
80 మంది బాల కార్మికులకు విముక్తి
హైదరాబాద్: బలపం పట్టి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన రేపటి యువత బలవంతపు వెట్టిచాకిరీలో మగ్గి తమ జీవితాన్ని అంధకారమయం చేసుకుంటోంది. బంగారంషాపుల్లో పనిచేస్తూ.. తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్న ఇటువంటి 80 మంది బాలలను గురువారం సాయంత్రం పోలీసులు రక్షించారు. పాతబస్తీలోని చార్మినార్, హుస్సేని ఆలమ్ పరిధిలో గల బంగారు ఆభరణాలకు మెరుగులద్దే దుకాణాలలో తమ బాల్యాన్ని వృధా చేసుకుంటున్న బాలకార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. నగర సౌత్ జోన్ పోలీసులు జరిపిన ఈ దాడుల్లో సుమారు 80 మంది బాలకార్మికులను గుర్తించి వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం పాతబస్తీ ప్రాంతాల్లో ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.