కార్డిప్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ పరాజయం పాలైనప్పటకి.. ఆ జట్టు ఆల్‌రౌండర్, ఓపెనర్ మాథ్యూ షార్ట్ మాత్రం చరిత్ర సృష్టించాడు. బ్యాటింగ్‌లో 28 పరుగులతో పర్వాలేదన్పించిన షార్ట్.. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు.
ఈ మ్యాచ్‌లో పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేసిన షార్ట్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ఔరా అన్పించాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన షార్ట్.. కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. దీంతో పలు అరుదైన రికార్డులను షార్ట్ తన పేరిట లిఖించుకున్నాడు.
షార్ట్ సాధించిన రికార్డులు ఇవే..?
టీ20ల్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా షార్ట్ రికార్డులలెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వాట్సన్ పేరిట ఉండేది. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో వాట్సన్ 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో 5 వికెట్ల ఘనత సాధించిన షార్ట్.. 13 ఏళ్ల వాట్సన్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
అదే విధంగా ఓవరాల్‌గా ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా షార్ట్ నిలిచాడు. ఈ జాబితాలో భారత స్పిన్నర్ చాహల్ తొలి స్దానంలో ఉన్నాడు. 2017లో చాహల్ ఇంగ్లండ్‌పై ఏకంగా 6 వికెట్లు సాధించాడు.
ఓడిపోయిన మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా బంగ్లాపేసర్ ముస్తిఫిజుర్ రెహ్మన్ సరసన షార్ట్ నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment