Iland
-
ఇండోనేషియాలో పేలిన అగ్ని పర్వతం.. ఆరుగురు మృతి
జకర్తా: ఇండోనేషియాలో అగ్ని పర్వతం పేలింది. ఇక్కడి ఫ్లోర్స్ ద్వీపంలోని మౌంట్ లెవోటోబి లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ విపత్తులో పలు ఇళ్లు దగ్ధమయ్యాయని, ఆరుగురు మృతి చెందారని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ మీడియాకు తెలిపింది.ఫ్లోర్స్ ద్వీపంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా బూడిద దాదాపు 2000 మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. సమీపంలోని గ్రామాన్ని వేడి బూడిద చుట్టుముట్టింది. ఈ ఘటనలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఆరుగురు మృతిచెందారు. ఈ పర్వత విస్ఫోటనం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో కూలిన ఇళ్ల కింద కొందరు సమాధి అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.వులాంగిటాంగ్ జిల్లాలో సంభవించిన ఈ అగ్నిపర్వతం పేలుడు కారణంగా సమీపంలోని పులులారా, నవోకోటే, హోకెంగ్ జయ, క్లాటన్లో, బోరు కెడాంగ్ గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఇండోనేషియాలో గత రెండు వారాల్లో ఇది రెండవ అగ్నిపర్వత విస్ఫోటనం. అక్టోబర్ 27న జరిగిన విస్ఫోటనంలో దట్టమైన బూడిద ఉవ్వెత్తున్న ఎగసిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామం
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 500వ రోజుకు చేరుకున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం స్నేక్ ఐల్యాండ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్నేక్ ఐల్యాండ్ విముక్తికి పోరాడిన ఉక్రెయిన్ సైనికులను సన్మానించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామమన్నారు. ఆక్రమణకు గురైన ప్రతి అంగుళాన్ని తిరిగి స్వా«దీనం చేసుకుంటామనేందుకు ఈ ఘటనే ప్రబల తార్కాణమని వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఏరోజు రికార్డయిందో తెలియలేదు. జెలెన్స్కీ శనివారం తుర్కియేలో ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా బలగాలు ఈ ఐల్యాండ్‌ను ఆక్రమించుకోగా ఉక్రెయిన్ జూన్ 30న తిరిగి స్వా«దీనం చేసుకుంది. కాగా, లీమాన్ పట్టణంలో శనివారం రష్యా రాకెట్ దాడిలో ఎనిమిది మంది మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. -
ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై తీవ్రత ఎంతంటే..?
జకర్తా: ఇండోనేషియాలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.0 తీవ్రత నమోదైంది. తలాడ్ ఐలాండ్స్ సమీపంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఇండోనేషియా జియోగ్రఫీసిక్స్ ఏజెన్సీ బీఎంకేజీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. #Gempa Dirasakan Magnitudo: 6.0, Kedalaman: 11 km, 11 Feb 2023 15:55:06 WIB, Koordinat: 3.67 LU-126.76 BT (Pusat gempa berada di Laut 37 km Tenggara Melonguane) #BMKG https://t.co/OiHiTwvX8x — BMKG (@infoBMKG) February 11, 2023 అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదు. దీని వల్ల సునామీ వచ్చే ప్రమాదం కూడా లేదని అధికారులు తెలిపారు. చదవండి: టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు.. -
ఏకాకి దీవిలో ఏకాకి ఇల్లు.. చూసేందుకు ఎగబడుతున్న జనం..
అదొక ఏకాకి దీవి. అందులో ఒక ఏకాకి ఇల్లు. ఏకాకి దీవిలో ఉన్న ఆ ఏకాకి ఇంటి చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఐస్లాండ్ దక్షిణ తీరానికి ఆవల ఉన్న ఈ ఏకాకి దీవి పేరు ఎల్లియోయే. ఇది ఐస్లాండ్లోని వెస్ట్మానేయార్ మునిసిపాలిటీ పరిధిలో ఉంది. ఇదివరకు ఇక్కడ కొద్దిపాటి జనాలు ఉండేవాళ్లు. చాలాకాలంగా ఇక్కడ మనుషులెవరూ ఉండటం లేదు. వందేళ్ల కిందట ఈ దీవిలో ఒక ఇల్లు వెలిసింది. ఈ దీవిలో ఉంటూ వస్తున్న చివరి మనుషులు 1930లో దీనిని విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఈ దీవి, ఇందులోని ఇల్లు పూర్తిగా ఖాళీగానే ఉంటున్నాయి. ప్రళయం ముంచుకొచ్చినప్పుడు తలదాచుకునే ఉద్దేశంతో ఒక శతకోటీశ్వరుడు ఇక్కడ ఇల్లు కట్టినట్లు ప్రచారం ఉన్నా, నిజానికి ఈ ఇంటిని ఎల్లియాయే హంటింగ్ అసోసియేషన్ చేపలు వేటాడేవాళ్లకు స్థావరంగా ఉపయోగపడేందుకు నిర్మించారని అధికారిక సమాచారం. ఈ ఇంటికి మంచినీటిపైపులు, విద్యుత్తు సరఫరా సౌకర్యాలేవీ లేవు. వర్షపునీటిని సేకరించి, ఆ నీటిని ఉపయోగించుకునే సౌకర్యం మాత్రమే ఉంది. ఖాళీగా ఉన్న ఈ దీవి గురించి, ఇందులోని ఇంటిని గురించి కథనాలు రావడంతో దీనిని చూసేందుకు చాలామంది ఆసక్తి ప్రదర్శించడంతో ఐస్లాండ్కు చెందిన టూరిస్ట్ కంపెనీలు ఇక్కడకు టూర్లు నిర్వహిస్తున్నాయి. బస చేసే సౌకర్యం లేకపోవడంతో, పగలంతా ఇక్కడ తిరిగినా, సాయంత్రం పడవలో బయలుదేరి, వెస్ట్మానేయర్ పట్టణానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, ఈ దీవిని చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతుండటం విశేషం. చదవండి: ఈ కొండపైకి చేరుకోవాలంటే ఆ దారి మాత్రమే దిక్కు! -
మనుషులు లేని దీవిలో ఆ ముగ్గురు 33 రోజుల పాటు..
వాషింగ్టన్: తెలియని ప్రాంతంలో ఒక్క పూట గడపాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటిది నర సంచారం లేని దీవిలో.. తిండి తిప్పలు లేకుండా నెల రోజులకు పైగా గడపడం అంటే మాటలు కాదు. ఇలాంటి భయంకర పరిస్థితి ఎదురయ్యింది ముగ్గురు వ్యక్తులకు. వీరంతా 33 రోజుల పాటు మనుషుల్లేని దీవిలో బందీలయ్యారు. నాలుగో మనిషి కనబడడు.. ఆహారం, నీరు లేదు. అదృష్టం కొద్ది అక్కడ కొబ్బరి చెట్లు ఉండటంతో.. ఇన్నాళ్లు బతికి బట్టకట్టగలిగారు. చివరకు 33 రోజుల తర్వాత ఆ దీవి నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఇంతకు వీరంతా ఆ దీవిలోకి ఎందుకు వెళ్లారు.. ఎలా బయటపడగలిగారు అనే విషయాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. క్యూబాకు చెందిన ఓ మహిళ, ఇద్దరు పురుషులు.. పడవలో సముద్రంలోకి వెళ్లారు. అలల తాకిడి ఎక్కువ కావడం వల్ల వారు ప్రయాణిస్తున్న పడవ బొల్తా పడింది. ఊహించని ఈ ప్రమాదానికి వారు బిక్క చచ్చిపోయారు. ఎలానో ధైర్యం తెచ్చుకుని చేతికి అందిన వస్తువులను పట్టుకుని సమీపంలోని దీవి వరకు ఈదుకుంటూ వెళ్లిపోయారు. ఇక వారు చేరుకున్న దీవి నర సంచారం ఉండని బహమాన్ దీవుల్లోని అతి చిన్న ద్వీపం అంగుయిలా కే. ఒడ్డుకు అయితే చేరగలిగారు కానీ అక్కడి నుంచి బయటపడే మార్గ కనిపించలేదు. చేసేదేం లేక అటుగా ఏమైనా ఓడలు, విమానాలు వస్తే సాయం అడగవచ్చని భావించి.. కాలం గడపసాగారు. ఇలా ఓ మూడు రోజులు గడిచాయి. వారితో తెచ్చుకున్న ఆహారం మొత్తం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దీవిలో ఏమైనా పండ్ల చెట్ల లాంటివి ఉంటాయేమోనని వెతకడం ప్రారంభించారు. అదృష్టం కొద్ది వారికి కొబ్బరి చెట్లు కనిపించాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. మొదట్లో కొబ్బరి బొండాల్లో నీరు తాగి, కొబ్బరిని తిని రోజులు వెళ్లదీశారు. కానీ ఎన్ని రోజులని ఇలా. సరైన ఆహారం లేక.. కేవలం కొబ్బరి మాత్రమే తీసుకుంటుండటంతో వారిలో నీరసం బాగా పెరిగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్ది నీరసం పెరగుతోంది.. బతుకు మీద ఆశ తగ్గుతోంది. ఇక తామంతా ఆ దీవిలోనే ఆకలితో అలమటించి సజీవ సమాధి అవ్వక తప్పదని భావించారు. అలా 33 రోజుల గడిచిపోయాయి. #UPDATE @USCG rescued the 3 Cuban nationals stranded on Anguilla Cay. A helicopter crew transferred the 2 men & 1 woman to Lower Keys Medical Center with no reported injuries. More details to follow.#D7 #USCG #Ready #Relevant #Responsive pic.twitter.com/4kX5WJJhs8 — USCGSoutheast (@USCGSoutheast) February 9, 2021 ఈ క్రమంలో ఫిబ్రవరి 8న అమెరికాకు చెందిన కోస్ట్ గార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి అటుగా ఎగురుతూ వచ్చింది. ఆ శబ్దం వారిలో చనిపోయిన ఆశలను రేకేత్తించింది. బతికిపోయాం.. ఇక బయటపడతాం అని భావించారు. తమ దగ్గరున్న దుస్తులను జెండాలుగా ఊపుతూ.. తమ గురించి ఎయిర్ క్రాఫ్ట్‌లోని వారికి అర్థం అయ్యేలా చేశారు. ఇక విమానంలో ఉన్న వారికి కింద ఏవో జెండాలు కదులుతున్నట్లు తోచి.. కాస్త కిందకు వచ్చారు. అక్కడ ఈ ముగ్గురిని చూసి షాకయ్యారు. ఆ తర్వాత పైలెట్ వీరి గురించి అధికారులకు తెలియజేశాడు. దాంతో ఆ దీవి వద్దకు హెలికాప్టర్‌ను పంపి ఆ ముగ్గురికి నీళ్లు, ఆహారంతో పాటు వారితో మాట్లాడేందుకు వీలుగా ఓ రేడియో వాకీ టాకీని కూడా అందించారు. అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో అదే రోజు వారిని రక్షించలేకపోయారు. దాంతో ఫిబ్రవరి 9న మరో రెస్క్యూ హెలికాప్టర్ అక్కడికి చేరుకుని ముగ్గురిని రక్షించింది. అనంతరం వారిని హాస్పిటల్‌కు తరలించారు. లక్కీగా వారిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.. నీరసం మినహా ఇతర అనారోగ్య సమస్యలు ఏం లేవని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఇక వీరిని కాపాడిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మీకింకా భూమ్మీద నూకలున్నాయి.. అందుకే బయటపడ్డారు.. మరో సారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి అంటూ నెటిజనులు సూచిస్తున్నారు. చదవండి: ఆరోగ్యం... క్యూబా భాగ్యం! స్కూల్ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..! -
లో లొంగదు
ఒక మారుమూల సముద్రంలో ఒక ద్వీపం ఉంది. ఓడల మీద సముద్రాలను నాగరకులు గాలించారు. నాగరకులు సర్వ ప్రపంచము, సముద్రపు నీళ్లలో తేలిన ప్రతిమంటిగడ్డ తాము సాధించామని అనుకొన్న తరువాత ఆ ద్వీపం ఉన్నదని తెలుసుకునేందుకే కొన్ని వేల యేండ్లు పట్టినవి. తెలుసుకోవటమే ఆలస్యము. మతాలు, వర్తకులు, తుపాకులు అక్కడికి చేరినవి. ఒక నాగరకజాతి సేనానాయకుడు ఆ ద్వీపానికి సైనిక నియంత. అతడు బ్రహ్మచారి. అనగా అవివాహితుడన్నమాట. ఆ ద్వీపము శీతమండలాల్లో ఉండటం మూలంగా అక్కడి జనులు తెల్లనివాళ్లు. ఇతర ఖండములలోని అనాగరకులవంటివారు. అనగా కోట్ల కొలది సంవత్సరాలు బ్రతికిన జాతి అన్నమాట. చెట్టులో– పుట్టలో, సూర్యునిలో – చంద్రునిలో, మెరుపులో– మేఘములోనేదో దివ్యశక్తి యున్నదని దాని నారాధించినవాళ్లు. జీవుణ్ణి కాలిక్రిం బెట్టి త్రొక్కరు. బంగారము నాణెముగా వాడుకోరు. దానియందు తేజశ్శక్తి ఉన్నదని ఆరాధిస్తారు. కుండపెంకులలో వండుకొని తింటారు. లోహపాత్రలు నాగరకత అని యెరుగరు. శరీరావయవములు కావలసినంత మాత్రము కప్పుగొంటారు. ఈ యనాగరకులు నాగరకులయ్యే రోజులు వచ్చి ఆ ద్వీపం నాగరకుల కంట బడ్డది. సైనిక నియంత ఒక స్త్రీని చూచాడు. ఆమె అందం అతని కళ్లు పట్టరాకండా ఉండిపోయింది. ఆవిడ మొగుడికి కబురు పంపించాడు– నీ భార్యని నాకు తోలిపెట్టమని. ఆ జీవుడు యేమి చేస్తాడూ? ఇదివరకే తమ ద్వీపంలో జరిగిన ఘోరాలు తెలుసు. అయినా జీవుడు పెనగులాడటం స్వభావం. అది అన్యాయ మని, తన ప్రాణము పోయినా భార్యను వదిలిపెట్టనని కబురంపించాడు. నియంతకు కోపం వచ్చింది. పదిమంది సైనికులు, తుపాకులతో వాని యింటికి వెళ్లాడు. వీళ్లు వస్తారని తెలిసి పొయ్యిలో పెట్టుకొనే పొడుగాటి పుల్లలు తానొకటి, తన పెద్ద కొడుకొకటి చేతులతో పుచ్చుకొని, గుడిసె ముందర నిలుచున్నారు. వారి యాయుధాలను చూస్తే నియంతకు నవ్వు వచ్చింది. అతడు ‘‘ఎందుకు నవ్వుతావు’’ అని యడిగాడు. నియంత అన్నాడు: ‘‘ఓరి మూర్ఖుడా! మా తుపాకులముందు నీ కట్టెపుల్లలు నిలుస్తావా?’’. అతడన్నాడు కదా– ‘‘నా కట్టెపుల్లలు నీ తుపాకులకు సమాధానము చెపుతవని గాదు నే నీ కర్రలు పుచ్చుకొన్నది. నా మనస్సు నీ మనస్సుకు సమాధానం చెప్పవలెనని.’’ ఒక్క కత్తి విసరుతో తండ్రీకొడుకుల తలలు తెగిపోయినవి. నియంత గుడిసెలో ప్రవేశించి అతని భార్యను తీసుకు రాబోయినాడు. ఆరేండ్ల మొదలు చనుబాలు త్రాగే శిశువు వరకు నలుగురు పిల్లలు ఏడవ మొదలుపెట్టారు. ఆ స్త్రీ భర్త శవం, కొడుకు శవం మీదబడి యేడవటం మొదలుపెట్టింది. సైనికులు శవాలను సముద్రంలో పారవేశారు. ఆమె యింక పిల్లలను పట్టుకొని యేడవటం మొదలుపెట్టింది. సైనికులు నియంత ఆజ్ఞతో పెద్దపిల్లలను ముగ్గురినీ తల్లి చేతులలోంచి లాక్కుని పదిపదకొండు సార్లు విదిలించి వేయగా వేయగా వాళ్లు దెబ్బలు తగిలి, ఉస్సురని ప్రాణాలు కడవట్టి చనిపోయినారు. ఆ స్త్రీ పాలుత్రావు పిల్లతో నియంత యింటికి వెళ్లింది. ఈ కథ జరిగి అయిదేళ్లయింది. ఆ స్త్రీ ఆ పిల్లతో కాలం పుచ్చుతోంది. నియంత– ఆ పిల్లకూడ పోతేగానీ నీవు నాతో సరిగా ఉండవు. స్త్రీ– నీకన్న కర్కోటకుడవు నీవే! ఈ పసిపిల్ల ప్రాణములు కూడా తీస్తావా? నియంత– నిన్ను తీసుకువచ్చినప్పుడు ఇది పసిపిల్ల. ఇప్పుడు కాదే! దీని యీడు పిల్లలను అప్పుడు నీ దగ్గరనుండి లాగివేయలేదా? అట్లాగే యిప్పుడూను. ఆ స్త్రీకి అతనితో అయిదేండ్లున్న తరువాత అతని యేమాటకు ఎంత అర్థమో తెలిసినది. తన బిడ్డ తనకు మిగలదని తెలిసింది. పిల్లను చేతిలో పెట్టి ‘‘యిదిగో, చంపివేయి. ఈ పిల్ల ఉన్నన్నాళ్లు నేను దానిని వదిలిపెట్టలేను’’ అన్నది. అతడు ఆ పిల్లను నరికాడు. ఆమె యేడుస్తూ వెళ్లిపోయింది. ఆమె కొన్ని రాత్రులు ఉరి పోసుకుందామనుకుంది. పోసికోలేదు. సముద్రములో బడి చద్దామనుకుంది. చావలేదు. కిరసనాయిలు మీద పోసికొని నిప్పు ముట్టించుకుందా మనుకుంది. ముట్టించుకోలేదు. యెన్నో అనుకుంది. ఏమీ చేయలేదు. కొన్నాళ్లకు ఒక రాత్రి నియంత తప్ప త్రాగి మదించిన కళ్లతో ఆమె గదికి వచ్చాడు. నియంత– నీ మగడు, నీ పిల్లలు పోయి పదేళ్లయింది. స్త్రీ– నా ద్వీపపు స్వాతంత్య్రం పోయి పాతిక యేండ్లయింది. నియంత– ఇంకా యెన్నాళ్లీ దుఃఖం? స్త్రీ– ఈ శరీరం వున్నన్నాళ్లు. నియంత– నీకు ఏమి తక్కువగా ఉంది? పూర్వంకన్న మంచిదుస్తులు ధరిస్తున్నావు. మంచి భోజనం చేస్తున్నావు. నీ జాతికన్న నా జాతి గొప్పది. నీ భర్తకన్న నేను గొప్పవాడను. స్త్రీ– నా భర్తకన్న గొప్పవాడవు కావు. నియంత– కానా! స్త్రీ– భార్య పిల్లలను రక్షించుకునేందుకు