ప్రేక్షకులు మెచ్చే పాత్రలు ఎన్నో చేసిన ప్రియాంక చోప్రా ‘అనూజ’ ద్వారా తన ఉత్తమ అభిరుచిని చాటుకుంది. 97వ ఆస్కార్ అవార్డ్‌ల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘అనూజ’(Anuja) షార్ట్ లిస్ట్ అయింది. ‘అనూజ’ త్వరలో నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమ్ కానుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు మిండి కాలింగ్, గునిత్ మోగాలతోపాటు వెన్నుదన్నుగా నిలిచింది ప్రియాంక చోప్రా.
బాలకార్మికులైన పిల్లల బతుకు పోరాటంపై వెలుగులు ప్రసరించిన ఈ లఘుచిత్రానికి ఆడమ్ జోగ్రేవ్స్ డైరెక్టర్. తొమ్మిదేళ్ల అనూజ తన అక్కతో కలిసి ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటుంది. తన భవిష్యత్ కోసం పని మానేసి చదువుకోవాలా? కుటుంబం కోసం చదువును త్యాగం చేయాలా? అనే అనూజ జీవితంలోని ఈ సందిగ్ధ స్థితికి ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ అద్దం పడుతుంది.
దోపిడి ప్రపంచంలో తమ ఆనందం, అవకాశాల కోసం ఆశపడే, పోరాడే ఇద్దరు సోదరీమణుల గురించి చెప్పే కథ ఇది.ప్రౌడ్ ఆఫ్ దిస్ బ్యూటీఫుల్ ఫిల్మ్’ అంటూ ‘అనూజ’ గురించి తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ప్రియాంక చోప్రా.‘అనూజ’లో అనన్య షాన్ బాగ్ (పాలక్), సజ్దా పఠాన్ (అనూజ), నగేష్ బోంస్లే (మిస్టర్ వర్మ) నటించారు.
(చదవండి: ఇంతలా 'కృతజ్ఞత' చూపించడం అందరి వల్ల కాదేమో..!)
Comments
Please login to add a commentAdd a comment