matthew short
-
టీమిండియాతో సెమీఫైనల్.. ఆసీస్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్దమైంది. మంగళవారం(మార్చి 4) దుబాయ్ వేదికగా సెమీఫైనల్-1లో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ గాయం కారణంగా కీలకమైన సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో షార్ట్ తొడకండరాలు పట్టేశాయి.దీంతో అతడికి విశ్రాంతి అవసరమని క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం సూచించారు. తద్వారా అతడు సెమీఫైనల్‌కు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని యువ ఆల్‌రౌండర్ కూపర్ కొన్నోలీతో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఉన్న కొన్నోలీ.. ఇప్పుడు ప్రధాన జట్టులోకి వచ్చాడు. కొన్నోలీకి అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవలే జరిగిన బిగ్‌బాష్ లీగ్-2025 సీజన్లో కూపర్ దుమ్ములేపాడు. అదేవిధంగా ఈ యువ ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అందులో మూడు వన్డేలు ఉన్నాయి. అయితే తుది జట్టులో మాత్రం టాప్-ఆర్డర్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ లేదా కొన్నోలీకి చోటు దక్కే అవకాశముంది. అదనపు స్పిన్ అప్షన్ కావాలని ఆసీస్ మెనెజ్‌మెంట్ భావిస్తే కొన్నోలీకే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం ఖాయం.ఇక సెమీస్ పోరు కోసం ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న కంగారులు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు ఆర్హత సాధించాలని స్మిత్ సేన భావిస్తోంది. మరోవైపు భారత్ మాత్రం వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని కసితో ఉంది.సెమీస్‌కు ఆసీస్ జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంగాచదవండి: Champions Trophy: వరుణ్ ‘మిస్టరీ’ దెబ్బ -
సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూపు-బి నుంచి ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు ఆర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శుక్రవారం అఫ్గానిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో నాలుగు పాయింట్లతో ఆసీస్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. అయితే సెమీఫైనల్స్‌కు ముందు కంగారులకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్ గాయం కారణంగా సెమీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.షార్ట్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా షార్ట్ తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికి సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన షార్ట్ కాస్త ఇబ్బంది పడుతూ కన్పించాడు. కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు చేసి అతడు ఔటయ్యాడు. కాగా మ్యాచ్ అనంతరం షార్ట్ గాయంపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు."షార్ట్ తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు నడవడానికి కాస్త ఇబ్బంది పడడం మేము చూశాము. అయితే నాకౌట్స్ మ్యాచ్‌లు మొదలు కావడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. కాబట్టి షార్ట్ తన గాయం నుంచి కోలుకుంటాడని ఆశిస్తున్నాము. అయితే షార్ట్ ఒకవేళ సెమీస్‌కు దూరమైనా, అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు మా కుర్రాళ్లు సిద్దంగా ఉన్నారని" స్మిత్ పేర్కొన్నాడు.కాగా సెమీస్‌కు షార్ట్ దూరమైతే ఆసీస్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. అతడికి అద్బుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌పై భారీ లక్ష్యాన్ని ఆసీస్ చేధించడంలో షార్ట్ది కూడా కీలక పాత్ర. రన్ ఛేజ్‌లో ఈ ఆసీస్ ఆల్‌రౌండర్ 62 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.కాగా ఈ మెగా ఈవెంట్లో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ వంటి స్టార్ ప్లేయర్ల సేవలను ఆసీస్ కోల్పోయింది. ఇప్పుడు ఈ జాబితాలోకి షార్ట్ చేరాడు. షార్ట్ స్ధానంలో యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.చదవండి: ఆసీస్‌తో మ్యాచ్ రద్దు.. అయినా అఫ్గాన్‌కు సెమీస్ చేరే ఛాన్స్! ఎలా అంటే? -
CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీకి పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేసినట్లు సోమవారం వెల్లడించింది. అయితే, గాయం కారణంగా దూరమవుతాడనుకున్న ప్యాట్ కమిన్స్(Pat Cummins) సారథ్యంలోనే ఆస్ట్రేలియా ఈ ఈవెంట్లో పాల్గొననుంది.తొలిసారిగా ఆ ఇద్దరికి చోటుఇక బ్యాటర్ మాథ్యూ షార్ట్‌తో పాటు ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ(Aaron Hardie) తొలిసారిగా ఐసీసీ టోర్నమెంట్లో ఆడే అవకాశం దక్కించుకున్నారు. మరోవైపు.. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా పొట్టి ఫార్మాట్లో పరుగుల వరద పారించిన నాథన్ ఎల్లిస్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే రిటైర్ అయిన డేవిడ్ వార్నర్, గాయం వల్ల జట్టుకు దూరమైన కామెరాన్ గ్రీన్, పేసర్ సీన్ అబాట్ స్థానాల్లో మాథ్యూ, హార్డీ, ఎల్లిస్ ఈ జట్టులోకి వచ్చారు.మోకాలి గాయంకాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కమిన్స్ బృందం 3-1తో గెలిచి పదేళ్ల తర్వాత ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, ఈ మెగా సిరీస్ నేపథ్యంలో కెప్టెన్, స్టార్ పేసర్ కమిన్స్ గాయపడినట్లు వార్తలు వచ్చాయి.శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడే జట్టుకు కమిన్స్దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ అతడి గాయాన్ని ధ్రువీకరిస్తూ మోకాలి నొప్పితో కమిన్స్ బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో అతడు చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, తాజా ప్రకటనతో అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది.వన్డే ప్రపంచకప్-2023 విజేతఇదిలా ఉంటే.. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్-2023లో ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాను చాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఫైనల్లో టీమిండియాను ఓడించి.. కంగారూ జట్టుకు టైటిల్ అందించాడు. ఈ క్రమంలో ఏకంగా ఆరోసారి వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా.. మరో వన్డే మెగా టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది.వరల్డ్‌కప్ ఈవెంట్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియాతో పాటు సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ కూడా ఈ టోర్నమెంట్లో ఆడేందుకు క్వాలిఫై అయ్యాయి. అయితే, 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన పాకిస్తాన్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టింది.గ్రూప్- ‘బి’లోఇదిలా ఉంటే.. వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించగా... దుబాయ్ వేదికగా రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా.. అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-బిలో ఉంది. ఇక గ్రూప్-‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఆడనున్నాయి. కాగా ఆస్ట్రేలియా ఫిబ్రవరి 22న లాహోర్ వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుప్యాట్ కమిన్స్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, ఆడం జంపా.చదవండి: IPL 2025: కెప్టెన్ పేరును ప్రకటించిన పంజాబ్ కింగ్స్చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్ మ్యాచ్‌లు ఎక్కడంటే? -
చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. 13 ఏళ్ల రికార్డు బద్దలు
కార్డిప్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ పరాజయం పాలైనప్పటకి.. ఆ జట్టు ఆల్‌రౌండర్, ఓపెనర్ మాథ్యూ షార్ట్ మాత్రం చరిత్ర సృష్టించాడు. బ్యాటింగ్‌లో 28 పరుగులతో పర్వాలేదన్పించిన షార్ట్.. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేసిన షార్ట్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ఔరా అన్పించాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన షార్ట్.. కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. దీంతో పలు అరుదైన రికార్డులను షార్ట్ తన పేరిట లిఖించుకున్నాడు. షార్ట్ సాధించిన రికార్డులు ఇవే..?టీ20ల్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా తరపున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా షార్ట్ రికార్డులలెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వాట్సన్ పేరిట ఉండేది. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో వాట్సన్ 15 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌లో 5 వికెట్ల ఘనత సాధించిన షార్ట్.. 13 ఏళ్ల వాట్సన్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. అదే విధంగా ఓవరాల్‌గా ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా షార్ట్ నిలిచాడు. ఈ జాబితాలో భారత స్పిన్నర్ చాహల్ తొలి స్దానంలో ఉన్నాడు. 2017లో చాహల్ ఇంగ్లండ్‌పై ఏకంగా 6 వికెట్లు సాధించాడు.ఓడిపోయిన మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా బంగ్లాపేసర్ ముస్తిఫిజుర్ రెహ్మన్ సరసన షార్ట్ నిలిచాడు.