short
-
కలల మేఘంపై అనూజ..
ప్రేక్షకులు మెచ్చే పాత్రలు ఎన్నో చేసిన ప్రియాంక చోప్రా ‘అనూజ’ ద్వారా తన ఉత్తమ అభిరుచిని చాటుకుంది. 97వ ఆస్కార్ అవార్డ్‌ల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘అనూజ’(Anuja) షార్ట్ లిస్ట్ అయింది. ‘అనూజ’ త్వరలో నెట్‌ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమ్ కానుంది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు మిండి కాలింగ్, గునిత్ మోగాలతోపాటు వెన్నుదన్నుగా నిలిచింది ప్రియాంక చోప్రా.బాలకార్మికులైన పిల్లల బతుకు పోరాటంపై వెలుగులు ప్రసరించిన ఈ లఘుచిత్రానికి ఆడమ్ జోగ్రేవ్స్ డైరెక్టర్. తొమ్మిదేళ్ల అనూజ తన అక్కతో కలిసి ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటుంది. తన భవిష్యత్ కోసం పని మానేసి చదువుకోవాలా? కుటుంబం కోసం చదువును త్యాగం చేయాలా? అనే అనూజ జీవితంలోని ఈ సందిగ్ధ స్థితికి ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ అద్దం పడుతుంది.దోపిడి ప్రపంచంలో తమ ఆనందం, అవకాశాల కోసం ఆశపడే, పోరాడే ఇద్దరు సోదరీమణుల గురించి చెప్పే కథ ఇది.ప్రౌడ్ ఆఫ్ దిస్ బ్యూటీఫుల్ ఫిల్మ్’ అంటూ ‘అనూజ’ గురించి తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ప్రియాంక చోప్రా.‘అనూజ’లో అనన్య షాన్ బాగ్ (పాలక్), సజ్దా పఠాన్ (అనూజ), నగేష్ బోంస్లే (మిస్టర్ వర్మ) నటించారు.(చదవండి: ఇంతలా 'కృతజ్ఞత' చూపించడం అందరి వల్ల కాదేమో..!) -
Mystery: షార్ట్ కుటుంబాన్ని చంపినదెవరు?
ఉదయం తొమ్మిదయ్యేసరికి క్రిస్ థాంప్సన్ తన ఓనర్ మైకేల్ షార్ట్ కోసం రోడ్డుపక్క నిలబడి ఎదురు చూస్తున్నాడు. పదే పదే టైమ్ చూసుకుంటున్నాడు. ఎంతసేపటికీ మైకేల్ రాకపోయేసరికి, ‘ఇదేంటి? తొమ్మిదికల్లా క్రిస్టియన్స్‌బర్గ్‌లో డెలివరీకి బయలుదేరదామన్న మనిషి ఇంకా రాలేదు? ఇల్లు దగ్గరే కదా, వెళ్లి చూద్దాం’ అనుకుని మైకేల్ ఇంటి వైపు అడుగులేశాడు క్రిస్.క్రిస్ వెళ్లేసరికి మైకేల్ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. హాల్లో కాస్త దూరంలో సోఫాలో నిద్రపోతున్నట్లు కనిపించిన తన ఓనర్ని మొదట ‘సార్.. సార్!’ అని బయట నుంచే పిలిచాడు. ఎంత పిలిచినా ఇంట్లో ఎవరూ పలుకకపోయేసరికి, దగ్గరకు వెళ్లి లేపుదామన్నట్లు ఇంటి లోపలికి అడుగులేశాడు. సోఫా దగ్గరకు వెళ్లేసరికి మైకేల్ ప్రాణాలతో లేడు. అతడి నుదుటిపైన తుపాకీతో కాల్చిన గాయం క్రిస్‌ని గజగజ వణికించేసింది. పైగా ఇల్లంతా ఆవహించిన నిశ్శబ్దం అతడ్ని మరింతగా భయపెట్టింది. వెంటనే బయటికి పరుగుతీసి, పోలీసులకు సమాచారమందించాడు.క్రైమ్ టేప్స్ చుట్టి, ఇల్లంతా తమ అధీనంలోకి తెచ్చుకున్న పోలీసులు. ఆ ఇంట్లో మైకేల్ మృతదేహంతో పాటు మరో శవాన్ని గుర్తించారు. అది మైకేల్ భార్య మేరీ షార్ట్ది. ఆమెను కూడా పైన బెడ్రూమ్లో నిద్రలో ఉండగానే ఎవరో కాల్చి చంపేశారు. అంటే ఒకేరాత్రి జంట హత్యలు జరిగాయి. మరి కిల్లర్ ఎవరు? అనే దిశగా విచారణ మొదలైంది. ఆ సమయంలో అధికారులకు క్రిస్ కీలక సాక్షిగా మారాడు.‘మైకేల్ సార్‌ది మొబైల్ హోమ్ మూవింగ్ బిజినెస్. నాలానే చాలామంది వర్కర్స్ అతని దగ్గర పనిచేస్తున్నారు. ముందురోజు రాత్రి పది దాటే వరకూ డెలివరీ పని మీద సార్ నాతోనే ఉన్నాడు. ఈరోజు ఉదయాన్నే తొమ్మిదికిక్రిస్టియన్స్బర్గ్లో డెలివరీకి వెళ్దాం, రెడీగా ఉండు అన్నాడు. ఎప్పుడూ పది నిమిషాలు ముందుండే మనిషి ఎంతకూ రాకపోయేసరికి డౌట్ వచ్చి ఇంటికి వెళ్లాను’ అని క్రిస్ చెప్పాడు. నిజానికి మైకేల్ శవాన్ని మొదటిగా చూసిన వ్యక్తి, మైకేల్ సజీవంగా ఉన్నప్పుడు చివరిసారిగా చూసిన వ్యక్తి క్రిస్ మాత్రమే!‘అసలు రాత్రికి రాత్రి మైకేల్ ఇంట్లో ఏమైంది?’ అనే ప్రశ్నతో పోలీసులు తలలు పగలగొట్టుకుంటుంటే.. మైకేల్, మేరీల బంధువులంతా ‘జెన్నిఫర్ ఎక్కడ?’ అని ప్రశ్నించారు. విచారణ అధికారులంతా తెల్లబోయారు. వారి నుంచి ‘జెన్నిఫర్ ఎవరు?’ అనే ప్రశ్న అప్రయత్నంగానే వచ్చింది.జెన్నిఫర్.. మైకేల్, మేరీల ఏకైక కుమార్తె. తొమ్మిదేళ్ల పాప. లేకలేక పుట్టిన సంతానం. చాలా అందంగా, క్యూట్‌గా ఉండే తెలివైన పిల్ల. ‘జంట హత్యల తర్వాత పాప కనిపించడం లేదంటే, కిల్లర్ టార్గెట్ జెన్నిఫర్‌ని ఎత్తుకెళ్లడమేనా?’ అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.నిజానికి ఆ రాత్రి మైకేల్ పది దాటాక ఇంటికి వెళ్లాడని క్రిస్ చెప్పాడు. అదే రాత్రి పదిన్నరకు మేరీ డిన్నర్ ఐటమ్స్ కొని ఇంటికి తీసుకెళ్లిందని ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ దుకాణదారుడు చెప్పాడు. ‘సాధారణంగా రాత్రి సమయంలో తన గురక కారణంగా మేరీ నిద్ర చెడిపోకూడదని చాలాసార్లు అదే సోఫాలో నిద్రపోతుంటాడట మైకేల్. పైన బెడ్రూమ్లో మేరీ నిద్రపోతుంది. ఆ రాత్రి అదే జరిగినట్లుంది’ అని క్లారిటీ ఇచ్చింది మేరీ సోదరి.ఇంట్లో అంతా నిద్రపోయాక దుండగుడు.. మైకేల్, మేరీలను చాలా సులభంగా చంపి, పాపను ఎత్తుకుపోయాడనేది అప్పటికే స్పష్టమైంది. అంటే బహుశా ఆ కిల్లర్ ఆ ఇంటికి అతిథిగా వచ్చి ఉంటాడా? ఆ దంపతులకు సుపరిచితుడేనా? ఇలా చాలా అనుమానాలు తలెత్తాయి.మైకేల్ ఇంటి సమీపంలో ఆ రాత్రి ఎప్పుడూ చూడని తెల్లటి కారు ఒకటి చూశామని కొందరు సాక్ష్యం చెప్పారు. అదే తెల్లటి కారులో మరునాడు తెల్లవారుజామున (మృతదేహాలను చూసిన రోజు) 40 ఏళ్ల అపరిచిత వ్యక్తి వెళ్లడం చూశామని మరికొందరు ఇరుగు పొరుగువారు చెప్పారు. దాంతో కిల్లర్ ఊహాచిత్రాన్ని గీయించే పనిలో పడ్డారు అధికారులు. పాప కోసం దగ్గర్లోని అడవిని, చుట్టుపక్కల ప్రదేశాలను జల్లెడపట్టారు. అయినా ఆచూకీ దొరకలేదు.2002 ఆగస్ట్ 15న వర్జీనియా, హెన్రీ కౌంటీలో జరిగిన ఈ ఉదంతం అమెరికా వ్యాప్తంగా సంచలనంగా మారింది. హత్యలు జరిగిన ఆరు వారాల తర్వాత మైకేల్ ఇంటికి సుమారు 35 మైళ్ల దూరంలో ఉన్న స్టోన్ విల్ క్రీక్ అనే ప్రాంతంలోని అల్బర్ట్ అనే వ్యక్తి ఇంటి ముందు కుళ్లిన దవడ భాగం దొరికింది. మొదట దాన్ని గమనించిన అల్బర్ట్ ఫ్యామిలీ ఏదో జంతు కళేబరాన్ని కుక్కలు తెచ్చి పడేసి ఉంటాయని భావించారు. పరిశీలనగా చూస్తే అది పిల్లల దవడ అని తేలడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎన్ఏ టెస్ట్‌లో అది జెన్నిఫర్దని తేలింది. వెంటనే మృతదేహం కోసం సమీపంలో వెతికించారు. పాడుబడిన ఒక వంతెన కింద కుళ్లిపోయిన పాప శవం కనిపించింది. అయితే స్టో¯Œ విల్ క్రీక్కి గతంలో మైకేల్ చాలా మొబైల్ హోమ్స్ డెలివరీ చేశాడని తేలింది. పైగా అక్కడ చాలామంది డీలర్స్‌తో అతడికి స్నేహ సంబంధాలున్నాయి.పాప మృతదేహం దొరికిన చోట క్షుణ్ణంగా పరిశోధన చేసినా, ఎలాంటి ఆధారమూ దొరకలేదు. అయితే ఆ విచారణలో గ్యారిసన్ బౌమన్ అనే ఒక నేరచరిత కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరికి సరైన ఆధారాలు లేకపోవడంతో అతణ్ణి విడిచిపెట్టారు. రాత్రికి రాత్రి ఎవరైనా సీరియల్ కిల్లర్ రహస్యంగా ఇంట్లోకి దూరి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడా? లేక నిజంగానే ఆ క్రూరుడు పథకం ప్రకారం మైకేల్ ఫ్యామిలీని మోసం చేసి మట్టుపెట్టాడా? అనేది తేలలేదు. దాంతో ఇరవై రెండేళ్లు గడచిపోయినా ఈ ఉదంతం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే : ఒకరు పొడగరి, మరొకరు అత్యంత పొట్టి..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, అత్యంత పొట్టి మహిళలుగా గిన్నిస్ రికార్డులకెక్కిన వారెవ్వరో మనకు తెలిసిందే. వారిన చూసి యావత్తు దేశం అబ్బురపడింది కూడా. అలాంటి వ్యక్తులు నిజ జీవితంలో ఎదురపడితే ఎలా ఉంటుంది..అన్న ఆలోచనే ఎంతో ఆశ్యర్యానికిలోను చేస్తుంది. అలాంటిది అదే నిజమైతే ఎలా ఉంటుందో చెప్పండి. ఔను..! మీరు వింటుంది నిజమే..!. ఆ ఇద్దరు వ్యక్తులు తాము రికార్డులకెక్కిన అదే వేదిక వద్ద కలుసుకుని ఆనందంతో మునిగితేలారు. ఆ క్షణం ఆ ఇరువురూ ఇది కల? నిజమా అనే సందిగ్ధంలో ఉండిపోయారు. నవంబర్ 13, 2024 అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే రోజున ఆ ఇరువురు లండన్‌లో మధ్యాహ్నం టీ కోసం సమావేశమయ్యారు. లండన్‌లో ది సావోయ్ హోటల్ రుచికరమైన టీ సిప్ చేస్తూ..ఒకరి ఇష్టాలను ఒకరూ షేర్చేసుకున్నారు. అక్కడ టీ తోపాటు పేస్ట్రీలను కూడా ఆస్వాదించారు. ఇక అత్యంత పొడవైన మహిళ రుమిసా.. "జ్యోతిని కలవడం ఇదే తొలిసారి. ఆమె అత్యంత అందమైన మహిళ. తాను ఆమెను కలవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది". రుమిసా. అలాగే జ్యోతి ప్రతిస్పందనగా.."నాకంటే ఎత్తుగా ఉన్నవారిని చూడటం అలవాటు చేసుకున్నాను. ఈ రోజు ప్రపంచంలోనే ఎత్తైన మహిళను కలుసుకోవడం అత్యంత సంతోషంగా ఉంది." అని ఆనందాన్ని వ్యక్తం చేసింది. కాగా, రుమీసా 215.16 సెం.మీ (7 అడుగుల 0.7 అంగుళాలు)తో అత్యంత ఎత్తైన మహిళగా నిలిచింది. ఇక జ్యోతి 62.8 సెం.మీ (2 అడుగుల 0.7)తో అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించింది. View this post on Instagram A post shared by NDTV (@ndtv) (చదవండి: ఆరు పదులకు అందాల కిరీటం) -
తాత్వికత: ఎంతో చిన్నది జీవితం
ఓ గురువు అటవీ ప్రాంతంలోని మారుమూల ఉన్న చిన్నచిన్న గ్రామాలకు వెళ్ళి సత్సంగం చేయాలని బయలుదేరాడు. ఆయనతోపాటు శిష్యబృందం కూడా బయలుదేరింది. కొండలు, గుట్టలు, సెలయేర్లు దాటి వెళ్తూ ఉన్నారు. దారిలో ఓ శిష్యుడు, గురువుని ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎలా?’’ అని అడిగాడు. ‘‘మానవ శరీరం దేవుడిచ్చిన ఒకే ఒక అవకాశం. మరలా రమ్మంటే రాదు. అందుకని దాని విలువ తెలుసుకుని క్షణం క్షణం ఆనందంగా జీవించాలి!’’ అన్నాడు.‘‘అదెలా?’’ అని అడిగాడు శిష్యుడు.ఇంతలో దూరంగా కొందరు మహిళలు పొయ్యిపైన నీళ్ళు కాగిస్తూ కనిపించారు గురువుకి. శిష్యుడిని అక్కడే కొద్దిసేపు ఆగమని చె΄్పాడు. ఆ కట్టెలు కాలే వాసన పీల్చి కాలుతున్నదేదో చెప్పమన్నాడు.వాసన పీల్చిన శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ‘తను గమనించింది వాస్తవమా కాదా’ అని ఒకటికి రెండుసార్లు సరి చూసుకున్నాడు. తను చూస్తున్నది ముమ్మాటికీ నిజమేనని అర్థమయ్యింది.‘‘అక్కడ కాలుతున్నది చందనం కట్టెలు. అయ్యో, ఎందుకలా చేస్తున్నారు. ఎంతో విలువైన చందనం కొయ్యలను వంటచెరుకుగా వాడటమేమిటి?’’ అని మనసులో అనుకున్నాడు.‘భర్తలకు తెలియకుండా వారు పొరపాటుగా అలా చేస్తున్నారేమోనని’ అనుమానమేసింది. జాగ్రత్తగా గమనించిన అతడికి మరింత ఆశ్చర్యం కలిగింది. అది ఏమిటంటే ఆ మహిళలకు కొద్ది దూరంలోనే వారి భర్తలు చందనం కొయ్యలను కత్తితో నరికి పొయ్యిలో పెట్టడానికి అనువుగా కట్టెలు చీల్చుతున్నారు.అదే విషయాన్ని శిష్యుడు బాధగా ‘బంగారంలాంటి చందనాన్ని మంటపాలు చేయడం’ గురించి గురువుకు చెప్పాడు. దానికి గురువు నవ్వి ‘‘చందనం కొయ్యల విలువ, వాటి ప్రత్యేకత వారికి తెలియదు. అందుకే వాటిని పొయ్యిలోపెట్టి తగులబెట్టేస్తున్నారు. వారి కళ్ళకు అవి మామూలు కట్టెల్లాగే అగుపిస్తున్నాయి. నీకు వాటి విలువ తెలుసు కాబట్టే ఆశ్చర్యపోతున్నావు. వారు చేస్తున్నది తప్పని చెబుతున్నావు. వారికి వాటి విలువ తెలిసేంత వరకు వారు చేస్తున్నది సరైనదేనని అనుకుంటారు. మనిషి కూడా అంతే. జీవితం విలువ తెలుసుకోక లేనిపోని పట్టింపులు, అహం, అసూయాద్వేషాలు, కోపం, ప్రతీకారం, ప్రపంచాన్ని మార్చాలనే ప్రయత్నం... ఇలాంటి వాటితో ఎంతోకాలం వృథా చేస్తున్నాడు. జీవితం విలువైనదన్న ఎరుక ఉంటే చాలు, ఆనందం మన వెంటే ఉంటుంది’’ అని వివరించాడు.జీవితం చాలా చిన్నదనీ, ప్రతిక్షణం ప్రకృతి ప్రసాదమని, అది తెలుసుకోక΄ోతే అసలైన ఆనందాన్ని కోల్పోతామని గ్రహించిన శిష్యబృందం ముందుకు నడిచింది. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. 13 ఏళ్ల రికార్డు బద్దలు
కార్డిప్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ పరాజయం పాలైనప్పటకి.. ఆ జట్టు ఆల్‌రౌండర్, ఓపెనర్ మాథ్యూ షార్ట్ మాత్రం చరిత్ర సృష్టించాడు. బ్యాటింగ్‌లో 28 పరుగులతో పర్వాలేదన్పించిన షార్ట్.. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేసిన షార్ట్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ఔరా అన్పించాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన షార్ట్.. కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. దీంతో పలు అరుదైన రికార్డులను షార్ట్ తన పేరిట లిఖించుకున్నాడు. షార్ట్ సాధించిన రికార్డులు ఇవే..?టీ20ల్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా షార్ట్ రికార్డులలెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వాట్సన్ పేరిట ఉండేది. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో వాట్సన్ 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో 5 వికెట్ల ఘనత సాధించిన షార్ట్.. 13 ఏళ్ల వాట్సన్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా షార్ట్ నిలిచాడు. ఈ జాబితాలో భారత స్పిన్నర్ చాహల్ తొలి స్దానంలో ఉన్నాడు. 2017లో చాహల్ ఇంగ్లండ్‌పై ఏకంగా 6 వికెట్లు సాధించాడు.ఓడిపోయిన మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా బంగ్లాపేసర్ ముస్తిఫిజుర్ రెహ్మన్ సరసన షార్ట్ నిలిచాడు. -
షార్ట్స్ వేసుకోకూడదా? యోగా ట్రైనర్‌కి చేదు అనుభవం..!
ఒక్కోసారి కొన్ని సంఘటనలు చూస్తే మనలో మనకే వ్యతిరేకతన అనిపిస్తుంది. కొన్ని రకాల శిక్షణకు, ఆటలకు, వ్యాయమాలకు వెసులుబాటుగా ఉండే దుస్తులే ధరించాల్సి ఉంటుంది. తప్పదు. దీన్ని కొందరూ పెద్దవాళ్లు విశాల దృక్పథంతో అర్థం చేసుకునే యత్నం చేయాలి. లేదా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉంటే సూచించొచ్చు. అంతేగానీ బహిరంగంగా వేరొకరి వేషధారణ గురించి అవమానకరంగా మాట్లాడటం సబబు కాదు. కానీ ఇక్కడ అలాంటి దిగ్బ్రాంతికర ఘటనే చోటు చేసుకుంది. బెంగళూరులో టానీ భట్టాచార్జీ అనే యోగా ట్రైనర్ షార్ట్స్ వేసుకున్నందుకు బహిరంగంగా ఓ వృద్ధ మహిళ అవమానించింది. ఇలాంటివి వేసుకోకూడదంటూ తన మాతృభాషలో అరుస్తూ మాట్లాడింది. అందుకు యోగా ట్రైనర్ మీకేంటి సమస్య అని సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్న అదేపనిగా మాట్లాడుతూ ఆమెని ఇబ్బంది పెట్టింది. చివరికీ ఆమెకు అర్థం కావడం లేదు లే అని సదరు యోగా ట్రైనరే పక్కకు తప్పుకుని వెళ్లిపోతున్నా.. వెంటపడి మరీ అవమానించే పని చేసింది. అంతేగాదు ఆమె వేసుకున్న షార్ట్‌ని అక్కడున్న మరికొందరికీ చూపిస్తూ గట్టి గట్టిగా మాట్లాడటం వంటివి చేసింది. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయగా సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చకు తెరలేపింది. సంప్రదాయం, ఆధునిక విలువల మధ్చ తీవ్రమైన చర్చకు దారితీసింది. కొందరూ ఆ వృద్ధ మహిళకు సపోర్ట్ చేయగా, మరికొందరూ మాత్రం సదరు యోగా ట్రైనర్‌ని లైట్ తీసుకోమని పట్టించుకోవద్దని సలహాలిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Tanny Bhattacharjee (@fit_and_fabb) (చదవండి: 'ఎకో ఫ్రెండ్లీ జర్నీ'! 27 దేశాలు చుట్టొచ్చిన ఇద్దరు మిత్రులు..!) -
మూడు రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకులు, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల అంశాలు సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు నష్టపోయి 73,904 వద్ద స్థిరపడింది. నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 22,453 వద్ద నిలిచింది. దీంతో సూచీల మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 271 పాయింట్లు పతనమై 73,744 వద్ద కనిష్టాన్ని, నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 22,388 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి. ఆఖరి గంటలో కన్జూమర్ డ్యూరబుల్స్, సర్వీసెస్, మెటల్, యుటిలిటీ, కమోడిటీ రంగాలకు చెందిన మధ్య, తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాలు కొంత తగ్గాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.28%, 1.14% చొప్పున పెరిగాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. రిటైల్ విభా గాన్ని విభజిస్తుందన్న వార్తలతో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ షేరు 12% లాభపడి రూ.236 వద్ద ముగిసింది. -
పొడవాటి జుట్టు లేదు.. అయినా మిస్ ఫ్రాన్స్‌గా కిరీటం..!
ఫ్రాన్స్ అందాల పోటోల్లో జడ్జీలు విభిన్నమైన దానికి ప్రాధాన్యత ఇస్తు జడ్జిమెంట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందాల పోటీకి అసలైన నిర్వచనం ఏంటో క్లియర్‌గా చెప్పారు. ఓ మహిళ నీకు సరిలెవ్వరూ. ప్రతి స్త్రీ అందంగా విభిన్నంగా ఉంటుంది. ఎవరీ అందం వారిదే. స్త్రీల అందాన్ని ఎవరూ డిక్టేట్ చేయకూడదనే ఉద్దేశ్యంతో పొడవాటి కురులు లేకపోయినా మగవాళ్ల మాదిరిగా జుట్టు ఉన్న అమ్మాయిని ఎంపిక చేసి ఆశ్చర్యపరచడమే గాక పలువురు విమర్శులు అందుకున్నారు. ఈ మేరకు నార్డ్ పాస్ డి కైలస్కు చెందిన 20 ఏళ్ల గిల్లెస్ మిస్ ఫ్రాన్స్‌గా కిరీటాని దక్కించుకుంది. దీంతో 103 ఏళ్ల ఫ్రాన్స్ అందాల పోటీల చరిత్రలో పొడవాటి జుట్టు లేని మహిళగా గిల్లెస్ నిలిచింది. పిక్సీ కట్ ఉన్న గిల్లెస్ని విజేతగా ప్రకటించడం గురించి మీడియా ప్రశ్నించగా.. ఇంతవరకు పొడవాటి జుట్టుతో అందమైన మిస్లనే చూడటం అలవాటు చేసుకున్నాం కానీ పొట్టి జుట్టుతో ఆండ్రోజినస్ లుక్‌ని ఎంచుకోవాలని నిర్ణయిచామని ఈ పోటీకి జడ్జీలుగా వ్యవహరించినవారు అన్నారు. ప్రతి స్త్రీ విభిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఓ ప్రత్యేకం. ఎవర్నీ డిక్టేట్ చేయలేమని చెప్పేందుకే ఆమెను సెలక్ట్ చేశామని అన్నారు. మిస్ యూనివర్స్ లేదా ఫ్రాన్స్ కావడానికి ప్రత్యేకమైన అర్హత అంటూ దేన్ని పరిగణలోనికి తీసుకోం. వేదికపైకి వచ్చే ప్రతి రూపాన్ని స్వీకరిస్తాం, వారిలోని ఆత్మవిశ్వాసాన్ని బేరీజు వేసి ఎన్నిక చేస్తామని అందాల పోటీల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు కిరీటాన్ని దక్కించుకున్న గిల్లిస్ మాట్లాడుతూ..నేను బలమైన మహిళగా ఉండాలనుకుంటున్నాను. మహిళలు విభిన్నమైవారిని చూపాలనుకున్నాను. ఇక్కడ నా జుట్టు ప్రత్యేకం కాదు. నేను జీవితాన్ని ఇవ్వడం లేదా శ్వాసించడం లేదా జీవించడం వల్లే తాను ప్రత్యేకమని చెబుతోంది గిల్లేస్. కాగా, మిస్ఫ్రాన్స్ ఫైనల్‌కి ఏడుగురు మహిళలు రాగా ప్రజల ఓటు తోపాటు న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని విజేతలను ప్రకటించడం జరుగుతుంది. నిజానికి మిస్ ఫ్రాన్ కిరీటం దక్కించుకున్న గిల్లెస్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ జ్యూరీ(జడ్జీల)ఓటు కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మిస్ ఫ్రాన్ పోటీల్లో ఎక్కు వైవిధ్యాన్ని అనుమతించింది. అలాగే ఇకపై పోటీల్లో వయోపరిమితి లేదు, వివాహమైన, పిల్లలు ఉన్నా, టాటుల ఉన్నా కూడా పాల్గొనవచ్చునని నిర్వాహకులు పేర్కొన్నారు. (చదవండి: డయానా ధరించిన డ్రెస్ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి రికార్డు స్థాయిలో..) -
ప్రపంచంలోనే అతి పొట్టి శునకం.. ఎత్తు 3.5 అంగుళాలే..!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతి చిన్న శుకనంగా అమెరికా ఫ్లోరిడాకు చెందిన 'పర్ల్' అనే ఆడ శునకం నిలిచింది. ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్న శునకాల్లో ఇదే అత్యంత పొట్టిది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కూడా దక్కించుకుంది. చిహువాహువా బ్రీడ్‌కు చెందిన ఈ బుల్లి శునకం వయసు రెండేళ్లు. ఎత్తు 3.59 అంగుళాలు. పొడవు 5 అంగుళాలు. అంటే టీ కుప్పు సైజులో ఉంటుంది. ఇది పుట్టినప్పుడు ఔన్సు బరువు కంటే తక్కువ ఉండటం గమనార్హం. గతంలో గిన్నిస్ రికార్డు సృష్టించిన మిరాకిల్ మిల్లీ సోదరే దీనికి జన్మనివ్వడం మరో విశేషం. 2020లో మిల్లీ చనిపోయింది. మరో ప్రత్యేక ఏంటంటే ఈ రెండు శునకాల యజమాని కూడా ఒక్కరే. ఆమే ఫ్లోరిడాలోని వనేసా సెమ్లర్. పర్ల్ చాలా యాక్టివ్‌గా ఉంటుందని, చికెన్, సాల్మన్ ఫిష్‌ను చాలా ఇష్టంగా తింటుందని సెమ్లర్ చెప్పుకొచ్చారు. రోజుకు నాలుగు సార్లు దీనికి ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై కేఫ్‌లు కన్పిస్తే వాటి ముందు అరుస్తుందని, దానికి క్రీమ్ ఇచ్చేంతవరకు అలాగే మొరుగుతుందని వివరించారు. కాగా.. గతంలో ప్రపంచంలో అతి పొట్టి శునకంగా బ్రిటన్‌కు చెందిన యార్క్‌షైర్ టెర్రియర్ ఉండేది. దీని ఎత్తు 2.8 అంగుళాలే. పొడవు 3.75 అంగుళాలు. అయితే ఈ శునకం 1945లో చనిపోయింది. ఇంతకంటే పొట్టి శునకాన్ని ఇప్పటివరకు గుర్తించలేదు. చదవండి: 92 ఏళ్ల వయసులో నాలుగో భార్యకు విడాకులు.. ఇక చాలు అంటూ.. -
కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆర్ఎస్ఎస్ ధరించే ఖాకీ నిక్కర్ కాలిపోతున్న ఫోటోను షేర్ చేసింది. విద్వేష సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించి ఆర్ఎస్ఎస్-బీజేపీ చేస్తున్న నష్టాన్ని నివారించేందుకు దశల వారీగా తమ లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొంది. దీనికి భారత్ జోడో యాత్ర ట్యాగ్‌ను జత చేసింది. To free the country from shackles of hate and undo the damage done by BJP-RSS. Step by step, we will reach our goal.#BharatJodoYatra 🇮🇳 pic.twitter.com/MuoDZuCHJ2 — Congress (@INCIndia) September 12, 2022 సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఫోటోను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ.. మీరు దేశంలో హింసను కోరుకుంటున్నారా? అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రాహుల్ చేపట్టింది భారత్ జోడో యాత్ర కాదు భారత్ తోడో, ఆగ్ లగావో యాత్ర అని సెటైర్లు వేశారు. బెంగళూరు ఎంపీ, బీజేపీ యువనేత తేజస్వీ సూర్య.. ఈ ఫోటో కాంగ్రెస్ రాజకీయాలకు ప్రతీక అని ధ్వజమెత్తారు. 'కాంగ్రెస్ రాజేసిన నిప్పు 1984లో ఢిల్లీని తగలబెట్టింది. 2002లో 59 మంది కరసేవకులను సజీవదహనం చేసింది. మరోసారి ఆ పార్టీ హింసనే ప్రేరెేపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే... రాజ్యాంగంపై నమ్మకంతో కాంగ్రెస్ రాజకీయపార్టీగా నిలిచిపోయింది. గతంలో కాంగ్రెస్ రాజేసిన అగ్గి దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి కోల్పోయేలా చేసింది. ఇక అధికారం మిగిలున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కూడా ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోతుంది' అని తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న భారత్ జోడో యాత్రను తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలుపెట్టారు. 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర దేశంలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ 3,570కిలోమీటర్లు సాగనుంది. ఐదు రోజులు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ప్రస్తుతం కేరళలో కొనసాగుతోంది. కశ్మీర్లో ముగుస్తుంది. చదవండి: జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు సంచలన తీర్పు -
షాకింగ్: ఒంటి నిండా కట్లు.. షార్ట్ మీద వచ్చిన వరుడు
జకర్తా: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుక. లైఫ్‌లో ఒక్కసారే జరిగే ఈ వేడుకని (అఫ్కోర్స్.. కొందిరి జీవితంలో రెండు, మూడు పెళ్లిల్లు కూడా ఉంటాయి)మరపురాని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని భావిస్తారు చాలా మంది. అందుకే శక్తికి మించి ఖర్చు చేస్తారు. పెళ్లి మంటపం.. నుంచి తినే భోజనాల వరకు ప్రతీది ప్రత్యేకంగా ఉండాలని చూస్తారు. ఇక వివాహ సమయంలో ధరించే వస్త్రాల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వేలు, లక్షలు ఖర్చు చేసి మరి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. వివాహ సమయంలో ప్రతి ఒక్కరి దృష్టి తమ మీద ఉండాలని ఆశిస్తారు. సాధారణంగా ఏ పెళ్లిలో అయినా కనిపించే దృశ్యాలు ఇవి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబేయే వార్త ఇందుకు భిన్నం. ఇక్కడ ఓ వరుడు చేతికి కట్టుతో.. ఒంటి మీద చొక్కా లేకుండా కేవలం షార్ట్ ధరించి పెళ్లికి హాజరయ్యారు. కాళ్లు, చేతులకు కట్లు కట్టి ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సంఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఈ పెళ్లి వేడుకలో వరుడి శరీరం మీద కట్లతో.. ఒంటి మీద చొక్కా కూడా లేకుండా హాజరైతే.. వధువు మాత్రం బుట్టబొమ్మలా తయారయి వచ్చి పెళ్లి కుమారిడి పక్కన కూర్చుంది. ఈ వేడుకకు బంధువులు కూడా బాగానే హాజరయ్యారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారంతా ‘‘పాపం ఆ యువకుడికి పెళ్లి అంటే ఇష్టం లేదేమో.. కొట్టి మరి ఇలా పెళ్లి చేస్తున్నారు’’ అని కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘‘ప్లీజ్ ఈ ఫోటోల వెనక స్టోరీ షేర్ చేయండి’’ అని కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్లపై సదరు పెళ్లి కుమార్తె స్పందించింది. ‘‘మా ఇద్దరికి ఈ వివామం ఇష్టమే. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందు నా భర్తకు యాక్సిడెంట్ అయ్యింది. పెట్రోల్ తీసుకురావడం కోసం వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఇలా ఒళ్లంతా గాయాలయ్యాయి. బట్టలు వేసుకోవడానికి రావడం లేదు. అందుకే ఇలా షార్ట్ మీద వచ్చాడు’’ అని తెలిపింది. చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్తో లవర్ని.. -
షార్ట్... సిక్సర్ల సునామీ
సిడ్నీ: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డీఆర్సీ షార్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జేఎల్టీ వన్డే కప్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ క్వీన్స్‌ల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 23 సిక్స్‌లతో అతడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున బరిలో దిగిన షార్ట్... 148 బంతుల్లో 15 ఫోర్లు సహా 257 పరుగులు సాధించాడు. అతడి జోరుతో జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది. 100, 150, 200, 250 వ్యక్తిగత స్కోరును షార్ట్ సిక్సర్లతోనే అందుకోవడం విశేషం. ఇందులో 200, 250 మార్క్‌ను మూడేసి వరుస సిక్సర్లతో చేరుకోవడం గమనార్హం. ఛేదనలో హీజ్లెట్ (107), క్రిస్ లిన్ (58) రాణించినా... ఆండ్రూ టై (6/46) ధాటికి క్వీన్స్‌ల్యాండ్ 271 పరుగులకే పరిమితమైంది. దీంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 116 పరుగులతో విజయం సాధించింది. ►షార్ట్ ఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ► ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత సిక్స్‌ల రికార్డు నమీబియా ఆటగాడు జి.స్నైమన్ (113 బంతుల్లో 196; 7 ఫోర్లు, 17 సిక్స్‌లు, 2007లో యూఏఈపై) పేరిట ఉంది. క్రిస్ గేల్ (2015లో జింబాబ్వేపై), రోహిత్ శర్మ (2013లో ఆస్ట్రేలియాపై) 16 సిక్స్‌లు కొట్టారు. షార్ట్ 23 సిక్స్‌లతో వీటన్నిటిని బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ► తన రికార్డు ఇన్నింగ్స్‌తో షార్ట్ లిస్ట్ ‘ఎ’ (అంతర్జాతీయ, దేశవాళీ వన్డేలు) క్రికెట్లో అత్యధిక మూడో వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సర్రే ఆటగాడు (ఇంగ్లండ్) అలిస్టర్ డంకన్ బ్రౌన్ (160 బంతుల్లో 268; 30 ఫోర్లు, 12 సిక్స్‌లు; గ్లామోర్గన్‌పై 2002లో), భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (173 బంతుల్లో 264; 33 ఫోర్లు, 9 సిక్స్‌లు; శ్రీలంకపై 2014లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. -
రాజన్న సన్నిధిలో లఘు దర్శనమే
సాక్షి, వేములవాడ: ఈనెల 31నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా ఎములాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం ఉంది. ఈ క్రమంలో ఆదివారం 50వేల మందిపైగా భక్తులు తరలివచ్చారు. దీంతో రాజన్న క్షేత్రం కిటకిటలాడింది. భక్తుల రద్దీని గమనించిన ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రద్దీ మరింత పెరుగుతుండడంతో రాత్రంతా దర్శనాలను కొనసాగించనున్నట్లు మైక్ ద్వారా ప్రకటించారు. సోమవారం వీఐపీ దర్శనాలను బ్రేక్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు తలనీలాలు, కోడె మొక్కులు, ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బద్ది పోశవ్వకు బోనాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.38 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. Appearances before the short RAJANNA -
ఒక్కో ఏటీఎంలో రూ.కోటి ఎందుకు పెట్టరు?
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశ కేంద్ర బ్యాంక్ ఆర్ బీఐ పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఆయన రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నగదు పరిస్థితి గురించి ప్రజలకు అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. దేశంలో తీవ్రమైన నగదు కొరత ఉందన్నారు. డీమానిటైజేషన్ మొత్తం ప్రక్రియలో ఆర్ బీఐ పారదర్శకంగా వుండాలని వ్యాఖ్యానించారు. అయితే ఏదైనా సమస్య ఉంటే నిష్పాక్షికంగా ప్రకటించడానికి బదులు వాస్తవాలను దాచి పెడుతూ పారిపోతోందని విమర్శించారు. నల్లధనాన్ని అరికట్టడానికి దేశం తీసుకున్న నోట్ల రద్దు సరైంది కాదని ప్రతీప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియతో నకిలీ నగదును కొంత మేరకు అరికట్టే అవకాశం ఉంది తప్ప నల్లధనాన్ని నిరోధించడం సాధ్యం కాదన్నారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దు సంక్షోభంతో నగదు పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కనీసం మరో మూడు నెలల పడుతుందన్నారు. దేశంలో ద్రవ్య వినియోగం తీవ్రంగా దెబ్బతినడంతో ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై శాశ్వతంగా ఉంటుందని చౌదరి తెలిపారు. సరిపడినంత నగదు ఉందని ఆర్ బీపై హామీ ఇస్తోంది కదా అని ప్రశ్నించినపుడు అది అంతా అబద్ధమని కొట్టి పారేశారు. నిజంగా తగినంత సొమ్ము ఉంటే, దేశంలోని 2 లక్షల ఏటీఎంలలో ఒక్కో దానిలో కోటి రూపాయలు ఎందుకు అందుబాటులోకి తేవడం లేదనీ , ప్రతి ఖాతాదారుడు రూ .5,000 లేదా రూ 10,000 డ్రా చేసుకోమని ఎందుకు చెప్పలేకపోతోందని ఆయన ప్రశ్నించారు. అలాగే ఇటీవల నగదు విత్ డ్రా పరిమితిని రోజుకు రూ.4500 పెంచినా ఒకటి రెండు ఏటీఎంలు అలా పనిచేయడపోవడమే ఇందుకు తార్కాణమని తెలిపారు. జరుగుతున్న పరిణామాల్లో ఆర్ బీఐ నిశ్శబ్ద ప్రేక్షకుడులా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. నిజానికి, ఆర్బిఐ మంటల్ని ఆర్చే ఫైర్ మ్యాన్ లా వ్యవహరించాలి. నీళ్ళు చల్లి మంటల్ని అదుపు చేయాలి. కానీ దీనికి విరుద్ధంగా ఆర్ బీఐ పారిపోతోందంటూ ఘాటుగా విమర్శించారు. ప్రతీ దేశం పాత కరెన్సీని రద్దు చేసింది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుందని వ్యాఖ్యానించారు. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేయడం సరైన నిర్ణయం కాదనీ, ఇది నకిలీ కరెన్సీని అడ్డుకోవడానికి పాక్షికంగా ఉపయోగపడుతుంది తప్ప నల్లధనాన్ని నిరోధించలేదని చెప్పారు. ఏ దేశమూ ఇలా చేయలేదని పేర్కొన్నారు. నోట్ల రద్దు పర్యవసానాల్ని అంచనా వేయడంలో, తగిన చర్యల్ని తీసుకోవడం కేంద్రం విఫలమైందని అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. -
మీ ఉంగరం వేలు చూపుడువేలు కంటే పొడవుగా ఉంటే...
ఫింగర్ ఫ్యాక్ట్స్ వేళ్లు మనుషుల స్వభావాన్ని చెబుతాయా? అవుననే అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ముఖ్యంగా చూపుడువేలు, ఉంగరం వేలు పొడవును బట్టి మనుషులను మూడు వర్గాలుగా విభజించారు. ఆ వర్గాలేమిటో తెలుసుకునే ముందు మీ చేయి బల్ల మీద పెట్టి ఒకసారి పరిశీలించుకోండి. మీ ఉంగరం వేలు చూపుడువేలు కంటే పొడవుగా ఉందా పొట్టిగా ఉందా లేదంటే రెండు సమానమైన పొడవుగా ఉన్నాయా చూసుకోండి. ఆ తర్వాత ఇది చదవండి. ఎ. మీ ఉంగరం వేలు చూపుడు వేలుకంటే పొడవుగా ఉంటే ఇలాంటి వాళ్లు చూడటానికి బాగుంటారు. మాటలతో ఆకట్టుకుంటారు. ఇతరులకు ఎంతదూరమైనా వెళ్లి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రియుడు/ప్రియురాలిని అనుక్షణం మైమరిపిస్తారు. ఒక్కోసారి దూకుడుగా ఉంటారు. ఉంగరం వేలు పొడవుగా ఉన్నవారు డబ్బు కూడా బాగానే సంపాదిస్తారని పరిశీలన. సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో వీళ్లు ముందుంటారు. ఇంజనీరింగ్ రంగంలో ఇలాంటివాళ్లు బాగా రాణిస్తారు. బి. మీ చూపుడు వేలు ఉంగరం వేలు కంటే పొడవుగా ఉంటే వీళ్లు అతి విశ్వాసంతో ఉంటారు. అది ఎదుటివారికి అహంభావంగా కనిపిస్తుంది. అంతర్ముఖులు కాకపోవచ్చుగాని ఇలాంటివాళ్లు తమతో తాము గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. వీళ్లకు ఎప్పుడూ దృష్టి లక్ష్యంపైనే ఉంటుంది. అయితే చొరవగా స్నేహహస్తాన్ని చాచలేరు. ప్రేమను వ్యక్తపరచలేరు. కనుక తమకు ఎదుటివారి నుంచి ఎంత దక్కితే అంతతోనే సర్దుకోవాల్సి వస్తుంది. సి. చూపుడు వేలు ఉంగరం వేలు ఒకే పొడవులో ఉంటే ఇలాంటి వారికి గొడవలంటే అస్సలు పడవు. ఈ జీవితం ఏదో ఇలా హాయిగా గడిచిపోవాలని కోరుకుంటారు. అలాగని ఎవరైనా తమను గొడవకు అనివార్యం చేస్తే గనుక ఎదుటివారికి చుక్కలు చూపిస్తారు. చూపుడువేలు ఉంగరం వేలు ఒకే పొడవులో ఉన్న వారు తమ భాగస్వామిని చాలా బాగా చూసుకుంటారు. ఇంటా బయటా ఏదైనా వ్యవహారాన్ని చక్కపెట్టడంలో వీరు సమర్థులు. -
మహిళపై దౌర్జన్యం..ముగ్గురు అరెస్ట్!
పూనెః యువతిపై దాడికి దిగిన ఐదుగురు యువకుల్లో ఎట్టకేలకు పోలీసులు ముగ్గుర్ని అరెస్టు చేశారు. తనపై ఐదుగురు యువకులు దౌర్జన్యానికి దిగారని, బెదిరింపులకు పాల్పడ్డారంటూ వారం రోజులుగా ఓ మహిళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించేందుకు, ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసేందుకు అంగీకరించలేదు. చివరికి ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు పది రోజులక్రితం జరిగిన ఘటనలో పూనేకు చెందిన 22 ఏళ్ళ మహిళా అడ్వర్ టైజింగ్ ఎగ్జిక్యూటివ్ పై ఐదుగురు యువకులు దౌర్జన్యానికి దిగారు. కారులో ఉన్న ఆమెను జుట్టు పట్టుకొని బయటకు లాగి తీవ్రంగా కొట్టారు. తమ కుటుంబాల్లోని మహిళలు, బాలికలు ఎవ్వరూ కురచ దుస్తులు వేసుకోకూడదని, పర పురుషులతో కలసి ప్రయాణించకూడదని బెదిరింపులకు కూడ పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తనపై జరిగిన దాడిని గురించి ఫిర్యాదు చేసేందుకు వారం రోజులపాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగింది. అయితే ఏ ఒక్కరూ ఆమె ఫిర్యాదును స్వీకరించలేదు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఉన్నతాధికారులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. మహిళ ఫిర్యాదు స్వీకరించని ముగ్గురు పోలీసులపై కూడ తాము చర్యలు తీసుకుంటామని సిటీ పోలీస్ కమిషనర్ రష్మి సుక్లా తెలిపారు. మే 1వ తేదీన ఇద్దరు మగ కొలీగ్స్ తో కలసి కారులో వెడుతున్నబాధితురాలు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన సమయంలో మరో కారులో వెడుతున్న ఐదుగురు యువకులు ఆమెపై వేధింపులకు దిగారు. కారును చుట్టుముట్టి, తెరచి ఉన్న విండోనుంచి ఉమ్ము వేయడమే కాక, డోర్ తెరచి ఆమెను బలవంతంగా కారు నుంచి బయటకు లాగి, ఆమె అపార్ట్ మెంట్ కు ముందే తీవ్రంగా కొట్టి అక్కడినుంచి జారుకున్నారు. ఐదు నిమిషాల తర్వాత తిరిగి వెనక్కు వచ్చి, సహాయంకోసం తన బంధువులకు, మిత్రులకు ఫోన్ చేస్తున్న ఆమెను బెదిరింపులకు పాల్పడ్డారు. నీ ఇల్లు అడ్రస్ తెలిసిందని, తర్వాత నీ సంగతి చూస్కుంటామని, నువ్వు ఎవరితో చెప్పుకున్నా లాభం లేదని, తమకు ఎంతో మంచి పరిచయాలు ఉన్నాయని బెదిరించారని బాధితురాలు తెలిపింది. అయితే ఇంత జరిగినా ఘటనలో ఎటువంటి సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్ దొరకక పోవడం విశేషం. -
పొడుగరులే ఆరోగ్యవంతులట!
రోజువారీ పనుల్లో పొడుగరులకు తరచు కొన్ని ఇబ్బం దులు తప్పకపోయినా, ఆరోగ్యం విషయంలో మాత్రం పొడగరులే అదృష్టవంతులని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పొట్టి వారితో పోలిస్తే పొడగరులకు గుండెజబ్బులు, వినికిడి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా తక్కువ అని అమెరికాలోని ఓహయో స్టేట్ వర్సి టీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధకులు చేప ట్టిన అధ్యయనంలో పొడగరుల గురించి మరిన్ని ఆసక్తి కరమైన విశేషాలు వెలుగులోకి వచ్చాయి. పొట్టి వారి కంటే పొడగరులే కెరీర్లో బాగా రాణించడమే కాకుం డా, ఎక్కువ సంతోషంగా కూడా ఉంటారని పరిశోధ కులు చెబుతున్నారు. అయితే వీరికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు లేకపోలేదు. వీరికి స్కిన్ కేన్సర్, కోలన్ కేన్సర్, కిడ్నీ కేన్సర్ వంటి కొన్ని రకాల కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. -
ఆధునిక పద్ధతిలో మూల్యాంకనం
సమస్యలకు చెక్ పెట్టేందుకే.. జేఎన్టీయూహెచ్లోనే వాల్యుయేషన్ సకాలంలోనే బీటెక్, బీఫార్మసీ ఫలితాల విడుదల సాక్షి, సిటీబ్యూరో: పరీక్షా ఫలితాల విడుదల లో జాప్యంతోపాటు ఎదురయ్యే ఇతర సమస్యలకు చెక్ పెట్టేందుకు మూల్యాంకన విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్టు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు తెలిపారు. శనివారం జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ వ్యాప్తంగా 65 కేంద్రాల్లో మూల్యాంకనం జరిగేదన్నారు. ప్రస్తుతం జేఎన్టీయూహెచ్ వేదికగా ఒకేచోట అన్ని జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తున్నందున క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కు ఆధునిక ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. ఈ తరహా టెక్నాలజీ ఒక్క జేఎన్టీయూహెచ్లో మాత్రమే ఉందన్నారు. అంతేకాకుండా జవాబు పత్రాల బండిల్స్ మిస్ కాకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. తేడాలొస్తే బ్లాక్‌లిస్ట్‌లో.. మూల్యాంకనాన్ని మెరుగైన పద్ధతిలో చేపడుతున్నామని వర్సిటీ పరీక్షల విభాగం డెరైక్టర్ ఈశ్వర్ప్రసాద్ అన్నారు. జవాబు పత్రాన్ని మూడు నిమిషాలలోపు మూల్యాంకనం చేస్తే సర్వర్ అనుమతించదన్నారు. మూల్యాంకనంలో తేడాలను గమనించేందుకు ఒక చీఫ్ ఎగ్జామినర్తోపాటు నలుగురు అదనపు కంట్రోలర్లు ఉంటారన్నారు. ప్రతి బండిల్ నుంచి ర్యాండమ్‌గా రెండేసి పేపర్లు తనిఖీ చేస్తారని, తేడాలున్నట్టు తేలితే రీవాల్యుయేషన్ చేయిస్తామని తెలిపారు. నిర్లక్ష్యం వహించే ఆచార్యులను బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నారు. ఏటా ఫలితాలు వచ్చిన తరువాత కనీసం 15 వేలమంది రీవాల్యుయేషన్, రీకౌంటింగ్లకు దరఖాస్తు చేసుకునేవారని, మూల్యాంకనంలో నాణ్యతను పెంపొందించడంతో రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సంఖ్య ఈ ఏడాది 1,500కు మించలేదన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్న తీరును సీసీటీవీల ద్వారా వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్లు తమ చాంబర్నుంచే పర్యవేక్షిస్తారని చెప్పారు. మూల్యాంకనం తరువాత మార్కులను ఎప్పటికప్పుడు ట్యాబ్లెట్ పీసీల్లో నమోదు చేయడం ద్వారా నేరుగా సర్వర్‌కు అనుసంధానం చేశామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఫలితాలను సకాలంలో అందించాలనే ఉద్దేశంతో ఉదయం 9 నుంచి రాత్రి10 గంటల వరకు ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రెక్టార్ టి.కిషన్ కుమార్‌రెడ్డి, వర్సిటీ ఇన్నోవేషన్ టెక్నాలజీ సెంటర్ డెరైక్టర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు.