
జకర్తా: ఇండోనేషియాలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.0 తీవ్రత నమోదైంది. తలాడ్ ఐలాండ్స్ సమీపంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఇండోనేషియా జియోగ్రఫీసిక్స్ ఏజెన్సీ బీఎంకేజీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
#Gempa Dirasakan Magnitudo: 6.0, Kedalaman: 11 km, 11 Feb 2023 15:55:06 WIB, Koordinat: 3.67 LU-126.76 BT (Pusat gempa berada di Laut 37 km Tenggara Melonguane) #BMKG https://t.co/OiHiTwvX8x
— BMKG (@infoBMKG) February 11, 2023
అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదు. దీని వల్ల సునామీ వచ్చే ప్రమాదం కూడా లేదని అధికారులు తెలిపారు.
చదవండి: టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు..