కాలిఫోర్నియా: అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. భూప్రకంపనల ధాటికి పలుచోట్ల ప్రమాదాలు సంభవించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. ఫార్చునాకు 15 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
భూకంపం కారణంగా హంబోల్డ్ కౌంటీలో వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దాదాపు 71వేల మంది అంధకారంలోకి వెళ్లారు. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోయాయి.
చదవండి: ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్‌లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment