child labour
-
కలల మేఘంపై అనూజ..
ప్రేక్షకులు మెచ్చే పాత్రలు ఎన్నో చేసిన ప్రియాంక చోప్రా ‘అనూజ’ ద్వారా తన ఉత్తమ అభిరుచిని చాటుకుంది. 97వ ఆస్కార్ అవార్డ్‌ల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘అనూజ’(Anuja) షార్ట్ లిస్ట్ అయింది. ‘అనూజ’ త్వరలో నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమ్ కానుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు మిండి కాలింగ్, గునిత్ మోగాలతోపాటు వెన్నుదన్నుగా నిలిచింది ప్రియాంక చోప్రా.బాలకార్మికులైన పిల్లల బతుకు పోరాటంపై వెలుగులు ప్రసరించిన ఈ లఘుచిత్రానికి ఆడమ్ జోగ్రేవ్స్ డైరెక్టర్. తొమ్మిదేళ్ల అనూజ తన అక్కతో కలిసి ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటుంది. తన భవిష్యత్ కోసం పని మానేసి చదువుకోవాలా? కుటుంబం కోసం చదువును త్యాగం చేయాలా? అనే అనూజ జీవితంలోని ఈ సందిగ్ధ స్థితికి ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ అద్దం పడుతుంది.దోపిడి ప్రపంచంలో తమ ఆనందం, అవకాశాల కోసం ఆశపడే, పోరాడే ఇద్దరు సోదరీమణుల గురించి చెప్పే కథ ఇది.ప్రౌడ్ ఆఫ్ దిస్ బ్యూటీఫుల్ ఫిల్మ్’ అంటూ ‘అనూజ’ గురించి తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ప్రియాంక చోప్రా.‘అనూజ’లో అనన్య షాన్ బాగ్ (పాలక్), సజ్దా పఠాన్ (అనూజ), నగేష్ బోంస్లే (మిస్టర్ వర్మ) నటించారు.(చదవండి: ఇంతలా 'కృతజ్ఞత' చూపించడం అందరి వల్ల కాదేమో..!) -
210 మంది చిన్నారులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్: తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులుగా మారిన చిన్నారులను కనిపెట్టేందుకు జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్–9 స్పెషల్ డ్రైవ్ రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, కూడళ్లు, ఇటుక బట్టీలు, ఖార్ఖానాలు తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరు రోజుల్లో మొత్తం 210 మంది చిన్నారుల జాడను అధికారులు గుర్తించారు. వీరిలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 125 మంది, వికారాబాద్‌లో 14, ఆదిలాబాద్‌లో 12, నిజామాబాద్‌లో 8, వరంగల్‌లో 11, నల్లగొండలో 9, నారాయణపేట్‌లో 8 మంది, భూపాలపల్లిలో ఏడుగురు, కామారెడ్డిలో ఇద్దరు, మహబూబాబాద్‌లో ఇద్దరు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు, మెదక్‌లో నలుగురు, భద్రాద్రి కొత్తగూడెంలో నలుగురు, ఆసిఫాబాద్‌లో ఇద్దరు చొప్పున చిన్నారుల జాడను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఏటా జూలైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ స్పెషల్ డ్రైవ్‌లో పోలీసులతోపాటు మహిళా, శిశు సంక్షేమం, ఆరోగ్య, వైద్య, కార్మిక, రెవెన్యూ శాఖల నుంచి అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. -
ఖాజీపేట్ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంయుక్త తనిఖీలు
-
భారతావనికి బాలలే భారమా?
పీడిత సమాజంలో పీడనకు ఒక వర్గం బాలలు బలవుతున్నారు. అందుకే బాలలు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో భారత సమాజం ఉందంటే అతిశయోక్తి కాదు. సమాజంలో మూడు వంతులుగా ఉన్న బాలల స్థితిగతులను పరిశీలించాల్సిందే. ఈ ప్రాధాన్యత దృష్ట్యా బాలల కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయి చట్టాలు రూపొం దాయి. ప్రత్యేక హక్కులు బాలలకు దఖలు పడ్డాయి. ఇవి భారతదేశంలో 1992 నుండి అమలులోనికి వచ్చాయి. వివక్ష లేకుండా అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం, భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, జీవించే హక్కును కలిగి ఉండటం బాలల హక్కుల మూల సూత్రాలు. పేదరికం కారణంగా చదువుకి దూరమై కష్టతరమైన పనులు చేస్తూ గడపాల్సిన దుఃస్థితిలో బాలలు ఇప్పటికీ ఉన్నారు. కనీసం ఉపాధి అవకాశాలను అంది పుచ్చుకునే చదువు వరకు కూడా వెళ్లలేకపోతున్నారు. 5 నుండి 14 ఏళ్ల వయసు ఉన్న బాల బాలికలలో ప్రతి 8 మందిలో ఒకరు తమ కోసమో, తమ కుటుంబం కోసమో పాలబుగ్గల ప్రాయంలోనే పనివారుగా మారుతున్నారు. 29 శాతం ప్రాథమిక విద్యకు ముందే బడి మానేస్తున్నారు. వీరిలో అట్టడుగు వర్గాల పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) వల్ల 5వ తరగతి కూడా పూర్తి చేయకుండానే బాలలు డ్రాపవుట్లుగా మారే ప్రమాదముంది. జాతీయ నూతన విద్యావిధానం పూర్తి స్థాయిలో అమలైతే బాలలు యాచకులుగా, బాల కార్మికులుగా, వలస బాధితులుగా, నేరగాళ్లుగా తయారయ్యే అవకాశం ఉంది. బీజేపీ అధికారంలోనికి రాగానే బాలకార్మికుల పనికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసింది. ఏ దేశంలో కూడా ఇలాంటి సాహసం చేసిన దాఖలాలు లేవు. బాలలే ఈ సమాజానికి పెట్టుబడి అని ఒకవైపు అంటూనే ఇటువంటి చట్టాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇందువల్ల పిల్లలు కూలీలుగా మారే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)... భారత్‌లో ప్రతి 100 మందికి 79 మంది బాలలు రక్త హీనతతో, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది. శారీరక ఎదుగుదల లేని బాలలు 64 శాతం మందీ, తగినంత బరువులేని బాలలు 43 శాతం మందీ ఉన్నారనీ, ప్రతి ఏటా అంధత్వంతో కోటి మంది ఇబ్బందులు పడుతున్నారనీ డబ్ల్యూహెచ్ఓ తేటతెల్లం చేసింది. శిశు సంరక్షణకూ, బాలల ఆరో గ్యానికి తగిన బడ్జెట్ కేటాయించక పోవడం కార ణంగా మన దేశంలో బాలల పరిస్థితి ఇంతగా దిగజారింది. మనసుంటే ప్రస్తుతం ఉన్న వనరులూ, చట్టాల తోనే బాలల స్థితిగతులను మెరుగుపరచవచ్చని కేరళ రాష్ట్రం నిరూపించింది. బాలలకు పౌష్టికాహారం అందించడంలో కేరళ మొదటి స్థానంలో ఉంది. విద్యా రంగంలో మోడల్‌గా ఉంది. వరల్డ్ విజన్ ఇండియా, ఐఎఫ్ఆర్ లీడ్లు సంయుక్తంగా 24 సూచికలతో చేసిన సర్వేలో కేరళ చిన్నారుల సంక్షేమంలో టాప్‌లో ఉందని వెల్లడైంది. బీజేపీ పాలిత ప్రాంతమైన జార్ఖండ్ ఆఖరి స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎన్ఈపీ అమలైతే రేపటి పౌరుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. బాలల్లో అన్నార్తులు, అనాథలు, యాచకులు, నేరగాళ్లు, సంఘ విద్రోహశక్తులు ఉండకూడదంటే వినాశకర సంస్కరణలు ఆపాలి, ఆగాలి. బాలలకు రాజ్యాంగం ఇచ్చే హక్కులను చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రతి శిశువుకు మంచి భవితను కోరుకునే హక్కు ఉంది. ఆ హక్కుల రక్షణకు పోరాడే వేదికలకు మద్దతునివ్వాలి. కె.విజయ గౌరి, వ్యాసకర్త యు.టి.ఎఫ్. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొబైల్: 89853 83255 -
భళా.. బాల కార్మికా
‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయంచేసే చేతులు మిన్న’.. ఓ అధికారి ప్రోత్సాహం, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఆ యువకులను ఉన్నతస్థాయికి చేర్చింది. జిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న బాలకార్మికులకు ఒక అధికారి ఇచ్చిన చేయూత వారి జీవితాలను మార్చేసింది. ఒకరు డాక్టరు అయితే మరో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాగా.. ఇంకొకరు íసీఏ ఫైనల్ చదువుతున్నారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన ఈ పేద విద్యార్థుల విజయగాథ ఏమిటంటే.. బీవీ రాఘవరెడ్డి 1998లో కర్నూలుకు చెందిన నిరుపేద తల్లిదండ్రులు తమ కుమారుడు శివప్రసాద్‌ను 8వ తరగతిలోనే చదువు మాన్పించి స్థానిక జిన్నింగ్ మిల్లులో సంచులు కుట్టే పనిలో పెట్టారు. తనిఖీ నిమిత్తం ఆ మిల్లుకు వెళ్లిన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి ఆ కుర్రాడితో కాసేపు మాట్లాడాక అతనికి చదువుపై ఉన్న ఇష్టాన్ని గుర్తించారు. శివప్రసాద్ తండ్రిని ఒప్పించి.. తానే స్కూలులో చేర్పించి ఆర్థికసాయం అందిస్తూ వచ్చాడు. టెన్త్, ఇంటర్లో మంచి మార్కులు సంపాదించిన శివప్రసాద్ ఆ తర్వాత మెడిసిన్ సీటు సాధించాడు. అనంతరం జనరల్ మెడిసిన్‌లో పీజీ, క్లినికల్ ఆంకాలజీలో స్పెషలైజేషన్ చేసి ఇప్పుడు కర్నూలు విశ్వభారతి మెడికల్ కళాశాలలో మెడికల్ ఆంకాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. గుంటూరుకు చెందిన జనార్థన్దీ ఇలాంటి కథే. చదువుకుంటూనే జిన్నింగు మిల్లులో పనికి వెళ్తున్న ఆ కుర్రాణ్ణి శివకుమార్‌రెడ్డి చేరదీసి ఇంటర్లో చేర్పించారు. ఆ తర్వాత ఇంజనీరింగ్‌లో సీటొచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యమా అని కోర్సు పూర్తయ్యాక ఫోన్‌పేలో ఉద్యోగం సంపాదించాడు. ఇక ఏటుకూరుకు చెందిన యలవర్తి శివకుమార్ కూడా వీరిలాగే గుంటూరులోనే బాలకార్మికుడిగా పనిచేస్తుండగా శివకుమార్‌రెడ్డికి తారసపడ్డాడు. అతనికి చదువుపై ఆసక్తి ఉందని తెలిసి సీఏ ఇంటర్లో చేర్పించారు. అతను ఇప్పుడు సీఏ ఫైనల్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. శివకుమార్ అన్న విజయకుమార్‌కు సైతం చేయూతనివ్వటంతో అతనూ ఫీజు రీయింబర్స్‌మెంటుతో బీటెక్ పూర్తిచేసి టీసీఎస్‌లో రూ.22 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. పేద పిల్లల చదువుకు చేయూత వివిధ కారణాలతో కొందరు పిల్లలు చిన్న వయసులోనే చదువుకు దూరమవుతున్నారు. నా విధి నిర్వహణలో భాగంగా ఫ్యాక్టరీల్లో బాల కార్మికులను గుర్తించి వారిని ఇంటికి పంపడంతో సరిపెట్టకుండా చదువు వైపు మళ్లిస్తున్నాను. నాలుగు కుటుంబాల్లో వెలుగు రావటం నాకెంతో ఆనందాన్నిచ్చింది. అదే స్ఫూర్తితో నంద్యాలలోని నా చిన్ననాటి స్నేహితులతో కలిసి ‘ఆపద్బంధు సేవాసమితి’ని ప్రారంభించి పేద పిల్లల చదువుకు చేయూతనిస్తున్నాం. – ఎంవీ శివకుమార్‌రెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విజయ్‌కుమార్‌కు వచ్చిన టీసీఎస్ ఆఫర్ లెటర్ నేను సైతం.. నేను టెన్త్ చదువుతున్నప్పుడు గుంటూరులోనే ఓ జిన్నింగ్ మిల్లులో పనిచేసేవాడ్ని. అప్పుడు తనిఖీకొచ్చిన ఇన్స్పెక్టర్ శివకుమార్‌రెడ్డి నన్ను ప్రోత్సహించి సాయంచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు తోడ్పాటుతో ఇంజనీరింగ్ పూర్తిచేశా. ప్రస్తుతం ఫోన్‌పేలో పనిచేస్తున్నాను. సార్ చూపిన బాటలో విద్యార్థులకు సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాను. – గుంజి జనార్థన్‌రావు, బిజినెస్ డెవలెప్మెంట్ అసోసియేట్, ఫోన్‌పే ఆ స్ఫూర్తి మరువలేనిది.. పేద కుటుంబం కావటంతో చదువుకుంటూనే జిన్నింగు మిల్లులో పనిచేసేవాణ్ని. 2008లో సార్ తనిఖీకి వచ్చినపుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. పనిమానేసి చదువుపై శ్రద్ధపెట్టాలని చెప్పి ఆర్థికసాయం చేశారు. టెన్త్‌లో మంచి మార్కులొస్తే కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు. ఆ ఘటన మర్చిపోలేను. నేను ఈస్థాయికి చేరుకోవడానికి సార్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. – యలవర్తి శివకుమార్, సీఏ ఫైనల్ -
ఇంకానా బాల కార్మిక వ్యవస్థ?
బాలలు భగవంతుడి స్వరూపాలంటారు. ఏ దేశానికైనా మూల స్తంభాలూ, భవిష్యత్తూ వాళ్లే. అమ్మ ఒడిలో, నాన్న లాలనలో, స్వేచ్ఛగా ప్రేమాభిమానాల మధ్య ఎదగడం బాలల హక్కు కావాలి. అమాయ కత్వంతో తొణికిసలాడే ఆ పసి మనసుల గురించి పట్టించుకోక పోవడం, అనాదరించడం సాంఘిక దురాచారమే అవుతుంది. ఈ 21వ శతాబ్దంలోనూ బాల కార్మిక వ్యవస్థ అతిపెద్ద ప్రపంచ సమస్యల్లో ఒకటి కావడం దురదృష్టకరం. ప్రపంచవ్యాప్తంగా కూడా బాలకార్మిక వ్యవస్థ కొన సాగేందుకు బోలెడన్ని కారణాలు ఉన్నాయి. పేదరికం, నిరక్ష రాస్యత, పెద్ద పెద్ద కుటుంబాలు, బాలలకు సులువుగా ఉపాధి దొరికే అవకాశం లేకపోవడం, ఉన్న చట్టాల అమల్లో నిర్లక్ష్యంతో పాటు అనేక ఇతర అంశాలు కూడా చేరడం వల్ల ఈ సాంఘిక ఆర్థిక, రాజకీయాలు కలిసి ఈ దురాగతం ఇంకా కొనసాగేలా చేస్తున్నాయి. అయితే బాల కార్మిక వ్యవస్థను ఒక ఆర్థిక సమస్యగా పరిగణిస్తే మాత్రం ఏ దేశమూ దీన్ని పరిష్కరింప జాలదు. సామాజిక దృక్పథంలో మార్పు రావాలి. రాజకీయం గానూ కొంత సున్నితంగా వ్యవహరించాలి. గత ఎనిమిదేళ్లలో బాల కార్మిక వ్యవస్థను నియంత్రిం చడంలో దేశం చెప్పుకోదగ్గ స్థాయిలో విజయవంతమైంది. నేను కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి)గా వ్యవహరిస్తున్న సమయంలో అమల్లోకి వచ్చిన ‘ద చైల్డ్ లేబర్ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) అమెండ్మెంట్ యాక్ట్ 2016’ పాత్ర కూడా ఇందులో ఉండటం ముదావహం. పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలను ఏ రకంగానూ పనిలో పెట్టుకోకూడదని ఈ చట్టం చెబుతుంది. అలాగే 14–18 మధ్య వయస్కులను ప్రమాదకరమైన వృత్తుల్లో నియమించ రాదు. అయితే కుటుంబ సభ్యుల లేదా కుటుంబ వ్యాపారంలో బాలలు సాయం అందించేందుకు ఈ చట్టం అవకాశం కల్పి స్తోంది. అలాగని ప్రమాదకరమైన వృత్తులో పని చేసే అవకాశం లేదు. మా అమ్మ ఈశ్వరమ్మ ఉల్లిపాయలు అమ్మేది. స్కూల్ అయిపోయిన తరువాత నేనూ దుకాణంలో అమ్మకు సాయపడే వాడిని. అయితే 2016 నాటి చట్టం కంటే ముందు ఇలా చేయడం శిక్షార్హమైన నేరం. నా చిన్నతనపు కథనం ఎందుకు ప్రస్తావిస్తున్నానని అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రమాద కరం కాని చాలా వాణిజ్య కార్యకలాపాల్లో ఇప్పటికీ తల్లిదండ్రు లకు పిల్లల సాయం అవసరమవుతూంటుంది. అటువంటి సందర్భాల్లో పిల్లలు వారికి సాయపడటంలో తప్పులేదు. ఇంకో విషయం: మా అమ్మ ఎప్పుడూ స్కూల్ ఎగ్గొట్టి తనకు సాయపడాలని కోరలేదు. ఆ విషయం నేనెప్పుడూ గుర్తుంచు కుంటాను. కష్టాలెన్ని ఉన్నా నాకు మంచి విద్యను అందించా లన్న ఆమె దృఢ నిర్ణయానికి నమస్సులు అర్పిస్తాను. బాలాకార్మికులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కేంద్రీ కృతమై ఉన్న నేపథ్యంలో వారందరిలోనూ వీలైనంత తొందరగా చైతన్యం కల్పించాల్సిన అవసరముంది. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు కింద ఇప్పటివరకూ దాదాపు 14 లక్షల మంది బాలకార్మికులకు విముక్తి లభించింది. అంతేకాకుండా ప్రత్యేక శిక్షణా కేంద్రాల ద్వారా వారికి బ్రిడ్జ్ కోర్సులు అందించి సాధారణ పాఠశాలల్లో విద్యనభ్యసించే అవకాశం కల్పించారు. వృత్తి నైపుణ్యాలు అందించడంతోపాటు మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్య సేవలు, ఉపకార వేతనం కూడా అందించారు. బాలకార్మిక వ్యవస్థ నుంచి బయటపడ్డ వారు సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు వీలుగా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2021 మార్చి 31 నాటికి దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 1,225 ప్రత్యేక శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. తల్లిదండ్రుల వృత్తుల్లో బాలలు కార్మికులుగా చేరడం మనం చాలాకాలంగా చూస్తున్నాం. ఇటుక బట్టీలు, గార్మెంట్స్, వ్యవసాయం, టపాసుల తయారీల్లో బాలకార్మికుల భాగ స్వామ్యం ఉంది. ధాబాలు, చిన్న చిన్న హోటళ్లు, టీస్టాల్స్, తివాచీ, చేతిగాజుల పరిశ్రమల్లో పిల్లలు రకరకాల పనులు చేస్తున్నారు. ఇలా అసంఘటిత రంగాల్లో బాలకార్మికులు పనిచేసే అవకాశాలు ఎక్కువ. అయినప్పటికీ పాఠశాలలకు పంపకుండా పనిలో పెట్టుకుంటున్న కుటుంబ సభ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇది మరింత సమర్థంగా, వేగంగా జరగాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్‌ను సక్రమంగా అమలు చేయడం కూడా బాలకార్మిక వ్యవస్థ పీడ వదిలించుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సమగ్ర శిక్ష అభియాన్ సమన్వయంతో ఐదు నుంచి ఎనిమిదేళ్ల మధ్య వయస్కులు విద్యా వ్యవస్థలో భాగమయ్యేలా చూడాలి. అలాగే ‘పెన్సిల్’ (ప్లాట్ఫార్మ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్)పై సమర్థమైన నిఘా ఉంచాలి. కుటుంబాల వృత్తుల్లో పాల్గొన్న వారిని కూడా బాలకార్మికులుగా గుర్తించడం ద్వారా ప్రస్తుత పరిస్థితి మార్చలేము. అందుకే భిన్నమైన ఆలోచనతో ఈ చిక్కుముడిని విప్పాల్సి ఉంటుంది. పైగా ఈ పని కేవలం ప్రభుత్వానిది మాత్రమే అనుకుంటే తప్పు. ఎన్జీవోలు, స్వచ్ఛంద కార్యకర్తలు, సీనియర్ సిటిజెన్లు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. 2022 సంవత్సరపు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాలను ‘సార్వత్రిక సామాజిక పరిరక్షణ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన’ అన్న అంశం ప్రధాన ఇతివృత్తంగా నిర్వహిస్తూండటం ఎంతైనా సంతోషకరం. బాల కార్మికుల్లేని ప్రపంచం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటన్న సంగతి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను తుదముట్టించాలన్న లక్ష్యం ప్రపంచం ముందున్న విషయం తెలిసిందే. ఈ దిశగా భారత్ గత ఎనిమిదేళ్లల్లో ఎంతో ప్రగతి సాధించింది. కోవిడ్–19 కారణంగా ఇబ్బందులు ఎదురైనా బాలకార్మిక వ్యవస్థ మళ్లీ వేళ్లూనుకోకుండా దృఢ సంకల్పం, నిశ్చయంతో పని చేయా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలిసికట్టుగా కృషి చేస్తే దేశం త్వరలోనే బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి పొందగలదు! - బండారు దత్తాత్రేయ, హరియాణా రాష్ట్ర గవర్నర్ (జూన్ 12న ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం) -
బాల్యం బడికి దూరం
సాక్షి, బెంగళూరు: అన్నెం పున్నెం ఎరుగని బాల్యంపై కరోనా భూతం పంజా విసిరింది. పాఠశాలల్లో అక్షరాలు నేరుస్తూ, ఆడుకోవాల్సిన చిన్నారులు పొలాల్లో, కార్ఖానాల్లో, దుకాణాల్లో పనివాళ్లుగా మారిపోయారు. రోజంతా పనిచేస్తే వచ్చే కూలీ తమతో పాటు ఇంట్లో వారి ఆకలి తీరుస్తుందన్న ధ్యాసే తప్ప చదువుకోవాలన్న ఆశ వారికి దూరమైంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయినా.. విద్యార్థుల చేరికలు తక్కువగా ఉన్నాయి. కరోనా వల్ల గత రెండేళ్లుగా వేలాదిమంది బాలలు బడికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన బాలలు చదువు మానేసి ఏదో ఒక పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. కుటుంబ పెద్దను కరోనా వైరస్ కబళించగా అనేక కుటుంబాలు దీనావస్థలోకి జారుకున్నాయి. ఫలితంగా మళ్లీ బడి ముఖం చూసే అదృష్టానికి వేలాది బాలలు నోచుకోలేకపోతున్నారు. ఈ సమస్య ఉత్తర కర్ణాటకలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 వేల మందిలో 35 శాతం మంది పిల్లల డ్రాపవుట్లపై ఎన్ఎఫ్హెచ్ఎస్ (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) చేపట్టిన అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది విద్యార్థులు తమకు చదువుపై ఆసక్తి లేదని చెప్పారట. 20 వేల మంది బాలురను సంప్రదించగా అందులో 35.7 శాతం మంది ఇదే మాట అన్నారు. బాధాకరమైన కారణాలు 21 వేల మంది బాలికలను ఈ ప్రశ్న అడగ్గా 21.4 శాతం మంది చదువు వద్దని చెప్పారు. బాధాకరమైన కారణాలు చదువుకునేందుకు పాఠశాలల్లో ఫీజులు చెల్లించేంత డబ్బు లేదు చదువుకు బదులు ఏదైనా పని చేసుకుంటే ఇల్లు గడుస్తుంది పాఠశాలలు దూర ప్రాంతాల్లో ఉండడంతో వెళ్లలేని పరిస్థితి బాలికలకు సరైన వసతులు లేకపోవడంతో చదువంటే అనాసక్తి ప్రభుత్వ బడుల్లో సరైన బోధన లేదు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు చెల్లించి చదవలేం (చదవండి: ‘నాకీ భార్య వద్దు’ .. మ్యాగీ వండిపెట్టిందని విడాకులిచ్చాడు) -
నటి ముంతాజ్‌పై గృహ హింస ఆరోపణలు
తమిళసినిమా: నటి ముంతాజ్ గృహ హింస ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమె అన్నా నగర్లో నివసిస్తున్నారు. కాగా ఈమె ఇంట్లో ఆరేళ్లుగా ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మైనర్ బాలికలు పని చేస్తున్నారు. మంగళవారం అనూహ్యంగా బాలికల్లో ఒకరు అన్నానగర్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తాము సొంత ఊరుకు వెళ్లిపోవాలనుకుంటున్నట్లు, అయితే ఇంటి యజమానురాలు అనుమతి ఇవ్వటం లేదని, హింసిస్తున్నారని చెప్పింది. అన్నానగర్ పోలీసులు ఆ బాలిక ఉన్న ప్రాంతానికి వెళ్లి తనతో పాటు ముంతాజ్ ఇంటిలో మరో బాలికను చెన్నైలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. బుధవారం బాలల సంరక్షణ కేంద్రం అధికారి శాలిని ఆ ఇద్దరి నుంచి వివరాలు సేకరించారు. చదవండి: Keerthi Suresh: నా దృష్టిలో ఆ రెండూ కష్టం! -
సారూ... పిల్లలతో పని చేయిస్తే ఎలా?
కేవీపల్లె(అన్నమయ్య జిల్లా): ‘సారూ.. మేము పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే.. మీరు పని చేయిస్తే ఎలా?’ అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదులకు తాళం వేశారు. ఈ సంఘటన మారేళ్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పాఠశాలలో 56 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆవరణలో స్టేజీ నిర్మించాలని ప్రధానోపాధ్యాయులు గంగాధరం, ఉపాధ్యాయులు భావించారు. బుధవారం విద్యార్థులతో గుణాతం తవ్వకం పని చేపించారు. గురువారం నిర్మాణానికి అవసరమయ్యే కట్రాళ్ల కోసం వారిని ఓ బండకు పంపించి ట్రాక్టర్‌కు లోడు చేయించారు. సిమెంట్ బస్తాలను ఆటోకు లోడు చేయించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం చెంది పాఠశాల వద్దకు వచ్చారు. స్థానిక సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి సహకారంతో శుక్రవారం తరగతి గదులకు తాళాలు వేశారు. తమ బిడ్డలతో పనులు చేయించిన వారిపై చర్యలు తీసుకునే వరకు తాళాలు తీయరాదని డిమాండ్ చేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు చెట్ల కింద తరగతులు నిర్వహించారు. దీనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఉపాధ్యాయులను నిలదీశారు. గురువారం హెచ్ఎం గంగాధరం లేకపోయినా, ఆయన ఆదేశాల మేరకే పిల్లలతో పని చేయించామని ఇన్చార్జి హెచ్ఎం వెంకటసుబ్బయ్య తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు సర్ది చెప్పి తాళాలు తెరిపించారు. అనంతరం విద్యార్థులకు ఆలస్యంగా సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించారు. జరిగిన సంఘటనపై ఎంఈవో రెడ్డిబాషాను వివరణ కోరగా విచారణ జరిపి డీఈవోకు నివేదిక పంపిస్తామని తెలిపారు. పిల్లలచే పని చేయించడం అన్యాయం మా పిల్లలతో పని చేయించడం అన్యాయం. మేము కష్టపడి పిల్లలను బాగా చదివించుకోవాలని పాఠశాలకు పంపిస్తున్నాం. అయితే ఎర్రటి ఎండలో బండపైకి పంపించి కట్రాళ్లు ట్రాక్టర్‌కు లోడు చేయించడం ఎంత వరకు సమంజసం. పాఠశాల పేరెంట్స్ కమిటీకి ఉపాధ్యాయుల జవాబుదారీతనం లేదు. – రమణయ్య, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ -
తప్పిపోయిన చిన్నారులను గుర్తించేలా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం
సాక్షి హైదరాబాద్: చిన్నారుల మోములో చిరునవ్వులు వికసించాలన్న ప్రధాన లక్ష్యంతో నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. తప్పిపోయి నిరాదరణకు గురై ఉన్న చిన్నారులు తల్లిదండ్రుల అక్కున చేరుతుండగా, వెట్టిచాకిరీలో మగ్గుతున్న బడీడు బాలకార్మికులు చదువుబాట పడుతున్నారు. బాలల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆపరేషన్ స్మైల్ పేరుతో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతోంది. ఈ నెల 1 నుంచి 31 వరకు తప్పిపోయిన బాలలను గుర్తించడం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నియంత్రణతో పాటు భిక్షాటన చేసే చిన్నారులు, వీధిబాలలు, అనాథలు, బడిమానేసిన చిన్నారులు, ఇతరత్రా అంశాల్లో వారిని గుర్తించి విముక్తి కల్పించడమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. రంగంలోకి బృందాలు గ్రేటర్ పరిధిలో ఆపరేషన్ స్మైల్– 8 స్పెషల్ డ్రైవ్ కోసం పోలీసు డిపార్ట్మెంట్ , లేబర్ డిపార్ట్మెంట్, శిశు సంక్షేమశాఖ, రెవెన్యూ శాఖ, చైల్డ్ లైన్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కూడిన సుమారు 24 బృందాలు రంగంలోకి దిగి జల్లెడ పడుతున్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రదేశాలు, హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, ఇళ్లు, గాజుల పరిశ్రమలు, భిక్షాటన, దుకాణాల్లో పనిచేస్తున్న చిన్నారుల జాడ కనిపెట్టేందుకు ఈ బృందాలు కృషి చేస్తాయి. పలు పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన అదృశ్యం కేసుల్లోనూ చిన్నారుల వివరాలను సేకరించి.. వాటిని సీసీటీఎన్‌ఎస్‌లోని డాటాబేస్‌తో పోల్చిచూస్తున్నారు. ఇందుకోసం పోలీసులు దర్పణ్ అనే సరికొత్త టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నారు. దీనిద్వారా తప్పిపోయిన చిన్నారులు.. వివిధ ప్రభుత్వ హోంలు, అనాథాశ్రమాలు, ఎన్జీఓల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల ఫొటోలను పోల్చిచూస్తూ వారి వివరాలు కనిపెట్టడంలో సఫలీకృతమవుతున్నారు. సదుపాయాలు ఏవి? ఆపరేషన్ స్మైల్‌లో చిన్నారుల గుర్తింపు, కుటుంబాల వద్దకు చేర్చడం, లేదా వివిధ హోమ్స్‌లలో ఆశ్రయం కల్పించడం సమస్యగా తయారైంది. ఇక్కడ చాలామందికి ఒకే చోట ఆశ్రయం కల్పించడం వల్ల సదుపాయాల సమస్య తప్పడంలేదు. పతీ పిల్లాడికి ఇచ్చే నగదును పెంచుతామన్న మహిళా శిశు సంక్షేమ శాఖ హామీ ప్రతిపాదనగానే మిగిలిపోయింది. మరోవైపు ఇతర రాష్ట్రాల పిల్లలను కాపాడాక వారి సమస్యలు తెలుసుకునేందుకు భాష సమస్యగా మారుతోంది. దుబాసీలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల బాలల వివరాలు, కనుక్కోవడం క్లిష్టతరంగా మారుతోంది. ఎనిమిదేళ్లుగా... వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న చిట్టిచేతులను కాపాడాలని, వారి ముఖంలో చిరునవ్వును తిరిగి తేవాలన్న సంకల్పంతో ఆపరేషన్ స్మైల్ 2015లోశ్రీకారం చుట్టారు. ఎనిమిదేళ్లలో సుమారు 3 వేలకుపైగా చిన్నారులను కాపాడారు. 1600 మందికిపైగా చిన్నారులను తిరిగివారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 14వందల మందిని వివిధ హోమ్స్‌కు తరలించారు. ప్రతి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడంతో ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్‌కు బీజం పడింది. పోలీసు అధికారి చేపట్టిన చర్యలను ఆదర్శంగా తీసుకొని కార్యక్రమ రూపకల్పన చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడటంతో ప్రతి ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ చేపడుతున్నారు. -
బాలల దినోత్సవం: వాళ్ల కెపుడు పండగ
-
బాలల దినోత్సవం: వాళ్ల కెపుడు పండగ
సాక్షి, హైదరాబాద్: నవంబరు 14 అనగానే చిన్నారులకు ఇష్టమైన పండుగ బాలల దినోత్సవం గుర్తుకొస్తుంది. చేతిలో జెండాలు, గుండెలమీద గులాబీలతో ఉత్సాహం ఉరకలు వేసే చిన్నారులు మన కళ్ల ముందు కదలాడతారు. మరోవైపు గనుల్లో, కార్ఖానాల్లో, ఇటుకబట్టీల్లో, గొడ్ల సావిళ్లలో, టీ దుకాణాల్లో మగ్గిపోతున్న బాల్యం. 75 వసంతాల అమృత మహోత్సవాల వేళ కనీస చదువుకు దూరమై, కట్టుబానిసల్లా బతుకులీడుస్తున్న దైన్యం. మరి వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న భావి భారతానికి నిజమైన బాలల పండుగ ఎపుడు? ఇపుడిదే మిలియన్ డాలర్ల ప్రశ్న. భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు నాడు బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ప్రత్యేకగా వేడుకలు నిర్వహించు కుంటాం. పిల్లలు స్వాత్రంత్య సమరయోధుల వేషధారణలో తమను తాము చూసుకొని మురిసిపోతారు. భావి భారతంకోసం ఎన్నో కలల్లో మునిగిపోతారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడిచిన ఈ శుభవేళ రేపటి పౌరులు కనీస సౌకర్యాలు కూడా లేకుండా దారిద్ర్యంలో మగ్గిపోతున్న వారు చాలామంది ఉన్నారు. మిలియన్లకొద్దీ బాలల భవిష్యత్‌ను కాలరాస్తున్న బాల కార్మిక వ్యవస్థ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బడిలో ఉండాల్సిన బాల భారతం వెట్టి చాకిరీలో మగ్గిపోతోంది. ఇక నైనా వారి జీవితాల్లో మార్పు రావాలని, వెలుగులు నిండాలని కోరుకుంటూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల న్యాయవాదిగా నోబెల్ గ్రహిత కైలాశ్ సత్యార్థి: యూఎన్
న్యూయార్క్: యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) న్యాయవాదిగా నోబెల్ గ్రహిత కైలాశ్ సత్యార్థిని నియమిస్తున్నట్లుగా శుక్రవారం ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. ఈ మేరకు కైలాశ్ సత్యార్థి తోపాటు స్టెమ్ కార్యకర్త వాలెంటినా మునోజ్ రబనాల్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాండ్‌స్మిత్, కే పాప్ సూపర్‌స్టార్స్ బ్లాక్ పింక్‌లను ఎస్డీజీ కొత్త న్యాయవాదులుగా నియమిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఒక ప్రతిక ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఫస్ట్ టైం.. బెజోస్-మస్క్ మధ్య ఓ మంచి మాట) ఈ సందర్భంగా యూఎన్ చీఫ్ గుటెర్రెస్ మాట్లాడుతూ... కొత్తగా నియమితులైన ఈ ఎస్డీజీ న్యాయవాదులు తమ సరికొత్త విధానాలతో సంక్షోభంలో ఉన్న ప్రపంచాన్ని సుస్థిరాభివృద్ధి దిశగా నడిపించటమే కాక తమ ఆశయాలను నెరవేర్చుకోగలరంటూ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ పురోగాభివృద్ధికై 17 అంశాలతో కూడిన సుస్థిరభివృద్ధి లక్ష్యాల కోసం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు కలిసి పనిచేస్తామని అంగీకరించిన సంగతిని గుర్తు చేశారు. ఈ క్రమంలో 2030 కల్లా ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూప్ సుస్థిరాభివృద్ధి కోసం ప్రతిపాదించిన లక్ష్యాల గురించి కూడా ప్రస్తావించారు. బాలకార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణ, బానిసత్వం వంటి వాటిపై నోబెల్ గగ్రహిత కైలాశ్ సత్యార్థి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: ఎర్త్ - 2.0,‘అయ్యా! ఇంతకీ ఆ భూమి ఏ నగరంలో ఉంది?’) -
బాలకార్మికులు బడికి వెళ్లాలంటే.
ప్రపంచవ్యాప్తంగా పదికోట్ల మంది కంటే ఎక్కువమందిని కోవిడ్–19 మహమ్మారి దారి ద్య్రంలోకి నెట్టివేసిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి ప్రభావిత కమ్యూనిటీకు చెందిన పిల్లలకు కరోనా వైరస్ తాజా వేరియంట్లు ప్రమాదకరంగా మారుతున్నాయని నిర్ధారిస్తున్నారు. భారత్ విషయానికి వస్తే అంతర్గతంగా ఆర్థిక కారణాలతో వలస వెళుతున్న కోట్ల మంది ప్రజల దుస్థితి విషయం ఏమిటి? దేశ జనాభాలో వీరు 37 శాతం వరకు ఉన్నారు. జూన్ 10న అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూనిసెఫ్ వెలువరించిన నివేదిక ప్రకారం 16 కోట్లమంది పిల్లలు బాలకార్మికులుగా ఉంటున్నారని తెలుస్తోంది. గత 20 ఏళ్లలో మొదటిసారిగా 2020లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన ప్రగతి స్తంభించిపోయిందని ‘బాలకార్మికులు: 2020లో ప్రపంచవ్యాప్తంగా అంచనాలు, ధోరణులు.. పురోగామి పథం’ అనే పేరిట వెలువడిన నివేదిక పేర్కొంది. భారత్‌లో ఐదేళ్ల నుండి 14 ఏళ్లలోపు వయసున్న కోటిమంది పిల్లలు బాలకార్మికులుగా ఉంటున్నారు. కాగా 2020 నుంచి అంటే కరోనా మహమ్మారి ప్రభావం చూపిన సంవత్సరం నుంచి దేశంలో బాలకార్మికుల సంఖ్య అపారంగా పెరిగిపోతోంది. దేశంలో బాలకార్మికుల పెరుగుదలకు వలసపోవడం అతి ముఖ్యమైన కారణంగా కనిపిస్తుంది. గత ఏడాది నుంచి కరోనా నేపథ్యంలో వలస కార్మికులు తమ తమ ఊళ్లకు తిరుగు వలస పోవడంతో పత్తి క్షేత్రాల్లో, మిరప పొలాల్లో, ఇంటి పనిలో, బట్టీల్లో, ఉత్పత్తి కంపెనీల సరఫరా చైన్లలో, ఇతర పనిస్థలాల్లో బాలకార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యూనిసెఫ్ అభిప్రాయం ప్రకారం దేశంలోని రెండున్నర కోట్లమంది పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోవడమే కాదు.. పాఠశాలల మూసివేతతో పెనునష్టం బారిన పడిపోయారు. కానీ మనం కోటి మంది పిల్లల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం తప్ప, పాఠశాల విద్యకు దూరమైన ఎంతో మంది బాల కార్మికుల గురించి మాట్లాడేది ఎన్నడు? తాజా నిర్ధారణ ప్రకారం, పాఠశాలకు వెళ్లని ఏ పిల్లలైనా సరే బాలకార్మికులుగా మారిపోయే అవకాశం ప్రబలంగా ఉంది. ఏ కారణం వల్లనైనా బడికి వెళ్లలేకపోయిన ప్రతి బాలికా, బాలుడూ తల్లిదండ్రులకు సాయపడే పనుల్లోకి దిగిపోతారు, కుటుంబానికి చెందిన వృత్తుల్లో భాగమవుతుంటారు. బిహార్‌లో అయితే స్కూల్‌కి దూరమైన పిల్లలు అక్రమ సారా బట్టీల నుంచి ఇటుక బట్టీల వరకు వివిధ రకాల పనుల్లో మునిగి తేలుతుంటారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే క్వారీల్లో పనిచేస్తుంటారు. రాజస్తాన్‌లో అయితే గనుల్లో పనిచేయడం, ఇంటి పెరడుల్లో పనులను చక్కబెట్టడంలో నిమగ్నమై ఉంటారు. కాగా ఢిల్లీలో అయితే మురికివాడల్లో కూర్చుని దుస్తుల పరి శ్రమల్లో గుండీలు కుడుతూ కనిపిస్తారు. దీంతోపాటు 2020 నుంచి భారతదేశంలో బాల్యవివాహాలు పెరిగిపోవడం కూడా చూస్తున్నాం. ఆడపిల్లల పరిస్థితి మరీ ప్రమాదకరంగా తయారైంది. వీరికి చిన్నవయసులోనే పెళ్లి చేస్తున్నారు. ఈ బాలవధువులు వెంటనే బాలకార్మికులుగా మారిపోతున్నారు. మూడున్నర కోట్లమంది పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారని ఎన్ఎస్ఎస్ఓ 2017 డేటా పేర్కొంది. ఇక 2021లో, 2 కోట్ల 40 లక్షల మంది పిల్లలు మహమ్మారి తర్వాత పాఠశాలలకు తిరిగి వెళ్లని స్థితికి చేరుకున్నారని యునెస్కో పేర్కొంది. మరి వీరంతా ఎక్కడికి పోయారు? గతసంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ కాలంలో లాక్ డౌన్ నిబంధనలను తీవ్రంగా అమలు చేయడంతో లక్షలాదిమంది వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు సొంత ఊళ్లకు చేరుకోవడం, ఉపాధికి దూరం కావడం, ఆదాయాలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం కారణంగా వారి పిల్లలు కూడా దాని ప్రభావానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. మధ్యాహ్న భోజన పథకాలు కూడా ఆగిపోయాయి. 2017లో 6–10 సంవత్సరాల లోపు పిల్లల్లో 1.5 శాతం మంది బళ్లకు దూరమయ్యారని విద్యా నివేదిక వార్థిక స్థితి పేర్కొనగా 2020లో ఇది 5.3 శాతానికి పెరిగపోయిందని పోల్చి చెప్పింది. గత సంవత్సరంలో 15 లక్షల పాఠశాలలు మూతపడగా, లెక్కకు మించిన సంఖ్యలో పిల్లలు బాలకార్మికులుగా మారిపోయారు. ప్రత్యేకించి బాలికలను వేధించడం, బాలికలను అక్రమ రవాణాకు గురిచేయడం, బాల్యవివాహాలను అధికం చేయడం షరామామూలుగా మారిపోయింది. గత కొద్దినెలల్లో బాలబాలికలకు ఆపన్నహస్తం అందించే చైల్డ్ హెల్ప్ లైన్లు 17 శాతం అధికంగా కాల్స్ అందుకున్నాయి. ప్రభుత్వ అధికారులు దాదాపు 5 వేలకు పైగా బాలికా వివాహాలను అడ్డుకున్నారు. దాదాపు 5 లక్షలకు పైగా బాలికలు బాల్య వివాహాల బారిన పడ్డారని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ పేర్కొంది. కానీ, కేంద్ర బడ్జెట్ ఈ సంవత్సరం బాలబాలికల విద్యపై 5 వేల కోట్ల రూపాయల కోత విధించింది. జీడీపీలో కనీసం 6 శాతం మేరకు విద్యకు కేటాయించాలని ఆల్ ఇండియా ఫోరమ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సంస్థ కేంపెయిన్లు చేస్తున్న తరుణంలోనే కేంద్రం విద్యా కేటాయింపులను కుదించివేయడం గమనార్హం. ఇక ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా చేర్చాలనే ప్రతిపాదన గాల్లో కలిసిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి కావలిసిందేమిటంటే, సంస్థాగతంగా సమస్యను పరిష్కరించడమే. దీనికోసం ఒక సమాజంగా, ఒక జాతిగా మనలను చాలా క్లిష్టమైన ప్రశ్నలు సవాల్ చేస్తాయి. మొదటి ప్రశ్న ఏమిటంటే, మన జాతీయ విద్యావిధానం బాలకార్మిక వ్యవస్థకు తగిన ప్రాధాన్యమిచ్చి పిల్లలందరినీ పాఠశాలలకు తీసుకువచ్చే మార్గాలను నిజంగా అన్వేషిస్తోందా? పాఠశాలలకు ఆవల బహిరంగ విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టకపోతే సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, పేదరికంలో కూరుపోయిన కమ్యూనిటీల పిల్లలకు మరిన్ని ప్రమాదాలు ఎదురుకాక తప్పదు. ఈ పరిస్థితిని పట్టించుకోనంతవరకు బాలబాలికలు మరింతగా చదువుకు దూరం కాక తప్పదు. కోవిడ్ మహమ్మారి ముగిసిపోయిన అనంతరం బాలబాలికల పరిరక్షణ, క్రమబద్దీకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే బాలకార్మిక వ్యవస్థ కోరల్లో మరింత మంది పిల్లలు పడిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనా సంవత్సరంగా భావిస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ, దేశ దేశాల ప్రభుత్వాలు, యంత్రాంగాలు బాలకార్మిక వ్యవస్థ మూలాలను పరిష్కరించేందుకు సమన్వయంతో కృషి చేయాలని నిర్ణయించుకున్నాయి. భారత్ మరింత గట్టిగా కృషి చేయవలసి ఉంది. దీనికోసం దేశంలో బాలకార్మిక వ్యవస్థ బలంగా ఉనికిలో ఉందని మొదటగా గుర్తించాల్సి ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన తర్వాత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర సమాజం, వ్యాపార వర్గాలు, మీడియాతోపాటుగా అన్ని రంగాలూ సమస్య పరిష్కారానికి సామూహికంగా, వ్యూహాత్మకంగా కృషి చేయడానికి ఆస్కారముంటుంది. బహముఖ రంగాలనుంచి, బహుముఖ వర్గాలనుంచి సామూహిక కృషి జరపాలన్న వైఖరి ద్వారానే పేదరికం, సామాజిక వెనుకబాటుతనం, తల్లిదండ్రులకు ప్రత్యామ్నాయంగా సురక్షిత జీవన మార్గాలను కల్పించలేకపోవడం, పిల్లలకు తగిన రక్షణ యంత్రాంగాల లేమి, నాణ్యమైన విద్యా లేమి వంటి సమస్యలను పరిష్కరించడానికి వీలు కలుగుతుంది. బాలకార్మిక వ్యవస్థ మూలాలకు అవతల ఎన్నో పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. దేశంలో పదిలక్షల మందికి పైగా పిల్లలను పాఠశాలలకు తీసుకురావడం కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ విధానాలు, ఆచరణలనంచి భారత్ నేర్చుకుని తీరాలి. ఎంవీ ఫౌండేషన్ వంటి సంస్థలు చేపడుతున్న బాలకార్మిక విముక్తి మండలి వంటి నమూనాలను అధ్యయనం చేసి వాటిని అమలు చేయవచ్చు కూడా. 2025 నాటికి భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంకితమవుదాం. మౌనిక బెనర్జీ వ్యాసకర్త కంట్రీ లీడ్ ఫర్ వర్క్, యూనిసెఫ్ -
World Day Against Child Labour: ఛిద్రమవుతున్న బాలల బతుకులు
వెబ్‌డెస్క్: కోవిడ్ మహమ్మారి బాల్యాన్ని కాటేస్తోంది. పిల్లలను పాఠశాలకు దూరం చేసి కర్మాగారాలకు దగ్గర చేస్తోంది. గడిచిన ఇరవై ఏళ్లుగా బాల కార్మికుల విషయంలో కనిపిస్తున్న వృద్ధి కరోనా దెబ్బకు కకావికలమైంది. మరోసారి రికార్డు స్థాయిలో బాల కార్మికుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏడు జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. బాలలపై కోరలు చాచిన కరోనా కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు లాక్డౌన్ అనివార్యంగా మారింది. దీంతో పాఠశాలలు మూత పడ్డాయి. రోజువారి పని చేసుకునే కూలీలకు ఉపాధి కరువైంది. ఫలితంగా వర్థమాన, పేద దేశాల్లోని పిల్లలు భారీ ఎత్తున పాఠశాలకు దూరమవుతున్నారు. ఆర్థిక పరిస్థితి దిగజారిన కుటుంబాలకు అండగా ఉండేందుకు బాల కార్మిక వ్యవస్థలోకి బలవంతంగా నెట్టివేయబడుతున్నారు. తాజా గణాంకాలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి. 20 ఏళ్ల తర్వాత తొలిసారి ఐక్యరాజ్య సమితి చైల్డ్ లేబర్ గ్లోబల్ ఎస్టిమేట్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్లమంది బాల కార్మికులు ఉన్నట్లుగా తేల్చింది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన చర్యల కారణంగా క్రమంగా తగ్గుతూ వచ్చింది. 20 ఏళ్ల పాటు తగ్గుముఖం పడుతూ వచ్చిన బాల కార్మికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) తెలిపింది. 2001 నుంచి 2016 వరకు అన్ని దేశాల్లో కలిపి 9.4 కోట్ల మంది బాలకార్మికులు ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. మరింత మంది కేవలం కోవిడ్ కారణంగా 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మరో 90 లక్షల మంది పిల్లలకు బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉందని యూఎన్వో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో 46 లక్షల మంది బాలలు అనాథలుగా మారడమో లేదా సామాజిక భద్రతకు దూరమవుతారని తెలిపింది. పదివేల మందికి పైగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో 5 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న వారి సంఖ్య 25.6 కోట్లుగా ఉంది. ఇందులో నాలుగో వంతు మంది పిల్లలు బాల కార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్నారు. సామాజిక భద్రత ఇక కరోనా కారణంగా 2021 మే 31 వరకు దేశ వ్యాప్తంగా పది వేల మంది పిల్లలు అనాథలుగా మారినట్ట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీరందరికీ సామాజిక భద్రత ఇప్పుడు ఎంతో అవసరం. ఈ పిల్లలను ఆదుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మొదటగా ముందుకు వచ్చారు. పిల్లల పేరిట రూ. 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు సైతం ఇదే తరహా పథకాలను ప్రారంభించాయి. చదవండి: ఇంటర్నెట్ సౌకర్యం లేని వారికీ జీవించే హక్కుంది -
పనికి రానంటావా?
పనికి రాకపోవడంతో బాలునిపై దౌర్జన్యం చేస్తున్న యజమాని. ఆదివారం బెంగళూరు లాల్‌బాగ్‌లో బాల కార్మిక దురాచారానికి వ్యతిరేకంగా నిర్వహించిన బయలు నాటకంలో ఓ సన్నివేశం. బాలలను పనికి కాదు, బడికి పంపాలని ఈ సందర్భంగా చాటిచెప్పారు. బోనులో చిక్కిన భల్లూకం తుమకూరు: తుమకూరు సిద్దగంగ మఠ పరిసరాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. నాలుగైదు నెలలుగా ఓ ఎలుగుబంటి మఠం పరిసరాల్లో సంచరిస్తు రెండుసార్లు ఏకంగా మఠంలోకే ప్రవేశించింది. దీంతో మఠం సిబ్బంది ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు మఠం చుట్టుపక్కల బోన్లు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి ఎలుగుబంటి బోనులో చిక్కింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఎలుగుబంటిని అడవిలోకి తరలించారు. పక్షులను కాపాడుకోవాలి గౌరిబిదనూరు: వేసవి ప్రారంభం కావడంతో పక్షులను కాపాడుకోవాలని యశస్వీ పీయూ కళాశాల అధ్యక్షుడు శశిధర్ అన్నారు. ఆదివారం పక్షులకు ఆహారం, నీరు ఇవ్వండి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పక్షులకు ఆహారం, నీరు సకాలంలో అందక పోవడంతో మృత్యువాతపడుతున్నాయని, ఈ నేపథ్యంలో వాటి సంరక్షణకు విద్యార్థులు చిన్నపాటి ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు, ధాన్యపు గింజలు ఉంచి మానవత్వం చాటుకుంటున్నారని అభినందించారు. -
బాలమిత్ర పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తాం
సాక్షి, విజయవాడ: జువైనల్ జస్టిస్ చట్టం అమలుపై డీజీపీ కార్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. జ్యూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే మహేశ్వరి, న్యాయమూర్తులు విజయలక్ష్మి, గంగారావు పాల్గొననుండగా.. డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ వెబినార్ ద్వారా పాల్గొన్నారు. పిల్లల భద్రత చట్టం అమలు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాల నేరస్థులు పెరగడానికి గల కారణాలు, వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేదానిపై రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు. వీధి బాలలను రక్షించడం పోలీసుల విధి నిర్వహణలో భాగం అని స్పష్టం చేశారు గౌతమ్ సవాంగ్. (చదవండి: ఆ దాడి చేసింది టీడీపీ కార్యకర్తే) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్జీఓలతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు. అనేక మంది చిన్నారులకు బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలమిత్ర పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సెమినార్లో అనేక అంశాలు చర్చించాము. చర్చించిన ప్రతి అంశాన్ని పరిష్కారం అయే విధంగా చర్యలు తీసుకుంటాం అని గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. -
12 ఏళ్ల బాలుడిపై యజమాని దారుణం!
-
అందరూ చూస్తుండగానే దారుణం!
సాక్షి, నిజామాబాద్: 12 ఏళ్ల బాలుడిని పనిలో పెట్టుకోవడమే కాకుండా ఓ వ్యక్తి అతని పట్ల రాక్షసంగా ప్రవర్తించాడు. పనిలోకి రావడం లేదని చెట్టుకు కట్టేసి చితకబాదాడు. కొట్టొద్దని ఆ బాలుడు యజమానిని ఎంతగా బతిమాలినా వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా కాళ్లకు తాడు కట్టి బాలుడిని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. నిజామాబాద్ జిల్లాలోని మల్కాపూర్‌లో బుధవారం ఈ దారుణం వెలుగుచూసింది. బాలుడిని యజమాని చిత్ర హింసలకు గురిచేస్తున్నా జనమంతా చోద్యం చూశారే తప్ప ఏ ఒక్కరూ ఆపలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. (ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిందని అక్కాచెల్లెళ్లు..) ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం కాగా, మైనర్ బాలుడిపై దాడి ఘటనపై మల్కాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ స్పందించింది. ఈ అమానుష దాడి ఘటనను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ దృష్టికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు చెప్పారు. ఇదిలాఉండగా.. బాలుడిపై దాడి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నిజామాబాద్ రూరల్ పోలీసులు మల్కాపూర్ చేరుకున్నారు. వివరాలు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
బాలల స్వేచ్ఛకు పెను సవాలు..!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తితో నెలకొంటున్న పరిస్థితులు బాలల స్వేచ్ఛకు పెను సవాలుగా మారనున్నాయి. లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతబడి చాలామంది పిల్లలు ఇంటివద్దే ఉండటంతో వారిని పనిబాట పట్టించేందుకు తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక సంక్షోభ సమయంలో ఊరట లభిస్తుందనే ఆశతో పిల్లల్ని కార్మికులుగా మార్చే ప్రమాదముందని ప్రపంచ కార్మిక సంస్థ(ఐఎల్ఓ), యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. లాక్డౌన్ అన్ని రంగాలపై పెను ప్రభావాన్నే చూపింది. దీంతో తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే నిరుద్యోగం పెరగడంతో చిన్నపాటి ఉద్యోగాల్లో తక్కువ వేతనానికి పనిచేసే బాలలపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో బాల కార్మికుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉంది. ఇరవై ఏళ్లలో 10 కోట్ల బాలకార్మికులు బడికి బాలల హక్కులతో పాటు బాల కార్మిక వ్యవస్థపై చేపట్టిన ఉద్యమం ఇరవై ఏళ్లలో మంచి ఫలితాలనే ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది పిల్లలను వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించడంలో అంతర్జాతీయ సంస్థలు కృషి చేశాయి. దేశంలో ఇరవై ఏళ్లలో దాదాపు 1.7 కోట్ల మంది పిల్లలు బాలకార్మిక వ్యవస్థ నుంచి విముక్తులయ్యారు. తాజా పరిస్థితులు, భవిష్యత్ అంచనాలపై ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో బాలల స్వేచ్ఛకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకై చేస్తున్న ఉద్యమాన్ని మరింత తీవ్రం చేయాలని, పనిలో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. -
బాల్యం బుగ్గిపాలు!
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పలకా బలపం పట్టి.. అక్షరాలు దిద్దాల్సిన ఆ చిట్టిచేతులు పంట పొలాల్లో తట్టా బుట్టా పట్టుకొని వ్యవసాయ పనులు చేస్తున్నాయి. తోటి పిల్లలతో ఆడి, పాడాల్సిన ఆ చిన్నారులు.. ఇటుక బట్టీల్లో మట్టి కొట్టుకుపోతున్నారు. విద్యాహక్కు చట్టం బడిఈడు గల 5 నుంచి 14 ఏళ్లలోపు ప్రతి చిన్నారి కచ్చితంగా పాఠశాల విద్యను అభ్యసించాలని చెబుతోంది.. ఈ క్రమంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులను బడిబాట పట్టించేందుకు ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా.. వారి బతుకులకు మాత్రం భరోసా కల్పించలేకపోతున్నాయి.. ఇందులో భాగంగా ఆయా జిల్లాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో బడికి వెళ్లకుండా, వివిధ ప్రాంతాల్లో ఉంటున్న చిన్నారులకు గుర్తించేందుకు రెండు నెలల పాటు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎక్కువగా నారాయ ణపేట జిల్లాలోని మద్దూరు, మాగనూరు మండలాలు, జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు, మల్దకల్, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్ మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో బడిబయటి పిల్లలు ఎక్కువగా ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 30 మంది చిన్నారులకు.. ఉపాధి కోసం చాలామంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జీవనోపాధి కోసం వలస వెళ్తుంటారు. భవన నిర్మాణం, ఇటుక బట్టీలు వంటి స్థిరంగా ఉపాధి పొందే ప్రాంతాల్లో చిన్నారులను గుర్తించి వారికి అందుబాటులో పనిచేస్తున్న ప్రాంతంలో పాఠశాలలు అందుబాటులో లేని క్రమంలో కనీసం 30 మంది చిన్నారులు ఉంటే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అక్కడ వర్క్‌సైడ్ హాస్టల్ నిర్వహించాల్సి ఉంది. వీరితోపాటు వివిధ తండాలు, గ్రామాల్లో తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సహకారంతో వారి పిల్లలకు స్థానికంగా సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేయాలి. చిన్నారులు ఇంత ఎక్కువ సంఖ్యలో బడికి పోకుండా ఉంటున్నప్పటికీ ప్రభుత్వం హాస్టళ్ల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వీటి నిర్వహణపై జిల్లా విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో వీటి ఏర్పాటు జరగలేదు. ఇంతేకాకుండా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించి తర్వాత పాఠశాలలకు పంపించకుండా వివిధ పనులకు పంపిస్తున్నారు. మండల స్థాయిలో సర్వే విద్యాశాఖ అధికారులు రెండు నెలల పాటు నిర్వహించిన మండల స్థాయి సర్వేలో మొత్తం 2,152 మంది 5– 14 ఏళ్లలోపు చిన్నారులు బడిబయట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వర్షాకాలం ముగిసిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు తండాలు, వివిధ గ్రామాల నుంచి ఉపాధి, కూలీ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారున్నారు. వీరు చిన్నారులను ఇంటి వద్ద వృద్ధులతో వదిలేసిపోవడంతో చిన్నారుల ఆలనాపాలన, చదువుల గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వారు పాఠశాల ముఖం చూసే పరిస్థితి కనిపించడం లేదు. అంతేకాకుండా ఇరత ప్రాంతాల నుంచి పాలమూరు జిల్లాకు వలస వచ్చే వారు ఎక్కువగా ఇటుక బట్టీలు, బొగ్గు బట్టీలు, బొంతలు కుట్టేవారు, ఇతర జీవనోపాధి కోసం వచ్చే పిల్లలు ఎక్కువగా పాఠశాలలకు వెళ్లకుండా ఉంటున్నారు. వీటితోపాటు మరెంతో మంది చిన్నారులు వివిధ కారణాలతో చదువులకు దూరమవుతున్నారు. -
ఆ చిన్నారుల మోములో చిరునవ్వు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను, బాలకార్మికులు, యాచకులు, వెట్టి చాకిరీలో మగ్గుతున్న పిల్లలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన ఆరవ విడత ‘ఆపరేషన్ స్మైల్’పూర్తయింది. మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో 3,600 మంది చిన్నారులను పోలీసులు రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించగా.. మిగిలిన వారిని రెస్క్యూ హోంలలో ఉంచారు. రక్షించిన వారిలో 1,292 మంది పిల్లలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. ఈసారి నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో మొదటిసారిగా చైల్డ్ ట్రాక్ పోర్టల్, ముఖాలు గుర్తించే ఫేషియల్ రికగ్నేషన్ యాప్, దర్పణ్లను ఉపయోగించడం కూడా సత్ఫలితాలనిచ్చింది. రాష్ట్రంలో ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మతపరమైన స్థలాలు, ట్రాఫిక్ కూడళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, టీస్టాళ్లు, దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ ఆరవ ఆపరేషన్ స్మైల్‌ను మహిళా రక్షణ విభాగం నిర్వహించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశు గృహాల్లో ఉన్న పిల్లల డేటాను డిజిటలైజ్ చేయడంతో తప్పిపోయిన, దొరికిన, రక్షించిన పిల్లల ఫొటోలను పోల్చిచూడడానికి సులభంగా మారింది. దర్పణ్ యాప్ ద్వారా కల్వకుర్తి పోలీస్ స్టేషన్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో తప్పిపోయిన ఇద్దరు పిల్లలను గుర్తించారు. -
‘ఆపరేషన్ స్మైల్’ నవ్వులు పూయిస్తుందా?
ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరున దేశవ్యాప్తంగా బాల కార్మికులుగా, వీధి బాలలుగా ఉన్న చిన్నా రుల సంరక్షణ జరుగు తుంది. పోలీసు డిపార్ట్ మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, శిశు సంక్షేమశాఖ, రెవెన్యూ శాఖ, చైల్డ్ లైన్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి చేపట్టే ఈ కార్యక్రమంలో మన తెలుగు రాష్ట్రాలలో పోలీసు శాఖ తరఫున సీఐడీ డిపార్ట్మెంట్ గణనీయమైన పాత్ర పోషిస్తున్నది. ఈ ఆపరేషన్ స్మైల్గానీ, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలకు బీజం పడటానికి కారణం 2009లో సుప్రీంకోర్టు తప్పిపోయిన పిల్లల ఆచూ కీపై విచారణ చేపడుతూ తప్పిపోయిన పిల్లల జాడ కనుగొనాలని అప్పటి ఘజియాబాద్ జిల్లా పోలీసు అధికారిని ఆదేశించడంతో, ఆ పోలీసు అధికారి బాల కార్మికులు, వీధి బాలలను పరి రక్షించే చర్యలు చేపట్టడంతో మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ ఎస్పీ పనితీరు సత్ఫలితాలు ఇవ్వ డంతో దేశంలోని 631 జిల్లాల్లో ఘజియాబాద్ జిల్లా పోలీసు అధికారి చేపట్టిన చర్యలను ఆద ర్శంగా తీసుకొని ఆ రకంగా కార్యక్రమ రూప కల్పన చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడ టంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్, జూలై 1 నుండి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టాలని తీర్మానించింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా ఈ రెండు కార్య క్రమాలు విధిగా చేపడుతూ బాలకార్మికులుగా, వీధి బాలలుగా ఉన్న వారిని సంరక్షిస్తూ వస్తు న్నాయి. అలాగే ఆరోగ్యకరంగా ఉండి, ఎలాంటి వైకల్యం లేని ఆరు సంవత్సరాలు వచ్చిన బాల, బాలికలు బడి బయట విద్యాబుద్ధులకు దూరంగా ఉంటే వారిని సైతం బాల కార్మికులుగానే గుర్తిస్తూ వారిని పాఠశాలల్లో చేర్చే దిశగా అధికార యంత్రాంగం పని చేస్తున్నది. వీటికి అనుసం ధానంగా దర్పణ్ కార్యక్రమం ద్వారా తప్పిపో యిన పిల్లలు ఏదైనా ప్రభుత్వ లేదా స్వచ్ఛంద సంఘాల ఆశ్రమాల్లో నివసిస్తున్నారా అని తెలుసు కోవడానికి మరింత తోడ్పాటు అందిస్తున్నది. ఈ దర్పణ్ సహితం మంచి ఫలితాలనే ఇస్తుందనడా నికి జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తప్పిపోయిన పిల్లలు ఇద్దరిని తెలంగాణలో ఒకరు, ఆంధ్రప్రదే శ్లో ఒకరిని కనుగొనడం సాధ్యమైంది. కానీ, పిల్లల రక్షణ మాత్రమే సరిపోతుందా? బాలకార్మికులను రక్షించామని సంఖ్యలు, అంకెలు చెబుతూ ఆనందిస్తున్నాము. కానీ, పరిరక్షణ విష యానికి వస్తే పూర్తి విఫలం చెందుతున్నాము. జనవరిలో రక్షించిన పిల్లలనే కొందరిని మళ్లీ జూలైలో రక్షిస్తున్నామంటే అన్ని శాఖల శ్రమ ఎంత నిష్ఫలమవుతుందో నిలుస్తున్నది. ఈ ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ రక్షించిన పిల్లల్ని వారి గుర్తింపు పూర్తయ్యేవరకు వారిని ఉంచేందుకు వసతులు లేక షాదీఖానాలలో లేదా టెంట్లలో ఉంచిన సంద ర్భాలు ప్రతి ఏటా పునరావృతమౌతున్నాయి. ప్రతి ఏటా ఈ ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టి అంతటితో మా పని అయి పోయిందని సంతోషించక కేంద్ర ప్రభుత్వానికీ, అధికారులకూ నిజాయితీగా బాల కార్మిక వ్యవస్థ వీధి బాలల వ్యవస్థను రూపుమాపాలనుకుంటే సందుల్లో, గొందుల్లో బాల కార్మికుల కోసం వెత కడం కన్నా, కేంద్ర ప్రభుత్వం తరఫున టీవీల్లో, పత్రికల్లో ఓ ప్రకటన చేసి తేదీ నిర్ణయించి కర్మాగారాల్లో, ఇళ్లల్లో, గనుల్లో, పనిలో, మాఫియా ముఠాల కనుసన్నల్లో బతుకీడుస్తున్న బాల కార్మికు లను ప్రభుత్వ అధికారులకు అప్పజెప్పమనీ అనం తరం బాల కార్మికులు ఎవరి వద్దనైనా కనిపిస్తే కఠిన శిక్షతో జైల్లో నెడతామని నిజాయితీగా ప్రక టన చేస్తే దేశం మొత్తంపైన ఉన్న బాల కార్మికులు ప్రభుత్వం చెంతకు చేరడం ఖాయం. అటు పిమ్మట తల్లిదండ్రుల వద్దకి చేర్చి పాఠశాలలకు పంపాలని నిర్దేశిస్తే నిజంగా బాల కార్మికులు లేని భారతదేశంగా ప్రపంచ దేశాలముందు సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈ చిన్న కిటుకు కేంద్ర ప్రభు త్వానికి తెలియంది కాదు. కానీ, బాల కార్మికుల నందరినీ ఒకేసారి రక్షిస్తే ప్రజల ముందు చెప్పు కోవడానికి ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా వచ్చే అవకాశం కోల్పోతారు. పిల్లల వద్దనైనా రాజ కీయాలు పక్కన పెడితే వారి జీవితాల్లో నవ్వుల పువ్వులు పూయించవచ్చు. అచ్యుతరావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం ‘ మొబైల్ : 93910 24242 -
చిద్రమౌతున్న బాల్యానికి బంగారు భరోసా
సాక్షి, నల్గొండ : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని బాలల పరిరక్షణ సమితి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ పేరున ఆరు మాసాలకోసారి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో బాలకార్మికులను గుర్తిస్తుంది. అయినా ఎక్కడో ఒక చోట బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయస్సులో ఖార్ఖానాల్లో, ఇటుకబట్లీల్లో, ఇతర ప్రైవేట్ వ్యాపార సంస్థల్లో మగ్గిపోతున్నారు. బాలల పరిరక్షణ కోసం బాలల న్యాయ చట్టం, ఉచిత నిర్బంధ విద్యా హక్కు, ఇలా ఎన్నో చట్టాలను చేసింది. ఆడపిల్లలపై అకృత్యాలు, సామాజిక రుగ్మతలు, అన్యాయాలను ఎదిరించడం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాలు ఈ నెల 7న ప్రారంభం కాగా.. 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. ఎన్నో ప్రత్యేక చట్టాలు.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని బాలల పరిరక్షణ సమితి అనేక కార్యక్రమాలు చేపడుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ పేరున ఆరు మాసాలకోసారి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో బాలకార్మికులను గుర్తిస్తుంది. అయినా ఎక్కడో ఒక చోట బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతోంది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయస్సులో బాలకార్మికులుగా ఉంటూ తమ జీవితాన్ని కోల్పోతున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ విభాగం ఏర్పాటు చేసింది. బాల్య వివాహాలతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తుంది. అయితే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం 2016లో ప్రత్యేక చట్టాన్ని చేసింది. అదే విధంగా 2006లో బాల్య వివాహాల నిరోధక చట్టం, 2015లో బాలల న్యాయ చట్టం, 2009లో ఉచిత నిర్బంధ హక్కు చట్టాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1098 టోల్ ఫ్రీ నంబర్.. చిన్నపిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే వారి సమాచారాన్ని అందించేందుకు 1098కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. బాల కార్మికులతో పాటు అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడినా ఈ నంబర్‌కు సమచారం అందిస్తే వెంటనే వారు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారు. ఆరు మాసాలకోసారి బాలకార్మికుల గుర్తింపు.. ఆరు మాసాలకోసారి బాలకార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్‌ల పేర పోలీస్, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, ఐసీడీఎస్, కార్మిక శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీల ఆధ్వర్యంలో బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. ఏ ఆధారం లేనివారికి ఆ వయస్సును బట్టి సంబంధిత పాఠశాలల్లో చేర్పించి వారి సంరక్షణ బాధ్యతను చూసుకుంటారు. బాలకార్మికులు ఇలా.. జిల్లాలో బాల కార్మికులను 2018–19 సంవత్సరంలో గుర్తించడం జరిగింది. కట్టంగూర్ మండలంలో అత్యధికంగా 79 మందిని గుర్తించగా.. చింతపల్లి, కనగల్, నాంపల్లి, తిప్పర్తి మండలాల్లో ఇద్దరు చొప్పున గుర్తించారు. నకిరేకల్ 62, మిర్యాలగూడ 59, మాడుగులపల్లి 58, నల్లగొండ 53, త్రిపురారం 23, కేతెపల్లి 16, తిరుమలగిరి సాగర్ 16, వేములపల్లి 12, గుర్రంపోడు 11, దేవరకొండ 10, నేరేడుగొమ్ము 9, మునుగోడు, పెద్దవూరలో 8మంది చొప్పున, అనుమల, శాలిగౌరారంలో ఏడుగురు చొప్పున, చండూరులో ఆరుగురు, చందంపేట, గుండ్రపల్లిలో ఐదుగురు చొప్పున, అడవిదేవులపల్లి, చిట్యాల, దామరచర్ల మండలాల్లో నలుగురు చొప్పున బాలకార్మికులను గుర్తించారు. అక్రమ రవాణా నిరోధక చట్టం.. అక్రమ రవాణా నిరోధానికి 1956లో ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో అక్రమ రవాణా బాధితులు ఎవరంటే ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా లైంగిక వ్యాపారాలకు తరలించబడిన వారు. బలవంతపు వెట్టి చాకిరీలో ఉన్నవారు, ఏ ఉద్దేశంతో అయినా సరే అమ్మివేయబడిన వారు, మంచి జీవనోపాధి ఇస్తామన్న మాటలు నమ్మి తెలియని ప్రాంతానికి తరలించబడినవారు. అక్రమ రవాణా బాధితులను కాపాడుతున్న సందర్భాల్లో... ప్రత్యేక పోలీస్ అధికారి లేదా అక్రమ రవాణానిరోధక ఆఫీసర్ అక్రమ రవాణా జరగబోతున్నా, జరిగిన సందర్భాలను తెలుసుకోవడాకి వారెంట్ లేకుండా పరిశోధించవచ్చు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ఇద్దరు గౌరవపరమైన వ్యక్తుల నుంచి సమర్థత తీసుకోవాలి. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు స్వచ్ఛంద సంస్థకు చెందిన మహిళ అయి ఉండాలి. అక్కడ కనిపించిన పిల్లలందరినీ బయటికి తీసుకురావాలి. అక్రమ రవాణా నుంచి కాపాడిన తర్వాత.. వయస్సు నిర్ధారణ, గాయాలను గుర్తించడం కోసం వైద్యం కోసం తరలించాలి. న్యాయమూర్తి ముందు హాజరుపర్చాలి. మహిళా పోలీస్, సామాజిక కార్యకర్త చేత బాధితురాలిపై విచారణ జరిపించాలి. పూర్తి శ్రద్ధ, సంరక్షణ బాధితురాలికి కల్పించాలి. పిల్లలయితే సీడబ్ల్యూసీని ప్రవేశపెట్టాలి. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ, డీఈఓ, డీఎంహెచ్ఓ, పీడీ డీఆర్డీఏ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒకరిని, స్వచ్ఛంద సంస్థ నుంచి ఒకరిని సభ్యులుగా తీసుకుంటారు. ఐసీడీఎస్ పీడీ కన్వీనర్‌గా ఈ కమిటీకి ఉంటారు. బేటీ బచావో, బేటీ పడావో ప్రయోజనాలు.. 2015 జనవరి 22న కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అమ్మాయిలు ఉన్నత విద్యను పొందడానికి అవకాశం ఉంటుంది. తమకంటూ సొంత గుర్తింపును సృష్టించుకోవచ్చు. ఈ పథకం వల్ల కలిగే పలు ప్రయోజనాలు.. బాలికల ఉన్నత విద్య కోసం ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. ఈ పథకం కింద బాలికలు ఉన్నత విద్యను పొందుతారు. బాలికల వివాహాం కోసం ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తుంది. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య వివక్షత తగ్గనుంది. ఈ పథకం కింద బ్యాంక్‌లో డిపాజిట్ చేయబడిన మొత్తం ఆదాయ పన్ను నిబంధన 80–సీ కింద మినహాయింపు ఉంటుంది. ఈ పథకానికి అర్హులైన వారు సుకన్యయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఇలా.. బేటీ బచావో బేటీ పడావో పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వయో పరిమితి 10 సంవత్సరాల వయస్సు ఉంటుంది. 10 సంవత్సరాల వయస్సు గల ఏ అమ్మాయి అయినా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న బా లికలు కూడా ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి బాలల జనన ధ్రువీకరణ, చిరునామా, గుర్తింపు కార్డును జత చేయాల్సి ఉంటుం ది. దరఖాస్తులను సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో అందించాలి. -
నటి భానుప్రియపై చెన్నైలో కేసు
తమిళనాడు,పెరంబూరు: నటి భానుప్రియపై బాల కార్మికుల నేరం కేసు మరోసారి కలకలం సృష్టిస్తోంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సామర్లకోట పోలీసులు భానుప్రియపై నమోదు చేసిన కేసు ఇప్పుడు చెన్నై పోలీసుల చేతికి మారింది. చెన్నైలో ఒక ఫ్లాట్‌లో నివశిస్తున్న భానుప్రియ తన ఇంటి పని కోసం మైనర్ బాలికలను నియమించుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే తన ఇంట్లో పనిపిల్ల చోరీకి పాల్పడిందంటూ గత జనవరి 19న స్థానిక పాండిబజార్ పోలీస్‌స్టేషన్‌లో నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేశారు. ఇంటి పనిపిల్లే చోరీకి పాల్పడి ఉంటుందని, ఆ అమ్మాయిపై కేసు నమోదు చేయాలని భానుప్రియ పేర్కొంది. అయితే పనిపిల్ల తల్లి ప్రభావతి సామర్లకోట పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపీకృష్ణన్లపై ఫిర్యాదు చేసింది. అందులో తన కూతుర్ని ఇంట్లో నిర్బంధించి చిత్రవధకు గురి చేస్తున్నారని, తన కూతురిని రక్షించమని కోరింది. దీంతో సామర్లకోట పోలీసులు చెన్నైకి వచ్చి నటి భానుప్రియను విచారించారు. అదే సమయంలో భానుప్రియ పెట్టిన కేసులో చెన్నై, పాండిబజార్ పోలీసులు పనిపిల్ల, తల్లి ప్రభావతిని అరెస్ట్ చేసి విచారించారు. అలాంటిది తాజాగా సామర్లకోట పోలీసులు నటి భానుప్రియ కేసును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించిన నేరం జరిగింది చెన్నైలో కాబట్టి నటి భానుప్రియపై బాల కార్మికుల చట్టం కింద వారు నమోదు చేసిన కేసును చెన్నై పోలీసులకు ఇటీవల తరలించారు. దీంతో చెన్నై, పాండిబజార్ పోలీసులు ఆ కేసుకు సంబంధించి నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్‌పై కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు నటి పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. -
బడి బయటే బాల్యం
సాక్షి, కోట (నెల్లూరు): సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చింది. ఈ విద్యాసంవత్సరం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. బడి ఈడు పిల్లలంతా పాఠశాలల్లోనే కనిపించాలని, ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్చేలా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారుల ఉదాసీనత కారణంగా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. జిల్లాలో కావలి తర్వాత గూడూరు నియోజకవర్గం పరిధిలోనే ఎక్కువ మంది బడి ఈడు పిల్లలు పనులకు వెళ్తున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. విద్యాహక్కు చట్టానికి తూట్లు విద్యాహక్కు చట్టం అమలులో లోటు పాట్లు కనిపిస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలందరినీ బడిలో చేర్చుకోవాలన్నది లక్ష్యం. అయితే గూడూరు నియోజకవర్గంలో వెయ్యిమందిపైనే బడి బయట పిల్లలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి అధికారుల లెక్కల కంటే ఎక్కువగానే బడి బయట పిల్లలు వివిధ రకాల పనులు చేస్తున్నారు. ముఖ్యంగా 8 నుంచి 14 ఏళ్లలోపున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు చెందిన చిన్నారులు మోతుబరి రైతుల వద్ద పశువుల కాపరులుగా, ఇటుకల బట్టీలు, దుకాణాల్లో బాల కార్మికులుగా గడుపుతున్నారు. మండలంలోని కోట, విద్యానగర్, ప్రకాశంకాలనీ, గోవిందపల్లి, సిద్ధవరం, కొత్తపట్నం గ్రామాల్లో చిన్నారులు అధికంగా దుకాణా లు, హోటళ్లు, చిత్తుకాగితాలు ఏరుకుంటూ, భవన నిర్మాణాల్లో జీవనం సాగిస్తున్నారు. ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్న చిన్నారులు కాగా నియోజకవర్గంలో ఆక్వాసాగు పెరగడంతో కూలీలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో తల్లిదండ్రులు కూలీలుగా రొయ్యలగుంటల వద్ద చేరుతున్నారు. వారితో పాటు పిల్లలను బడి మా న్పించి పనులకు పంపుతున్నారు. కోట మండలంలోని పలు గిరిజన కాలనీల్లోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్ధుల హాజరు శాతం చాలా తక్కువగా ఉంది. వీరంతా బడిలో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నా అది వాస్తవం కాదు. కొంద రు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపి పనులకు వెళ్తున్న బాలలను పాఠశాలకు తీసుకువస్తున్నా వారి కొనసాగింపు కష్టంగా ఉంది. కార్మిక శాఖాధికారులు పట్టించుకోకపోవడం, విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు బడిమానేసి తిరిగి పనులకు వెళ్తున్నారు. ముఖ్యంగా విద్యానగర్, ప్రకాశంకాలనీలో ఎక్కువ మంది బడిమానేసిన పిల్లలు రోడ్లపై తిరుగుతూ కాగి తాలు, పాతసామాన్లు ఏరుకుంటూ కనిపిస్తున్నారు. ఇక్కడ ఇసుప సామాన్ల దుకాణం నడుపుతున్న వ్యాపారి ముందుగానే డబ్బులు ఇస్తూ వారిని పనులకు ఉసిగొల్పుతున్నట్టు సమాచారం. డబ్బు చెల్లించలేని స్థితిలో పిల్లలు పాతసామాన్లు ఏరుకుని వచ్చి అమ్మి బాకీ కట్టాలని షరతులు పెట్టినట్టు తెలిసింది. బడికి వెళ్లకుండా రోడ్లపై తిరుగుతున్న కొందరు విద్యార్థులను ప్రశ్నించగా బడికి వెళ్లాలని ఉన్నా తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తుందంటున్నారు. -
స్వేదపు పూసలు
బాల్యానికి రెక్కలుంటాయి. ఛీ..! రెక్కల కష్టం మిగిలింది. భవిష్యత్తు బంగారంలా ఉండాలి.బంగారం లాంటి పిల్లల భవిష్యత్తు ఏమవుతోంది? గిల్టుగా మారుతోంది.అవును... మన ఒంటి మీద తళతళలాడే ఈ గిల్టు ఆభరణాలు ఆ పిల్లల బాల్యానికి భరణాలే. మన మెడలో హారాలను... పిల్లలు తమ స్వేదంతో కడుతున్నారు. ‘‘బంగారం, ప్లాటినం, వెండి వంటి విలువైన లోహాలతో తయారయ్యే ఆభరణాలకు బదులు, అనుకరణ నగలే ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. అయితే ఇండియన్ ఇమిటేషన్ ఆర్నమెంట్స్ మార్కెట్లో పాతిక శాతాన్ని చైనా ఆక్రమించేసింది. ఏడాదికి వెయ్యికోట్ల విలువైన ఆభరణాలు చైనా నుంచి ఇండియాకి దిగుమతి అవుతున్నాయి. మన ఇమిటేషన్ ఆభరణాలతో పోలిస్తే చైనా ఆభరణాల ధర తక్కువ. చైనాలో తయారవుతున్న ఇమిటేషన్ నగలన్నీ మెషీన్ మేడ్ ఆర్నమెంట్సే. మన దగ్గర అలా కాదు. చేత్తో తయారయ్యేవే ఎక్కువ. బంగారు, ప్లాటినం ఆభరణాలను పోలిన ఇమిటేషన్ నగలను తయారు చేసే నిపుణులు మన దగ్గరున్నారు. ఇమిటేషన్ నగల తయారీ దారులు ఇండియాలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే గుజరాత్లో ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ కూలితో పని చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీ రాజ్‌కోట్‌లో విస్తరించడానికి అదీ ఒక కారణం. మన దగ్గర వంద రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల విలువ చేసే ఇమిటేషన్ నగలు తయారవుతున్నాయి. ప్రపంచంలో ఈ నగల తయారీలో చైనా తరవాతి స్థానం ఇండియాదే. మన నగలకు జర్మనీ, అమెరికా, పాకిస్తాన్, మధ్య ఆసియా దేశాలు, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాలతోపాటు అనేక దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మన జువెలరీ తయారీ సంస్థలన్నీ వ్యవస్థీకృతం కావాలి’’ ... ఇది రాజ్‌కోట్ ఇమిటేషన్ జ్యువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ వికారియా 2013లో అన్నమాట. వినడానికి బాగున్న మాట కూడ. మరి... ఇమిటేషన్ నగల తయారీలో ఛిద్రమవుతున్న బాల్యం మాటేమిటి? ఇలా బయటపడింది గుజరాత్, రాజ్‌కోట్‌లోని ఒక కృత్రిమ ఆభరణాల తయారీ యూనిట్లో పని చేస్తున్న పిల్లలను పోలీసులు రక్షించారు. ఆ పిల్లలకు ఏ నలుగురో, ఐదుగురో కాదు... ఏకంగా డెబ్బై మంది పిల్లలు. అదీ ఒక్క కార్ఖానాలోనే. ఇక మిగిలిన వర్క్ యూనిట్ల సంగతేమిటి? ఏడు వందల కార్ఖానాలున్న రాజ్‌కోట్‌లో ఎంత మంది పిల్లల బాల్యం అందమైన రంగు రాళ్ల నీడలో మసకబారుతుండవచ్చు? ఆ సంఖ్య వందలు కాదు వేలల్లో ఉండవచ్చనే అనుమానిస్తున్నారు పోలీసులు. గత ఏడాదిలో ఒక కార్ఖానా నుంచి ఇద్దరు పిల్లలు యజమాని కళ్లు కప్పి పారిపోయారు. వాళ్ల కోసం సాగిన దర్యాప్తులో తీగ లాగితే డొంక కదిలినట్లు పిల్లలు బిలబిల మంటూ బయటికొచ్చారు. చట్టానికి దొరకని ట్రాఫికింగ్ ఇమిటేషన్ నగల తయారీలో పరిశ్రమల్లో పని చేస్తున్న పిల్లలంతా వెస్ట్ బెంగాల్ నుంచి పని కోసం గుజరాత్‌కి వచ్చిన వాళ్లే. ఇది చాలా పెద్ద నెట్వర్క్. కార్ఖానాల యజమానులకు నేరుగా ఎటువంటి సంబంధం ఉండదు. పిల్లలను సరఫరా చేసే ఏజెంట్లు ఉంటారు. ఆ ఏజెంట్లు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి బేరం కుదుర్చుకుంటారు. నెలకు ఆరువేల జీతం ఇప్పిస్తామని చెప్పి పిల్లలను తీసుకొస్తున్నారు. ఇది చట్టం పరిధిలో ఏ సెక్షన్‌కూ దొరకని పిల్లల అక్రమరవాణా. తల్లిదండ్రుల సమ్మతితోనే జరుగుతుంది కాబట్టి, ఏజెంట్ల మీద ఎవరూ కేసు పెట్టరు. ఊపిరిసలపని పని పరిస్థితుల్లో పిల్లలు తమకు తామే బంధనాలను చేధించుకుని బయటకు రావడంతో ఈ దురాగతం అయినా బయటికొచ్చింది. పగలు – రాత్రి పని బ్రేస్లెట్లు, గాజులు, చెవి కమ్మలు, హారాలు, లాకెట్ల వంటి ఆభరణాలలో రాళ్లు పొదగడం వంటి సునిశితమైన పనుల్లో శిక్షణనిస్తారు. ఈ కార్ఖానాల్లో పగలు – రాత్రి పని జరుగుతుంటుంది. షిఫ్ట్‌ల వారీగా పిల్లల చేత పని చేయిస్తుంటారు. ఇక విశ్రాంతి సమయంలో ఒక పది– పన్నెండు మంది పిల్లలు నిద్రపోవాలి. ఇంత కష్టపడినా సరే... ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం వేతనం ఇవ్వరు, సగం ఇచ్చి సరిపెడతారు. ఇంత పెద్ద ఘోరం చాపకింద నీరులా జరిగిపోతోంది. ఇంత పెద్ద స్కామ్ బయటపడిన తర్వాత కూడా రాజ్‌కోట్ ఇమిటేషన్ నగల వ్యాపారుల సంఘం ప్రతినిధులు మాత్రం... ‘‘మా పరిశ్రమల్లో బాల కార్మికులు లేరు. మేము ఇళ్ల దగ్గర ఉండే ఆడవాళ్లకు మెటీరియల్ ఇచ్చి, వాళ్లు తయారు చేసిన ఆర్నమెంట్కి పీస్ లెక్కన వేతనం ఇస్తాం. ఇది అతి పెద్ద పరిశ్రమ. రాజ్‌కోట్‌లో ఏడాదికి ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇందులో ఎవరైనా చిన్న పిల్లల చేత పనులు చేయిస్తుంటే అది పూర్తిగా తప్పే, అలాంటి వాళ్లను తప్పకుండా శిక్షించాల్సిందే’’ అని చేతులు దులుపుకున్నారు. ఇదంతా చట్టమే స్వయంగా చూసుకోవాలి... అన్నట్లు ముక్తాయించి ఊరుకున్నారు. అందరి భాగస్వామ్యం ఉంది పిల్లలు కార్మికులుగా మారుతున్నారంటే ఆ నేరం అందరిదీ. మొదటి దోషి ప్రభుత్వం, ఆ తర్వాత సమాజం. తల్లిదండ్రులు, పని ఇచ్చిన యజమాని వరకు అందరూ దోషులే. ఒక గ్రామంలో జనాభా రికార్డులో నమోదై ఉన్న పిల్లలందరూ ఆ ఊరి స్కూళ్లలో కానీ మరేదైనా స్కూళ్లలో కానీ నమోదై ఉన్నారా లేదా అని పర్యవేక్షించాల్సింది ప్రభుత్వమే. స్కూళ్లలో నమోదు కాకపోయినా, నమోదై వరుసగా నెలల పాటు ఆబ్సెంట్ అవుతున్నా ఆ స్కూల్ టీచర్లు, అధికారులు కారణాల కోసం అన్వేషించాలి. తల్లిదండ్రులతో మాట్లాడి సమాచారం తెలుసుకోవాలి. పిల్లలను పనుల్లో పెట్టడం నేరమని తల్లిదండ్రులను హెచ్చరించాలి. పిల్లలు తప్పకుండా బడికి వచ్చేటట్లు చూడాలి. పోషణ జరగని కుటుంబాలకు పనికి ఆహార పథకంలో పని కల్పించాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, పిల్లల కోసం ఇన్ని పథకాలున్నా సరే... పిల్లలు బడిలో ఉండాల్సిన వయసులో పనిలో ఉన్నారంటే సమాజం బాధ్యత కూడా ఉందని చెప్పక తప్పదు. సమాజంలో అందరమూ... ఒక హోటల్, మరేదైనా దుకాణంలో పిల్లలు పని చేస్తున్నట్లు గమనిస్తే ఆ హోటల్‌కి, దుకాణానికి వెళ్లడం మానేయాలి. బాల కార్మికుల సర్వీసులను, ఉత్పత్తులను స్వీకరించడానికి ఎవరికి వారు స్వచ్ఛందంగా వ్యతిరేకించాలి. ఈ బహిష్కరించడం అనేది విదేశీ వస్తు బహిష్కరణలాగ ఒక ఉద్యమంలా జరగాలి. అప్పుడే పసితనానికి బాల్యం మిగులుతుంది.– ప్రొఫెసర్ శాంతా సిన్హా, సామాజిక కార్యకర్త,మాజీ చైర్ పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బడి చట్టం ఏమైంది? ‘‘పువ్వుల్లా విచ్చుకోవాల్సిన బాల్యం ఆడంబరాల వెలుగు జిలుగులకు బలవుతోంది. బడిలో ఉండాల్సిన వయసులో పిల్లలు గాలి, వెలుతురు, కనీస సౌకర్యాలు లేని పరిశ్రమల్లో మగ్గిపోతున్నారు. మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏమైంది, ఆ చట్టాన్ని అమలు చేస్తే అక్షరాలు దిద్దాల్సిన చేతులు పూసలు అద్దవు కదా. ఈ నేరంలో ప్రత్యక్ష దోషులు కంపెనీ నిర్వహకులు, ఏజెంట్లు అయితే... మూల దోషి ప్రభుత్వమేనన్నారు పిల్లల హక్కుల కార్యకర్త శాంతాసిన్హా. మనకు చట్టాలున్నాయి, వాటిని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలున్నాయి, ప్రభుత్వాలు విఫలమైనప్పుడు హెచ్చరించి బాధ్యత గుర్తు చేయడానికి న్యాయస్థానాలూ ఉన్నాయి. ఈ మూడు వ్యవస్థలకు సమస్యను ఎలుగెత్తి చాటే పత్రికలూ ఉన్నాయి, హక్కుల పరిరక్షణ కోసం పని చేసే కార్యకర్తలూ ఉన్నారు. అయినా బిగించిన పిడికిలి నుంచి జారి పోయే ఇసుకలాగ చట్టాలు నిర్వీర్యమైపోతుంటాయి. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ ఆడపిల్లల కోసం ప్రభుత్వం ఒకవైపు స్పెషల్ డ్రైవ్ చేస్తోంది. మగపిల్లల బాల్యం కూడా భద్రంగా ఏమీ లేదనడానికి రాజ్‌కోట్ పెద్ద ఉదాహరణ.– వాకా మంజులారెడ్డి -
'ముస్కాన్'తో 445 మంది చిన్నారుల్లో చిరునవ్వు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో జూలై 1 నుంచి నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-5 వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఏటా రెండు విడుతలుగా ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అందులో భాగంగా నగరంలో జూలై 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్5 పేరుతో అధికార యంత్రాంగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. హైదరాబాద్ సిటీలో మొత్తం 17 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఆపరేషన్ ముస్కాన్-5లో భాగంగా హైదరాబాద్‌లో మొత్తం 445 మంది వీధి బాలలు, బాల కార్మికులను అధికారులు కాపాడారు. వీరిలో 407 మంది బాలురు ఉండగా, 38మంది బాలికలు ఉన్నారు. పట్టుబడిన బాల కార్మికుల్లో 381 మంది చిన్నారులను గుర్తించి పునరావాస చర్యల్లో భాగంగా పోలీసులు వారిని తిరిగి తమ తల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాకుండా వారికి చదువుకోవడానికి స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అందజేశారు, మరో 64 మంది చిన్నారులను రెస్క్యూ హోమ్ కు తరలించామని అధికారులు వివరించారు. పలువురు బాలురను సైదాబాద్ రెస్క్యూ హోమ్ కు, బాలికలను నింబోలిఅడ్డ రెస్క్యూ హోమ్ కు తరలించామని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం పద్నాలుగు సంవత్సరాల లోపు చిన్నారులతో పని చేయించడం చట్టరిత్యా నేరం. కార్మిక శాఖ అధికారులు చట్టవ్యతిరేకంగా బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు 7 కేసులు నమోదు చేసి 18 లక్షలకు పైగా జరిమానా వేశారు. కాగా జనవరిలో నిర్వహించిన ఆపకేషన్ స్మైల్‌లో భాగంగా 429మంది చిన్నారులను, ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 874 మంది చిన్నారులను పోలీసులు సంరక్షించారు. -
బాల్యం.. వారికి మానని గాయం
సాక్షి సిటీబ్యూరో: నగరంలోని గాజుల తయారీ పరిశ్రమల్లో బాల కార్మికులు మగ్గిపోతున్నారు. పేదరికంలో ఉన్న వారిని గుర్తించి కార్మికులుగా చేర్చుకుని వారిచేత వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. ఏడాదికి రెండు సార్లు మొక్కుబడిగా జనవరి, జూలై నెలల్లో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు చేపట్టి కొంత మంది బాల కార్మికులకు విముక్తి కల్పిస్తున్నా అది పూర్తి స్థాయిలో అమలుకావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల దాడులు ముగిసిన వెంటనే రూటు మార్చి పిల్లలను తీసుకువచ్చి యథావిధిగా పనులు చేయిస్తున్నారు. దీంతో ఎప్పటిలాగానే ఆడుతూ, పాడుతూ తిరుగుతూ, విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన బాలలు కార్మికులుగా మారిపోతున్నారు. గతంలో ఈ గాజుల పరిశ్రమలు నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో అధికంగా ఉండేవి. అధికారులు ఏటా దాడులు చేసి బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తుండటం, కేసులు నమోదు చేస్తుండటంతో పరిశ్రమలను గ్రేటర్ శివారు ప్రాంతాలైన కాటేదాన్, బాలాపూర్, మైలార్ దేవ్ పల్లి ప్రాంతాలకు తరలించారు. నగరంలో వందల సంఖ్యలో గాజుల తయారీ పరిశ్రమలు ఉంటాయని అనధికారిక అంచనా. అంతా 16 ఏళ్ల లోపు వారే..... గాజులకు లప్పం అద్దడం, చమ్కీలు అద్దడానికి బాలలు అయితేనే బాగుటుందని పరిశ్రమల నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే గాజుల తయారీ పరిశ్రమల్లో 8 సంవత్సరాల నుంచి 16 ఏళ్ల లోపు వారే పనిచేస్తున్నట్లు దాడుల్లో తేలింది. బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్ గడ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలలో కడుపేదరికంలో ఉండి తినడానికి తిండి లేని వారిని కార్మికులుగా చేర్చుకుంటున్నారు. అంతకుముందు పనిచేసినటువంటి వారి ద్వారా లేదా అదే రాష్ట్రాలకు చెందిన బ్రోకర్ల ద్వారా గుర్తించి వారిని నగరానికి రప్పిస్తున్నారు. తల్లిదండ్రులకు అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తంలో చెల్లించి మిగతా జీతాన్ని నెల నెల ఇస్తుంటారు. 8 నుంచి 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారికి నెలకు రూ. 1500, 10 నుంచి 14 సంవత్సరాల లోపు వారికి రూ.2000, 14 నుంచి 16 లోపు వారికి రూ. 2500 జీతాన్ని చెల్లిస్తున్నారు. అనారోగ్యంలో ‘బాల్యం’ బాలలైతే వారికి అదే కంపెనీలలోని గోదాంలలో ఉండటానికి వసతి కల్పించి తినడానికి తిండి పెడితే చాలు ఎన్ని గంటల పాటు అయినా పని చేయించుకోవచ్చనేది పరిశ్రమల నిర్వాహకుల ఆలోచన. గాజులకు అద్దేటువంటి రసాయనాల వల్ల చిన్నతనంలోనే ఆనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కెమికల్స్‌ను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గాజులకు చేతులతో అద్దడం వల్ల చర్మ వ్యాధులకు గురవుతున్నారు. పూర్తిగా గాజు సంబంధిత ముడి పదార్ధాలతో కూడి ఉండటం వాటిని గాజుల తయారీ కోసం ఫర్నేస్ లో వేడిచేయడం వల్ల బాల కార్మికులు అరోగ్యం పాడవుతుంది. ఒకేసారి 54 మందికి విముక్తి..... బీహర్‌కు చెందిన మహ్మద్ అస్లామ్ బాలాపూర్‌కు వలస వచ్చి శాహిమ్ నగర్లో గాజుల పరిశ్రమ నడుపుతున్నాడు. రేణుకాపూర్, అబీద్ నగర్, అబ్దుల్లా నగర్‌కు చెందిన మహ్మద్ రియాజ్, మహ్మద్ అస్సామ్, షేక్ హబీబ్, మహ్మద్ ముస్లామ్, అస్డర్, నజీమ్ అక్రమ్ వీరితో మరికొంత మంది బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల నుంచి బాల కార్మికులను తీసుకువచ్చి గాజుల తయారీ పరిశ్రమలలో పనిచేయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఆపరేషన్ స్మైల్, కార్మిక శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కార్పొరేషన్, ప్రజ్వల స్వచ్చంద సంస్థ సభ్యులతో కలిసి రాత్రి వేళల్లో దాడులు చేసి ఒకేసారి 54 మంది బాల కార్మికులను గుర్తించి వారి చేత పనిచేయిస్తున్నటువంటి వారిపైన కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 176 మంది..... 2014 సంÐసంవత్సరంలో 39 మంది, 2015లో అత్యధిక ంగా 282 మంది, 2016 లో 124 మంది 2017 లో 22 మం దిని 2018లో 190 మందిని గుర్తించి వారికి విముక్తి కల్పించారు. అదేవిధంగా 2019లో ఇప్పటి వరకు 176 మంది బాల కార్మికులను కాపాడారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఛైల్డ్ వెల్ఫేర్ అధికారు లు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, కార్మిక శాఖ అధికారు ల మధ్య సమన్వయ లోపం కూడ బాల కార్మిక వ్యవస్థ కొనసాగడానికి కారణం అవుతుందనే ఆరోపణులు ఉన్నాయి. 1098 నెంబర్‌కు ఫోన్ చేస్తే చాలు.... బాల కార్మికులు మీ కంట పడినా, ఎక్కడైనా పని చేస్తున్నట్లు సమాచారం ఉన్నా నేరుగా 1098 చైల్డ్ లైన్ టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే బాల కార్మిక నిర్మూలన అధికారులు వచ్చి పిల్లాడిని ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరుస్తారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి చిల్డ్రన్స్ హోమ్‌కు తరలిస్తారు. ఆ చిన్నారి తల్లిదండ్రుల వివరాలను సేకరించి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి పిల్లాడిని బడికి పంపేలా చర్యలు తీసుకుంటారు. ఎవరు లేకపోతే ప్రభుత్వ హాస్టళ్లకు పంపించి విద్యను అందిస్తారు. -
స్వస్థలానికి బాలకార్మికులు..
సాక్షి, ఖమ్మం: జీఆర్పీ, ఆర్పీఎఫ్, చైల్డ్‌లైన్ శాఖలు గుర్తించిన బాలకార్మికులు వారి స్వస్థలానికి బయలుదేరారు. చిన్నారులను తీసుకుని ఆదివారం అధికారులు అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి భోపాల్‌కు బయలుదేరారు. అక్కడి నుంచి వారి స్వస్థలం బాలాఘాట్‌కు తీసుకెళ్లనున్నారు. ఈ నెల 17న 29 మంది బాలకార్మికులను నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తుండగా జీఆర్పీ, ఆర్పీఎఫ్, చైల్డ్‌లైన్‌వారు గుర్తించి, బాలకార్మికులను చైల్డ్‌లైన్ సంరక్షణలో ఉంచిన విషయం విదితమే. ఈ సందర్భగా చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయమూర్తి వినోద్‌కుమార్, ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ఆర్పీఎఫ్ సీఐ మధుసూదన్‌లు చొరవ తీసుకుని బాలలను సురక్షితంగా భోపాల్ పంపించేందుకు పలువురి సిబ్బందిని ఎస్కార్ట్‌గా ఏర్పాటు చేశారని వివరించారు. వీరిలో ఏఆర్ పోలీస్‌లు 13 మంది, ఆర్పీఎఫ్ నుంచి ఒకరు, జీఆర్పీ నుంచి ఇద్దరు, చైల్డ్‌లైన్ నుంచి ఒకరు, ఐసీడీఎస్ నుంచి ఒకరు ఎస్కార్ట్‌గా వెళ్లినట్లు పేర్కొన్నారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి వినోద్‌కుమార్ దగ్గరుండి రైలు ఎక్కించి పిల్లలకు వీడ్కోలు పలికారు. బాలల రక్షణ అధికారి విష్ణునందన, చైల్డ్‌లైన్ బాధ్యులు శ్రీనివాస్, కోర్టులైజన్ ఆఫీసర్ భాస్కర్‌రావు, సీడీపీఓ బాలత్రిపురసుందరి, భారతి, హరిప్రసాద్, సోని, జీఆర్పీ సిబ్బంది బాలబాలికలకు అన్ని సదుపాయాలు ఏర్పాటుచేసి భోపాల్ పంపించారు. -
భానుప్రియపై చర్యలు తీసుకోవాలి
పెరంబూరు: నిబంధనలకు విరుద్దంగా మైనర్ బాలికను పనిలో నియమించుకున్న నటి భానుప్రియపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ మరో సారి తెరపైకి వచ్చింది. నటి భానుప్రియ తన ఇంటిలో నలుగురు మైనర్ బాలల్ని పనికి నియమించుకుందన్న అంశం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ఒక మహిళ అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులో చెన్నైలో నటి భానుప్రియ ఇంటిలో పని చేస్తున్న తన కూతుర్ని ఆమె వేధిస్తోందని, ఆమె నుంచి తన కూతుర్ని కాపాడాల్సిందిగా కోరింది. దీంతో పోలీసులు భానుప్రియపై కేసు నమోదు చేసి విచారణ కోసం చెన్నైకి వచ్చారు కూడా. అయితే భానుప్రియ తన ఇంట్లో పని చేస్తున్న పిల్ల మైనర్ అనే విషయం తనకు తెలియదని, అదీ కాకుండా ఆ పనిపిల్ల తన ఇంట్లో చోరీకి పాల్పడిందనీ స్థానిక టీనగర్, పాండిబజార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది కూడా. ఈ విషయం అలా ఉంచితే బుధవారం బాల కార్మిక నిర్మూలన దినోత్సవాన్ని పురష్కరించుకుని బాల కార్మికుల పరిరక్షణ సమాఖ్య బాలకార్మికుల గురించిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సమాఖ్య నిర్వాహకుడు శేషారత్నం మాట్లాడుతూ మైనర్ బాలలను పనిలో చేర్చుకున్న నటి భానుప్రియపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బాలకార్మికుల చట్టం ప్రకారం పిల్లలను పనికి చేర్చుకుంటే రూ.50వేల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే భానుప్రియ తన ఇంటిలో పని చేసే పిల్ల మైనర్ అనే విషయం తనకు తెలియదనీ, ఆ పిల్ల వయసు 17 ఏళ్లు అని ఆమె కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. అయినా ముగిసి పోయిన అంశాన్ని మళ్లీ శేషారత్నం తెరపైకి తీసుకు రావడంతో ప్రయోజనం ఉంటుందా? లేదా? అన్నది చూడాలి. -
ముగ్గురు బాల కార్మికులకు విముక్తి
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో ముగ్గురు బాల కార్మికులకు జిల్లా బాలల సంరక్షణ అధికారులు విముక్తి కలిగించారు. ఓ వ్యక్తి ప్రధాన మంత్రికి రాసిన లేఖతో కదిలిన యంత్రాంగం ఈ ముగ్గురిని బయటకు తీసుకురాగలిగారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇంతియాజ్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె. బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.46లోని ఫ్లాట్ నంబర్ 905లో నివసిస్తున్న వ్యాపారి బల్వీదర్ సింగ్ ఇంట్లో ముగ్గురు బాల కార్మికులు ఏడాది కాలంగా పనిచేస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తి ఇటీవల ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్, కార్మికశాఖ, బాలల సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో ఇక్కడి యంత్రాంగం కదిలింది. ఈ లిఖిత పూర్వక సమాచారం అందుకున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి ఇంతియాజ్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణారెడ్డి, కార్మిక శాఖ అధికారులు, రెవెన్యూ, చైల్డ్ హెల్ప్‌లైన్ సంయుక్తంగా గురువారం ఉదయం ఈ ఇంటిపై దాడి చేశారు. అధికారులు, పోలీసులు, సిబ్బందిని లోపలికి రానివ్వకుండా ఇంటి యజమానులు అడ్డుకుని ముగ్గురు పిల్లలను దాచేందుకు యత్నించారు. గోడపై నుంచి బయటకు దాటించేందుకు కూడా యత్నించినా చుట్టూ పోలీసులు ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఇక లాభం లేదని ఇంటి యజమానురాలు బయటకు రావడంతో అధికారులు తాము వచ్చిన విషయాన్ని తెలిపారు. ఒక్కో శాఖ నుంచి ఒక్కరు రావాలంటూ ఆమె ఆంక్షలు విధించింది. మీడియాను లోనికి రాకుండా గేటు వద్దే అడ్డుకున్నారు. లోనికి వెళ్లిన అధికారులు ముగ్గురు బాల కార్మికులను గుర్తించి వారి గుర్తింపు పత్రాలను అడగ్గా వాటిని ఇచ్చేందుకు ఇంటి యజమాని నిరాకరించాడు. దీంతో ఆ ముగ్గురు మైనర్ బాలికలను విచారించగా.. ఢిల్లీలోని ఓ ఏజెన్సీ ద్వారా నియమించుకున్నట్లు తేలింది. ఓ బాలిక ఏడాదిగాను, మరో ఇద్దరు బాలికలు గత ఫిబ్రవరి నుంచి పనిచేస్తున్నారని, ఈ ముగ్గురూ జార్ఖండ్‌కు చెందిన వారని తెలిపారు. బాలికలను చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ముందు హాజరు పరిచి తదుపరి చర్యలు తీసుకుంటామని ఇంతియాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా ఏడాది క్రితం వరకు ఈ ఇల్లు ఏపీ మంత్రి నారాయణది కాగా ఇటీవలనే ఆయన ఇంటిని అమ్మేయగా దాన్ని బల్వీందర్‌సింగ్ కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. -
23 మంది బాలకార్మికుల పట్టివేత
అడ్డగుట్ట: బీహార్ నుంచి హైద్రాబాద్‌కు అక్రమంగా బాలకార్మికులను రవాణా చేస్తున్నట్లు కార్మిక శాఖ, బాలల హక్కుల సంఘం, బాలల సంరక్షణ విభాగం అధికారుల సమాచారంతో రైల్వే పోలీసులు పెద్ద సంఖ్యలో బాలకార్మికులను అదుపులోకి తీసుకుని పునరావాస కేంద్రానికి తరలించిన సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...పాతబస్తీలోని గాజుల పరిశ్రమల్లో పని చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు బీహార్ నుంచి బాలలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. బాలల సంఘాల సమాచారంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హైద్రాబాద్ జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి ఇంతియాజ్, గోపాలపురం ఏసీపీ శ్రీనివాస్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి తనిఖీలు ప్రారంభించారు. అర్థరాత్రి వచ్చిన దానాపూర్ ఎక్స్‌ప్రెస్ నుంచి దాదాపు 300 మంది చిన్నారులు, యువకులు కిందకు దిగడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. 23 మంది బాల కార్మికులను గుర్తించారు. కొన్ని ముఠాలు వీరిని నగరానికి తీసుకువచ్చి వివిధ పరిశ్రమల్లో పనిలో పెడుతున్న ట్లు తెలిపారు. తనిఖీల్లో భాగంగా బల్లార్షాలో 10 మంది, నాగ్‌పూర్‌లో 40 మంది, కాజీపేట్‌లో 16 మంది బాలకార్మికులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని తరలిస్తున్న ముఠా సభ్యుల కోసం గాలింపు చేపట్టామన్నారు. -
భానుప్రియ మెడకు బాలకార్మిక కేసు..?
చెన్నై : సినీనటి భానుప్రియ మెడకు బాలకార్మిక చట్టం కేసు చుట్టుకునేట్టు కనిపిస్తోంది. మైనర్ బాలికను పనికి నియమించుకోవడం పట్ల బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. అంతేకాదు, బాలికను లైంగికంగా వేధించారని ఆరోపణలు రావడంతో ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో మూడు రోజుల కిందట భానుప్రియను అరెస్ట్ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేసింది. చదువుకోవాల్సిన బాలికను పనిలో పెట్టుకున్నందుకు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. భానుప్రియపై కేసు నమోదుచేసి, అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. మైనర్ బాలలను పనిలో పెట్టుకోవడం నేరం. ఇలా పెట్టుకున్నట్లు రుజువైతే కోర్టు భానుప్రియకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామానికి చెందిన ప్రభావతి కుమార్తె సంధ్యను మూడేళ్ల క్రితం భానుప్రియ తన ఇంట్లో పనికి పెట్టుకుంది. ఇటీవల కాలంలో తన కుమార్తెను భానుప్రియ సోదరుడు లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం, తమ ఇంట్లో దొంగతనానికి పాల్పడి చోరీ వస్తువులు అడిగినందుకు ఇలా కేసు పెట్టి బెదిరిస్తున్నారని భానుప్రియ ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భానుప్రియ ఇంట్లో పని చేసే బాలిక తాను ఎలాంటి వేధింపులకు గురి కాలేదని, తల్లి చెప్పడంతోనే దొంగతనానికి పాల్పడినట్టు ఒప్పుకుంది. దాంతో దొంగతనం కేసు నుంచి తప్పించుకోవడానికే భానుప్రియ కుటుంబంపై ఈ ఆరోపణలు చేసినట్లు గుర్తించిన పాండీబజార్ పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. -
బడికి పోవాల్సింది కానీ.. పనికి వెళ్తున్నాం
సాక్షి, వరంగల్: చాలా మంది పిల్లలకి బాలల దినోత్సవం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ రోజే పాఠశాలల్లో ఆటలు, పాటలతో పాటు పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. వీటన్నింటితో బడికి వెళ్లే పిల్లలు సంతోషంగా ఉంటారు. మరీ కుంటుంబ కష్లాల వల్లా చాలా మంది పిల్లలు వారి బాల్యాన్ని బలిచేసుకుంటున్నారు. వీరికి బాలల దినోత్సవం అంటూ ఒకటి ఉంటుందని బహుశ తెలియకపోవచ్చు. తెలిసిన బడికి పోవాల్సింది కానీ.. పనికీ వెళ్తున్నాం అని అనుకుంటూ వారి జీవితాలని సాగిస్తున్నారు. కనీసం మనమైనా ఇటువంటి పిల్లలని గుర్తించి వారి బాల్యాన్ని బలి కాకుండా కాపాడగలమా ? పలక పట్టాల్సిన చేతులు పలుగు పట్టుకొని పనులకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చట్టాలు ఎన్ని ఉన్నా సంరక్షించే శాఖలు సేవలు చేస్తున్నా బాలలు కార్మికులుగా మారే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఈ ఫొటోలో ఉన్న బాలుడి పేరు మడకం జోగయ్య, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన గొత్తికోయ ప్రాంతానికి చెందినవాడు. తల్లిదండ్రులు ప్రతి ఏడాది ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యవసాయ రైతు వద్దకు మిర్చి పంట వద్ద మకాం ఉంటారు. వీరితోపాటు ఈ బాలుడు వచ్చి తోట పనుల్లో నిమగ్నమవుతాడు. తోటకు తడికట్టడం, మందు చల్లడం, కూలీలకు నీళ్లు తీసుకురావడం వంటి పనులు చేస్తుంటాడు. చదువుకునేందుకు స్థోమత లేక తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ పనులు చేస్తున్నాడు. బాలకార్మికులను పనిలో పెట్టుకోవద్దని తెలిసినా ఆ కుటుంబ పేదరిక పరిస్థితికి ఈ బాలుడితో పనిచేయించక తప్పడం లేదని ఆ రైతు వాపోయాడు. ఇలాంటి బాలలు ఎంతో మంది మన ఏజెన్సీ ప్రాంతం, రాష్ట్రం, దేశంలో కనిపించడం పరిపాటిగా మారింది. ఏజెన్సీలో మారని తీరు.. ఏటూరునాగారం: ఏజెన్సీలో బాలురతో పనిచేయించడం, బాల్య వివాహాలు జరిగినా సంబంధిత మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. అక్కడ పనిచేసే సిబ్బందికి అన్ని తెలిసినా కూడా బాల్య వివాహాన్ని అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వివాహాలు చేసేవారు, వి వాహాలు చేసుకునే బాలికలు అక్కడుండే సిబ్బంది తెలిసినవారు కావడంతో వారి వివాహాన్ని అడ్డుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. చట్టాలపై అవగాహన, రక్షణ కల్పించేవారు లేక బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. బడీడు పిల్లలు బడిలో చేరి డ్రాపౌట్లుగా మారడం, పశువుల కాపరిలా మారడం వంటి చర్యలు ఏజెన్సీలో అనునిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ఈ చట్టాల పటిష్టతోపాటు బాలలకు కావాల్సిన సౌకర్యాల కల్పనను మరింత బలోపేతం చేస్తేనే బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు అదుపులోనికి వస్తాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. భారత మొదటి ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రూపొందించిన∙చట్టాలు ఇవే.. జీవించే హక్క: ఇది ఆరోగ్య ప్రమాణానికి సరైన జీవన స్థితికి గల హక్కు. దీని ప్రకారం పిల్లలు, అనా రోగ్యం, ఇతర ప్రమాదాల వల్ల మరణించకుం డా ఆరోగ్యంగా జీవించే హక్కును సంపాదించుకున్నారు. ప్రతి బిడ్డకు ఆహారం ఆరోగ్యం, విద్య అందించి వారి పరిపూర్ణ, శారీరక, మానసిక, సామాజిక వికాసానికి పునాది వేయాలి. రక్షణ హక్కు : అన్ని రకాల బాధలు, అవమానాల, దాడుల నుంచి పిల్లలకు విముక్తి, స్వేచ్ఛ కల్పించుట, అత్యవసర పరిస్థితులలో సంఘర్షణలు, సంభవిస్తే ప్రత్యేక రక్షణను కల్పించాలి. దోపిడీ నుంచి రక్షణను కల్పించి వారి అభివృద్ధికి తగిన జాగ్రత్త తీసుకోవడం, భారత రాజ్యంగ చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు పిల్లలు, ఫ్యాక్టరీలలో గాని, గనులలోగాని, ఇతర వ్యాపార సముదాయాల్లో పనులు చేయించడం నేరం. పిల్లల ఉన్నతికి, వికాసానికి హక్కు: పిల్లలు ఆలంబన, వికాసం, సంరక్షణ, సాంఘిక భద్రత హక్కులతోపాటు విశ్రాంతికి, వినోదానికి సాంస్కతిక కార్యకలాపాలకు సంబంధించిన హక్కులు కూడా ఉన్నాయి. బడికి వెళ్లని 5–14 సంవత్సరాల పిల్లలకు (పశువులను మేపుతూ, పొలం పనులు చేసేవారు) నిర్భంద ఉచిత విద్యను ఆదేశించడం జరిగింది. భాగం పంచుకునే హక్కు: బాలల అభిప్రాయాలపై గౌరవం, భావ ప్రకటన, స్వేచ్ఛ, సరైన సమాచారం పొందే హక్కు. పిల్లలు వారి మనస్సులోని భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కులు వారి భావాలకు తగిన విలువను ఇవ్వాలి. భావప్రకటనకు స్వేచ్ఛకు కలిగించాలి. అదేవిధంగా భారత ప్రభుత్వం 1933లో బాలల చట్టం చేసి చిన్న పిల్లలను శ్రమ దోపిడీ నుంచి రక్షించడానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పింది. 1938లో బాలల ఉద్యోగ కల్పన చట్టం ఏర్పాటు కాగా కఠిన శ్రమకు లోనయ్యే పనుల్లో వారిని వినియోగించరాదని సూచనలు చేసింది. కర్మాగారాల్లో పిల్లలతో పనిచే యించరాదని 1948లో కర్మాగారాల చట్టాన్ని రూపొందించారు. బాలలను రక్షించడానికి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, చైల్డ్ ఫౌండేషన్ వారు ఉచిత టెలిఫోన్ నంబర్‌ను రూపొందించారు. 1098కు బడిలో గానీ, బడిబయట గానీ, పిల్లలను బడికి పంపకుండా వేరే పనులు చేయించినా, ఇతరులతో ఇబ్బందులు, వేదింపులకు లోనైతే వెంటనే ఈ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే ఇబ్బందులకు గురైన బాలలకు రక్షణ కల్పించడం జరుగుతుంది. అండగా ఉండేందుకు తోడ్పడుతుంది. బాలలను రక్షించేందుకు ప్రత్యేక దృష్టి జిల్లాలో బాలలను రక్షించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాం. చిన్నారులపై అఘాయిత్యాలు, బాలలను కార్మికులుగా పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే వెళ్లి వారి ని విముక్తి చేయడం జరుగుతుంది. జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 954 మంది బాలబాలికలను రక్షించాం. ఎలాంటి ఇబ్బంది ఉన్నా 1098కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. – చిన్నయ్య, జిల్లా సంక్షేమ అధికారి, భూపాలపల్లి జిల్లా బాలలతో పనిచేయించడం నేరం.. వయస్సు నిండని బాలలతో పనులు చేయిం చడం చట్ట రీత్యా నేరం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం 5–14 వయస్సు కలిగిన పిల్లలు బడిలో ఉండాలి. బడిబయట ఉంటే వెంటనే వారిని బడిలో చేర్పించాలి. 18 ఏళ్ల వయస్సు నిండని యువతికి వివాహం జరిపిస్తే బాల్య వివాహం కిందకు వస్తుంది. – ఓంకార్, బాలల సంరక్షణ అధికారి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా -
బాల్యం.. బందీ
బాల్యం మరుపురాని జ్ఞాపకం.. జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయే కమ్మనికావ్యం. కాని పరిస్థితుల ప్రభావం..తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో ఏటా వేల మంది చిన్నారులు బాలకార్మికులుగా మారిపోతున్నారు. చిన్న వయసులోనే వెట్టిచాకిరికీ గురవుతున్నారు. ప్రభుత్వాలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఇవ్వడం లేదు. చిత్తూరుఎడ్యుకేషన్: జిల్లాలో ఏటా బాలకార్మికుల సంఖ్య పెరగడమేగాని తగ్గడం లేదు. బాలకార్మికుల నిర్మూలన కోసం సర్వశిక్షా అభియాన్, కార్మికశాఖ చర్యలు తీసుకుంటున్నా ఇంకా 4,167 మంది ఉన్నారు. విద్యాహక్కు చట్టం(2009) అమల్లోకి వచ్చి పదేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ సంచారంలో, ఇటుక బట్టీలు, హోటళ్లు, డాబాలు, దుకాణాలు, వెట్టి చాకిరీలో, భిక్షాటన చేస్తూ చిన్నారులు మగ్గుతూనే ఉన్నారు. అధికారులు విఫలం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో అధికారులు విఫలమవుతున్నారు. సర్వశిక్షాఅభియాన్, బాలకార్మికుల శాఖ, సమగ్రశిశుసంక్షేమ శాఖ అధికారులు బడిబయట పిల్లలపై శ్రద్ధ చూపకపోవడంతో ఫలితాలు నెరవేరడం లేదు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో ముఖ్యపాత్ర పోషించాల్సిన సర్వశిక్షా అభియాన్, కార్మికశాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. జిల్లాలో 4,167 మంది డ్రాపౌట్లు! జిల్లాలో తిరుపతి రూరల్, అర్బన్, ఏర్పేడు, మదనపల్లె, రామసముద్రం, చిత్తూరులో 4,167 మంది బాలకార్మికులు ఉన్నట్లు సర్వశిక్షాఅభియాన్ అధికారులు గుర్తించారు. వారిని బడిలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిలో ఇప్పటివరకు 2,818 మందిని పాఠశాలలో చేర్పించామని సర్వశిక్షా అభియాన్ అధికారులు కాకి లెక్కలు చెబుతున్నారే గాని క్షేత్రస్థాయిలో అంతమంది పాఠశాలలో చేరలేదనే విమర్శలున్నాయి. ప్రత్యేక నిబంధనలివీ.. ఆర్టికల్ 15: మహిళలు, బాలల సంక్షేమాన్ని ప్రత్యేక చట్టాలు చేయవచ్చు. ఆర్టికల్ 23 (1): బాలలను అమ్మడం, కొనడం, భిక్షాటన చేయించడం, నిర్భంద చాకిరీ నిషేధం. ప్రకరణం 30(సి): పిల్లలు తమ వయçసు, శక్తికి మించిన పనుల్లో నిమగ్నం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రకరణం 39 (ఎఫ్) : బాలలు స్వేచ్ఛాయుత గౌరవప్రద పరిస్థితుల్లో ఆరోగ్యవంతంగా పెరగడానికి తగినన్ని అవకాశాలు, సౌకర్యాలను కల్పించాలి. బాల్యాన్ని కామపీడన నుంచి, నైతిక, భౌతిక నిర్లక్ష్యాల నుంచి ప్రభుత్వం రక్షించాలి. ప్రకరణం 47 : బాలలకు పౌష్టికాహారం, మెరుగైన జీవనాన్ని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. నీరుగారుతున్న లక్ష్యం జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టు లక్ష్యం జిల్లాలో నీరుగారుతోంది. ఆ ప్రాజెక్టులో భాగంగా 9 నుంచి 14 ఏళ్ల లోపు బాల కార్మికుల కోసం ప్రత్యేక స్కూళ్ల ఏర్పాటు, ఉపకార వేతనాలు అందించేందుకు కేంద్రం పుష్కలంగా నిధులు అందిస్తోంది. అయితే సర్వశిక్షా అభియాన్, కార్మికు ల శాఖల సహకారం లోపించడంతో స్కూళ్ల నిర్వహణకు ఎన్జీఓలు వెనుకడుగు వేస్తున్నారు. బాలకార్మికులకు మూడేళ్లు చదువు చెప్పి పైచదువులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2001లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ౖచైల్డ్ లేబర్ ప్రాజెక్టు కింద స్కూళ్లను మంజూరు చేసింది. అయితే అవి ఈ జిల్లాలో ఎక్కడా ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారుల తీరు మారకపోతే భవిష్యత్‌లో బాల కార్మికులు ఎక్కువయ్యే ప్రమాదముంది. -
ఆందోళనకు గురిచేస్తోన్న ఐఎల్ఓ గణాంకాలు..
సాక్షి, వెబ్ డెస్క్ : ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) విడుదల చేసిన గణాంకాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చెక్కుపై ఒక్క సంతకంతో లక్షల రూపాయలు సంపాదిస్తున్న నేటి కాలంలో పూట గడవక పిల్లల్ని పనికి పంపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని ఐఎల్ఓ నివేదిక పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 152 మిలియన్ మంది బాల కార్మికులు ఉన్నారని.. వారిలో చాలా మంది ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చేసే కర్మాగారాల్లో పనిచేస్తున్నారని వెల్లడించింది. వీరిలో ఐదు నుంచి పదిహేడేళ్ల వయస్సు లోపు వారే అధికంగా ఉన్నారని పేర్కొంది. పారిశుద్ధ్యం, భవన నిర్మాణం, వ్యవసాయం, గనులు, ఇళ్లలో పని చేసే బాల కార్మికుల సంఖ్య పెరుగుతోందని ఐఎల్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వారి బాల్యాన్ని హరించడంతో పాటు ఆరోగ్యంపై, ప్రవర్తనపై దుష్ప్రభావాన్ని చూపుతుందని.. విద్యకు దూరమవడం వల్ల భవిష్యత్ అంధకారంగా మారుతోందని పేర్కొంది. ఇటీవలి కాలంలో 5 నుంచి 11 సంవత్సరాల వయస్సున్న బాల కార్మికుల సంఖ్య 19 మిలియన్లకు చేరిందని వెల్లడించింది. అదే విధంగా కర్మాగారాల్లో పని చేసే బాలికల సంఖ్య 28 మిలియన్లు, బాలల సంఖ్య 45 మిలియన్లుగా ఉందని ఐఎల్ఓ నివేదికలో పేర్కొంది. నానాటికీ పెరుగుతున్న బాల కార్మికుల మరణాలు.. భారతదేశంలో అక్రమంగా జరుగుతున్న మైకా గనుల తవ్వకాల కారణంగా కేవలం రెండు నెలల్లో ఏడుగురు బాల కార్మికులు మరణించారని 2016లో రాయిటర్స్ పరిశోధనాత్మక నివేదిక వెల్లడించింది. మైకా ఉత్పత్తి చేస్తున్న ప్రధాన రాష్ట్రాలైన బిహార్, జార్ఖండ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లలో మూడు నెలలపాటు జరిపిన సర్వేలో బాలకార్మికులను ఎక్కువగా నియమించుకున్నట్లు వెల్లడైందని పేర్కొంది. మైకా గనుల్లో పనిచేసే బాల కార్మికులు తీవ్ర అనారోగ్యం పాలవడంతో మరణాలు సంభవిస్తున్నాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఐఎల్ఓ ఎజెండా.. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఐఎల్ఓ-2018 నివేదికను రూపొందించింది. ఇందులో భాగంగా పని ప్రదేశాల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాల గురించి ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. అలాగే బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించనుంది. సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తోన్న ప్రపంచదేశాలు 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా అంతం చేసేలా కృషి చేయడంతో పాటు కార్మికుల ఆరోగ్యం, భద్రత గురించి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఐఎల్ఓ పేర్కొంది. -
బాల్యం..బలి.!
ఆరేళ్ల వయసు నుంచి 14 ఏళ్ల వయసున్న ప్రతి పిల్లవాడు బడిలోనే ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. బడిఈడు వయసుండే చాలామంది పిల్లలందరూ బడిలో కంటే పనిలోనే అధికంగా ఉంటున్నారు. ఫలితంగా బాలకార్మికులుగా మిగిలిపోతున్నారు. కారణం పేదరికం, కుటుంబ ఆర్థిక పరిస్థితులేనని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత జఠిలంగా ఉంది. పలక బలపం పట్టాల్సిన వయసులో పనుల్లో పడి బాల్యం చితికిపోతోంది. కడప ఎడ్యుకేషన్/రాయచోటి రూరల్ : బడి బయట పిల్లలను బడిలో చేర్పించి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఎన్ని చట్టాలు ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బడి ఈడు పిల్లలు బాల కార్మికులుగానే మిగిలిపోతున్నారు. ఫలితంగా బడి బయట పిల్లల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలని ఉన్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో సుమారు 30లక్షల జనాభా ఉండగా, అందులో 2లక్షల వరకు బాలలు ఉన్నట్లు అంచనా. అందులో సుమారు 20–25వేల మంది వివిధ ప్రాంతాల్లో బాల కార్మికులుగా ఉండగా, కొందరు బాలలు భిక్షాటన చేస్తూ, ప్లాస్టిక్ కవర్లు సేకరిస్తూ వీధుల్లో సంచరిస్తూనే బడులకు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా ఏటేటా బడి బయట పిల్లలు బాలకార్మికులుగా మారిపోతున్నారు. కుటుంబ పోషణ భారమవడంతోనే .. కుటుంబ పోషణ భారమైన పేదలు తమ పిల్లలను పనిలో భాగస్వాములను చేస్తున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల వారు హోటళ్లు, దుకాణాలు, ఇటుక బట్టీల్లో కూలీలుగా ఉంచుతున్నారు. కొందరు బైక్ మెకానిక్ షాపుల్లో, మరి కొందరు వెల్డింగ్ వర్క్ షాపుల్లో, కూల్‌డ్రింక్ షాపుల్లో, బరువులు మోసేందుకు పండ్ల మండీల్లో తమ పిల్లలను చేర్చుతున్నారు. ఇంకొందరు తమ పిల్లలను వ్యవసాయపనులు, భవన నిర్మాణ కూలీ పనులు, వస్త్ర దుకాణాల్లో, చిల్లర అంగళ్లలో పనులకు పంపుతున్నారు. గిరిజనులు తమతో పాటు సంచార జీవనానికి వినియోగించుకుంటున్నారు. మరీ వెనుకబడిన వర్గాల వారు పిల్లలను చిత్తుకాగితాలు ఏరుకోవడం తదితర పనులకు వినియోగిస్తున్నారు. వలస జీవనం దుర్భరం ... సంచార జీవనంతో ముందుకు సాగే వారు పిల్లలతో పాటు వచ్చి కొందరు ఇక్కడ షాపుల్లో, ఇటుకల బట్టీల్లో పిల్లలను పనుల్లో పెడుతున్నారు. మరి కొందరు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి పెద్దలతో పాటు పిల్లలను కూడా పనుల్లో చేర్పించు కుంటున్నారు. ఇదిలా ఉంటే స్థానికంగా ఉంటున్న ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుండటంతో కూడా బాల కార్మికులు పెరిగిపోతున్నారు. చిన్న పిల్లలను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమైనా ఈ విషయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి 14 ఏళ్ల లోపు పిల్లలందరినీ పాఠశాలలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని, వారికి మెరుగైన విద్యను అందించాలని పలువురు కోరుతున్నారు. సర్వే నిర్వహిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా బడిబయట ఉన్న పిల్లలను గుర్తించేందుకు ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో సెక్టోరియల్ అధికారులతోపాటు సీఆర్పీలు సర్వే నిర్వహిస్తున్నాం. జిల్లాలో బడిబయట పిల్లలు 3177 మంది ఉన్నట్లు గుర్తించాం. వీరందరిలో 1645 మంది అమ్మాయిలు ఉండగా వీరిలో 800 మందిని కేజీబీవీలలో చేర్పించనున్నట్లు మిగతా వారిని స్థానిక పాఠశాలల్లో చేర్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. అలాగే మిగతా 1532 మంది బాలురను ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లతోపాటు ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. జిల్లాలో బడిబయటి పిల్లల కోసం గత ఏడాది 22 నాన్‌రెసిడెన్షియల్ స్పెషల్ ట్రెయినింగ్ సెంటర్లు(ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ) ఏర్పాటు చేశాము. మళ్లీ ఈ ఏడాది మరో 8 కేంద్రాలకు అనుమతులు కోరాం. అలాగే మరో రెండు రెసిడెన్షియల్ స్పెషల్ ట్రెయినింగ్ సెంటర్లను సిద్ధం చేస్తున్నాం. బడిబయటి పిల్లలందరిని వాటిల్లో ఉంచి విద్యనందిస్తాం. – వెంకట్రామిరెడ్డి. ఎస్ఎస్ఏ, ఏఎల్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ బాల కార్మిక చట్టాలను పటిష్టం చేయాలి: వసంతాభాయ్, సీడీపీఓ ,రాయచోటి నేటి సమాజంలో మాన సంబంధాలుతెగిపోవడం వల్ల, తల్లిదండ్రులు విడిపోవడం వల్ల కూడా బాలకార్మికుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిని ఆదరించే బాధ్యత అందరిపై ఉంది. బాల కార్మికులను పనుల్లో పెట్టుకుంటున్న యజమానులను శిక్షించాలి. ప్రభుత్వం చట్టాలను పటిష్టంగా అమలు చేయడం ద్వారానే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించే అవకాశం ఉంది. వీలైనంత వరకు బడి బయట పిల్లలను అంగన్వాడీ సెంటర్లలో చేర్పిస్తున్నాము. ప్రజల్లో కూడా మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉంది. -
బాలికకు విముక్తి
కొరాపుట్ : కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితిలోని మొర్చిగుడ గ్రామంలో ఇతరుల బంధనలో చిక్కుకున్న బాలికకు విముక్తి లభించింది. జిల్లా శిశు సంరక్షణ విభాగం ఆ బాలికను చెరనుంచి విముక్తిరాలిని చేసింది. తండ్రి పరారీలో ఉండగా తల్లి మరణంతో ఆ బాలిక అనాథగా మిగిలిపోయింది. దూరపు చుట్టమైన సోదరిగా చెప్పుకున్న ఒక మహిళ ఆ బాలికను చేరదీసింది. తన పిల్లలను ఎత్తుకోవడం, ఇంటి చాకిరీ చేయించడంతో పాటు గ్రామంలో కూలి పనులకు వినియోగించడంతో పాటు చాలీ చాలని తిండిపెడుతూ ఆ బాలికను నానా హింసలు పెడుతున్న వైనం ఈ నోట ఆ నోట జిల్లా శిశు సంరక్షణ అధికారిణి రాజశ్రీ దాస్ చెవికి చేరింది. ఆమె తన బృందంతో గ్రామానికి వెళ్లి దర్యాప్తు నిర్వహించి ఆ బాలికను బాల కార్మికురాలిగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా శిశు సంక్షేమ కమిటీ ముందు శుక్రవారం హాజరు పరిచారు. ఆ బాలికను శిశు సంరక్షణ విభాగం గృహంలో ఉంచుతూ చదువుకునేందుకు ఏర్పాటు చేశారు. బంధ విముక్తురాలు కావడంతో ప్రస్తుతం ఆ బాలిక ఆనందిస్తోంది. -
చిన్నారుల మోములో చిరునవ్వు
నారాయణఖేడ్: బాలలు పనిలో కాదు బడిలో ఉండాలంటూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లా బాలల సంరక్షణ శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. గతంలో మాదిరిగా ప్రచారానికే పరిమితం కాకుండా ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరిట తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాలకార్మికులకు విముక్తి కల్పించడంతోపాటు పనుల్లో పెట్టుకున్న వ్యాపారులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దీంతో వ్యాపార వర్గాల్లో వణుకు ప్రారంభమైంది. అదే క్రమంలో సదరు పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రచార రథాల ద్వారా పల్లెపల్లెన బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలను పనిలో పెట్టుకుంటే తీసుకునే చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్ఆపరేషన్ స్మైల్ జిల్లాలో విజయవంతమైందని అధికారులు చెబుతున్నారు. జనవరిలో ఆపరేషన్ స్మైల్ ద్వారా 107 మంది బాలకార్మికులకు, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 105మందికి విముక్తి కల్పించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను పనుల్లో పెట్టుకోమని లిఖితపూర్వకంగా రాయించుకొని అప్పగించారు. అదే క్రమంలో చిన్నారులను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని వ్యాపారులకు హెచ్చరికలు జారీచేశారు. వారితో లిఖితపూర్వకంగా ధ్రువీకరణ తీసుకున్నారు. అధికారుల చర్యలు వ్యాపారులను హడలెత్తిస్తుండగా తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో నాలుగు సంరక్షణ కేంద్రాలు.. బాలకార్మికులకు విముక్తి కల్పిస్తున్న అధికారులు వారికోసం సంబంధీకులు రాని పక్షంలో వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో దివ్యదిశ హోం, ఖేడ్ మండలం నిజాంపేట్‌లో ఆర్నాల్డ్ హోం, ఇస్నాపూర్‌లో విజనరీ వెంచర్స్‌లో బాలురను ఉంచుతున్నారు. అమీన్‌పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్ హోంలో బాలికలు, బాలురను ఉంచుతున్నారు. బాలకార్మికులకు విముక్తి కల్పించిన తర్వాత మొదటగా జిల్లా కేంద్రంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరుస్తారు. ఇందులో చైర్ పర్సన్‌గా శివకుమారి, సభ్యులుగా న్యాయవాది అశోక్, మహారాజ్, కైలాష్, ఆత్మారాం ఉన్నారు. వీరు పిల్లలతో మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే పాఠశాలకు పంపడం, హోంలకు రెఫర్ చేయడం చేస్తారు. బాలల చట్టాలపై అవగాహన.. బాలల చట్టాలపై అధికారులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చిలో 100 గ్రామాలు, నవంబర్‌లో 100 గ్రామా ల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఏడాది మార్చిలో వంద పల్లెల్లో ప్రచారం చేశారు. ప్రత్యేకంగా ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి బాలల హక్కులు, బాలకార్మిక చట్టాల, అక్రమ రవాణా నిరోధం, లైంగిక వేధింపులు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో మరో వంద గ్రామాల్లో ప్రచారం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బాలల హక్కులు.. ♦ 14ఏళ్లలోపు బాలలతో పనిచేయించడం బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం 1986 ప్రకారం నేరం. పనిచేయించిన యజమానులకు సెక్షన్ 14 ప్రకారం ఏడాది జైలు, రూ.20వేల జరిమానా విధిస్తారు. రెండోసారి ఇదే నేరం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష. ♦ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లా కార్మికశాఖ అధికారులు, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, చైల్డ్టోల్ఫ్రీ నం: 1098, 100కు ఫిర్యాదు చేయొచ్చు. ♦ బాలల న్యాయచట్టం (సంరక్షణ) బాలలను రెండు వర్గాలుగా పరిగణిస్తోంది. సెక్షన్ 2(1) ప్రకారం 18ఏళ్లు నిండకుండా నేరం చేసిన బాలలను న్యాయమండలి పర్యవేక్షిస్తుంది. సెక్షన్ 2(డి) ప్రకారం వీధి బాలలు, భిక్షాటన చేస్తున్న బాలలు, జీవనాధారం లేని బాలలు, అనాథ బాలలు, బాలకార్మికులు, పారిపోయిన బాలలు, దీర్ఘకాలిక జబ్బులకు గురైన బాలలు, బాల్య వివాహ బాధిత బాలలు, వేధింపులకు గురైన బాలలకు బాలల సంక్షేమ సమితి పునరావాసం కల్పిస్తుంది. ♦ చట్టవిరుద్ధంగా పిల్లలను పెంచుకోవడం, అమ్ముకోవడం నేరం. పిల్లలను ఇచ్చినా, తీసుకున్నా మూడేళ్ల కారాగార శిక్ష తప్పదు. ప్రభుత్వమే కోర్టు ద్వారా చట్టబద్ధంగా దత్తత ఇస్తుంది. ♦ బాలలకు భారత రాజ్యాంగం ద్వారా 54 (అధికరణలు) హక్కులు వర్తిస్తాయి. వీటిలో ప్రధానంగా జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కు ఉన్నాయి. ♦ బాలలను రక్షించడం, హక్కులను కాపాడేందుకు కొన్ని చట్టాలను తెచ్చారు. 18ఏళ్లలోపు ఆడపిల్ల, 21 ఏళ్లలోపు మగ పిల్లలకు వివాహాలు చేయడం 2006 బాల్యవివాహ నిషేధ చట్టం ప్రకారం నేరం. ఇలాంటి వివాహాలు చెల్లవు. బాల్య వివాహాలు నిర్వహించినా, ప్రొత్సహించినా, సహకరించినా రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. ♦ బాలికలను రవాణా చేయడం అక్రమ రవాణా నిరోధక చట్టం 1956 ప్రకారం నేరం. అక్రమ రవాణా నిరోధానికి ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్, 1098, 100లకు ఫిర్యాదు చేయొచ్చు. చర్యలు తప్పవు బాలలను పనుల్లో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తాం. పిల్లలను రక్షించి పునరావాసం కల్పిస్తాం. బాల కార్మిక చట్టాలపై ఇప్పటికే గ్రామాల్లో ప్రచార రథం ద్వారా ప్రచారం నిర్వహించాం. మరోసారి అవగాహన కల్పిస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి కాకుండా బడికి పంపించాలి.– రత్నం, జిల్లా బాలలసంరక్షణ అధికారి (డీసీపీఓ) -
బాల కార్మికుల్లేని తెలంగాణను నిర్మిద్దాం
కరీంనగర్ లీగల్/శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్)/ఇబ్రహీంపట్నం రూరల్ : బాల కార్మికుల్లేని తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి పిలుపునిచ్చారు. దేశంలో పిల్లలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సంరక్షణ కోసం అందరూ ఉద్యమించాలన్నారు. ప్రపంచంలో 53 శాతం బాలలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ పరిధిలోని శేరిగూడ శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాలలో ‘చైల్డ్ ఫ్రెండ్లీ తెలంగాణ’అంశంపై జరిగిన సెమినార్లో పాల్గొన్నారు. పిల్లల సంతోషాలు, కళలను పట్టించుకోకపోవడంతో వారి బాల్యం బుగ్గిపాలవుతోందని, చాలా ప్రాంతాల్లో పిల్లలు బాలకార్మికులుగా మగ్గిపోతున్నారని, పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కాలేజీ ఆడిటోరియానికి కైలాశ్ సత్యార్థి ఆడిటోరియంగా నామకరణం చేశారు. ప్రతి ఒక్కరి బాధ్యత.. చిన్న పిల్లలపై లైంగిక దాడులు పెరగుతున్నాయని, ప్రతి గంటకు సగటున నలుగురు పిల్లలు లైంగికదాడులకు గురవుతున్నారని సత్యార్థి పేర్కొన్నారు. వీటి నిర్మూలనకు సమాజంలోని పౌరులంతా బాధ్యతగా కృషి చేయాలన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో బాలల హక్కులను పరిరక్షిస్తూ ప్రపంచంలోనే భారత్‌ను అగ్రగామిగా నిలుపుకొందామని పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఎంపీ వినోద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బాలమిత్ర సదస్సుకు హాజరయ్యారు. తల్లిదండ్రుల్లేని అనాథ పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంటులో బిల్లు పెట్టిన వినోద్‌ను అభినందించారు. నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లల సంక్షేమానికి 500 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు వివిధ రాష్ట్రాల్లో సత్యార్థి ఫౌండేషన్ సంస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని చాలా పాఠశాలల్లో టాయిలెట్లు లేక పిల్లలు బడి మానేస్తున్నారని చెప్పారు. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే పాఠశాలల్లో ఎన్నికలు, పార్లమెంట్, పంచాయితీ వంటివి ఏర్పాటు చేసి పిల్లలకు బాధ్యతలు తెలపాలని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. పిల్లల హక్కులు హరించే వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. -
ఇటుక బట్టీ యజమాని దాష్టీకం
కొత్తపల్లి(కరీంనగర్) : పొట్టకూటి కోసం వలస వచ్చిన కార్మికులపై ఓ ఇటుక బట్టీ యజమా ని కర్కశంగా ప్రవర్తించాడు. ఆడ, మగ అని చూడకుండా తీవ్ర చిత్రహింసలకు గురిచేశా డు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట శివారులోని వీబీఐ ఇటుకబట్టీలో చోటుచేసుకుంది. కార్మిక సం ఘాల సహకారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు 18 మందికి విముక్తి కలిగించారు. వీరిలో 11 మంది కూలీలు, ఏడుగురు చిన్నారులున్నారు. ఏం జరిగిందంటే.. ఒడిశా రాష్ట్రం బొలంగిర్ జిల్లా బెల్‌పడా మండలం గగ్రూలీ గ్రామానికి చెందిన హిమాన్షు చురా, భానుచురా, జుగే చురా, రమేష్ మహందా, ముని తండి, రాజబంటి చురా, రాణిమహందా, ఆశిష్ మహందా, పట్నాగర్ మండల కేంద్రానికి చెందిన అశోక్ సునా, తుర్కెలా మండలం కాంటాబాంజీ గ్రామానికి చెందిన లలితా పణిక, గోపాల్ పణిక, సీమ పణిక, భాస్కర సునా, సునిలీ సుర , రాజు పనిక మమతా మహానంద్, డొబో మహందా, ఆశిమహందాలు గత నవంబర్‌లో జీవనోపాధి కోసం చింతకుంట శివారులోని వీబీఐ ఇటుక బట్టీల కంపెనీలో కూలీలుగా చేరారు. ఒడిశాకు చెందిన సర్ధార్ గణేష్ అనే బ్రోకర్ వీబీఐ కంపెనీ యజమాని నారాయణరావుతో ఒప్పందం కుదుర్చుకొని కొంత మొత్తాన్ని కార్మికులకు అడ్వాన్స్‌గా అందించాడు. యజమాని చిత్రహింసలు పనిలో చేరినప్పటి నుంచి నారాయణరావు కూలీలను తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశాడు. పనికి ఒత్తిడిచేయడం, జ్వరం వచ్చిన పట్టించుకోకుండా దాడిచేశాడు. దీంతో వారు ఒడిశాకు చెందిన శ్రామిక అధికార్ మంచ్ కార్మిక సంఘానికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సదరు యజమాని వారివద్దనున్న సెల్ఫోన్లు లాక్కుని బ్రోకర్‌కు సమాచారమిచ్చారు. బ్రోకర్ గణేశ్ ఇక్కడకు చేరుకుని 18 మందిని గోదావరిఖని గంగానగర్‌లో ఉన్న జీఎల్‌కే ఇటుక కంపెనీకి తరలించాడు. స్పందించిన కార్మిక సంఘాలు ఈ విషయమై స్థానిక తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ నాయకులు జిల్లా కార్మిక అధికారికి డిసెంబర్ 31న ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో కరీంనగర్ అడిషనల్ సీపీకి ఫిర్యాదు చేయడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి వారికి పనిస్థలం నుంచి విముక్తి కలిగించారు. రేకుర్తిలోని సాయిమహాలక్ష్మీ గార్డెన్స్‌లో ఆశ్రయం కల్పించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి వాంగ్మూలం స్వీకరించారు. యజమాని నారాయణరావుపై కేసు నమోదు చేíసినట్లు ఎస్సై పి.నాగరాజు తెలిపారు. కార్మికులకు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చైల్డ్ లేబర్ ఆక్ట్ కింద మరో కేసు ఒడిశా కార్మికులకు చెందిన మైనర్ పిల్లలను చిత్రహింసలకు గురిచేయడంతో పాటు వారిని అక్రమంగా నిర్బంధించినందుకు చైల్డ్ లేబర్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఫర్వీన్ తెలిపారు. -
ఇటుక మాఫియా!
‘కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉంది..యజమానులు మోబైల్ ఫోన్లు లాక్కున్నారట.. బయటకు వెళ్లొద్దట.. ఎవరితోనూ మాట్లాడొద్దట.. పనిచేసేది ఎక్కువ...వేతనం తక్కువ.. పైగా తిట్టడం.. కొట్టడం.. పరిస్థితి దుర్భరంగా ఉంది.’ ఇది ఇటీవల పెద్దపల్లికి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లేబర్ ఇన్స్పెక్టర్ మనోజ్ మండలేశ్వర్ ఇటుకబట్టీల్లో వలస కూలీల దుస్థితిపై వెలిబుచ్చి న ఆవేదన. రాఘవాపూర్‌లోని ఏబీఎస్ బ్రిక్ ఇండస్ట్రీ ఒక్క ఇటుకబట్టీని చూసి ఆయన చెప్పిన అభిప్రాయం జిల్లాలోని మెజార్టీ ఇటుక బట్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి, పెద్దపల్లి: సాధారణంగా ల్యాండ్, సాండ్ మాఫియాను ఎక్కువగా చూస్తుంటాం. కానీ.. ఇటుక మాఫియా ఆగడాలు అంతా ఇంతా కావు. జిల్లాలో దాదాపు 70 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఈ బట్టీల్లో కనీసం ఐదు నుంచి ఆరు వేల మంది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన, స్థానికంగా పలుకుబడి ఉన్న వాళ్లు ఇటుకబట్టీలను నిర్వహిస్తున్నారు. ఇందులో నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం నిర్వహించే వాళ్లు కొద్ది మందే. కానీ.. మెజార్టీ బట్టీల్లో నిబంధనల ఊసే ఉండదు. కార్మిక చట్టాల మాటే తెలవదు. వలస కార్మికులు కావడంతో వెట్టిచాకిరి ఇక్కడ సర్వసాధారణంగా మారింది. కార్మికులు కుటుంబాలతో వస్తారు కాబట్టి, పిల్లలుంటారని పైకిచెబుతున్నా.. ఆ బాలలను కార్మికులుగా మార్చే ఘనత ఇటుక బట్టీల యజమానులదే. కనీస వేతనం అనే పదమే ఇక్కడ వినిపించదు. వారిచ్చిందే వేతనం.. చెప్పిందే శాసనం. వినని కార్మికులను చితకబాదడం ఇక్కడి యజమానుల నైజం. దౌర్జన్యాలు నిత్యకృత్యం. గతంలో లైంగిక దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. ఇక్కడి ఇటుక ఉభయరాష్ట్రాల మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో, కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా ఇక్కడి నుంచి ఇటుకలు వెళుతుండడం డిమాండ్‌ను తెలియచేస్తోంది. కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతుండడం, బట్టీల్లో అకృత్యాలు నిత్య కృత్యం కావడంతో వీరికి స్థానిక నాయకుల నుంచి జాతీయస్థాయి నేతల వరకు అందరితోనూ సత్సంబంధాలుంటాయి. ఇటుకబట్టీలకెవరైనా వెళ్తే ఆ బెదిరింపులు సామాన్యంగా ఉండవు. అసలు ఇటుక బట్టీల లోపలికి వెళ్లడమే అసాధ్యం. లోనికి అడుగు పెట్టగానే, అనుమానపు చూపులు వెంటాడుతుంటాయి. ఆ వెంటనే పదుల సంఖ్యలో వచ్చి చుట్టుముడుతారు. ఎందుకు వచ్చారు? ఏం కావాలంటూ ఉచ్చస్వరంతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు. ఫొటోలు తీస్తే .. ఆ కెమెరాతో బయటకు వెళ్లడం మరిచిపోవాల్సిందే. వెళ్లిన వాళ్లకు సంబంధించిన పైస్థాయి నుంచి క్షణాల్లో ఫోన్లు వస్తుంటాయి. దౌర్జన్యాలకు పాల్పడుతారు. ఇటుకబట్టీలకు వెళ్లే సాహసం కూడా ఎవరూ చేయరు. అధికారులకు మామూలే... కార్మిక చట్టాలను అమలు చేస్తూ, కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన, దౌర్జన్యాలను అరికట్టాల్సిన అధికారులు ఇటుక మాఫియాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. నిర్బంధ కార్మికులకు విముక్తి కల్పించడానికి ఛత్తీస్‌గఢ్ బృందం వచ్చినప్పుడు, స్థానిక అధికారులు వ్యవహరించిన తీరు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కార్మికులను తీసుకెళ్లకుండా ఛత్తీస్‌గఢ్ బృందాన్ని నిలువరించేందుకు ఆ అధికారులు పడినపాట్లు చూసి ఇతర అధికారులే విస్మయానికి గురయ్యారు. అడ్వాన్స్‌లు తీసుకొన్న కార్మికులను పంపొద్దంటూ ఛత్తీస్‌గఢ్ అధికారులను కూడా ఆ అధికారులు ఒప్పించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చివరకు జిల్లా సంక్షేమశాఖాధికారులు వారితో స్వల్ప వాదనకు కూడా దిగడం విశేషం. బాలకార్మికులు కనిపించడంతో ‘వాళ్లు లంచ్‌కు ఇంటికి వచ్చుంటారేమో’ అని నమ్మబలికేందుకు చేసిన ప్రయత్నాన్ని సహచర అధికారులే ఈసడించుకున్నారు. ఇదంతా చూసి, ఇటుకబట్టీ యజమానుల కన్నా... ఆ అధికారులకే ఎక్కువ బాధ ఉన్నట్లుందంటూ వ్యాఖ్యానించడం వినిపించింది. ఇటుకబట్టీల్లో కార్మికుల నిర్బంధం కొంతమంది అధికారులకు ఎందుకు మామూలో ఊహించడం పెద్ద కష్టం కాదు. పరాయి రాష్ట్రం చెప్పినా మేల్కొనరా? జిల్లాలోని ఇటుకబట్టీల్లో కార్మికులతో నిర్బంధంగా వెట్టిచాకిరి చేయించుకొంటున్నారని పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన బృందం చెప్పినా, ఇక్కడి అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి అధికారులు, పోలీసులు వచ్చి, ఇక్కడి ఇటుకబట్టీల నుంచి కార్మికులను విడిపించుకొని తీసుకెళ్లడం స్థానిక పాలనకు అవమానకరంగా పలువురు పేర్కొంటున్నారు. అడ్వాన్స్‌లు ఇచ్చి తెచ్చుకున్నాం, బాలలు బడికి వెళుతున్నారు అంటూ యజమానులు ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. బట్టీల్లో వాతావరణానికి వారి మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. వ్యాపారానికి కార్మికులు అవసరమే అయినా... వారికి ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన సౌకర్యాలు, కనీస వేతనాలు, బాలలకు చదువు చెప్పిస్తే ఎలాంటి సమస్యా ఉండదు కదా అని కొంతమంది అధికారులు సలహా ఇస్తున్నారు. -
బాల కార్మికులు.. ఆ ఫ్యాక్టరీలకు ‘కరెంట్’ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ : ఆటపాటలతో అల్లరి చేస్తూ బరువు బాధ్యతల్లేకుండా బతికే బాల్యం ఎవరికైనా ఇష్టమే. కొందరైతే ఎప్పటికీ ఎదగకుండా బాల్యంలోనే బతుకంతా గడిపేయాలని ఆశిస్తారు. ఎంత ఆశించినా పేద వర్గాలకు చెందిన అభాగ్య బాలలకు అందరిలాగా బాల్యం అందుబాటులో ఉండదు. ఖార్కానాల్లో, గనుల్లో, వెట్టి పనుల్లో వారి బాల్యం చిక్కుకుపోయి ఉంటుంది. 2011లో జరిపిన జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో 18 ఏళ్ల లోపు పిల్లలు దాదాపు 45 కోట్ల మంది. దురదృష్టవశాత్తు వారిలో ఐదు నుంచి 18 ఏళ్లలోపున్న మూడున్నర కోట్ల మంది పొద్దుపొద్దున్న నిద్ర లేవగానే పనుల్లోకి వెళ్లిపోవాలి. ఐదు నుంచి 14 ఏళ్ల లోపున్న మరో కోటిన్నర మంది పిల్లలు ఇటుక బట్టీల్లో, బీడీ కంపెనీల్లో, ఇతర ప్రమాదకర రంగాల్లో పనిచేయాలి. ఈ 14 ఏళ్ల లోపు పిల్లల్ని పనుల్లోకి తీసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆశించిన ఫలితాలు రావడం లేవు. ఇలాంటి పరిస్థితుల్లోనే కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల మేరకు ‘కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్’ బాల కార్మికులను పనిలో పెట్టుకున్న కంపెనీలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. దీనిపై ఆ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. 1999లో కర్ణాటక హైకోర్టు విద్యుత్ సంస్థ ఆదేశాలను కొట్టివేసింది. దీనిపై విద్యుత్ సంస్థ 2006లో సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది. దాదాపు 11 ఏళ్ల అనంతరం సుప్రీంకోర్టు రెండు, మూడు రోజుల క్రితం బాల కార్మికుల చట్టాలను ఉల్లంఘించిన కంపెనీలు, సంస్థలకు విద్యుత్ సరఫరాను నిలిపి వేయవచ్చంటూ తీర్పునిచ్చింది. ఈ విషయాన్ని కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన అధికారులు మీడియాకు తెలిపారు. -
బాలకార్మికుల కేసులో ముగ్గురి అరెస్ట్
భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : బాలకార్మికులతో పనిచేయించుకుంటున్న ఓ కంపెనీ మేనేజర్‌తో సహా ఇద్దరు బ్రోకర్లను అరెస్ట్ చేసినట్టు భువనగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. మండల కేంద్ర పరిధిలోని ఎస్పీఎస్ యార్న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ(జిప్స్)లో మంగళవారం రాచకొండ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ రఫీక్, ఆపరేషన్ స్మైల్ సంయుక్త ఆధ్వర్యంలో అకస్మిక దాడులు నిర్వహించారని తెలిపారు. కంపనీలో 18 ఏళ్ల లోపు ఉన్న 11 మంది బీహార్ రాష్ట్రానికి చెందిన బాలలతో పని చేయించుకుంటున్నట్లు గుర్తించామని తెలిపారు. అంతేకాక తక్కువ వేతనంతో వారిచే వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని విచారణలో తెలిసిందని తెలిపారు. బాలకార్మికులను పనిలో పెట్టుకొన్న మేనేజర్ ఉరిమింది వెంకటేశ్వరప్ప, బీహార్‌కు చెందిన లేబర్ కాంట్రాక్టర్ సంతోష్‌యాదవ్, లేబర్‌ను సరఫరా చేస్తున్న రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్కు చెందిన పల్లె బాబురావును బుధవారం అరెస్ట్ చేసి భువనగిరి కోర్టుకు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అలాగే పరారీలో ఉన్న ఎస్పీఎస్ యార్న్ కంపనీ ఎండీ నరేశ్ తాపర్ను త్వరలో అరెస్ట్‌చేస్తామన్నారు. నిందితులపై బాలకార్మికచట్టం, వెట్టిచాకిరి చట్టం, జెవైనల్ జస్టిస్ చట్టం, ఉమన్ ట్రాక్ రూల్ మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వివరించారు. అలాగే హోటళ్లు, షాపుల్లో పనిచేస్తున్న భువనగిరిలో ఆరుగురు, చౌటుప్పల్ నలుగురు చొప్పున బాలకార్మికులకు విముక్తి కల్పించామని అన్నారు. మూడు కేసులలో మొత్తం 21 మంది బాలకార్మికులను చైల్ట్ వేల్ఫేర్ కమిటీకి అప్పగించామని తెలిపారు. బాలకార్మికులను పనిలో పెట్టుకొన్న షాపు యజమానులకు నోటీసులు ఇచ్చామని, విచారణ అనంతరం తగిన జరిమానా విధించనున్నట్లు చెప్పారు. రాచకొండ పోలీసుల తరుపున ఆపరేషన్ స్మైల్ టీమ్‌లు ఇకపై ఇటుక బట్టీలు, ఫౌల్ట్రి, స్పిన్నింగ్ మిల్లు, కెమికల్ కంపనీలు, లాడ్జ్రీలు, షాపులలో తరచు తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలకార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటులో యాదాద్రి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలోనే సీసీ కెమెరా ఏర్పాటులో యాదాద్రిభువనగిరి జిల్లా మొదటి స్థానంలో ఉందని డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు. జిల్లాలో నేను సైతం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అందులో భాగంగానే 10వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగ, ఇప్పటి వరకు 936 ఏర్పా టు చేశామని వివరించారు. ఆలేరు మండలంలో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామం, షాపు, ఇంటింటికీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని పోలీ సులకు సహకరించాలని కోరారు. సమావేశంలో ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ రఫీక్, చౌటుప్పల్ ఏసీపీ రమేశ్‌జాదవ్, ఎస్ఓటీ ఎస్ఐ సురేశ్, ఆపరేషన్ స్మైల్ ఎస్ఐ సాయిలు, స్థానిక ఎస్ఐలు రాఘవేంద్రగౌడ్, వెంకట య్య, లేబర్ ఆఫీసర్ మహ్మద్ అహ్మ ద్, చైల్డ్‌లైన్ టీమ్ జిల్లా సభ్యుడు యాదయ్య, సిబ్బంది ప్రతాప్, కరుణాకర్, సుధాకర్, శంకర్, జనార్దన్, ధనుంజయ్య, యాదయ్య తదితరులు ఉన్నారు. -
మనిషా? లేక రాక్షసా?
సాక్షి, న్యూఢిల్లీ : పని పేరుతో తన దగ్గరకు తెచ్చుకున్న మైనర్‌పై ఓ యువతి అతికిరాతకంగా వ్యవహరించింది. రెండేళ్లుగా శారీరకంగా తీవ్రంగా హింసిస్తుండటంతో ఆ వేధింపులు తట్టుకోలేక బాలిక పై నుంచి దూకి పారిపోయేందుకు యత్నించింది. అయితే అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిహార్‌కు చెందిన యువతి(23) ఫరిదాబాద్ లో చదువుకుంటోంది. తన స్వగ్రామంలోని ఇంట్లో పని చేసే దంపతుల కూతురిని తన అవసరాల నిమిత్తం రెండేళ్ల క్రితం వెంట తెచ్చుకుంది. కొన్నాళ్లపాటు బాగానే చూసుకున్న యువతి.. హఠాత్తుగా మారిపోయింది. ఇంట్లోంచి కాలు కూడా బయటపెట్టనీయకుండా బాలికను ఆ యువతి దారుణంగా హింసించటం మొదలుపెట్టింది. లోపలి నుంచి ఏడుపులు వినిపించటంతో చుట్టుపక్కల వారు యువతిని ప్రశ్నించగా.. మీకు సంబంధం లేని విషయం.. మీ పని మీరూ చూస్కోండి అంటూ యువతి పరుషంగా బదులు ఇచ్చేదంట. ఈ క్రమంలో ఆ వేధింపులను తట్టుకోలేక పారిపోవాలని బాలిక నిర్ణయించుకుంది. బుధవారం వారిద్దరూ ఉంటున్న కనిష్క టవర్స్ 11వ అంతస్థు నుంచి కిందకు దూకేసింది. అయితే కింది ఫ్లోర్ లోనే ఉన్న పిట్ట గూడులో ఇరుక్కుపోయి భయంతో అరవ సాగింది. తొమ్మిదవ ఫ్లోర్లో ఉన్న ఓ టీచర్ ఆ ఏడుపులు విని పోలీసులకు సమాచారం అందించింది. వారొచ్చి బాలికను రక్షించి విముక్తి కల్పించారు. బాలిక శరీరం మొత్తం కాల్చిన గాయాలు ఉన్నాయి. ప్రతీ రోజు తనకు నరకం చూపించిందని ఆ బాలిక చెబుతోంది. బాల కార్మిక చట్టం కింద యువతిపై కేసు నమోదు చేసి.. పోలీసులు ఎఫ్ఐఆర్ సిద్ధం చేశారు. కాగా, బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చేంత వరకు శిశు సంరక్షణ కేంద్రంలో ఉంచాలని ఫరిదాబాద్ శిశు సంరక్షణం కమిటీ అధికారి హెచ్ఎస్ మాలిక్ తెలిపారు. -
పర్వతం.. పాదాక్రాంతం
- నాటి బాలకార్మికుడే నేటి పర్వతారోహకుడు - బీసీ రాయ్ పర్వతాన్ని అధిరోహించిన కప్పట్రాళ్ల కుర్రోడు - మీరతాంగ్ గ్లేసియర్‌లో నిమాస్ కోర్సు కర్నూలు(హాస్పిటల్) : చిన్నతనంలో చదువు ఒంటబట్టలేదని తల్లిదండ్రులు అతన్ని వలస పనులకు తీసుకెళ్లేవారు. అలాంటి బాలుడు నేడు చదువుకుని దేశంలోని ప్రతిష్టాత్మక పర్వతాలను అధిరోహిస్తున్నాడు. ఎత్తైన బీసీ రాయ్ పర్వతాన్ని అధిరోహించడమే గాక మీరతాంగ్ గ్లేసియర్‌లో 28 రోజుల పాటు కఠోర శిక్షణ సైతం తీసుకున్నాడు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామానికి చెందిన ఓబులేసు, వీరభద్రమ్మలకు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు. వీరు తమకున్న నాలుగు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూనే గ్రామంలో వ్యవసాయ పనులకు కూలీగా వెళ్లేవారు. ఒక్కగానొక్క కుమారుడైన కె. సురేంద్రను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. 4వ తరగతికి వచ్చినా అ,ఆలు సరిగ్గా రావని చదువు మాన్పించి పనికి పంపించారు. తమతో పాటు వలస సమయంలో గుంటూరు జిల్లాకు తీసుకెళ్లేవారు. ఈ దశలో బాలున్ని చూసిన అధికారులు బాలకార్మిక నిర్మూలన పాఠశాలలో చేర్పించి 5వ తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత 10వ తరగతి వరకు బీసీ హాస్టల్లో ఉంటూ పత్తికొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ఆదోనిలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. సురేంద్రను బాగా చదివించాలని బెంగళూరులో ఉండే పెద్దమ్మ కుమారుడు రవి అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజిలో బీ.కాం చదివించాడు. పర్వతారోహణకు శ్రీకారం : గతేడాది నవంబర్‌లో ‘మిషన్ ఎవరెస్ట్’ పై జిల్లా యువజన సంక్షేమ శాఖ ఇచ్చిన ప్రకటన చూసి సురేంద్ర ఆకర్షితుడయ్యాడు. వెంటనే దరఖాస్తు చేసుకుని ఎంపికలో జిల్లాలో రెండవ స్థానాన్ని సాధించాడు. అనంతరం విజయవాడలోని కేతనకొండలో శిక్షణ పొందాడు. అక్కడ నుంచి డార్జిలింగ్‌కు వెళ్లి 20 రోజుల పాటు, సిక్కిం సరిహద్దులోని రాతోం గ్లేసియర్‌లో కఠినమైన ట్రెక్కింగ్ శిక్షణ పొందాడు. బీసీరాయ్ పర్వతారోహణ : రాతోంగ్లేషియర్లో కఠినమైన ట్రెక్కింగ్ శిక్షణ అనంతరం గతేడాది డిసెంబర్ 9న బీసీ రాయ్ పర్వతాన్ని అధిరోహించాడు. నేపాల్‌లో భూకంపం వచ్చిన తర్వాత ఇక్కడ పర్వతారోహణను ప్రభుత్వం నిషేదించింది. తాజాగా మళ్లీ అనుమతినిచ్చింది. ఈ పర్వతారోహణకు మన రాష్ట్రం నుంచి 24 మంది వెళ్లగా చివరకు 12 మంది మాత్రమే అధిరోహించారు. వారిలో ముందుగా పర్వతాన్ని ఎక్కిన రెండవ వాడు సురేంద్ర. ఇక్కడ ఏ గ్రేడ్ వచ్చిన వారందరికీ అడ్వాన్స్ మౌంటేనింగ్ కోర్సు నిమాస్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటేనింగ్ అల్లాయిడ్ కోర్స్)లో 28 రోజుల పాటు మీరతాంగ్ గ్లేసియర్ (అరుణాచల్ ప్రదేశ్–చైనా బోర్డర్)లో ఈ నెల 8వ తేదీ వరకు శిక్షణ పొందాడు. ఈ సమయంలో 72 కిలోమీటర్ల ట్రెక్కింగ్, 20 వేల అడుగుల ఎత్తు దాకా మీరతాంగ్ గ్లేసియర్‌ను ఎక్కడం, మైనస్ 15 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ శిక్షణ పొందడం మరిచిపోలేని అనుభూతనిచ్చిందని సురేంద్ర వివరించాడు. ఈ శిక్షణ అనంతరం న్యూమలింగ్ గ్రామంలో 9కిలోమీటర్ల రన్నింగ్ పోటీ నిర్వహించారని ఇందులో ఉత్తీర్ణత సాధించానని చెప్పాడు. దీంతో ప్రపంచంలోని ఏ పర్వతాన్నైనా అధిరోహించేందుకు తనకు అవకాశం లభించిందని, భవిష్యత్‌లో ప్రభుత్వం సహకరిస్తే దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహిస్తానని మనసులోని మాట చెప్పాడు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
సీబీసీఐడీ మెజిస్ట్రేట్ శివశంకర్ కాకినాడ లీగల్ : సామాజిక రుగ్మతగా మారిపోయిన బాలకార్మిక వ్యవస్థను, యాచక వృత్తిని రూపుమాపాల్సిన అవసరం ఎంతయినా ఉందని కాకినాడ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి, సీబీసీఐడీ జడ్జి కె.శివశంకర్ అన్నారు. స్థానిక గాంధీ భవ¯ŒSలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా కేరింతలు కొడుతూ పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్చుకోవలసిన బాలల జీవితాలు యాచక వృత్తిలోనూ, బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాలలను సంరక్షించి విద్యాబుద్ధులు నేర్పించకపోతే భవిష్యత్‌లో వారు సంఘ విద్రోహశక్తులుగా మారే ప్రమాదం ఉందన్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఒక ఉద్యమంగా తీసుకుని సమష్టిగా ఆ వ్యవస్థలను సమూలంగా నిర్మూలించాల్సి ఉందన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.శివరామప్రసాద్ మాట్లాడుతూ నేటిబాలలే రేపటి పౌరులని, బాలలను తీర్చిదిద్దితే దేశానికి, సమాజానికి మేలు జరుగుతుందన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఇ¯ŒSచార్జి పీడీ పంతం సావిత్రి మాట్లాడుతూ బాలల వసతి గృహనిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్సు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానికులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
‘బాలలతో పనులు చేయిస్తే ఊరుకోం’
హైదరాబాద్: బాల కార్మిక నిర్మూలన కోసం యుద్ధం మొదలైంది. కార్మిక శాఖతో పాటు అన్ని శాఖలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఇకపై బాలలతో పనులు చేయిస్తే ఊరుకునేది లేదు. సమాచారం ఇస్తే చాలు దాడులు చేసి జైలుకు పంపుతాం.. అని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన బాలకార్మిక నిర్మూలన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లల్ని పనుల్లో పెట్టుకోవడంతో పాటు వారిని హింసిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆకస్మిక దాడులు నిర్వహించి యజమానులపై కేసులు నమోదుచేసి బాలలకు విముక్తి కలిగిస్తున్నామని చెప్పారు. అలాంటి దాడుల్లో గుర్తించిన చిన్నారులకు ప్రభుత్వమే ఉచిత విద్యనందించి వసతి కల్పిస్తుందన్నారు. -
ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్!
ఇందూరు: బాల కార్మికులను పని నుంచి విముక్తి కల్పించడం.. బడిబయట పిల్లలను బడిలో చేర్పించడం.. అనాథ పిల్లలకు వసతి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ జిల్లాలో విజయవంతమైంది. జూలై 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు కొనసాగిన ఈ స్పెషల్ డ్రైవ్‌లో చాలా మంది బాల కార్మికులకు పని నుంచి విముక్తిని కల్పించారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం స్థానంలో ఆపరేషన్ ముస్కాన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని జిల్లా బాలల సంరక్షణ విభాగం సిబ్బందితోపాటు పోలీసు, కార్మిక శాఖ అధికారులు పాలు పంచుకున్నారు. ఈ మూడు శాఖల సమన్వయంతో నిజామాబాద్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ డివిజన్లవారీగా నలుగురు సభ్యులు కలిగిన నాలుగు బృందాలు ప్రత్యేక వాహనంలో నెల రోజులపాటు సంచరించారు. ఫ్యాక్టరీలు, వ్యాపార సముదాయాలు, రైల్వే, బస్టాండ్ ప్రాంతాల్లో 93 మంది పిల్లలను పట్టుకున్నారు. ఇందులో బాల కార్మికులు 62, వీధిబాలలు ఒక్కరు, భిక్షాటన చేస్తున్నవారు 13 మంది పిల్లలున్నారు. వ్యాపారులపై కేసు జూవైన్ జస్టిస్ చట్టం ప్రకారం పిల్లలతో పని చేయించడం, పనిలో పెట్టుకోవడం నేరం కిందకు వస్తుంది. బాలలతో పని చేయిస్తున్న ఏడుగురు వ్యాపారులకు ఫైన్ వేయడంతోపాటు కేసులు నమోదు చేశారు. వ్యాపారస్తులతో రూ.5,000 నుంచి రూ.20,000 వరకు పిల్లల పేరిట బ్యాంకుల్లో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే వారికి 18 ఏళ్లు నిండిన తరువాత పైచదువులకు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. బాలలను తీసుకెళ్లి వారి తల్లి దండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి బడిలో చేర్పించారు. అలాగే భిక్షాటన, చెత్త కాగితాలు సేకరిస్తున్న పిల్లలను వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలల్లో చేర్పించారు. అనాథ పిల్లలను స్వచ్ఛంద సంస్థల్లో చేర్పించి నివాసంతోపాటు, విద్యను అందిస్తున్నారు. నెల రోజులపాటు కొనసాగిన డ్రైవ్ విజయవంతగా ముగియడంతో బృందాల సభ్యులకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులు ప్రసంశలు కురిపించారు. నిరంతరం చేస్తే ఎంతో మేలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ఏడాదితో రెండు పర్యాయాలు నిర్వహించాలి. అయితే ఈ కార్యక్రమాన్ని రెండుసార్లు మాత్రమే కాకుండా నిరంతరంగా కొనసాగిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కనీసం నాలుగు దఫాలుగా నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందంటున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ చేపడితే పాఠశాలల్లో పిల్లల డ్రాపౌట్ తగ్గడానికి వీలుందడని, బడిలో చేర్పించిన పిల్లలు మళ్లీ బడికి వెళ్తున్నారో లేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయమై ఐసీడీఎస్ పీడీ శారదను అడుగగా.. బాల కార్మికులను వ్యాపారస్తులు పనిలో పెట్టుకోవడం చట్ట ప్రకారం నేరం. కేసుల నమోదు, భారీ జరిమానాలు ఉంటాయి. కావున వ్యాపారస్తులు బాలలను పనిలో పెట్టుకోవద్దు. వారిని చదివించడానికి కృషి చేయాలని తెలిపారు. -
బాల కార్మికులకు విముక్తి
ఆపరేషన్ ముస్కాన్ బృందం దాడులు చిల్డ్రన్ హోంకు చిన్నారుల తరలింపు హుస్నాబాద్‌రూరల్ : హుస్నాబాద్ సర్కిల్లోని వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది బాలకార్మికులకు ముస్కాన్ ఆపరేషన్ టీం శుక్రవారం విముక్తి కల్పించింది. టీం అధ్వర్యంలో కోహెడ, భీమదేవరపల్లి, హుస్నాబాద్ మండలాల్లోని దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది బాల కార్మికులను గుర్తించారు. చత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వీరిని కరీంనగర్‌లోని చిల్డ్రన్ హోంకు తరలిస్తామని హుస్నాబాద్ సీఐ దాసరి భూమయ్య తెలిపారు. మళ్లీ బాలలతో పనిచేయిస్తే బాల కార్మిక చట్టం ప్రకారం యజమానులను శిక్షిస్తామని హెచ్చరించారు. దాడుల్లో ఎస్సై కిరణ్, వంగర ఎస్సై హరిప్రసాద్, ముస్కాన్ టీం సభ్యులు రమేశ్, అర్చన తదితరులు పాల్గొన్నారు. -
248 మంది బాల కార్మికుల గుర్తింపు
సోంపేట : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదనపు డీజీపీ (సీఐడీ) ప్రత్యేక కమిషన్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముష్కాన్–2 కార్యక్రమం నిర్వíß స్తున్నట్టు డీసీపీవో కె.వి.రమణ తెలిపారు. ఈ నెల 28 వరకు నిర్వహించిన దాడులలో మొత్తం 248 మంది బాలకార్మికులను గుర్తించడం జరిగిందన్నారు. గురువారం సోంపేట, బారువ గ్రామాల్లో దాడులు నిర్వహించి 19 మంది బాల కార్మికులను గుర్తించామన్నారు. బాలలతో పని చే యించినా, యాచక వృత్తి చేయించినా, అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో పీవీ రమణ, ఏఎస్.ఐ, ఐ.లక్ష్మినాయుడు బాలల రక్షణాధికారి, రాజీవ్ విద్యామిషన్ అధికారి రాజారావు, చైల్డ్‌లైన్ సిబ్బంది జాస్మిన్ కుమారి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
14 మంది బాలకార్మికుల గుర్తింపు
జహీరాబాద్ టౌన్: పలు శాఖల అధికారులు కలసి గురువారం పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బాలకార్మికులను గుర్తించారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం, కార్మికశాఖ అధికారి యాదయ్య, సీడబ్ల్యూసీ సభ్యుడు మహరాజ్, డీసీపీయూ సభ్యుడు గోపాల్, ఏఎస్ఐ మల్లయ్య తదితర శాఖల అధికారులు అశోక్, మోతిరాం, సత్తిరెడ్డి తదితరులు పట్టణంలోని హోటళ్లు, వ్యాపార సంస్థలను తనిఖీలు నిర్వహించారు. 14 మంది బాలకార్మికులను గుర్తించి వారిని సంగారెడ్డిలోని దివ్యదిశ హోంకు తరలించారు. ఈ సందర్బంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి రత్నం మాట్లాడుతూ 14 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టడం నేరమన్నారు. పిల్లలను పనుల్లో పెట్టుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆపరేషన్ ముస్కాన్–2కు సహకరించండి
ఇచ్ఛాపురం(కంచిలి): ఆపరేషన్ ముస్కాన్–2 కార్యక్రమానికి అందరి సహకారం అవసరమని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఎస్ఐ ఎం.లక్ష్మయ్య అన్నారు. సమగ్ర బాలల పరిరక్షణ పథకంలో భాగంగా మంగళవారం ఇచ్ఛాపురం, సోంపేట పట్టణాల్లో ఆపరేషన్ ముస్కాన్ పేరిట తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రదేశాల్లో 23 మంది బాల కార్మికులు, అనాథలను గుర్తించినట్లు తెలిపారు. వీరిని బాలల సంక్షేమ సమితి ముందు హాజరు పరిచి పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 218 మంది బాలబాలికలను గుర్తించామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సమగ్ర బాలల పరిరక్షణ పథకం ప్రాజెక్టు అధికారి ఎం.మల్లేశ్వరరావు, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ ఆర్.జాస్మిన్‌కుమారి, ఎం.స్వాతి, జగదీశ్వర రావు, ఎం.బాలకృష్ణ పాల్గొన్నారు. -
ఇవేమి సవరణలు?!
ఎందరు కాదంటున్నా బాల కార్మిక చట్టానికి సంబంధించిన సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభ కూడా ఆమోదించింది. ఇంతక్రితమే దీనికి రాజ్యసభ ఆమోదం లభించింది కనుక మరికొన్ని రోజుల్లో ఈ సవరణలన్నీ చట్టంలో భాగమవుతాయి. ఇప్పుడున్న 1986నాటి చట్టంతో బాల కార్మిక వ్యవస్థను అరికట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నందున ఈ సవరణలు తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం మొదటినుంచీ చెబుతోంది. 14 ఏళ్లలోపు పిల్లలను ప్రమాద కరమైన పనుల్లో లేదా ప్రక్రియల్లో భాగస్వాములను చేయరాదని ఇప్పుడున్న చట్టం చెబుతుండగా... 14-18 ఏళ్ల మధ్యనున్న కౌమార దశ పిల్లలను కూడా ప్రస్తుత సవరణ అందులో చేర్చింది. అలాగే బాల కార్మికుల్ని పనిలో పెట్టుకోవడం కాగ్నిజబుల్ (వారెంటు లేకుండానే అరెస్టు చేయదగ్గ) నేరంగా పరిగణిస్తారు. ఆర్నెల్ల నుంచి రెండేళ్ల వరకూ శిక్షలు... రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకూ జరిమానాల విధింపు వగైరాలు కూడా ఉన్నాయి. చూడగానే ఇన్ని మంచి అంశాలు కనబడుతున్న ఈ బిల్లుకు బాలల హక్కుల కార్యకర్తలనుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి, విపక్షాలనుంచి ఎందుకంత వ్యతిరేకత వచ్చింది? బీజేపీ సభ్యుడు వరుణ్ గాంధీ సైతం దీన్ని ఎందుకు తప్పుబడుతున్నారు? దీన్ని ఆమోదిస్తే బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించినట్టవుతుందని ఎందుకు హెచ్చరించారు? బాల కార్మిక వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్మూలించేందుకని చెబుతున్న ఈ బిల్లు ఆచరణలో అందుకు విరుద్ధమైన ఫలితాలనిస్తుందన్నదే వీరి వాదన. ప్రమాదకరం కాని కుటుంబ వ్యాపారాలు, కుటుంబ వృత్తుల్లో, వ్యవసాయంలో 14 ఏళ్ల లోపు పిల్లలు పనిచేయవచ్చునని తాజా బిల్లు మినహాయింపునిస్తున్నది. అలాగే టీవీ సీరియళ్లు, సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, ఇతర వినోద రంగాల్లో, క్రీడారంగాల్లో కూడా వారు పనిచేయవచ్చు. అయితే వారి చదువు దెబ్బతినకుండా పాఠశాల పని గంటలు ముగిశాక లేదా సెలవుల్లోనూ పనిచేయవచ్చు. అంతేకాదు... ప్రమాదకర పనులు, ప్రక్రియల జాబితాను కూడా గణనీయంగా తగ్గించింది. కేవలం మైనింగ్, మండే స్వభావం ఉండే పదార్థాలు, ఫ్యాక్టరీల చట్టం ప్రమాదకరమైన ప్రక్రియలుగా పరిగణించే రంగాలను మాత్రమే ఇందులో చేర్చింది. కుటుంబ వృత్తులు, వ్యాపారా లంటే సవరణ బిల్లును రూపొందించినవారి ఆంతర్యం ఏమోగానీ... కార్పెట్, జరీ, బీడీ, మైకా, వజ్రాల కోత, పారిశుద్ధ్యం, ఇటుకబట్టీలు వంటివి కూడా అందులో కొస్తాయి. సవరణల్లో మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. భవిష్యత్తులో ఏదైనా వృత్తి లేదా వ్యాపారం ప్రమాదకరం కానిదని కేంద్ర ప్రభుత్వం భావిస్తే ఏ సవరణా అవసరం లేకుండానే ఆ కేటగిరీలోకి చేర్చే హక్కు దానికుంటుంది. ఫలానా రంగానికి మినహాయింపు వచ్చిన సంగతి పార్లమెంటుకు కూడా తెలియదు. అమల్లో ఉన్న చట్టానికి చేసే సవరణలు దాని లోటుపాట్లను తీర్చేవిధంగా ఉండాలి తప్ప మరింత నీరుగార్చేలా మారకూడదు. ఒకపక్క 14 ఏళ్లలోపు పిల్లలకు నిర్బంధ, ఉచిత విద్య పొందే హక్కు ఉన్నదని చెబుతూ మనం ఘనంగా విద్యా హక్కు చట్టం తెచ్చుకున్నాం. ఏదో ఒక పేరు మీద 14 ఏళ్లలోపు పిల్లలతో పని చేయించడానికి అవకాశం కల్పించే ఇలాంటి సవరణలను ఆమోదిస్తే విద్యాహక్కు చట్టం తీసుకొచ్చిన ఉద్దేశమే నీరుగారే ప్రమాదం ఉండదా? నిజానికి విద్యాహక్కు చట్టం వచ్చాక చాలామంది పిల్లలు బడిబాట పట్టారు. అట్టడుగు, నిరుపేద వర్గాలవారికి చెందిన పిల్లల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. మొదట్లో బడికి పిల్లల్ని పంపడం దండగనీ, తమ కొచ్చే ఆదాయం పడిపోతుందని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు సైతం అనంతర కాలంలో కాస్త మారారు. బడికెళ్లొస్తున్న పిల్లల్లో మార్పు గమనించాకనే ఇది సాధ్యమైంది. తాము బతికినలాంటి బతుకు తమ పిల్లలకు రాకూడదన్న ఆకాంక్ష వారిలో పెరుగుతోంది. దీన్ని మరింత విస్తృతపరిచే కార్యాచరణ ఉంటే పిల్లల హాజరు వందశాతానికి చేరుకోవడం పెద్ద కష్టంకాదని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఈ సమయంలో ఇలాంటి చట్టాలు దాన్ని నీరుగార్చవా? తప్పని సరైతే వేరుగానీ అవకాశాన్నిస్తే ఉపయోగించుకోవడానికి చూసే తల్లిదండ్రుల సంఖ్య పెరుగు తుంది. పిల్లల్ని పనికి పంపే వీలుందని తెలిసినప్పుడు ఇంట్లో మగపిల్లలకన్నా ఆడ పిల్లలే సహజంగా దానికి బలవుతారు. ఆడపిల్ల ఎటూ పరాయి ఇంటికి వెళ్లాల్సినదే గనుక పనికి పంపుదామన్న ఆలోచన ఉంటుంది. సభ మరికాస్త సమయం తీసుకునైనా ఈ అంశాలన్నిటిపైనా ఆలోచించాల్సింది. కానీ అది జరగలేదు. బిల్లుపై చర్చ జరిగిన సందర్భంగా కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కుటుంబ వ్యాపారాల్లో తల్లిదండ్రులెవరైనా భోజనానికో, మరో పనికో వెళ్లినప్పుడు పిల్లలు కాసేపు ఆ పనులు చూస్తూ ఉండటం సాధారణమేనని చెప్పారు. అందులో అవాస్తవమేమీ లేదు. అయితే ఆ ‘కాసేపు’ పనిని చట్టబద్ధం చేయడంతో అదొక హక్కుగా మారి పిల్లలను బడికి పంపడం మానుకునే ధోరణి బలపడే ప్రమాదం ఉంటుంది. అసలు తనిఖీకొచ్చిన అధికారులకు పనిలో ఉన్న పిల్లలతో యజమానులకున్న చుట్టరికాన్ని లోతుగా ఆరా తీయడం సాధ్యమవు తుందా? వారిని మాయజేసే అవకాశం ఉండదా? అసలు బాల కార్మిక చట్టానికి ఇలాంటి మినహాయింపులు కావాలని అడిగిందెవరు? ఒత్తిళ్లు తెచ్చిందెవరు? కౌమార దశలో ఉన్న పిల్లలను ఈ చట్టం పరిధిలోకి తీసుకొస్తూనే ‘ప్రమాదకర’ జాబితాను కాస్తా కుదించడమేమిటి? తమను తాము సమర్ధించుకోవడం, రక్షించుకోవడం సాధ్యంకాని పరిస్థి తుల్లో పిల్లలుంటారు. బాల్యం బందీఖానాగా కాక ఒక మధురానుభూతిగా వారికి మిగ లాలి. చదువుకూ, ఆటపాటలకూ అవకాశమిచ్చేదిగా ఉండాలి. వారిలోని సృజనా త్మకతను వెలికితీసి, సానపెట్టేదిగా ఉండాలి. పిల్లలతో సున్నితంగా వ్యవహరించే వాతావరణం ఉన్నప్పుడే వీటన్నిటా వారు ఎదుగుతారు. ఉత్తమ పౌరులుగా రూపొందుతారు. ఇప్పుడు చట్టానికి తీసుకొచ్చిన సవరణలు ఆ మౌలిక అంశాలను విస్మరిస్తున్నాయి. ఇది విచారకరం. -
బాలకార్మికులను అదుపులోకి తీసుకున్న అధికారులు
రామాయంపేట : ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా బాలల సంరక్షణ అధికారులు బుధవారం రామాయంపేట పట్టణంలో తొమ్మిది మంది బాలకార్మికులను గుర్తించి పట్టుకున్నారు. బాలల సంరక్షణ జిల్లా అధికారి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో షీం టీం హెడ్ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుళ్లు మధు, సోమలత పట్టణంలోని పలు దుకాణాలు, మెకానిక్ షెడ్డులు, కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్న బాలకార్మికులను గుర్తించి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పలు దుకాణాల్లో పనిచేస్తున్న బాలకార్మికులను మరోచోటుకు తరలించారు. పట్టుబడ్డ వారిలో విద్యార్థులు నిసాక్, ప్రవీణ్, నవీన్, ఇమ్రాన్‌ఖాన్, నరేశ్, భానుప్రసాద్, ఇలియాస్, ఫారూఖ్, ప్రశాంత్ ఉన్నారు. వీరిని దొంతి గ్రామంలో ఉన్న బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని భాస్కర్‌రావు పేర్కొన్నారు. -
బలవుతున్న బాల్యం..
ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి. 21వ శతాబ్దంలోనూ ఈ సమస్య ఇంకా అంతం కావడం లేదు. ఎందరో బాలల భవిష్యత్‌ను చిదిమేస్తున్న కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేస్తూనే ఉంది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించడం లేదు. నేడు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా నేటి తరంలో బాలకార్మిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం.. 21 కోట్ల మంది.. కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారు. కొన్నిదేశాల్లో 17 ఏళ్లలోపు బాలల్ని కూడా కార్మికులుగానే భావిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 కోట్ల మంది బాల కార్మికులుగా కొనసాగుతున్నారని ఐక్యరాజ్య సమితి అంచనా. పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లే. పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగం, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారు. కారణాలు.. పిల్లల తల్లిదండ్రుల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యతల కారణంగానే బాలకార్మికులు పెరిగిపోతున్నారు. కనీస అవసరాలకు సరిపడా ఆదాయం దొరకని అనేక కుటుంబాలు తమ పిల్లల్ని పనుల్లో చేర్పిస్తున్నాయి. ప్రపంచంలో పావుశాతం జనాభా కఠిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఆఫ్రికా, అసియా, లాటిన్ అమెరికాల్లో పేదరికం కారణంగా పిల్లలు కార్మికులుగా మారాల్సి వస్తోంది. కొన్ని దేశాల్లో పిల్లలు విద్యనభ్యసించేందుకు అనువైన వసతులు లేకపోవడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు ఉచిత విద్య అందించకపోవడం, ప్రైవేటు విద్య ఖరీదు కావడంతో బాలలు చదువుకు దూరమై కార్మికులుగా పని చేస్తున్నారు. వెట్టిచాకిరి, సామాజిక అంశాలు సైతం ఇందుకు కారణమవుతున్నాయి. ఇక కొందరు పిల్లలు వంశపారంపర్యంగా వస్తున్న పనుల్లోనే కొనసాగుతున్నారు. బాల్యం ఛిద్రం.. బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వీరిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్ధా్యనికి మించిన పనుల్ని చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్థితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి. భవిష్యత్ అంధకారం.. బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్‌లో ఉన్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీరికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు. ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం, ఆర్థిక తోడ్పాటు లేకపోవడం, నైపుణ్యలేమి వంటి కారణాల వల్లే ఇలా మారుతున్నారు. ఇందుకు వ్యవస్థనే తప్పుబట్టాల్సి ఉంటుంది. నిర్మూలనకు మార్గం.. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలంటే ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలి. దీనికి అనుగుణమైన చట్టాలు రూపొందించాలి. బాలలతో పని చేయించుకునే యజమానులకు కఠిన శిక్షలు విధించాలి. బాలలందరికీ విద్య, పోషకాహారం అందేందుకు కృషి చేయాలి. ఈ పరిస్థితికి కారణమైన వ్యవస్థల్లో మార్పు తీసుకురావడం ద్వారానే ఇది సాధ్యం. పిల్లల్ని పనులు మాన్పించి, బడులలో చేర్పించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. వారి తల్లిదండ్రులు ఆర్థికంగా ఎదిగేందుకు సరైన అవకాశాల్ని కల్పించడం ద్వారా బాల కార్మికులు లేకుండా చూడొచ్చు. ఇలాంటి పిల్లలు చదువుకునేందుకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి, ఉచిత విద్య, భోజనం అందిచాలి. తల్లిదండ్రుల సంరక్షణ లేని వారికి ప్రత్యేక రక్షణ, వసతులు కల్పించాలి. మన దేశంలో.. ప్రపంచంలో ఎక్కువ మంది బాలకార్మికులు ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. మన దేశంలో దాదాపు కోటి వరకు బాల కార్మికులు ఉన్నట్లు అంచనా. ఈ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం కఠినమైన చట్టాల్ని అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించలేకపోతున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ బాలకార్మిక ప్రాజెక్టు అమలవుతోంది. దీనిలో భాగంగా పనుల్లో మగ్గుతున్న బాలల్ని గుర్తించి, వారికి సరైన ఆవాసం కల్పించి, విద్య అందిస్తారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యాహక్కు చట్టం సత్ఫలితాల్నిస్తోంది. ఏ కారణం చేతనైనా బాలలు బడి బయట ఉండరాదని, ప్రతి ఒక్కరికి నిర్బంధ ప్రాథమిక విద్య అందాలని ఈ చట్టం చెబుతోంది. బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లల్ని పనుల్లో పెట్టుకోకూడదు. దీన్ని అతిక్రమించిన వారికి జైలు శిక్షలతోపాటు జరిమానాలు విధిస్తారు. యునిసెఫ్ కృషి.. అంతర్జాతీయంగా బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న యునిసెఫ్ సంస్థ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు యత్నిస్తోంది. వివిధ దేశాలతో కలిసి ఈ సమస్య నివారణ కోసం చట్టాలు రూపొందించింది. 15 ఏళ్లలోపు పిల్లల్ని ఎక్కడా పనుల్లో చేర్చుకోకూడదని, 18 ఏళ్లలోపు వారిని కఠినమైన పనులకు వినియోగించకూడదని యునిసెఫ్ నిబంధనలు చెబుతున్నాయి. పిల్లలందరికీ కచ్చితంగా విద్య అందేలా చూస్తోంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అవసరమైన చట్టాలను రూపొందించడంలో, ప్రాథమిక విద్య అందించడంలో యునిసెఫ్ కీలకపాత్ర పోషిస్తోంది. -
ఒక్కరూ లేరట..!
బాలకార్మికుల గుర్తింపులో కార్మిక శాఖ విఫలం ఏడాది కాలంలో ఒక్కరినీ గుర్తించిన దాఖలాలు లేవు ఆపరేషన్ స్మైల్‌తో దూసుకెళ్తున్న పోలీసులు ఏడాదిలో 347 మందికి విముక్తి తాజాగా ఐసీడీఎస్ అధికారుల దాడులు సాక్షి, మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లాలో కార్మిక శాఖ మొద్దునిద్రపోతోంది. హోటళ్లు, కార్ఖానాలు, ఇతర వాణిజ్య దుకాణాల్లో బాలకార్మికులు దర్శనమిస్తోన్నా చూసీ చూడ నట్లుగా వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలో ఒక్క బాలకార్మికుడిని ఆ వ్యవస్థ నుంచి విముక్తి కల్పించలేకపోయింది. అసలు జిల్లాలో బాలకార్మికులు లేరనుకున్నారో ఏమో కార్మికశాఖాధికారులు.. శాఖలో ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. మరోపక్క.. శాంతిభద్రతల పరిరక్షణ, ఇతర బందోబస్తులో నిమగ్నమైన పోలీసులు బాలకార్మికులనూ గుర్తిస్తూ.. వారిని వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిస్తున్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గడిచిన ఆరు నెలల్లో పోలీసులు జిల్లావ్యాప్తంగా 347 మంది బాలకార్మికులను గుర్తించి వారిని స్కూళ్లు.. తల్లిదండ్రులకు అప్పగించారని సాక్షాత్తూ.. జిల్లా కార్మికశాఖ సహాయ కమిషనర్ జగదీశ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. గడిచిన ఏడాది కాలంలో కార్మిక శాఖాధికారులు ఒక్కరిని కూడా ఆ వ్యవస్థ నుంచి విముక్తి కల్పించలేదన్నారు. పట్టింపులేని కార్మిక శాఖ తీరుతో జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ బలపడుతోందనే విమర్శలొస్తున్నాయి. కార్మిక క్షేత్రంలో అధ్వానం.. జిల్లాలోని తూర్పు ప్రాంత పరిధిలో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. బాలకార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో తల్లిదండ్రులే తమ పిల్లలను పనిలో పెడుతున్నారు. పసి పిల్లల్ని పనిలో పెట్టుకున్న వ్యాపారులు వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా పోలీసులు కేవలం మంచిర్యాల డివిజన్‌లోనే 12 మంది బాలకార్మికులను ఆ వ్యవస్థ నుంచి విముక్తి కల్పించారు. తాజాగా.. ఐసీడీఎస్ అధికారులూ మంచిర్యాల పట్టణంలోని అండాళమ్మ కాలనీ శివారు ప్రాంతంలోని ఇటుక బట్టీలో పని చేస్తోన్న ముగ్గురు బాలకార్మికుల్ని గుర్తించారు. అయితే.. ఈ ప్రాంతంలో బాలకార్మికులను గుర్తించాల్సిన కార్మికశాఖాధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘తూర్పు జిల్లా పరిధిలో అసలు బాలకార్మికులే లేరు. హోటళ్లు.. కార్ఖానాలు.. ఇటుక బట్టీలు అన్నీ చోట్లా వెతికినా బాలకార్మికులు కానరావడం లేదు. బాలకార్మికులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.’ అని మంచిర్యాల కార్మికశాఖాధికారిణి హేమలత వివరణ ఇచ్చారు. ‘ఆపరేషన్’కు నో..! బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన.. అనాథ పిల్లల గుర్తింపే ల క్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసులకు కార్మిక శాఖ సహకారం కొరవడింది. ఆపరేషన్ స్మైల్.. మిస్సింగ్ పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమమని మంచిర్యాల కార్మిక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో పోలీసులతో బాలకార్మికులను గుర్తించాలంటూ తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. పోలీసులు బాలకార్మికులను గుర్తించి తమకు సమాచారమందిస్తే వెళ్లి కేసు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. మరోపక్క.. ఆపరేషన్ స్మైల్ లక్ష్యం నెరవేరాలంటే పోలీసులతో పాటు కార్మికశాఖ, ఐసీడీఎస్ అధికారులూ తమతో కలిసి దాడుల్లో పాల్గొనాలని గతేడాది డిసెంబర్ చివరి వారంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అన్ని శాఖల ఉన్నతాధికారులు స్పష్టం చేశారని ఆపరేషన్ స్మైల్ మంచిర్యాల డివిజన్ ఇన్చార్జి లక్షెట్టిపేట ఎస్ఐ శ్రీనివాస్ చెప్పారు. కార్మిక, ఐసీడీఎస్ శాఖల సహకారం లేకున్నా బాలకార్మికుల గుర్తింపునకు పోలీసులు అహర్నిషలు కృషి చేస్తున్నారన్నారు. దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తాం.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు శాఖ తరఫున కృషి చేస్తున్నాం. కానీ.. బాలకార్మికుల సమాచారం మా అధికారులకు అందడం లేదు. బాలలు బడిలోనే ఉండాలి.. అలా కాదని బాలకార్మికులతో పని చేయిస్తే సదరు యజమానులపై కేసులు నమోదు చేస్తాం. బాలకార్మికులు ఎక్కడ కనిపించినా 9492555240కు ఫోన్లో నాకు సమాచారమివ్వండి. వెంటనే స్పందిస్తాం. - జగదీశ్‌రెడ్డి, జిల్లా కార్మికశాఖ సహాయ కమిషనర్ -
50 మంది బాలలకు విముక్తి
వరంగల్: వరంగల్ నగరంలోని పరిశ్రమల్లో మగ్గిపోతున్న చిన్నారులకు పోలీసులు విముక్తి కల్పించారు. నగర చుట్టుపక్కల ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మంది బాలలను పోలీసులు శుక్రవారం తమ తనిఖీల్లో భాగంగా గుర్తించారు. వారిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. సంబంధిత పరిశ్రమల యాజమాన్యాలపై కేసు నమోదు చేశారు. -
27మంది బాల కార్మికులకు విముక్తి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో పలు హోటళ్ల పై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లలో పని చేస్తున్న 27 మంది బాల కార్మికులను గుర్తించారు. వారికి పని నుంచి విముక్తి కలిగించి బాలసదన్‌కు తరలించారు. మరోసారి చిన్నారులతో పని చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హోటళ్ల యజమానులను హెచ్చరించారు. -
నెలాఖరు వరకు ‘స్మైల్-2’
* మెదక్ డివిజన్లో ఇప్పటివరకు 23 మంది బాలకార్మికుల గుర్తింపు * జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న 8 బృందాలు * తాజాగా అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, తూప్రాన్‌లో దాడులు : 17 మంది గుర్తింపు * స్మైల్-2 ప్రత్యేక అధికారి హన్మంత్ నాయక్ వెల్లడి అల్లాదుర్గం: జిల్లాలో ఈనెల ఒకటో తేదీన ప్రారంభించిన ‘ఆపరేషన్ స్మైల్-2’ కార్యక్రమాన్ని ఈనెల 31వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆపరేషన్ స్మైల్-2 ప్రత్యేక అధికారి హన్మంత్ నాయక్ తెలిపారు. మంగళవారం పెద్దశంకరంపేట, అల్లాదుర్గంలో తనిఖీలు నిర్వహించి ఎనిమిది మంది బాల కార్మికులను గుర్తించినట్టు చెప్పారు. సీఐడీ, సీడబ్ల్యూసీ, బాలల సంరక్షణ అధికారుల భాగస్వామ్యంతో స్మైల్-2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఎనిమిది బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఇప్పటివరకు మెదక్ డివిజన్ పరిధిలో 23 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని దొంతి, సంగారెడ్డి, నిజాంపేట, మెదక్‌లోని బాలల సంరక్షణ కేంద్రాల్లో చేర్పిస్తున్నట్టు చెప్పారు. బాలలను అదుపులోకి తీసుకునే సమయంలో ఎదిరించిన తల్లిదండ్రులు, యజమానులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఒక్క రోజులోనే 17 మంది గుర్తింపు అల్లాదుర్గం/తూప్రాన్: ‘ఆపరేషన్ స్మైల్-2’లో భాగంగా మంగళవారం పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, తూప్రాన్‌లో తనిఖీలు నిర్వహించారు. పెద్దశంకరంపేట, అల్లాదుర్గంలో నలుగురు చొప్పున అదుపులోకి తీసుకున్నట్టు బాలల సంరక్షణ అధికారి రామకృష్ణ తెలిపారు. కాగా తూప్రాన్‌లోని వివిధ దుకాణాల్లో దాడులు చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఆ ప్రాంత బాలల సంరక్షణ అధికారి భాస్కర్‌గౌడ్ తెలిపారు. -
చిన్నారితో చాకిరీ చేయిస్తున్న వ్యక్తి అరెస్ట్
యాకుత్‌పురా (హైదరాబాద్) : చిన్నారితో చాకిరీ చేయిస్తున్న ఓ యజమానిని రెయిన్‌బజార్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్సై వి. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురా సాదత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫిర్దోస్ (29) గత కొన్ని రోజులుగా జాఫర్ రోడ్డులో బైక్ మెకానిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఫరీద్ అన్సారీ (13) అనే బాలుడిని దుకాణంలో చేర్చుకుని పని చేయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న హైదరాబాద్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు రెయిన్‌బజార్ పోలీసుల సహకారంతో బాలుడికి విముక్తి కల్పించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిర్దోస్‌ను అరెస్ట్ చేశారు. -
పోలీసుల అదుపులో 60 మంది బాలకార్మికులు
విశాఖపట్నం: నిన్నమొన్నటి వరకు హైదరాబాద్ పాతబస్తీలో బాలకార్మికుల ఉదంతాలు వరుసగా వెలుగులోకిరాగా.. బుధవారం విశాఖపట్టణంలో 60 మంది బాలకార్మికులను పోలీసులు గుర్తించారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో పశ్చిమబెంగాల్ నుంచి వస్తున్నట్లుగా భావిస్తున్న 60 మంది బాలలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలలను ఎక్కడి తరిస్తున్నారు? ఈ ముఠా వెనుక ఎవరున్నారు? అనే విషయాలు తెలియాల్సిఉందని పోలీసులు చెప్పారు. -
22 మంది బాలకార్మికులకు విముక్తి
శ్రీకాకుళం(ఆముదాలవలస): 22 మంది బాల కార్మికులకు విముక్తి లభించింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుంచి గుజారాత్‌కు 22 మంది చిన్నారులను తరలిసున్నారన్న సమాచారం అందుకున్న చైల్డ్‌లైన్ అధికారులు ఆదివారం దాడులు చేసి బాలలకు విముక్తి కల్పించారు. ఆముదాల వలస రైల్వే స్టేషన్లో వీరిని అదుపులోనికి తీసుకున్నారు. -
బాల కార్మికులకు విముక్తి!
-
74మంది బాలకార్మికులకు విముక్తి
-
74మంది బాలకార్మికులకు విముక్తి
హైదరాబాద్ : వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వచ్చిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ లో 74మంది బాల కార్మికులను గుర్తించిన పోలీసులు వారికి విముక్తి కలిగించారు. అక్రమంగా బాల కార్మికులను తరలిస్తున్నారంటూ అందిన సమాచారం మేరకు పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, అసోం తదితర ప్రాంతాలకు చెందిన బాలకార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని రెస్క్యూ హోంకు తరలించారు. వారిలో 24మంది బాల కార్మికులు కాగా, మరికొంతమంది వెట్టిచాకిరీ కార్మికులు. కాగా వీరిని తరలించిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
బాలకార్మికుల అక్రమరవాణా గుట్టు రట్టు
- ముగ్గురు పిల్లలతో సహా పరారైన ఏజెంట్ నెల్లూరు: విజయనగరం జిల్లాకు చెందిన 10 మంది బాలబాలికలను కార్మికులుగా మార్చి నెల్లూరులో పనిలో కుదిర్చేందుకు ప్రయత్నించిన ఓ ముఠా గుట్టు రట్టయింది. విజయనగరం నుంచి బాలకార్మికులను తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న నెల్లూరు సీడబ్ల్యూసీ అధికారులు ఆదివారం నెల్లూరు రైల్వే స్టేషన్లో కాపుకాశారు. రైలు దిగుతూ ఈ విషయాన్ని గమనించిన బాలకార్మికుల ఏజెంట్ ముగ్గురు పిల్లలతో సహా పరారయ్యాడు. కాగా, మిగిలిన ఏడుగురు బాలల్ని అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ నెల్లూరులోని బీఎమ్ఆర్ హ్యాచరీస్‌లో పని చేయడం కోసం తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. సదరు బీఎమ్ఆర్ హ్యాచరీస్ కంపెనీ టీడీపీ ఎమ్మెల్సీ రవిచంద్రకు చెందిందిగా సమాచారం. పరారయిన ఏజెంట్ అజిత్ సహా ముగ్గురు పోలీసుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
వెట్టి నుంచి ఐదుగురు బాలలకు విముక్తి
హైదరాబాద్ : సికింద్రాబాద్ ప్రాంతంలో చెత్త, ప్లాస్టిక్ వస్తువులను ఏరుకుంటున్న ఐదుగురు బాలలకు ఓ స్వచ్ఛంద సంస్థ శుక్రవారం విముక్తి కల్పించింది. ఉప్పుగూడ ప్రాంతం నుంచి ఐదుగురు బాలలను ఒక వ్యక్తి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతానికి తీసుకువచ్చాడు. వారితో ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏరించే ప్రయత్నం చేస్తుండగా... స్థానికులు ఇచ్చిన సమాచారంతో దివ్య హెల్ప్ డెస్క్ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. వారిని తీసుకొచ్చిన వ్యక్తి పరారవ్వగా, ఉప్పుగూడకు చెందిన శివ (12), నగేష్ (11), ఉషన్ (10), సాయి (11), నరేష్ అనే ఐదుగురు బాలలను దివ్య హెల్ప్ డెస్క్ వారు సైదాబాద్‌లోని బాలుర వసతి గృహానికి తరలించారు. -
16 మంది బాల కార్మికులకు విముక్తి
హైదరాబాద్: నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కింగ్కాలనీలోని ఓ వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న బాలలకు పోలీసులు బుధవారం విముక్తి కల్పించారు. డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు సదరు వాటర్‌ప్లాంట్‌పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ వెట్టిచాకిరీ చేస్తున్న 16 మంది బాలలను గుర్తించి, బాలల సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ప్లాంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. -
ఇద్దరు బాల కార్మికులకు విముక్తి
ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఇద్దరు బాల కార్మికులకు కార్మిక శాఖ అధికారులు విముక్తి కల్పించారు. సహాయ కేంద్రానికి వచ్చిన ఫిర్యాదు మేరకు సహాయ కార్మిక శాఖ అధికారి ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం రెండు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ హోటల్లో పనిచేస్తున్న బాలుడ్ని, కూరగాయల దుకాణంలో పనిచేస్తున్న మరో బాలుడ్ని గుర్తించారు. వారికి విముక్తి కల్పించి వారితో పనిచేయిస్తున్న వ్యాపారస్థులకు షోకాజు నోటీసులు జారీ చేశారు. రూ.20 వేల చొప్పున జరిమానా విధించారు. విముక్తి కలిగిన ఇద్దరిలో ఒకరు ఖానాపూర్ మండలం మక్కాపూర్కు చెందిన బాలుడు కాగా, మరో బాలుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వాడని గుర్తించారు. -
బాలకార్మికురాలిని రక్షించిన అధికారులు
-
బాలకార్మిక వ్యవస్థపై సత్యార్థి ఆవేదన
-
బాలలతో పని చేయిస్తున్న ఇద్దరు అరెస్టు
హైదరాబాద్: బిహార్ నుంచి బాల కార్మికులను తీసుకువచ్చి, వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ఇద్దరిని మొఘల్‌పురా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గౌలిపురా మీర్‌కా దయారా ప్రాంతానికి చెందిన మహ్మద్ నజీముద్దీన్ (35), సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన మహ్మద్ అర్షద్‌లు చెప్పుల వ్యాపారులు. కాగా, కొన్ని నెలలుగా బిహార్ రాష్ట్రంలో గయా, ధన్వాడ, షాదీపూర్ జిల్లాలకు చెందిన బాలురను నగరానికి అక్రమ మార్గాల్లో తీసుకొచ్చి చెప్పుల ఫ్యాక్టరీలో పని చేయిస్తున్నారు. ఈనెల 2వ తేదీ రాత్రి పోలీసులు నిర్వహించిన కార్డ్డాన్ సెర్చ్‌లో ఈవిషయం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నజీముద్దీన్, అర్షద్లపై చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ఆదేశానుసారం అరెస్ట్ చేసి, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. ఇంకా, ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పరిశ్రమల్లో తనిఖీలు: బాల కార్మికులకు విముక్తి
హైదరాబాద్ : నగరంలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలోని గాజు పరిశ్రమల్లో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పని చేస్తున్న 20 మంది బాల కార్మికులను పోలీసులు విముక్తి కల్పించారు. వారంతా బీహార్ రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వారందరిని సాధ్యమైనంత త్వరగా బీహార్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని పోలీసులు వెల్లడించారు. గాజు పరిశ్రమలకు చెందిన ఇద్దరు యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఏసీపీ చెర నుంచి బాల కార్మికునికి విముక్తి
హైదరాబాద్ : బాధ్యతాయుతమైన పోలీసు వృత్తిలో ఉన్న ఓ అధికారి తన ఇంట్లో బాల కార్మికుడి చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో కార్మికశాఖ అధికారులు సదరు పోలీసు ఆఫీసర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ సరూర్‌నగర్ హుడా కాలనీలో నివాసం ఉంటున్న ఏపీఎస్పీ బెటాలియన్ ఏసీపీ ఈవీ రామారావు ఇంట్లో కార్మికశాఖ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. సూరి (10) అనే బాలుడి చేత రెండేళ్లుగా ఇంటి పనులు చేయించుకుంటున్నారన్న సమాచారంతో కార్మికశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీలో ఏసీపీ ఇంట్లో ఉన్న బాల కార్మికుడిని తమ సంరక్షణలోకి తీసుకున్నారు. అడ్డువచ్చిన కానిస్టేబుల్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ ప్రస్తుతం కర్నూలు బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. కాగా ఆయనపై కేసు నమోదు చేశారు. -
స్వస్థలాలకు బాలకార్మికులు
హైదరాబాద్ :నెలన్నర క్రితం హైదరాబాద్ లోని పాతబస్తీలో పోలీసుల కార్డన్‌సెర్చ్‌లో పట్టుబడిన బాల కార్మికులు ఆదివారం తమ స్వస్థలాలకు పయనమయ్యారు. పట్టుబడిన వారిలో చాలామందిని అప్పట్లోనే వారి స్వస్థలాలకు పంపించగా, 50 మందిని మాత్రం సైదాబాద్‌లోని బాలకార్మికుల సదనానికి తరలించారు. ఆదివారం వీరిని అధికారులు నాంపల్లి రేల్వేస్టేషన్కు బస్సులో తరలించి, ఓ రైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బోగీలో భద్రత నడుమ వారి స్వస్థలమైన కోల్‌కతాకు పంపించారు. -
80 మంది బాల కార్మికులకు విముక్తి
హైదరాబాద్: బలపం పట్టి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన రేపటి యువత బలవంతపు వెట్టిచాకిరీలో మగ్గి తమ జీవితాన్ని అంధకారమయం చేసుకుంటోంది. బంగారంషాపుల్లో పనిచేస్తూ.. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న ఇటువంటి 80 మంది బాలలను గురువారం సాయంత్రం పోలీసులు రక్షించారు. పాతబస్తీలోని చార్మినార్, హుస్సేని ఆలమ్ పరిధిలో గల బంగారు ఆభరణాలకు మెరుగులద్దే దుకాణాలలో తమ బాల్యాన్ని వృధా చేసుకుంటున్న బాలకార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. నగర సౌత్ జోన్ పోలీసులు జరిపిన ఈ దాడుల్లో సుమారు 80 మంది బాలకార్మికులను గుర్తించి వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం పాతబస్తీ ప్రాంతాల్లో ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. -
బాలల కడుపు మార్చారు...
- పస్తులుంచిన ఐసీపీఎస్ అధికారులు - ఉదయం నుంచి బిస్కట్లతోనే సరి.. మంకమ్మతోట: కార్మికులుగా మారిన వారిని అక్కున చేర్చుకుని సంక్షేమానికి కృషిచేయాల్సిన ఐసీపీఎస్ అధికారులు బాలలను శనివారం పస్తులుంచి పరేషాన్ చేశారు. కార్ఖానాలు, హోటళ్లు, వివిధ సంస్థల్లో బందీలుగా ఉండి పనిచేస్తున్న వారికి విముక్తి కల్గిస్తూ హైదరాబాద్‌లో పోలీసులు, ఐసీపీఎస్, సీడబ్ల్యూసీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వరుసగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న సమగ్ర బాలల సంరక్షణ పథకం ఆధ్వర్యంలో దాడులు ముమ్మరం చేసింది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పనులు చేస్తూ సంస్థకు కనిపించిన బాలలను తీసుకొస్తున్నారు. వివిధ పనులు చేస్తూ, భిక్షాటన చేస్తూ, వీధుల్లో చెత్తకాగితాలు ఏరుకుంటూ కనిపించిన 480 మంది బాలలను ఈ నెల గుర్తించారు. శనివారం సిరిసిల్ల నుంచి ఆరుగురు బాలబాలికలు, హుజూరాబాద్ 14, పెద్దపల్లి 7, జగిత్యాల 7, కరీంనగర్లో 13మంది బాలకార్మికులుగా గుర్తించి సీడూబ్ల్యూసీ చైర్పర్సన్ కొమురయ్య ఎదుట హాజరుపర్చేందుకు సీడబ్ల్యూసీ, ఐసీపీఎస్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ బాలలను ఉదయం 9 గంటలకు గుర్తించి తరలించారు. వీరిని కార్యాలయంలోని ఓ గదిలో ఉంచి మహిళా పోలీసు కానిస్టేబుల్‌ను సెక్యూరిటీగా ఉంచారు. ఉదయం నుంచి టీ, టిఫిన్, భోజనం వంటివి ఏమీ పెట్టకుండా బిస్కట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కడుపులో తిప్పినట్లు అయి బెంచీలపై పడుకున్నారు. తమ పిల్లలను అధికారులు తీసుకువెళ్లారనే సమాచారం తెలుసుకుని శాఖ కార్యాలయానికి వచ్చిన తల్లిదండ్రులు ఉదయం నుంచి పడిగాపులు పడుతున్నట్లు బాధితులు తెలిపారు. ఒక పూట బడి కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటున్న పిల్లలను తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. చుట్టపు చూపుగా నేపాల్ నుంచి వచ్చిన అబ్బాయి సునీల్(12)ను వీధిలో కనిపించగానే తీసుకువ చ్చారని, మధ్యాహ్నం భోజనం సమయంలో తీసుకువచ్చి ఇప్పటివరకు ఆహారం ఏమీ ఇవ్వలేదని కమల అనే మహిళా ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం 10 గంటలకు తీసుకువచ్చిన అధికారులు రెండుసార్లు బిస్కట్లు మాత్రమే ఇచ్చారని ఆరెపల్లికి చెందిన బాలిక రష్మి(13), సుగ్లాంపల్లికి చెందిన అనిల్(11), వేములవాడకు చెందిన దుర్గేష్ తెలిపారు. ఈ విషయంపై సీడబ్ల్యూసీ చైర్పర్సన్ కొమురయ్య, ఐసీపీఎస్ జిల్లా కోఆర్డినేటర్ పర్వీన్‌ను వివరణ కోరగా.. బిస్కట్లు, మంచినీరు ఇచ్చామని, టిఫిన్, భోజనం వంటివి పెట్టలేదని తెలిపారు. పిల్లలకు ఆహారం అందించేంత బిల్లు తమ వద్ద లేదని పేర్కొన్నారు. -
51 మంది బాల కార్మికులకు విముక్తి
హైదరాబాద్ క్రైం: బాలకార్మికుల విముక్తి కోసం పోలీసుల తనిఖీలు రెండో రోజూ కొనసాగాయి. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసిన పోలీసులు 51 మంది బాలకార్మికులకు విముక్తి కల్పించారు. వీరిలో కొంత మంది పిల్లలు నగరానికి చెందిన వారుగా గుర్తించి వాతల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాకుండా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలను రామాంతపూర్‌లోని ప్రగతినగర్ రెస్య్కూ హోంకు తరలించారు. శుక్రవారం జరిపిన దాడుల్లో రెయిన్‌బజార్‌లో 10మంది, కాలాపత్తర్‌లో 25మంది, డబీర్పూరలో 8మంది, మీర్చౌక్లో 8మంది బాలకార్మికులను గుర్తించి పోలీసులు వారికి విముక్తి కల్పించారు. కాగా, గురువారం జరిపిన దాడుల్లో చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 80 మంది పిల్లలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడులకు సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ నాయకత్వం వహించారు.