అదొక ఏకాకి దీవి. అందులో ఒక ఏకాకి ఇల్లు. ఏకాకి దీవిలో ఉన్న ఆ ఏకాకి ఇంటి చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఐస్‌లాండ్ దక్షిణ తీరానికి ఆవల ఉన్న ఈ ఏకాకి దీవి పేరు ఎల్లియోయే. ఇది ఐస్‌లాండ్‌లోని వెస్ట్‌మానేయార్ మునిసిపాలిటీ పరిధిలో ఉంది. ఇదివరకు ఇక్కడ కొద్దిపాటి జనాలు ఉండేవాళ్లు. చాలాకాలంగా ఇక్కడ మనుషులెవరూ ఉండటం లేదు. వందేళ్ల కిందట ఈ దీవిలో ఒక ఇల్లు వెలిసింది. ఈ దీవిలో ఉంటూ వస్తున్న చివరి మనుషులు 1930లో దీనిని విడిచిపెట్టారు.
అప్పటి నుంచి ఈ దీవి, ఇందులోని ఇల్లు పూర్తిగా ఖాళీగానే ఉంటున్నాయి. ప్రళయం ముంచుకొచ్చినప్పుడు తలదాచుకునే ఉద్దేశంతో ఒక శతకోటీశ్వరుడు ఇక్కడ ఇల్లు కట్టినట్లు ప్రచారం ఉన్నా, నిజానికి ఈ ఇంటిని ఎల్లియాయే హంటింగ్ అసోసియేషన్ చేపలు వేటాడేవాళ్లకు స్థావరంగా ఉపయోగపడేందుకు నిర్మించారని అధికారిక సమాచారం. ఈ ఇంటికి మంచినీటిపైపులు, విద్యుత్తు సరఫరా సౌకర్యాలేవీ లేవు. వర్షపునీటిని సేకరించి, ఆ నీటిని ఉపయోగించుకునే సౌకర్యం మాత్రమే ఉంది.
ఖాళీగా ఉన్న ఈ దీవి గురించి, ఇందులోని ఇంటిని గురించి కథనాలు రావడంతో దీనిని చూసేందుకు చాలామంది ఆసక్తి ప్రదర్శించడంతో ఐస్‌లాండ్‌కు చెందిన టూరిస్ట్ కంపెనీలు ఇక్కడకు టూర్లు నిర్వహిస్తున్నాయి. బస చేసే సౌకర్యం లేకపోవడంతో, పగలంతా ఇక్కడ తిరిగినా, సాయంత్రం పడవలో బయలుదేరి, వెస్ట్‌మానేయర్ పట్టణానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, ఈ దీవిని చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతుండటం విశేషం.
చదవండి: ఈ కొండపైకి చేరుకోవాలంటే ఆ దారి మాత్రమే దిక్కు!
Comments
Please login to add a commentAdd a comment