గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే : ఒకరు పొడగరి, మరొకరు అత్యంత పొట్టి.. | Worlds Tallest And Shortest Women Meet For The Firsh Time | Sakshi
Sakshi News home page

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ డే : ఒకరు పొడగరి, మరొకరు అత్యంత పొట్టి..

Published Fri, Nov 22 2024 1:49 PM | Last Updated on Fri, Nov 22 2024 1:52 PM

Worlds Tallest And Shortest Women Meet For The Firsh Time

ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, అత్యంత పొట్టి మహిళలుగా గిన్నిస్‌ రికార్డులకెక్కిన వారెవ్వరో మనకు తెలిసిందే. వారిన చూసి యావత్తు దేశం అబ్బురపడింది కూడా. అలాంటి వ్యక్తులు నిజ జీవితంలో ఎదురపడితే ఎలా ఉంటుంది..అన్న ఆలోచనే ఎంతో ఆశ్యర్యానికిలోను చేస్తుంది. అలాంటిది అదే నిజమైతే ఎలా ఉంటుందో చెప్పండి. 

ఔను..! మీరు వింటుంది నిజమే..!. ఆ ఇద్దరు వ్యక్తులు తాము రికార్డులకెక్కిన అదే వేదిక వద్ద కలుసుకుని ఆనందంతో మునిగితేలారు. ఆ క్షణం ఆ ఇరువురూ ఇది కల? నిజమా అనే సందిగ్ధంలో ఉండిపోయారు. నవంబర్‌ 13, 2024 అధి​కారిక గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ డే రోజున ఆ ఇరువురు లండన్‌లో మధ్యాహ్నం టీ కోసం సమావేశమయ్యారు. లండన్‌లో ది సావోయ్‌ హోటల్‌ రుచికరమైన టీ సిప్‌ చేస్తూ..ఒకరి ఇష్టాలను ఒకరూ షేర్‌చేసుకున్నారు. 

అక్కడ టీ తోపాటు పేస్ట్రీలను కూడా ఆస్వాదించారు. ఇక అత్యంత పొడవైన మహిళ రుమిసా.. "జ్యోతిని కలవడం ఇదే తొలిసారి. ఆమె అత్యంత అందమైన మహిళ. తాను ఆమెను కలవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది". రుమిసా. అలాగే జ్యోతి ప్రతిస్పందనగా.."నాకంటే ఎత్తుగా ఉన్నవారిని చూడటం అలవాటు చేసుకున్నాను. ఈ రోజు ప్రపంచంలోనే ఎత్తైన మహిళను కలుసుకోవడం అత్యంత సంతోషంగా ఉంది." అని ఆనందాన్ని వ్యక్తం చేసింది. 

కాగా, రుమీసా 215.16 సెం.మీ (7 అడుగుల 0.7 అంగుళాలు)తో అత్యంత ఎత్తైన మహిళగా నిలిచింది. ఇక జ్యోతి  62.8 సెం.మీ (2 అడుగుల 0.7)తో  అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించింది.

 

(చదవండి: ఆరు పదులకు అందాల కిరీటం)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement