కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 500వ రోజుకు చేరుకున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం స్నేక్ ఐల్యాండ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్నేక్ ఐల్యాండ్ విముక్తికి పోరాడిన ఉక్రెయిన్ సైనికులను సన్మానించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామమన్నారు.
ఆక్రమణకు గురైన ప్రతి అంగుళాన్ని తిరిగి స్వా«దీనం చేసుకుంటామనేందుకు ఈ ఘటనే ప్రబల తార్కాణమని వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఏరోజు రికార్డయిందో తెలియలేదు. జెలెన్‌స్కీ శనివారం తుర్కియేలో ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా బలగాలు ఈ ఐల్యాండ్‌ను ఆక్రమించుకోగా ఉక్రెయిన్ జూన్ 30న తిరిగి స్వా«దీనం చేసుకుంది. కాగా, లీమాన్ పట్టణంలో శనివారం రష్యా రాకెట్ దాడిలో ఎనిమిది మంది మరణించారని ఉక్రెయిన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment