న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశత్వం, అసమర్థత నుంచి విముక్తి పొందాలని ప్రజలు కోరుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘బచావో..బచావో’ అంటూ విపక్షాలు రోదిస్తున్నాయని మోదీ ఎద్దేవా చేసిన మరుసటి రోజే రాహుల్ తిప్పికొట్టారు. కోల్‌కతాలో విపక్ష ర్యాలీపై మోదీ స్పందిస్తూ..పశ్చిమ బెంగాల్‌లో తమకు ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నారని, అయినా తమని చూసి విపక్షాలు భయపడుతున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి రాహుల్ స్పందిస్తూ ‘సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్న ఆ అరుపులు నిరుద్యోగ యువత, కష్టాల్లో ఉన్న రైతులు, అణచివేతకు గురైన దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, నష్టాల్లో ఉన్న చిన్న వ్యాపారులవి. మీ నిరంకుశత్వం, అసమర్థత నుంచి బయటపడాలని వారు ప్రార్థిస్తున్నారు. వంద రోజుల్లో వారందరికీ విముక్తి కలుగుతుంది’ అని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment