికా కీలక విషయం వెల్లడించింది. ఈ దాడికి పాల్పడింది రష్యా కాదని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పింది. రష్యా మిసైల్స్‌ను ఉక్రెయిన్ నిలువరించే క్రమంలో పొరపాటున ఓ మిసైల్ పొరుగుదేశమైన పోలాండ్ సరిహద్దులో పడిందని పేర్కొంది. ఉక్రెయిన్ ఫైరింగ్ వల్లే రష్యా మిసైల్ పోలాండ్‌లో పడినట్లు అమెరికా నిఘా అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం జీ20 సదస్సులో భాగంగా ఇండోనేషియా బాలిలో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. పోలాండ్ మిసైల్ ఘటన వెంటనే అప్రమత్తమై జీ20 సదస్సులో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మిసైల్ దాడి రష్యా చేసినట్లు కన్పించడం లేదని ఆయన కూడా ఇప్పటికే సూత్రప్రాయం తెలిపారు. పోలాండ్ కూడా ఈ పని చేసింది రష్యానే అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే పేర్కొంది. చదవండి: పోలాండ్‌లో మిస్సైల్ అటాక్.. టెన్షన్లో జో బైడెన్! -
కాలువలోకి దూసుకెళ్లిన మినీబస్సు.. 22 మంది దుర్మరణం
కైరో: ఈజిప్టు ఉత్తర డకాలియా ప్రావిన్స్ అగ పట్ణణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ప్రయాణిస్తున్న ఓ మినీబస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ఈ దుర్ఘటనలో 22 మంది దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మొత్తం 18 అంబులెన్సులను పంపి బాధితులను రెండు ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులున్నారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు లక్ష ఈజిప్ట్ పౌండ్లను పరిహారంగా ప్రకటించింది ప్రభుత్వం. ఈజిప్ట్‌లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రహదారులు సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ఏటా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2021లోనే 7,000 మందికిపైగా వివిధ ప్రమాదాల్లో చనిపోయారు. గత నెలలో కూడా మినీబస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. -
ట్విట్టర్ ఆర్థిక పరిస్థితిపై ఎలాన్ మస్క్ హెచ్చరిక
-
ఇజ్రాయెల్ పయనం ఎటు?
సర్వేల జోస్యాన్ని నిజం చేస్తూ ఇజ్రాయెల్ ఎన్నికల్లో లికుడ్ పార్టీ నేతృత్వంలోని అతి మితవాద, మత, ఛాందసవాద పార్టీల కూటమి ఘనవిజయం సాధించింది. ఆ కూటమి 120 స్థానాలున్న పార్లమెంటులో 64 గెల్చుకుని సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలెట్టింది. ఈ నెల 1న జరిగిన ఈ ఎన్నికలు మితవాద పక్షాలకు దేశ చరిత్రలో తొలిసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకామిచ్చాయి. అవినీతి ఆరోపణల్లో విచారణ నెదుర్కుంటూ రాజకీయంగా మసకబారుతున్న విపక్ష లికుడ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఈ ఫలితాలు తిరుగులేని నేతగా స్థిరపరిచాయి. నాలుగేళ్లకోసారి జరగాల్సిన పార్లమెంటు ఎన్నికలు అస్థిర రాజకీయాల కార ణంగా మూడున్నరేళ్లలో అయిదోసారి వచ్చిపడటంతో దేశ పౌరులు విసుగుచెందారనీ, పరస్పరం పొసగని పక్షాలున్న కూటమిని నమ్ముకోవటం కంటే పక్కా మితవాదంవైపు పోవటమే సరైందన్న నిర్ణయానికొచ్చారనీ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు గద్దె దిగబోతున్న మధ్యేవాద కుడి, ఎడమ పక్షాలు, అరబ్‌ల పార్టీల కూటమి ప్రభుత్వం దేశంలో సామరస్యత నెలకొల్పడం మాట అటుంచి మెరుగైన ఆర్థికాభివృద్ధికి దోహదపడే చర్యలు తీసుకోలేకపోయింది. ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగాన్ని అరికట్టలేకపోయింది. అందుకే ఆ కూటమి 51 సీట్లకు పరిమితమైంది. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో పదవీభ్రష్టుడైన నెతన్యాహూ ఆ కూటమి వైఫల్యాలను పూర్తిగా తనకనుకూలంగా మార్చు కోగలిగారు. జియోనిస్టు పార్టీ, మరో రెండు తీవ్ర ఛాందసవాద పక్షాలనూ కలుపుకొని కూటమి కట్టారు. మూడు దశాబ్దాలుగా పార్లమెంటులో చెప్పుకోదగ్గ స్థానాలతో వెలిగిన వామపక్షం మెరెట్జ్ ఈసారి కొన్ని వేల ఓట్లకే పరిమితమై చట్టసభకు వెలుపలే ఉండిపోయింది. సమస్యల మాటెలా ఉన్నా మితవాద కూటమి అధికారం మెట్లెక్కడంలో మీడియా ప్రధాన పాత్ర పోషించింది. జియోనిస్టు పార్టీ నేత బెన్ గవీర్కు అపరిమితమైన ప్రచారమిచ్చి ఆయన పార్టీ దూసుకుపోయేందుకు దోహదపడింది. ఈ ప్రచారం ఏ స్థాయిలో సాగిందంటే ఆయనతో కూటమి కట్టి లాభపడిన నెతన్యాహూ సైతం అది మోతాదు మించిందని అంగీకరించాల్సి వచ్చింది. ఇదిగాక వాట్సాప్, టెలిగ్రాం యాప్‌లలో వందకుపైగా గ్రూపులు ఏర్పాటుచేసి బెన్ గవీర్ స్వీయ ప్రచారంతో హోరెత్తించారు. ఎప్పటికైనా ప్రజా భద్రతా మంత్రినవుతానని బెన్ గవీర్ నిరుడు జోస్యం చెప్పిన ప్పుడు ఆ పదవికి ఆయన పనికిరాడని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు. తీరా రాజకీయ అవసరాల రీత్యా అదే పార్టీతో కూటమి కట్టక తప్పలేదు. ఇప్పుడాయనను మంత్రిని చేసి, ప్రజా భద్రత శాఖ అప్పగించినా ఆశ్చర్యం లేదు. స్వదేశంలోనే యూదులకు రక్షణ కరువైందనీ, ఉగ్రవాదులు ఏ నిబంధనలకూ లోబడకుండా దాడులు చేస్తుంటే వారిపై పోరాడే సైనికులకు నిబంధనలు సంకెళ్లుగా మారుతున్నాయనీ బెన్ గవీర్ తరచు వాపోయేవారు. ఈ మాదిరి ఉపన్యాసాలు యూదుల్ని బాగా ఆకట్టుకున్నాయి. పైగా 1994లో ఒక మసీదులో తలదాచుకున్న 29 మంది పాలస్తీనా పౌరులను ఊచకోత కోసిన బరూక్ గోల్డ్స్టీన్ను ఆయన తన ఆరాధ్యదైవంగా చెప్పుకుంటారు. సంక్షోభం ఆవరించిన సమాజంలో ఉద్రేకపూరిత ఉపన్యాసాలు జనాన్ని ప్రభావితం చేస్తాయి. బెన్ గవీర్ ఆ పని సమర్థవంతంగా చేయగలిగారు. మధ్యేవాద మితవాద పక్షం యామినా పార్టీ అరబ్పార్టీలున్న కూటమికి నేతృత్వం వహించటం యూదులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో మెజారిటీ యూదులు అతి మితవాద పక్షమైన లికుడ్ పార్టీకి, ఛాందసవాద జియోనిస్టు పార్టీకి వలస పోయారు. విభేదాలున్నా కలిసి పనిచేద్దామని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు మెరుగైన పరి ష్కారం చూపుదామని జతకట్టిన ఎనిమిది పక్షాల కూటమి ప్రభుత్వం నడపటంలో, ఆర్థిక సమస్య లను అరికట్టడంలో వైఫల్యాలే చవిచూసింది. అంతర్గత పోరుతో సతమతమైంది. ఇప్పుడు గద్దెనెక్కబోతున్న కూటమిలోని జియోనిస్టు పార్టీ ప్రతిపాదనలు సామాన్యమైనవి కాదు. న్యాయవ్యవస్థను సమూల ప్రక్షాళన చేయాలన్నది దాని ప్రధాన డిమాండ్. పార్లమెంటు చేస్తున్న చట్టాలను సుప్రీంకోర్టు ఇష్టానుసారం కొట్టివేస్తున్నదనీ, ఇది దేశ భద్రతకు చేటు తెస్తున్నదనీ ఆ పార్టీ చాన్నాళ్లుగా ఆరోపిస్తోంది. దీన్ని నిజంగా అమలు చేయటం మొదలుపెడితే న్యాయవ్యవస్థ బలహీనపడుతుందనీ, న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ పక్షాలదే పైచేయి అవుతుందనీ చాలామంది కలవరపడుతున్నారు. ఇప్పటికే మూడు అవినీతి ఆరోపణల్లో విచారణను ఎదుర్కో బోతున్న నెతన్యాహూకు ఇది తోడ్పడుతుందని వారి భావన. అన్ని స్థాయుల్లోనూ ఎక్కడికక్కడ వ్యవస్థాగతమైన నిఘా ఉన్నప్పుడే, దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పుడే వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుంది. తిరుగులేని అధికారం చలాయించే నేతకు అది సాగిలపడితే సర్వం అస్తవ్యస్థ మవుతుంది. పరోక్షంగా తనకు లాభదాయకమైన ప్రతిపాదన చేస్తున్నారన్న ఉబలాటంతో బెన్ గవీర్ను రాజకీయంగా అదుపు చేయటంలో నెతన్యాహూ విఫలమైతే... పాలస్తీనాపై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలంగా అండదండలందిస్తున్న అమెరికా సైతం వర్తమాన అంత ర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరకాటంలో పడుతుంది. దాన్నుంచి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు లభించవు. అంతిమంగా ఏ దేశ పౌరులైనా సామరస్యతనూ, ప్రశాంతతనూ, ఆర్థిక సుస్థిరతనూ కోరుకుంటారు. ఇవన్నీ సుసాధ్యం చేసినప్పుడే నెతన్యాహూకు యూదుల నిజమైన ఆదరణ దొరకుతుంది. -
మా వైఫల్యం వల్లే ఆ 156 మంది చనిపోయారు: పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్
సియోల్: రాజధాని సియోల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు తమ వైఫల్యమే కారణమని దేశ పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ అంగీకరించారు. హాలోవిన్ ఉత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 156 మంది చనిపోగా, మరో 151 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 26 మంది పరిస్థితి విషమంగా ఉంది. ‘జరగబోయే ప్రమాదం గురించి ఘటనకు ముందు అందిన అత్యవసర ఫోన్‌కాల్స్‌పై మా అధికారులు సరిగా స్పందించలేదని తేలింది. వెంటనే చర్యలు తీసుకుని ఉంటే విషాదం నివారించగలిగే వారం. ప్రభుత్వ విభాగం అధిపతిగా ఈ దుర్ఘటనకు నాదే బాధ్యత’ అని యూన్ చెప్పారు. ఈ దుర్ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. మృతి చెందిన 156 మందిలో 101 మంది మహిళలుండగా వీరిలో ఎక్కువ మంది టీనేజర్లని ప్రభుత్వం తెలిపింది. పురుషులతో పోలిస్తే వీరు తక్కువ ఎత్తు ఉండటం, శారీరకంగా తక్కువ బలవంతులు కావడంతో తోపులాటలో ఛాతీ ఎక్కువ ఒత్తిడికి గురై ఊపిరాడక చనిపోయారని పేర్కొంది. హాలోవీన్ ఉత్సవాల కోసం 137 మంది అధికారులను కేటాయించామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వీరికి డ్రగ్స్ వాడకాన్ని నివారించే బాధ్యతలే తప్ప, బందోబస్తు విధులను కేటాయించలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నిర్వాహకులెవరూ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని భావిస్తున్నామన్నారు. మృతుల్లో అమెరికా, చైనా, రష్యా, ఇరాన్ తదితర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. చదవండి: ఎవరెస్ట్ నేర్పే పాఠం ఎలాంటిదంటే.. -
ట్విట్టర్ లోకి ట్రంప్ రీ ఎంట్రీ ..?
-
ఏక నాయకత్వం చైనాకు మేలేనా?
మావోయిస్టు అతివాదపు విధ్వంసక దశాబ్దాల అనంతరం సామూహిక నాయకత్వ శైలిని చేపట్టేలా చైనా కమ్యూనిస్టు పార్టీని ముందుకు నడిపారు డెంగ్ జియావోపింగ్. తదనుగుణంగా అధ్యక్ష పదవిని ఎవరైనా రెండు సార్లే చేపట్టేలా, పదవీ విరమణ వయసు 68 ఏళ్లకే పరిమితమయ్యేలా నిర్ణయమైంది. ఏక నాయకుడి అధికారానికి చెక్ పెట్టే ప్రయత్నమది. కానీ జిన్‌పింగ్ ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టేశారు. పార్టీ 20వ కాంగ్రెస్ ముగింపు రోజున పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యులను వేదికపై పెరేడ్ చేయించినప్పుడు జిన్‌పింగ్ అధికార కేంద్రీకరణ స్వరూపం తేటతెల్లమైంది. తన అధికారం మీద ఏ తనిఖీ లేని అధినేత పాలన తెచ్చే పర్యవసానాలను చైనా మరోసారి ఎదుర్కోవలసి ఉంటుంది. ఇటీవల ముగిసిన చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 20వ కాంగ్రెస్ సాధించిన అతి ముఖ్యమైన ఫలితం ఏమిటంటే, పార్టీ జనరల్ సెక్రటరీగా షీ జిన్‌పింగ్ మూడోసారి ఎన్నికై రికార్డు సృష్టించడమే. మరోరకంగా చెప్పాలంటే, చైనా ప్రజా రిపబ్లిక్ అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పొడిగింపునకు ఇది నాంది. అలాగే, శక్తిమంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా మరో పర్యాయం తన పొడిగింపునకు, బహుశా జీవితకాల పొడిగింపునకు కూడా ఇది నాంది. ► మావోయిస్టు అతివాదానికి సంబంధించిన విధ్వంసక దశాబ్దాల అనంతరం చైనాకు నాయకత్వం వహించిన డెంగ్ జియావోపింగ్, సామూహిక నాయకత్వ శైలిని చేపట్టేలా చైనా కమ్యూనిస్టు పార్టీని ముందుకు నడిపించారు. తదనుగుణంగా అధ్యక్ష పదవిని ఎవరైనా రెండు సార్లు మాత్రమే చేపట్టాలనీ, విరమణ వయసును 68 సంవత్స రాలకు పరిమితం చేయాలనీ పార్టీ నిర్ణయించింది. కానీ 2017లో జరిగిన 19వ పార్టీ కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవికి పరిమితులు ఎత్తివేసి, అత్యంత శక్తిమంతుడిగా ఆవిర్భవించేలా జిన్‌పింగ్ ఈ నిబంధనలు అన్నింటినీ పక్కనపెట్టేశారు. ► కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగంలో రెండు కీలకమైన రాజకీయ భావనలను ప్రవేశపెట్టడంతో జిన్‌పింగ్ శక్తి నిరూపితమైంది. పార్టీలో ‘రెండు వ్యవస్థాపనలు’ అనే ఈ భావనలు జిన్‌పింగ్‌ని ‘కోర్’ గానూ, ఆయన భావాలను పార్టీ పాలనలో కీలకమైన సిద్ధాంతంగానూ ఆమో దించాయి. ఇక ‘రెండు రక్షణలు’ అనేవి జిన్‌పింగ్ స్థాయిని, చైనాలో పార్టీ కీలక పాత్రను పరిరక్షించాలని పిలుపునిచ్చాయి. ► 20వ కాంగ్రెస్ ముగింపు రోజున చైనాలో కీలక పాలనా బృందమైన కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ (పీబీఎస్సీ) సభ్యులను వేదికపై పెరేడ్ చేయించినప్పుడు జిన్‌పింగ్ అధికార కేంద్రీకరణ స్వరూపం స్పష్టంగా కనిపించింది. వారంతా జిన్‌పింగ్ కీలక మిత్రులు. వారి నియామకానికి విధేయతే కీలక అంశంగా నిలిచిందని సంకేతమిచ్చింది. ► సీపీసీ అపెక్స్ బాడీలో జిన్‌పింగ్ తర్వాత నంబర్ 2 ఎవరంటే లీ క్వియాంగ్. నూతన ప్రభుత్వాన్ని ఎంచుకోవడానికి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 2023 మార్చిలో సమావేశమవుతున్నప్పుడు ప్రధానమంత్రి లీ కికియాంగ్ స్థానంలో ప్రధాని కాబోయేది లి క్వియాంగే మరి. లీ క్వియాంగ్ ప్రస్తుతం షాంఘైలో సీపీసీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. ఇక కొత్తగా నియమితులైన ఇతరులు ఎవరంటే– బీజింగ్ పార్టీ అధ్యక్షుడు కై క్వి, షీ జిన్‌పింగ్ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డింగ్ గ్సూగ్జియాంగ్, గ్వాంగ్ డాంగ్ రాష్ట్ర పార్టీ నేత లీ షీ. ► ప్రధాని లీ కికియాంగ్, ఉపప్రధాని వాంగ్ యాంగ్లను పీబీఎస్సీ నుంచి తొలగించారు. ఈ ఇద్దరి వయస్సు 67 సంవత్స రాలు. మరొక దఫా కూడా వీరికి బాధ్యతలు ఇవ్వవచ్చని భావిం చారు. 67 సంవత్సరాలు వచ్చిన మరో నేత వాంగ్ హనింగ్ని మాత్రం తిరిగి ఎన్నుకున్నారు. ఆయన కూడా జిన్‌పింగ్ సహచరుడు. ఒక ప్పుడు జిన్‌పింగ్ వారసుడిగా పరిగణన పొందిన ఉపప్రధాని హు చున్హువా పీబీఎస్సీలో సభ్యత్వం పొందడంలో విఫలమయ్యారు. మొత్తంగా ఆయన్ని పొలిట్ బ్యూరో నుంచే తప్పించారు. ► నూతన నాయకుల జాబితాలో గుర్తించదగిన విషయం ఏమి టంటే, శిక్షణ పొందిన ఆర్థికవేత్త అయిన లీ కికియాంగ్ వంటి నేతలను తప్పించడమే. మరో ఇద్దరు ముఖ్యమైన నేతలను (పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ యీ గాంగ్, బ్యాంకింగ్ రెగ్యులేటర్ గువో షుకింగ్) కూడా కొత్త సెంట్రల్ కమిటీ నుంచి తప్పించారు. ఆర్థిక విధానాల్లో ఉదారవాద వైఖరిని ప్రదర్శించిన వారిని పదవుల నుంచి తప్పించా రని అంచనా. ► వ్యక్తిగత అధికారం మీద రాజ్యాంగ పరంగా ఉన్న ఒకే ఒక్క కీలక మైన పరిమితిని పక్కకు పెట్టేయడంతో, ఆ అధికారాన్ని వినియోగించ డంలో ఉన్న నియంత్రణలను కూడా జిన్‌పింగ్ పక్కకుపెట్టేస్తారని ఆందోళన నెలకొంది. జాతీయవాద విధానాలకు, చైనా రోజువారీ జీవితంలో సీపీసీ పాత్ర విస్తరణకు జిన్‌పింగ్ ప్రాధాన్యమిస్తారనేది తెలిసిన విషయమే. అలాగే ఆయనది తైవాన్‌పై కఠిన వైఖరి, పాశ్చాత్య దేశాలు, ఇండియా లాంటి ఇతర దేశాలతో ఘర్షణాత్మక వైఖరి. ► ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రతకు సంబంధించిన విధానాలకు జిన్‌పింగ్ రెట్టింపు ప్రాధాన్యత ఇస్తారని, పార్టీ కాంగ్రెస్‌కు మొట్ట మొదటి రోజునే ఇచ్చిన నివేదికలో ఇవి రెండూ కీలకమైన విష యాలుగా పేర్కొన్నప్పుడే అందరూ అంచనా వేశారు. ఆ తర్వాతి వారంలో సీపీసీ రాజ్యాంగంలో కొన్ని అంశాలను చొప్పించారు. ఈ నివేదిక రాబోయే అయిదేళ్ల కోసం మార్గదర్శక పత్రాన్ని అందజేసింది. ► జాతీయ కాంగ్రెస్‌లో చేసిన రెండు గంటల ప్రసంగంలో జిన్‌పింగ్ ఆర్థిక విధానం, భద్రతపై సీపీసీ ప్రాధాన్యతలను వివరించారు. రాజ్యాంగంలో సైన్స్, విద్యపై కొత్త సెక్షన్లు ఉన్నాయి. చైనా భవిష్యత్ ప్రణాళికలో పెరిగిన వీటి ప్రాధాన్యతను ఇవి సూచించాయి. దీని సారాంశం ఏమిటంటే, ‘చైనీయ లక్షణాల’తో కూడిన ఆధునికీకరణ, పాలన అనే. ఆర్థిక రంగం గురించి జిన్‌పింగ్ నొక్కి చెప్పడంలో ఉద్దేశం సైన్స్, టెక్నాలజీ అభివృద్ధిని ప్రోత్సహించాలని పిలుపునివ్వడమే. 2021లో ‘ఉమ్మడి సౌభాగ్యం’ కోసం పిలుపునిస్తూ జిన్‌పింగ్ స్వయంగా ఇచ్చిన నినాదం... మరింత సమాన పంపిణీ వైపుగా సాంప్రదాయ చైనా ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించడమే. అయితే ఆర్థిక ప్రగతిని ప్రోత్స హించే సమగ్ర విధానం కొనసాగుతుందని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ► అలాగే భద్రతపై జిన్‌పింగ్ నొక్కి చెప్పారు. అమెరికాపై తీవ్ర విమర్శ చేశారు. అమెరికా బ్లాక్ మెయిల్ చేయడానికీ, చైనాను దిగ్బంధించడానికీ, తీవ్రమైన ఒత్తిడిని సృష్టించడానికీ ప్రయత్ని స్తోందని ఆరోపించారు. 2027 నాటికి చైనా ప్రపంచస్థాయి సైన్యాన్ని కలిగి ఉంటుందని అతిశయించి చెప్పారు. వ్యూహాత్మక అణునిరోధ కతతో పాటుగా, నూతన పోరాట సామర్థ్యాలను సంతరించుకున్న కొత్త ప్రాదేశిక శక్తులను ప్రవేశపెడతామని చెప్పారు. ► భారత దృక్కోణం నుంచి చూస్తే– పీఎల్ఏ(సైన్యం) ఆధునీకరణ అంటే చైనా భద్రతాస్థితిని మెరుగుపరిచి, సంక్షోభాలను నిలువరించి, స్థానిక యుద్ధాలను గెలవడమే. ఇది కచ్చితంగా తైవాన్, భారత్‌లతో చైనాకున్న సమస్యలను ప్రస్తావిస్తోందంటే సందేహించవలసిన పనిలేదు. గల్వాన్ లోయలో భారత్ సైన్యంతో ఘర్షణలకు సంబంధిం చిన క్లిప్పులను కాంగ్రెస్ ప్రతినిధులకు ప్రదర్శించి చూపారంటే, చైనా విధాన నిర్ణేతల మనసుల్లో భారత్‌కు ఉన్న ప్రాధాన్యత ఏమిటో నిర్ధారణ అవుతోంది. ► అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి పదవీ కాలాలకు పరిమితి విధించడమనే భావనకు చరిత్రలోకి మళ్లాలి. దానికి జూలియస్ సీజర్, నెపోలియన్ వంటి శక్తిమంతుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. అయితే ఎనిమిది లేదా పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న నేతలు అలసిపోతారని ఆధునిక అనుభవం సూచిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, ఇరాన్ సుప్రీం అధినేత అయతుల్లా ఖొమైనీ, ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్, ఇంకా పలువురు ఆఫ్రికన్ ప్రభుత్వాధినేతల పాలనా రికార్డు దీన్నే నిరూపిస్తోంది. ► సామూహిక నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి డెంగ్ జియావో పింగ్ చేసిన ప్రయత్నాల్లో నిశ్చయమైన విజ్ఞత ఉంది. ఏక నాయకుడి అధికారాన్ని తనిఖీ చేసే ప్రయత్నమది. అయితే ఇలాంటి ఆంక్షలను జిన్‌పింగ్ తొలగించేశారు. తన అధికారం మీద ఏ తనిఖీ లేని తిరుగు లేని అధినేత పాలన తెచ్చే పర్యవసానాలను చైనా మరోసారి ఎదుర్కో వలసి ఉంటుంది. మనోజ్ జోషి, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే నాటికి పుతిన్ అవుట్!
కీవ్: రష్యాతో యుద్ధం ముగిసేనాటికి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పదవిలో ఉండరని చెప్పారు ఉక్రెయిన్ రక్షణ అధికారి కిరిలో బుడనోవ్. పుతిన్‌ను అధ్యక్షుడిగా తొలిగించేందుకు ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అతి త్వరలోనే పుతిన్ పదవిని కోల్పోతారని జోస్యం చెప్పారు. యుద్ధం మొదలైన తొలినాళ్లలో రష్యా ఆక్రమించుకున్న ఖేర్సాన్ను ఉక్రెయిన్ తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకుంటోంది. నవంబర్ నాటికి ఈ ప్రాంతమంతా మళ్లీ తమ అధీనంలోకి వస్తుందని బుడనోవ్ పేర్కొన్నారు. ఆ తర్వాత క్రిమియాను కూడా తిరిగి పొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాన్ని రష్యా 2014లోనే తమ భూభాగంలో విలీనం చేసుకుంది. సెప్టెంబర్ నుంచి రష్యా సేనలను చావుదెబ్బ కొడుతూ తమ ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకుంటోంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలోనే పుతిన్ పదవి కోల్పోతారని బుడనోవ్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ దాడులకు ప్రతిఘటనగా ఇటీవల డ్రోన్లతో క్షిపణుల వర్షం కురిపించింది రష్యా. విద్యుత్ కేంద్రంపై బాంబులతో విరుచుకుపడింది. దీంతో ఉక్రెయిన్‌లో 40 శాతం మంది ప్రజలు అంధకారంలోకి వెళ్లారు. అయినా ఏమాత్రం వెనక్కితగ్గకుండా రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నాయి కీవ్ సేనలు. తమ ప్రాంతాలని తిరిగి చేజిక్కించుకుంటున్నాయి. చదవండి: షాకింగ్.. బ్రిటన్ మాజీ ప్రధాని ఫోన్ హ్యాక్.. కీలక రహస్యాలు లీక్! -
ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో పేలుడు.. 10 మంది యువకులు మృతి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫుట్ స్టేడియం సమీపంలో భారీ పేలుడు సంభవించి 10 మంది మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్యారేజ్‌లో పేలుడు పదార్థాలున్న వాహనం పేలి మంటలు పక్కనే ఉన్న గ్యాస్ ట్యాంకర్‌కు వ్యాపించడంతో అది కూడా పేలి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా రోజూ ఫుట్‌బాల్ ఆడేందుకు స్టేడియానికి వచ్చే యువకులే అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఇరాక్ సైన్యం ప్రకటనలో తెలిపింది. పేలుడుకు గల కరాణాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. చదవండి: ఆస్పత్రులూ ఖాళీ.. ఖేర్సన్ నుంచి రష్యా సేనల పలాయనం -
ఆస్పత్రులూ ఖాళీ.. ఖేర్సన్ నుంచి రష్యా సేనల పలాయనం
కీవ్: ఖేర్సన్ ప్రాంతంపై మళ్లీ ఉక్రెయిన్ సైన్యం పట్టు సాధిస్తుండటంతో అక్కడి నుంచి రష్యా సేనలు పలాయనం చిత్తగించాయి. ‘యుద్ధంలో గాయపడి ఖేర్సన్ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న తోటి సైనికులను రష్యా బలగాలు వెంట తీసుకెళ్తున్నాయి. వెళ్తూ వెళ్తూ ఖేర్సన్‌లోని ఆస్పత్రులను నిరుపయోగం చేస్తున్నాయి. ఔషధాలు, ఉపకరణాలు, చివరకు అంబులెన్స్‌లనూ తరలిస్తున్నాయి. స్థానిక వైద్యులను తమతోపాటు రష్యాకు రావాలని బెదిరిస్తున్నాయి’ అని ఉక్రెయిన్ సాయుధ దళాల విభాగం శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. మరోవైపు, 2014 నుంచి రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియా ద్వీపకల్పంలోని రష్యా నౌకల్లో పేలుళ్లు సంభవించాయి. చదవండి: ఎగుమతి ఒప్పందం రద్దు చేస్తాం: రష్యా -
ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మాస్క్
-
ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు
-
డర్టీ బాంబ్‌పై బైడెన్ కీలక వ్యాఖ్యలు.. రష్యాకు హెచ్చరికలు..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఆ దేశం ఉక్రెయిన్‌పై అణు బాంబును ప్రయోగిస్తే క్షమించరాని తప్పిదం చేసినట్లే అని స్ఫష్టం చేశారు. శ్వేతసౌధంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డర్టీ బాంబ్(అణు బాంబ్)పై రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ బైడెన్ ఈమేరకు స్పందించారు. అణుబాంబుల గురించి వస్తున్న వార్తలు నిజమో కాదో తనకు తెలియదని, ఒకవేళ ఉక్రెయిన్‌పై రష్యా డర్టీ బాంబ్‌ను ప్రయోగిస్తే మాత్రం తీవ్ర తప్పిదం చేసినట్లేనని పేర్కొన్నారు. ఐరోపాలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంలో రష్యా రహస్యంగా కార్యకలాపాలు సాగిస్తోందని ఉక్రెయిన్ న్యూక్లియన్ ఎనర్జీ ఆపరేటర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే రష్యా మాత్రం ఉక్రెయినే డర్టీ బాంబ్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోందని ఆరోపించింది. తాము స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ ప్రాంతంలో దాడి చేయబోతుందని చెప్పింది. సొంతప్రజలపైనే అణుబాంబు ప్రయోగించి దాన్ని తమపై తోసేందుకు కుట్ర చేస్తోందని పేర్కొంది. ఖేర్సన్ నుంచి తమ బలగాలను ఖాళీ చేయిస్తోంది. డర్టీ బాంబ్ విషయంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనే తేల్చుకుంటామంది. మరోవైపు రష్యా ఆరోపణలను నాటో దేశాలు ఇప్పటికే ఖండించాయి. యుద్ధంలో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే రష్యా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నాయి. చదవండి: డర్టీ బాంబ్ పంచాయితీ భద్రతా మండలికి! -
రాజకీయాల్లోకి వచ్చిన ఏడేళ్లకే ప్రధాని.. చరిత్రలో ఒకేఒక్కడు రిషి..!
లండన్: కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బ్రిటన్ను గాడినపెట్టే బాధ్యతలు తీసుకున్న రిషి సునాక్‌కు మొదట్నుంచి ఆర్థిక వ్యవహారాల్లో మంచి పట్టు ఉంది. చిన్నతనంలో తల్లి పనిచేసే ఫార్మసీ షాప్‌లో పని చేసినప్పుడే వాటి జమా ఖర్చులన్నీ చూసేవారు. పెరిగిపెద్దయ్యాక ఎంబీఏ చదివి ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఎక్కువగా పనిచేశారు. ► భారతీయ కుటుంబానికి చెందిన రిషి సునాక్ యూకేలోని హ్యాంప్‌షైర్ సౌతంప్టన్‌లో మే 12, 1980లో జన్మించారు. ► తండ్రి యశ్వీర్ కెన్యాలోపుట్టి పెరిగారు. తల్లి ఉష సునాక్ టాంజానియలో పుట్టారు. ఆఫ్రికాలో భారతీయులపై దాడులకి భయపడి వారి కుటుంబం 1960 ప్రాంతంలోనే బ్రిటన్‌కు వలస వెళ్లిపోయింది. తండ్రి వైద్యుడు కాగా, తల్లి ఫార్మసీ నడిపేవారు. వారికి ఇద్దరు మగపిల్లలు. ఒక ఆడపిల్ల. రిషి అందరిలో పెద్దవాడు. తమ్ముడు సంజయ్ సైకాలజిస్టు కాగా, చెల్లి రాఖి ఐక్యరాజ్యసమితి విద్యా విభాగంలో చీఫ్ స్ట్రాటజిస్ట్‌గా పని చేస్తున్నారు. ► రిషి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా హాంప్‌షైర్‌లో సాగింది. కళాశాల విద్య వించెస్టర్‌లో చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ (పీపీఈ) 2001లో గ్రాడ్యుయేషన్ చేశారు. ► అమెరికాలోని కాలిఫోర్నియాలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. అక్కడే ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి పరిచయమయ్యారు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారి తీసింది. ► 2009, ఆగస్టులో అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. వారికి అనౌష్క, కృష్ణ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ► చదువుకున్న సమయంలో హాలీడేస్‌లో సౌథంప్టన్‌లో కర్రీ హౌస్‌లో వెయిటర్‌గా పనిచేశారు. 2001–2004 మధ్య ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, గోల్డ్‌మ్యాన్ సాచ్స్‌లో ఎనలిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత హెడ్జ్ ఫండ్స్‌లో(ప్రైవేటు ఇన్వెస్టర్ల సంపద) భాగస్వామిగా ఉన్నారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన కాటామారన్ వెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి 2013–2015 మధ్య డైరెక్టర్‌గా ఉన్నారు. ► 2015లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కన్జర్వేటివ్ పార్టీ తరఫున యార్క్‌షైర్‌లో రిచ్మండ్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ► థెరిసా మే రెండోసారి ప్రధాని అయినప్పుడు 2018లో స్థానిక వ్యవహారాల శాఖ ఉప మంత్రిగా పని చేశారు ► 2019 సాధారణ ఎన్నికల్లో రిచ్మండ్ నుంచే ఎన్నికై 60% ఓట్లను సాధించారు. ► బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో 2019, జులై 24న ట్రెజరీకి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. 2020లో అత్యంత కీలకమైన ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కాపాడుతూ భారీ ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించారు ► కోవిడ్‌పార్టీ గేట్ కుంభకోణంలో ఇరుకున్న బోరిస్ జాన్సన్ కేబినెట్ నుంచి వైదొలిగి ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. ► జాన్సన్ రాజీనామా చేసిన అనంతరం ప్రధాని పదవికి పోటీ పడ్డారు. అత్యధిక మంది ఎంపీలు ఆయనకు మద్దతునిచ్చినప్పటికీ టోరీ సభ్యుల ఓటింగ్‌లో లిజ్ ట్రస్ చేతిలో 21 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ► అపజయం ఎదురైన చోటే నెలన్నరలోనే సునాక్‌ని గెలుపు వరించడం విశేషం. ► రాజకీయాల్లోకి వచ్చిన ఏడేళ్లలోనే అక్టోబర్ 25న బ్రిటన్‌కు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. – సాక్షి, నేషనల్ డెస్కన్ చదవండి: ముందున్నది ముళ్లదారే.. రిషికి అంత ఈజీ కాదు..! -
ఓడలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవదహనం.. 226 మందిని..
