liberation
-
సనాతన ధర్మం గురించి నాతో చర్చించే దమ్ముందా..?
-
విమోచన దినంపై కాంగ్రెస్ వైఖరేంటి?: బండి సంజయ్
రసూల్‌పురా: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జై తెలంగాణ అని నినదించి ఇపుడు ఎందుకని విమోచన దినోత్సవం జరపడం లేదో సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిజాం నవాబు, రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన అమరవీరుల విశేషాలను తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు కేంద్ర సాంస్కృతిక, హోంశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తు న్నామని తెలిపారు.ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రతీ ఒక్కరు చూడాలని భావిత రాలకు నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆకృత్యాల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు, అవమానాలు పడ్డారో, ఏయే ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగాయో ఫొటో ఎగ్జిబిషన్ తెలియజేస్తుందని చెప్పారు. గతంలో ఉన్న రజాకార్ల దళం నేడు ఎంఐఎం పార్టీగా మారిందని అలాంటి దళాన్ని నాటి బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొగుడుతున్నారని విమర్శించారు.బీఆర్ఎస్ సమైక్యదినం అంటే కాంగ్రెస్ వాళ్లు ప్రజాపాలన అంటున్నారని ప్రజావంచన దినోత్సవం అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. పాఠ్యాంశాల్లో తెలంగాణచరిత్ర చేర్చాలన్న ఆలోచన త్వరలో ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్. చింతల రామచంద్రారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పీఎల్.శ్రీనివాస్ నగర నాయకులు పాల్గొన్నారు. -
93 పేలుళ్ల కేసు నుంచి తుండాకు విముక్తి
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసు నుంచి మాఫియా డాన్, వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు అబ్దుల్ కరీం తుండా(81)కు ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించింది. అతడిపై మోపిన అభియోగాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్ చూపలేకపోయిందని కోర్టు పేర్కొంది. తుండాపై ఉన్న అభియోగాలన్నిటినీ కొట్టి వేస్తూ గురువారం అజ్మేర్లోని ఉగ్రవాద, విచ్ఛిన్నకర కార్యకలాపాల నివారణ చట్టం (టాడా) కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో రైళ్లలో బాంబులను అమర్చినట్లు ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో ఇర్ఫాన్, హమీదుద్దీన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. బాబ్రీ మసీదు విధ్వంసానికి ఏడాదైన సందర్భంగా 1993 డిసెంబర్ 5, 6 తేదీల్లో లక్నో, కాన్పూర్, హైదరాబాద్, సూరత్, ముంబైల్లోని రైళ్లలో వరుసగా పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోగా 22 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తుండా బాంబుల తయారీకి సహకరించినట్లు ఆరోపణలున్నాయి. కాగా, హమీదుద్దీన్ 14 ఏళ్లుగా, ఇర్ఫాన్ 17 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. బాంబు పేలుళ్లతోపాటు వీరిపై పలు కేసులు నమోదై ఉన్నాయి. -
Freedom: స్వేచ్ఛ
సృష్టి లోని జీవులన్నీ కోరుకునేది స్వేచ్ఛ. కాని, అది ఎంత వరకు సాధ్యం? మనమే తల్లి తండ్రులని ఎంచుకుని, పుట్టటం మన చేతుల్లో లేదు అనుకుంటాం. పుట్టిన తరువాత ఇక చేయగలిగినది ఏమీ లేదు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆ బంధంలో నుండి బయట పడాలని తాపత్రయం. బొడ్డు కోసి మాయనుండి వేరైన తరువాత అసలైన బంధనాల్లో ఇరుక్కుపోవటం జరిగింది. అప్పటి వరకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. పూర్తిగా తల్లితండ్రుల మీద ఆధారపడతారు. అక్కడి నుండి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధార పడక తప్పదు. జ్ఞానసముపార్జన కోసం గురువుల మీద ఆధారపడ వలసి వస్తుంది. ఆహారం కోసం అయితే వడ్డించినవారి మీద, వండినవారి మీద, సంబారాలని ఇంటికి తెచ్చినవారి మీద, పంటలు పండించినవారి మీద – ఇట్లా ఎందరి మీదనో ఆధార పడకుండా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళవు కదా! ముందుగా అవన్నీ తెచ్చుకోవటానికి కావలసిన డబ్బులు ఉండాలి. అవి ఆకాశంలో నుండి ఊడి పడవు. మనం స్వంతంగా తయారు చేయలేము. మఱి, నేను స్వేచ్ఛాజీవిని. ఎవరి మీదా ఆధారపడను అనటం ఎంత సమంజసం? ఆలోచించాల్సిన విషయమే కదా! ఇది ఇరుకుగా ఉన్న గర్భంలో నుండి బయట పడి స్వేచ్ఛాజీవిని అనుకున్న మానవుడికి తాను ఇరుక్కున్న చుట్టరికపు బంధనాల నుండి విడివడాలని అంతర్గతంగా అంతరంగపు అట్టడుగు పొరల్లో మాటుపడి ఉన్న కోరిక. ఈ బంధనాలనే పురాణాలు ప్రతీకాత్మకంగా వృత్రాసురుడు అని చెప్పాయి. చుట్టుకున్నవే చుట్టరికాలు, బంధించేవే బంధనాలు. నిజమైన స్వేచ్ఛ అంటే దేనినీ పట్టుకొని ఉండక పోవటం. దేనినీ పట్టించుకోక పోవటం అనుకుంటారు. నిజమైన స్వేచ్ఛాజీవి అందరికీ సమంగా అందుబాటులో ఉంటాడు. వీరు నాకు ఇష్టులు, మేలు చేసినవారు, బంధువులు, భవిష్యత్తులో నాకు సహాయ పడతారు, నాకు కీడు చేశారు, ఎందుకూ పనికిరారు మొదలైన భావనలతో ప్రవర్తించటం అభిప్రాయాల ఊబిలో కూరుకుపోవటమే. అది వ్యక్తుల విషయం మాత్రమే కాదు, వస్తువులు, సిద్ధాంతాలు మొదలైనవి కూడా. ఎదుటివారి పట్ల ఎటువంటి అభిప్రాయమూ లేకుండా వారికి మేలు కలిగేట్టు తనకు చేతనైనంత వరకు ప్రవర్తించటం, తరువాత ఎటువంటి ప్రతిఫలం కాని, గుర్తింపు కాని ఆశించకుండా ఉండటం స్వేచ్ఛాజీవి లక్షణం. ఏ మాత్రం ఆశించినా అది బంధమే. ఒకవేళ ఏదైనా ప్రతిఫలం లభిస్తే, దానిని ఎటువంటి వ్యామోహం లేకుండా స్వీకరించాలి. ‘‘వద్దు, అది నన్ను బంధిస్తుంది.’’ అని నిరాకరిస్తే, అదే పెద్ద బంధనం అవుతుంది. ‘‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. తరువాత బంధనాలలో ఇరుక్కుంటాడు’’ అన్న ఆంగ్ల సామెత వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి. నిజంగానే మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నామా? స్వేచ్ఛ ఎవరు ఇచ్చేది కాదు. తనంతట తాను అనుభవించ వలసినది. ఆ విధంగా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన అంతా. స్వ+ ఇచ్ఛ అంటే తన అసలైన ఇచ్ఛ, అంటే కోరిక ఏదైతే ఉన్నదో, బంధనాల నుండి విడివడాలని – అది నెరవేరటానికి తగినట్టుగా ఉండగలగటమే స్వేచ్ఛ. దానిని గుర్తించక పోవటం వల్ల స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండగలగటం, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం, ఎవరినీ దేనినీ లెక్కచేయకపోవటం అనే అపోహ వ్యాపించి ఉంది లోకంలో. సర్వసంగపరిత్యాగులని చూస్తే ఈ విషయం బాగా తెలుస్తుంది. వారికి ఇల్లు, బంధువులు మొదలైన బంధాలు ఉండవు. పేరు ప్రఖ్యాతులు వంటి చుట్టలలో (వలయాల్లో) ఇరుక్కోరు. ఈ క్షణాన మోక్షం ఇస్తానంటే ఏవో సద్దుకొని వస్తాను అనకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరే వారు ఎంత మంది ఉంటారు? అదీ నిజమైన స్వేచ్ఛ అంటే. – డా. ఎన్. అనంత లక్ష్మి -
Nithari Killings: నిఠారి వరుస హత్యల కేసులో దోషులకు విముక్తి
ప్రయాగ్‌రాజ్/న్యూఢిల్లీ: 2006 నాటి నిఠారి వరుస హత్యల కేసులో నిందితులుగా మణీందర్ సింగ్ పంధేర్, పని మనిషి సురేంద్ర కోలీలకు అలహాబాద్ హైకోర్టు విముక్తి కల్పించింది. వారికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. నోయిడాలోని ఓ బంగ్లా వెనుక 8 మంది చిన్నారుల ఎముకలు కనిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఇద్దరూ కలిసి పలువురు బాలికలపై లైంగికదాడికి, దారుణ హత్యలకు పాల్పడటంతోపాటు నరమాంస భక్షకులుగా మారినట్లు కూడా ఆరోపణలొచ్చాయి. అత్యాచారం, హత్య నేరాలకు పాల్పడిన వీరిద్దరికీ ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ పంధేర్, కోలీలు వేసిన పిటిషన్‌ను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్విల ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎటువంటి సందేహాలకు తావు లేకుండా వీరిద్దరికీ వ్యతిరేకంగా కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ధర్మాసనం పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పుతో పంధేర్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైందని ఆయన లాయర్ మనీషా భండారి చెప్పారు. అయితే, మరో కేసులో జీవిత ఖైదు శిక్షపడిన కోలీ మాత్రం జైలులోనే ఉంటాడని అన్నారు. తీర్పు ప్రతి అందాక తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.2007లో పంధేర్, కోలీలపై 19 కేసులు నమోదయ్యాయి. అయితే, సాక్ష్యాలు దొరకలేదంటూ మూడు కేసుల్లో మాత్రమే సీబీఐ అభియోగ పత్రాలు నమోదు చేయగలిగింది. మిగతా 16 కేసులకుగాను మూడు కేసుల నుంచి కోలీ బయటపడ్డాడు. ఒక కేసులో విధించిన మరణశిక్షను కోర్టు జీవిత ఖైదుగా మార్చింది. కోలీకి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో 12 కేసుల నుంచి అతడికి విముక్తి లభించింది. అదే సమయంలో, పంధేర్‌పై ఉన్న ఆరు కేసుల్లో, ఒకటి సీబీఐ వేసింది కాగా, మరో అయిదు బాధితుల కుటుంబాలవి. గతంలో సెషన్స్ కోర్టు అతడిపై ఉన్న మూడు కేసులను కొట్టివేసింది. మిగతా మూడింటిలో 2009లో ఒకటి, తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో రెండు కేసుల నుంచి పంధేర్ బయటపడినట్లయిందని అతడి లాయర్ చెప్పారు. కోలీ ఘజియాబాద్ కారాగారంలో, అతడి మాజీ యజమాని పంధేర్ నోయిడా జైల్లో ఉన్నారు. -
సెప్టెంబర్ 17 : BRS పునరుజ్జీవనం vs BJP విమోచనం
సెప్టెంబర్ 17 వచ్చిందంటే రాజకీయ పార్టీలు కొత్త వివాదాన్ని తీసుకొస్తున్నాయి. చరిత్రలో ఇలా జరిగింది.. ఇది మా వాదన అంటూ ఒక్కో రకంగా చెప్పుకుంటున్నాయి. నిజంగా ఏం జరిగిందన్నది మరుగునపడి పార్టీలు తీసుకొస్తున్న కొత్త వాదన మీద వర్తమానం నడుస్తోంది. నాడు ఏం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తోన్న రాజకీయనాయకులు జరిగిన దానికి తమదైన భాష్యం చెప్పుకుంటున్నాయి. సాక్షికి ఇచ్చిన వ్యాసాల్లో రెండు విరుద్ధ భావాలను పంచుకున్నాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. బీఆర్ఎస్ తరపున మంత్రి శ్రీనివాసగౌడ్, బీజేపీ తరపును విద్యాసాగర్‌రావు అందించిన ప్రత్యేక వ్యాసాలు ఇవి. BRS : పునరుజ్జీవనం : ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యమంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. కృష్ణా–గోదావరీ జలాలను తెలంగాణలోని చేను చెల్కలను తడపడానికీ, చెరువులను నింపడానికీ, తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమానికీ ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. అలా చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రతిష్ఠాత్మకమైనది ‘పాలమూరు–రంగారెడ్డి.’ తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు.’ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష, ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా–గోదావరీ జలాలను చేను చెల్కలకు, చెరువులను నింపడానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమాన్ని ప్రథమ ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ఉన్న దక్కన్ పీఠభూమి శిఖరంగా ఉన్న తెలంగాణను ఆకుపచ్చ సీమగా మలిచే బృహత్తర కార్యక్రమాన్ని కేసీర్ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సమాంతరంగా నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెంపు ప్రాతిపదికగా ప్రజల భాగ స్వామ్యంతో చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ అపూర్వ ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక సామాజిక సాంస్కృతిక వికాసం పునరుజ్జీవం పొందుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల దాష్టీకాల వలన తెలంగాణ సంక్షుభితంగా మారింది. పాలమూరు జిల్లాలో మానవ జీవన విధ్వంసం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ మనిషికి మనుగడకు మహా యుద్ధమే జరిగింది. ‘నీరు పల్లమెరుగు’ అనే కాలం చెల్లిన నమూనాతో తెలంగాణలో అత్యధిక చెరువులు ఉన్న ఉమ్మడి పాలమూరుపై నిర్లక్ష్యం చేసి బిరా బిరా కృష్ణమ్మను రానివ్వకుండా దగా చేశారు. తమ కళ్ళముందు పారుతున్న నీటిని కూడా చెరువులో నిల్వ కాకుండా చేశారు. అదే కృష్ణా– గోదావరులతో కోస్తా ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చుకున్నారు. గతి తప్పిన రుతువులు, బోర్ బావులతో వ్యవసాయం బావురుమన్నది. నీరు లభ్యం కాని స్థితిలో తీవ్ర దుర్భిక్షం నడుమ జీవితం నిత్య మరణంగా మారిన నేపథ్యంలో బతకడానికి దేశ విదేశాలలో వలస కూలీలుగా కట్టు బానిస జీవితం వెల్లబోస్తున్న దైన్యానికి పాలమూరు ప్రజానీకం నెట్టబడింది. మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని అంతిమ విజయతీరం వైపు చేర్చడానికి కేసీఆర్ చేపట్టిన అనేక ప్రజాస్వామ్య ఉద్యమ వ్యూహాల్లో భాగంగా 2009 లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుండి ఎన్నికైనారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు, భోగోళిక స్థితిగతులను అవగాహన చేసుకున్నారు. జీవ వైవిధ్యానికి అనువుగా నల్ల రేగళ్లు, ఎర్ర చెల్కలు, ఇసుక భూములు ఉన్నాయక్కడ. నీరు అందితే దక్కన్ అన్నపూర్ణగా విలసిల్లే భవిష్యత్ ఉందని నిర్ధారించుకున్నారు. వలసలు వెళ్లిన ఇక్కడి ప్రజలు తిరిగి రావడమే కాదు, పక్క ప్రాంతాల నుండి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చే దశకు చేరుకోవాలని కోరుకున్నారు. ఈ ప్రాంత లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించిన సంతోషంలో కృతజ్ఞతను చాటుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలనుకున్నారు. పాలమూరును పడావు పెట్టి కృష్ణా నీటిని తరలించుకుపోయిన అప్పటి ప్రాంతీయ ద్రోహులను ఎండగట్టారు. 2014లో రాష్ట్ర సాకారం తర్వాత ఉద్యమ క్రమంలోనే రూపకల్పన చేసుకున్న ఉత్తర తెలంగాణ కోసం ‘కాళేశ్వరం’, దక్షణ తెలంగాణ కోసం ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కార్యాచరణ ప్రారంభించారు. చైనా నిర్మించిన సుప్రసిద్ధ ‘త్రీ గార్జెస్’ ప్రాజెక్ట్ కంటే గొప్పగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ సాంకేతికతతో, ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ అద్భుతాలతో కూడిన ‘పాలమూరు –రంగారెడ్డి' సాగునీటి ప్రాజెక్ట్‌కు 2015 జూన్ 11న శంఖు స్థాపన చేశారు. శ్రీశైలం ఎగువ భాగాన కొల్లాపుర్ మండలం ‘ఎల్లూరు’ గ్రామం వద్ద వర్షాకాలంలో 120 టీఎంసీల కృష్ణా జలాలను తరలిస్తూ పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండలో 30 వేల ఎకరాల భూమికి సాగునీరు, అలాగే 1,228 గ్రామాలకి త్రాగునీరు అందించడం దీని లక్ష్యం. కృష్ణమ్మ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా నార్లాపూర్ అంజనగిరి, ఏదుల వీరాంజనేయ, వట్టెం వెంకటాద్రి, కరివేన కురుమూర్తి జలాశయాల గుండా ప్రవహించి లిఫ్ట్ ద్వారా రంగారెడ్డిలోని ఉద్దండాపూర్, లక్ష్మీ దేవిపల్లి జలాశయాలకు చేరుతుంది. సెప్టెంబర్ 16న ‘రంగారెడ్డి–పాలమూరు’ ప్రాజెక్ట్‌ను కొల్లాపూర్ మండలంలో ‘సింగోటం’ వద్ద కేసీర్ ప్రజలకి అంకితం చేస్తున్నారు. నీటి శబ్దం, నీటి స్పర్శ మానవ భావోద్వేగాలకు ప్రతీకగా ఇక్కడ జరిగే ఉద్వేగ మహత్తర అంకిత సభకు ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల సర్పంచ్‌లతో పాటు అశేష ప్రజానీకం తరలి రానున్నారు. కృష్ణమ్మ నీటిని కలశాలలో తీసుకొని వెళ్లి ఆయా గ్రామ దేవాలయాల స్వామి పాదాలకు అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆనతి కాలంలోనే తెలంగాణలో 78 శాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయాన్ని పండుగగా మార్చే గౌరవప్రద జీవన భూమికను కేసీఆర్ పోషిస్తున్నారు. పరవళ్ళు తొక్కుతూ వస్తున్న నీటిని, కళ్ళ ముందునుంచి పారిపోతున్న నీటిని దోసిళ్ళతో ఒడిసిపట్టుకుంటున్న సంస్కృతిని సాగుచేస్తున్నారు. జీవన సంక్షోభం ద్వారా వచ్చిన ఆత్మన్యూనత స్థానంలో అభివృద్ధి సుభిక్ష ఆత్మ గౌరవ పతాకాన్ని జన మనో కేతనంగా మార్చిన యుగ కర్తగా నిలిచిపోతారు కేసీఆర్. పాలమూరు బిడ్డగా, ఇక్కడి ప్రజల విధేయుడిగా, కేసీఆర్ ఉద్యమ సహచరుడిగా, ప్రభుత్వ పాలనలో తన అనుచరుడిగా ఇతిహాసాన్ని తలపించే పాలమూరు పునరుజ్జీవన చరిత్ర నిర్మాణంలో నేనూ ఒకడిగా ఉండడం పరమానందంగా ఉంది. నిరసనోళ్ల శ్రీనివాస గౌడ్ - వ్యాసకర్త రాష్ట్ర మంత్రివర్యులు ------------- BJP : విమోచనం : హైదరాబాదు సంస్థానంలో ఉన్న వారందరూ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి సామాజికంగా, సాంస్కృతికంగా కలిసి వున్నారు. ఈ సంస్థానాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనీ, ఉర్దూను అధికార భాషగా రుద్దాలనీ నిజాం విషపూరితంగా ఆలోచించిన తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. భారత ప్రభుత్వం ‘పోలీసు చర్య’ను మొదలుపెట్టి, ప్రజలకు ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించింది. హైదరాబాద్ సంస్థాన విమోచనకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిస్తే ‘భారత ప్రభుత్వ దౌత్యం, సామాన్య ప్రజల త్యాగం, యుద్ధం, విలీనం’ లాంటివి చరిత్ర పుటలలో కనబడుతాయి. ఆనాడు, తెలంగాణా, మరాఠ్వాడ, కర్ణాటకలో విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఇప్పటికీ వీటి భయానక ఛాయలు కనబడతాయి. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ వారికీ, నిజాముకూ మధ్య జరిగిన ఒప్పందానికి వ్యతిరేకంగా 1800 సంవత్సరంలోనే స్వాతంత్య్ర పోరాటం పురుడు పోసుకుంది. హిందువులు, ముస్లింలు కలిసి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హిందూ – ముస్లిం ఐక్యతకు ఇది దర్పణం. ఆంగ్లేయులు సంపదను విచ్చలవిడిగా దోచుకొని దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేశారు. 1857 జూలై 17న మౌల్వి అల్లాఉద్దిన్, తుర్రేభాజ్ ఖాన్ నాయకత్వంలో వందలాది మంది హిందూ, ముస్లింలు కోఠీలో గల బ్రిటిష్ రెసిడెన్సీపై దాడిచేశారు. ఫలితంగా తుర్రేభాజ్ ఖాన్‌ను హతమార్చి శవాన్ని కోఠీలో వేలాడదీశారు. అల్లాఉద్దిన్ అండమాన్ జైళ్లో 1884లో కన్నుమూశారు. అప్పుడే పుంజుకున్న రాంజీ గోండ్ తిరుగుబాటు తరువాత, వీరులను ప్రభుత్వం నిర్మల్ పట్టణంలో మఱి -
స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామం
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 500వ రోజుకు చేరుకున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం స్నేక్ ఐల్యాండ్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన స్నేక్ ఐల్యాండ్ విముక్తికి పోరాడిన ఉక్రెయిన్ సైనికులను సన్మానించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో స్నేక్ ఐల్యాండ్ విముక్తి కీలక పరిణామమన్నారు. ఆక్రమణకు గురైన ప్రతి అంగుళాన్ని తిరిగి స్వా«దీనం చేసుకుంటామనేందుకు ఈ ఘటనే ప్రబల తార్కాణమని వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఏరోజు రికార్డయిందో తెలియలేదు. జెలెన్స్కీ శనివారం తుర్కియేలో ఉన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా బలగాలు ఈ ఐల్యాండ్‌ను ఆక్రమించుకోగా ఉక్రెయిన్ జూన్ 30న తిరిగి స్వా«దీనం చేసుకుంది. కాగా, లీమాన్ పట్టణంలో శనివారం రష్యా రాకెట్ దాడిలో ఎనిమిది మంది మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. -
మోదీ నిరంకుశత్వం నుంచి విముక్తి కావాలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశత్వం, అసమర్థత నుంచి విముక్తి పొందాలని ప్రజలు కోరుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘బచావో..బచావో’ అంటూ విపక్షాలు రోదిస్తున్నాయని మోదీ ఎద్దేవా చేసిన మరుసటి రోజే రాహుల్ తిప్పికొట్టారు. కోల్‌కతాలో విపక్ష ర్యాలీపై మోదీ స్పందిస్తూ..పశ్చిమ బెంగాల్లో తమకు ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నారని, అయినా తమని చూసి విపక్షాలు భయపడుతున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి రాహుల్ స్పందిస్తూ ‘సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న ఆ అరుపులు నిరుద్యోగ యువత, కష్టాల్లో ఉన్న రైతులు, అణచివేతకు గురైన దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, నష్టాల్లో ఉన్న చిన్న వ్యాపారులవి. మీ నిరంకుశత్వం, అసమర్థత నుంచి బయటపడాలని వారు ప్రార్థిస్తున్నారు. వంద రోజుల్లో వారందరికీ విముక్తి కలుగుతుంది’ అని ట్వీట్ చేశారు. -
మస్కట్ నుంచి మహిళకు విముక్తి
నెల్లూరు(పొగతోట): ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లి చిక్కుకుపోయిన ఓ మహిళకు కలెక్టర్ ముత్యాలరాజు చొరవతో విముక్తి లభించింది. నగరంలోని ఎన్టీఆర్నగర్కు చెందిన ఎస్కే రహంతుల్లా, మస్తానమ్మ దంపతులు. టైలర్‌గా రహంతుల్లా సంపాదనతో కుటుంబం గడవకపోవడంతో మస్తానమ్మ మస్కట్‌కు వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో కూలీ పనికి చేరింది. ఇంటి యజమాని వేధించడంతో పాటు తనకు విష పదార్థాలు ఇచ్చి చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని, తనను స్వస్థలానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జూన్ 8న మస్తానమ్మ కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంది. స్పందించిన కలెక్టర్ ఎంబీసీ వారితో చర్చించారు. ఆమెపై కేసులు పెట్టకుండా నెల్లూరుకు పంపేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మస్తానమ్మ మస్కట్ నుంచి బయలుదేరి మంగళవారం రాత్రి నెల్లూరుకు క్షేమంగా చేరుకుందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
ఆపరేషన్ స్మైల్‌లో 35మంది పిల్లలకు విముక్తి
-
పాలకులకు ఏమైంది?
విమోచనను ఎందుకు నిర్వహించరు? డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి సంగారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరణ సంగారెడ్డి మున్సిపాలిటీ: తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని గతంలో ఉద్యమించిన టీఆర్ఎస్.. అధికారంలోకి రాగానే ఎందుకు మౌనంగా ఉందని డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ప్రశ్నించారు. శనివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే యూపీఏ సర్కార్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్ ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. రజాకార్ల చెర నుంచి తెలంగాణ ప్రాతాన్ని విముక్తి కల్గించేందుకు ఎందరో ప్రాణాలు బలి ఇచ్చిరన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీలు అంజయ్య, ప్ర«భాకర్‌రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ శంకర్‌యాదవ్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సాబేర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజి అనంతకిషన్, కౌన్సిలర్ కసిని రాజు, నాయకులు సంతోష్, సంజీవ్‌కుమార్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
చింతపల్లి ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్‌నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరంగా యాత్ర విజయవంతానికి బీజేపీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుకుడపు రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్, నగేష్, పర్వతాలు, సైదులు, విక్రమ్, ధన్‌రాజ్ ఉన్నారు. -
భర్తను రోకలిబండతో మోది.. భార్య ఆత్మహత్య
-
భర్తను రోకలిబండతో మోది.. భార్య ఆత్మహత్య
• హైదరాబాద్‌లోని మియాపూర్‌లో విషాదం • నాలుగేళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న భర్తకు విముక్తి కల్పించాలని.. • చంపేందుకు ప్రయత్నించిన భార్య • ఆ తర్వాత 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య హైదరాబాద్: నాలుగేళ్లుగా జీవచ్ఛవంలా పడి ఉన్న భర్తకు విముక్తి కల్పించాలనుకుంది.. ఆయనను చంపేసి బాధల నుంచి తప్పించాలనుకుంది.. ఆయనతోపాటు తానూ తనువు చాలించాలని నిర్ణయించుకుంది.. ఎటూ కదలలేని స్థితిలో ఉన్న భర్త తలపై రోకలి బండతో మోదింది.. ఆయన చనిపోయాడనుకుని 13వ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.. ఐదు పదులు దాటిన దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఉదంతం మంగళవారం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న మైహోం జ్యువెల్స్ అపార్ట్మెంట్లో ఈ విషాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమె భర్త ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాలుగేళ్లుగా వ్యాధితో.. రాజమండ్రికి చెందిన మురళీకృష్ణ (65) ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైరయ్యారు. ఆయనకు భార్య వెంకట సాయిలక్ష్మి (56), కుమారులు గణేశ్, ఓంకార్ ఉన్నారు. వారికి ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరూ మంచి ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. మురళీకృష్ణ నాలుగేళ్లుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయని స్థితి. లేవడం, కూర్చోవడం, నడవడం కూడా చేయలేరు. భార్య వెంకట సాయిలక్ష్మి అన్నీ తానై భర్తకు సపర్యలు చేస్తోంది. భర్త అలాంటి పరిస్థితిలో ఉండడం భరించలేక పోయింది. తీవ్ర మానసిక వేదనకు గురై.. రెండేళ్లుగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తామిద్దరం కలసి చనిపోతామంటూ కుమారులు, బంధువులతో చె బుతూ ఉండే ది. గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినా.. తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుందంటూ కుమారులు నచ్చజెప్పారు. అప్పటి నుంచి కొంతకాలం బాగానే ఉన్న సాయిలక్ష్మి.. ఎంతకూ భర్తకు నయం కాకపోవడంతో ఆయనను చంపి, తనూ చావాలని నిర్ణయించుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుర్చీలో కూర్చొని ఉన్న భర్త తలపై రోకలిబండతో గట్టిగా మోదింది. దీంతో మురళీకృష్ణ తలపై పెద్దగాయమై అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. రక్తంతో గది అంతా నిండిపోయింది. ఆయన మరణించాడనుకున్న సాయిలక్ష్మి... తాము ఉండే 13వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. అక్కడిక్కడే మృతి చెందింది. అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు అది గమనించి కుమారులకు సమాచారమిచ్చారు. తీవ్ర గాయాలైన మురళీకృష్ణను దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ఇస్లామిక్ స్టేట్ నుంచి రమాదికి విముక్తి
బగ్దాద్: ఇరాక్‌లోని రమాది నగరం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఉక్కుపిడికిలి నుంచి విముక్తి పొందింది. ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న ఈ నగరాన్ని తిరిగి తమ పరిధిలోకి తెచ్చుకున్నట్టు ఇరాక్ సైన్యం ప్రకటించింది. రమాదిలోని ప్రభుత్వ భవనాలపై మళ్లీ ఇరాక్ జాతీయ జెండాను రెపరెపలాడించడం ద్వారా సైన్యం చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందని భద్రతా బలగాల అధికార ప్రతినిధి బ్రిగ్ జెన్ యహ్యా రసూల్ తెలిపారు. రమాది నగరం గత మే నెలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ మాటువేసిన ఉగ్రవాదులను తరిమేసి తిరిగి ఈ కీలక నగరాన్ని ఇరాక్ సైన్యాలు తమ అధీనంలోకి తీసుకోవడం ఐఎస్ఐఎస్కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికీ నగరంలో అక్కడక్కడ ఉన్న ఐఎస్ఐఎస్ అనుకూల శక్తులు, సాయుధులు ఇరాక్ సైన్యాన్ని ప్రతిఘటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ గతకొన్ని వారాలుగా రమాది కోసం హోరాహోరిగా పోరాడుతున్న ఇరాక్ సైన్యాలు ఇది అత్యంత కీలక విజయమని భావిస్తున్నారు. ఆదివారం నాటికే రమాదిలోని ప్రభుత్వ బంగ్లాలను తమ అధీనంలోకి తెచ్చుకున్న ఇరాక్ బలగాలు తాజాగా నగరంపై పూర్తి పట్టు సాధించినట్టు భావిస్తున్నారు. -
వెట్టి నుంచి ఐదుగురు బాలలకు విముక్తి
హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్రాంతంలో చెత్త, ప్లాస్టిక్ వస్తువులను ఏరుకుంటున్న ఐదుగురు బాలలకు ఓ స్వచ్ఛంద సంస్థ శుక్రవారం విముక్తి కల్పించింది. ఉప్పుగూడ ప్రాంతం నుంచి ఐదుగురు బాలలను ఒక వ్యక్తి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతానికి తీసుకువచ్చాడు. వారితో ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏరించే ప్రయత్నం చేస్తుండగా... స్థానికులు ఇచ్చిన సమాచారంతో దివ్య హెల్ప్ డెస్క్ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. వారిని తీసుకొచ్చిన వ్యక్తి పరారవ్వగా, ఉప్పుగూడకు చెందిన శివ (12), నగేష్ (11), ఉషన్ (10), సాయి (11), నరేష్ అనే ఐదుగురు బాలలను దివ్య హెల్ప్ డెస్క్ వారు సైదాబాద్‌లోని బాలుర వసతి గృహానికి తరలించారు. -
ఇద్దరు బాల కార్మికులకు విముక్తి
ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఇద్దరు బాల కార్మికులకు కార్మిక శాఖ అధికారులు విముక్తి కల్పించారు. సహాయ కేంద్రానికి వచ్చిన ఫిర్యాదు మేరకు సహాయ కార్మిక శాఖ అధికారి ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం రెండు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ హోటల్లో పనిచేస్తున్న బాలుడ్ని, కూరగాయల దుకాణంలో పనిచేస్తున్న మరో బాలుడ్ని గుర్తించారు. వారికి విముక్తి కల్పించి వారితో పనిచేయిస్తున్న వ్యాపారస్థులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. విముక్తి కలిగిన ఇద్దరిలో ఒకరు ఖానాపూర్ మండలం మక్కాపూర్కు చెందిన బాలుడు కాగా, మరో బాలుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వాడని గుర్తించారు. -
దొరల తెలంగాణ కోరుకుంటున్న ప్రభుత్వం
సీపీఎం బస్సుజాతా ప్రారంభ కార్యక్రమంలో మల్లు స్వరాజ్యం హైదరాబాద్: నాడు భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ ప్రజలు పోరా టం చేసి దొరల అరాచకాలను, రాచరిక పాలనను నిర్మూలించగా, నేడు రాష్ట్ర ప్రభుత్వం దొరల తెలంగాణను కోరుకుంటోందని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. మార్చి ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే సీపీఎం తెలంగాణ రాష్ట్ర తొలి మహాసభలను జయప్రదం చేయాలంటూ చేపట్టిన బస్సుజాతాను గురువారం హైదరాబాద్ నల్లకుంటలో ఆమె ఎర్రజెండా ఊపి ప్రారంభించారు. కళాకారులతో కలసి డప్పు కొట్టి అందరినీ ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారం, నవతెలంగాణ నిర్మాణం కోసం సీపీఎం ఉద్యమిస్తోందని, ప్రజలు ఆ పార్టీని ఆదరించాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకునేలా ప్రజలను చైతన్యపరిచేందుకు తమ పార్టీ ప్రచారయాత్ర చేపట్టిందని చెప్పారు. -
ఆస్పత్రి నుంచి రోగికి విముక్తి
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : చికిత్సకు అయిన డబ్బులు చెల్లించలేదని ఓ రోగిని ఆస్పత్రివర్గాలు నిర్బంధించిన సంఘటన హన్మకొండలో శనివారం వెలుగు చూసింది. అయితే సదరు ఆస్పత్రి వర్గాలు మాత్రం తాము ఏ రోగిని నిర్బంధించలేదని పేర్కొం టున్నారు. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ ప్రాంతానికి చెందిన తుమ్మ కోటేశ్వర్రావు ఫ్రాంక్రియాస్ వ్యాధితో బాధపడుతూ సుబేదారిలో ఓ ఆస్పత్రిలో ఈ నెల 10న చేరారు. ఈ నెల 26న బిల్లులు చెల్లించి డిశ్చార్జీ కావాల్సిందిగా అతడికి ఆస్పత్రి వర్గాలు తెలి పాయి. అయితే తమ వద్ద అంతమొత్తంలో డబ్బు లేదని, తగ్గించాలని కోరినట్లు రోగి కోటేశ్వర్రావు విలేకరులకు వివరించారు. రూ.52 వేలు బిల్లు వేశారని, అంత బిల్లు చెల్లించలేనని తన వద్ద డబ్బులు లేవని చెప్పినా వినలేదన్నారు. చివరకు తన భార్య పుస్తెల తాడు, చెవి కమ్మలు అమ్మగా రూ.40 వేలు వచ్చాయన్నారు. అందులో నుంచి రూ.30 వేలు చెల్లిస్తానని చెప్పినట్లు తెలిపారు. మిగతా రూ.5 వేలతో మందులు కొనుగోలు చేస్తానని, మరో రూ.5 వేలు కుటుంబ ఖర్చులకు అవసరమని వేడుకున్నట్లు వివరించాడు. మిగతా మొత్తానికి పోస్ట్ డేటెడ్ చెక్ ఇస్తానని చెప్పినా వదిలిపెట్టకుండా రాత్రిపూట బయటకు వెళ్లకుండా గురు, శుక్రవారాల్లో రాత్రి తనను రూంలో బంధించారని వాపోయాడు. పగలు మాత్రం డోర్ తీసిపెడుతున్నారని వివరించారు. శనివారం వచ్చి రూ.30 వేలు తీసుకెళ్లారని, అయినా మిగతా సొమ్ము చెల్లిస్తేనే ఆస్పత్రి నుంచి పంపిస్తామని చెప్పారన్నారు. తాను మునిసిపల్ కాంట్రాక్టర్‌నని తనకు బిల్లులు వచ్చేది ఉందన్నా రు. తాను చెక్ ఇస్తానని చెప్పిన వినలేదన్నారు. కనీసం తనకు రెండు రోజుల నుంచి ఆహారం కూడా ఇవ్వడం లేదన్నారు. తనను చూడలేక ఇతర వార్డుల్లో ఉన్న వారు రొట్టె ఇచ్చారని చెప్పారు. కాగా విలేకరులు వచ్చిన విషయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం తుమ్మ కోటేశ్వర్‌రావును ఎట్టకేలకు వదిలేసింది. ఈ విషయమై ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా తాము ఏ రోగిని బంధించలేదని చెప్పడం గమనార్హం.