rictor scale
-
జపాన్‌లో భారీ భూకంపం..సునామీ హెచ్చరిక జారీ
టోక్యో:జపాన్(Japan)లో సోమవారం(జనవరి13) భారీ భూకంపం(EarthQuake) సంభవించింది. క్యుషు ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. 37 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యురోపియన్ భూకంప పరిశోధనా కేంద్రం తెలిపింది. ఈ భూకంపం ధాటికి ఎలాంటి పప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని సమాచారం. అయితే ముందు జాగ్రత్తగా కొన్ని తీర ప్రాంతాలకు సునామీ(Tsunami) హెచ్చరికలు జారీ చేశారు. గతేడాది ఆగస్టు 8న క్యుషు ప్రాంతంలో రెండు భారీ భూకంపాలు రాగా జనవరి 1 2024న 7.6 తీవ్రతతో సుజు,వజీమాలో భారీ భూకంపం సంభవించింది.ఈ భూకంపం ధాటికి ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు టెక్టానిక్ ప్లేట్లు కలిసే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో జపాన్ ఉండడంతో ఇక్కడ తరచు భూకంపాలు వస్తుంటాయి. -
చిలీలో భూకంపం..6.2 తీవ్రత నమోదు
శాంటియాగో:చిలీలో భారీ భూకంపం వచ్చింది. కలమాకు 84 కిలోమీటర్ల దూరంలోని అంటోఫగాస్టాలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2గా నమోదైంది. 104 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు యురోపియన్ మెడిటెర్రేనియన్ సెస్మలాజికల్ సెంటర్(ఈఎమ్ఎస్సీ) ఒక ప్రకటనలో తెలిపింది.Another video of the M6.1 earthquake that hit Chile earlier....pic.twitter.com/w4FyDegf4n— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025భూకంపం కారణంగా జరిగిన ప్రాణ,ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల్లో నమోదైన భూకంపం దృశ్యాలను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. భూకంపం ధాటికి భవనాలు కొద్ది సేపు అటు ఇటు ఊగుతుండడం ఆ వీడియోల్లో కనిపించింది. CCTV of the M6.1 earthquake in Chile a short while ago. That was a long one 👀pic.twitter.com/SvyBLoZZhU— Volcaholic 🌋 (@volcaholic1) January 2, 2025 -
జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.1 తీవ్రత..
టోక్యో: జపాన్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. ఉత్తర్ జపాన్‌లోని అమోరిలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే భూకంపం కారణంగా ఏమైనా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందా? అనే విషయాలపై మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం లేదు. భూకంప తీవ్రత భారీగా నమోదైనప్పటికీ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. చదవండి: అన్నంత పని చేస్తున్న కిమ్! 'ఆయుధాలను పెంచాలని పిలుపు' -
Earthquake: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి..
పెరు, ఈక్వెడార్‌లోని గయాస్ తీరప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.8గా నమోదైంది. 66 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం ధాటికి చాలా ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా మచాలా, క్యుయెన్సా నగరాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. భూప్రకంపనల ధాటికి జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా మొత్తం 14 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈక్వెడార్ అధ్యక్షుడు గ్విల్లెర్మో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మచాలాలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఇతర నగరాలను కూడా సందర్శిస్తానని చెప్పారు. చదవండి: కోవిడ్ డేటాను చైనా తొక్కిపెడుతోంది -
టర్కీలో మళ్లీ భూకంపం.. ముగ్గురు మృతి.. 200 మందికి గాయాలు..
ఇస్తాన్‌బుల్: టర్కీ, సిరియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. హతాయ్ ప్రావిన్స్ డిఫ్నీ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి ముడు అపార్ట్మెంట్లు కూలిపోయాయి. ముగ్గురు చనిపోయారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. భూకంపం సంభవించింది సరిహద్దు ప్రాంతం కావడంతో సిరియాలోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఆరుగురు గాయపడ్డారు. Moment of the earthquake from Kayseri #Turkey #turkiyeearthquake pic.twitter.com/NoDuZ1iEll — Mandy Ricci (@ADV561SDV56) February 21, 2023 రెండు వారాల క్రితమే టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. వేల భవనాలు కుప్పకూలి 47,000 మందికిపైగా చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.. ఇప్పుడు మళ్లీ భూకంపం రావడం ఆందోళనకు గురిచేస్తోంది. #Turkey 🇹🇷#turkeyearthquake2023 New earthquakes in Turkey in the city of Hatay shook the south of the country. from 6.4, 6.2. There were deaths as well as missing and thousands of wounded. It was announced that a new tsunami is coming in Iskenderum among others city.👇🏻 pic.twitter.com/vq5DROI1Vz — Daniel Von Sáenz ☭⃠🇵🇪🇯🇪🇩🇪➕️ (@DanielS12576850) February 21, 2023 అయితే తాజాగా భూకంపం వచ్చిన ప్రాంతంలో జనాలు ఎక్కువగా నివసించడం లేదని అధికారులు పేర్కొన్నారు. గత భూకంపంలో కూలిపోయిన తమ ఇళ్ల నుంచి సామాన్లు, వస్తువులు తీసుకోవాడనికి వెళ్లి ఉంటారని చెప్పారు. New,Bandara di Hatay #Turkey diguncang gempa M6.4 kedalaman 10km senin,20/02/2023 air laut surut.#turkeyearthquake2023 #TurkeySyriaEarthquake2023 pic.twitter.com/lOztUAAHyw — 📿 frenkyf¹ (@frenkyfi) February 21, 2023 చదవండి: విద్వేషమే విడదీసింది! కొరియన్ యుద్ధానికి కారణమెవరు? చివరకు మిగిలింది -
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 6.1 తీవ్రత
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో బుధావరం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. పరాపరౌముకు వాయవ్యంగా 50 కిలోమీటర్ల దూరంలో 76 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత 15 నిమిషాల్లోనే 31వేల మంది తాము ఉన్న చోట్ల భూమి కంపించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 30 సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే భూకంపం కారణంగా ఏమైనా ఆస్తి నష్టం, ప్రాణనష్టం సంభవించిందా అనే విషయాలపై స్పష్టత లేదు. దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెప్పారు. A 6.2 magnitude earthquake has struck near the city of Wellington in New Zealand. #earthquake #NewZealand #Wellington #earthquakes pic.twitter.com/GQ2esClqa4 — Dp Rathi (@rathi_dp) February 15, 2023 న్యూజిలాండ్‌లో ఇప్పటికే సైక్లోన్ గేబ్రిల్లే విధ్వంసం సృష్టిస్తోంది. దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసి వరదలు సంభవించాయి. వివిధ ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో10,500 మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో భూకంపం రూపంలో మరో ఉపద్రవం రావడం న్యూజిలాండ్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. #NewZealand Now 6.1 magnitude #earthquake in New Zealand , people in shock@IsraelinNZ @nytimes @nytimesworld @BBCWorld @CNN #ValentinesDay #joker2 #SUGA_AgustD_TOUR #ChampionsLeague #BabarAzam𓃵 #บิวเป็นพีทที่สมบูรณ์แบบ #14february #mha380 #AgustD #หวานใจมิวกลัฟ #Quantumania pic.twitter.com/6WbDovUPbY — Journalist Amit kumar 'देव' (@AmitKum995) February 15, 2023 A state of emergency has been declared in New Zealand as 'unprecedented' storm lashes North Island. Read more: https://t.co/zt61o4VdId pic.twitter.com/ETJiaE738Z — SBS News (@SBSNews) February 14, 2023 New Zealand has declared a state of national emergency in the wake of Cyclone Gabrielle. Take a look at the extent of the flooding in Hawke's Bay, NZ:pic.twitter.com/KXAt9hs3lC — Steve Hanke (@steve_hanke) February 14, 2023 New Zealand declared a state of emergency for only the third time in its history after Cyclone Gabrielle flooded parts of the country. The cyclone cut power to 225,000 residents, stranded people on rooftops and swept at least one sailor out to sea. https://t.co/fLzWhOlL7Q pic.twitter.com/581xvHSHCk — The New York Times (@nytimes) February 15, 2023 చదవండి: లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్న భర్త.. దిమ్మతిరిగే షాకిచ్చిన భార్య..! -
కోలుకోక ముందే దెబ్బ మీద దెబ్బ.. టర్కీలో మరోసారి భూకంపం..
ఇస్తాంబుల్: గత సోమవారం సంభవించిన భారీ భూకంపంతో కకావికలమైన టర్కీలో మరోసారి భూకంపం వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పలుచోట్ల భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.7గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దక్షిణ టర్కీ నగరం కహ్రమన్మరాస్ సమీపంలో 15.7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల భవనాలు కూలిపోయినట్లు గానీ, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. 34వేలకు పెరిగిన మృతులు.. తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 34వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. వేల మంది గాయపడినట్లు చెప్పారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు టర్కీ హతాయ్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దెబ్బతిన్న రన్‌వేను రిపేర్ చేసినట్లు చెప్పారు. దొంగతనాలు.. భూకంపం కారణంగా సర్వస్వం కోల్పోయి వేల మంది ప్రజలు నిరాశ్రయులైతే.. మరోవైపు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లలో చొరబడి వస్తువులు, నగలు, డబ్బులు దోచుకెళ్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నందున దొంగలపై కఠిన చర్యలు తప్పవని అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ హెచ్చరించారు. సాధారణంగా వాళ్లకు ఒక్కరోజు ఉండె జైలు నిర్భంధం ఇప్పుడు నాలుగు రోజులకు పెరిగినట్లు గుర్తు చేశారు. లూటీలకు పాల్పడిన 57 మందిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. చదవండి: మరో గుర్తుతెలియని వస్తువును కూల్చేసిన అమెరికా..వారంలో నాలుగోది! -
భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో 3 రాష్ట్రాల్లో ప్రకంపనలు..
న్యూఢిల్లీ: తుర్కియే, సిరియాలో భారీ భూకంపం అనంతరం భారత్‌లో కూడా భూకంపాలు సంభవించే ముప్పు ఉందని నిపుణలు అంచనావేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అవి నిజరూపం దాల్చుతున్నాయి. దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. గుజరాత్లో శనివారం, అస్సాంలో ఆదివారం భూప్రకంపనలు రాగా.. తాజాగా సోమవారం ఉదయం సిక్కింలో భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 4.3 తీవ్రత నమోదైంది. ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని యుక్సోం ప్రాంతంలో 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం ట్విట్టర్లో తెలిపింది. ఉదయం 4:15 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు పేర్కొంది. Earthquake of Magnitude:4.3, Occurred on 13-02-2023, 04:15:04 IST, Lat: 27.81 & Long: 87.71, Depth: 10 Km ,Location: 70km NW of Yuksom, Sikkim, India for more information Download the BhooKamp App https://t.co/FgmIkxe9Q2@Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @Ravi_MoES pic.twitter.com/1FuxFI7Ire — National Center for Seismology (@NCS_Earthquake) February 13, 2023 అస్సాం, గుజరాత్‌లోనూ ఆదివారం అస్సాంలోనూ భూకంపం వచ్చింది. రిక్టరు స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది. అంతుకుముందు రోజు గుజరాత్ సూరత్‌లోనూ 3.8 తీవ్రతో భూమి కంపించింది. దేశంలో 60శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్లో ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2022 డిసెంబర్లో పార్లమెంటులో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్ అయిదులో ఉంటే అత్యంత ప్రమాదకరమని, రెండో జోన్లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది. జోన్ 5 ► వెరీ హై రిస్క్ జోన్ : రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 9 అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 11% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతం, గుజరాత్లో రణ్ ఆఫ్ కచ్, ఉత్తర బిహార్, ఉత్తరాది రాష్ట్రాలు, అండమాన్ నికోబర్ దీవులు జోన్ 4 ► హైరిస్క్ జోన్ : భూకంప తీవ్రత 8 వరకు నమోదయ్యే అవకాశం ► ఈ జోన్లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 8 వరకు వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 18% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కశ్మీర్లో మిగిలిన ప్రాంతం, లద్దాఖ్, హిమాచల్‌లో మిగిలిన భాగాలు పంజాబ్, హరియాణా లో కొన్ని భాగాలు, ఢిల్లీ, సిక్కిమ్, యూపీæ ఉత్తర ప్రాంతం, బిహార్‌లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని భాగాలు, పశ్చిమ రాజస్థాన్ జోన్ 3 ► మధ్య తరహా ముప్పు: ఈ జోన్లో భూకంప తీవ్రత 7 వరకు వచ్చే అవకాశం ► దేశ భూభాగంలో ఇది 31% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు, ఉత్తరప్రదేశ్, హరియాణాలో కొన్ని ప్రాంతాలు, గుజరాత్లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కూడా జోన్ 3లోకి వస్తాయి జోన్ 2 ► లో రిస్క్ జోన్ : భూకంప తీవ్రత 6 అంతకంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ► దేశ భూభాగంలో ఇది 40% ► ఈ జోన్‌లోని ప్రాంతాలు: రాజస్థాన్, హరియాణా, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలకు ముప్పు పెద్దగా లేదనే చెప్పొచ్చు. చదవండి: తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. మనకు ముప్పు ఎంత? -
ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై తీవ్రత ఎంతంటే..?
జకర్తా: ఇండోనేషియాలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.0 తీవ్రత నమోదైంది. తలాడ్ ఐలాండ్స్ సమీపంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఇండోనేషియా జియోగ్రఫీసిక్స్ ఏజెన్సీ బీఎంకేజీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. #Gempa Dirasakan Magnitudo: 6.0, Kedalaman: 11 km, 11 Feb 2023 15:55:06 WIB, Koordinat: 3.67 LU-126.76 BT (Pusat gempa berada di Laut 37 km Tenggara Melonguane) #BMKG https://t.co/OiHiTwvX8x — BMKG (@infoBMKG) February 11, 2023 అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదు. దీని వల్ల సునామీ వచ్చే ప్రమాదం కూడా లేదని అధికారులు తెలిపారు. చదవండి: టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు.. -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. పలు నగరాల్లో కంపించిన భూమి..
మనిలా: ఫిలిప్పీన్స్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. న్యూ బటాన్ ప్రాంతం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఫిలిప్పీన్స్ భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది. భూకంపం ధాటికి పలు దక్షిణాది రాష్ట్రాలోని నగరాల్లో భూప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తినష్టం గానీ, ప్రాణనష్టం గానీ జరిగినట్లు ఇంకా నిర్ధరణ కాలేదు. 🔴🇵🇭#Philippines 🚨#ÚLTIMAHORA | FILIPINAS 🇵🇭 Un terremoto de magnitud 6.0 sacudió New #Bataan en Davao De Oro a las 6:44 p.m. del miércoles, según Phivolcs.#filipinas .#TerremotoPH #terremoto #davao #earthquake,#joshtve #EarthquakePH #joshtve #temblor video 1📹#EarthquakePH pic.twitter.com/OA0sk7QCZz — Joshtve_ (@Joshtve_) February 1, 2023 పసిపిక్ మహా సముద్రం ప్రాంతంలోని ఫిలిప్పీన్స్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. ఏటా 20 టైఫూన్లు, ఉష్ణమండల తుఫాన్లు వస్తుంటాయి. ప్రపంచంలోని అత్యంత విపత్తు పీడిత దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటిగా ఉంది. 🔴🇵🇭#Philippines 🚨#ÚLTIMAHORA | FILIPINAS 🇵🇭 Un terremoto de magnitud 6.0 sacudió New #Bataan en Davao De Oro a las 6:44 p.m. del miércoles, según Phivolcs.#filipinas .#TerremotoPH #terremoto #davao #earthquake,#joshtve #EarthquakePH #joshtve #temblor video 2 📹#EarthquakePH pic.twitter.com/O0nGlW5agE — Joshtve_ (@Joshtve_) February 1, 2023 చదవండి: పాపం..! డ్యాన్స్ చేసినందుకు ఆ జంటకు ఏకంగా పదేళ్లు జైలు శిక్ష -
కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. ఇద్దరు మృతి.. చీకట్లో వేల మంది..
కాలిఫోర్నియా: అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. భూప్రకంపనల ధాటికి పలుచోట్ల ప్రమాదాలు సంభవించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడ్డారు. ఫార్చునాకు 15 మైళ్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా హంబోల్డ్ కౌంటీలో వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దాదాపు 71వేల మంది అంధకారంలోకి వెళ్లారు. భూకంప తీవ్రతకు పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోయాయి. చదవండి: ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు -
రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ..
ద్వీపకల్ప దేశం సొలోమన్ ఐలాండ్స్‌లో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.0గా నమోదైంది. సోలోమన్ తీరానానికి 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం ధాటికి 20 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇళ్లు కదిలి, ఇంట్లోని టీవీ, ఇతర సామాన్లు కిందపడిపోయినట్లు పేర్కొన్నారు. ప్రజలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసినట్ల వివరించారు. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే మొదట 7.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపిన అధికారులు ఆ తర్వాత దాన్ని 7.0గా సవరించారు. మొదట సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాసేపటి తర్వాత.. ముప్పు తప్పిందని నిర్ధరించుకున్నాక ఆదేశాలు ఉపసంహరించుకున్నారు. చదవండి: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 162 మంది దుర్మరణం -
ఇండోనేషియాలో భారీ భూకంపం.. 162 మంది దుర్మరణం
జకార్తా: ఇండోనేసియాలోని జావా ద్వీపం సోమవారం భారీ భూకంపం ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. డజన్ల కొద్దీ భవంతులు పేకమేడల్లా నేల మట్టమయ్యాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. భవంతులు కూలిన ఘటనల్లో మొత్తంగా 162 మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమ జావా గవర్నర్ రిద్వాన్ కమిల్ చెప్పారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. మరణాల సంఖ్య భారీగానే ఉండొచ్చని గవర్నర్ అన్నారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం అందర్నీ కలచివేస్తోంది. సియాంజుర్ పట్టణంలో ఇస్లామిక్ బోర్డింగ్ స్కూళ్లు, మసీదులు ఎక్కువ. ఇక్కడి ఇస్లామిక్ స్కూళ్లలో డే క్లాసులు పూర్తయ్యాక అదనపు క్లాసుల కోసం చాలా మంది విద్యార్థులు స్కూళ్లలోనే ఉండిపోయారు. అదేసమయంలో భూకంపం రావడంతో పాఠశాల భవంతులు కూలి ఎక్కువ మంది చిన్నారులు విగతజీవులయ్యారు. ప్రకంపనల ధాటికి జనం ఇళ్లు, కార్యాలయాలు వదిలి బయటకు పరుగులుపెట్టారు. చాలా మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు. కిక్కిరిసిన ఆస్పత్రులు.. జాతీయ విపత్తు దళం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమైంది. పెద్ద సంఖ్యలో ఉన్న క్షతగాత్రులను స్థానికులు పికప్ ట్రక్కులు, బైక్‌లపై ఆస్పత్రులకు తరలించారు. అధిక జనాభా ఉన్న జావా పట్టణంలో చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి చేరి భయంతో బిక్కుబిక్కుమంటూ కనిపించారు. ఆగకుండా వస్తున్న క్షతగాత్రులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులను రోడ్లపైనే పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. ఆరుబయట పార్కింగ్ ప్రాంతాల్లోనే చికిత్సచేస్తున్నారు. రక్తమోడుతున్న చిన్నారులను ఆస్పత్రికి తీసుకొస్తున్న దృశ్యాలతో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ఆస్పత్రి, పాఠశాల సహా పలు భవంతులు నేలకూలాయి. ఆస్పత్రి కూలి ఎక్కువ మంది చనిపోయారని వార్తలొచ్చాయి. సోమవారం మధ్యాహ్నం వేళ రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం పశ్చిమ జావాలోని సియాంజుర్ రీజియన్‌లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని ఆ దేశ జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది. సియాంజుర్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ‘మూడుసార్లు భూమి కంపించింది. మొదటిసారి ఆగకుండా పది సెకన్లపాటు కుదిపేసింది’ అని స్థానికురాలు దేవి రిస్మా చెప్పారు. ‘భవంతి ఊగిపోతున్నపుడు 14వ అంతస్థులో ఉన్నాను. మెట్లు దిగి కిందికొచ్చేటపుడు పై ప్రాణాలు పైనే పోయాయి’ అని మహిళా లాయర్ మయాదిత చెప్పారు. భూకంపం తర్వాత సైతం 1.8 నుంచి 4 తీవ్రతతో దాదాపు 25 సార్లు ప్రకంపనలు కనిపించాయని ఆ దేశ భూకంపాలు, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. ఇళ్లు ధ్వంసమై నిరాశ్రయులైన 13,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిజేదిల్ గ్రామంలో శిథిలాల కింద 24 మంది చిక్కుకుని సాయంకోసం అరి్థస్తున్నారు. 27 కోట్ల జనాభా గల ఇండోనేసియాలో భూకంపాలు, అగి్నపర్వతాలు బద్ధలవడం, సునామీలు సర్వసాధారణం. 2004లో హిందూ మహా సముద్రం అడుగున ఏర్పడి విలయం సృష్టించిన భారీ భూకంపం వెనువెంటనే సునామీ ధాటికి 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: న్యూజిలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు -
రాజస్థాన్‌లో భూకంపం
జైపూర్ : రాజస్తాన్‌లో గురువారం తెల్లవారుజామున 4.10 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు తెలిపారు. రాజస్థాన్ బికనేర్ నగరానికి 669 కిలోమీటర్ల దూరంలో భూకంప తీవ్రతను గుర్తించారు. భూకంప ఉపరితలానికి దాదాపు 30 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. గత వారంలోనూ రాజస్థాన్‌లో భకంపం సంభవించిన సంగతి తెలిసిందే. వరుస భూ ప్రకంపనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. राजस्थान के बीकानेर में महसूस हुए भूकंप के झटके, रिक्टर स्केल पर इतनी थी तीव्रता#Rajasthan #Earthquake #Bikaner https://t.co/kW54UJFNMn — ABP News (@ABPNews) August 13, 2020 -
భూప్రకంపనలు.. ఇండోనేషియాలో అత్యధికం
జకార్తా : ఇండోనేషియా సహా వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున ఇండోనేషియా, సింగపూర్ సహా భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. అత్యధికంగా ఇండోనేషియాలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు కాగా, సింగపూర్‌లో తెల్లవారుజామున 4.24 గంటలకు రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సమీపంలో తెల్లవారుజామున 1:33 గంటలకు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. జావా తీరం సముద్రగర్భంలో 528 కిలోమీటర్ల లోతులో భూకంపన కేందద్రాన్ని గుర్తించినట్టు ఇండోనేషియా వాతావరణ జియోఫిజిక్స్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని , సునామీ వచ్చే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. M6.1 #earthquake (#gempa) strikes 142 km N of #Semarang (#Indonesia) 7 min ago. Effects reported by eyewitnesses: pic.twitter.com/M19yatlAlO — EMSC (@LastQuake) July 6, 2020 -
మిజోరంలో భూకంపం
ఐజ్వాల్ : ఈశాన్య భారతంలో 12 గంటల వ్యవధిలోనే రెండవ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 4:10 గంటలకు మిజోరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( (ఎన్‌సిఎస్ )పేర్కొంది. దీని ప్రభావం ఎక్కువగా ఛంపాయ్ జిల్లాలో నమోదైందని దాదాపు 27 కిలోమీటర్ల లోతు వరకు భూమి కంపించినట్లు తెలిపింది. అయితే దీని ద్వారా ఎటువంటి ప్రాణనష్టం జరగలేని అధికారులు వెల్లడించారు. వరుస భూకంపాల వల్ల రాష్ర్టంలోని పలు చోట్ల ఇళ్లు ధ్వంసం అవడంతో పాటు రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఆదివారం 4:16 గంటలకు మణిపూర్‌లో భూకంపం సంభవించగా, రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్లు మణిపూర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎర్త్ సైన్స్ విభాగం వెల్లడించిన సంగతి తెలిసిందే. (ముంబైకి మరో ముప్పు ) జూన్ 18న ఐదు ఈశాన్య రాష్ర్టాల్లో భూకంపం సంభవించింది. ఛంపాయ్, షిల్లాంగ్ సహా ఐదు ప్రధాన నగరాల్లో భూకంపం భూ ప్రకంనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. వరుస భూకంపాలపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు . ప్రభుత్వానికి అన్నివిధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్పందించిన మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్‌తంగా కృతఙ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకున్నా ఆస్తినష్టం జరిగిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. (రైతు వేషంలో మంత్రి: సినిమా సీన్‌ను తలపించేలా.. ) -
ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు
న్యూఢిల్లీ: నాలుగు రోజుల వ్యవధిలోనే దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. బుధవారం రాత్రి 10:42 గంటలకు నోయిడాలో భూ ప్రకంపనలకు భయాందోళనలతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. భూకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా.. దీని తీవ్రతతో ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్ అంతటా భూ ప్రకంపనలు సంభవించాయి. 3.8 కిలోమీటర్ల లోతు వరకు ఈ ప్రభావం ఉందని ఎన్‌సిఎస్ వెల్లడించింది. అయితే ప్రాణనష్టం, ఆస్తినష్టం లాంటివి జరగలేదని నివేదించింది. నాలుగు రోజుల క్రితం మే 29న ఢిల్లీ సహా రోహతక్ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఒక్క రోజులోనే ఢిల్లీ పరిసరాల్లో వరుసగా భూమి కంపించగా, వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై వరుసగా 4.5, 2.9గా నమోదైంది. అంతేకాకుండా ఏప్రిల్ 12 నుంచి వరుస భూకంపాలతో ఢిల్లీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. -
ఇండోనేషియాలో భూకంపం
-
ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియా: తూర్పు ఇండోనేషియాలో సోమవారం వేకువజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. దీంతో భూకంపాలను సమీక్షించే సంస్థలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. బాండా సముద్ర ప్రాంతంలో భూ ఉపరితలం నుంచి 171 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మొదటి సునామీ హెచ్చరికను హిందూ మహా సముద్రం సునామీ వార్నింగ్ అండ్ మిటిగేషన్ సిస్టమ్(ఐఓటీడబ్లుఎంఎస్) జారీ చేసింది. సెకండ్ బులెటిన్‌లో ఈ సునామీతో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అంబన్ ఐలాండ్‌కు 380 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు స్పష్టం చేశారు. భూకంపం 2 నుంచి 3 సెకండ్ల పాటు ఉందని చెప్పారు. ఇదే ప్రాంతంలో గత నెల 26న 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని, కానీ ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ఇండోనేషియా పసిఫిక్ రింగ్‌పై ఉందని, అందువల్లే తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయని, వీటితో పెద్దగా ప్రమాదం లేదని స్థానిక అధికారుల తెలిపారు. 2004 సంవత్సరంలో 9.3 తీవ్రతతో సునామీ సంభవించడంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.2 లక్షల మంది చనిపోయిన సంగతి తెల్సిందే. ఒక్క ఇండోనేషియాలోనే 1.68 లక్షల మంది చనిపోయారు. -
ఇరాన్లో భూకంపం.. భయంతో పరుగులు
టెహ్రాన్ : ఇరాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై 6.1తీవ్రతతో ఏర్పడిన ఈ భూకంపం కెర్మాన్ ప్రావిన్స్‌లోని హజ్‌డాక్ అనే గ్రామాన్ని తాకింది. భూకంప శాస్త్రవేత్తల వివరాల ప్రకారం బుధవారం ఉదయం టెహ్రాన్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. 10 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించామని అది సంభవించగానే ఇళ్లల్లో నుంచి జనాలు బయటకు పరుగులు తీశారని చెప్పారు. దీనికారణంగా దాదాపు 60 మందిగాయాలపాలయ్యారని, ఆస్తి నష్టం కూడా చోటు చేసుకున్నట్లు తెలిపారు. తొలుత 6.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కాస్త తర్వాత 4 తీవ్రతతో ఓసారి 5.1 తీవ్రతతో మరోసారి ఏర్పడింది. ఈ ఏడాది నవంబర్లోనే 7.2తీవ్రతతో ఏర్పడిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దీని కారణంగా 600మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2003లో ఏర్పడిన 6.6 తీవ్రతతో ఏర్పడిన భూకంపం పెను విధ్వంసాన్నే సృష్టించి 26వేలమందిని బలితీసుకుంది. -
న్యూజిలాండ్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ఉత్తర తీరంలో శుక్రవారం వేకువజామున మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1 గా నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీచేశారు. ఈశాన్య తీరంలోని గిస్బోర్న్ సిటీ ఏరియాలో 19కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు. దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఉదయం 5గంటలకు మునుపే భూకంపం సంభవించినట్లు స్థానికుడు బిల్ మార్టిన్ చెప్పాడు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ఇంట్లో వస్తువులు చిందవందరగా పడిపోయాయని తెలిపాడు. తరచుగా భూ ప్రకంపనలు రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో చుట్టుపక్కల వాళ్లు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని బిల్ మార్టిన్ వెల్లడించాడు. గత రెండు రోజులుగా న్యూజిలాండ్ లో దాదాపు 7 తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయి. -
న్యూజిలాండ్‌లో భూకంపం: తీవ్రత 7.2 గా నమోదు
న్యూజిలాండ్: న్యూజిలాండ్ తీర ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2 గా నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. 159 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా.. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 4.37 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో తీర పరిసరప్రాంత వాసులంతా భయభ్రాంతులకు లోనైయ్యారు. నిన్న (బుధవారం) పసిఫిక్ ఐలాండ్‌లో భూకంపం సంభవించగా, రిక్టర స్కేలుపై దాని తీవ్రత 6.8 గా నమోదైంది. గతవారం ఇటలీలో భారీ భూకంపం (6.2) సంభవించడంతో దాదాపు 247 మంది మృత్యువాతపడిన సంగతి విధితమే. -
పపువా న్యూగినియాలో భారీ భూకంపం
పపువా న్యూగినియా: పపువా న్యూగినియాలో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూ ప్రకంపనలు వ్యాపించాయి. రాబౌల్ ప్రాంతంపై ఈ భూకంపం ప్రకంపం ప్రభావం పడినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు తెలియజేశారు. అయితే, నష్టానికి సంబంధించిన వివారాలు ఇంకా తెలియాల్సి ఉంది. గత మే నెలలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంబంధించి మొత్తం దీవిని వణికించిన విషయం తెలిసిందే. -
రష్యాలో భూకంపం..6.3 తీవ్రత నమోదు
మాస్కో: రష్యాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. దక్షిణ రష్యాలోని కురిలె ఐలాండ్‌లో బుధవారం భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా, దీనివల్ల చోటుచేసుకున్న ఆస్తి, ప్రాణనష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సెవెరో కురిల్స్క్ వద్ద 34 కిలోమీటర్ల లోతులోని భూకంప కేంద్ర నుంచి ప్రకంపనలు వ్యాపించినట్లు తెలిసింది. -
సిక్కింలో స్వల్ప భూకంపం, తీవ్రత 4 గా నమోదు
న్యూఢిల్లీ : నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ముఖ్యంగా సిక్కిం కేంద్రంగా ఈ ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0 గా నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 36 కిలోమీటర్ల నాభ్యంతరంగా ఈ స్వల్ప ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. ఎటువంటి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకూ అధికారిక ప్రకటనలు వెలువడలేదు.