జకర్తా: ఇండోనేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఓడలో మంటలు చెలరేగి 14 మంది సజీవదహనమయ్యారు. సముద్రంలో చిక్కుకున్న మరో 226 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఈస్ట్ నుసా టెంగర్రా ప్రావిన్స్‌లో కుంపాంగ్ నుంచి కలాబాహి వెళ్తున్న ఓడలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో ఓడలో 230 మంది ప్యాసెంజర్లు, 10 మంది సిబ్బంది కలిపి మొత్తం 240 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే అకస్మాతుగా మంటలు ఎందుకు చెలరేగాయనే విషయం తెలియరాలేదు. దీనిపై విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. 17 వేల ఐలాండ్స్కు నిలయమైన ఇండోనేసియాలో పడవ ప్రమాదాలు సర్వ సాధారణమయ్యాయి. ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించడం కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. 2018లో కూడా 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఓడ మునిగిన ఘటనలో 167 మంది జలసమాధి అయ్యారు. 19991లో జరిగిన మరో ఘటనలో సముద్రం మధ్యలో ఓడ మునిగి 332 మంది చనిపోయారు. 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఇండోనేసియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విషాద ఘటన కావడం గమనార్హం. చదవండి: బ్రిటన్ పీఎంగా రిషి.. మరి ఈ దేశాలను ఏలుతోంది మనోళ్లేనని తెలుసా? -
పోటీ నుంచి తప్పుకున్న బోరిస్.. బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్!
లండన్: భారత సంతతికి చెందిన రిషి సునాక్.. బ్రిటన్ కొత్త ప్రధాని కావడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఇక రేసులో మిగిలి ఉన్న పెన్నీ మోర్డాంట్‌కు కేవలం 29 మంది ఎంపీల మద్దతే ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 100 మంది ఎంపీల సపోర్ట్ లేకుండా ఆమె పోటీ చేయడం అసాధ్యం. సోమవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా ఆమె 100 మంది సభ్యుల మద్దతు ఉందని నిరూపించుకోలేకపోతే.. 142 మంది సభ్యుల మద్దతున్న రిషి సునాక్ ఆటోమేటిక్‌గా ప్రధాని అవుతారు. ఫలితంగా బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా సరికొత్త చరిత్ర సృష్టిస్తారు. పోటీ చేస్తానని తప్పుకున్న బోరిస్.. లిజ్ ట్రాస్ రాజీనామా చేయగానే.. ప్రధాని పదవి కోసం బోరిస్ మరోసారి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కూడా వేగంగా పావులు కదిపారు. దాదాపు 100 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపినట్లు సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. దీంతో పోటీ లేకుండా ప్రధాని అయ్యేందుకు ఆయన రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్తో చర్చలు జరపగా వారు రేసు నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. మరోవైపు రిషికి 142 మంది ఎంపీలు అండగా ఉన్నారు. దీంతో రిషితో పోటీపడి గెలవలేనని భావించిన బోరిస్.. ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీని తాను ఏకం చేయలేనని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయినా తాను ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ దేశానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. బోరిస్ నిర్ణయం అనంతరం రిషి సునాక్ ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. బ్రెగ్జిట్, కరోనా వ్యాక్సిన్ల పంపణీ, ఉక్రెయిన్ యుద్ధం సమయంలో మాజీ ప్రధాని దేశాన్ని ముందుకు నడిపిన తీరు అద్భుతమని కొనియాడారు. రిషి సునాక్.. భారత ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారయణ మూర్తి అల్లుడనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన కూతురు అక్షతా మూర్తినే రిషి వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. చదవండి: బ్రిటన్ ప్రధాని పోటీలో ఉన్నా.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్.. -
చరిత్రలో తొలిసారి.. ఇటలీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మహిళ
రోమ్: ఇటలీ చరిత్రలోనే తొలిసారి ఓ మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రైట్ వింగ్‌కు చెందిన బ్రదర్స్ ఆఫ్ ఇటీలీ పార్టీ అధ్యక్షురాలు జియార్జియా మెలోని(45) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఫలితంగా అత్యంత అరుదైన ఘనత సాధించారు. ప్రధాని అయ్యాక మెలోని ఫైర్ బ్రాండ్‌గా ముందుకుసాగుతారని అంతా భావిస్తున్నారు. ఇటలీ అంతర్జాతీయ సంబంధాలు, వలసదారుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. అలాగే దేశ అప్పులను తగ్గించేందుకు స్థిరమైన బడ్జెట్‌ను ప్రవేశపెడాతరని అనుకుంటున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మెలోని సారథ్యంలోని బ్రథర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ మొత్తం 400 స్థానాలకు 118 స్థానాలు గెలుచుకుంది. అయితే ఇతరుల మద్దతుతో 237 సీట్ల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మెలోని ఇప్పటికే కేబినెట్‌ను కూడా ప్రకటించారు. చదవండి: ‘రిషి సునాక్.. ప్రధాని ఛాన్స్ నాకివ్వు!’ -
మ్యాగజైన్ స్టోరీ : యూకే నాట్ ఓకే
-
భారతీయులకు యూకే తీపి కబురు
-
టాప్ 60 న్యూస్ @ 6:30 AM 22 October 2022
-
నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్‌కు బిగ్ రిలీఫ్.. 'గ్రే లిస్ట్' నుంచి తొలగింపు
పారిస్: పాకిస్తాన్‌కు భారీ ఊరట లభించింది. ఉగ్రవాదుల ఆర్థిక విషయాలపై నిఘా వహించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్).. ఆ దేశాన్ని నాలుగేళ్ల తర్వాత 'గ్రే లిస్ట్' నుంచి తొలగించింది. ఉగ్రవాదుల కార్యకలాపాల విషయంలో పాక్ పురోగతి సాధించిందని, తీవ్రవాద సంస్థలకు నిధుల చేరవేతలో దిగొచ్చిందని ఈమేరకు నిర్ణయం తీసుకుంది. పారిస్‌లో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే అనూహ్యంగా మరో ఆసియా దేశం మయన్మార్‌ను బ్లాక్ లిస్టులో చేర్చింది ఎఫ్ఏటీఎఫ్. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, మొజాంబిక్ దేశాలను కొత్తగా గ్రే లిస్టులో చేర్చింది. పాకిస్తాన్, నికరాగ్వా దేశాలను ఈ జాబితా నుంచి తొలగించింది. ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లించడమే గాక, తీవ్రవాదుల పట్ల సానుభూతిగా ఉండే పాకిస్థాన్‌ను వరుసగా నాలుగేళ్ల పాటు గ్రే లిస్టలో ఉంచింది ఎఫ్ఏటీఎఫ్. తాము తీవ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నామని, అనేక మంది టెర్రరిస్టులను అరెస్టు చేస్తున్నామని పాకిస్తాన్ కొద్ది సంవత్సరాలుగా చెబుతున్నా ఎఫ్ఐటీఎఫ్ దాన్ని సమర్థించలేదు. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు తగ్గినందున ఆ దేశానికి ఊరటనిచ్చింది. చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంలో 66,000 మంది రష్యా సైనికులు మృతి! -
ఉక్రెయిన్‌తో యుద్ధంలో 66,000 మంది రష్యా సైనికులు మృతి!
కీవ్: రష్యాతో 240 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఆ దేశానికి చెందిన 66,750 మంది సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ భీకరు పోరులో శుత్రుదానికి జరిగిన నష్టాన్ని ఓ చిత్రం రూపంలో విడుదల చేసింది. ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం ఇరు దేశాలకు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. దాదాపు 9 నెలలు కావస్తున్నా యుద్ధం ఆగే సూచలను కన్పించడం లేదు. ఉక్రెయిన్ చెప్పిన వివరాల ప్రకారం ఈ యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టం.. చనిపోయిన సైనికులు - 66750 ధ్వంసమైన యుద్ధ విమానాలు- 269 హెలికాప్టర్లు - 263 ట్యాంకులు - 2573 మానవ రహిత విమానాలు - 1325 స్పెషల్ ఎక్విప్మెంట్ - 147 పడవలు - 16 సాయుధ వాహనాలు - 5258 ఆయుధ వ్యవస్థలు - 1648 బహుళ రాకెట్ లాంచర్లు - 372 వాహనాలు, ఇంధన ట్యాంకులు - 4006 యుద్ధ విమాన నిర్వీర్య వవస్థలు - 189 క్రూజ్ క్షిపణులు - 329 2️⃣4️⃣0️⃣ days of full-scale Russia’s war on #Ukraine. Information on #Russian invasion. Losses of #Russia’s armed forces in Ukraine, October 21. pic.twitter.com/SidRhOrGdk — MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) October 21, 2022 ప్రపంచానికే సంక్షోభం తెచ్చేలా ఉన్న ఈ భీకర యుద్ధాన్ని ఆపాలని అన్ని దేశాలు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ రష్యా, ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం ఆపే ప్రసక్తే లేదని పుతిన్ చెబుతున్నారు. జెలెన్స్కీ కూడా రష్యాతో చర్చలకు ససేమిరా అంటున్నారు. చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు షాక్.. ఐదేళ్లు వేటు -
బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా...
-
చైనా అధ్యక్షుడిగా ముచ్చటగా మూడోసారి ఆయనే!
బీజింగ్: చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్ అక్టోబర్ 16 నుంచి 22 వరకు జరగనుంది. మరో ఐదేళ్లకు అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 2,296 మందికిపైగా ప్రతినిధులు ఆదివారం ప్రారంభమయ్యే ఈ సదస్సులో పాల్గొంటున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టి చరిత్ర సృష్టించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఐదేళ్లకోసారి జరిగే సీపీసీ సదస్సు ఆదివారం ప్రారంభమవుతుంది. ప్రారంభోత్సవం అనంతరం అధ్యక్షుడు జిన్పింప్ ప్రసంగించనున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, రానున్న ఐదేళ్లకు రోడ్‌మ్యాప్‌ను వివరించనున్నారు. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే జిన్‌పింగ్ వరుసగా మూడోసారి చైనా కమ్యూనిస్టు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని, పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా అరుదైన ఘనత సాధిస్తారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సదస్సును కఠినమైన కోవిడ్ నిబంధనల మధ్య నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యేవారు కచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రెండు రోజుల పాటు కోవిడ్ బబుల్‌లో ఉండాలి. చదవండి: బొగ్గ గనిలో పేలుడు ఘటన.. 40కి చేరిన మృతుల సంఖ్య -
ఉక్రెయిన్ అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్‌ను కిడ్నాప్ చేసిన రష్యా!
కీవ్: జపోరిజజియా అణు విద్యుత్ కేంద్రం డిప్యూటీ చీఫ్ వలెరియ్ మార్టిన్‌యుక్‌ను రష్యా కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. ఆయనను ఎక్కడ నిర్బంధించి ఉంచారో తెలియడం లేదని పేర్కొంది. ట్రేస్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని వాపోయింది. ఈమేరకు ఉక్రెయిన్ అణు విద్యుత్ నిర్వహణ సంస్థ ఎనర్జోఆటం మీడియాకు వెల్లడించించి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చీఫ్ రఫేల్ గ్రాస్‌ను ఈ విషయంపై సంప్రదిస్తున్నట్లు ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొంది. మరోవైపు రష్యా రక్షణమంత్రి కూడా ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఐరోపాలోనే అతిపెద్దదైన ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా కొద్ది రోజుల క్రితమే ఆక్రమించుకుంది. ఆ తర్వాత దీని చీఫ్‌ను అక్టోబర్ 1 నిర్భంధించింది. అనంతరం అక్టోబర్ 3న విడుదల చేసింది. కానీ ఆ తర్వాత రోజు నుంచి అతడు విధులకు హాజరుకావడం లేదు. అణువిద్యుత్ కేంద్రం రష్యా గుప్పిట్లోనే ఉన్నప్పటికీ దీన్ని ఉక్రెయిన్ సిబ్బందే నిర్వహిస్తున్నారు. చదవండి: ఉక్రెయిన్ కోసం కాదు.. అందుకైతే పుతిన్‌ను కలుస్తా -
బంగారం.. నీ ప్రేమ కోసం అంతరిక్షం నుంచి భూమ్మీదకు వస్తా!
టోక్యో: ప్రేమ పేరుతో జపాన్ మహిళను మోసం చేశాడు ఓ వ్యక్తి. తాను రష్యా వ్యోమగామినని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్సీ)లో పని చేస్తున్నాని చెప్పి నమ్మించి బురిడీ కొట్టించాడు. మహిళను తాను ప్రాణంగా ప్రేమిస్తున్నాని చెప్పాడు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీని ఖర్చుల కోసం ఆమె వద్ద నుంచి 4.4 మిలియన్ యెన్(రూ.25లక్షలు) వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా పదే పదే డబ్బులు అడగడంతో ఆమెకు అనుమానం వచింది. ఆ తర్వాత అసలు విషయం తెలిసి కంగుతింది. ఈ జపాన్ మహిళ వయసు 65 ఏళ్లు. ఈమెకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఐఎస్సీలో పనిచేస్తున్నట్లు చెప్పాడు. జూన్‌లో ఇందుకు సంబంధించి ఫోటోలు పెట్టాడు. ప్రొఫైల్ పిక్చర్ కూడా మార్చాడు. ఇవి చూసి అతడు నిజంగా వ్యోమగామి అని మహిళ నమ్మింది. ఇద్దరూ తరచూ చాట్ చేసుకున్నారు. ఆ తర్వాత వీరి సంభాషణ ఇన్స్టాగ్రాం నుంచి జపాన్ సోషల్ మీడియా యాప్ 'లైన్'కు మారింది. ఇందులోనే మహిళను ప్రాణంగా ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకొని జీవితాంతం తోడుగా ఉండాలని ఉందని చెప్పాడు. దీంతో ఆమె అతడ్ని గుడ్డిగా నమ్మింది. అయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి భూమ్మీదకు రావాలంటే ఖర్చవుతుందని రూ.25లక్షలు పంపాలని మహిళను అతను కోరాడు. అతడ్ని నమ్మిన ఆమె రూ.25లక్షలు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 5 మధ్య ఐదు విడతల్లో పంపింది. అయినా అతను ఇంకా డబ్బు కావాలని అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతను వ్యోమగామి కాదని, మోసం చేశాడని తెలిసింది. పోలీసులు ఈ కేసును 'ఇంటర్నేషనల్ రోమాన్స్ స్కామ్'గా ట్రీట్ చేసి విచారణ చేపట్టారు. చదవండి: Viral Video: నడిరోడ్డుపై దిండు వేసుకుని పడుకుని హల్చల్ -
Iran Hijab Protest: మరో ఇద్దరు ఆందోళకారులు మృతి
సులిమానియా: ఇరాన్లో నాలుగు వారాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో మరో ఇద్దరు చనిపోయారు. నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కుర్దిష్ ప్రాబల్య సనందాజ్ పట్టణంలో శనివారం ప్రదర్శన చేపట్టారు. నిరసనలో భాగంగా కారు హారన్ మోగించిన ఓ వ్యక్తి భద్రతా బలగాల కాల్పుల్లో చనిపోయారని మానవహక్కుల సంఘాలు తెలిపాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు బలగాలు జరిపిన కాల్పుల్లో మరో వ్యక్తి చనిపోయాడని పేర్కొన్నాయి. హిజాబ్ ధరించలేదనే కారణంతో మోరల్ పోలీసులు అరెస్ట్ చేసిన మహ్సా అమిని(22) అనే కుర్దిష్ మహిళ కస్టడీలో మృతి చెందింది. నిరసనగా సెప్టెంబర్ 17 నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. చదవండి: పాకిస్థాన్ మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం! -
రష్యా కు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్
-
పాకిస్థాన్ మాజీ ప్రధాని అరెస్టుకు రంగం సిద్ధం!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. విదేశీ నిధుల కేసులో ఆయనను అదుపులోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పీటీఐ నాయకులు తారిఖ్ షమి, హమీద్ జమాన్, సైఫ్ నియాజీని శుక్రవారం అరెస్టు చేశారు అధికారులు. ఇమ్రాన్‌పై కేసు పెట్టాలని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రానా సనావుల్లా సంబంధిత అధికారులను ఆదేశించారని ఆ దేశ మీడియా తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీకి ఇమ్రాన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో దాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధికారులు చూస్తున్నారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మీడియా పేర్కొంది. అనధికారికంగా వెబ్సైట్ నిర్వహిస్తూ విదేశాల నుంచి నిధుల సమకూర్చుకున్నారనే ఆరోపణలతో మొదట పీటీఐ నేత సైఫుల్లా నియాజిని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైబర్ క్రైం విభాగం శుక్రవారం అరెస్టు చేసింది. ఆ తర్వాత కాసేపటికే మరికొంతమంది నేతలను అరెస్టు చేసింది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది. చదవండి: షాకింగ్.. ఆ కరోనా టీకాలు తీసుకున్న వారికి గుండెపోటు ముప్పు! -
పారేద్దామనుకున్న టికెట్‌కు 1.6 కోట్లొచ్చాయి
వెదుకుతున్నది దొరికితే కలిగే సంతోషం మామూలుగా ఉండదు. అలాంటిది పారేద్దామనుకున్న టికెట్‌కు రూ.కోట్లు దక్కితే... ఆనందానికి అవధులుండవు. ఈ యూఎస్ మహిళ విషయంలో అది నిజమైంది. రోపర్‌కు చెందిన 60 ఏళ్ల జాక్వలిన్ లేహ్ ఓ స్టోర్ నుంచి ‘నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ’ టికెట్ హాట్‘5’ను ఐదు డాలర్లకు కొన్నది. ‘ప్రతి టికెట్‌కు అదృష్టం వరిస్తుందా’ అని భావించిన జాక్వలిన్ ఆ టికెట్‌ను పారేసినంత పనిచేసింది. ఎందుకైనా మంచిదని... చెత్తబుట్టలో వేసేముందు మరోసారి చెక్ చేసింది. అంతే... ఆమె లాటరీ టికెట్ రెండు లక్షల డాలర్లను గెలుచుకుంది. ‘‘నాకు ఇంతకుముందెప్పుడూ ఇలా జరగలేదు. పారేద్దామనుకున్న టికెట్‌కు డబ్బులు రావడం ఇంకా నమ్మశక్యంగా లేదు’’ అంటోంది జాక్వెలిన్. ట్యాక్స్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ పూర్తయ్యాక... కోటీ 20 లక్షల రూపాయలను ఇంటికి తీసుకెళ్లింది. కార్ లోన్ కట్టడంతోపాటు ఇతర అవసరాలన్నీ తీర్చేసుకుంటానని ఆనందంగా చెబుతోంది. చదవండి: మానవ హక్కుల పోరాటాలకు నోబెల్ శాంతి బహుమతి -
థాయిలాండ్ లో మారణహోమం
-
విశ్వంలో భూమ్మీద మాత్రమే జీవం ఉందా? బంగారు డిస్క్‌లతో ప్రయోగం
మొత్తం విశ్వంలో భూమ్మీద మాత్రమే జీవం ఉందా? సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపైనో.. ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలపైనో ఏదైనా జీవం ఉందా అన్నది ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్న. ఈ గ్రహాంతర వాసుల (ఏలియన్లు) కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తున్నారు. ఎక్కడైనా ఏలియన్లు ఉంటే మనను గుర్తించేందుకు వీలుగా అంతరిక్షంలోకి వివిధ తరంగాలతో సిగ్నళ్లు పంపడం వంటివీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సుదూర అంతరిక్ష ప్రయోగాల్లో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను పంపారు. ఏమిటా బంగారు డిస్కులు, వాటిపై ఏముందన్న వివరాలు తెలుసుకుందామా.. భూమి, మానవుల విశేషాలతో.. ఒకవేళ ఎక్కడైనా గ్రహాంతర జీవులు ఉండి ఉంటే.. వాటికి భూమి మీద జీవం, మనుషులు ఉన్నట్టు తెలిపేందుకు శాస్త్రవేత్తలు వ్యోమనౌకలలో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను పంపారు. వాటిపై మనుషులు సాధించిన ప్రగతి, వివిధ సాంస్కృతిక, సాంకేతిక అంశాలను వివరించేలా ఉన్న డిజైన్లు, ఆకారాలను నిక్షిప్తం చేశారు. అయితే ఇవి పూర్తిస్థాయి బంగారు ప్లేట్లు కాదు. పన్నెండు అంగుళాల వ్యాసం ఉన్న గట్టి రాగి ప్లేట్లపై మందంగా బంగారు పూత పూశారు. ఇప్పటివరకు నాలుగు వ్యోమనౌకలలో.. అంతరిక్షంలో సుదూర ప్రయోగాల కోసం పంపిన వ్యోమనౌకలలో నాసా శాస్త్రవేత్తలు బంగారు డిస్‌్కలను అమర్చారు. ఇప్పటివరకు పయోనిర్–10, పయోనిర్–11, వోయేజర్–1, వోయేజర్–2 వ్యోమనౌకలు వీటిని తీసుకుని అంతరిక్షం అంచుల్లోకి చేరుకున్నాయి కూడా. వోయేజర్ వ్యోమనౌకల్లో పంపిన డిస్్కలపై పంపిన డేటాను శాస్త్రవేత్త కార్ల్ సాగన్ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. ఏలియన్లకు అర్థమయ్యేలా.. 1977లో వోయేజర్ వ్యోమనౌకలలో పంపిన బంగారు డిస్క్‌లను గ్రామ్‌ఫోన్ రికార్డుల తరహాలో రూపొందించారు. వాటిలో గణితం, సైన్స్‌కు సంబంధించిన వివరాలను, వివిధ ధ్వనులను నమోదు చేశారు. గణితం, సైన్స్‌కు సంబంధించిన అంశాలు యూనివర్సల్ అని.. ఎప్పటికైనా వీటిని గ్రహాంతర వాసులు అర్థం చేసుకోగలరని శాస్త్రవేత్తల భావన. అందుకే ఈ డిస్క్‌లను టైం క్యాప్సూల్స్ అని కూడా పేర్కొన్నారు. ఈ బంగారు డిస్క్లకుపైన కవర్‌ను కూడా అమర్చారు. దీనిని అల్యూమినియంతో తయారు చేశారు. అంతరిక్షంలో పరిస్థితులను తట్టుకుని కోట్ల ఏళ్లు ఉండేందుకు వీలుగా.. యురేనియం–238ను పూత పూశారు. ఈ కవర్‌పై ‘‘అన్ని కాలాలు, అన్ని ప్రపంచాల్లో సంగీతాన్ని సృష్టించేవారి కోసం..’’ అని రాశారు. బంగారు డిస్క్‌లలో ఏమేం నిక్షిప్తం చేశారు? ► మానవులు, భూమికి సంబంధించి అనలాగ్ పద్ధతిలో ఎన్కోడ్ చేసిన 115 చిత్రాలు (తింటూ, తాగుతూ ఉన్న మనుషులు, తాజ్‌మహల్ వంటి ప్రముఖ స్థలాలు, క్రీడాకారులు, గర్భిణులు, పాలిస్తున్న తల్లి, ఎల్రక్టానిక్ పరికరాలు, న్యూటన్ రాసిన బుక్‌లోని ఓ పేజీ.. ఇలా ఎన్నో). ► హిందీ, బెంగాలీ, కన్నడ సహా 55 భాషల్లో పలకరింపులు. ► ప్రముఖ సంగీత విద్వాంసులకు సంబంధించిన 90 నిమిషాల సంగీతం. ► భూమిపై వినిపించే వివిధ రకాల ధ్వనులతో కూడిన (ఉరుములు, జంతువుల అరుపులు, మనుషుల మాటలు, ముద్దు ధ్వని సహా) 12 నిమిషాల ఆడియో. ► అంతరిక్షంలో మన సౌర కుటుంబం, భూమి ఉన్న ప్రాంతాన్ని గుర్తించగలిగేలా డిస్క్ కవర్‌పై మ్యాప్. ► డిస్క్‌లోని వివరాలను డీకోడ్ చేసేందుకు వీలైన మేథమేటికల్, సైన్స్ ఆకృతులు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
నేలపై నుంచి కాల్పులు.. విమానంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
మయన్మార్‌లో షాకింగ్ ఘటన జరిగింది. నేషనల్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి బుల్లెట్ తగిలింది. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. నేలపై నుంచి ఎవరో కాల్పులు జరపడంతో విమానం పైకప్పుకు రంద్రంపడి బుల్లెట్ లోనికి దూసుకెళ్లింది. అనంతరం లోయికావ్ నగరంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బ్రిటీష్ వార్త సంస్థ వివరాల ప్రకారం విమానం 3,500 అడుగుల ఎత్తులో, విమానాశ్రయానికి నాలుగు మైళ్ల దూరంలో ప్రయాణిస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే లోయికావ్ విమానాశ్రయానికి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే విమానంపై కాల్పులు జరిపింది కచ్చితంగా రెబల్ గ్రూప్‌కు చెందిన వారే అని మయన్మార్ సైన్యం తెలిపింది. కరెన్ని నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడించింది. రెబల్స్ గ్రూప్స్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించాయి. మయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సాయుధ దళాలు, సంప్రదాయ తెగలు పోరాటం చేస్తున్నాయి. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ అనుబంధ సంస్థలే విమానంపై కాల్పులు జరిపాయని మయన్మార్ మిలిటరీ కౌన్సిల్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ జామ్ మిన్ టున్ తెలిపారు. మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీని జైలుకు తరలించిన నాటి నుంచి ఆ దేశంలో అనేక చోట్ల సాయుధ దాళాలు పోరాటం చేస్తున్నాయి. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు విమానంపై కాల్పులు జరిగిన కాయా రాష్ట్రంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. చదవండి: ఉక్రెయిన్ వ్యూహంతో రష్యా ఉక్కిరిబిక్కిరి.. ఆ నగరం వదిలి పరార్! -
ఇండోనేషియా ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట,,, దాదాపు 180 మంది మృతి
-
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 100 మంది చిన్నారులు మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఓ విద్యాసంస్థ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ దర్ఘటనలో 100 మంది విద్యార్థులు చనిపోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే పేలుడుకు పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉందని అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 7:30గంటలకు ఓ వ్యక్తి కాజ్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు బాంబు ధరించి వెళ్లాడని, అనంతరం విద్యార్థుల మధ్యకు చేరుకుని తనను తాను పేల్చుకున్నాడని అధికారులు తెలిపారు. వాజిర్ అక్బర్ ఖాన్ ప్రాంతంలో ఇటీవలే భారీ పేలుడు సంభవించి పదుల సంఖ్యలో మరణించారు. ఇప్పుడు మరో ఘటన జరగడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. అఫ్గానిస్తాన్‌ల ోతాలిబన్లు అధికారంలోకి వచ్చి ఆగస్టుతో ఏడాది పూర్తయింది. ఆ తర్వాత నుంచి వరుసుగా బాంబు దాడులు జరుగుతున్నాయి. తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగానే ఉగ్రసంస్థలు ఈ దారుణాలకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Each number on those chairs represented one human being. Each number, and their families, had dreams to come here and take the university preparation entrance examination. Those dreams are dashed with fatal consequences for them, the families, communities , and the country. pic.twitter.com/CnphF6tgd9 — BILAL SARWARY (@bsarwary) September 30, 2022 చదవండి: టీ రెక్స్ అంటే.. డైనోసార్ సినిమాల్లో హీరో లెక్క -
Sakshi Cartoon 29-09-2022
-
'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత
హవానా: స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాల జాబితాలో మరో దేశం చేరింది. గే మ్యారేజెస్‌కు క్యూబా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే మహిళల హక్కులకు పెద్దపీట వేస్తున్న ఈ కమ్యూనిస్టు దేశం 'సేమ్ జెండర్' మ్యారేజెస్‌ను అధికారికం చేసింది. ఈ చట్టం కోసం ఆదివారం పెద్దఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. 84లక్ష మంది పాల్గొన్న ఈ ఓటింగ్‌లో దాదాపు 40 లక్షల మంది(66.9శాతం) దీనికి అనుకూలంగా ఓటు వేశారు. 1.95లక్షల మంది(33శాతం) మాత్రం వ్యతిరేకించారు. దీంతో ప్రజల నుంచి భారీ మద్దతు వచ్చినందున గే మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు క్యూబా ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఈ విషయంపై క్యూబా అధ్యక్షుడు డయాజ్ క్యానెల్ స్పందిస్తూ.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. కొన్ని తరాల రుణం తీర్చుకున్నట్లయిందని పేర్కొన్నారు. ఎన్నో క్యూబా కుటుంబాలు ఈ చట్టం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో క్యూబాలో స్వలింగ సంపర్కుల పెళ్లికి చట్టబద్దత లభిస్తుంది. వీరు పిల్లల్ని కూడా దత్తత తీసుకోవచ్చు. పురుషులు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయి. చదవండి: యువకుడి అసాధారణ బిజినెస్.. సినిమాలో హీరోలా.. -
మరింత మందిని కనండి.. ఇటాలియన్లకు పోప్ పిలుపు
మటేరా: ఎన్నికల వేళ ఇటాలియన్లు మరింత మంది పిల్లలను కనాలంటూ పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన పిలుపు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆదివారం మటేరాలో ఆయన బిషప్‌ల సమావేశంలో ఈ మేరకు కోరారు. వలసదారులను స్వాగతించాలని పిలుపునిచ్చారు. దేవుడు కుటుంబం, మాతృభూమి’నినాదంతో ప్రచారం చేస్తున్న మెలోనీ నేతృత్వంలోని రైటిస్ట్ పార్టీ కూడా ఎక్కువ మందిని కంటే ప్రోత్సాహకాలిస్తామని వాగ్దానం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ జననాల రేటున్న దేశాల్లో ఇటలీ ఒకటి. చదవండి: చైనాలో ‘సైనిక కుట్ర’పై... అదే అస్పష్టత -
ఘోర ప్రమాదం.. పడవ మునిగి 23 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఆదివారం ఘోరో ప్రమాదం జరిగింది. ఉత్తర పంచగఢ్ జిల్లాలో పడవ మునిగి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో దాదాపు 70 మంది ఉన్నట్లు ఓ ప్రయాణికుడు చెప్పాడని అధికారులు వెల్లడించారు. ఇంకా ఎంతమైంది అదృశ్యమయ్యారని కచ్చితంగా సంఖ్య చెప్పలేమన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదాల కారణంగా ఏటా పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. జలాంతార మార్గాలు చాలా ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మేలో ఓ పడవ వేగంగా వెళ్లి భారీ ఓడను ఢీకొట్టిన ఘటనలో 26 మంది చనిపోయారు. చదవండి: దేశ రాజధానిలో దారుణం.. 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం -
Typhoon Talas: జపాన్‌లో 'తలస్' బీభత్సం.. ఇద్దరు మృతి
టోక్యో: సెంట్రల్ జపాన్‌లో తలస్ తుఫాను బీభత్సం సృష్టించింది. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల ధాటికి వరదలు సంభవించాయి. కొంచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వేల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కకెగావా నగరంలో ఒకరు తన ఇంటిపై కొండచరియలు విరిగిపడి చనిపోయాడు. దీని పక్క నగరం ఫుకురోయ్లో మరోవ్యక్తి వరదలో వాహనంలో చిక్కుకుని మరణించాడు. షిజువోకాలో మరో వ్యక్తి వరదలో వాహనం నడుపుతూ కొట్టుకుపోయి అదృశ్యమయ్యాడు. అతను కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు రికార్డుస్థాయిలో 40సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. వరదల వల్ల అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 1,20,000 ఇళ్లు అంధకారంలో ఉన్నాయి. 55వేల మంది ఇళ్లకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వీరికి శుభ్రమైన నీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జపాన్‌లో వేసవి కాలం, శరద్ రుతువులతో తరచూ తఫాన్లు వస్తుంటాయి. గతవారం కూడా నన్మదోల్ తుఫాన్ నైరుతి జపాన్ను అతలాకుతలం చేసింది. అప్పుడు సంభవించిన వివిధ ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. మరో 147మంది గాయపడ్డారు. చదవండి: బ్రిటన్ రాణి సమాధి ఫోటోలు వైరల్