కర్రపుచ్చుకొని నిలబడ్డాడు. రక్షించలేనని తెలుసు. అయినా తన ధర్మం తాను చేశాడు. తాను చచ్చిన తరువాతగాని నిన్ను నా దగ్గరకు రానీయలేదు. నేను నిజముగా నీ భార్యనై ఉంటే నీకన్న బలవంతుడు నాకోసం వస్తే, నీవు పారిపోయేవాడవు. నియంత– మరి యిటువంటివాడితో నీవు సంసార మెందుకు చేస్తున్నావు? స్త్రీ– నేను నీతో సంసారము చేయుట లేదు. నియంత– ఈ మాటలు వింటే యెవరైనా నిన్ను మూఢురాల వనుకొంటారు. స్త్రీ– నేను వాళ్లని మూఢులనుకొంటాను. నియంత– అయితే నీకు నాతో ఉండటం యిష్టం లేదన్నమాట. స్త్రీ– లేదని నీతో చెప్పుట యిది యెన్ని లక్షలో సారి. నియంత– నిన్ను చంపేస్తాను. స్త్రీ– పదియేళ్ల నుండి అల్లా చేస్తావేమోయని యెదురు చూస్తున్నాను. నియంత– నీకు చావంటే అంత యిష్టమా? స్త్రీ– అంతాయింత యిష్టమా! నియంత– ఎందుకు చావవు? సముద్రంలో పడి చావవచ్చు. ఉరి పోసికొని చావవచ్చు. స్త్రీ– నా కట్లా చావటం యిష్టం లేదు. నియంత– ఎట్లా చావటం యిష్టం? స్త్రీ– నీకు కోపము తెప్పించి నువ్వు నన్ను చంపితే చావాలని. నియంత– అంటే, నీకు నామీద ప్రేమ ఉన్నదన్నమాట. స్త్రీ– అవును, ఉంది. నా భర్త, నా పిల్లలు నీ చేతిమీదుగా చచ్చారు గనుక అల్లా నీ చేతిమీదుగానే చద్దామన్నంత ప్రేమ. నియంత– ఈ మాటల కేమిగాని నీకు చావటానికిష్టం లేదు. స్త్రీ– పొరపాటు. చావటాని కిష్టం ఉన్నది. ఆ యిష్టము కూడా ఒళ్లంతా తగలబెడుతూ ఉన్నంత యిష్టం. కాని చావు రెండు రకాలు. తనంతట తాను చచ్చే చావు. యెదటివాళ్లు చంపితే చచ్చేచావు. నాకు రెండవ చావే యిష్టం. నియంత– అంటే నాతో కలిసి సుఖించడం యిష్టమన్నమాట. స్త్రీ– నీవు పశువువు. నీ నాగరకత అంతా నీవు చేసే సురాపానంలో, ధరించే దుస్తుల్లో, తుపాకి మందులో ఉంది. నీ మనసులో లేదు. నీ జాతిలో లేదు. నేను బ్రతుకుచున్నానన్న విషయం నీకాశ్చర్యంగా ఉంది. ఉరి పోసికునో, సముద్రంలో పడో చావటం నా జీవుడికి యిష్టం లేదు. నా జీవుడు ఈ శరీరాన్ని పట్టుకున్నాడు. వాడంతట వాడు వదలిపోడు. ఆ నా చనిపోయిన భర్తకోసం, పిల్లల కోసం గుండె అటమటించి చావటం, మహాగ్ని జ్వాలలలో మ్రగ్గిపోవటం ఈ జీవుడికి యిష్టం. ఈ జీవుడికి యిది యొక అనుభవం. చచ్చిపోవటానికి యిష్టపడడు. సౌఖ్య మనుభవిద్దామని కాదు. దుఃఖమనుభవిద్దామని. సౌఖ్యమో, దుఃఖమో ఈ శరీరంతో పుట్టి, యీ శరీరానికి సంబంధించినవి అనుభవించటమే అతని కిష్టం. ఈ శరీరానికి, యీ జీవుడికి యెడతెగరాని లంకె. నా అంతట నేను చావటం నా కిష్టం లేదు. నీవు చంపితే చచ్చిపోవటం యిష్టం. మృత్యువు దానియంతట అది వస్తే యింకా యిష్టం. అట్లాగే ఈ జీవుడు ఈ శరీరంతో తన యిష్టం వచ్చిన సౌఖ్యాన్ని అనుభవించి సౌఖ్యం అనుభవించా ననుకుంటాడు. ఇతరులవల్ల బలవంతంగా చేయబడ్డ అనుభవం అది వాడికి సౌఖ్యం కాదు. అది దుఃఖమే. ఆ దుఃఖమైనా అనుభవించటం అతని కిష్టం. నియంత– అయితే నీవు నా కక్కర లేదు. స్త్రీ– ఊరికే అనట మెందుకు? నియంత ఆమెను చంపెను. చనిపోవుచున్న యామె పెదవిమీద సంతోషపు నవ్వు తాండవించెను. కొనయూపిరితో నిట్టనెను: ‘‘నీవు నీ జన్మలో చేసిన మంచి పని యిది యొక్కటియే. నేను చనిపోవు చుంటిని గదా! నీవు తరువాత యేమి చేసెదవు?’’ నియంత– మరల నింకొక స్త్రీని సంపాదించెదను. స్త్రీ– నీకు తగిన మాట! నీ జాతికి జీవుని యిష్టము తెలియదు. ఆమె కొన్ని రాత్రులు ఉరి పోసుకుందామనుకుంది. పోసికోలేదు. సముద్రములో బడి చద్దామనుకుంది. చావలేదు. కిరసనాయిలు మీద పోసికొని నిప్పు ముట్టించుకుందామనుకుంది. ముట్టించుకోలేదు. యెన్నో అనుకుంది. ఏమీ చేయలేదు. కొన్నాళ్లకు ఒక రాత్రి నియంత తప్ప త్రాగి మదించిన కళ్లతో ఆమె గదికి వచ్చాడు. విశ్వనాథ సత్యనారాయణ -
కన్న బిడ్డల కోసం కళ్లల్లో వత్తులు వేసుకుని..
తాడేపల్లి రూరల్ : ‘‘నా కన్నబిడ్డలు వస్తారు. నన్ను ఇంటికి తీసుకువెళతారు. ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్లారు. నేను ఇక్కడే ఉంటా. లేదంటే నా బిడ్డలు కంగారు పడతారు. చలి గాలైనా పర్వాలేదు. నా కుమారులు వచ్చే వరకు నేను కదలను.’’ అంటూ ఓ అమాయక తల్లి తన కన్న బిడ్డల రాక కోసం ఆశగా ఎదురు చూస్తోంది. చలిగాలులకు వణుకుతూ రోడ్డుపైనే కళ్లల్లో వత్తులు వేసుకుని చూడసాగింది. కనికరం లేకుండా తనను వదిలించుకు పోయారని గ్రహించలేకపోయింది. కనిపెంచిన బంధాన్నే తెంచుకుపోయారని గుర్తించేందుకు అమ్మ మనసు అంగీకరించ లేకపోతోంది. వివరాల్లోకి వెళితే..కొద్ది రోజుల కిందట సుమారు 70 ఏళ్ల వృద్ధురాలిని కొందరు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటరులో వదిలి వెళ్లారు. రాత్రిళ్లు చలిగాలులకు వృద్ధురాలు పడుతున్న ఇబ్బందులు గమనించిన స్థానికులు ఆమెకు దుప్పటి ఇచ్చి సెంటర్లోని పోలీస్ ఐలాండ్‌లో ఉంచి పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీనిపై ఎస్ఐ వినోద్‌కుమార్ స్పందించి ఆమెను డోలాస్‌నగర్‌లోని మేయర్స్ హోం అనే స్వచ్ఛంద సంస్థలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ వృద్ధురాలు అక్కడ నుంచి కదిలేందుకు ససేమిరా అంటూ భీష్మించుకు కూర్చుంది. తన కుమారులు ఇక్కడ విడిచి వెళ్లారని వారు వచ్చి తీసుకువెళతారని కన్నబిడ్డలపై మమకారాన్ని చూపుతోంది. తన పేరు అప్పల నరసమ్మ అని, ఊరు తూర్పు గోదావరి జిల్లా అని చెబుతున్న ఆ వృద్ధురాలిని అతికష్టం మీద పోలీసులు ఆదివారం రాత్రి మేయర్స్ హోమ్‌కు తరలించారు.