
వెట్టి నుంచి ఐదుగురు బాలలకు విముక్తి
హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్రాంతంలో చెత్త, ప్లాస్టిక్ వస్తువులను ఏరుకుంటున్న ఐదుగురు బాలలకు ఓ స్వచ్ఛంద సంస్థ శుక్రవారం విముక్తి కల్పించింది. ఉప్పుగూడ ప్రాంతం నుంచి ఐదుగురు బాలలను ఒక వ్యక్తి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతానికి తీసుకువచ్చాడు. వారితో ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏరించే ప్రయత్నం చేస్తుండగా... స్థానికులు ఇచ్చిన సమాచారంతో దివ్య హెల్ప్ డెస్క్ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. వారిని తీసుకొచ్చిన వ్యక్తి పరారవ్వగా, ఉప్పుగూడకు చెందిన శివ (12), నగేష్ (11), ఉషన్ (10), సాయి (11), నరేష్ అనే ఐదుగురు బాలలను దివ్య హెల్ప్ డెస్క్ వారు సైదాబాద్‌లోని బాలుర వసతి గృహానికి తరలించారు.